hotels and restaurents
-
Lok sabha elections 2024: ఓటేస్తే డిస్కౌంట్... ఫ్రీ హెయిర్ కట్!
ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం! మన రాత మారాలన్నా, నేతల తలరాతలు మార్చాలన్నా మన చేతుల్లోనే ఉంది. అందుకే ప్రతి ఓటరూ ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ ఎన్నికల సంఘం కోడై కూస్తోంది. అయినా కొందరిలో మాత్రం చలనం శూన్యం. అందుకే, ఈ ఓట్ల జాతరలో దుమ్మురేపేందుకు మేము సైతం అంటున్నారు కొందరు ఔత్సాహిక వ్యాపారులు. అటు ఓటింగ్ శాతం, ఇటు తమ వ్యాపారం పెరిగేలా బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ‘ఓటేసి వేలిపై సిరా చుక్క చూపండి, డిస్కౌంట్ పొందండి’ అంటూ ఓటర్లను ఊరిస్తున్నారు. ఉత్తరాఖండ్ హోటల్, రెస్టారెంట్ అసోసియేషన్ తాజాగా ఆఫర్ ప్రకటించింది. రాష్ట్రంలో 19న శుక్రవారం ఒకే విడతలో లోక్‌సభ ఎన్నికలు పూర్తవుతాయి. పోలింగ్ ముగిసిన తర్వాత నుంచి 20వ తేదీ సాయంత్రం దాకా తమ హోటళ్లు, రెస్టారెంట్లలో ఏం తిన్నా బిల్లులో 20 శాతం డిస్కౌంట్ ఇస్తామని తెలిపింది. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని, వేలిపై సిరా గుర్తు చూపి డిస్కౌంట్ పొందచ్చొని అసోసియేషన్ ప్రెసిడెంట్ సందీప్ సాహ్ని చెబుతున్నారు. శుక్రవారమే రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ జరగనున్న తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో కూడా ఓటేసిన వారికి పోలింగ్ రోజు హోటళ్లు, ఫుడ్ స్టాల్స్, బేకరీలు.. ఇలా ఎక్కడ ఏం తిన్నా 5 శాతం తగ్గింపు లభిస్తుంది. ఓటర్లను ప్రోత్సహించేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ ఎస్.అరుణ్ రాజ్ చెప్పారు. ఇక కాంచీపురం కలెక్టర్ కలైసెల్వి మోహన్ వాటర్ బాటిళ్లపై పోలింగ్ సంబంధ పోస్టర్లను అతికించడం ద్వారా ఓటర్లలో చైతన్యం నింపుతున్నారు. ఏప్రిల్ 26న రెండో విడతలో పోలింగ్ జరిగే మహారాష్ట్రలోని అకోలాకు చెందిన అనంత కౌల్కర్ అదిరిపోయే ఆఫరిచ్చాడు. ఓటేసి సిరా గుర్తు చూపిన వారికి తన సెలూన్లో ఫ్రీగా హెయిర్ కట్ చేస్తాననంటూ షాపు ముందు బోర్డు పెట్టేశాడు. మే 25న ఆరో విడతలో పోలింగ్ జరగనున్న జంషెడ్‌పూర్‌లో కూడా ఓటేసిన వారికి హోటళ్లు, రెస్టారెంట్లు, మాల్స్, కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు డిస్కౌంట్ ఇచ్చేలా ఈసీ అధికారులు ఒప్పించారు. గత నవంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బైక్ ట్యాక్సీ సంస్థ ర్యాపిడో 2,600 పై చిలుకు పోలింగ్ బూత్‌లకు ఫ్రీ రైడ్స్ ఆఫర్ చేయడం తెలిసిందే. ఈసారి సార్వత్రిక ఎన్నికలు ఏడు విడతల్లో జూన్ 1 దాకా సుదీర్ఘంగా జరగనున్న నేపథ్యంలో ఆఫర్ల జోరు కూడా పెరిగేలా కనిపిస్తోంది! -
పాచిపోయిన మటన్, చికెన్ వంటకాలు
కర్ణాటక: ఆహారభద్రతా శాఖాధికార్లు సోమవారం హోసూరు, సూళగిరి ప్రాంతాల్లో నిర్వహిస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లు బేకరీలలో తనిఖీలు నిర్వహించారు. హోసూరు ఆహార భద్రతా శాఖాధికారి ముత్తుమారియప్పన్ నేతృత్వంలో అధికారులు రాజశేఖర్, ముత్తుకుమార్‌ల బృందం పట్టణంలోని పలు హోటళ్లలో సోదాలు చేయగా, ఎప్పుడో వండి, పాచిపోయిన ఆరు కిలోల తందూరి చికెన్, 18 కిలోల మటన్, చికెన్ బిర్యాని, మటన్ బిర్యానీలను ఫ్రిజ్‌లలో నిల్వ చేసినట్లు గుర్తించారు, వాటిని స్వాధీనపరుచుకొని బయటపడేశారు. కొన్ని హోటళ్లలో నమూనాలను సేకరించి పరిశీలనకు పంపారు. బేకరీ దుకాణాల్లో కాలం చెల్లిపోయిన తినుబండారాలను స్వాధీనపరుచుకొన్నారు. కల్తీ టీపొడి విక్రయిస్తున్న నలుగురికి తలా రూ. 2000 జరిమానా విధించారు. నాసిరకం పదార్థాలను విక్రయిస్తే సీల్వేస్తామని హెచ్చరిక నోటీసులు జారీ చేశారు. -
హోటళ్లు, రెస్టారెంట్లలో సర్వీస్ చార్జీలపై నిషేధం
న్యూఢిల్లీ: హోటళ్లు, రెస్టారెంట్లలో సర్వీస్ చార్జీల వడ్డింపుపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఇకపై సర్వీస్ చార్జీలను విధించడాన్ని, బిల్లుల్లో ఆటోమేటిక్‌గా చేర్చడాన్ని నిషేధిస్తూ కేంద్రీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ ప్రాధికార సంస్థ (సీసీపీఏ) ఆదేశాలు జారీ చేసింది. వీటిని ఉల్లంఘించే హోటళ్లు, రెస్టారెంట్లపై కస్టమర్లు ఫిర్యాదు చేయొచ్చని పేర్కొంది. సర్వీస్ చార్జీల విషయంలో వినియోగదారుల హక్కుల ఉల్లంఘన, అనుచిత వ్యాపార విధానాలను అరికట్టేందుకు సీసీపీఏ సోమవారం ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది. ‘సర్వీస్ చార్జీ అనేది స్వచ్ఛందమేనని కస్టమర్లకు చెప్పకుండా.. హోటళ్లు, రెస్టారెంట్లు దాన్ని బిల్లులో ఆటోమేటిక్‌గా చేరుస్తున్నాయని ఫిర్యాదులు మా దృష్టికొచ్చాయి. మెనూ లో చూపే ఆహార ఉత్పత్తుల ధరలు, వాటికి వర్తించే పన్నులకు అదనంగా ఏదో ఒక ఫీజు లేదా చార్జీ ముసుగులో అవి దీన్ని విధిస్తున్నాయి. ఏ హోటలూ లేదా రెస్టారెంటూ బిల్లులో సర్వీస్ చార్జీని ఆటోమేటిక్‌గా చేర్చకూడదు. దాన్ని చెల్లించాలంటూ కస్టమరును బలవంతపెట్టకూడదు. ఇది స్వచ్ఛందమైనది, ఐచ్ఛికమైనది మాత్రమేనని వినియోగదారుకు స్పష్టంగా తెలియజేయాలి’ అని పేర్కొంది. అలాగే, సర్వీస్ చార్జీ వసూలు ప్రాతిపదికన లోపలికి ప్రవేశం విషయంలో గానీ సేవలు అందించడంలో గానీ ఎటువంటి ఆంక్షలు ఉండకూడదని పేర్కొంది. ఆహారం బిల్లులో సర్వీస్ చార్జీని చేర్చడం, ఆ తర్వాత మొత్తంపై జీఎస్టీని వసూలు చేయడం వంటివి సరికాదని సీసీపీఏ స్పష్టం చేసింది. మరోవైపు ప్రభుత్వ మార్గదర్శకాలతో పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని హోటల్, రెస్టారెంట్ అసోసియేషన్స సమాఖ్య ఎఫ్హెచ్ఆర్ఏఐ వైస్ ప్రెసిడెంట్ గురుబక్షీష్ సింగ్ కొహ్లి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఆదేశాలను పూర్తిగా అధ్యయనం చేస్తామని, తమ రంగాన్ని మాత్రమే వేరుగా చేసి చూడవద్దని ప్రభుత్వాన్ని కోరతామని ఆయన పేర్కొన్నారు. సాధారణంగా హోటళ్లు, రెస్టారెంట్లు ఫుడ్ బిల్లు మొత్తంపై 10 శాతం సర్వీస్ చార్జీని వసూలు చేస్తున్న నేపథ్యంలో సీసీపీఏ మార్గదర్శకాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఫిర్యాదులు ఇలా.. ఒకవేళ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఏదైనా హోటల్ లేదా రెస్టారెంటు సర్వీస్ చార్జి విధించిన పక్షంలో, బిల్లు మొత్తం నుంచి దాన్ని తొలగించాలంటూ సదరు సంస్థను కస్టమరు కోరవచ్చు. అయినప్పటికీ ఫలితం లేకపోతే నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్ (ఎన్సీహెచ్) నంబరు 1915కి లేదా ఎన్సీహెచ్ మొబైల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. సత్వర పరిష్కారం కోసం ఎలక్ట్రానిక్ మాధ్యమంలో ఈ–దాఖిల్ పోర్టల్ ద్వారా వినియోగదారుల కమిషన్‌కి కూడా ఫిర్యాదు చేయొచ్చు. అలాగే విచారణ, చర్యల కోసం సంబంధిత జిల్లా కలెక్టరును కూడా ఆశ్రయించవచ్చు. సీసీపీఏకి ఈ–మెయిల్ ద్వారా కూడా ఫిర్యాదు పంపవచ్చు. సీసీపీఏ మార్గదర్శకాల్లో మరిన్ని వివరాలు.. ► రెస్టారెంట్లు లేదా హోటళ్లు ఆహారం, పానీయాలను అందించడంలో సర్వీసు కూడా భాగంగానే ఉంటుంది. దానికి అనుగుణంగానే ఆయా ఆహార, పానీయాల ధరలు ఉంటాయి. వాటిని ఏ రేటుకు అందించాలనేది నిర్ణయించుకోవడంలో హోటళ్లు లేదా రెస్టారెంట్లపై ఎటువంటి ఆంక్షలు లేవు. ► వినియోగదారుకు, హోటల్ మేనేజ్మెంట్కు మధ్య కుదిరిన కాంట్రాక్టు ప్రకారం కనీస స్థాయికి మించి సర్వీసులను పొందిన పక్షంలో కస్టమరు తన విచక్షణ మేరకు టిప్ ఇవ్వొచ్చు. ఇది కస్టమరుకు, హోటల్ సిబ్బందికి మధ్య ప్రత్యేకమైన వేరే లావాదేవీ అవుతుంది. తను భుజించిన తర్వాత మాత్రమే ఆహార నాణ్యత, సర్వీసుపై కస్టమరు ఒక అవగాహనకు రాగలరు. ఆ తర్వాత టిప్ ఇవ్వొచ్చా, లేదా.. ఒకవేళ ఇస్తే ఎంత ఇవ్వాలి అన్నది నిర్ణయించుకోగలుగుతారు. అంతే తప్ప రెస్టారెంట్లో ప్రవేశించినంత మాత్రాన లేదా ఆర్డరు చేసినంత మాత్రాన కస్టమరు టిప్‌పై నిర్ణయం తీసుకోలేరు. కాబట్టి కట్టాలా లేదా అనేది నిర్ణయించుకోవడంలో కస్టమరుకు ఎటువంటి అవకాశమూ ఇవ్వకుండా బిల్లులో ఏకపక్షంగా సర్వీస్ చార్జీని విధించడానికి వీల్లేదు. -
AP: అర్ధరాత్రి వరకు హోటళ్లు, రెస్టారెంట్లకు అనుమతి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని హోటళ్లు, రెస్టారెంట్ల వ్యాపార వేళలను పొడిగిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. బార్ అండ్ రెస్టారెంట్లు మినహా ఇతర ఆహార దుకాణాలు ఉదయం ఐదు గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు కార్యకలాపాలు కొనసాగించుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి(ఎఫ్ఏసీ) జి.అనంతరాము మార్గదర్శకాలు విడుదల చేశారు. కోవిడ్ నేపథ్యంలో జారీ చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనల గడువు మార్చితో ముగియడంతో కొత్త ఉత్తర్వులు వెంటనే అమలులోకి వస్తాయని స్పష్టం చేశారు. ఏపీ హోటల్ అసోసియేషన్ అభ్యర్థన మేరకు వ్యాపార వేళలను పెంచినట్టు తెలిపారు. కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ వ్యాపారులు, వినియోగదారులు విధిగా మాస్క్ ధరించడంతో పాటు శానిటైజర్ వాడాలని సూచించారు. చదవండి: (ఎలాంటి కాన్పులైనా అమ్మకు 5,000) -
కాలం మారింది.. ఇక మీ టేబుల్ వద్దకు వెయిటర్స్ రారు, అంతా మీ చేతుల్లోనే!
తరాలు మారుతున్న కొద్దీ ప్రజల్లో అనాదిగా వస్తున్న ఆచారాలు, సంప్రదాయాలు, అభిరుచులు ఆలోచనా విధానాల్లో విప్లవాత్మక మార్పులొస్తున్నాయి. తదనుగుణంగా ఆధునిక జీవనశైలి అలవర్చుకుంటున్నారు. ప్రస్తుతం ప్రపంచం డిజిటల్ వైపు పరుగులు తీస్తోంది. అందుకు హోటళ్లు, రెస్టారెంట్ పరిశ్రమలు సైతం మినహాయింపు కాదు. ఈ నేపథ్యంలో ఆయా రంగాలు.. సాధారణ ముద్రిత మెనూల స్థానంలో ‘డిజిటల్ మెనూ’ను ప్రవేశపెడుతున్నాయి. వెయిటర్స్‌తో సంబంధం లేకుండా కూర్చున్న చోటు నుంచే వినియోగదారులు ఆహారాన్ని ఆర్డర్ చేయడానికి, బిల్లు చెల్లింపులు చేసేందుకు ‘నో టచ్ ఆర్డరింగ్’ పేరుతో క్యూఆర్ కోడ్ సాయంతో డిజిటల్ మెనూను తీసుకొస్తున్నాయి. – సాక్షి, అమరావతి నో వెయిటింగ్.. ఈజీ ఆర్డర్ టేబుల్‌పై ఉంచిన ప్రత్యేక క్యూఆర్ కోడ్‌లో రెస్టారెంట్లో లభించే పదార్థాల వివరాలను పొందుపరుస్తారు. దానికే సంబంధిత బ్యాంకు ఖాతాను జత చేస్తారు. వినియోగదారులు స్మార్ట్ ఫోన్‌తో కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా డిజిటల్ మెనూను వీక్షించవచ్చు. నచ్చిన ఆహారాన్ని వెయిటర్ సాయం లేకుండానే ఆర్డర్ చేయొచ్చు. ఇక్కడ ‘కిచెన్ టు టేబుల్’ (కేవోటీ)విధానంలో కోరిన ఆహారం జాప్యం లేకుండానే అందుతుంది. ఎలా తయారు చేస్తున్నారో చూడొచ్చు.. అన్య దేశాలకు చెందిన సంస్థల్లో ప్రత్యేకమైన డిజిటల్ మెనూ అందుబాటులో ఉంది. వాటిలో ట్యాబ్‌లను డిజిటల్ మెనూలుగా డైనింగ్ టేబుళ్లకు జోడిస్తున్నారు. మరోవైపు ‘సెల్ఫ్ ఆర్డరింగ్ కియోస్క్’లో మనం ఆర్డర్ చేసే పదార్థాన్ని 3డీ రూపంలో ముందుగానే చూపిస్తున్నారు. ఇక ఇంటరాక్టివ్ డిస్ప్లే టేబుల్స్ ద్వారా ఆర్డర్ చేసిన వస్తువు వచ్చేలోగా కిచెన్‌లో అది తయారు చేసే విధానాన్ని వీక్షించవచ్చు. టెక్నాలజీ వైపు.. కోవిడ్ తర్వాత భారతదేశంలోని దాదాపు మూడింట ఒకవంతు రెస్టారెంట్లు క్యూఆర్ కోడ్ ఆర్డరింగ్ టెక్నాలజీని చురుకుగా ఉపయోగిస్తున్నట్టు పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 2021 చివరి నాటికి దేశంలోని 80 శాతం రెస్టారెంట్లు క్యూఆర్ కోడ్లు, ఇతర ఆన్లైన్ ఆర్డరింగ్ టెక్నాలజీలోకి వస్తాయని అంచనా వేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని లగ్జరీ హోటళ్లు, రెస్టారెంట్లలో మాత్రమే డిజిటల్ మెనూ అమలవుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని హరిత హోటళ్లు, రిసార్టులు, రెస్టారెంట్లలో డిజిటల్ మెనూ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు పర్యాటక శాఖ చర్యలు చేపడుతోంది. పైలట్ ప్రాజెక్టు కింద తొలుత 14 చోట్ల అందుబాటులోకి తేనున్నామని ఏపీటీడీసీ ఎండీ సత్యనారాయణ చెప్పారు. శ్రామిక శక్తి సామర్థ్యం పెంపు రద్దీగా ఉండే హోటళ్లలో వెయిటర్‌కు ఆర్డర్ ఇచ్చేందుకు గంటల పాటు ఎదురు చూసే అవస్థలు తప్పుతాయి. ముఖ్యంగా శ్రామిక శక్తి కొరతను, పని భారాన్ని అధిగమించొచ్చు.ఈ డిజిటల్ మెనూలను బహుళ భాషల్లో సులభంగా సృష్టించవచ్చు. -
ఇస్మార్ట్ హోటల్..ఇవేమన్నా "మార్చురీ" గదులా?,సెటైర్లు పడ్డా ఎలా సక్సెస్ అయ్యిందంటే
పని మీద ఊరుకానీ ఊరు వెళ్తే.. ఉండటానికి చోటు ఒక సమస్యగా ఉంటుంది. తక్కువ ఖర్చుతో లాడ్జిల్లో ఉందామంటే కంఫర్ట్‌గా ఉండకపోవచ్చు. పోనీ మంచి సౌకర్యాలున్న హోటల్లో దిగాలంటే.. అది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఈ సమస్యను తీర్చేందుకు నెలకొల్పిన కాన్సెప్ట్ ‘క్యాప్సుల్ హోటల్’. జపాన్‌లో చాలా ఏళ్ల క్రితమే మొదలైన ఈ ట్రెండ్.. వయా సింగపూర్, ఇండియా మీదుగా యూరప్‌ని చేరింది. ఇప్పుడు బ్యూటీసిటీ మిలాన్‌లో క్యాప్సుల్ హోటల్స్‌దే హవా నడుస్తోంది. ఇంతకీ ఈ ఇస్మార్ట్ హోటల్ రూపురేఖలు ఎలా ఉంటాయి? ఎందుకు వాటికి అంత ప్రయారిటీ ఇస్తున్నారు..? (చదవండి: జపాన్ తరహా పాడ్ రూమ్స్ ఇప్పుడు భారత్‌లో..!) క్యాప్సుల్ హోటల్స్.. సింపుల్‌గా చెప్పాలంటే చిన్నసైజులో ఉండే బెడ్రూమ్స్తో కూడిన కాంప్లెక్స్‌లివి. ఒక చిన్న ఛాంబర్లో మినిమమ్ ఫెసిలిటీస్‌తో వీటిని ఏర్పాటు చేస్తారు. హోటల్స్‌తో పోలిస్తే రేటు చాలా తక్కువ. రాత్రిళ్లు పడుకోవడానికి సౌకర్యవంతంగా ఉంటాయి. పైగా ప్రైవసీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందుకే పనుల మీద వేరే ఊర్లకు వెళ్లేవాళ్లు, టూరిస్టులు వీటికి ప్రాధాన్యం ఇస్తున్నారు. వెస్ట్రన్ వరల్డ్‌లో వీటినే ‘పాడ్ హోటల్స్’ అంటారు. సాధారణంగా ఈ తరహా హోటల్స్ ఎయిర్పోర్ట్ దగ్గర్లో కనిపిస్తుంటాయి. అక్కడ వాటిని ‘స్లీప్‌బాక్స్’ పేరుతో పిలుస్తారు. అయితే ఈ మధ్యకాలంలో టూరిస్టుల తాకిడి ఎక్కువగా ఉండే ప్రధాన నగరాల్లోనూ క్యాప్సుల్ హోటల్స్ బిజినెస్ పెరుగుతోంది. కమర్షియల్‌గా మార్చేశారు జపాన్ ఉమెడ జిల్లా ఒసాకాలో తొలి క్యాప్సుల్ హోటల్ని 1979లో ఏర్పాటు చేశారు. జపనీస్ ఫేమస్ ఆర్టిటెక్ట్ కీషో కురోకావా ఆ హోటల్ని డిజైన్ చేయడం విశేషం. ఆ తర్వాత టోక్యోలో మరో మూడు బ్రాంచ్‌లు ఏర్పాటయ్యాయి. నిజానికి వీటిని ఏర్పాటు చేయడం వెనుక ఒక మంచి ఉద్దేశం ఉంది. చిన్న చిన్న పనులు చేసుకుంటూ రోడ్‌సైడ్ జీవితాల్ని గడిపేవాళ్ల కోసం వీటిని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా చలికాలంలో రాత్రిళ్లు ఉండేందుకు తక్కువ ఖర్చుతో వాళ్లకు క్యాప్సుల్ హోటల్స్‌ని అందుబాటులోకి తీసుకొచ్చారు. కానీ, రాను రాను ఇదొక బిజినెస్‌గా మారింది. మూడేళ్లలోనే జపాన్ మొత్తం మీద నలభైకి పైగా క్యాప్సుల్ హోటల్స్ వెలిశాయి. అక్కడి నుంచి ప్రపంచం మొత్తం విస్తరించాయి. సకల సౌకర్యాలు క్యాప్సుల్ హోటల్ ఛాంబర్లు చూడటానికి స్లీపర్ కోచ్ బస్సుల్లా ఉంటాయి. ఒక ఛాంబర్‌కి మరో ఛాంబర్ ఆనుకుని ఉంటుంది. ప్లాస్టిక్ టబ్ లాంటి నిర్మాణానికి అద్దాల సెటప్‌తో డోర్, దానికొక కర్టెన్ ఉంటుంది. లోపలికి పాకుతూ వెళ్లాల్సి ఉంటుంది. లోపల చిన్న బెడ్, లైట్, పవర్ ప్లగ్, వై–ఫై ఫెసిలిటీ ఉంటాయి. కొన్నిసార్లు టీవీ, ల్యాప్‌ట్యాప్‌ని ఇస్తారు. న్యూస్ పేపర్, రీడింగ్ మెటీరియల్స్ అందిస్తారు. జస్ట్ పడుకోవడానికి, రెస్ట్ తీసుకోవడానికి మాత్రమే సరిపోతాయివి. క్యాప్సుల్ హోటల్స్ ఆడ, మగకి విడివిడిగా ఉండొచ్చు. లేదంటే కపుల్ స్పెషల్‌గా ఉంటాయి. ఛాంబర్ కాంప్లెక్స్ బయట సామాన్లు భద్రపరుచుకోవడానికి ఒక లాకర్ ఉంటుంది. క్యాప్సుల్‌లో తినడానికి, సిగరెట్ తాగడానికి వీల్లేదు. అయితే బాత్రూమ్లు మాత్రం బయట కామన్‌గా ఉంటాయి. కొన్నింటిలో రెస్టారెంట్, షవర్స్, స్నాక్ బార్స్, పూల్స్.. ఎంటర్టైన్మెంట్ ఫెసిలిటీస్ సెపరేట్‌గా ఉంటాయి. కాకపోతే వాటికి కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అయితే క్లాస్ట్రోఫోబియా(ఇరుకుప్రదేశాలంటే భయం) ఉన్నవాళ్లు క్యాప్సుల్ హోటల్‌కి దూరంగా ఉండటమే బెటర్. మైనస్లున్నాయ్ ఒకరకంగా చెప్పాలంటే ఇది తొమ్మిది గంటల హోటల్. అంటే రాత్రి పూట పడుకోవడానికి, పగటిపూట విశ్రాంతి తీసుకోవడానికి మాత్రమే పనికొచ్చేలా సెట్ చేశారు. టైం అయిపోగానే ఖాళీ చేయాల్సిందే(చెక్ అవుట్). మళ్లీ కంటిన్యూ కావాలంటే మళ్లీ రిజిస్ట్రర్‌లో రికార్డు చేసుకోవాలి. అంతేకాదు పాడ్ హోటల్ కావడంతో ఛాంబర్లో రీసౌండ్ మాత్రం బాగా వస్తది. దీంతో మిగతా ఛాంబర్లకు ఆ సౌండ్ వినిపిస్తుంది. ఏదైనా ప్రమాదాలు జరిగినా త్వరగా రియాక్ట్ కావడానికి ఛాన్స్ కూడా ఉండదు. మరోవైపు వీటిని ఏర్పాటు చేసిన ఉద్దేశాన్ని మరిచిపోయి.. కమర్షియల్ పర్పస్‌గా మార్చేశారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. పైగా ఛాంబర్స్‌ని మరీ కుదించి ‘మార్చురీ’ టైప్‌లో డిజైన్స్ చేస్తున్నారని జపాన్ ఆర్టిటెక్ అసోషియేషన్ ఒక వాదనను వినిపించింది. ఇవన్నీ పక్కనపెడితే.. కంఫర్ట్ కోసం వెతుక్కునే వాళ్లకు అన్నివిధాల చీప్ అండ్ బెస్ట్ ఈ క్యాప్సుల్ హోటల్స్. మన దగ్గర కూడా.. జపాన్ నుంచి మొదలైన ఈ హోటల్ ట్రెండ్.. చైనా, ఇండోనేసియా, ఇండియా, హాంకాంగ్, బెల్జియం, పోలాండ్స్కి విస్తరించాయి. యూరోప్‌లో అక్కడక్కడ ఎయిర్పోర్ట్ దగ్గరల్లో క్యాప్సూల్స్ హోటల్స్ కనిపిస్తాయి. మన దేశంలోనూ క్యాప్సుల్ హోటల్ని ‘అర్బన్ పాడ్’ పేరుతో ముంబైలోని అంధేరీ ఏరియాలో ఏర్పాటు చేశారు. ఒక హోటల్లో ఉండే బెనిఫిట్సే ఇందులోనూ అందుతాయి. పైగా రేటు కూడా రీజనబుల్. దీంతో ఈ ఐడియా వర్కవుట్ అయ్యింది. ముఖ్యంగా టూరిస్టుల్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ స్పందనతో దేశంలో మరిన్ని చోట్ల క్యాప్సుల్ హోటల్స్‌ని విస్తరించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. -
హోటల్ ఫుడ్ ఇక మరింత ప్రియం.. 30 శాతం మేర పెరగనున్న ధరలు
సాక్షి, ముంబై: రెస్టారెంట్లు, హోటళ్లలో ఆహార పదార్థాలు మరింత ప్రియం కానున్నాయి. త్వరలో 30 శాతం మేర ధరలు పెరగనున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ఇంధన ధరలతో రవాణా ఖర్చులూ పెరుగుతుండటం, దానికి తోడు కూరగాయల ధరలు, వంట గ్యాస్ ధరలు ఆకాశాన్నంటుతుండటంతో హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యాలు ధరలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడుతోందని ‘ఆహార్’ సంఘటన అధ్యక్షుడు శివానంద్ శెట్టి పేర్కొంటున్నారు. దీంతో సామాన్యులు, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారు హోటల్‌కు వెళ్లాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. ‘కరోనా’ నుంచి కోలుకోకముందే కరోనా సంకట కాలంలో హోటల్ వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వం విధించిన అనేక ఆంక్షల మధ్య హోటళ్లు, రెస్టారెంట్లు తెరిచినప్పటికీ అనుకున్న మేర లాభాలు కాదుకదా కనీసం పెట్టుబడి కూడా రాలేదు. ఖర్చులు పెరిగి, ఆదాయం గణనీయంగా తగ్గడంతో వ్యాపారులు ఆర్థికంగా భారీ దెబ్బతిన్నారు. ఈ ఏడాది మే, జూన్ తర్వాత దశల వారీగా కరోనా ఆంక్షలు సడలిస్తుండటంతో హోటల్ వ్యాపారాలు మెల్లమెల్లగా పుంజుకోసాగాయి. అయితే గతేడాది చవిచూసిన నష్టాన్ని పూడ్చుకోవాలని హోటల్ వ్యాపారులు భావించారు. కానీ ధరలు పెంచితే మొదటికే మోసం వస్తుందని భావించి పాత ధరలతోనే నెట్టుకొస్తున్నారు. కానీ ప్రస్తుతం పెట్రో ధరలు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఆహారపదార్థాల ధరలను కనీసం 30 శాతం పెంచక తప్పని పరిస్థితి నెలకొందని శివానంద్ అంటున్నారు. చదవండి: (Mukesh Ambani House: ‘అంటిలియా’ అడ్రస్ అడిగిన ముగ్గురి అరెస్టు!) పెరిగిన ధరలు హోటల్, రెస్టారెంట్లు, క్యాంటీన్లలో గ్యాస్ సిలిండర్ వినియోగం తప్పనిసరి. స్టార్ లేదా పెద్ద హోటళ్లలో రోజుకు ఐదు సిలిండర్లు, చిన్న హోటళ్లలో రోజుకు రెండు గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తుంటారు. ఆయా వ్యాపార సంస్థలు వినియోగించే వంట గ్యాస్ సిలిండర్‌కు ఇళ్లలో వినియోగించే గ్యాస్ సిలిండర్ కంటే ఎక్కువే చెల్లిస్తారు. అవి కూడా పెరగడంతో ఖర్చులు ఎక్కువవుతున్నాయి. అలాగే పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరిగిపోవడంతో రవాణా చార్జీలు పెరిగాయి. విద్యుత్ బిల్లులు, కార్మికులు, సిబ్బంది వేతనాలు, సామగ్రి కొనుగోలు ఖర్చు అన్నీ పెరగడంతో పాటు కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ప్రతీ హోటల్‌కు గ్రేడ్‌ను బట్టి ఖర్చులు వేర్వేరుగా ఉంటాయి. అదే తరహాలో మెనూ ధరలు కూడా వేర్వేరుగానే ఉంటాయి. ఈ నేపథ్యంలో హోటల్, రెస్టారెంట్లలలో మెనూ చార్జీలు పెంచాల్సి వస్తోందని శివానంద్ స్పష్టం చేశారు. లేకపోతే హోటళ్లు, రెస్టారెంట్లు నడపలేని పరిస్థితి ఏర్పడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే 30 శాతం ధరలు ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయనేది త్వరలో హోటల్, రెస్టారెంట్ల యజమానులతో సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. -
హోటళ్లు, రెస్టారెంట్లకు తీవ్ర హెచ్చరికలు
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ మళ్లీ పంజా విసురుతోంది. రోజు రోజుకు వైరస్ కేసులు పెరుగుతున్న తరుణంలో ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే శనివారం తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. రాష్ట్రంలోని హోటళ్ళు, రెస్టారెంట్లు కోవిడ్-19 నిబంధనలను కచ్చితంగా పాటించాలని హెచ్చరించారు. కోవిడ్-19 ప్రోటోకాల్స్‌ను కఠినంగా పాటించండి, నిబంధనలు ఉల్లంఘించి కఠినమైన లాక్డౌన్ విధించే స్థితికి ప్రభుత్వాన్ని నెట్టొద్దంటూ సీఎం గట్టిగా హెచ్చరించారు. అవాంఛనీయమైన వైఖరి ఏర్పడటంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇకనైనా అన్ని జాగ్రత్తలు, మార్గదర్శకాలను పాటిస్తూ కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా చూడాలని సీఎం సూచించారు. షాపింగ్ సెంటర్లు, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ల ప్రతినిధులు హాజరైన వర్చువల్ సమావేశంలో ముఖ్యమంత్రి తాజా హెచ్చరికలు జారీ చేశారు. అక్టోబర్ నుండి దశలవారీగా కార్యకలాపాలు తిరిగి ప్రారంభమైనప్పటి నుండి చాలా చోట్ల రద్దీ పెరిగిందని, రక్షణ నియమాలను పాటించడం లేదని, దీనివల్ల కేసులు బాగా పెరిగాయన్నారు. తమ ప్రభుత్వం లాక్డౌన్ అమలుకు అనుకూలంగా లేదని, కానీ ప్రస్తుత పరిస్తితుల నేపథ్యంలో అన్ని నియమాలను పాటించండి. స్వీయ క్రమశిక్షణ, ఆంక్షల మధ్య ఉన్న తేడాను ప్రతి ఒక్కరూ గ్రహించి ప్రవర్తించాలన్నరు.న నియమాలను పాటించని కారణంగానే కేసులు బాగా పెరుగుతున్నాయంటూ ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే కఠినమైన నిర్ణయం తీసుకోకుండా ఉండేందుకు సహకరించాలని ప్రజలను కోరారు. కాగా మహారాష్ట్రలో శనివారం నాటికి 15,602 కేసులు, 88 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 22,97,793 కు, మరణాల సంఖ్య 52,811 కు చేరుకుంది. -
నేటి నుంచి బార్లు, రెస్టారెంట్లు
సాక్షి, ముంబై: మహారాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి బార్లు, రెస్టారెంట్లు, హోటళ్లు ప్రారంభమవుతున్నాయి. ఇటీవల ప్రకటించినట్టుగానే బార్లు, రెస్టారెంట్లు, హోటళ్లు తెరిచేందుకు ప్రభుత్వం పలు మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రతి కస్టమర్‌కు ప్రవేశం ద్వారం వద్దనే థర్మల్ స్క్రీనింగ్ చేయాలని ఆదేశించింది. కస్టమర్లకు సేవలందించే సమయంలో భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలని తెలిపింది. ఇక డబ్బులు చెల్లించేందుకు అత్యధికంగా డిజిటల్ పద్దతిని వినియోగించాలని సూచించింది. మాస్క్‌లు లేకుండా ఎవరిని లోపలికి అనుమతించకూడదని, కేవలం అహార పదార్థాలు సేవించే సమయంలో మాస్కులు విప్పేందుకు అనుమతి ఉంటుందని మార్గదర్శకాల్లో పేర్కొంది. కాగా, కస్టమర్లు వీలైతే మాస్కులతోపాటు గ్లౌస్లు, ఇన్స్టంట్ హ్యాండ్ వాష్‌లు వెంట తెచ్చుకోవాలని సూచించాలి. అన్‌లాక్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 50 శాతం సామర్థ్యంతో హోటళ్లు. బార్లు, రెస్టారెంట్లు తెరవాలన్న నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. గత ఆరు నెలలుగా లాక్డౌన్ కారణంగా మూసి ఉంచిన బార్లు, రెస్టారెంట్లు సోమవారం నుంచి కిటకిటలాడనున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు.. * కస్టమర్లు వస్తే హోటళ్లు, బార్లు, రెస్టారెంట్ల సిబ్బంది ద్వారాలు తెరవాలి * లక్షణాలు లేని వారిని మాత్రమే లోపలికి అనుమతించాలి. * కస్టమర్ల పేర్లు నమోదు చేయాలి. * అదేవిధంగా ప్రతి కస్టమర్‌కు శానిటైజర్‌ను అందుబాటులో ఉంచాలి. * డబ్బులు తీసుకునే వ్యక్తి తరచూ శానిటైజర్ వినియోగించాలి. * శౌచాలయాలు, హ్యాండ్ వాష్ చేసుకునే స్థలాలను తరచూ పరిశీలించి అక్కడ పరిశుభ్రత ఉండేలా చూడాలి. * సిబ్బందితోపాటు కస్టమర్ల మధ్య వీలైనంత తక్కువగా సంప్రదింపులు ఉండేలా చూడాలి. * సీసీటీవీ కెమెరా పని చేస్తూ ఉండాలి. * సీట్ల సంఖ్య కంటే అధిక కస్టమర్లను అనుమతించకూడదు.. * రెండు టేబుళ్ల మధ్య సురక్షితమైన దూరం ఉండేలా చూడాలి. * టేబుళ్లు, కిచెన్‌ను నిత్యం పరిశుభ్రం చేయాలి. * సిబ్బంది (కార్మికులు)కి టైమ్ టు టైమ్ వైద్య/ కరోనా పరీక్షలు చేయించాలి. అవసరమైతే కరోనా హెల్ప్‌లైన్ కేంద్రాన్ని సంప్రదించాలి. * కూర్చునే ముందు టేబుళ్లపై మెనూ కార్డు, టేబుల్ టవల్ ఇతర వస్తువులేవి ఉండకూడదు. బట్ట (వస్త్రం) నాప్‌కిన్‌కు బదులుగా యూజ్ అండ్ త్రో (డిస్పోజల్) వస్త్రాన్ని వినియోగించాలి. * క్యూఆర్ కోడ్ మాదిరిగా మెనూ కార్డు అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నించాలి. * సోషల్ డిస్టేన్స్ ఉంచేందుకుగాను భూమిపై కూడా మార్క్‌లు (గీతలు) చేయాలి. * వీలైతే ఏసీ వినియోగం వద్దు. అవసరమనిపిస్తే ఏసీని తరచూ శుభ్రపరచాలి. * వీలైనంతవరకు వండిన వస్తువుల వివరాలే మెనూ కార్డులో ఉంచాలి. ఒక టేబుల్‌పై ఒకే కుటుంబం లేదా ఒక సమూహానికి చెందిన వారినే కూర్చునేందుకు అనుమతించాలి. ఇతరులను అనుమతించకూడదు. -
మాల్స్, హోటళ్లు, మందిరాలు ఓపెన్
సాక్షి, సిటీబ్యూరో: కరోనా వైరస్ దెబ్బతో మూతపడ్డ మాల్స్, హోటళ్లు, ప్రార్థనా మందిరాలన్నీ సోమవారం నుంచి తెరుచుకోన్నాయి. అయితే ఎస్ఎంఎస్ (శానిటైజర్, మాస్క్, సోషల్ డిస్టెన్స్)ను తప్పనిసరిగా అమలు చేయాలని, అవి ఉల్లంఘించే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే గడిచిన వారం రోజులుగా నగరంలో భారీగా కరోనా పాజిటివ్ కేసులు–మరణాలు నమోదవుతున్న నేపథ్యంలో మాల్స్, హోటళ్లు, మందిరాలు తిరిగి ప్రారంభిస్తుండటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నగరంలో ఎన్నారైలు, తబ్లిగీల కుటుంబాలు, ఏరియాలు దాటి మహా నగరమంతా వైరస్ స్వైర విహారం చేస్తున్న నేపథ్యంలో భారీగా జనం పోగయ్యే ప్రాంతాలు తిరిగి ప్రారంభిస్తుండటం ఒక విధంగా రిస్క్‌తోనే కూడుకున్నదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ‘దూరం..దూరం..’ ఏరాట్లు సోమవారం ఉదయం నుంచి కీసర, దిల్సుఖ్నగర్ సాయిబాబా, నౌబత్పహడ్ వెంకటేశ్వరస్వామి దేవాలయాలు మొదలుకుని చారిత్రక మక్కా మసీదు, సెయింట్ ఆన్స్ చర్చి తదితరాలన్నీ యథావిధిగా ఓపెన్ అవుతాయి. ఇక్కడ కూడా తప్పనిసరిగా మాస్క్, భౌతికదూరం పాటించే నిబంధనతో పాటు అన్ని చోట్ల గేటు బయటే శానిటైజర్ ఇచ్చే ఏర్పాట్లను ఆయా సంస్థలే చేపడుతున్నాయి. ఇక మాల్స్–హోటళ్లకు సంబంధించి నగరంలో 20 వేల వరకు ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు, 110 వరకు ఉన్న స్టార్ హోటళ్లలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా రక్షణ ఏర్పాట్లు చేసుకున్నారు. రెస్లారెంట్లలో ఇంతకు ముందు సీట్లలో యాభై శాతాన్ని, అంటే..ప్రతి టేబుల్‌పై ఇద్దరిని మాత్రమే అనుమతించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే మరో వైపు రెస్టారెంట్లు, హోటళ్లకు నరిపోను సిబ్బంది కూడా లేకపోవటంతో పూర్తి సర్వీసులు అందజేయలేని పరిస్థితి ఉంది. భయపెడుతున్న కోవిడ్ రక్కసి.. కోవిడ్ రక్కసి పంజా జోరుగా విసురుతోంది. నగరంలో ప్రతి నెలా కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది. మార్చిలో నగరంలో 64 పాజిటివ్ కేసులు, 6 మరణాలు సంభవిస్తే, ఏప్రిల్‌లో 537 కేసులు, 15 మరణాలు, మేలో 1054 కేసులు, 50 మరణాలు, జూన్‌లో తొలి 7 రోజుల్లోనే 635 కేసులు, 39 మరణాలు చోటు చేసుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, అధికారులు ఎంత చెప్పినా.. స్వీయ నియంత్రణే అల్టిమేట్ రక్షణ చర్య అని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంటోంది. తాము ఎన్ని ఏర్పాట్లు చేసి, పర్యవేక్షించినా నగర వాసులు తాము వెళుతున్న ప్రదేశాల్లో నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే సంస్థలు, ప్రాంతాలపై వెంటనే 100 ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కోరింది. ఇదే విషయంలో తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్.వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ తమకు ప్రజల నుండి కూడా సహకారం కావాలని, తాము ఎన్ని ఏర్పాట్లు చేసినా, వచ్చే వారిలో స్వీయ నియంత్రణ ఉండాలని అన్నారు. భౌతిక దూరంతో నమాజ్ పాటించాలని ఫత్వా నగరవ్యాప్తంగా సోమవారం నుంచి మసీదులు పూర్తి స్థాయిలో ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నమాజ్‌లు చేసుకునేవారు భౌతిక దూరం పాటించాలని జామియా నిజామియా ఫత్వా జారీ చేసింది. అలాగే ప్రతి మసీదును ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలని నిర్ణయించారు. నమాజ్‌ల కోసం పరిచే జానీమాజ్‌లను తీసి..నేల పైనే నమాజ్ చేసుకోవడానికి ఏర్పాట్లు చేశారు. ప్రవేశ ద్వారా వద్ద శానిటేషన్ ఏర్పాట్లు చేపట్టారు. ప్రముఖ మత గురువు ముఫ్తీ అజీముద్దీన్ మాట్లాడుతూ కరోనా వ్యాపించకుండా ఉండాలంటే భౌతిక దూరం తప్పనిసరి అని, మసీదు కమిటీలు కూడా ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ లెక్కలు చూసి..అడుగేయండి.. నగరంలో కోవిడ్ విస్తరణ..జెట్ స్పీడ్ వేగంతో జరుగుతోంది.అందుకే సోమవారం నుండి ఇంటి నుండి బయల్దేరే వారు ఈ లెక్కలు చూసి..జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.. నగరంలో కేసులు, మరణాలు ఇలా.. రోజు పాజిటివ్ కేసులు జూన్ 1 79 జూన్ 2 70 జూన్ 3 108 జూన్ 4 110 జూన్ 5 116 జూన్ 6 152 జూన్ 7 132 -
8 నుంచి హోటళ్లు, రెస్టారెంట్లు ప్రారంభం
-
8 నుంచి హోటళ్లు, రెస్టారెంట్లు ప్రారంభం
సాక్షి, విజయవాడ : కేంద్ర మార్గదర్శకాల ప్రకారం జూన్ 8వ తేదీ నుంచి రాష్ట్రంలో హోటళ్లు, రెస్టారెంట్లు ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు మంత్రులు అవంతి శ్రీనివాస్, వెల్లంపల్లి శ్రీనివాస్ హోటళ్ల యాజమాన్యాలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కోవిడ్-19 నివారణ చర్యలు పాటిస్తూ హోటళ్ల నిర్వహణ అంశాలపై యాజమాన్యాలతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. 'ఎనిమిదో తేదీ నుంచి రాష్ట్రంలో హోటళ్లు.. రెస్టారెంట్లు ప్రారంభించవచ్చు. ఏపీలో అతిపెద్ద కోస్తా తీరం.. సుందర నదులు.. టూరిస్ట్ స్పాట్లు చాలా ఉన్నాయి. అన్ని చోట్లా హోటళ్లు ఓపెన్ చేసుకునేందుకు అనుమతి ఇస్తున్నాం. పుణ్య క్షేత్రాల్లో కూడా హోటళ్లను తెరిచేలా చర్యలు తీసుకుంటాం. టూరిస్టులు, యాత్రీకుల వసతి కోసం హోటళ్లు నిర్వహిస్తూనే కోవిడ్ నివారణ చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలి. దాదాపు ప్రతి జిల్లాలోనూ టూరిజం ప్రమోషన్లో భాగంగా వివిధ ఫెస్టివల్స్ నిర్వహించాం.(బాబు దళితులను హేళన చేశారు: మేరుగ) పర్యాటక రంగం ద్వారా ఆదాయాన్ని ఏ విధంగా సమకూర్చాలనే అంశంపై కసరత్తు చేస్తున్నాం. అరకు, గండికోట, హర్సలీహిల్స్ వంటి ప్రాంతాల్లో ఫైవ్ స్టార్, సెనెన్ స్టార్ రిసార్ట్స్ నిర్మాణం చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నాం. లాక్ డౌన్ సమయంలో నెలకు రూ. 10 కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోయాం. బోట్ ఆపరేటింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాం.తొమ్మిది కమాండ్ కంట్రోల్ రూముల ఏర్పాటు చేయనున్నాం. త్వరలోనే కమాండ్ కంట్రోల్ రూములను కూడా ప్రారంభిస్తామంటూ' అవంతి శ్రీనివాస్ తెలిపారు. -
హోటల్స్ రంగ షేర్లకు డిమాండ్
కరోనా వ్యాధి నేపథ్యంలో దాదాపు 3నెలల మూసివేత తర్వాత జూన్ 8 నుంచి పునఃప్రారంభం అవుతుండంతో హోటల్ కంపెనీ షేర్లుకు సోమవారం భారీగా డిమాండ్ నెలకొంది. నేటి ఉదయం ట్రేడింగ్ సెషన్లో ఈ రంగానికి చెందిన షేర్లు దాదాపు 19 శాతం వరకు లాభపడ్డాయి. కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ ఎత్తివేతలో భాగంగా ఈ జూన్ 8నుంచి హోటల్స్, రెస్టారెంట్లు, ఇతర ఆతిథ్య సేవలు, షాపింగ్ మాళ్లు ప్రారంభానికి కేంద్రం ఆమోదం తెలపడంతో హోటల్స్ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఫలితంగా ఈ రంగానికి చెందిన ఇండియన్ హోటల్స్, ఈఐహెచ్, తాజ్ జీవీకే అండ్ రెస్టారెంట్స్, ఈఐహెచ్ అసోసియేటెడ్, షాపర్స్టాప్ షేర్లు 10శాతం నుంచి 19శాతం ర్యాలీ చేశాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో హోటల్స్‌కు డిమాండ్ లేకపోవడంతో గడిచిన 3నెలల్లో హోటల్స్ స్టాక్స్‌లు 40-50శాతం నష్టాన్ని చవిచూశాయి. ఇదే సమయంలో బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు 13శాతం క్షీణించాయి. రాబోయే 3 ఏళ్లల్లో వార్షిక ప్రాతిపదికన రూమ్ రెవెన్యూ ఆదాయం 6-8శాతం పెరుగుతుందని హోటల్స్ పరిశ్రమ అంచనా వేస్తుంది. -
లాక్డౌన్: ఆ వార్తలో నిజం లేదు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో అన్ని షాపులు, వ్యాపార కార్యకలాపాలు ఆగిపోయాయి. మొదట లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 14 వరకు విధించిన తరువాత దానిని మే3 వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. అయితే లాక్డౌన్ ఎత్తి వేసిన తరువాత కూడా హోటళ్లు, రెస్టారెంట్లు అక్టోబర్ 15వ తేదీ వరకు తెరవడానికి వీలులేదు అని పర్యాటక శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు వార్తలు వినిపించాయి. దీనికి సంబంధించిన లెటర్ కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. అయితే దీనిపై పర్యాటక శాఖ స్పందించింది. ఆ వార్తలో నిజం లేదని, అది తాము ప్రకటించలేదని పేర్కొంది. ఎవరో ఫేక్ న్యూస్ సృష్టించి దానిని ఆన్లైన్లో వైరల్ అయ్యేలా చేశారని తెలిపింది. దీని వల్ల దేశ పర్యాటక రంగం మీద ప్రభావం పడుతుందని పేర్కొంది. ఇలాంటి అబద్దపు వార్తలు ఎవరు ప్రచారం చేశారో తెలుసుకొని వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ప్రజలు ఎవరూ ఇలాంటి వార్తలు నమ్మి ఆందోళన చెందవద్దని పర్యాటక శాఖ విజ్ఞప్తి చేసింది. (అది నకిలీ లింక్.. క్లిక్ చేస్తే అంతే!) Be cautious of #Fake order claiming that hotels/resturants will remain closed till 15th October 2020 due to #Coronavirusoutbreak.#PIBFactCheck: The order is Fake and has NOT been issued by Ministry of Tourism. Do not believe in rumours! pic.twitter.com/efRx3PWTj0 — PIB Fact Check (@PIBFactCheck) April 8, 2020 ఇదిలా ఉండగా ఇప్పటి వరకు భారతదేశంలో 19,000 మంది కరోనా బారిన పడగా, 640 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. దేశంలో కరోనా కేసుల్లో 5218 పాజిటివ్ కేసుల్తో మహారాష్ట్ర మొదటిస్థానంలో ఉండగా, తరువాత స్థానంలో ఢిల్లీ, గుజరాత్ ఉన్నాయి. (లాక్డౌన్ పొడగింపు: ఆ ప్రచారం అవాస్తవం) -
హోటళ్లు, రెస్టారెంట్లు తెరవాలి
సాక్షి, హైదరాబాద్ : కరోనా నివారణ కోసం ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లు/రెస్టారెంట్లు మూతపడి ఇబ్బంది పడుతున్న వారికి శుభవార్త. అన్ని హోటళ్లు/రెస్టారెంట్లను టేక్ అవే(పార్శిల్‌ను ఇంటికి తీసుకెళ్లడం), హోం డెలివరీ సేవలకు తెరిచి ఉంచాలని రాష్ట్ర పురపాలక శాఖ డైరెక్టర్ ఎన్.సత్యనారాయణ ఆదేశించారు. అయితే వినియోగదారులు అక్కడే కూర్చొని తినడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. పేద ప్రజల ఆకలి తీర్చడానికి రూ.5కే భోజనం అందించే అన్నపూర్ణ భోజన కేంద్రాలను నిర్వహించాలని సూచించారు. కరోనా నియంత్రణ, లాక్డౌన్ అమలుపై మంగళవారం ప్రగతిభవన్‌లో నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పలు సూచనలు చేశారని, వీటి అమలుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. హోటళ్లు/రెస్టారెంట్లు, ఇతర నిత్యావసర సరుకుల దుకాణాలను సాయంత్రం 6.30 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచేందుకు అవకాశం కల్పించారు. ►ఆహారపదార్థాలు, కిరాణా సరుకులు, పాలు, బ్రెడ్, పండ్లు, కూరగాయలు, గుడ్లు, మాంసం, చేపల విక్రయాలు, నిల్వ, రవాణాను అనుమతించాలి. ►అన్ని రకాల దుకాణాలను సాయంత్రం 6.30 గంటలకు మూసేయాలి. ►నిరాశ్రయులను నైట్ షెల్టర్ హోంలకు తరలించి బాగోగులు చూడాలని కోరారు. ►రూ.5కే భోజనం అందించే అన్నపూర్ణ కేంద్రాల నిర్వహణ కొనసాగించాలి. ఈ సమయంలో ఇవి అత్యవసరం. ►పురపాలికల్లో కంట్రోల్ రూమ్స్ తెరవాలి. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరించాలి. ►పారిశుధ్యం, నీటి సరఫరా, మురుగునీటి సరఫరా నిర్వహణ వంటి అత్యవసర పనులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. ►ఇంటింటి నుంచి చెత్త సేకరణ, రవాణాను పకడ్బందీగా నిర్వహించాలి. ►బయోమెట్రిక్ పద్ధతిలో హాజరు నమోదుకు ముందు, తర్వాత అధికారులందరూ శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకోవాలి. ►పార్కులు, ఇతర ప్రజలు గుమికూడే ప్రదేశాలను మూసేయాలి. ►బహిరంగ ప్రదేశాల్లో ప్రజల మధ్య 5 అడుగుల దూరం ఉండేలా చర్యలు తీసుకోవాలి. ►లాక్డౌన్ సమయంలో దుకాణాల వద్ద సామాజిక దూరం నిబంధనను ఉల్లంఘించే వ్యక్తులపై ఐపీసీ 188, 269, 270 సెక్షన్ల కింద కేసులు పెట్టాలి. ►నిత్యావసరం కాని సరుకులు, అత్యవసరం కాని సేవలన్నింటినీ మూసేయాలి. ►బహిరంగ ప్రదేశాల్లో ఇన్ఫెక్షన్ల నివారిణి ద్రావణాన్ని చల్లాలి. రహదారుల మరమ్మతులు/నిర్వహణ పనులు వేగవంతం చేయాలి. ►ఉన్నతాధికారుల నుంచి అనుమతి పొందకుండా మున్సిపల్ కమిషనర్లు ఎవరూ సెలవులు పెట్టరాదు. విధులకు గైర్హాజరు కారాదు. ఉత్తమ పారిశుధ్య సేవలకు పురస్కారాలు ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో పారిశుధ్య నిర్వహణ కోసం అద్భుత సేవలందించిన 25 మంది మున్సిపల్ కమిషనర్లతో పాటు ప్రతి పురపాలికలోని ముగ్గురు పారిశుధ్య కార్మికులను గుర్తించి వారి పురస్కారాలను అందించాలని పురపాలక శాఖ నిర్ణయించింది. ఏప్రిల్ 20 తర్వాత వీరికి పురస్కారాలు అందించనుంది. పట్టణ ప్రగతి వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్న రోజువారీ పారిశుధ్య కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని పురస్కారాలకు ఎంపిక చేయనున్నారు. -
సారీ.. నో ఆనియన్ !
సాక్షి, సనత్‌నగర్ : ఉల్లి.. ఇటు వంటింట్లోనే కాదు అటు హోటళ్లు, రెస్టారెంట్లలోనూ కొండెక్కి కూర్చుంది. ధరలో సెంచరీ దాటేసిన దీనిని పట్టుకునేందుకు ఎవరి తరమూ కావట్లేదు. ఇప్పటికే ఇళ్లల్లో చాలా మటుకు ఉల్లికి స్వస్తి పలకగా, ఆ దిశగా పలు హోటళ్లు, రెస్టారెంట్లు సైతం పయనిస్తున్నాయి. కొన్ని రెస్టారెంట్లు ఏకంగా బిర్యానీలో ఉచితంగా ఇచ్చే ఆనియన్ సలాడ్‌కు ప్రత్యేక రేటు నిర్ణయించేశాయి. మరికొన్ని మొత్తంగా ఉల్లికి టాటా చెప్పేసి కీర, క్యారెట్‌తో ఆ స్థానాన్ని భర్తీ చేసేస్తున్నాయి. ఇక పలు హోటళ్లలో ఆనియన్ దోశ ఊసే ఎత్తడం లేదు. కొన్ని రోజుల పాటు ఉల్లితో ముడిపడి ఉన్న ఆహార పదార్థాలకు తాత్కాలిక బ్రేక్ వేస్తే మంచిదన్న అభిప్రాయానికొచ్చేశారు. ఉదయం అల్పాహారం దగ్గర నుంచి మధ్యాహ్నం లంచ్, సాయంత్రం స్నాక్స్, రాత్రి డిన్నర్ వరకు.. హోటల్, రెస్టారెంట్ వంటకాలు ఎక్కువగా ఆనియన్తో ముడిపడి ఉంటాయి. ఆహార ప్రియులు ఎక్కువగా ఆనియన్ తెప్పించుకుని మరీ తమకిష్టమైన వంటకాలతో కలిపి భుజించడం షరామామూలు. ఇక బిర్యానీకి ఆనియన్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటిది ఉల్లి ధరలు కొండెక్కి కూర్చోవడంతో హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు సైతం వాటి వాడకాన్ని తగ్గించేశారు. ఇక అంతగా వినియోగదారులను పోగొట్టుకోవడం ఇష్టం లేక అంతగా అవసరమైతే కొసరి కొసరి అందిస్తున్నారు. అది కూడా ఆనియన్ దోశ అయితేనే. బిర్యానీ, చపాతి, పరోటా ఇలా తదితర వంటకాల్లో ఉచితంగా ఇచ్చే ఆనియన్‌కు దాదాపుగా గుడ్‌బై చెప్పేశారు. ఇక ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో అయితే ఉల్లి ప్రసక్తే లేకుండాపోయింది. మలక్‌పేట మార్కెట్‌కు 18 వేల సంచులు చాదర్‌ఘాట్: కొండెక్కిన ఉల్లి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయని మార్కెట్ శాఖ అడిషనల్ డైరెక్టర్ పి.రవికుమార్ తెలిపారు. సోమవారం ఆయన మలక్‌పేట మార్కెట్లో ఉల్లి ధరలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహారాష్ట్ర, కర్నూలు, కర్ణాటక, మహబూబ్‌నగర్‌ల నుంచి మలక్‌పేట మార్కెట్‌కు సోమవారం 18 వేల బ్యాగులు వచ్చాయన్నారు. క్వింటాకు రూ.4వేల నుంచి రూ.8 వేల వరకు ధర పలుకుతున్నట్లు చెప్పారు. కిలో ఉల్లి రూ.60 నుంచి 80 వరకు మార్కెట్లో లభ్యమవుతోందన్నారు. ఈజిప్ట్ నుంచి ఈ నెల 14, 15 తేదీల్లో రాష్ట్రానికి వెయ్యి క్వింటాళ్ల ఉల్లి దిగుమతి కానున్నట్లు వివరించారు. సమావేశంలో జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్, గ్రేడ్ 3 సెక్రటరీ నరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఉప్మా దోశకు డిమాండ్.. పెరిగిన ఆనియన్ ధరలు ఉప్మా దోశకు డిమాండ్‌ను పెంచాయి. దోశలో ఏదో ఒకటి మిక్స్ చేసి తింటే గానీ మజా ఉండదని ఆహారప్రియులు చెప్పేమాట. ఈ క్రమంలో ఉల్లికి బదులుగా ఉప్మాను జత చేసి హోటల్ నిర్వాహకులు అందిస్తున్నారు. ఉప్మా దోశ సాధారణమే అయినప్పటికీ ఉల్లి పెరుగుదలతో ఎక్కువ మంది మెనూలో ఉప్మా దోశ చేరిపోయింది. కీర, క్యారెట్‌తో సరి.. ఒకప్పుడు ఉల్లి కంటే కీర, క్యారెట్ల ధర ఎక్కువ ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. క్యారెట్, కీరల కంటే ఉల్లి డబుల్, త్రిపుల్ స్థాయిలో పెరగడంతో బిర్యానీ హోటళ్లు ఇప్పుడు ఆనియన్‌ను పక్కనపెట్టేశాయి. దీని స్థానంలో కీరను అందిస్తుండగా.. మరికొన్ని హోటళ్లు దానికి క్యారెట్ కూడా జతచేసి అందిస్తున్నాయి. చిన్న చిన్న హోటళ్ల దగ్గర నుంచి బడా రెస్టారెంట్ల వరకు కూడా ఇదే పరిస్థితి నెలకొంది. పెద్ద మొత్తంలోఆనియన్ తెచ్చి ఉచితంగా అందించే పరిస్థితి లేదని, ఒకప్పుడు సిల్వర్‌గా భావించే ఉల్లి ఇప్పుడు బంగారం సరసన చేరిపోయిందని రెస్టారెంట్ల నిర్వాహకులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆచితూచి కొనుక్కొని వాడాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఆనియన్ దోశ ఆపేశాం.. గతంలో బిర్యానీ, చపాతీ, పరోటా తదితర వంటకాలతో పాటు ఆనియన్ కూడా ఇచ్చేవాళ్లం. ధరలు పెరిగినప్పటి నుంచి ప్రస్తుతం ఆనియన్‌ను ఆపేశాం. ఈ పరిస్థితిని కస్టమర్లు కూడా అర్థం చేసుకుని సహకరిస్తున్నారు. ఇక ఆనియన్ దోశ అడిగినప్పుడు ఉప్మా దోశ గానీ లేక ప్లేన్ దోశ గానీ తీసుకోమని చెబుతున్నాం. కస్టమర్ పట్టుబడితే తప్ప ఆనియన్ దోశకు అంతగా ప్రాధాన్యమివ్వడం లేదు. – శ్రీనివాస్, అభి టిఫిన్స్, వివేకానందనగర్ రూ.4వేల భారం.. మొన్నటివరకు హోల్‌సేల్‌గా క్వింటాల్ ఉల్లిపాయలను వెయ్యి రూపాయలకు తీసుకునేవాణ్ణి. ప్రస్తుతం పెరిగిన ధరతో అదే క్వింటాల్ ఉల్లిపాయలను రూ.10 వేలకు తీసుకోవాల్సి వస్తోంది. అందుకే ప్రస్తుతం కస్టమర్లను పోగోట్టుకోవడం ఇష్టం లేక 50 కిలోలు మాత్రమే తీసుకుంటున్నాను. అయినా నాలుగు వేల రూపాయలకుపైగా భారం పడుతోంది. ధరలు పెంచితే వినియోగదారులు ఎక్కడ దూరం అవుతారోనని ఆ ఊసే ఎత్తడం లేదు. – వీరేశప్ప, ఉడిపి గ్రాండ్ హోటల్, కూకట్పల్లి వినియోగదారులు అర్థం చేసుకోవాలి.. మార్కెట్‌క వెళితే కిలో రూ.140 ఉండడంతో వెనక్కి తిరిగివచ్చేశాం. కొన్ని రోజులు ఆనియన్ దోశను ఆపివేయాలనే నిర్ణయానికి వచ్చాం. అందుకే హోటల్‌కు వచ్చిన కస్టమర్లకు ప్లేన్ దోశ, ఉప్మా దోశను మాత్రమే అందిస్తున్నాం. వినియోగదారులు కూడా పరిస్థితిని అర్థం చేసుకుని ఉల్లి దోశ జోలికి వెళ్లడం లేదు. ప్రజలు కూడా ఉల్లి వాడకాన్ని కొద్ది రోజులు నిలిపి చేస్తే ధరలు దిగి దిగి వస్తాయనే విశ్వసిస్తున్నాం. – భవాని, ఇడ్లీ ప్యూర్ వెజ్ అండ్ రెస్టారెంట్ కాసిన్ని తక్కువ ఇస్తున్నాం.. మార్కెట్లో ఉల్లి ధరలు చూస్తుంటే మతిపోతోంది. కానీ కస్టమర్లకు ఇవ్వక తప్పని పరిస్థితులు ఉన్నాయి. ఇంతకుముందు ఇచ్చినన్ని కాకపోయినా ఇప్పుడు కాస్త తక్కువ చేసి ఇస్తున్నాం. కొంత మంది కస్టమర్లు మళ్లీ కావాలని అడుగుతున్నారు. ధరలు తగ్గితే బాగుంటుంది. ఇవే ధరలు కొనసాగితే ఉల్లి లేకుండానే వంటలు చేయాల్సి వస్తుంది. – కుసుమ, చంద్రహవేలిహోటల్ నిర్వాహకురాలు, జూబ్లీహిల్స్ క్యాబేజీ తురుము.. క్యారెట్ ముక్కలు బంజారాహిల్స్: నగరంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో ఉల్లిగడ్డ పకోడీలో ఉల్లికి బదులు క్యాబేజీ, కాలిఫ్లవర్ వాడుతున్నారు. కట్‌మిర్చికి ఉల్లిపాయలు ఇవ్వడం మానేశారు. బిర్యానీ పక్కన కీర, నిమ్మకాయ ముక్కలు పెడుతున్నారు. ఇక కొన్ని హోటళ్లలో తమవద్ద ఉల్లిపాయలు లభించవని బోర్డులు ఏర్పాటు చేశారు. బిర్యానీ ముద్ద దిగడం లేదు బిర్యానీలోకి ఆనియన్ అడిగితే క్యాబేజీ తురుముతో పాటు కీరదోస ముక్కలు ఇస్తున్నారు. ఆనియన్ లేకపోతే బిర్యానీ తినడం చాలా కష్టంగా ఉంటుంది. దీంతో బిర్యానీ తినలేక రోటీ తిని పోవాల్సి వస్తోంది. ఏ రెస్టారెంట్‌కు వెళ్లినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. డబ్బులు ఇస్తామని చెబుతున్నా ఆనియన్ సలాడ్ మాత్రం ఇవ్వడం లేదు. – సాయి, కృష్ణానగర్ ఓ హోటల్లో ఆనియన్ సలాడ్‌కు రూ.25 చెల్లించాలని పెట్టిన బోర్డు తక్కువ ఇస్తున్నారు.. రెస్టారెంట్లలో ఏది ఆర్డర్ చేసినా సలాడ్‌లో ఉల్లిపాయ ముక్కలు తక్కువగా ఇస్తున్నారు. మళ్లీ కావాలని అడిగినా స్పందించడం లేదు. చాలీచాలని ఉల్లిపాయలతో కాస్త అసంతృప్తిగానే కడుపు నింపుకోవాల్సివస్తోంది. బయట మార్కెట్లో ఉల్లి ధరల ప్రభావం ఇంట్లో ఉండేవారితో పాటు మాలాగే రెస్టారెంట్లకు వచ్చేవారికి కూడా కనిపిస్తోంది. – శ్రీశైలం, జూబ్లీహిల్స్ మొహమాటం లేకుండా చెప్పేస్తున్నాం.. ఆనియన్ లేదని కస్టమర్లకు నిర్మొహమాటంగా చెప్పేస్తున్నాం.. బోర్డులు కూడా పెట్టేశాం. బిర్యానీలో ఉల్లిపాయలకు బదులుగా కీరదోస ముక్కలను అందిస్తున్నాం. గత 15 రోజుల నుంచే ఇదే తరహాలో మా కస్టమర్లను బుజ్జగించాల్సి వస్తోంది. కొంత మంది ఆనియన్ లేదంటే బిర్యానీ తినకుండానే వెళ్లిపోతున్నారు.. – వాజిద్, గ్రీన్ బావర్చి హోటల్ యజమాని, కృష్ణానగర్ -
ఏనుగుల కారిడార్‌లో రిసార్టులపై కొరడా
న్యూఢిల్లీ: నీలగిరిలోని ఏనుగుల కారిడార్ పరిధిలో అనుమతులు లేకుండా నడుస్తున్న హోటళ్లు, రిసార్టులపై సుప్రీంకోర్టు కొరడా ఝళిపించింది. ఆ ప్రాంతంలోని 27 రిసార్టులు, హోటళ్లను మూసివేయాలని సుప్రీంకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. నీలగిరి జిల్లాలోని ఏనుగుల కారిడార్‌లో చట్ట విరుద్ధంగా రిసార్టులు, హోటళ్లను నడుపుతున్నారంటూ దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘ఏనుగులు సంచరించే ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని చట్టం ఉంది. అయినా రిసార్టులు, హోటళ్ల నిర్మాణాలను ఎలా చేపడతారు?’ అంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ వర్షాకాలంలో సుమారు 18వేల ఏనుగులు నీలగిరి కారిడార్లోకి ప్రవేశించాయని పిటిషనర్ తెలపగా.. ఆ ప్రాంతంలో ఉన్న రిసార్టులు, హోటళ్లకు విద్యుత్ సరఫరా నిలిపివేయాలని ధర్మాసనం అధికారులను ఆదేశించింది. -
హరిత హోటల్‌పై విజిలెన్స్ దాడులు
ధర్మపురి : రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పుణ్యక్షేత్రాల్లో ఏర్పాటు చేసిన హరిత హోటళ్లు అక్రమాలకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. ధర్మపురి క్షేత్రంలోని హరిత హోటల్‌పై శనివారం విజిలెన్స్ అధికారులు దాడిచేయగా పలు విషయాలు వెలుగుచూశారు. స్థానికులు, అధికారుల కథనం ప్రకారం.. ధర్మపురిలోని గోదావరి ఒడ్డున వీఐపీల విడిది కోసం హరిత హోటల్ ఏర్పా టు చేశారు. ఇందులో మధ్యం, మాం సం ఉండదు. నిత్యం ధర్మపురికి వచ్చే భక్తులకు ఈ భవనం ఎంతో అనుకూలంగా ఉంటుంది. కొంత కాలంగా హోటల్లో మేనేజర్ ఇష్టానుసారంగా మెనూ తయారు చేయిస్తున్నాడని ఆరోపణలు వస్తున్నాయి. అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయని అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో హైదరాబాద్ నుంచి వచ్చిన విజిలెన్స్ అధికారులు, స్థానిక పోలీసుల సహకారంతో హోటల్‌పై దాడిచేశారు. స్థానిక ఎస్సై లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జరిపిన దాడుల్లో గదుల్లో కనీస శుభ్రత కూడా కనిపించలేదు. గదుల్లో పేక ముక్కలు, ఖాళీ మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. హోటల్‌కు సంబంధించిన రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించారు. క్యాష్బుక్ కనిపించకపోవడంతో హోటర్ మేనేజర్ బాలకృష్ణను పోలీసులు విజిలెన్స్ అధికారులు ప్ర«శ్నించగా నీళ్లు నమిలాడు. క్యాష్బుక్ పోయిందని బుకాయించాడు. ప్రతిరోజూ హోటల్లో ఎంత మంది ఉంటున్నారు, ఎన్ని గదులు అద్దెకిస్తున్నారు.. జమ, ఖర్చుల వివరాలేవని ప్రశ్నించారు. మేనేజర్, సిబ్బంది సరైన సమాధానం చెప్పలేదు. కాగా, విజిలెన్స్ దాడుల అనంతరం మేనేజర్ బాలకృష్ణ హోటల్ క్యాష్బుక్ పోయిందని ధర్మపులి ఠాణాలో సాయంత్రం ఫిర్యాదు చేశారు. హోటల్లో అసాంఘిక కార్యకలాపాలు, క్యాష్బుక్ మాయంపై విచారణ జరుపుతున్నామని ఎస్సై తెలిపారు. -
వాటర్ బాటిళ్లకు ఎమ్మార్పీ వర్తించదు!
సాక్షి, న్యూఢిల్లీ: హోటళ్లు, రెస్టారెంట్లలో వాటర్ బాటిళ్లను గరిష్ట చిల్లర ధర (ఎమ్మార్పీ) కంటే ఎక్కువకు అమ్ముకోవచ్చని సుప్రీంకోర్టు మంగళవారం చెప్పింది. నీటిసీసాల అమ్మకాలకు ‘న్యాయబద్ధమైన కొలతలు, తూనికల చట్టం’ వర్తించదని జస్టిస్ రోహింటన్ ఫాలీ నారిమన్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. హోటళ్లలో వస్తువుల అమ్మకంతోపాటు వినియోగదారులకు సేవలు కూడా అందుతాయనీ, ఎవ్వరూ కేవలం నీటిసీసాను కొనడానికే హోటళ్లకు వెళ్లరని వ్యాఖ్యానించింది. సేవలతోపాటు రెస్టారెంట్లలో ఉండే వాతావరణాన్ని ఆస్వాదించేందుకే వినియోగదారులు అక్కడకు వెళ్తారనీ, అందుకోసం యజమానులు పెట్టబుడి పెడుతుండటం వల్ల ఎమ్మార్పీ కన్నా ఎక్కువ రేటు తీసుకోవచ్చంది. భారత హోటళ్లు, రెస్టారెంట్ల సంఘాల సమాఖ్య వేసిన ఓ పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది. -
అన్ని రెస్టారెంట్లపై 12% జీఎస్టీ !
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానాల్లో సవరణలను సూచించేందుకు ఏర్పాటైన మంత్రివర్గం సంఘం పలు సూచనలు చేసింది. ఏసీ, నాన్–ఏసీ రెస్టారెంట్లు అనే తేడా లేకుండా అన్ని రెస్టారెంట్లలోనూ (కాంపోజిషన్ పథకాన్ని ఎంచుకోనివి) 12 శాతం పన్నునే వసూలు చేయాలని సిఫారసు చేసింది. ప్రస్తుతం కాంపోజిషన్ పథకంలో ఉన్న రెస్టారెంట్లకు 5 శాతం, తయారీదారులకు 2 శాతం పన్ను వర్తిస్తుండగా ఈ రేటును 1 శాతానికి తగ్గించాలని సూచించింది. అలాగే గది అద్దె రూ.7,500కు మించి ఉన్న హోటళ్ల రెస్టారెంట్లలో వసూలు చేస్తున్న 18 శాతం పన్నునే ఫైవ్–స్టార్ హోటళ్లలోని రెస్టారెంట్లలోనూ విధించాలంది. కాంపోజిషన్ పథకాన్ని ఎంచుకున్న ఒక వ్యాపారి పన్ను వర్తించని, వర్తించే...రెండు రకాల వస్తువులను అమ్ముతున్నప్పుడు అతను మొత్తం టర్నోవర్‌పై పన్ను కట్టాలంటే 0.5 శాతం, పన్ను వర్తించే వస్తువల టర్నోవర్‌కు మాత్రమే పన్ను కట్టాలంటే 1 శాతం పన్ను ఉండేలా చూడాలని మంత్రివర్గం సలహా ఇచ్చింది. దేశంలో ఇప్పటివరకు కోటికి పైగా వ్యాపారులు జీఎస్టీ కింద నమోదు చేసుకోగా, 15 లక్షల మంది కాంపోజిషన్ పథకాన్ని ఎంచుకున్నారు. -
అర్ధరాత్రి వరకూ హోటళ్లు, రెస్టారెంట్లు..
హైదరాబాద్: తెలంగాణలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో హోటళ్లు, రెస్టారెంట్లు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచేలా ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్ర హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. శనివారం ఆయన సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటి వరకు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే హోటళ్లలో ఆహార పదార్థాలు లభించేవని, ఇక నుంచి ఆ పరిస్థితి ఉండదని చెప్పారు. రాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచే హోటళ్లు, రెస్టారెంట్ల వద్ద గొడవలు జరగకుండా చూసుకోవలసిన బాధ్యత యజమానులదేనని అన్నారు. ఈ హోటళ్లలో తెలంగాణ వంటకాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. అంతకు ముందు హోటల్స్, రెస్టారెంట్స్ యజమానులతో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర హోటళ్ల సంఘం అధ్యక్షుడు సద్ది వెంకట్‌రెడ్డి, కార్యదర్శి బి. జగదీష్రావు పాల్గొని ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను హోటళ్లలో ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్పారు.