Neelagiri
-
Mitra Satheesh: నీలగిరి ‘తోడాలు’.. పాండిచ్చేరి చాపనేత.. ఎన్నెన్నో విశేషాలు!
Kerala Mithra Satheesh And Son On Epic Road Trip To Kashmir Interesting Facts: తెలుగువాళ్ల పూతరేకులు నచ్చాయి... జమ్ము – సోనామార్గ్లు కనువిందు చేశాయి. అస్సాం ఆదివాసీలు మనసు దోచుకున్నారు. నాగాలాండ్ గ్రీన్ విలేజ్ స్వాగతం పలికింది. ఇదీ... ఈ తల్లీకొడుకుల పర్యటన స్వరూపం. డాక్టర్ మిత్రా సతీశ్ వయసు నలభై. ఆమె కేరళ రాష్ట్రం, కొచ్చిలోని ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో ప్రొఫెసర్. ఆమె కొడుకు నారాయణ్‌కి పదేళ్లు. ఇద్దరూ కారు ట్యాంకు నింపుకుని కొచ్చిలో బయలుదేరారు. ఏకంగా 17 వేల కిలోమీటర్లు ప్రయాణించారు. తమ భారతదేశ పర్యటనలో 28 రాష్ట్రాలు, ఆరు కేంద్ర పాలిత ప్రాంతాలను కవర్ చేశారు. ఇంతకీ ఈ సుదీర్ఘ ప్రయాణం ఎందుకు? ఈ ప్రయాణంలో వాళ్లు తెలుసుకున్న కొత్త సంగతులేంటి? తెలుసుకుందాం. నీలగిరి ‘తోడా’లు డాక్టర్ మిత్ర గ్రామీణ భారతాన్ని స్వయంగా చూడడానికి, అర్థం చేసుకోవడానికి వెళ్లారు. తోడా గిరిజనులను దగ్గరగా చూడడానికి, వారి జీవనశైలిని అధ్యయనం చేయడానికి కొచ్చి నుంచి నేరుగా నీలగిరికి ప్రయాణమయ్యారామె. అలా అన్ని రాష్ట్రాల్లోనూ పర్యటించాలనుకున్నారు. అందుకే రాష్ట్రంలో కనీసం ఒక్క గ్రామాన్నయినా చూసేటట్లు టూర్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. ఆ ఒక్క గ్రామం కూడా ఆ ప్రదేశానికి చెందిన లలిత కళలు, హస్తకళల ప్రాముఖ్యత ఉన్న గ్రామాలనే ఎంపిక చేసుకున్నారు డాక్టర్ మిత్ర. ఆ జాబితాలో ఇప్పటికే బయటి ప్రపంచానికి తెలిసినవి కొన్ని, తెలియనివి ఎక్కువగా ఉన్నాయి. పాండిచ్చేరి చాపనేత ఈ తల్లీకొడుకులు తమ పర్యటనలో పాండిచ్చేరిలోని ఒక ముస్లిమ్ కుటుంబం నుంచి చాపనేత కళ నేర్చుకున్నారు. నాలుగు వందల ఏళ్ల నుంచి వారసత్వంగా వస్తున్న కళ ఈ చాపనేత. స్థానికంగా దొరికే గడ్డిని మగ్గం మీద చాపలాగ నేస్తారన్నమాట. అలాగే వెళ్లిన ప్రతిచోటా స్థానిక రుచులను ఆస్వాదించారు. భౌగోళిక, చారిత్రక నేపథ్యాల్లో రూపుదిద్దుకున్న ప్రత్యేకమైన జీవనశైలిని చూసి ఆనందించారు. అలా జమ్ము, ఉత్తరాఖండ్, డెహ్రాడూన్, జైపూర్, ఉజ్జయిన్, గుజరాత్, మహారాష్ట్ర, గోవా మీదుగా కేరళ చేరుకున్నారు. ఈ టూర్ లో మిస్ అయిన కర్నాటక కోసం దీనికి అనుబంధంగా ఓ చిన్న టూర్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారామె. అందులో కూర్గ్, బేలూర్, బేలావాడి, మెల్కొటేలుంటాయన్నారు. అచ్చమైన మనిషి సోనామార్గ్, అస్సాం, చత్తీస్‌గఢ్ వాళ్లు ఆత్మీయతంగా, స్వార్థరహితంగా కనిపించారు. వాళ్లను చూసినప్పుడు అచ్చంగా మనిషిని చూసిన సంతోషం కలిగిందన్నారామె. ‘‘జంతువులను వేటాడమే వృత్తిగా కలిగిన బోడో గిరిజనులు ఇప్పుడు మానాస్ నేషనల్ పార్క్‌లో జంతువులను సంరక్షిస్తున్నారు. ఇండియాలో తొలి గ్రీన్ విలేజ్ ఖోనామాను నాగాలాండ్‌లో చూశాను. ఆదివాసీలందరూ పర్యావరణహితమైన వ్యవసాయ విధానాలను పాటిస్తున్నారని తెలిసి ఆశ్చర్యపోవడం నా వంతయింది. వాళ్లు వేటను పూర్తిగా త్యజించారు. ఒక మహిళ ఇలా దేశ పర్యటనకు వచ్చిందని తెలిసి అబ్బురపడుతూ నాకు జాగ్రత్తలు చెప్పారు. ఈ టూర్లో మేము చూసిన ఎత్తైన ప్రదేశం లధాక్‌లోని జోజి లా. మమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేసిన ప్రదేశం జమ్ము, కశ్మీర్‌లోని సోనామార్గ్ హిల్‌స్టేషన్. ఆంధ్రప్రదేశ్ వాళ్ల పూతరేకుల రుచిని మర్చిపోలేం. హోమ్లీ స్టే ఇక ఈ టూర్ కోసం నేను పాటించిన జాగ్రత్తలేమిటంటే... సూర్యోదయం స్టీరింగ్ పట్టుకుంటే సూర్యాస్తమయం సమయానికి ఆ రోజు ప్రయాణాన్ని ఆపేసేదాన్ని. బస కోసం హోమ్స్టేలకే ప్రాధాన్యం ఇచ్చాను. హోటళ్లతో పోలిస్తే ఖర్చు తగ్గడం మాత్రమే కాదు, స్థానికుల ఆత్మీయతను ఆస్వాదించవచ్చు. సొంతవాళ్లతో ఉన్నట్లే అనిపిస్తుంది. వారి సంప్రదాయాలను, జీవనశైలిని కూడా తెలుసుకోవచ్చు. నమ్ముతారో లేదో కానీ ఈ టూర్‌కి అయిన ఖర్చు ఒకటిన్నర లక్ష మాత్రమే. నాకు ఈ టూర్‌కి వెళ్లకముందు కారు నడపడం మాత్రమే తెలుసు. టూర్ కోసం కారుకి వచ్చే చిన్న చిన్న రిపేర్లు, టైరులో గాలి చెక్ చేసుకోవడం, టైరు మార్చడం వంటివి కూడా నేర్చుకున్నాను. మగవాళ్లు లేకుండా ఆడవాళ్లు మాత్రమే సోలో టూర్ చేసేటప్పుడు పిల్లలను తీసుకువెళ్లడానికి భయపడతారు. కానీ పదేళ్లు నిండిన పిల్లలైతే ఏమీ భయపడాల్సిన పని లేదు. కొత్త ప్రదేశాల నుంచి పెద్దవాళ్ల కంటే పిల్లలే ఎక్కువ తెలుసుకుంటారు. అలాగే ప్రదేశాలకు తగినట్లు, పరిస్థితులకు అనుగుణంగా మెలగడం కూడా నేర్చుకుంటారు. కాబట్టి పిల్లలను తీసుకుని వెళ్లడమే సరైన నిర్ణయం’’ అంటారు డాక్టర్ మిత్ర. చదవండి: Betel Leaves: తమలపాకులు నములుతున్నారా.. అయితే మీరు... RJ Malishka: ముంబై కీ రాణీ.. ఈ స్వరం... మైమరపిస్తుంది.. పనిచేయిస్తుంది! -
పెళ్లి పీటలపై వరుడుకి షాక్ ఇచ్చిన వధువు
సాక్షి, చెన్నై : కొద్దిసేపట్లో పెళ్లికూతురి మెడలో తాళికట్టే సమయం. పెళ్లి కొడుకు తాళిబొట్టు పట్టుకుని సిద్ధంగా ఉన్నాడు. కాసేపట్లో తాను ఓ ఇంటివాడినవుతానని సంబరపడిపోతున్నాడు వరుడు. ఇంతలో అతగాడికి ఆగమంటూ పెళ్లికూతురు అభ్యర్థన. చివరి నిమిషంలో ఇదేమి ట్విస్ట్ అనుకుంటూ పెళ్లికొడుకు అయోమయంగా చూస్తున్నాడు. రీల్ సీన్‌ను తలపించేలా రియల్ సీన్ చోటు చేసుకుంది అక్కడ. సినిమా సీన్లనే తలదన్నేలా పెళ్లి కొడుకు ఆనంద్‌కు షాక్ ఇచ్చింది పెళ్లి కూతురు ప్రియదర్శిని. పెద్దలు కుదిర్చిన పెళ్లి ఇష్టం లేకపోతే హీరోయిన్ మొండికేసి చివరి నిమిషంలో ప్రేమించినవాడితో వెళ్లిపోవడం మనం సినిమాల్లో చూస్తుంటాం..! అయితే ఇది తమిళనాడులో నిజంగానే జరిగింది. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, ప్రేమించిన వ్యక్తినే పెళ్లాడతానంటూ పెళ్లికూతురు తెగేసి చెప్పింది. దీంతో ఒక్కసారిగా వధూవరుల ఇరు కుటుంబాలతో పాటు పెళ్లికి వచ్చిన అతిథులంతా అనుకోని ఈ పరిణామంతో అవాక్కు అయ్యారు. తమిళనాడులోని నీలగిరి జిల్లాలోని ఉదగ గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. తనను ప్రేమించినవాడు అరగంటలో వస్తాడని అతడినే పెళ్లాడతానంటూ ప్రియదర్శిని ఖరాఖండిగా చెప్పేసింది. కుటుంబ సభ్యులు ఆమెకు ఎంత నచ్చచెప్పినా ఫలితం లేకపోయింది. దీంతో ఆగ్రహంతో ఆమెపై చేయి చేసుకునేవరకూ వెళ్లింది పరిస్థితి. ఇష్టం లేని పెళ్లి ఎందుకు చేస్తున్నారంటూ నిలదీసింది. అయితే ఈ విషయాన్ని ముందే ఎందుకు చెప్పలేదని పెళ్లికూతుర్ని బంధువులు ప్రశ్నించారు. మరోవైపు పెళ్లి మండపంలో జరిగిన అవమానం తట్టుకోలేని పెళ్లి కొడుకు ఆనంద్ అక్కడ నుంచి వెళ్లిపోయాడు. దీంతో పెళ్లి ఆగిపోయింది. అక్కడవరకూ బాగానే ఉంది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ప్రేమికుడి పార్తీపన్ కోసం పెళ్లి కూతురు అరగంట, గంట వేచి చూసినా చివరకు అతగాడు మాత్రం రాలేదు. దీంతో పెళ్లికూతురుని కూడా ఆమె పెద్దలు మండపంలోనే వదిలేసి బాధను దిగమింగకుంటూ వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. -
ప్రేమించిన వ్యక్తినే పెళ్లాడతానంటూ ..
-
రసవత్తరంగా నీలగిరి రాజకీయం..
సాక్షి, నల్లగొండ : నీలగిరి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి వ్యూహ, ప్రతి వ్యూహాలు రచిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోను గెలిచి తీరాలనే లక్ష్యంతో అభ్యర్థులు రేయింబవళ్లు ఎన్నికల వ్యూహాలను రచిస్తూ ప్రచార పర్వం కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులు వారి గెలుపును చాలెంజ్‌గా తీసుకొని ప్రత్యర్థి వైపు ఉన్న ప్రజలను తమ వైపు తిప్పుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. సర్వశక్తులా పోరాడుతున్న అభ్యర్థులు నీలగిరి మున్సిపల్ ఎన్నికలను అన్ని పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఇరు పార్టీల ముఖ్య నాయకులు మున్సిపల్ ఎన్నికల భారం తమ మీద వేసుకొని అభ్యర్థులకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ముఖ్యంగా రెండు ప్రధాన పార్టీల మధ్య రసవత్తర రాజకీయమే నడుస్తోందని చెప్పవచ్చు. అభ్యర్థి తమ గెలుపు కోసం ప్రత్యర్థి పార్టీల వైఫల్యాలను ఎక్కువగా ప్రజల్లో ప్రచారం చేస్తున్నారు. మెజార్టీ స్థానాలను కైవసం చేసుకొని నీలగిరి మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేయాలని అధికార పార్టీ నాయకులు భావిస్తుంటే, కాంగ్రెస్ తమ స్థానం నిలబెట్టుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతోంది. వార్డుల్లోని ప్రజలను తమ తరపున ప్రచారానికి రావాలని ఖర్చు ఎంతైనా భరిస్తున్నారు. ఎదుటి పార్టీ అభ్యర్థి తరపున ప్రచారం కోసం వెళ్లే వారిని ఎలాగైనా నివారించాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఓ వార్డులో 1000 మందికి పైగా భోజనాలు .. పట్టణంలోని వన్‌టౌన్ ప్రాంతంలో గల ఓ వార్డు అభ్యర్థి వార్డు ఓటర్లందరు తమ వెంటే ఉన్నారని అనిపించుకునేందుకు భారీ ర్యాలీ నిర్వహించి 1000 మందికి పైగా భోజనాలు పెట్టారు. ఎన్నికల ప్రచారానికి వచ్చే వారందరికి ఓ చోట టెంట్ వేసి భోజనాలు వండించి పెట్టి ఓటర్లను తమ వైపు తిప్పకుంటున్నారు. ఇలా ఒక అభ్యర్థి చేస్తే మరుసటి రోజు మరో అభ్యర్థి తామేమన్న తక్కువ ఉన్నామా అన్నట్లు ప్రజలను భారీగా రప్పించి బలప్రదర్శనకు దిగుతుండడం గమనార్హం. -
ఏనుగుల కారిడార్‌లో రిసార్టులపై కొరడా
న్యూఢిల్లీ: నీలగిరిలోని ఏనుగుల కారిడార్ పరిధిలో అనుమతులు లేకుండా నడుస్తున్న హోటళ్లు, రిసార్టులపై సుప్రీంకోర్టు కొరడా ఝళిపించింది. ఆ ప్రాంతంలోని 27 రిసార్టులు, హోటళ్లను మూసివేయాలని సుప్రీంకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. నీలగిరి జిల్లాలోని ఏనుగుల కారిడార్‌లో చట్ట విరుద్ధంగా రిసార్టులు, హోటళ్లను నడుపుతున్నారంటూ దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘ఏనుగులు సంచరించే ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని చట్టం ఉంది. అయినా రిసార్టులు, హోటళ్ల నిర్మాణాలను ఎలా చేపడతారు?’ అంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ వర్షాకాలంలో సుమారు 18వేల ఏనుగులు నీలగిరి కారిడార్లోకి ప్రవేశించాయని పిటిషనర్ తెలపగా.. ఆ ప్రాంతంలో ఉన్న రిసార్టులు, హోటళ్లకు విద్యుత్ సరఫరా నిలిపివేయాలని ధర్మాసనం అధికారులను ఆదేశించింది. -
నీలగిరి అభివృద్ధికి సహకారమందిస్తా – నేతి విద్యాసాగర్
నల్లగొండ టూటౌన్ : నీలగిరి అభివృద్ధికి తనవంతుగా సహకారం అందిస్తానని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ అన్నారు. ఆదివారం పట్టణంలోని 36వ వార్డులో గల హౌసింగ్‌బోర్డు కాలనీలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి నిధులు రూ.5 లక్షలతో చేపట్టిన కమ్యూనిటీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ టీఆర్ ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో జిల్లా అన్నిరంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్నారు. టీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి దుబ్బాక నర్సింహారెడ్డి మాట్లాడుతూ ఒక్క హౌసింగ్‌బోర్డు కాలనీలోనే రూ.37 లక్షలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. స్థానిక కౌన్సిలర్ మారగోని నవీన్‌కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అబ్బగోని రమేష్‌గౌడ్, దత్త గణేష్, బొర్ర సుధాకర్, మారగోని యాదయ్య గౌడ్, సముద్రాల మల్లీఖార్జున్, వేణు సంకోజు, అఫాన్ అలీ, రహీంఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
రాజా వారి ఆస్తి రూ.3.61 కోట్లు
-
రాజా వారి ఆస్తి రూ.3.61 కోట్లు
చెన్నై: కేంద్ర మాజీ మంత్రి, 2జీ స్పెక్ట్రమ్ కోటి 76 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం కేసులో ప్రధాన సూత్రధారి ఏ.రాజా ప్రస్తుత ఆస్తి 3 కోట్ల 61 లక్షల రూపాయలట. తనకు, తన కుటుంబ సభ్యులకు కలిపి 3.61 కోట్ల రూపాయల ఆస్తులున్నట్లు ప్రకటించారు. తమిళనాడులోని నీలగిరి లోక్‌సభ స్థానం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. నామినేషన్ పత్రంలో తెలిపిన రాజా తెలిపిన వివరాలు: 1.రాజాకు, భార్య పరమేశ్వరి, కుమార్తె మయూరి పేరున ఉన్న స్థిరచరాస్తుల విలువ రూ..60 కోట్ల. 2.అప్పులు రూ.35.5 లక్షలు. 3.తనపై ఆదాయపు పన్ను కేసు, 2జీ స్పెక్ట్రం కేసు ఉన్నట్లు పేర్కొన్నారు.