హోటల్స్‌ రంగ షేర్లకు డిమాండ్‌ | Hotel stks rally up to 19% | Sakshi
Sakshi News home page

హోటల్స్‌ రంగ షేర్లకు డిమాండ్‌

Published Mon, Jun 1 2020 12:02 PM | Last Updated on Mon, Jun 1 2020 12:02 PM

Hotel stks rally up to 19%  - Sakshi

కరోనా వ్యాధి నేపథ్యంలో దాదాపు 3నెలల మూసివేత తర్వాత జూన్‌ 8 నుంచి పునఃప్రారంభం అవుతుండంతో హోటల్‌ కంపెనీ షేర్లుకు సోమవారం భారీగా డిమాండ్‌ నెలకొంది. నేటి ఉదయం ట్రేడింగ్‌ సెషన్లో ఈ రంగానికి చెందిన షేర్లు దాదాపు 19 శాతం వరకు లాభపడ్డాయి. 

కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ ఎత్తివేతలో భాగంగా ఈ జూన్‌ 8నుంచి హోటల్స్‌, రెస్టారెంట్లు, ఇతర ఆతిథ్య సేవలు, షాపింగ్‌ మాళ్లు ప్రారంభానికి కేంద్రం ఆమోదం తెలపడంతో హోటల్స్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. 

ఫలితంగా ఈ రంగానికి చెందిన ఇండియన్‌ హోటల్స్‌, ఈఐహెచ్‌, తాజ్‌ జీవీకే అండ్‌ రెస్టారెంట్స్‌, ఈఐహెచ్‌ అసోసియేటెడ్‌, షాపర్‌​స్టాప్‌ షేర్లు 10శాతం నుంచి 19శాతం ర్యాలీ చేశాయి. 

కరోనా వ్యాప్తి నేపథ్యంలో హోటల్స్‌కు డిమాండ్‌ లేకపోవడంతో గడిచిన 3నెలల్లో హోటల్స్‌ స్టాక్స్‌లు 40-50శాతం నష్టాన్ని చవిచూశాయి. ఇదే సమయంలో బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు 13శాతం క్షీణించాయి. రాబోయే 3 ఏళ్లల్లో వార్షిక ప్రాతిపదికన రూమ్‌ రెవెన్యూ ఆదాయం 6-8శాతం పెరుగుతుందని హోటల్స్ పరిశ్రమ అంచనా వేస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement