'సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి'
వైఎస్‌ఆర్ విద్యార్థి విభాగం డిమాండ్
అనంతపురం ఎడ్యుకేషన్ : రాజధాని పేరుతో జరిగిన భూ అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వైఎస్‌ఆర్ విద్యార్థి విభాగం డిమాండ్ చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను ఆ శాఖ నాయకులు శుక్రవారం దహనం చేశారు. ఈ సందర్భంగా శాఖ జిల్లా అధ్యక్షుడు బండి పరుశురాం, రాష్ట్ర కార్యదర్శి నరేంద్రరెడ్డి, యువజన విభాగం నగర అధ్యక్షుడు మారుతినాయుడు మాట్లాడుతూ... మంత్రులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు పేదల నోట్లో మట్టి కొట్టి భూములు స్వాహా చేశారన్నారు.
బహుళ అంతస్తులను నిర్మిస్తామంటూ బూటకపు మాటలు చెప్పి ఆ ప్రాంత రైతాంగాన్ని నిలువునా ముంచారని ఆవేదన వ్యక్తం చేశారు. మోసపోయిన రైతులకు తిరిగి భూములు ఇప్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర కార్యదర్శి గౌస్‌బేగ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్‌మోహన్, సేవాదల్ జిల్లా అధ్యక్షుడు మిద్దె భాస్కర్‌రెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శులు బాబాసలాం, సుధీర్‌రెడ్డి, ఈశ్వర్, లోకేష్‌శెట్టి, కార్యదర్శులు గోపి, సునీల్‌దత్తరెడ్డి, నగర ప్రధానకార్యదర్శి సాకే నవీన్ తదితరులు పాల్గొన్నారు.