Land irregularities
-
అమ్మో.. అమోయ్‌కుమార్!
సాక్షి, హైదరాబాద్: అమోయ్‌కుమార్.. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో చేసిన అక్రమాలు ఒకొక్కటిగా బయటకు వస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ భూములనే కాదు అటవీ, రక్షణశాఖ, కాందిశీకుల భూములనూ తన అధికారాన్ని ఉపయోగించి ధారాదత్తం చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహేశ్వరం మండలంలో భూదాన్భూములపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణ చేపట్టడంతో ఆయన బారిన పడిన బాధితులు ఒక్కొక్కరుగా ఈడీకి ఫిర్యాదు చేస్తున్నారు. ఒకవైపు ఈడీ విచారణ చేస్తుండగానే.. మరోవైపు హైకోర్టు, అమోయ్‌కుమార్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఉన్నప్పుడు 52 ఎకరాల ప్రభుత్వ భూమిని పైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయడాన్ని తప్పుపడుతూ ఆ నిర్ణయాన్ని మంగళవారం కొట్టేయడం చూస్తుంటే.. కలెక్టర్‌గా ఆయన ప్రభుత్వానికి తీవ్రంగా ఆర్థిక నష్టం కలిగించారో తెలుస్తోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీపావళి తర్వాత అమోయ్‌కుమార్‌ను మరోసారి విచారణకు పిలిచే అవకాశాలున్నాయి. – ఆదిబట్లలోని సర్వే నంబరు 44లోని సీలింగ్ భూములైన 18 ఎకరాలను కొంతమందికి పట్టాదార్ పాస్‌పుస్తకాలు ఇవ్వడం పూర్తిగా అధికార దుర్వినియోగమేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. – శామీర్‌పేట మండలంలోని తూముకుంటలోని అటవీ భూములకు సంబంధించి సర్వే నంబరు 164లో మొత్తం 26 ఎకరాలను కూడా అన్యాయంగా కొంతమంది వ్యక్తులు, పరిశ్రమల పేరిట పెద్దవారికి ధారాదత్తం చేశారని రాఘవేందర్‌గౌడ్ డాక్యుమెంట్లతో సహా ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. – సర్వే నంబరు 165/1, సర్వేనంబరు 1266లోని భూములను కూడా ఒకసారి పరిశీలించాలని అందులో పేర్కొన్నారు. 26 ఎకరాలను మరొకరి పేరిట చేయడమేకాక, మ్యుటేషన్ కూడా చేశారని, ఆ స్థలం అటవీశాఖ ఆ«దీనంలోనే ఉన్నా.. ఇలా మ్యుటేషన్ చేయడంతో వారు ఆ కాగితాలను వినియోగించుకొని రుణాలు కూడా తెచ్చుకున్నారని చెబుతున్నారు. 1953లోనే ఆ సర్వే నంబరులోని భూములు రిజర్వ్ ఫారెస్ట్ కోసం కేటాయించినట్టు గెజిట్ నోటిఫికేషన్లో ఉన్నా, వారసులం అంటూ కొందరు చేసుకున్న దరఖాస్తు ఆధారంగా వారికి ఆ భూములు ధారాదత్తం చేశారని ఆ ఫిర్యాదులో వివరించారు. ఆ భూమి తమదంటూ దరఖాస్తు చేసుకున్న వారసుల తండ్రి 1976లో చనిపోతే.. వారు 2017లో వచ్చి తమ భూమి అంటూ దరఖాస్తు చేసుకోవడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. ఆర్ఓఆర్ చట్టం ప్రకారం వారసులకు భూములు అప్పగించే ముందు ఆ భూమిలో వారి ఆ«దీనంలో ఉందా.. వారు ఆ భూమిని సాగు చేస్తున్నారా.? రెవెన్యూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించడం, దానిపై అభ్యంతరాలను ఆహా్వనించడం, సక్సెషన్‌కు అవసరమైన డాక్యుమెంట్లను కోరడం, యుఎల్‌సీ, తదితర వాటిని పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కలెక్టరేట్‌కు కేవలం 10 నిమిషాల దూరంలో ఉన్న ఆ భూములు ఎవరి ఆ«దీనంలో ఉన్నాయో తెలుసుకోకుండా మ్యుటేషన్ చేశారని ఈడీకి ఇచి్చన ఫిర్యాదులో పేర్కొన్నారు. – 261, 273 తదితర సర్వే నంబర్లలోని భూములను కూడా అదే విధంగా అప్పగించారని పేర్కొన్నారు. కూకట్పల్లి సమీపంలోని హైదర్‌నగర్ దగ్గర మూడు ఎకరాల భూమిని కూడా అమోయ్‌కుమార్ ధరణిని అడ్డుపెట్టుకొని ప్రైవేట్ వ్యక్తులకు ప్రభుత్వ భూమిని ధారాదత్తం చేశారన్నారు. – శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం పాన్‌మక్తలోని నిషేధిత జాబితాలో ఉన్న భూములను కూడా ఆ జాబితా నుంచి తొలగించి కొందరికి అప్పగించారని పేర్కొన్నారు. మరో పిటిషన్.. అమోయ్‌కుమార్ కలెక్టర్‌గా ఉన్న సమయంలో గోపనపల్లిలో 50 ఎకరాలు, మాదాపూర్‌లో 5 ఎకరాలు, హఫీజ్‌పేటలో 20 ఎకరాలు, మోకిలలో 115 ఎకరాలు, వట్టినాగుల పల్లిలో 20 ఎకరాలు, గండిపేట ఖానాపూర్‌లో 150 ఎకరాలు, మియాపూర్‌లో 27 ఎకరాలు అన్యాక్రాంతం చేశారని బక్క జడ్సన్ మంగళవారం ఈడీకి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేయడంలో ఆయనతోపాటు మాజీ చీఫ్ సెక్రటరీ, ప్రస్తుత రెవెన్యూ ముఖ్యకార్యదర్శిల పాత్ర ఉన్నట్టు ఈడీ జాయింట్ డైరెక్టర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. -
భూ అక్రమాలు క్షేత్ర స్థాయిలో కనిపించలేదు
సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో విశాఖ జిల్లాలో భూ అక్రమాలు జరిగాయంటూ కూటమి నేతలు చేస్తున్న దు్రష్పచారానికి తెరపడినట్లే. భూ అక్రమాలను పరిశీలించడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్షేత్ర స్థాయి పరిశీలనకు వచ్చిన రెవెన్యూ శాఖ స్పెషల్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా.. జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్, జేసీ మయూర్ అశోక్‌తో కలిసి శనివారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ భూ అక్రమాలు క్షేత్రస్థాయిలో కనిపించలేదని చెప్పారు. మాజీ సీఎస్ జవహర్‌రెడ్డి, ఆయన కుమారుడు దాదాపు 2 వేల ఎకరాల ఫ్రీ హోల్డ్ భూములను బెదిరించి రాయించుకున్నారనే ప్రచారంపైనా పరిశీలించామని చెప్పారు. అయితే, జిల్లాలో 2,600 ఎకరాలు ప్రీహోల్డ్కు అవకాశం ఉండగా, వాటిలో 626 ఎకరాలు ఫ్రీహోల్డ్ చేసి 22ఎ నుంచి తీసివేశారని తెలిపారు. ఇందులో 4 మండలాల పరిధిలోని 133 ఎకరాలు మాత్రమే కొత్త వారి పేరుతో రిజి్రస్టేషన్ జరిగిందని చెప్పారు. ఇందులో మాజీ సీఎస్‌కు ప్రమేయం ఉందని చెప్పలేమని స్పష్టం చేశారు. చట్టం ప్రకారం 20 ఏళ్లు దాటిన డి పట్టా భూములను ఎవరైనా కొనొచ్చని తెలిపారు. జిల్లాలో అసైన్డ్, డి పట్టా భూములను ఫ్రీ హోల్డ్ చేసి, రిజి్రస్టేషన్ వంటివి ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. త్వరలో జీవీఎంసీ, రెవెన్యూ అధికారుల సమన్వయంతో భూ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. నగరం విస్తరించడం, భోగాపురం ఎయిర్‌పోర్టు వల్ల విశాఖలో భూముల ధరలు పెరిగాయని చెప్పారు. ఏడాది క్రితం వరకు లేఅవుట్లకు అనుమతి ఉందో లేదో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తెలిసేది కాదని, నూతన విధానం వల్ల ఆ సమస్య పరిష్కారమైందని చెప్పారు. ఎర్రమట్టి దిబ్బల్లో అనుమతులివ్వలేదు ఎర్రమట్టి దిబ్బల్లో ఎలాంటి నిర్మాణాలకు అనుమతులివ్వలేదని తెలిపారు. అక్కడ కొంత భూమిని చదును చేస్తుండగా, జిల్లా యంత్రాంగం నిలిపేసిందని తెలిపారు. దసపల్లా ఎస్టేట్ భూములపై కోర్టు కేసులున్నాయన్నారు. 60 ఎకరాల్లో 14.5 ఎకరాల ప్రభుత్వ భూమిని 22ఎ లో పెట్టారని, మిగతా భూమిని ఏ విధంగా పరిష్కరించాలో మార్గాలను వెదుకుతున్నామని అన్నారు. ఎస్టేట్ భూములపై సెటిల్మెంట్ ఆఫీసర్ ల్యాండ్ రెంట్ పట్టా ఇవ్వడాన్నీ పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో సిటీ మ్యాప్ తయారుచేసి, ప్రభుత్వ, ప్రభుత్వేతర భూములను, రోడ్లు, పార్కులు వంటివి రంగులతో చూపుతామని, దీనివల్ల ఆక్రమణలకు ఆస్కారం ఉండదని తెలిపారు. అంతకు ముందు ఆయన కలెక్టర్ కార్యాలయంలో భూ సమస్యలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. -
నకిలీ పట్టాలు, భూ ఆక్రమణలపై ప్రభుత్వం కొరడా
సాక్షి ప్రతినిధి, కడప : భూ దందాలతోపాటు పలు అక్రమాలపై వైఎస్ జగన్ ప్రభుత్వం కన్నెర్ర చేసింది. నకిలీ పట్టాలు, భూ ఆక్రమణలతో కొందరు అక్రమార్కులు బద్వేలు ప్రాంతంలో అలజడులు సృష్టిస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాలు ప్రభుత్వం దృష్టికి చేరడంతో పేదలను ఇబ్బందులకు గురి చేస్తున్న వారెవరినీ వదిలి పెట్టవద్దంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా కలెక్టర్ విజయరామరాజు, ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్‌లను ఆదేశించారు. తన, పర తారమత్యం లేకుండా అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం తేల్చి చెప్పారు. సీఎంఓ నుంచి ఆదేశాలు అందుకున్న బద్వేలు ఆర్డీఓ ఆకుల వెంకట రమణ స్పందించారు. లోతైన విచారణకు దిగారు. బాధితులు తన వద్దకు రావాలంటూ ప్రకటించారు. దీంతో కొందరు బాధితులు తమ స్థలాలు, భూములను ఆక్రమించిన వారి వివరాలను ఆర్డీఓ, కలెక్టర్లకు అందజేశారు. వీటిపై ఆర్డీఓ లోతైన విచారణ చేపట్టారు. నకిలీ సీళ్లు, బోగస్ సంతకాలతో కొందరు నకిలీ పట్టాలు సృష్టించి పేదల స్థలాలు, భూములను ఆక్రమిస్తున్న విషయం ఆయన దృష్టికి వచ్చింది. అటువంటి వారి జాబితాను సిద్ధ చేసుకున్న ఆర్డీఓ బద్వేలు ప్రాంతంలో పోలీసులతో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పలు నకిలీ పట్టాలు, సీళ్లు, ఇతర సామగ్రి దొరికింది. దీంతో ప్రాథమికంగా 18 మందిపై కేసులు నమోదు చేశారు. సీపీఐ, టీడీపీ, ప్రజా సంఘాలు, అధికార పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు సైతం ఈ వ్యవహారంలో ఉన్నట్లు బట్టబయలైంది. బుధవారం నాటికి వీరిలో 8 మందిని అరెస్టు చేశారు. మిగిలిన వారు పరారీలో ఉన్నారు. విచారణ కొనసాగుతోంది. ఇంకొందరిపైన కేసులు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. బద్వేలుతోపాటు పోరుమామిళ్ల, కాశినాయన, కలసపాడు, గోపవరం, అట్లూరు ప్రాంతాల్లోనూ ఈ తరహా అక్రమాలపై ఆర్డీఓ లోతైన విచారణ చేపట్టారు. ఆర్మీ వారి పేర్లతో బోగస్ ఐడీలు కొందరు ఆర్మీలో ఉన్న వారి పేర్లతో బోగస్ ఐడీలు సృష్టించి కొత్త తరహా అక్రమాలకు తెరలేపారు. ఆక్రమించిన స్థలాలు, భూములు పది సంవత్సరాల క్రితమే సైనికుల పేరున పట్టాలు చేయించుకున్నట్లు రికార్డులు మార్చి ఎన్ఓసీల ద్వారా వాటిని వెంచర్లు వేసి కొందరు అమ్మకాలకు పెట్టగా, మరికొందరు వందలాది ఎకరాల భూములను సైనికుల పేరున మార్చి వేరొకరికి కోట్లాది రూపాయలకు అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది. పోరుమామిళ్ల, కలసపాడు, కాశినాయన ప్రాంతాలతోపాటు బద్వేలు, గోవపరంలోనూ ఈ తరహా అక్రమాలు జరిగినట్లు ఆర్డీఓ, కలెక్టర్ల దృష్టికి వచ్చింది. దీనిపై విచారణ చేపట్టారు. వీటితోపాటు వందలాది ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారి వివరాలను వెలికి తీస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో గత ప్రభుత్వంలోనే పెద్ద ఎత్తున భూ ఆక్రమణలు జరిగినట్లు విచారణలో బయటపడుతోంది. డీకేటీల అమ్మకాలు సహించం డీకేటీ స్థలాలు, భూముల కొనుగోళ్లు, అమ్మకాలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని జిల్లా కలెక్టర్ విజయరామరాజు, బద్వేలు ఆర్డీఓ ఆకుల వెంకట రమణలు ఇప్పటికే ప్రకటించారు. ల్యాండ్ కన్వర్షన్ లేకుండా ప్లాట్ల అమ్మకాలకు సిద్ధం చేసిన పలు వెంచర్లను ఇప్పటికే నిలిపివేశారు. వ్యవసాయానికి ఇచ్చిన భూమిని ఎట్టి పరిస్థితుల్లో ప్లాట్ల అమ్మకాలకు అనుమతించేది లేదని తేల్చి చెప్పారు. అలా చేయాలనుకుంటే ల్యాండ్ కన్వర్షన్ (భూ బదలాయింపు) తప్పనిసరి అని స్పష్టం చేశారు. బాధితులు, ప్రజల హర్షం భూ ఆక్రమణలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించడం, అందుకు కారకులైన వారిపై కేసులు నమోదు చేసి అరెస్టులు చేయడంపై బాధితులు, జిల్లా ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం తన, పర అన్న బే«ధం లేకుండా నిస్పాక్షికంగా వ్యవహరించడాన్ని అన్ని వర్గాల ప్రజలు స్వాగతిస్తున్నారు. అక్రమాల్లో ఇంటి దొంగలు బద్వేలుతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో జరిగిన భూ దందాల్లో ఇంటి దొంగల పాత్ర కీలకంగా ఉన్నట్లు ఉన్నతాధికారుల విచారణలో తేలింది. బద్వేలు అక్రమాల్లో కీలకపాత్ర పోషించిన ఇద్దరు వీఆర్వోలపై ఇప్పటికే కేసులు నమోదు చేశారు. వీరు కాకుండా ముగ్గురు తహసీల్దార్లు, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు ఆర్ఐలు, ఓ ఆర్డీఓ స్థాయి అదికారి సైతం గతంలో జరిగిన భూ ఆక్రమణలు, నకిలీ పట్టాల వ్యవహారంలో కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరి జాబితాను జిల్లా అధికారులు సిద్ధం చేశారు. త్వరలోనే వీరిపై కేసులు నమోదు చేయబోతున్నారు. పేదలకు అన్యాయం జరగనివ్వం బద్వేలు నియోజకవర్గంలో అర్హులైన పేదలకు అన్యాయం జరగనివ్వం. కొందరు అక్రమార్కులు నకిలీ సీళ్లు, ఫోర్జరీ సంతకాలతో నకిలీ పట్టాలు సృష్టించి పేదల స్థలాలు, భూములను దౌర్జన్యకరంగా ఆక్రమించారు. ఇలాంటి చర్యలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తాయి. ప్రభుత్వ ఆదేశాలతో నియోజకవర్గంలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపట్టాం. ఇప్పటికే చాలామందిపై కేసులు పెట్టి అరెస్టులు చేశాం. మరికొంతమందిపైన కేసులు పెట్టబోతున్నాం. నియోజకవర్గంలో ఏ ఒక్కరికీ అన్యాయం జరిగినా నా దృష్టికి తీసుకు రండి...కచ్చితంగా వారికి న్యాయం జరిగేలా చూస్తా. – ఆకుల వెంకట రమణ, ఆర్డీఓ, బద్వేలు -
సింహాచలం భూముల అక్రమాలపై ఏపీ సర్కార్ చర్యలు
సాక్షి, విశాఖపట్నం: సింహాచలం భూముల అక్రమాలపై ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అడిషనల్ కమిషనర్ కె.రామచంద్రమోహన్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. మాన్సాస్ భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడినట్లు దేవాదాయ శాఖ గుర్తించింది. సింహాచలం దేవస్థానం భూములను 22 ఏ జాబితా నుండి చట్టవిరుద్దంగా తొలగించారనే అభియోగాలు ఉన్నాయి. అశోక్ గజపతిరాజు చైర్మన్‌గా ఉన్న కాలంలో ఈవోగా రామచంద్రమోహన్ పని చేశారు. సింహాచలం శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ భూముల గోల్‌మాల్‌కు సంబంధించి రోజుకో వ్యవహారం వెలుగుచూస్తోంది. ఈ విషయమై రెండ్రోజులుగా ‘సాక్షి’లో వస్తున్న సంచలనాత్మక కథనాలు తెలిసిందే. తాజాగా.. ఈ 748 ఎకరాల భూబాగోతం వ్యవహారం వెలుగుచూడకుండా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ పెద్దలే అధికారుల నోరు నొక్కేసినట్లు తెలుస్తోంది. నిజానికి.. 2016 డిసెంబర్లో సింహాచలం ఆలయ ఆస్తుల రిజిస్టర్ నుంచి ఆ భూములు తొలగించడానికి నాలుగు నెలల ముందే అప్పటి దేవదాయ శాఖ కమిషనర్ మౌఖిక ఆదేశాలతో ఆలయ ఆస్తులపై రహస్యంగా విచారణ జరిపినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. -
నారా లోకేష్ ఫౌండేషన్ అధ్యక్షుడి భూమాయ
గత ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలు సాగించిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. పేదలకు అందాల్సిన ప్రతి సంక్షేమ ఫలాన్నీ అడ్డగోలుగా స్వాహా చేయడమే కాకుండా రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములను సైతం రాచమార్గంలో తమ పేరిట పట్టాలు చేయించుకున్నారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ పభుత్వం ఏర్పాటైన తర్వాత టీడీపీ నేతల అక్రమాలు బయటపడుతుండటంతో జనం ముక్కున వేలేసుకుంటున్నారు. సాక్షి, పుట్టపర్తి: నారా లోకేష్ యువజన ఫౌండేషన్ పుట్టపర్తి నియోజకవర్గ అధ్యక్షుడు పల్లపు రవీంద్ర భూ అక్రమాల్లో ఆరితేరిపోయాడు. నియోజకవర్గంలో రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములపై కన్నేసిన ఇతను నిబంధనలను తుంగలో తొక్కి టీడీపీ పాలనలో 39.52 ఎకరాలను స్వాహా చేశాడు. బుక్కపట్నం మండలం రామసాగారానికి చెందిన ఇతను తన సోదరుడు శంకర్, కుటుంబ సభ్యుల పేరిట పట్టాదారు పాసు పుస్తకాలు పొందాడు. 1996 నుంచి టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ ఈ బాగోతం కొనసాగుతూ వచ్చింది. అసైన్డ్ భూమి అంటే?.. భూమిలేని నిరుపేదలకు సాగు చేసుకోవడానికి, ఇళ్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం మంజూరు చేసిన, కేటాయించిన భూమిని అసైన్డ్ అంటారు. ఈ భూమిని వారసత్వంగా అనుభవించాలి. ఇతరులకు అమ్మడం, బదిలీ చేయడం చేయకూడదు. పుట్టపర్తి నియోజకవర్గంలో వేలాది ఎకరాలకు పైగా ఇలాంటి అసైన్డ్ భూములు ఉన్నాయి. వ్యవసాయం, ఇంటి స్థలాల కోసం పేదలకు గత ప్రభుత్వాలు వీటిని పంపిణీ చేశాయి. ఈ భూములను సాగు చేసుకొని పేదరికం నుంచి బయట పడాలన్నదే ప్రభుత్వాల లక్ష్యం. ఒకవేళ మొదటిసారి భూ బదలాయింపు జరిగితే తహసీల్దార్ ఆ భూమిని స్వాధీనం చేసుకొని సదరు వ్యక్తికే తిరిగి అప్పగించాలి. రెండోసారి కూడా భూమి బదలాయింపు జరిగితే ఆ భూమిని స్వాధీనం చేసుకొని మొదటి వ్యక్తికి ఇవ్వకుండా మరో నిరుపేదకు ఇవ్వాలి. అసైన్డ్ భూములు కొనుగోలు చేస్తే చెల్లకపోవడమే కాదు.. కొనడమూ నేరమని కూడా చట్టం చెబుతోంది. (జేసీ ఆరోగ్యం కాపాడుకో..) నిబంధనలకు విరుద్ధంగా.. రెండున్నర ఎకరాల తరి లేదా ఐదెకరాల మెట్టభూమి కంటే తక్కువ భూమి ఉండి, సంవత్సర ఆదాయం రూ.11వేల కన్నా తక్కువగా ఉన్నవారు మాత్రమే ప్రభుత్వ భూమిని పొందడానికి అర్హులు. ఇలా ఒక్కో కుటుంబానికి ఐదు ఎకరాల వరకు అసైన్డ్ భూమికి పట్టా పొందవచ్చు. ఈ నిబంధనలకు విరుద్ధంగా 39.52 ఎకరాల వరకు ప్రభుత్వ భూములకు పల్లపు రవీంద్ర, అతని సోదరుడు శంకర్, వారి కుటుంబ సభ్యులు పట్టాలు పొందారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎక్కడ పడితే అక్కడ ఇంటి పేర్లు మార్చి తమ పేరు మీదనే కాక భార్య పేరుపై కూడా పట్టాలు పొందారు. బుక్కపట్నం మండలం మారాల రెవెన్యూ పరిధిలో 19 ఎకరాలకు పైగా, ముదిగుబ్బ మండలం మంగలమడక రెవెన్యూ పరిధిలో మరో 19 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములను వీరు అప్పణంగా కాజేశారు. వీరిద్దరూ మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, అప్పటి ఎంపీ నిమ్మలకిష్టప్పకు సన్నిహితులు కావడంతో అధికారులు సైతం నోరు మెదపకుండా పట్టాలు రాసిచ్చేశారు. ►ఎకరాకు గరిష్టంగా రూ.25వేలు చొప్పున 39.52 ఎకరాలకు సుమారు రూ.10 లక్షల వరకు పావలా వడ్డీకే వివిధ బ్యాంక్‌ల ద్వారా రుణం. ►ఈ రెండేళ్లలో పంట పెట్టుబడి సాయంలో భాగంగా వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద లబ్ధి. ►కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వైఎస్సార్ రైతు భరోసా వర్తిస్తుంది. అయితే రవీంద్ర తన మాయాజాలంతో ఒక్కొక్కరికి రూ.13,500 చొప్పున కుటుంబంలోని నలుగురి పేరుతో ఈ రెండేళ్లలో రూ.1,08,000 స్వాహా చేశాడు. ప్రభుత్వాలను మోసగిస్తూ.. తన పేరు మీదనే కాక తన భార్య కృష్ణవేణి, సోదరుడు శంకర్, అతని భార్య జానకి పేరుతో దాదాపు 38.86 ఎకరాల భూమిని పల్లపు రవీంద్ర రాచమార్గంలోనే స్వాహా చేశాడనే విమర్శలు ఉన్నాయి. ఇతను పట్టాలు పొందిన అసైన్డ్ భూములు ఏవీ సాగుకు అనుకూలమైనవి కావు. గుట్టలు, రాళ్లతో కూడిన భూములకు పట్టాదారు పాసుపుస్తకాలు