Simhachalam lands
-
సింహాచలం భూములపై విజిలెన్స్ విచారణ
సింహాచలం (పెందుర్తి): సింహాచలంలోని శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి క్షేత్రానికి చెందిన భూములను టీడీపీ హయాంలో రికార్డుల నుంచి తొలగించిన వ్యవహారంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేపట్టింది. ఆలయ ఈవో కార్యాలయంలో సోమవారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ ఎస్పీ స్వరూపారాణి ఆధ్వర్యంలో డీఎస్పీ అన్నెపు నరసింహమూర్తి, సీఐ తిరుపతిరావు భూముల రికార్డులను పరిశీలించారు. ఈ అడ్డగోలు వ్యవహారంపై దేవదాయ శాఖ నియమించిన కమిటీ దర్యాప్తు నిర్వహించి, రికార్డులను పరిశీలించిన విషయం విదితమే. అప్పట్లో ఆస్తుల రికార్డుల నుంచి తొలగించిన 862.22 ఎకరాల్లో కొన్ని భూములు ఇప్పటికీ రెవెన్యూ రికార్డుల్లో సింహాచలం దేవస్థానం పేరిట ఉన్నట్టు గుర్తించింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నేపథ్యంలో భూముల వ్యవహారంపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశించగా.. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం రంగంలోకి దిగారు. మాన్సాస్ భూములపైనా ఈ విభాగం విచారణ చేయనుంది. మూడు నెలల్లోగా నివేదిక సింహాచలం దేవస్థానం, మాన్సాస్ భూముల అవకతవకలపై పూర్తి విచారణ జరిపి మూడు నెలల్లోగా ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ ఎస్పీ స్వరూపారాణి తెలిపారు. ప్రాథమికంగా వివిధ రికార్డులను పరిశీలించామని, కొన్ని రికార్డులను విజిలెన్స్ కార్యాలయానికి తీసుకెళ్లి పరిశీలిస్తామని చెప్పారు. అవకతవకలు జరిగిన భూములను స్వయంగా పరిశీలిస్తామన్నారు. -
‘ఆ అక్రమాల్లో చంద్రబాబు పాత్ర?’
సాక్షి, విజయవాడ: సింహాచలం, మాన్సాస్ భూముల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేవుడి భూములు కాజేసిన వారిని శిక్షించడానికే విజిలెన్స్ విచారణ చేపట్టామన్నారు. అక్రమాల్లో చంద్రబాబు పాత్ర కూడా ఉందని మంత్రి అనుమానం వ్యక్తం చేశారు. ‘‘అశోక్‌గజపతి ఛైర్మన్‌గా వందల కోట్ల భూములకు ఎన్ఓసీలు ఇచ్చారు. 313 ఎకరాలకు అడగకుండానే ఎన్ఓసీలు ఇచ్చారు. ఎండోమెంట్ కమిషనర్ ఇవ్వాల్సిన ఎన్ఓసీలు సింహాచలం ఈవో ఇచ్చారు. పదేళ్లుగా మాన్సాస్‌లో ఆడిట్ జరగలేదు. దేవుడి భూములను రియల్ ఎస్టేట్ సంస్థలకు కట్టబెట్టారని’ మంత్రి మండిపడ్డారు. సింహాచలం దేవస్థానం ఆస్తులు కాపాడాలన్నదే తమ లక్ష్యమని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. -
మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం భూముల వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
-
సింహాచలం: ‘అన్యాక్రాంతమైన భూములను వెనక్కి తీసుకుంటాం’
విశాఖ: టీడీపీ హయాంలోనే సింహాచలం భూములు అన్యాక్రాంతమయ్యాయి.. దీనిలో అధికారుల పాత్ర ఉండటంతో చర్యలు తీసుకున్నాం అని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. అన్యాక్రాంతమైన భూములను వెనక్కి తీసుకుంటాం అన్నారు. రుషికొండ రిసార్ట్స్‌పై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి అవంతి మండిపడ్డారు. కొత్తవి కట్టేందుకు పాత రిసార్ట్స్ తొలగిస్తే.. టీడీపీ రాజకీయం చేస్తోందని విమర్శించారు. ఇప్పుడున్నవాటి స్థానంలో వరల్డ్ క్లాస్ రిసార్ట్స్ నిర్మిస్తాం అన్నారు. కొత్త రిసార్ట్స్ కోసం మొదటి దశలో రూ.92 కోట్లు.. రెండో దశలో రూ.72 కోట్ల నిధులు మంజూరు అయ్యాయి అని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. -
సింహాచలం భూముల అక్రమాలపై ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్
సాక్షి, విశాఖపట్నం : సింహాచలం భూముల అక్రమాలకు సంబంధించి ఇద్దరు ఉద్యోగులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు దేవాదాయశాఖ అడిషనల్ కమిషనర్ రామచంద్రమోహన్, ఏఈవో సుజాతను సస్పెండ్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, దేవాలయ ఆస్తుల రిజిష్టర్ నుంచి భూముల తొలగింపులో.. ఏసీ రామచంద్రమోహన్, ఏఈవో సుజాతలు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. -
గోల్మాల్ నిజమే!
మహారాణిపేట (విశాఖ దక్షిణ): తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సింహాచలం దేవస్థానం భూములను జాబితాల నుంచి తప్పించడం.. మాన్సాస్ ట్రస్టుకు సంబంధించిన భూముల వ్యవహారాల్లో చోటుచేసుకున్న అక్రమాలూ నిజమేనని విచారణ కమిటీ ప్రాథమికంగా నిర్ధారించింది. దేవదాయ శాఖ అడిషనల్ కమిషనర్ చంద్రకుమార్, ప్రాంతీయ కమిషనర్ భ్రమరాంబ, ఉప కమిషనర్ పుష్పావర్ధన్ ఈ వ్యవహారంపై విచారణ పూర్తిచేసి నివేదికను ఆ శాఖ ప్రత్యేక కమిషనర్ పి.అర్జునరావుకు శనివారం సమర్పించారు. ఈ నివేదికను సోమవారం ప్రభుత్వానికి పంపుతున్నట్లు తెలిపారు. సింహాచలం దేవస్థానం భూములకు సంబంధించి పంచ గ్రామాల్లోని పలు సర్వే నంబర్లతో పాటు 748 ఎకరాల భూములను జాబితాల నుంచి తప్పించినట్లు కమిటీ నిగ్గుతేల్చింది. దేవదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్ల (ఇద్దరు ఏసీలు) సాయంతో అప్పటి దేవస్థానం ఈవో రామచంద్రమోహన్ ఈ 748 ఎకరాలను జాబితా నుంచి తప్పించడంలో కీలకపాత్ర పోషించారని.. దీని వెనుక ఆ శాఖకు చెందిన పలువురితోపాటు, కొందరు సింహాచలం దేవస్థానం అధికారులు, సిబ్బంది ఉన్నట్లు పేర్కొంది. భూములను జాబితాల నుంచి తప్పించడంలో అప్పటి ఈఓ నిబంధనలు ఉల్లంఘించారని నివేదికలో స్పష్టంచేసింది. ఈ విషయంలో ఏకపక్షంగా వ్యవహరించి.. దేవదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్లపై ఒత్తిడి తెచ్చారని తెలిపింది. కోట్లాది రూపాయలు విలువ చేసే ఈ భూములను దేవస్థానం జాబితాల నుంచి తప్పించిన వ్యవహారంపై విచారణ బృందం పలు ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఈవో రామచంద్రమోహన్ హయాంలో సిబ్బంది, సెక్యూరిటీ సంస్థల నియామాకం, లీజుల కాల పరిమితి పెంపు, ఇతర వ్యవహారాలపై పూర్తిస్థాయి విచారణ చేపడితే మరిన్ని అక్రమాలు వెలుగుచూసే అవకాశముందని కమిటీ సభ్యులు తమ నివేదికలో సిఫారసు చేసినట్టు సమాచారం. మాన్సాస్ భూముల అమ్మకాలు, మెడికల్ కాలేజీ ఏర్పాటులో చేతివాటం ప్రదర్శించినట్లు కూడా విచారణ బృందం గుర్తించింది. పలు వస్తువుల కొనుగోళ్లలో హెచ్చు ధరలున్నట్లు నివేదికలో పేర్కొంది. రెండు విడతలుగా విక్రయించిన 150 ఎకరాల్లో కొంత భూమిని పక్కదారి పట్టించినట్లు గుర్తించింది. 50 ఎకరాల భూమి విక్రయిస్తే అందులో 36 ఎకరాలకే సొమ్ములు వసూలు చేసి, మిగిలిన 14 ఎకరాలు విడిచి పెట్టినట్లు గుర్తించారు. -
సింహాచలం భూములపై లోతుగా విచారణ
మహారాణిపేట (విశాఖ దక్షిణ): సింహాచలం దేవస్థానం భూముల జాబితా నుంచి వందలాది ఎకరాలు మాయం కావడంపై విచారణ మరింత లోతుగా సాగుతోంది. పంచగ్రామాల భూ జాబితా నుంచి 740 ఎకరాల గల్లంతు కావడంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. దేవదాయ శాఖ అదనపు కమిషనర్ చంద్రకుమార్, ఉప కమిషనర్ ఇ.పుష్పవర్దన్ బుధవారం టర్నర్ సత్రం ఉప కమిషనర్ కార్యాలయంలో విచారణ చేపట్టారు. దేవదాయ శాఖ ఆస్తుల జాబితా, 22 ఏ జాబితా, ఇతర రికార్డులను అధికారులు తనిఖీ చేశారు. అడంగల్ కాపీలు, టెన్ వన్ రికార్డులను కూడా పరిశీలిస్తున్నారు. 2016 డిసెంబర్–2017 ఫిబ్రవరి మధ్య 740 ఎకరాల భూమిని జాబితాల నుంచి తప్పించినట్టు అధికారులు గుర్తించారు. ఏ ప్రాంతాల్లోని భూములను జాబితాల నుంచి తప్పించారనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. 2010 రికార్డుల ప్రకారం దేవస్థానానికి 11,118 ఎకరాల భూమి ఉండగా.. 2016 నాటికి 10,278 ఎకరాలు మాత్రమే ఉన్నాయి. మొత్తం వ్యవహారంపై విచారణ అధికారులు రెండు రోజుల్లో దేవదాయ శాఖ నివేదిక సమర్పించే అవకాశం ఉంది. -
సింహాచలం భూముల అక్రమాలపై విచారణ కమిటీ ఏర్పాటు
సాక్షి, విశాఖపట్నం: సింహాచలం దేవస్థానం, మాన్సాస్ ట్రస్ట్ భూముల వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూముల వ్యవహారంలో విచారణ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అడిషనల్ కమిషనర్ చంద్రకుమార్, డిప్యూటీ కమిషనర్ పుష్పవర్థన్‌లతో కమిటీని నియమించింది. ఈనెల 15లోగా ప్రాథమిక నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. మాజీ ఈవో రామచంద్రమోహన్ హయాంలో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అడిషనల్ కమిషనర్ కె.రామచంద్రమోహన్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అశోక్ గజపతిరాజు చైర్మన్‌గా ఉన్న కాలంలో ఈవోగా రామచంద్రమోహన్ పనిచేశారు. మాన్సాస్ భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడినట్లు దేవాదాయ శాఖ గుర్తించింది. సింహాచలం దేవస్థానం భూములను 22 ఏ జాబితా నుండి చట్టవిరుద్దంగా తొలగించారనే అభియోగాలు ఉన్నాయి. -
సింహాచలం భూముల అక్రమాలపై ఏపీ సర్కార్ చర్యలు
సాక్షి, విశాఖపట్నం: సింహాచలం భూముల అక్రమాలపై ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అడిషనల్ కమిషనర్ కె.రామచంద్రమోహన్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. మాన్సాస్ భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడినట్లు దేవాదాయ శాఖ గుర్తించింది. సింహాచలం దేవస్థానం భూములను 22 ఏ జాబితా నుండి చట్టవిరుద్దంగా తొలగించారనే అభియోగాలు ఉన్నాయి. అశోక్ గజపతిరాజు చైర్మన్‌గా ఉన్న కాలంలో ఈవోగా రామచంద్రమోహన్ పని చేశారు. సింహాచలం శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ భూముల గోల్‌మాల్‌కు సంబంధించి రోజుకో వ్యవహారం వెలుగుచూస్తోంది. ఈ విషయమై రెండ్రోజులుగా ‘సాక్షి’లో వస్తున్న సంచలనాత్మక కథనాలు తెలిసిందే. తాజాగా.. ఈ 748 ఎకరాల భూబాగోతం వ్యవహారం వెలుగుచూడకుండా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ పెద్దలే అధికారుల నోరు నొక్కేసినట్లు తెలుస్తోంది. నిజానికి.. 2016 డిసెంబర్లో సింహాచలం ఆలయ ఆస్తుల రిజిస్టర్ నుంచి ఆ భూములు తొలగించడానికి నాలుగు నెలల ముందే అప్పటి దేవదాయ శాఖ కమిషనర్ మౌఖిక ఆదేశాలతో ఆలయ ఆస్తులపై రహస్యంగా విచారణ జరిపినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. -
మనం దుర్యోధనుడికంటే దారుణంగా బతికితే ఎలా?
సింహాచలం: దేవుడి భూముల్లో ఒక్క అంగుళం కూడా ముట్టుకునే హక్కు ముఖ్యమంత్రికి కూడా లేదని పాంచరాత్ర ఆగమశాస్త్ర పండితులు త్రిదండి చిన జీయర్‌స్వామి అన్నారు. సింహాచలం దేవస్థానానికి చెందిన శ్రీకృష్ణాపురం గోశాలలో ఈ నెల 11 నుంచి జరుగుతున్న సుదర్శన నారసింహ మహాయజ్ఞంలో మంగళవారం పాల్గొన్న ఆయన వేదికపై అనుగ్రహ భాషణం చేశారు. దేవుడి భూముల్లో ఒక్క అంగుళం కూడా ముట్టుకునే హక్కు దేవాలయాల ఈవోలకే కాదు.. ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి కూడా లేదని స్పష్టం చేశారు. బ్రాహ్మణులకు, దేవుడికి ఇచ్చిన భూములు తప్ప మిగతా వాటిని మనం ఎలాగైనా శాసించవచ్చని మహాభారతంలో చెడ్డవాడిగా చెప్పుకునే దుర్యోధనుడే చెప్పాడని తెలిపారు. దుర్యోధనుడికంటే దారుణంగా మనం బతికితే ఎలాగని ప్రశ్నించారు. దీన్నిబట్టి చూస్తే ఆ కాలంలో దుర్యోధనుడే చాలా గొప్పవాడన్నారు. దేవుడి ఆస్తితో ఆటలొద్దు దేవుడి ఆస్తితో, భూములతో ఆటలాడుకోవడం మంచిపద్ధతి కాదన్నారు. దేవస్థానాన్ని, దేవాలయాన్ని అప్పగించారని ధర్మకర్తలు, ఈవోలు స్వార్థ ప్రయోజనాల కోసం వాటిని వాడుకోకూడదన్నారు. అలాగే దేవాలయాల్లో స్వామికి భక్తులు ఇచ్చే ఆభరణాలు వైదికులకు ఇస్తే వాటిని వారు వాడుకోకూడదన్నారు. అలా జరిగితే పాలకుల అసమర్థత అవుతుందన్నారు. సింహాచలం దేవస్థానం భూసమస్య పరిష్కారం అంటూ ఇటీవల ప్రభుత్వం చేసిన ఆర్డినెన్స్ విషయాన్ని విన్నానన్నారు. దేవస్థానానికి పూర్వీకులు ఇచ్చిన ఆస్థిని కాపాడాలన్నారు. దేవుడి కోసం మనం అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. దేవుడి ద్వారా సమాజం బాగుపడుతుందని, సామాజిక వ్యక్తుల్లో నైతిక బలం పెరుగుతుందనే ఉద్దేశంతో ఆరోజు వేలాది ఎకరాలు మన పూర్వీకులు దేవుడికి ఇచ్చారని తెలిపారు. నిజంగా జనాలపై ప్రేమ పొంగిపొర్లుతుంటే దేవుడి భూమి ఒక్క ఇంచు కూడా ముట్టుకో కుండా ప్రభుత్వ భూమి అంతా దానం చేయాలని సూచించారు. ఆలయ వ్యవస్థలను, భూము లను కాపాడాల్సిన భాధ్యత ధర్మకర్తలు, ఈవోలపై ఉంటుంద న్నారు. కార్యక్రమంలో పాల్గొన్న దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌గజపతి రాజు, ఈవో కె.రామచంద్ర మోహన్‌లను చూపిస్తూ ఆవిధంగా చేయాలని సూచించారు. ఆలయ వ్యవస్థని కాపాడుకోవాలి ఆలయ వ్యవస్థని జాగ్రత్తగా పెట్టుకుంటే సమాజంలో ఉన్న ప్రతీ వ్యక్తికి శ్రేయస్సు కలుగుతుందన్నారు. భగవంతుడు మేఘం వంటివాడని, మేఘానికి పక్షపాతం ఉండదన్నారు. సింహాచలం దేవస్థానం ప్రస్తుత కాలంలో చాలా గొప్ప ఆలయమన్నారు. ప్రతీ ఆలయంలో ఒక నిత్యాగ్నిహోత్రం ఉండేదని, ఆలయం ప్రారంభం నుంచి అగ్నిహోత్రం సాగుతుంటుందన్నారు. ఇప్పుడు చాలాచోట్ల ఆ వ్యవస్థ లేదని నిరుత్సాహం వ్యక్తం చేశారు. ఒక్క సింహాచలం దేవస్థానంలో ఆ వ్యవస్థ ఇప్పటికీ కొనసాగడం ఎంతో గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అహోబిల రామానుజ జీయర్ స్వామి మాట్లాడుతూ దేవస్థానంలో సుదర్శన నారసింహ మహా యజ్ఞం నిర్వహణ చాలా గొప్ప కార్యక్రమమని తెలిపారు. -
పంచభూతాలనూ దోచుకుతింటున్నారు
పెందుర్తి: సింహాచలం దేవస్థానం భూసమస్య టీడీపీకి ఎన్నికల సమయంలో మాత్రమే గుర్తుకు వస్తుందని వైఎస్సార్ సీపీ అనకాపల్లి పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. పంచగ్రామాల సమస్యను గాలికొదిలేసిన టీడీపీ నాయకులు ఇక్కడున్న పంచభూతాలను దోచుకుతింటున్నారని ధ్వజమెత్తారు. పంచగ్రామాల భూసమస్య పరిష్కారం ఆశిస్తున్న వేలాది కుటుంబాల తరఫున పార్టీ పెందుర్తి సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్‌రాజ్ చేపట్టిన పాదయాత్ర ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా వేపగుంట కూడలి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అమర్నాథ్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తికి ప్రతిపక్షం నాయకులను బూతులు తిట్టడం తప్ప ప్రజా సమస్యలను పరిష్కరించే తీరిక లేదని ఎద్దేవా చేశారు. భూసమస్యను ఆరు నెలల్లో పరిష్కరిస్తానని, లేకపోతే రాజీనామా చేస్తానని బండారు అన్నమాట వాస్తవమా కాదా అని ప్రశ్నించారు. తనకు మంత్రి పదవి రాలేదని గన్మెన్లను విడిచిపెట్టి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన బండారుకు ప్రజాసమస్య పరిష్కరించడంలో సీఎం చంద్రబాబును ఎందుకు ఎదిరించలేకపోతున్నారన్నారు. రాష్ట్రాన్ని చినబాబు(లోకేష్) దోచుకుంటుంటే పెందుర్తిని నాయుడుబాబు(బండారు కుమారుడు) లూటీ చేస్తున్నాడని ఆరోపించారు. మాటతప్పిన టీడీపీ నాయకులను రానున్న రోజుల్లో ప్రజలు అడుగడుగునా నిలదీయాలని పిలుపునిచ్చారు. ఈ సమస్య పరిష్కారానికి వైఎస్సార్ సీపీ నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. పార్టీ అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త వరుదు కల్యాణి మాట్లాడుతూ భూసమస్య పరిష్కారం కోసం అదీప్‌రాజ్ చేస్తున్న పోరాటం స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు. అదీప్‌రాజ్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తొలి కేబినెట్లోనే 100 రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని చెప్పి ప్రజలను వంచించారన్నారు. సమస్యకు పీఠాధిపతులు, వైస్సార్‌సీసీ కారణమంటున్న టీడీపీ నాయకులు ఆ పీఠాధిపతుల వద్దకు వెళ్లి సత్కారాలు చేయించుకోలేదా అని ప్రశ్నించారు. వేదికపై అదీప్‌రాజ్, అమర్నాథ్, వరుదు కల్యాణిలను కార్యకర్తలు ఘనంగా సత్కరించారు. సభకు పార్టీ 69వ వార్డు అధ్యక్షుడు దాసరి రాజు అధ్యక్షత వహించగా పార్టీ సీఈసీ సభ్యుడు పైలా శ్రీనివాసరావు, రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శి కొండా రాజీవ్, నగర అధికార ప్రతినిధి యతిరాజుల నాగేశ్వరరావు, మండల కన్వీనర్ నక్కా కనకరాజు, వార్డుల అధ్యక్షులు ముమ్మన వెంకటరమణ, కొలుసు ఈశ్వరరావు, శరగడం నరసింహమూర్తి, బట్టు సన్యాసిరావు, దాడి నూకరాజు, దొడ్డి కిరణ్, పార్టీ సీనియర్ నేతలు మల్లెల గురవారెడ్డి, మెంటి సూరిబాబు, వేలాది మంది కార్యకర్తలు, పంచగ్రామాల ప్రజలు పాల్గొన్నారు. -
ఎన్నాళ్లకెన్నాళ్లకు..
- సింహాచలం భూముల క్రమబద్దీకరణ - కేబినెట్లో తాజాగా ఆమోదం - 12,149 మందికి లబ్ది - 60 గజాల్లోపు ఆక్రమించుకున్న 1665 మందికి ఉచితం సాక్షి, విశాఖపట్నం: దశాబ్దాల కల సాకారమవుతోంది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సింహాచలం భూముల ఆక్రమిత బాధితులకు ఊరట లభించింది. ఏళ్లతరబడి ఆక్రమించుకున్నవారివే క్రమబద్ధీకరించాలని శనివారం విజయవాడలో కేబినెట్ సమావేశంలో సర్కార్ నిర్ణయం తీసుకుంది. 2008లో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుననుసరించి పంచగ్రామాల భూముల సమస్యను పరిష్కరించాలని నిర్ణయించింది. సింహాచలం దేవస్థానికిచెందిన 419ఎకరాల భూమి రెండు దశాబ్దాల క్రితం ఆక్రమణకు గురైంది. ఈ భూమి ప్రస్తుత మార్కెట్ విలువ రూ.2232కోట్లకు పైగా ఉంది. 12,149 మంది ఆక్రమించు కుని పక్కాకట్టడాలు నిర్మించుకున్నారు. 2008వరకు ఆక్రమించుకుని నిర్మించుకున్న పక్కా భవనాలను క్రమబద్ధీకరించాలని కేబినెట్ నిర్ణయించింది. ఆక్రమించుకున్న వారిని మూడు కేటగిరిలుగా విభజించింది. తొలికేటగిరిలో 60 చదరపు గజాలలోపు ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకున్న నిరుపేదలకు ఉచితంగా క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. 300 గజాల్లోపు ఆక్రమించుకున్న వారికి 1998 సంవత్సరం నాటి మార్కెట్ రేటులో 70 శాతంతో పాటు నాటి నుంచి నేటి వరకు ఏటా 9 శాతం చొప్పున వడ్డీ చెల్లిస్తే క్రమబద్దీకరించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక 300 గజాలకు పైబడి ఆక్రమించుకున్న వారికి మాత్రం ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం వసూలు చేసి రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయించింది. ఈ విధంగా 60 చదరపు గజాల్లోపు ఆక్రమించుకున్న వారు 1665 మంది ఉండగా, 300 చదరపు గజాల్లోపు ఆక్రమించుకున్న వారు 9366 మంది ఉన్నారు. 300 చదరపు గజాలు పైబడి ఆక్రమించుకున్న వారు 1118 ఉన్నట్టుగా లెక్క తేల్చారు. ఈ భూమికి ప్రత్యామ్నాయంగా 547 ఎకరాలను సింహాచలం దేవస్థానానికి కేటాయించాలని కేబినెట్ నిర్ణయిం చింది. ఈభూముల కనీసవిలువ రూ.609కోట్లు ఉంటుందని అంచనా వేసింది. దేవస్థానం నష్టపోతున్న 419 ఎకరాల భూమి విలువ రూ.2232 కోట్లుగా లెక్క తేల్చింది. ఈ మేరకు ప్రత్యామ్నాయ భూమితో పాటు రెగ్యులరైజేషన్ ద్వారా వచ్చే రూ.989కోట్ల ఆదాయాన్ని కూడా దేవస్థానానికి చెందేలా కేబినెట్ నిర్ణయం తీసుకుంది.