సాక్షి, బెంగళూర్ : కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బస చేసిన ఈగల్టన్ రిసార్ట్స్‌లో సహచర ఎమ్మెల్యే ఆనంద్ సింగ్‌పై దాడి చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జేఎన్ గణేష్‌ను పోలీసులు అరెస్ట్ చేయవచ్చని భావిస్తున్నారు. దాడి ఘటనపై ప్రశ్నించేందుకు గణేష్‌ను బుధవారం విచారణకు హాజరు కావాల్సిందిగా కోరిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.
కాగా, గణేష్‌పై సోమవారం ఆనంద్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు గణేష్‌ను అదేరోజు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది. ఇక ఆనంద్ సింగ్‌ను ఆస్పత్రికి తరలించడంతో ఆయన కుటుంబ సభ్యులకు గణేష్ క్షమాపణలు చెప్పారు. తాను బీజేపీతో టచ్‌లో ఉన్నట్టు పార్టీ నేతలకు సమాచారం ఇచ్చాడనే ఆగ్రహంతో ఆనంద్ సింగ్‌పై గణేష్ దాడికి తెగబడినట్టు చెబుతున్నారు. తమ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురిచేస్తుందనే ఆందోళనతో కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను శుక్రవారం సాయంత్రం బెంగళూర్‌లోని ఈగల్టన్ రిసార్ట్స్‌కు తరలించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment