సూర్యాపేట జిల్లా: నల్లగొండలో పోలీస్ రాజ్యం నడుస్తోందని ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి(Jagadish Reddy)విమర్శించారు. పాలన ఇలానే కొనసాగితే తిరుగుబాటు తప్పదని ఆయన హెచ్చరించారు. అసలు మున్సిపాలిటీలో కాంగ్రెస్ నాయకులకు ఏం పని అని జగదీష్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ రహిత తెలంగాణ కోసం నల్లగొండ(Nalgonda) నుండే ఉద్యమం మొదలవుతుందని వార్నింగ్ ఇచ్చారు.
ఈరోజు(మంగళవారం) సూర్యాపేటలో ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.‘ ఇక్కడ పోలీస్, కాంగ్రెస్ గుండాల రాజ్యం నడుస్తుంది. మంత్రి వెంకట్‌రెడ్డికి కేటీఆర్ ఫోబియా పట్టుకుంది. కేటీఆర్ ఫోటో, గులాలీ రంగు చూసినా వెంకట్‌రెడ్డికి భయమైపోతుంది. కాంగ్రెస్‌ఫ్లెక్సీలను వదిలి కావాలనే మున్సిపాలిటీ అధికారులు బీఆర్‌ఎస్ ఫ్లెక్సీలు చించేశారు. మంత్రి వెంకట్‌రెడ్డి సోయిలో లేకుండా ఇచ్చిన ఆదేశాలను అధికారులు అమలు చేస్తున్నారు. వెంకట్‌రెడ్డి మాటలు విని డ్యూటీ చేస్తే ఇబ్బందులు తప్పవు. భూపాల్‌రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు. గ్రామ సభల్లో కాంగ్రెస్ నిజ స్వరూపం బయటపడుతుంది. కాంగ్రెస్ నాయకులు చెప్పినట్లుగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు.జాబితాలో అర్హుల పేర్లు లేకపోవడంతో ప్రజలు తిరగబడుతున్నారు’ అని జగదీష్‌రెడ్డి స్పష్టం చేశారు.
నల్లగొండ మున్సిపాలిటీ వద్ద ఉద్రిక్తత
నల్లగొండ మున్సిపాలిటి(nalgonda municipality) వద్ద బీఆర్‌ఎస్-కాంగ్రెస్ నాయకులు మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం కాస్తా తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. మున్సిపల్ కమిషనర్ చాంబర్‌లో బీఆర్‌ఎస్(BRS) మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, కార్యకర్తలు బైఠాయించడంతో.. కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు మున్సిపల్ కార్యాలయంలోకి ఎలా వస్తారంటూ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌ెడ్డి మండిపడ్డారు.
అదే క్రమంలో బీఆర్‌ఎస్ కార్యకర్తలపైకి దూసుకెళ్లేందుకు బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు. అయితే దీన్ని పోలీసులు అడ్డుకోవడమే కాకుండా, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డిని అరెస్ట్ చేసి అక్కడ్నుంచి తరలించారు.
అడ్డగోలుగా ప్రవర్తిస్తే ఇంటికొచ్చి కొడతాం..
నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డిపై కాంగ్రెస్(Congress) నేతలు మండిపడుతున్నారు. అడ్డగోలుగా ప్రవర్తిస్తే ఇంటికొచ్చి కొడతామని హెచ్చరించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి వ్యతిరేకంగా నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునే ప్రస్తకే లేదన్నారు. ‘పోలీసులపై కంచర్ల భూపాల్ రెడ్డి దుర్భాషలాడారు. కంచర్ల భూపాల్ రెడ్డి పదేపదే అసభ్యకరంగా మాట్లాడుతూ రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారు. ఎన్ని రోజులు ఓపిక పట్టాం ఇకపై ఉరికిచ్చి కొడతాం.కంచర్ల భూపాల్ రెడ్డి ఒక మెంటల్ కృష్ణ’అని కాంగ్రెస్ నాయకులు ధ్వజమెత్తారు.,
Comments
Please login to add a commentAdd a comment