సీనియర్ నటి మీనా భర్త విద్యాసాగర్(48) హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. శ్వాసకోశ సమస్యతో బాధ పడుతున్న ఆయన చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందారు. కాగా, ఆయన మృతిపై ఇప్పుడు పలు అనుమానాలు మొదలయ్యాయి. పావురాల వ్యర్థాల నుంచి వచ్చిన గాలిని పీల్చడం వల్లే విద్యాసాగర్ మృతి చెందాడని స్థానిక మీడియాలో వార్తలు వెలుబడుతున్నాయి. మీనా ఫ్యామిలీ మొత్తానికి గతంలో కరోనా సోకింది. కోవిడ్ నుంచి కోలుకున్నప్పటికీ... విద్యాసాగర్ కొన్ని నెలలుగా పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్నాడు.
(చదవండి: సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్న నాజర్!, కారణం ఇదేనా?)
పోస్ట్ కోవిడ్ సమస్యలు మాత్రమే ఆయన మృతికి కారణం కాకపోవచ్చని, పావురాల వ్యర్థాల నుంచి వచ్చిన గాలిని పీల్చడం వల్లే శ్వాసకోశ సమస్య రెట్టింపై ప్రాణాంతకంగా మారిందని స్థానిక మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మీనా ఫ్యామిలీ నివాసం ఉండే ఇంటికి సమీపంలో పావురాలు ఎక్కువగా ఉంటాయి. వాటికి విద్యాసాగర్ తరచూ దానా వేస్తూ అక్కడే గడిపేవాడట.
కోవిడ్ సోకిన సమయంలో విద్యాసాగర్ ఊపిరితిత్తులు పాడైపోయినట్లు వైద్యులు గుర్తించారు. ఊపిరితిత్తుల మార్పిడి చేయించాలని వైద్యులు సూచించినప్పటికీ..దాతలు దొరక్కపోవడంతో విద్యాసాగర్ మృతి చెందినట్లు తెలుస్తోంది. మీనా, విద్యాసాగర్‌ల వివాహం 2009లో జరిగింది. వీరికి ఒక పాప. పేరు నైనిక. దళపతి విజయ్ హీరోగా వచ్చిన తేరీ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది.
పావురాల వ్యర్థాల నుంచి వచ్చిన గాలిని పీల్చడం వల్లే విద్యాసాగర్ మృతి చెందాడన్న వార్తల నేపథ్యంలో డాక్టర్ శ్రీలక్ష్మి(పల్మనాలజిస్ట్, అమోర్ హాస్పిటల్స్) ఈ విధంగా స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment