కరోనా మహమ్మారి ఎంతోమంది ప్రజలను ఇళ్లకే పరిమితం చేసింది. చాలామంది జీవితాలను తలకిందులు చేసిన కరోనా లాక్‌డౌన్ ఓ మహిళను మాత్రం కోటీశ్వరురాలిని చేసింది. ఇంతకీ ఇదెలా సాధ్యమైంది, ఈ సంఘటన ఎక్కడ జరిగింది అనే మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో చూసేద్దాం.
బెంగళూరులో నివాసముంటున్న ప్రియా శర్మ 2020 కరోనా సమయంలో ముంబై వెళ్లిపోయింది. ఆ సమయంలో చాలా రోజులు ఇంట్లోనే కాలం గడపాల్సి వచ్చింది. ముంబైలో వ్యాపారవేత్తగా ఉన్న ఆమె తాత ఇష్టాలను, ఇతర విషయాలను తెలుసుకోవడం ప్రారంభించింది. సరిగ్గా అలాంటి సమయంలోనే.. ఆమె తాత 2014లో లార్సెన్ అండ్ టూబ్రో కంపెనీలో 500 షేర్లు కొనుగోలు చేసినట్లు, ఆ పెట్టుబడులకు సంబంధించిన పత్రాలు ఆమె కంటపడ్డాయి.
ఇదీ చదవండి: ఒకేసారి 10 రోజుల సెలవు.. ఆనందంలో 50వేల ఉద్యోగులు
ప్రియా శర్మకు దొరికిన ఆ పత్రాలే ఆమెను కోటీశ్వరురాలిని చేశాయి. 16 సంవత్సరాల వ్యవధిలో ఈ షేర్లు 4,500కి పెరిగాయి. వాటి విలువ ఏకంగా రూ. 1.72 కోట్లకు పెరిగింది. అయితే ఈ డబ్బును పొందటం చాలా కష్టంతో కూడుకున్న పని అయిపోయింది. చాలారోజులు పట్టించుకోకుండా వదిలేసినా ఈ స్టాక్స్ కోసం ప్రియా.. లార్సెన్ అండ్ టూబ్రో కంపెనీని లేఖ రాసింది. ఆ తరువాత చాలా నిబంధనలను దాటుకుంటూ ముందుకు వెల్లాల్సి వచ్చింది. మొత్తం మీద తాత చేసిన పని మనవరాలిని కోటీశ్వరురాలిని చేసింది.
Comments
Please login to add a commentAdd a comment