సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని హోటళ్లు, రెస్టారెంట్ల వ్యాపార వేళలను పొడిగిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. బార్ అండ్ రెస్టారెంట్లు మినహా ఇతర ఆహార దుకాణాలు ఉదయం ఐదు గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు కార్యకలాపాలు కొనసాగించుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి(ఎఫ్‌ఏసీ) జి.అనంతరాము మార్గదర్శకాలు విడుదల చేశారు.
కోవిడ్ నేపథ్యంలో జారీ చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనల గడువు మార్చితో ముగియడంతో కొత్త ఉత్తర్వులు వెంటనే అమలులోకి వస్తాయని స్పష్టం చేశారు. ఏపీ హోటల్ అసోసియేషన్ అభ్యర్థన మేరకు వ్యాపార వేళలను పెంచినట్టు తెలిపారు. కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ వ్యాపారులు, వినియోగదారులు విధిగా మాస్క్ ధరించడంతో పాటు శానిటైజర్ వాడాలని సూచించారు.
చదవండి: (ఎలాంటి కాన్పులైనా అమ్మకు 5,000)
Comments
Please login to add a commentAdd a comment