రెండు నిండు ప్రాణాల్ని బలిగొన్న పుణే పోర్షే హిట్ అండ్ రన్ కేసు.. రకరకాల కోణాల్లో చర్చకు దారి తీసింది. వాహనం నడిపింది ఓ మైనర్ కావడంతో పేరెంటింగ్ కోణంలో ప్రధాన చర్చ నడిచింది. మైనర్ బాలుడి తండ్రి తన పలుకుబడి ఉపయోగించి కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నం.. ఆ ప్రయత్నంలో నిర్లక్ష్యం ధోరణి ప్రదర్శించిన పోలీసు అధికారులపై చర్యలు, రక్త నమూనాలు తారుమారు చేయటంతో డాక్టర్ల అరెస్టు.. తండ్రి, తాతల అరెస్ట్.. పోర్షే కథలు రోజుకొకటి వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఈ కేసు కారణంగానే.. నగరంలో అర్ధరాత్రుల దాకా అనుమతులు లేకుండా బార్‌లు, పబ్‌ల నిర్వహణ, వాటిల్లో డ్రగ్స్ వాడకం.. ఆ మొత్తం వెనుక అధికారుల అవినీతి బాగోతం బయటపడింది ఇప్పుడు..
పుణేలో అర్ధరాత్రి దాకా అక్రమంగా కార్యకలాపాలు నిర్వహించే పబ్‌లు, బార్‌లు.. పైగా డ్రగ్స్ కోణాన్ని ఇప్పుడు తెరపైకి తెచ్చారు ఓ ఎమ్మెల్యే. కాంగ్రెస్ ఎమ్మెల్యే రవీంద్ర ధంగేకర్.. ఈ హిట్ అండ్ రన్ కేసుపై ఇదివరకే నిరసన వ్యక్తం చేశారు. పబ్‌లు, బార్‌లపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తమ పార్టీ కార్యకర్తలతో కలిసి ఆయన యెరవాడ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. అయితే ఆయన ఇప్పుడు మరో సంచలన చర్చకు దారితీశారు.
చదవండి: Pune Porsche Case: రీల్‌ను మించిన రియల్ సస్పెన్స్ థ్రిల్లర్.. ఇవేం ట్విస్టులు బాబోయ్!
లంచాల మోజుతో పోలీసులు అక్రమంగా నిర్వహిస్తున్న పబ్ యజమానులు, డ్రగ్స్ ట్రేడర్ల వద్ద నెలకు లక్షల్లో లంచాలు తీసుకుంటున్నారని రవీంద్ర ధంగేకర్ ఆరోపణులు చేశారు. పుణె ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రతినెలా లంచాలు తీసుకుంటున్నారని, లంచాల సేకరణకు కానిస్టేబుళ్లు, ప్రైవేట్ వ్యక్తులను ఉపయోగించుకున్నారని తెలిపారు.
#Pune #Porsche Case: Ravindra Dhangekar Discloses Names Of Persons Involved In ' HAFTA 'From Pubs, Clubs and Liquor Shops
In a major crackdown, the Kasba Peth MLA Ravindra Dhangekar revealed that police are collecting monthly bribes amounting to lakhs of rupees from the owners… pic.twitter.com/5ehtFFSuW8— Pune Pulse (@pulse_pune) May 27, 2024
విమాన్ నగర్, కోరేగావ్ పార్క్, కళ్యాణి నగర్, భుగావ్ భూకుమ్, బానేర్, హింజవాడి, పింప్రి చించ్వాడ్, లోనావాలా ప్రాంతాల్లో ఉండే అర్ధరాత్రి, రూఫ్‌టాప్‌లో నిర్వహించినే హోటళ్ల వద్ద లంచాలు తీసుకొని చూసిచూడనట్లు వ్యవహరిస్తారని అన్నారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో పోలీసు నెలకు వసూలు చేసే మొత్తం దాదాపు రూ. 78 లక్షలు ఉంటుందని లెక్కలతో సహా మీడియాకు తెలిపారు. లంచాలు తీసుకునే ప్రాంతాలు, వాటిని వసూలు చేసే పోలీసు కానిస్టేబుల్స్ పేర్లను ఎమ్మెల్యే రవీంద్ర ధంగేకర్ బయటపెట్టారు.
కస్బా పేట్ ఎమ్మెల్యే రవీంద్ర ధంగేకర్ బయటపెట్టిన ఈ వివరాలు ప్రస్తుతం మహారాష్ట్రలో సంచలనంగా మారాయి. అదేవిధంగా పుణె పోలీసు డిపార్టుమెంట్‌లో ఎప్పటి నుంచో ఉన్న అవినీతి వ్యవహారం తాజాగా బట్టబయలు అయింది. పుణె సిటీ కల్చర్, చట్టాల అమలుపై తీవ్ర చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment