కర్ణాటక: ఆహారభద్రతా శాఖాధికార్లు సోమవారం హోసూరు, సూళగిరి ప్రాంతాల్లో నిర్వహిస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లు బేకరీలలో తనిఖీలు నిర్వహించారు. హోసూరు ఆహార భద్రతా శాఖాధికారి ముత్తుమారియప్పన్ నేతృత్వంలో అధికారులు రాజశేఖర్, ముత్తుకుమార్‌ల బృందం పట్టణంలోని పలు హోటళ్లలో సోదాలు చేయగా, ఎప్పుడో వండి, పాచిపోయిన ఆరు కిలోల తందూరి చికెన్, 18 కిలోల మటన్, చికెన్ బిర్యాని, మటన్ బిర్యానీలను ఫ్రిజ్‌లలో నిల్వ చేసినట్లు గుర్తించారు, వాటిని స్వాధీనపరుచుకొని బయటపడేశారు.
కొన్ని హోటళ్లలో నమూనాలను సేకరించి పరిశీలనకు పంపారు. బేకరీ దుకాణాల్లో కాలం చెల్లిపోయిన తినుబండారాలను స్వాధీనపరుచుకొన్నారు. కల్తీ టీపొడి విక్రయిస్తున్న నలుగురికి తలా రూ. 2000 జరిమానా విధించారు. నాసిరకం పదార్థాలను విక్రయిస్తే సీల్‌వేస్తామని హెచ్చరిక నోటీసులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment