Vidya Sagar
-
నాకు YSRCP పార్టీకి ఎటువంటి సంబంధం లేదు..
-
సజ్జల అనే వ్యక్తిని నేను ఎప్పుడు కలవలేదు..
-
వాంగ్మూలాలు మార్చేద్దాం.. వాస్తవాలు కప్పెట్టేద్దాం
సాక్షి, అమరావతి: వలపు వల విసిరి పారిశ్రామికవేత్తలను బురిడీ కొట్టించి ఆస్తులు కొల్లగొట్టే కి‘లేడీ’ కాదంబరి జత్వానీ కేసులో తిమ్మిని బమ్మి చేసేందుకు టీడీపీ కూటమి సర్కారు కుట్రలకు పదునుపెడుతోంది. ఈ కేసుకు వక్రభాష్యం చెబుతూ రాజకీయ కక్ష సాధింపు కుట్రను వేగవంతం చేస్తోంది. గతంలో ఈ కేసుకు సంబంధించి అధికారులు, సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలు తప్పని ముద్ర వేసేందుకు కుయుక్తులు పన్నుతోంది. నారా లోకేశ్ దుగ్ధతో తన రెడ్‌బుక్‌లో ప్రస్తావించిన పోలీసు అధికారులపై కక్ష సాధించడంతోపాటు వైఎస్సార్సీపీ సర్కారుపై దుష్ప్రచారం చేసేందుకు పావులు కదుపుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి అనిత తదితరులంతా ఈ కేసులో నిందితురాలికి వత్తాసు పలుకుతూ మాట్లాడటం ప్రభుత్వ పన్నాగాన్ని బట్టబయలు చేస్తోంది. టీడీపీ పెద్దల ఒత్తిడి మేరకు విజయవాడ పోలీసు ఉన్నతాధికారులు ఈ కేసును వక్రీకరిస్తూ రాజకీయ కక్ష సాధింపు ఉపకరణాలుగా మారుతున్నారు. ఆ ముగ్గురు ఐపీఎస్‌లే లక్ష్యం... మేం చెప్పినట్లు వాంగ్మూలాలివ్వండి మాయలేడీ కాదంబరి జత్వానీ బ్లాక్‌మెయిలింగ్ చేయడంతోపాటు ఫోర్జరీ పత్రాలతో తనకు చెందిన 5 ఎకరాలను దక్కించుకోవడంపై బాధితుడు విద్యాసాగర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం న్యాయస్థానం సమ్మతితో కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో పోలీసు అధికారుల బృందం ముంబై వెళ్లి అక్కడి పోలీసుల సహకారంతో ఆమెను అరెస్ట్ చేసింది. అనంతరం ముంబై న్యాయస్థానంలో హాజరుపరచి ట్రాన్సిట్ వారెంట్‌పై విజయవాడకు తీసుకువచ్చారు. అదే రోజు విజయవాడ న్యాయస్థానంలో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. అనంతరం న్యాయస్థానం ఐదు రోజులు పోలీసు కస్టడీకి అనుమతించడంతో కాదంబరి జత్వానీ వ్యక్తిగత న్యాయవాది సభ, ప్రభుత్వ వీఆర్వో సమక్షంలో విచారించారు. ఫోర్జరీ పత్రాలకు సంబంధించిన సాక్షులు, 5 ఎకరాలను విక్రయించేందుకు అడ్వాన్స్ ఇచ్చిన వారు... ఇలా పలువురు సాక్షులను విచారించారు. పోలీసుల విచారణతో సంతృప్తి చెందిన న్యాయస్థానం ఆమెకు రిమాండ్ విధించింది. అంతా చట్ట ప్రకారం సాగిన ఈ కేసుకు వక్రభాష్యం చెప్పాలంటే ఏం చేయాలనే ఆరాటంతో టీడీపీ కూటమి సర్కారు మల్లగుల్లాలు పడుతోంది. ఈ క్రమంలో గతంలో వాంగ్మూలాలు ఇచ్చిన సాక్షులు, అధికారులను విజయవాడ పోలీసులు పిలిపించి తీవ్రస్థాయిలో బెదిరిస్తున్నారు. నాడు ఐపీఎస్‌ల ఒత్తిడితో వాంగ్మూలు ఇచ్చామని చెప్పాలంటూ వేధిస్తున్నారు. లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని బెదిరిస్తున్నారు. అప్పట్లో ముంబై వెళ్లిన పోలీసుల బృందంలో కిందిస్థాయి అధికారులను కూడా బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. లోకేశ్ రెడ్‌బుక్‌లో పేర్కొన్న ఓ సీనియర్ ఐపీఎస్‌తోపాటు మరో ఇద్దరు ఐపీఎస్‌ల ఒత్తిడితోనే తాము కాదంబరి జత్వానిపై తప్పుడు కేసులు నమోదు చేసినట్లు చెప్పాలని బెదిరిస్తుండటం గమనార్హం. తాజాగా దీనిపై విచారణ అధికారిగా డీసీపీ కె.స్రవంతి రాయ్‌ను నియమించినా గతంలో ఇచ్చిన దానికి విరుద్ధంగా వాంగ్మూలాలు ఇప్పించే ప్రక్రియను విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబు స్వయంగా పర్యవేక్షిస్తుండటం గమనార్హం. ప్రభుత్వ పెద్దల నుంచి స్పష్టమైన ఆదేశాలతోనే ఆయన ఇలా వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ ఉదంతం పోలీసు శాఖలో ప్రస్తుతం కలకలం సృష్టిస్తోంది. గతంలో సక్రమంగా సాగిన విచారణను.. కోర్టు కూడా ఆమోదించిన విచారణ ప్రక్రియను కేవలం రాజకీయ దురుద్దేశంతో తిరగదోడి అక్రమ కేసులు బనాయించడం విస్మయం కలిగిస్తోందని పోలీసు వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. విజయవాడ కమిషరేట్‌లో హైడ్రామా హైడ్రామాలో భాగంగా కి‘లేడీ’ కాదంబరి జత్వానిని శుక్రవారం విజయవాడ రప్పించారు. ఓ స్టార్ హోటల్లో ఆమెకు బస కల్పించి కొందరు పోలీసు అధికారులు ఆమెకు తాము సిద్ధం చేసిన స్క్రిప్ట్ అందించారు. గతంలో చెప్పిన విషయాలను వక్రీకరిస్తూ ఎలా మాట్లాడాలో తర్ఫీదు ఇచ్చారు. తన తల్లి, న్యాయవాదులతో విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబును కలిసిన అనంతరం విచారణ అధికారి స్రవంతి రాయ్‌తో ఆమె చర్చించినట్లు తెలుస్తోంది. పోలీసు అధికారులు ముందుగా అందచేసిన స్క్రిప్‌్టనే ఆమె వల్లించినట్లు సమాచారం. తనను బెదిరించి సంతకాలు తీసుకున్నారని పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె వాదన అసంబద్ధమని పోలీసు వర్గాలు, పరిశీలకులు స్పష్టం నిజంగానే బలవంతంగా తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకుని ఉంటే ముంబై వెళ్లిన వెంటనే ఆ విషయాలను బయటపెట్టి న్యాయస్థానంలో కేసు వేసేవారని పేర్కొంటున్నారు. అంబరీష్ జత్వానీ స్మగ్లర్.. పారిశ్రామికవేత్తలు, రాజకీయనేతలు, బ్యూరోక్రాట్లను బ్లాక్మెయిల్ చేసి భారీగా ఆస్తులు కొల్లగొట్టే కుట్రలో కాదంబరి జత్వానీకి ఆమె తమ్ముడు అంబరీష్ జత్వానీ భాగస్వామి అనే విషయం పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. దుబాయ్ అండర్ వరల్డ్ మాఫియాతో సన్నిహిత సంబంధాలున్న అంబారీష్ జత్వానీ అంతర్జాతీయ స్మగ్లర్ కూడా. గతంలో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులకు చిక్కాడు. 2021 డిసెంబర్ 30న 599.490 గ్రామాలు బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తుండగా కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. ఇక సజ్జన్ జిందాల్తోసహా పలువురు పారిశ్రామికవేత్తలను బ్లాక్మెయిల్ చేసి భారీగా ఆస్తులు గుంజడంలో అతను పాత్రధారిగా వ్యవహరించాడు. హనీట్రాప్, బ్లాక్‌మెయిలింగ్ జత్వాని కుటుంబ దందా– ‘సాక్షి’ టీవీ చర్చలో కుక్కల విద్యా సాగర్ ‘బ్లాక్‌మెయిలింగ్, ఫోర్జరీలకు పాల్పడి అక్రమంగా ఆస్తులు కొల్లగొట్టడం కాదంబరి జత్వానీ, ఆమె కుటుంబం దందా. పెళ్లి చేసుకోవాలని లేదంటే ఆస్తులు రాసివ్వాలని బెదిరిస్తారు. సంతకాలు ఫోర్జరీ చేయడం, బోగస్ డాక్యుమెంట్లు సృష్టించడం, ఆస్తులు కొల్లగొట్టడం పక్కా కుట్రతో చేస్తారు. ఈ దందాలో కాదంబరి జత్వానీతోపాటు ఆమె తల్లి, సోదరుడు అంబరీశ్, ఇతర కుటుంబ సభ్యులు భాగస్వాములు. నాతోపాటు జిందాల్, ఏసియన్ పెయింట్స్ లాంటి పెద్ద పారిశ్రామిక సంస్థల కుటుంబాలకు చెందినవారితోపాటు ముంబై, ఢిల్లీ, బెంగళూరు తదితర నగరాల్లో ఎంతోమంది కాదంబరి జత్వాని బాధితులున్నారు. 2009లో నటాషా అనే పేరుతో పరిచయం చేసుకుంది. తనకు రెండేసి చొప్పున పాస్‌పోర్ట్‌లు, ఆధార్ కార్డులు ఉన్నాయి. ఎన్నోసార్లు బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అడిగేది. నా ఫోటోలను మార్ఫింగ్ చేసి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడింది. జగ్గయ్యపేటలో నా 5 ఎకరాల భూమిని ఫోర్జరీ పత్రాలతో ఇతరులకు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఈ ఏడాది ఫ్రిబవరిలో తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశా. పోలీసులు కేసు నమోదు చేసి చట్ట ప్రకారం ఆమెను అరెస్ట్ చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. నాలాంటి ఎంతోమంది మోసపోకుండా సమర్థంగా వ్యవహరించారు. నాకు వైఎస్సార్సీపీతో ఎలాంటి సంబంధం లేదు. 2014 ఎన్నికల ముందు మా నాన్న నాగేశ్వరరావు చనిపోవడంతో ఆయన ఇన్చార్జిగా ఉన్న పెనమలూరు నుంచి వైస్సార్సీపీ తరపున పోటీ చేయాల్సి వచ్చింది. ఎన్నికల ఫలితాల అనంతరం రాజకీయాలకు దూరంగా ఉంటున్నా. అప్పటి నుంచి నాకు ఏ పార్టీతోనూ సంబంధాలు లేవు. కాదంబరి జత్వానీని హఠాత్తుగా పిలిపించి తప్పుడు ఆరోపణలు చేయిస్తుండటం వెనుక పక్కా కుట్ర ఉంది. ఆమె నుంచి గత ఫిబ్రవరిలో పోలీసులు స్వాధీనం చేసుకున్న 7 ఫోన్లలోని వివరాలను ఎందుకు బయటపెట్టడం లేదు? ఈ కేసు విషయంలో న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నా. బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలకు భయపడేదే లేదు.’ -
నిజమైన తపస్వి విద్యాసాగరులు
సంత్ శిరోమణి ఆచార్య శ్రీ 108 విద్యాసాగర్ జీ మహరాజ్ జీ సమాధిని పొంది మనందరినీ విషాదంలో ముంచెత్తారు. జ్ఞానం, కరుణ, సేవల త్రివేణీ సంగమంగా పూజ్య ఆచార్యులు ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఆయన నిజమైన తపస్వి. ఆయన జీవితం భగవాన్ మహావీరుని ఆదర్శాలకు ప్రతీక. జైన సామాజిక వర్గంలో ఆయన ఉన్నత స్థానంలో నిలిచినప్పటికీ ఆయన ప్రభావం, పలుకుబడి కేవలం ఒక సామాజిక వర్గానికే పరిమితం కాలేదు. మతాలు, ప్రాంతాలు, సంస్కృతులకు అతీతంగా ప్రజలు ఆయన వద్దకు వచ్చేవారు. ప్రకృతికి నష్టాన్ని తగ్గించే జీవన విధానానికి ఆయన పిలుపునిచ్చారు. నిబద్ధత పునాదులపైనే ఒక బలమైన దేశం నిర్మితమవుతుందని విశ్వసించారు. లోతైన జ్ఞానం, ఎల్లలెరు గని దయ, మానవాళిని ఉద్ధరించాలన్న అచంచలమైన నిబద్ధతతో ఆచార్య విద్యాసాగర్ జీ (10 అక్టోబర్ 1946 – 18 ఫిబ్రవరి 2024) జీవితం ఆధ్యాత్మికంగా సుసంపన్నం అయింది. అనేక సందర్భాల్లో ఆయన ఆశీస్సులు అందుకున్న గౌరవం నాకు దక్కింది. అందువలన, నాతో సహా లెక్కలేనన్ని ఆత్మలకు మార్గాన్ని ప్రకాశవంతం చేసిన మార్గదర్శక కాంతిని కోల్పోయినట్లుగా నేను తీవ్రమైన లోటును అనుభవిస్తున్నాను. ఆయన అనురాగం, ఆప్యా యత, ఆశీస్సులు కేవలం సుహృద్భావ సంకేతాలు మాత్రమే కాదు, ఆయనతో సన్నిహితంగా మెలిగిన అదృష్టవంతులందరి మీదా ఆధ్యాత్మిక శక్తిని ప్రసరింపజేసి, స్ఫూర్తిని కలిగిస్తాయి. ఆయన జీవితం జైన మత మూల సూత్రాలకు ఉదాహరణగా నిలిచింది. దాని ఆదర్శాలను తన సొంత చర్యలు, బోధనల ద్వారా ప్రతిబింబింప జేశారు. సకల జీవరాశుల పట్ల ఆయనకున్న శ్రద్ధ, జైన మతానికి జీవితం పట్ల ఉన్న అమితమైన గౌరవానికి అద్దం పట్టింది. ఆలోచనల్లో, మాటల్లో, చేతల్లో నిజాయితీకి జైన మతం ఇచ్చిన ప్రాధా న్యాన్ని ప్రతిబింబిస్తూ ఆయన తన జీవితాన్ని గడిపారు. సరళమైన జీవనశైలిని అనుసరించారు. జైనమతం, భగవాన్ మహావీరుని జీవితం నుంచి ప్రపంచం ప్రేరణ పొందడానికి ఆయన వంటి మహా నుభావులే కారణం. ఆధ్యాత్మిక జాగృతికి, ముఖ్యంగా యువతలో ఆధ్యాత్మిక జాగృతికి ఆయన అవిశ్రాంతంగా కృషి చేశారు. విద్య ఆయన హృదయానికి చాలా దగ్గరైన రంగం. విద్యాధర్ (ఆయన చిన్ననాటి పేరు) నుండి విద్యాసాగర్ వరకు ఆయన చేసిన ప్రయాణం జ్ఞానాన్ని సంపాదించడం, అందించడంలో లోతైన నిబద్ధతతో సాగింది. న్యాయమైన, జ్ఞానవంతమైన సమాజానికి విద్య మూలస్తంభమని ఆయన ప్రగాఢ విశ్వాసం. వ్యక్తులను శక్తిమంతం చేయడానికీ, లక్ష్యం, సహకారంతో కూడిన జీవితాలను గడపడానికీ వీలు కల్పించే సాధనంగా ఆయన జ్ఞానాన్ని సమర్థించారు. విద్యను వ్యక్తులకు సాధికారత కల్పించి ఒక ప్రయోజనం, సేవాభావంతో జీవితం గడిపేందుకు దోహదపడే సాధనంగా ఆయన భావించారు. వారి బోధనలు స్వీయ అధ్యయనం, స్వీయ అవగాహన ప్రాము ఖ్యతను నిజమైన జ్ఞానానికి మార్గాలుగా నొక్కిచెప్పాయి. జీవితకాల అభ్యాసం, ఆధ్యాత్మిక ఎదుగుదలలో నిమగ్నం కావాలని వారి అనుచరులకు ప్రబోధించాయి. మన సాంస్కృతిక విలువలతో ముడిపడిన విద్యను మన యువత పొందాలని విద్యాసాగర్ జీ ఆకాంక్షించారు. నీటి ఎద్దడి వంటి కీలక సవాళ్లకు పరిష్కారం కనుగొనలేక పోయామనీ, గతం నుంచి నేర్చుకున్న పాఠాలకు దూరంగా ఉండటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందనీ ఆయన తరచూ చెప్పేవారు. సంపూర్ణ విద్య అనేది నైపుణ్యం, నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించేదిగా ఉంటుందని ఆయన విశ్వసించారు. భారతదేశ భాషా వైవిధ్యం పట్ల ఆయన ఎంతో గర్వ పడ్డారు. భారతీయ భాషలను నేర్చుకోవడానికి యువతను ప్రోత్స హించారు. పూజ్య ఆచార్యులు స్వయంగా సంస్కృతం, ప్రాకృతం, హిందీలో విస్తృతంగా రచనలు చేశారు. ఒక సాధువుగా చేరుకున్న శిఖరాలు, భూమిపై ఎంతగా నిలదొక్కుకున్నారు అనేవి ఆయన ప్రతిష్ఠాత్మక రచన ‘మూక్మతి’లో స్పష్టంగా కనిపిస్తుంది. తన రచనల ద్వారా అణగారిన వర్గాలకు గళం అందించారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో కూడా ఆచార్యుల కృషి చిరస్మరణీయం. ముఖ్యంగా నిరుపేదల నివాస ప్రాంతాల్లో ఆయన అనేక ప్రయత్నాల్లో పాలుపంచుకున్నారు. ఆరోగ్య సంరక్షణ పట్ల ఆయన విధానం సంపూర్ణమైనది. శారీరక శ్రేయస్సును ఆధ్యాత్మిక శ్రేయస్సుతో మిళితం చేస్తుంది. తద్వారా వ్యక్తి మొత్తం అవసరాలను తీరుస్తుంది. విద్యాసాగర్ జీ దేశ నిర్మాణం పట్ల చూపిన నిబద్ధత గురించి రాబోయే తరాలు విస్తృతంగా అధ్యయనం చేయాలని నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. పక్షపాత ఆలోచనలకు అతీతంగా జాతీయ ప్రయోజనాలపై దృష్టి సారించాలని ఆయన ప్రజలను ఎల్లప్పుడూ కోరేవారు. ప్రజాస్వామ్య ప్రక్రియల్లో భాగస్వామ్య వ్యక్తీకరణగా భావించిన ఓటును బలంగా విశ్వసించేవారిలో ఆయన ఒకరు. ఆరోగ్యకరమైన, స్వచ్ఛమైన రాజకీయాలను సమర్థించారు. విధాన రూపకల్పన ప్రజా సంక్షేమం గురించి ఉండాలి కానీ స్వప్రయోజనాల గురించి కాదనీ అనేవారు. పౌరులకు తమ పట్ల, తమ కుటుంబాల పట్ల, సమాజం పట్ల, దేశం పట్ల ఉండే బాధ్యతల నిబద్ధత పునాదులపైనే ఒక బలమైన దేశం నిర్మితమవుతుందని ఆయన విశ్వసించారు. నిజాయితీ, చిత్త శుద్ధి, స్వావలంబన వంటి సుగుణాలను పెంపొందించుకోవాలని వ్యక్తులను ప్రోత్సహించారు. న్యాయమైన, దయగల, అభివృద్ధి చెందు తున్న సమాజ నిర్మాణానికి అవి అవసరమని భావించారు. మనం వికసిత్ భారత్ నిర్మాణం కోసం కృషి చేస్తున్నందున విధుల పట్ల ఈ ప్రాధాన్యత చాలా ముఖ్యం. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ క్షీణత తీవ్రంగా ఉన్న ఈ కాలంలో, పూజ్య ఆచార్యులు ప్రకృతికి నష్టాన్ని తగ్గించే జీవన విధానా నికి పిలుపునిచ్చారు. అదేవిధంగా, మన ఆర్థిక వ్యవస్థలో వ్యవసా యానికి ఉన్న అత్యంత ముఖ్యమైన పాత్రను ఆయన గుర్తించారు. వ్యవసాయాన్ని ఆధునికంగా, సుస్థిరంగా మార్చాలని నొక్కి చెప్పారు. జైలు ఖైదీల సంస్కరణకు ఆయన చేసిన కృషి కూడా చెప్పుకోదగినది. వేల సంవత్సరాలుగా మన నేల ఇతరులకు వెలుగులు చూపించి మన సమాజాన్ని బాగు చేసిన మహానుభావులను అందించింది. సాధువులు, సంఘ సంస్కర్తల ఈ మహోన్నత పరంపరలో విద్యా సాగర్ జీ మహోన్నత వ్యక్తిగా నిలుస్తారు. ఆయన ఏం చేసినా వర్తమానం కోసమే కాకుండా భవిష్యత్తు కోసం కూడా చేసేవారు. గత ఏడాది నవంబర్‌లో ఛత్తీస్‌గఢ్‌లోని డోంగర్‌గఢ్‌లో ఉన్న చంద్రగిరి జైన మందిరాన్ని సందర్శించే అవకాశం నాకు లభించింది. అప్పటి సంద ర్శనే ఆయనతో నా చివరి సమావేశం అవుతుందని నాకు తెలియదు. ఆ క్షణాలు చాలా ప్రత్యేకమైనవి. ఆయన నాతో చాలాసేపు మాట్లాడి, దేశానికి సేవ చేయడంలో నేను చేసిన కృషిని ఆశీర్వదించారు. మన దేశం తీసుకుంటున్న దిశ, ప్రపంచ వేదికపై భారత్‌కు లభిస్తున్న గౌరవం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తాను చేస్తున్న పని గురించి మాట్లాడేటప్పుడు ఉత్సాహం చూపించారు. అప్పుడూ, ఎప్పుడూ, వారి సున్నితమైన చూపులు, నిర్మలమైన చిరునవ్వు... శాంతి, సేవా భావనను కలిగిస్తాయి. ఆయన ఆశీస్సులు మనసుకు ఓదార్పునిచ్చే ఔషధంలా, మనలోని, చుట్టుపక్కల ఉన్న దైవిక ఉనికిని గుర్తుచేసేలా ఉంటాయి. సంత్ శిరోమణి ఆచార్య శ్రీ 108 విద్యాసాగర్ జీ మహరాజ్ జీ లేని లోటును ఆయన గురించి తెలిసిన వారు, ఆయన బోధనలు, జీవితం స్పృశించినవారు శూన్యంగా భావిస్తారు. అయితే, ఆయన వల్ల స్ఫూర్తి పొందినవారి హృదయాల్లో వారు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆయన స్మృత్యర్థం వారు బోధించిన విలువలను పాటించడానికి మేము కట్టుబడి ఉంటాము. ఈ విధంగా, మనం ఒక గొప్ప ఆత్మకు నివాళులు అర్పించడమే కాకుండా, మన దేశం కోసం, ప్రజల కోసం ఆయన లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తాము. నరేంద్ర మోదీ భారత ప్రధాని -
ఇండస్ట్రీలో వారసత్వం.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కొడుకు కామెంట్స్
తెలుగు, తమిళంలో చాలా హిట్ సినిమాలకు సంగీతమందించి గుర్తింపు తెచ్చుకున్నారు విద్యాసాగర్. రజనీకాంత్ 'చంద్రముఖి'తో పాటు తమిళంలో పరవైగళ్ పలు విధం, పూమగళ్, జైహింద్, ధూల్ రన్, దిల్, తులసీ ఇలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు సంగీతాన్ని అందించారు. 'తిరుట్టుపయలే–2' తర్వాత మరో మూవీ చేయలేదు. అయితే విద్యాసాగర్ వారసుడు హర్షవర్ధన్ తండ్రి బాటలో పయనిస్తూ ఆయనలా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. మొత్తంగా 33 రిలీజ్!) ప్రస్తుతం ఏఆర్ రెహమాన్, జీవీ ప్రకాష్‌కుమార్, తమన్.. తదితర సంగీత దర్శకుల దగ్గర విష్ణువర్దన్.. మ్యూజిక్ మేనేజ్మెంట్ చేస్తున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ. తండ్రి విద్యాసాగర్‌కు చిత్రపరిశ్రమలోగానీ అభిమానుల్లో గానీ తగిన గుర్తింపు రాలేదని విష్ణువర్ధన్ అన్నారు. ఆయనలోని సంగీతాన్ని చిత్ర పరిశ్రమ సరిగా వాడుకోలేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాను ఆయనలా పేరు తెచ్చుకోవడానికి కృషిచేస్తున్నానని అన్నారు. అలాగని ఎక్కడా తన తండ్రి పేరును వాడుకోవడం లేదన్నారు. సొంత ప్రతిభ కృషితోనే ఈ రంగంలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. తన గురించి తెలిసిన వాళ్లు కొందరు విద్యాసాగర్ కుమారుడు అని ముందుగా ఎందుకు చెప్పలేదని అడుగుతుంటారన్నారు. అలా చెప్పుకోవడం ఇష్టం లేదని విష్ణువర్ధన్ చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: శోభను ఎవడు పెళ్లి చేసుకుంటాడో అంటూ శివాజీ చిల్లర వ్యాఖ్యలు) -
పెను విషాదం తర్వాత చిన్న గ్యాప్.. మళ్లీ కెమెరా ముందుకు మీనా
నటి మీనా చిన్న విరామం తరువాత మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు. బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఈమె ఆ తరువాత తమిళం, తెలుగు, మలయాళం తదితర భాషల్లో అగ్ర కథానాయిగా రాణించిన విషయం తెలిసిందే. కాగా ఈమె నటిగా ఫుల్‌ఫామ్‌లో ఉండగానే విద్యాసాగర్ అనే బెంగళూరుకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. వీరికి నైనిక అనే కూతురు కూడా ఉంది. అలాంటిది నటి మీన జీవితంలో ఇటీవల పెను విషాదం చోటు చేసుకుంది. ఆమె భర్త విద్యాసాగర్ ఈ ఏడాది కరోనా కారణంగా అనారోగ్యానికి గురై కన్నుమూశారు. దీంతో నటి మీనా బాధ నుంచి కోలుకోవడానికి చాలా కాలమే పట్టింది. ఆ మధ్య నటి కుష్భు, సంఘవి, రంభ తదితరులు ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించారు. కాగా ఇటీవల మానసిక వేదన నుంచి బయటపడటానికి నటి మీనా విదేశీ పర్యటన చేసి వచ్చారు. దీంతో కాస్త తేరుకున్న ఆమె మళ్లీ చిత్రాలలో నటించడానికి సిద్ధమయ్యారు. గతంలో అంగీకరించిన చిత్రాలను పూర్తి చేయడానికి రెడీ అవుతున్నారు. అలా ఆమె తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో ఒక్కో చిత్రం చేయాల్సి ఉంది. దీంతో పాటు మలయాళంలో మోహన్‌లాల్ సరసన దృశ్యం–3 చిత్రంలో నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా ప్రస్తుతం మీనా ఒక ప్రచార చిత్రంలో నటిస్తున్నారు. దానికి సంబంధించిన వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. చదవండి: (నాకు బలహీనతలు ఉన్నాయ్.. ఆ కామెంట్స్ చాలా బాధించాయి) -
టాలీవుడ్ సీనియర్ హీరో కన్నుమూత
అలనాటి హీరో, ప్రముఖ సీనియర్ నటుడు విద్యాసాగర్ తుదిశ్వాస విడిచారు. అనారోగ్య కారణాలతో ఆయన కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్నారు. కాగా 'ఈ చదువులు మాకొద్దు' సినిమాతో ఆయన హీరోగా పరిచయమయ్యారు. పలు సినిమాల్లో యాక్ట్ చేసి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. జంధ్యాల తీసిన అనేక సినిమాల్లో విద్యాసాగర్ నటించారు. కొన్ని సంవత్సరాల క్రితం ఆయనకు పక్షవాతం రావడంతో వీల్‌చెయిర్‌కే పరిమితమయ్యారు. చదవండి: అభిమాని కాళ్లు మొక్కిన హృతిక్ రోషన్, వీడియో వైరల్ -
భర్త మరణాంతరం తొలిసారి స్పందించిన నటి మీనా
భర్త మరణాంతరం మీనా తొలిసారి స్పందించారు. తన భర్త విద్యాసాగర్ మరణంపై సోషల్ మీడియాలో వస్తున్న ఆసత్య ప్రచారంపై ఆమె విచారం వ్యక్తం చేశారు. తన భర్త మృతిపై అసత్య ప్రచారాలు చేయొద్దని కోరారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆమె భావోద్వేగ పోస్ట్ షేర్ చేశారు. ‘భర్త దూరమయ్యారనే బాధలో ఉన్నాను. ఈ సమయంలో మా కుటుంబ ప్రైవసీకి భంగం కలిగించకండి. దయచేసి పరిస్థితి అర్థం చేసుకోండి. చదవండి: ‘భర్తను కాపాడుకునేందుకు మీనా చివరి వరకు పోరాడింది’ ‘విద్యాసాగర్ మృతిపై ఎలాంటి అసత్య ప్రచారాలు చేయొద్దని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ కష్టకాలంలో మాకు అండగా నిలిచి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నా భర్త ప్రాణాలను కాపాడేందుకు ఎంతో కృషి చేసిన వైద్య బృందం, తమిళనాడు సీఎం, ఆరోగ్య మంత్రి, ఐఏఎస్ రాధాకృష్ణన్, సన్నిహితులు, మిత్రులకు కృతజ్ఞతలు. అలాగే ఆయన కోలుకోవాలని ప్రార్థించిన అభిమానుల ప్రేమకు ధన్యవాదాలు’ అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చారు మీనా. చదవండి: వివాదంలో నరేశ్ పెళ్లి.. తెరపైకి మూడో భార్య.. సంచలన విషయాలు.. కాగా గత కొంతకాలం ఊపితిత్తుల సమస్యలతో బాధపడుతున్న మీనా భర్త విద్యాసాగర్ చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అయితే భర్తను బతికించుకునేందుకు మీనా ఎంతో ప్రయత్నించారని ప్రముఖ కొరియోగ్రాఫర్ కళా మాస్టర్ రీసెంట్గా ఓ ఇంటర్య్వూలో చెప్పుకొచ్చారు. View this post on Instagram A post shared by Meena Sagar (@meenasagar16) -
‘భర్తను కాపాడుకునేందుకు మీనా చివరి వరకు పోరాడింది’
ప్రముఖ నటి, సీనియర్ హీరోయిన్ మీనా భర్త విద్యాసాగర్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలం ఊపితిత్తుల సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. అయితే భర్తను బతికించుకునేందుకు మీనా ఎంతో ప్రయత్నించారని ప్రముఖ కొరియోగ్రాఫర్ కళా మాస్టర్ తెలిపారు. విద్యాసాగర్ కరోనా బారిన పడకముందే ఆయనకు బర్డ్ ఇన్ఫెక్షన్ అయినట్లు వైద్యులు చెప్పారని ఆమె అన్నారు. చదవండి: బెనారస్: మాయ గంగ సాంగ్ వచ్చేసింది ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా మీనా తన భర్తను కాపాడుకునేందుకు ఎంతో పరితపించారని ఆమె వివరించారు. ‘ఈ ఏడాది జనవరిలో కోరాన బారిన పడిన విద్యాసాగర్ అనంతరం కోలుకున్నారు. మీనా తల్లి బర్త్‌డే సందర్భంగా ఫిబ్రవరిలో వారి కుటుంబాన్ని కలిశాను. అప్పుడు ఆయన ఆరోగ్యం బాగానే ఉంది. ఆ తర్వాత నెల రోజులకే ఆయన అనారోగ్యం బారిన పడ్డారు. ఏప్రిల్‌లో మీనా ఫోన్ చేసి విద్యాసాగర్ ఆరోగ్యం బాగా క్షీణించిందంటూ ఆవేదన చెందారు. దీంతో నేను ఆసుపత్రికి వెళ్లి ఆయనను పలకరించాను’ అంటూ చెప్పుకొచ్చారు. చదవండి: షికారు అందరికీ తెలిసిన కథే, తప్పకుండా నచ్చుతుంది ఆయన ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకడంతో వెంటనే ట్రాన్స్‌ప్లాంట్ చేయాలని వైద్యులు చెప్పారని ఆమె పేర్కొన్నారు. దీంతో తమిళనాడు ముఖ్యమంత్రి, మంత్రులను కలిసి సాయం చేయాల్సిందిగా కోరామని, వారంతా సాయం చేసినా ట్రాన్స్‌ప్లాంట్ కోసం అవయవం దొరకలేదని తెలిపారు. ఈ క్రమంలో భర్తను కాపాడుకునేందుకు మీనా చివరి క్షణం వరకు ప్రయత్నించారని, చిన్న వయసులోనే తను భర్తను కోల్పోవడం బాధాకరమని కళా మాస్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. -
అశ్రునయనాల మధ్య మీనా భర్త అంత్యక్రియలు..రజనీకాంత్ కంటతడి
సాక్షి, చెన్నై: నటి మీనా భర్త విద్యాసాగర్ (48) భౌతిక కాయానికి బుధవారం బీసెంట్‌నగర్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. విద్యాసాగర్ మరణం మీనా కుటుంబాన్ని శోకసముద్రంలో ముంచెత్తగా, సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. బుధవారం ఉదయం నుంచే సినీ ప్రముఖులు, అభిమానులు స్థానిక సైదాపేటలోని మీనా ఇంటికి తరలి వచ్చి ఆమె భర్త విద్యాసాగర్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. సినీ ప్రముఖులు మీనాను ఓదార్చి సంతాపం వ్యక్తం చేశారు. రజనీకాంత్ కంటతడి బహుభాషా నటిగా పేరు తెచ్చుకున్న నటి మీనా భర్తను కోల్పోవడంతో ఆమె బంధువులు, సన్నిహితులు, అభిమానులు చలించిపోయారు. భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంతో ఉన్న మీనాకు ఆ బాధ నుంచి కోలుకోవడానికి తగిన శక్తిని భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ విద్యాసాగర్ భౌతిక కాయం వద్ద నివాళులు అర్పించారు. నటుడు రజనీకాంత్, మీనాలది సుదీర్ఘకాల సినీ అనుబంధం. ఆయన కథానాయకుడిగా నటించిన అన్భుళ్ల రజనీకాంత్ చిత్రంలో మీనా బాలనటిగా నటించారు. ఆ తరువాత యజమాన్, ముత్తు వంటి సూపర్ హిట్ చిత్రాల్లో రజనీకి జంటగా మంచి గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ మీనా ఇంటికి వెళ్లి ఆమె భర్త భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. (చదవండి: మీనా భర్త మృతికి పావురాలే కారణమా?) రజనీకాంత్‌ను చూడగానే మీనా అంకుల్ అంటూ బోరున ఏడ్చారు. దీంతో ఆమెను ఓదార్చిన రజనీకాంత్ కంటతడి పెట్టారు. అలాగే నటుడు, విజయకుమార్, శరత్‌కుమార్, దర్శకుడు కేఎస్ రవికుమార్, మన్సూర్ అలీఖాన్, దర్శకుడు సుందర్ సి, కుష్భు, చేరన్, నటి లక్ష్మి, సంగీత, రంభ, స్నేహ తదితర సినీ ప్రముఖులు నివాళులర్పించారు. నటుడు, రాజకీయ నాయకుడు విజయకాంత్, శరత్‌కుమార్, విశాల్ తదితరులు సామాజిక మాధ్యమాల్లో సంతాపం వ్యక్తం చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మీనా భర్త మృతికి పావురాలే కారణమా?
సీనియర్ నటి మీనా భర్త విద్యాసాగర్(48) హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. శ్వాసకోశ సమస్యతో బాధ పడుతున్న ఆయన చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందారు. కాగా, ఆయన మృతిపై ఇప్పుడు పలు అనుమానాలు మొదలయ్యాయి. పావురాల వ్యర్థాల నుంచి వచ్చిన గాలిని పీల్చడం వల్లే విద్యాసాగర్ మృతి చెందాడని స్థానిక మీడియాలో వార్తలు వెలుబడుతున్నాయి. మీనా ఫ్యామిలీ మొత్తానికి గతంలో కరోనా సోకింది. కోవిడ్ నుంచి కోలుకున్నప్పటికీ... విద్యాసాగర్ కొన్ని నెలలుగా పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్నాడు. (చదవండి: సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్న నాజర్!, కారణం ఇదేనా?) పోస్ట్ కోవిడ్ సమస్యలు మాత్రమే ఆయన మృతికి కారణం కాకపోవచ్చని, పావురాల వ్యర్థాల నుంచి వచ్చిన గాలిని పీల్చడం వల్లే శ్వాసకోశ సమస్య రెట్టింపై ప్రాణాంతకంగా మారిందని స్థానిక మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మీనా ఫ్యామిలీ నివాసం ఉండే ఇంటికి సమీపంలో పావురాలు ఎక్కువగా ఉంటాయి. వాటికి విద్యాసాగర్ తరచూ దానా వేస్తూ అక్కడే గడిపేవాడట. కోవిడ్ సోకిన సమయంలో విద్యాసాగర్ ఊపిరితిత్తులు పాడైపోయినట్లు వైద్యులు గుర్తించారు. ఊపిరితిత్తుల మార్పిడి చేయించాలని వైద్యులు సూచించినప్పటికీ..దాతలు దొరక్కపోవడంతో విద్యాసాగర్ మృతి చెందినట్లు తెలుస్తోంది. మీనా, విద్యాసాగర్‌ల వివాహం 2009లో జరిగింది. వీరికి ఒక పాప. పేరు నైనిక. దళపతి విజయ్ హీరోగా వచ్చిన తేరీ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది. పావురాల వ్యర్థాల నుంచి వచ్చిన గాలిని పీల్చడం వల్లే విద్యాసాగర్ మృతి చెందాడన్న వార్తల నేపథ్యంలో డాక్టర్ శ్రీలక్ష్మి(పల్మనాలజిస్ట్, అమోర్ హాస్పిటల్స్) ఈ విధంగా స్పందించారు. -
చదువు ‘ఎంటెక్’ వృత్తి ‘వ్యవసాయం’
-
సీఎంపై అనుచిత వ్యాఖ్యలు, డీఈ సస్పెన్షన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎంవీ విద్యాసాగర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ముఖ్యమంత్రిపై అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ, సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ సోమవారం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. దుష్ప్రవర్తన, క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు సస్పెండ్ చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ మాట్లాడుతూ... ‘డీఈ విద్యాసాగర్ తన మొబైల్ వాట్సాప్ గ్రూప్‌ల్లో కొన్ని ప్రభుత్వ వ్యతిరేక విషయాలను పోస్ట్ చేశారు. ముఖ్యమంత్రిని అసభ్య పదజాలంతో దూషిస్తూ, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను తన వాట్సాప్ గ్రూప్‌లలో విమర్శించారు. మా విచారణలో ఆధారాలతో సహా అవన్ని వాస్తవమని తేలాయి. ఉద్యోగులు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో లేదా బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. అతిక్రమిస్తే రాష్ట్ర ప్రభుత్వ ప్రవర్తనా నియమావళి ప్రకారం క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం’ అని స్పష్టం చేశారు. చదవండి: ‘మా అమ్మ మంచి తల్లి, కానీ నేనే బ్యాడ్’ -
కుప్పంలో వైఎస్ఆర్సీపీ నేత విద్యాసాగర్ హత్యకు కుట్ర
-
‘కూలిన చోటే నిలువెత్తు విగ్రహం’
కోల్‌కతా : లోక్‌సభ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో నెలరోజుల కిందట ప్రముఖ సంఘ సంస్కర్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహం ధ్వంసమైన క్రమంలో అదేచోట పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం విద్యాసాగర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రముఖ రాజకీయ నేతలు, మేథావులు, బెంగాలీ నటుల సమక్షంలో విద్యాసాగర్ విగ్రహానికి దీదీ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మే 14న బీజేపీ చీఫ్ అమిత్ షా రోడ్‌షో సందర్భంగా విద్యాసాగర్ కళాశాలలో నెలకొల్పిన విద్యాసాగర్ విగ్రహాన్ని కొందరు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. మమతా బెనర్జీ హామీ ఇచ్చిన మేరకు ఇదే కళాశాలలో పునర్నిర్మించిన విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. కోల్‌కతా కాలేజ్ స్ట్రీట్‌లోని విద్యాసాగర్ కాలేజ్‌లో ఆరు అడుగుల ఎత్తైన విద్యాసాగర్ విగ్రహాన్ని విద్యార్ధులు, మేథావులు, రాజకీయ నేతల హర్షధ్వానాల మధ్య ఆమె ఆవిష్కరించారు. బెంగాలీ సంస్కృతితో పాటు సమాజ వికాసానికి, విద్యావ్యాప్తికి ఆయన చేసిన కృషి అసామాన్యమని దీదీ ఈ సందర్భంగా కొనియాడారు. -
శభాష్ సాగర్!
సాక్షి, సిటీబ్యూరో: అతడి పేరు బి.విద్యాసాగర్... మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌లో కానిస్టేబుల్... రామ్‌గోపాల్‌పేట ఠాణా ఇన్చార్జ్గా ఉన్నాడు... గురువారం రాత్రి పక్కాగా పెట్రోలింగ్ విధులు నిర్వర్తించడమే కాకుండా ఒక్కడే ఉన్నా ఇద్దరు దోపిడీ దొంగలను పట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సీపీ అంజనీ కుమార్ శుక్రవారం తన కార్యాలయానికి పిలిపించి ప్రత్యేకంగా అభినందించారు. వివరాల్లోకి వెళితే.. నగరానికి చెందిన తిమ్మప్ప ఓ స్టార్ హోటల్లో రూమ్‌బాయ్‌గా పని చేస్తున్నాడు. గురువారం రాత్రి అతను నెక్లెస్‌రోడ్‌లో సంజీవయ్య పార్క్ మీదుగా నడిచి వెళుతుండగా, అర్ధరాత్రి పార్క్ వద్ద అతడిని అడ్డగించిన ముగ్గురు దుండగులు ఇటుకరాయితో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన తిమ్మప్ప కిందపడిపోగా అతడి వద్ద ఉన్న నగదు, సెల్‌ఫోన్ దోచుకెళ్లారు. అదే సమయంలో ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్న సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్ విద్యాసాగర్ తక్షణమే అక్కడికి చేరుకుని క్షతగాత్రుడిని అడిగి విషయం తెలుసుకున్నాడు. దుండగులను వెంటాడి, వారి వాహనాన్ని ఆపడంతో పాటు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరు పారిపోకుండా నియంత్రిస్తూనే రామ్‌గోపాల్‌పేట అధికారులకు సమాచారం అందించాడు. దుండగుల్ని పోలీసులకు అప్పగించడంతో పాటు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. నిందితులు లోయర్ ట్యాంక్‌బండ్, గాంధీనగర్‌లకు చెందిన ఎండీ అమీర్, బి.నిఖిల్‌గా గుర్తించిన పోలీసులు వీరిచ్చిన సమాచారంతో మరో మైనర్‌ను పట్టుకున్నారు. నగర కొత్వాల్ అంజనీకుమార్ శుక్రవారం టాస్క్‌ఫోర్స్ డీసీపీ పి.రాధాకిషన్‌రావు, ఇన్స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావుల సమక్షంలో విద్యాసాగర్‌ను ప్రత్యేకంగా అభినందించడంతో పాటు రివార్డు ప్రకటించారు. -
శుభలేఖ+లు టీజర్ రిలీజ్
-
ఉద్యమకారుడైనందుకు.. ఉద్యోగం ఊడింది
► ఆర్టీసీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన విద్యాసాగర్ ► తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు ఊడిన ఉద్యోగం సిద్దిపేట కల్చరల్: ఆర్టీసీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ.. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నందుకు ఓ ఉద్యమకారుడి ఉద్యోగం ఊడింది. దీంతో అతడు ఇంటికి వెళ్లలేక గుడిలోనే జీవనం సాగిస్తున్నాడు. వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్‌కు చెందిన వనపర్తి విద్యాసాగర్ 1988లో కడప బస్ డిపోలో సెక్యూరిటీగార్డుగా విధుల్లో చేరాడు. అక్కడ కొన్నేళ్లు పనిచేశాక అనంతపూర్‌కు, అక్కడి నుంచి జగిత్యాల డిపోకు బదిలీ చేశారు. అప్పట్లో ఇతను స్వరాష్ట్రం తెలంగాణ కావాలని బలంగా కోరుకున్నాడు. కేసీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకొని ఉద్యోగం చేస్తూనే స్వరాష్ట్రం వచ్చే దాకా అఖండ అయ్యప్పమాలను స్వీకరించి, శబరిమలైకి ప్రతి సంవత్సరం పాదయాత్రగా వెళుతున్నాడు. ఇందుకోసం తనకున్న కొద్దిపాటి భూమిని.. భార్య మెడలోని పుస్తెల తాడును అమ్మేశాడు. ఈ క్రమంలో ఓసారి విద్యాసాగర్‌ను కేసీఆర్ సన్మానించారు కూడా. అరుుతే, విద్యాసాగర్ ఉద్యమంలో పాల్గొనడం నచ్చని అప్పటి ఆంధ్ర అధికారి ఇతడిని విధుల నుంచి తొలగించారు. దీంతో తన బాధను అప్పటి తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్‌కు మొరపెట్టుకోవడంతో.. ఆయన చొరవతో మెట్పల్లి బస్ డిపోలో సెక్యూరిటీ గార్డుగా పోస్టింగ్ ఇచ్చారు. కానీ ఆ సంతోషం మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. మళ్లీ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నాడనే కారణంతో ఆరు నెలల్లోనే విధుల్లో నుంచి తొలగిస్తున్నట్లు కాగితం చేతిలో పట్టారు. దీంతో పిల్లలను చదివించే స్థోమత లేక.. భార్యకు మొహం చూపలేక ఎంతగానో మదనపడ్డాడు. దసరా రోజు.. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ దసరా రోజు సిద్దిపేట జిల్లాను ప్రారంభిస్తారని తెలుసుకొని మళ్లీ తన గోడును చెప్పుకోవడానికి సిద్దిపేటకు వచ్చాడు. కానీ అది సాధ్యపడలేదు. ఇతర ప్రజా ప్రతినిధులకైనా గోడు చెబుతామనుకుంటే వీలుకాకపోవడంతో ఇక చేసేది లేక.. సిద్దిపేట అయ్యప్ప దేవాలయంలోనే కాలం వెల్లదీస్తున్నాడు. ఏనాటికైనా సీఎం కేసీఆర్‌ను సిద్దిపేటలోనే కలుస్తాననీ, తన గోడు చెప్పుకొంటానని ఆశతో ఎదురు చూస్తున్నాడు. సీఎం చొరవ చూపాలి తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించడంతో.. ఆర్టీసీలోని ఆంధ్ర అధికారి సంపత్‌కుమార్‌కు కోపం వచ్చింది. నన్ను రెండుసార్లు సెక్యూరిటీ గార్డు ఉద్యోగంలోనుంచి తీసేశారు. సర్వం కోల్పోయిన నాకు మళ్లీ నా జాబ్ కావాలి. కేసీఆర్, ఇతర నాయకులు తలచుకుంటే ఇదేం పెద్ద విషయం కాదు. కాస్త జాలి చూపి, నా కుటుంబాన్ని ఆదుకోండి. మీ కాళ్లకు దండం పెడతా. - విద్యాసాగర్, బాధితుడు -
మత్స్య సంపదను పెంచడమే ప్రభుత్వ లక్ష్యం
చెర్కుపల్లి(కేతేపల్లి) : మత్స్య సంపదను పెంచడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని శాసనమండలి డెప్యుటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ అన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన మూడు లక్షల చేపపిల్లలను ఆదివారం మండలంలోని చెర్కుపల్లి ఉదయసముద్రం, దీపకుంట చెరువులలో ఆయన వదిలి మాట్లాడారు. దళారీ వ్యవస్థను అరికడుతూ మత్స్యసంపదపై ఆధారపడిన కార్మికుల కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకే ప్రభుత్వం చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేపట్టిందన్నారు. చేపల విక్రయానికి ప్రభుత్వం మార్కెట్ సౌకర్యం కల్పిస్తుందన్నారు. మత్స్యకారులు ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక స్వావలంబన సాధించాలని కోరారు. కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ బంటు మహేందర్, సొసైటీ చైర్మన్ లింగాల రాంనర్సయ్య, నాయకులు పీబీ ఎల్లయ్య, అంజాద్‌ఖాన్, పులుసురాజు, మల్లం సైదులు, ఎ.మహేందర్ తదితరులు పాల్గొన్నారు. -
నీలగిరి అభివృద్ధికి సహకారమందిస్తా – నేతి విద్యాసాగర్
నల్లగొండ టూటౌన్ : నీలగిరి అభివృద్ధికి తనవంతుగా సహకారం అందిస్తానని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ అన్నారు. ఆదివారం పట్టణంలోని 36వ వార్డులో గల హౌసింగ్‌బోర్డు కాలనీలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి నిధులు రూ.5 లక్షలతో చేపట్టిన కమ్యూనిటీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ టీఆర్ ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో జిల్లా అన్నిరంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్నారు. టీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి దుబ్బాక నర్సింహారెడ్డి మాట్లాడుతూ ఒక్క హౌసింగ్‌బోర్డు కాలనీలోనే రూ.37 లక్షలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. స్థానిక కౌన్సిలర్ మారగోని నవీన్‌కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అబ్బగోని రమేష్‌గౌడ్, దత్త గణేష్, బొర్ర సుధాకర్, మారగోని యాదయ్య గౌడ్, సముద్రాల మల్లీఖార్జున్, వేణు సంకోజు, అఫాన్ అలీ, రహీంఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్ఈసీ ఇండస్ట్రీస్‌కు పార్లమెంటరీ కమిటీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రక్షణ రంగంపై వేసిన అత్యున్నత స్థాయి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ (పీఎస్సీ) జూన్ 3న హైదరాబాద్‌లోని ఎస్ఈసీ ఇండస్ట్రీస్‌ను సందర్శించనుంది. దేశంలో ఒక ప్రైవేటు కంపెనీని పీఎస్సీ సందర్శించడం ఇదే తొలిసారి. ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి బీసీ ఖండూరి నేతృత్వం వహిస్తున్న ఈ కమిటీ... ఇక్కడ ఎస్ఈసీ ఇండస్ట్రీస్‌తో పాటు ప్రభుత్వ రంగంలో ఉన్న రక్షణ రంగ సంస్థలను కూడా సందర్శించనుంది. ఆరు దశాబ్దాలకుపైగా చరిత్ర కలిగిన ఎస్ఈసీ ఇండస్ట్రీస్ రక్షణ, వైమానిక రంగానికి అవసరమైన అత్యంత కీలక పరికరాలను తయారు చేస్తోంది. ఇది కంపెనీ విశిష్ట సేవలకు దక్కిన గుర్తింపు అని ఎస్ఈసీ ఇండస్ట్రీస్ ఎండీ డి.విద్యాసాగర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ‘కంపెనీ సాధించిన విజయాలను కమిటీకి వివరిస్తాం. ఎదుర్కొన్న కష్టాలనూ తెలియజేస్తాం. మేం లేవనెత్తే అంశాలను కమిటీ అధ్యయనం చేసి తగు పరిష్కారాలు సూచిస్తుందని భావిస్తున్నాం. తద్వారా పరిశ్రమకు ప్రయోజనం చేకూరుతుంది’ అని అన్నారు. -
వరుస చోరీలపై ఖాకీలు సీరియస్
జమ్మికుంట : జమ్మికుంట, హుజూరాబాద్ ప్రాంతాల్లో జరుగుతున్న చోరీ ఘటనలపై పోలీసులు దృష్టిసారించారు. దొంగలను పట్టుకునేందు కు గాలింపు ముమ్మరం చేశారు. అనుమానితులను,అపరిచిత వ్యక్తులను, ఇతర రాష్ట్రా ల నుంచి వచ్చి చిరువ్యాపారాల పేరిట గ్రామాల్లో సం చరిస్తున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. జమ్మికుంట మండలంలోని జగ్గయ్య పల్లిలో ఉడుత చిన్న రాజమ్మ అనే వృద్ధురాలు అనుమానాస్పదస్థితిలో మృతి చెందగా...ఒంటిపై ఉన్న బంగారం అపహరణకు గురైంది. ఈ నెల3న పట్టణంలోని వర్తక సంఘం ఏరియాలో మండలంలోని రాచపల్లికి చెందిన కనుకలక్ష్మి మెడలోని నాలుగు తులాల బంగారు పుస్తెల తాడును అందరూ చూస్తుండగానే ముగ్గురు యువకులు దొంగలించారు. మరుసటి రోజు హుజూరాబాద్‌లోని ఓ ఇంట్లో చోరీ జరగడంతో పోలీసులు దొంగల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గ్రామ శివారు ప్రాంతాల్లో డేరాలు వేసుకొని గ్రామాల్లో సంచార వ్యాపారాలు నిర్వహిస్తున్న మహారాష్ట్ర,ఉత్తరప్రదేశ్‌లకు చెందిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. చెల్పూర్ శివారులో ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు డేరాలు వేసుకొని గ్రామాల్లో తిరుగుతుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ ప్రాంతాలను ఖాళీ చేయాలని అక్కడున్న వారిని హెచ్చరించారు. అపరిచిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని జమ్మికుంట ఎస్సై విద్యాసాగర్ సూచించారు. -
రక్షణలో ఎస్ఈసీ సత్తా...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రక్షణ, ఏరోస్పేస్ రంగంలో ప్రత్యేక ఇంజనీరింగ్ పరికరాల తయారీలో నైపుణ్యం సొంతం చేసుకున్న ఎస్ఈసీ ఇండస్ట్రీస్‌కు విదేశీ ఆర్డర్లు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. నౌకలు, జలాంతర్గాముల తయారీలో ప్రపంచ అగ్రగామిగా ఉన్న ఫ్రాన్స్ కంపెనీ డీసీఎన్ఎస్ తమతో చేతులు కలపడం కలిసి వచ్చిందని ఎస్ఈసీ ఎండీ దొంతినేని విద్యాసాగర్ అన్నారు. డీసీఎన్ఎస్ చేపడుతున్న ప్రాజెక్టుల్లో పాలుపంచుకోవడం ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించగలిగామని ఆయన చెప్పారు. కంపెనీ ఏర్పాటై అక్టోబరుకు 60 ఏళ్లు పూర్తి కావస్తున్న సందర్భంగా సాక్షి బిజినెస్ బ్యూరోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మరిన్ని విషయాలను వెల్లడించారు. అవి ఆయన మాటల్లోనే.. ఏదైనా సాధ్యం చేస్తాం.. వ్యవసాయ పంపుసెట్ల తయారీ కంపెనీగా 60 ఏళ్ల క్రితం ప్రస్థానాన్ని ప్రారంభించాం. నేడు రక్షణ, ఏరోస్పేస్ రంగంలో ప్రత్యేకత ఉన్న హైటెక్ ఇంజనీరింగ్ పరికరాల తయారీలో నైపుణ్యం సొంతం చేసుకున్నాం. ప్రాజెక్టు ఏదైనా సరే సుసాధ్యం చేస్తాం. హైదరాబాద్‌లో మరో ప్లాంటు వచ్చే ఏడాది నెలకొల్పుతున్నాం. కేంద్రీకృత తయారీ కేంద్రంతోపాటు తీసుకున్న కాంట్రాక్టులనుబట్టి వివిధ అసెంబ్లింగ్ లైన్స్‌ను ఏర్పాటు చేస్తాం. 300 మందిని నియమించుకుంటాం. ఇక్కడ విదేశాలకు ఎగుమతయ్యే పరికరాలనే తయారు చేస్తాం. భావన(కాన్సెప్ట్) నుంచి తయారీ వరకు వన్ స్టాప్ సొల్యూషన్ అందించేందుకే కొత్త ప్లాంటును స్థాపిస్తున్నాం. నిర్ణీత గడువులోగా.. స్కార్పీన్ జలాంతర్గాముల కాంట్రాక్టును కేంద్ర ప్రభుత్వం డీసీఎన్‌ఎస్‌కు ఇచ్చింది. వీటి తయారీకి కావాల్సిన ప్రధాన భాగాల్లో 14 రకాలను మేం సరఫరా చేస్తున్నాం. కాంట్రాక్టు విలువ రూ.400 కోట్లు. గడువులోగా అంటే 2015 డిసెంబరు కల్లా సరఫరా చేస్తాం. మరో ఆరు జలాంతర్గాముల సరఫరా కాంట్రాక్టు డీసీఎన్‌ఎస్‌కు వచ్చే అవకాశం ఉంది. ఇదే జరిగితే మాకు మరోసారి రూ.400 కోట్ల కాంట్రాక్టు ఆశిస్తున్నాం. డీసీఎన్ఎస్ కోసం బాలానగర్‌లో ఉన్న ప్లాంటులో రూ.20 కోట్లతో ఫెసిలిటీ ఏర్పాటు చేశాం. డీసీఎన్ఎస్ భాగస్వామ్యంతో.. డీసీఎన్ఎస్ ఒప్పందంతో మా సంస్థ నావికా రంగంలోకి ప్రవేశించింది. రక్షణ పరికరాల తయారీలో ఉన్న ప్రపంచ ప్రముఖ సంస్థలు హైదరాబాద్ వైపు మళ్లేందుకు కారణమయ్యాం. అయితే ఇతర దేశాలకు జలాంతర్గాములను సరఫరా చేసే కాంట్రాక్టుల్లో భాగంగా బాలానగర్ ప్లాంటును కేంద్ర బిందువుగా చేసుకోవాలని డీసీఎన్ఎస్ భావిస్తోంది. వచ్చే ఏడాది నుంచి సరఫరా ప్రారంభం కానుంది. అలాగే సముద్ర అలల ఆధారంగా పనిచేసే విద్యుత్ ప్లాంట్లను ఫ్రాన్స్‌లో పెట్టే పనిలో డీసీఎన్ఎస్ నిమగ్నమైంది. ఈ ప్లాంట్లకు కావాల్సిన 50 శాతం పరికరాలను మేం సరఫరా చేయనున్నాం. వెల్లువలా కొత్త కాంట్రాక్టులు.. ట్రైలర్ మౌంటెడ్ ఎయిర్ డిఫెన్స్ యాంటెన్నా సరఫరా ప్రాజెక్టును భారత రక్షణ శాఖ ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్‌కు(ఐఏఐ) ఇచ్చింది. 300-600 కిలోమీటర్ల పరిధిలో క్షిపణుల రాకను ఇది గుర్తిస్తుంది. దేశీయంగా తొలిసారిగా ఐఏఐ, డీఆర్డీవోలు సంయుక్తంగా వీటిని రూపొందిస్తున్నాయి. ఎలక్ట్రానిక్ పరికరాలు మినహా మిగిలిన భాగాలను ఎస్ఈసీ అందిస్తోంది. మిరేజ్ 2000 ఎయిర్‌క్రాఫ్ట్‌కు క్షిపణుల సరఫరా కాంట్రాక్టు ఫ్రాన్స్‌కు చెందిన ఎంబీడీఏ కైవసం చేసుకుంది. ఈ కంపెనీకి ఎయిర్‌బోర్న్ పరికరాలను అందించనున్నాం. ఇక మీడియం మల్టీ రోల్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌కు కావాల్సిన పరికరాలను అందించే అవకాశాన్ని చేజిక్కించుకోనున్నాం.