సాక్షి, విశాఖపట్నం: సింహాచలం భూముల అక్రమాలపై ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అడిషనల్ కమిషనర్ కె.రామచంద్రమోహన్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. మాన్సాస్ భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడినట్లు దేవాదాయ శాఖ గుర్తించింది. సింహాచలం దేవస్థానం భూములను 22 ఏ జాబితా నుండి చట్టవిరుద్దంగా తొలగించారనే అభియోగాలు ఉన్నాయి. అశోక్ గజపతిరాజు చైర్మన్‌గా ఉన్న కాలంలో ఈవోగా రామచంద్రమోహన్ పని చేశారు.
సింహాచలం శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ భూముల గోల్‌మాల్‌కు సంబంధించి రోజుకో వ్యవహారం వెలుగుచూస్తోంది. ఈ విషయమై రెండ్రోజులుగా ‘సాక్షి’లో వస్తున్న సంచలనాత్మక కథనాలు తెలిసిందే. తాజాగా.. ఈ 748 ఎకరాల భూబాగోతం వ్యవహారం వెలుగుచూడకుండా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ పెద్దలే అధికారుల నోరు నొక్కేసినట్లు తెలుస్తోంది. నిజానికి.. 2016 డిసెంబర్‌లో సింహాచలం ఆలయ ఆస్తుల రిజిస్టర్ నుంచి ఆ భూములు తొలగించడానికి నాలుగు నెలల ముందే అప్పటి దేవదాయ శాఖ కమిషనర్ మౌఖిక ఆదేశాలతో ఆలయ ఆస్తులపై రహస్యంగా విచారణ జరిపినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment