
న్యూఢిల్లీ: నీలగిరిలోని ఏనుగుల కారిడార్ పరిధిలో అనుమతులు లేకుండా నడుస్తున్న హోటళ్లు, రిసార్టులపై సుప్రీంకోర్టు కొరడా ఝళిపించింది. ఆ ప్రాంతంలోని 27 రిసార్టులు, హోటళ్లను మూసివేయాలని సుప్రీంకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. నీలగిరి జిల్లాలోని ఏనుగుల కారిడార్‌లో చట్ట విరుద్ధంగా రిసార్టులు, హోటళ్లను నడుపుతున్నారంటూ దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘ఏనుగులు సంచరించే ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని చట్టం ఉంది. అయినా రిసార్టులు, హోటళ్ల నిర్మాణాలను ఎలా చేపడతారు?’ అంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ వర్షాకాలంలో సుమారు 18వేల ఏనుగులు నీలగిరి కారిడార్‌లోకి ప్రవేశించాయని పిటిషనర్ తెలపగా.. ఆ ప్రాంతంలో ఉన్న రిసార్టులు, హోటళ్లకు విద్యుత్ సరఫరా నిలిపివేయాలని ధర్మాసనం అధికారులను ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment