ముంబై: పుణె రోడ్డు ప్రమాదం కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసుకు సంబంధించిన విషయాలను పుణె పోలీసు కమిషనర్ అమితేష్ కుమార్ వెల్లడించారు. రోడ్డు ప్రమాదానికి ముందు ప్రముఖ బిల్డర్ కుమారుడైన మైనర్ బాలుడు కేవలం 90 నిమిషాలకు పబ్బులో రూ. 48 వేలు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని విషయాలను అమితేష్ కుమార్ తెలిపారు.
‘‘శనివారం 10.40కి మైనర్ నిందితుడు తన స్నేహితులతో కలిసి కోసీ రెస్టారెంట్(పబ్)కు వెళ్లారు. అక్కడ వారు భారీ బిల్లును చెల్లించారు. స్నేహితులతకు మైనర్ బాలుడు రూ. 48 వేలతో మద్యం తాగారు. కోసీ రెస్టారెంట్ మూసిన తర్వాత.. అక్కడి నుంచి వారు రెండో పబ్ బాలక్ మారియట్‌కు అర్థరాత్రి 12.10 గంటలకు వెళ్లారు. బాలుడిని అదుపులోకి తీసుకున్న వెంటనే ఆదివారం మెడికల్ టెస్ట్ పంపి.. అతని రక్త నమూనాలను ఫొరెన్సిక్ విభాగానికి పంపించాము. మద్యం తాగి మూలమలుపు రోడ్డుపై పోర్షే కారుకు నంబర్ ప్లేట్ లేకుండా నడిపాడు. రోడ్డు ప్రమాదానికి ఇదే ప్రధాన కారణంగా తెలుస్తోంది’అని అమితేష్ కుమార్ తెలిపారు.
‘‘మైనర్ బాలుడు తన స్నేహితులతో కలిసి రోడ్డు ప్రమాదానికి ముందు పబ్‌లో మద్యం సేవించారు. దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నిర్థారణకు వచ్చాం. ఫొరెన్సిక్ విభాగానికి పంపిన రక్త నమూనాల రిపోర్టు కోసం వేచి చేస్తున్నాం’’ అని అసిస్టెంట్ పోలీసుల కమిషనర్ మనోజ్ పాలిట్ తెలిపారు.
ఈ కేసులలో మైనర్ బాలుడి తండ్రిని పుణె పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా మైనర్ బాలుడికి మద్యం సర్వ్ చేసిన రెండు హోటళ్లకు చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై సీఎం ఏక్‌నాథ్ షిండే , డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ చాలా సీరియస్ అయ్యారు. దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు సీపీ అమితేష్ కుమార్ తెలిపారు.
ఆదివారం తెల్లవారుజామున మైనర్ బాలుడు తన స్నేహితులతో కలిసి ఖరీదైన పోర్షే కారుతో ఓ బైక్‌ను దారుణంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు ఐటీ ఫ్రొపెషనల్స్ మరణించారు. ఈ ఘటన కల్యాణి నగన్ జంక్షన్ వద్ద చోటు చేసుకుంది. గంటల వ్యవధిలో నిందిత బాలుడుని జువైనల్ జస్టిస్ కోర్టులో ప్రవేశపెట్టగా కఠినమైన షరతులతో బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. బెయిల్ మంజురూకు విధించి షరతులు కూడా చర్చనీయాంశం అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment