
విశాఖ: టీడీపీ హయాంలోనే సింహాచలం భూములు అన్యాక్రాంతమయ్యాయి.. దీనిలో అధికారుల పాత్ర ఉండటంతో చర్యలు తీసుకున్నాం అని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. అన్యాక్రాంతమైన భూములను వెనక్కి తీసుకుంటాం అన్నారు. రుషికొండ రిసార్ట్స్‌పై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి అవంతి మండిపడ్డారు. కొత్తవి కట్టేందుకు పాత రిసార్ట్స్ తొలగిస్తే.. టీడీపీ రాజకీయం చేస్తోందని విమర్శించారు. ఇప్పుడున్నవాటి స్థానంలో వరల్డ్ క్లాస్ రిసార్ట్స్ నిర్మిస్తాం అన్నారు. కొత్త రిసార్ట్స్ కోసం మొదటి దశలో రూ.92 కోట్లు.. రెండో దశలో రూ.72 కోట్ల నిధులు మంజూరు అయ్యాయి అని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment