ముంబై: మహారాష్ట్రలోని పుణెలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదం కేసులో పోర్షే కారు నడిపిన మైనర్ బాలుడి తండ్రి విశాల్ అగర్వాల్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. జువైనల్ జస్టిస్ యాక్టు కింద ఆయనపై నమోదైన కేసు ఆధారంగా ఔరంగాబాద్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సదరు మైనర్ బాలుడు ఆదివారం మద్యం మైకంతో పోర్షే కారుతో ఓ బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ప్రమాదం జరిగిన మైనర్ బాలుడి తండ్రి పరారీలో ఉన్నాడు. దీంతో పోలీసులు పలు బృందాలకు ఏర్పాడి మంగళవారం ఉదయం ఛత్రపతి శంభాజీనగర్ సమీపంలో అరెస్ట్ చేశారు.
ప్రమాద సమయంలో 17 మైనర్ బాలుడు 200 కిలోమిట్లర్లు వేగంతో కారు నడిపి బైక్‌ను ఢీకొట్టినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా ప్రాథమికంగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇక.. పుణె పోలీసు కమిషనర్ అమితేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘12వ తరగతి ఫలితాలు వెలువడిన తర్వాత నిందిత బాలుడు స్థానిక పబ్‌లో సంబరాలు చేసుకున్నాడు. కారు ప్రమాదానికి ముందు అతను మద్యం సేవించి ఉన్నాడు. మహారాష్ట్రలో 25 ఏళ్లు దాటిన వారికే మద్యం తాగే చట్టపరమైన అనుమతి ఉంది. చట్టవ్యతిరేకంగా మైనరకు మద్యం ఇచ్చిన బార్ ఓనర్లుపై చర్యలు తీసుకుంటాం’’ అని తెలిపారు.
రోడ్డు ప్రమాదం జరిగిన 15 గంటల లోపే మైనర్ బాలుడిని జువైనల్ కోర్టులో హాజరుపరిచామని పోలీసులు తెలిపారు. ఇక.. అతనికి బెయిల్ ఇవ్వడానికి కోర్టు పలు షరతులు విధించింది. వాటన్నింటిని తప్పకుండా పాటించాలని ఆదేశించింది. తీవ్రమైన నిర్లక్ష్యంతో ఈ ఘటనకు పాల్పడిన మైనర్ బాలుడి తండ్రి విశాల్ అగర్వాల్‌పై కూడా జువైనల్ జస్టిస్ యాక్ట్‌లోని పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ప్రముఖ బిల్డర్ అయిన విశాల్ అగర్వాల్ పరారీలో వెళ్లిపోయాడు. దీంతో పోలీసులు సెర్చ్ చేసిన మంగళవారం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment