నీలగిరి అభివృద్ధికి సహకారమందిస్తా – నేతి విద్యాసాగర్
నల్లగొండ టూటౌన్ : నీలగిరి అభివృద్ధికి తనవంతుగా సహకారం అందిస్తానని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ అన్నారు.
నల్లగొండ టూటౌన్ : నీలగిరి అభివృద్ధికి తనవంతుగా సహకారం అందిస్తానని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ అన్నారు. ఆదివారం పట్టణంలోని 36వ వార్డులో గల హౌసింగ్‌బోర్డు కాలనీలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి నిధులు రూ.5 లక్షలతో చేపట్టిన కమ్యూనిటీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ టీఆర్ ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో జిల్లా అన్నిరంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్నారు. టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇంచార్జి దుబ్బాక నర్సింహారెడ్డి మాట్లాడుతూ ఒక్క హౌసింగ్‌బోర్డు కాలనీలోనే రూ.37 లక్షలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. స్థానిక కౌన్సిలర్ మారగోని నవీన్‌కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అబ్బగోని రమేష్‌గౌడ్, దత్త గణేష్, బొర్ర సుధాకర్, మారగోని యాదయ్య గౌడ్, సముద్రాల మల్లీఖార్జున్, వేణు సంకోజు, అఫాన్ అలీ, రహీంఖాన్ తదితరులు పాల్గొన్నారు.