పొంది, వాటిని అడ్డుగా పెట్టి పంట రుణాలు, ఇన్పుట్ సబ్సిడీలు, ఇతర వ్యవసాయ సంక్షేమ ఫలాలను దోచేస్తూ వచ్చాడు. ఈ భూముల వివరాలను అడ్డగోలుగా వాడేస్తూ ఆదాయ పన్ను మినహాయింపు పొందడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు చిల్లు పెట్టాడు. ఇంత కాలం ప్రభుత్వాల కళ్లుగప్పుతూ వచ్చిన పల్లపు రవీంద్ర మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వ సొమ్ము కాజేసి.. ప్రభుత్వ సొమ్మును కాజేయడంలో పల్లపు రవీంద్రను మించిన వారు లేరని ఈ ప్రాంత రైతులు అంటున్నారు. పూర్వీకుల నుంచి పల్లపు రవీంద్ర కుటుంబసభ్యులకు 16 ఎకరాల మెట్ట భూమి సంక్రమించింది. ఈ విషయాన్ని దాచిపెట్టి తాను నిరుపేదనంటూ గత పన్నెండేళ్లలో రవీంద్ర, ఆయన సోదరుడు శంకర్, వీరి భార్య పేరుతో 39.52 ఎకరాల అసైన్డ్ భూమిని పొందారు. సాగుకు నోచుకోని ఈ భూములపై సబ్సిడీ రుణాలు, పంట రుణాలు, సబ్సిడీ విత్తనాలు, పంటల బీమా పరిహారాలను పొందుతుండటం గమనార్హం. -
వెంటాడుతున్న‘టీడీపీ’ పాపాలు
తెలుగుదేశం పార్టీ పాలనలో ప్రభుత్వ, చెరువు, కాలువ పోరంబోకు భూములు అన్యాక్రాంతమయ్యాయి. నాటి పాలకులు, అధికారులను నయానోభయానో బెదిరించి, భూములను దర్జాగా ఆక్రమించారు. వాటిని అమ్మి జేబులు నింపుకున్నారు. ఆనాటి టీడీపీ పాపాలు ఇప్పుడు అధికారులను వెంటాడుతున్నాయి. తాజాగా నాగలాపురంలో చోటుచేసుకున్న భూ ఆక్రమణ ఉదంతంలో రెవెన్యూ అధికారులపై చర్యలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సాక్షి, తిరుపతి: సత్యవేడు నియోజక వర్గ పరిధిలోని నాగలాపురం మండలం కడివేడు గ్రామం సర్వే నంబర్ 27లో 143.85 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిని చాకలతిప్ప కొండ పోరంబోకు. ఇందులో కోట్ల విలువ చేసే విలువచేసే 38.88 ఎకరాలను నాటి తహశీల్దార్ 11 మంది టీడీపీ నాయకులకు కట్టబెట్టారు. అది కూడా టీడీపీ నాయకుల ఒత్తిడి మేరకు ఇద్దరు తహశీల్దార్లు అప్పగించినట్లు తెలిసింది. నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ శ్రేణులకు భూములు కట్టబెట్టడంపై అప్పట్లో స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నాటి పాలకులు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం శూన్యం. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం అక్రమార్కులపై కొరడా ఝళిపిస్తోంది. నాగలాపురం మండలంలో భూ కేటాయింపులపై సంబంధిత అధికారులపై చర్యలకు ఆదేశాలు జారీ చేసింది. రెవెన్యూ శాఖలో కలకలం అక్రమార్కులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుండడంతో రెవెన్యూ శాఖలోని కొందరు అధికారుల్లో ఆందోళన మొదలైంది. శ్రీరంగరాజపురం మండలం చిన్నతయ్యూరులో టీడీపీ హయాంలో లేని భూమి ఉన్నట్లు రికార్డులు సృష్టించారు. గ్రామంలో సర్వే నంబర్ 285/2 చివరిది. అయితే నాడు టీడీపీ నాయకులు, రెవెన్యూ అధికారులు కొందరు కుమ్మక్కై సర్వే నంబర్ 286/1, 2, 3, 4, 5, 6, 287, 288, 293/4 సృష్టించి 29.33 ఎకరాల భూమి ఉన్నట్లు వెబ్‌ల్యాండ్‌లో చూపించారు. రెవెన్యూ రికార్డులు పెట్టి బ్యాంకుల్లో భారీగా రుణాలు పొందారు. ఇది అప్పట్లో వెలుగులోకి వచ్చినా టీడీపీ అధికారంలో ఉండటంతో అక్రమాలను తొక్కిపెట్టారు. అలాగే, తిరుపతి అర్బన్ పరిధిలో అక్కారాంపల్లె సర్వే నంబర్ 115/2బిలో 201 అంకణాలను మూడు డాక్యుమెంట్లతో భూమిని కొనుగోలు చేసినట్లు రిజిస్టర్ మార్టిగేజ్లో చూపించారు. అయితే ఈ సర్వే నంబర్ నిషేధిత జాబితాలో ఉండటం గమనార్హం! అందులో భవన నిర్మాణానికి అనుమతి లేకపోవడంతో మున్సిపల్ కమిషనర్ పేరిట రిజిస్టర్ చేసిన మార్టిగేజ్ దస్తావేజులో సర్వే నంబర్ మార్పులు చేశారు. సర్వే నంబర్ 115/2సీలో ఉన్నట్లు తిరుపతి సబ్ రిజిస్టార్ కార్యాలయంలో రిజిస్టర్ చేయించారు. అలా చేయడం వలన భవన నిర్మాణానికి అనుమతి ఇచ్చారు. ఇలా తిరుపతి పరిసర ప్రాంతాల్లో కొందరు రెవెన్యూ, రిజిస్టార్ కార్యాలయ అధికారులు కుమ్మక్కై లేని సర్వే నంబర్లను సృష్టించి...ప్రభుత్వ, చెరువు, కాలువ పోరంబోకు భూములను ఆక్రమించుకున్నారు. ఇంకా 22–ఏలో ఉన్న భూములను తొలగించి రిజిస్ట్రేషన్ చేసుకున్న ఉదంతాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందినట్లు తెలిసింది. అదే విధంగా జిల్లా వ్యాప్తంగా జరిగిన భూ అక్రమాలపైనా ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
అమరావతి భూ అక్రమాల కేసులో ముగిసిన పోలీస్ కస్టడీ
సాక్షి, గుంటూరు: రాజధాని అమరావతి భూ అక్రమాల కేసులో నిందితుల రెండు రోజుల పోలీస్ కస్టడీ శనివారంతో ముగిసింది. అమరావతి గ్రామాల పరిధిలో భూముల రికార్డులను తారుమారు చేసిన కేసులో గుంటూరు జిల్లా తుళ్లూరు మండల మాజీ తహసీల్దార్ అన్నే సుధీర్ బాబు, రియల్ ఎస్టేట్ వ్యాపారి, విజయవాడ ఎం అండ్ ఎం వస్త్రదుకాణ యజమాని గుమ్మడి సురేష్లను అరెస్టు చేసిన పోలీసులు రెండు రోజులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. చివరిరోజు శనివారం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ విచారణ కొనసాగింది. రెండు రోజుల కస్టడీలో ఏడు గంటల పాటు నిందితులను పోలీసులు విచారించారు. ఉదయం 10 గంటలకు జిల్లా జైలుకు చేరుకున్న తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాస రెడ్డి న్యాయవాది సమక్షంలో సురేష్‌ను విచారించారు. ఆయన ఏ విధంగా అసైన్డ్ భూమిని కొనుగోలు చేశాడు..? అప్పటి తహసీల్దార్ అన్నే సుధీర్ బాబు సహాయంతో అసైన్డ్ భూమిని పట్టా భూమిగా ఏ విధంగా వెబ్ ల్యాండ్‌లోకి ఎక్కించారు..? ఈ మొత్తం వ్యవహారం వెనుక రాజకీయ నాయకుల ప్రమేయం ఏమైనా ఉందా? అనే కోణంలో పోలీసులు విచారించినట్టు తెలుస్తోంది. పరస్పర ఒప్పందంతోనే.. సుధీర్ బాబు, సురేష్‌లు ఇద్దరూ పరస్పర ఒప్పందంతోనే అక్రమాలకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ ఒప్పందంలో భాగంగానే సురేష్ భూమిని కొనుగోలు చేసి సీఆర్డీఏకు రికార్డులు సమర్పించే రెండు నెలలకాలం భూమిని పట్టా భూమిగా చూపారని, అనంతరం అసైన్డ్ భూమిగా వెబ్ ల్యాండ్‌లో మార్పు చేసినట్టు సమాచారం. -
అమరావతిలో అక్రమాల కథ
-
రాజధాని భూ కుంభకోణం.. సిట్ దూకుడు
సాక్షి, విజయవాడ: రాజధాని భూముల అక్రమాల దర్యాప్తులో సిట్ దూకుడు పెంచింది. టీడీపీ హయాంలో ల్యాండ్ పూలింగ్ లో ఇంఛార్జ్‌లుగా పని చేసిన డిప్యూటీ కలెక్టర్లపై విచారణ చేపట్టింది. ఇప్పటికే డిప్యూటీ కలెక్టర్ మాధురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు. అవసరమయితే మరికొంత మందిని అదుపులోకి తీసుకుని సిట్ విచారించే అవకాశముందని సమాచారం. భూములు ఇచ్చేందుకు రైతులను ఒప్పించిన వారికి నజరానాగా అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసినట్టు సిట్ గుర్తించింది. (డిప్యూటీ కలెక్టర్ మాధురి అరెస్ట్) ప్రభుత్వ భూములు, కుంటలను రిజిస్ట్రేషన్లు చేసినట్టు సిట్ బృందం గుర్తించింది. మిగులు భూములు, అటవీ భూములు రిజిస్ట్రేషన్ చేసినట్లు ఆధారాలు సేకరించారు. 150 ఎకరాల భూ దందా జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. డిప్యూటీ కలెక్టర్‌తో పాటు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది నిర్వాకాలపై సిట్ అధికారులు దృష్టి పెట్టారు. గ్రామ కంఠం భూములను కూడా టీడీపీ నేతలు వదలలేదని దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. టీడీపీ నేతల అక్రమాలకు కొమ్ము కాసిన అధికారుల పాత్రపై సిట్ విచారణ చేపట్టింది. దీంతో అవినీతి అధికారుల గుండెల్లో దడ మొదలైంది. -
ప్రసాద్ దెబ్బకు బ్యాంకులు బోల్తా
- ఆయన నుంచి భూములు కొని బ్యాంకులకు తాకట్టు - ఏకంగా రూ.550 కోట్ల రుణం పొందిన ఓ వ్యాపారి సాక్షి, హైదరాబాద్: గోల్డ్‌స్టోన్ ప్రసాద్ చేసిన భూమాయకు బ్యాంకులు కూడా బోల్తా పడ్డాయి. హైదర్‌నగర్ సర్వే నంబర్ 172లోని వివాదాస్పద భూమికి సైతం కోట్లాది రూపాయల రుణం ఇచ్చాయి. నిజాం వారసులు, పైగా, సైరస్ కుటుంబీకులకు సంబంధించిన భూ వివాదం కేసులో ఫైనల్ డిక్రీ రాకున్నా.. ఆ భూములను గోల్డ్‌స్టోన్ ప్రసాద్ అనుయాయులకు కట్టబెట్టడమే కాకుండా, ఇతరులకు కూడా దర్జాగా వాటిని విక్రయించారు. గోల్డ్‌స్టోన్ ప్రసాద్ చెబుతున్న జీపీఏ అసలు ఉందో లేదో పరిశీలించకుండానే కొందరు సబ్ రిజి స్ట్రార్లు ఎడాపెడా రిజిస్ట్రేషన్లు చేస్తుండడంతో భూ అక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. మియాపూర్, ఇబ్రహీంపట్నం, శంషాబాద్, హైదర్‌నగర్‌లలో వేలాది ఎకరాల ప్రభుత్వ, అటవీ భూములు ప్రైవేటు పరమవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా హైదర్‌నగర్‌లోని సర్వే నంబరు 172లోని 196.20 ఎకరాలను దశలవారీగా ఇతరులకు రిజిస్ట్రేషన్లు చేస్తున్న వైనాన్ని ‘సాక్షి’ఆదివారం వెలుగులోకి తీసుకు వచ్చింది. ఈ కుంభకోణంలో మరిన్ని కొత్త కోణాలు బయటపడ్డాయి. ఇదీ రుణ మాయాజాలం.. హైదర్‌నగర్ సర్వే నంబరు 172లోని 48 ఎకరాలను గోల్డ్‌స్టోన్ ప్రసాద్ నుంచి నగరానికి చెందిన ఓ జ్యూయలరీ వ్యాపారి కొనుగోలు చేశాడు. ఈ భూమి మొత్తాన్ని తనకు చెందిన 13 సూట్ కేసు కంపెనీల పేరిట రిజిస్ట్రేషన్ చేయించి, ఆ భూములపై పంజాబ్‌కు చెందిన ఓ జాతీయ బ్యాంకు నుంచి రూ.550 కోట్లు రుణంగా పొందాడు. ఆ భూములను బ్యాంకు పేరిట మార్ట్గేజ్ రిజిస్ట్రేషన్ చేయించాడు. దానిలో పేర్కొన్న వివరాల ప్రకారం గోల్డ్‌స్టోన్ ప్రసాద్‌కు ముంబైకి చెందిన సైరస్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ లిమిటెడ్ నుంచి జీపీఏ ఉందని, దాని ద్వారా సంక్రమించిన హక్కుల మేరకు విక్రయించినట్లు పేర్కొన్నారు. గోల్డ్‌స్టోన్ ప్రసాద్ పేర్కొన్నట్టు ఆ జీపీఏ నకలు పత్రాన్ని రిజిస్ట్రేషన్ సమయంలో సమర్పించలేదు. జీపీఏ రిజిస్ట్రేషన్ నంబర్ గానీ, జీపీఏ రిజిస్ట్రేషన్ ఎక్కడ జరిగిందన్న వివరాలను కూడా దస్తావేజులో పేర్కొనలేదు. జీపీఏకు సంబంధించిన కనీస వివరాలనూ పరిశీలించకుండా కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ మార్ట్గేజ్ రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేయడం, ఆ మార్ట్‌గేజ్‌తో జ్యూయలరీ వ్యాపారి బ్యాంకుల నుంచి రుణంగా తీసుకోవడం జరిగిపోయాయి. భూముల కొన్న జ్యూయలరీ వ్యాపారీ గోల్డ్‌స్టోన్ ప్రసాద్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తేనని, మరికొన్ని భూ కుంభకోణాల్లోనూ అతని పాత్ర ఉందని సమాచారం. -
విచారణ వలకు.. తిమింగలాలు చిక్కేనా?
► భూ అక్రమాలపై విచారణకు అధికారుల కసరత్తు ► అన్ని వివరాలతో రాష్ట్ర అధికారులకు సమగ్ర నివేదిక ► దాన్ని పరిశీలించాక.. వారంలో వేదిక నిర్ణయం ► స్కాముల సూత్రధారులందరూ టీడీపీ నేతలే ► అందుకే విచారణపై సర్వత్రా అనుమానాలు విశాఖ సిటీ: జిల్లాలో జరిగిన భూ అక్రమాలపై ఈనెల 15న నిర్వహించనున్న బహిరంగ విచారణకు జిల్లా యంత్రంగా కసరత్తు చేస్తోంది. ఇందుకోసం అవసరమైన నివేదికను గురువారం సాయంత్రం రాష్ట్ర రెవెన్యూ, భూపరిపాలన ప్రధాన కమిషనరేట్‌కు పంపింది. ఈ నివేదికను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం రాష్ట్ర స్థాయి అధికారులు బహిరంగ విచారణ వేదిక ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై జిల్లా అధికారులకు వారం రోజుల్లో ఆదేశాలు జారీచేయనున్నారు. విమర్శలు వెల్లువెత్తడంతోనే.. రికార్డులు మార్చేసి.. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులతో కుమ్మక్కై అధికార పార్టీ నేతలు సాగించిన 6 వేలకుపైగా ఎకరాల భూ దందాపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో.. ఈ విచారణకు సిద్ధమైన విషయం తెలిసిందే. జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ స్వయంగా ఈ దందా వ్యవహారం బట్టబయలు చేయడం సంచలనం కలిగించింది. ఈ నేపథ్యంలో బహిరంగ విచారణ కోసం ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి సహా రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనరేట్ నుంచి సీనియర్ అధికారుల బృందం, సర్వే బృందం హాజరుకానుంది. ఇందుకు అవసరమైన నివేదికలు తయారు చేయడంలో రెండు రోజులుగా జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది. గురువారం సాయంత్రం నివేదికలను కమిషనరేట్‌కు పంపారు. ⇒ ఏఏ మండలాల్లో రికార్డులు గల్లంతయ్యాయి, దాని కారణాలను ఈ నివేదికలో పొందుపరిచారు. ⇒పాత అసైన్మెంట్ భూములు, వాటిలో ఏవైనా నిర్మాణాలు జరిగి ఉంటే.. వాటికి సంబంధించిన పత్రాలు, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ వివరాలను పేర్కొన్నారు. ⇒గత ఆరు నెలలుగా ఈ తరహా కేసులు ఎన్ని వచ్చాయి. వాటిని ఎలా పరిష్కరించారు. జిల్లాలోని 43 మండలాల్లో ఎక్కడ ఎక్కువగా భూములకు సంబంధించిన ఫిర్యాదులు నమోదయ్యాయనే అంశాలను రెవెన్యూ శాఖకు పంపిన నివేదికలో పేర్కొన్నారు. వారం రోజుల్లో వేదిక ప్రకటన జిల్లా యంత్రాంగం పంపిన ఈ నివేదికలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత.. బహిరంగ విచారణ ఎక్కడ నిర్వహించాలనే అంశంపై సంబం«ధిత శాఖ అధికారులు ప్రకటిస్తారు. రెండు వారాల సమయం ఉన్న నేపథ్యంలో అందరికీ అందుబాటులో ఉండేలా వేదికను గుర్తించాలని ఉన్నతాధికారులు జిల్లా అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో ప్రజావాణి నిర్వహించే హాల్లో విచారణ చేపట్టాలనే ఆలోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే పెద్ద సంఖ్యలో ఫిర్యాదుదారులున్న నేపథ్యంలో ఈ సమావేశ మందిరం సరిపోదన్న వాదన కూడా ఉంది. రాష్ట్ర అధికారుల సూచన మేరకు విచారణ వేదికను ఎంపిక చేస్తామని వారి ఆదేశాల మేరకు సమయం, ప్రాంతాన్ని వెల్లడిస్తామని జాయింట్ కలెక్టర్ సృజన తెలిపారు. -
మీకు సగం... మాకు సగం
► కాసుల కోసం రైతులతో బేరసారాలు ► దగదర్తిలో టీడీపీ నేతల రాజీ చర్చలు ► ఆక్రమణకు గురైన సైనికోద్యోగి భూమి రిజిస్ట్రేషన్ రద్దు ► కౌరుగుంట, దామవరంలో వేగవంతమైన భూసేకరణ సాక్షి టాస్క్‌ఫోర్స్, నెల్లూరు: దగదర్తి మండలంలో భూవ్యవహారం కొత్త మలుపు తిరుగుతోంది. భూ అక్రమాల వ్యవహారాన్ని సాక్షి వరుస కథనాల ద్వారా వెలుగులోకి తీసుకురావటంతో అక్రమార్కులు వెనక్కుతగ్గారు. అదేవిధంగా అక్రమాలకు కేంద్రంగా మారిన కావలి ఆర్డీఓ కార్యాలయంపైనా ఏసీబీ అధికారులు నిఘా పెట్టడంతో నిధుల స్వాహాకు బ్రేక్‌పడింది. అయితే విమానాశ్రయం కోసం నిధులు పెద్ద మొత్తంలో మంజూరు అవుతుండటంతో అందులో నుంచి కొంతైనా జేబుల్లో వేసుకునేందుకు అక్రమార్కులు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అందులోభాగంగా భూములు ఉన్న రైతుల వద్దకెళ్లి రాజీ చర్చలు జరుపుతున్నారు. ‘మీ భూ మికి సంబంధించి పరిహారం వచ్చేలా చర్యలు తీసుకుం టాం. అయితే అందుకు కొం త ఖర్చవుతుంది. వచ్చే పరి హారంలో మీకు సగం.. పని పూర్తిచేసినందుకు మేము సగం తీసుకుంటాం’ అంటూ రైతులపై ఒత్తిడి తెస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. దగదర్తి మండల పరిధిలో విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అందు కోసం 1399 ఎకరాల భూమి అవసరం ప్రభుత్వం చెప్పింది కూడా. అందులో భాగంగా విమానాశ్ర యం కోసం భూములను సేకరించమని ప్రభుత్వం జిల్లా అధికార యంత్రాగానికి ఆదేశాలు జారీ చేసింది. రైతుల ఆధీనంలో ఉన్న భూములకు పరిహారంగా రూ.10 లక్షలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో స్థానిక టీడీపీ నాయకులు కొందరు నిధులను కొల్లగొట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగా రైతుల పేరున ఉన్న భూములను వేరొకరి విక్రయించినట్లు రికార్డులు సృష్టించారు. ఈ అక్రమాలను సాక్షి వరుస కథనాలతో బయటపెట్టిన విషయం తెలిసిందే. స్పందించిన కలెక్టర్ దగదర్తి భూముల వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. అందులోభాగంగా కౌరుగుంట సర్వేనంబర్ 283/2లోని మాజీ సైనికోద్యోగికి చెందిన భూమి వేరొకరిపై చేసిన అక్రమ రిజిస్ట్రేషన్‌ను రద్దుచేశారు. అదేవిధంగా ఏపీఐఐసీ పరిశ్రమల ఏర్పాటు కోసం సేకరిస్తున్న భూముల్లోనూ అక్రమాలు జరిగాయి. అందులో సుమలత పేరున జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ కూడా రద్దుచేసినట్లు తెలిసింది. రైతులతో రాజీ చర్చలు : భూ అక్రమాలపై అధికారయంత్రాంగం, ఏసీబీ అధికారులు దృష్టిపెట్టడంతోపాటు... దగదర్తిలో జరిగిన భూ అక్రమాలపై సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించారు. ఈ విషయంపై మంత్రి కూడా స్పందించి విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. జిల్లా అధికారులు పూర్తిస్థాయి విచారణ చేపట్టడంతో పాటు భూ సేకరణను కూడా వేగవంతం చేశారు. ఈనెల 10లోపు మొదటి విడత సేకరణ పూర్తిచేయాలని నిర్ణయించారు. భూములు ఉన్నవారికే పరిహారం చెల్లిస్తామని అధికారులు స్పష్టం చేశారు. దీంతో అక్రమార్కులు చేసేది లేక రైతులతో రాజీ ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు. ‘మీకు సగం.. మాకు సగం’ అంటూ రైతుల వద్దకెళ్తున్నారు. తమ మాటను కాదంటే ప్రభుత్వం ఇచ్చే డబ్బులు రావని రైతులను బెదిరిస్తూ లొంగదీసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కొంత మంది భయంతో ఒప్పుకుంటే.. మరి కొందరు అడ్డు తగులుతుండటం గమనార్హం. -
'సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి'
వైఎస్ఆర్ విద్యార్థి విభాగం డిమాండ్ అనంతపురం ఎడ్యుకేషన్ : రాజధాని పేరుతో జరిగిన భూ అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వైఎస్ఆర్ విద్యార్థి విభాగం డిమాండ్ చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను ఆ శాఖ నాయకులు శుక్రవారం దహనం చేశారు. ఈ సందర్భంగా శాఖ జిల్లా అధ్యక్షుడు బండి పరుశురాం, రాష్ట్ర కార్యదర్శి నరేంద్రరెడ్డి, యువజన విభాగం నగర అధ్యక్షుడు మారుతినాయుడు మాట్లాడుతూ... మంత్రులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు పేదల నోట్లో మట్టి కొట్టి భూములు స్వాహా చేశారన్నారు. బహుళ అంతస్తులను నిర్మిస్తామంటూ బూటకపు మాటలు చెప్పి ఆ ప్రాంత రైతాంగాన్ని నిలువునా ముంచారని ఆవేదన వ్యక్తం చేశారు. మోసపోయిన రైతులకు తిరిగి భూములు ఇప్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర కార్యదర్శి గౌస్‌బేగ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్‌మోహన్, సేవాదల్ జిల్లా అధ్యక్షుడు మిద్దె భాస్కర్‌రెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శులు బాబాసలాం, సుధీర్‌రెడ్డి, ఈశ్వర్, లోకేష్‌శెట్టి, కార్యదర్శులు గోపి, సునీల్‌దత్తరెడ్డి, నగర ప్రధానకార్యదర్శి సాకే నవీన్ తదితరులు పాల్గొన్నారు.