ఫ్లోరైడ్ పాపం ఆంధ్రాపాలకులదే
నల్లగొండ రూరల్ :జిల్లా ఫ్లోరిన్ పీడిత ప్రాంతంగా మారడానికి ఆంధ్రా పాలకులే కారణమని రాష్ర్ట విద్యాశాఖమంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని చిన వెంకటరెడ్డి ఫంక్షన్‌హాల్‌లో టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో మంత్రిని ఘనంగా సన్మానించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ 1972లో జిల్లాలోని ఒకే గ్రామంలో ఫ్లోరైడ్ సమస్య ఉంటే ప్రస్తుతం జిల్లా అంతటా ఈ సమస్య నెలకొందన్నారు. రాష్ర్టంలో విద్యుత్ సమస్యను అధిగమించేం దుకు ఛత్తీస్‌ఘడ్ నుంచి కొనుగోలు చేస్తామన్నారు. అక్కడి నుంచి తెలంగాణకు కరెంట్ లైన్ ఏర్పాటు చేసేందుకు ఏడాది సమయం పట్టొచ్చన్నారు. మూడో సంవత్సరం నుంచి గృహ అవసరాలకు, వ్యవసాయానికి నిరంతరం విద్యుత్ సరఫరా చేసేందుకు అనుగుణంగా ప్రాజెక్టులు, పవర్‌ప్రాజెక్టులు నెలకొల్పుతామన్నారు. పాల న కొనసాగించేందుకు కేంద్రం 45 మంది ఐఏ ఎస్‌లను ఇచ్చిందని, వారు సరిపోయే పరిస్థితి లేదన్నారు. జిల్లా ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నామన్నారు. ఉద్యోగ కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
తీర్మానాన్ని అడ్డుకునేందుకు యత్నం
పోలవరం ముంపునకు గురవుతున్న 7 మండలాలను ఆంధ్రాలో కలపడాన్ని వ్యతిరేకిస్తూ ఇటీవల అసెంబ్లీలో తీర్మానం చేస్తే చంద్రబాబు తన ఏజెంట్లయిన ఎమ్మెల్యేల ద్వారా అడ్డుకునేందు కు ప్రయత్నించారని ఆరోపించారు. బాబు రాష్ట్రంలో ఆక్రమించిన హరిజన, గిరిజన, బడు గు బలహీన వర్గాల భూముల బండారం బయ ట పడుతుందనే టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఇబ్బం దులకు గురి చేసేందుకు కుట్ర చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర బిల్లు ఏర్పాటు సమయంలో పోలవరం ముంపు ప్రాంతాలైన కొన్ని గ్రామాలను ఆంధ్రాలో కలిపే ప్రతిపాదనను తాము వ్యతిరేకించామన్నారు. కానీ ఇలా చేయ డం వల్ల రాష్ట్ర ఏర్పాటుకు అవరోధం ఏర్పడుతుందని, రాష్ట్రం ఏర్పడిన తర్వా త సవరించుకోవచ్చని కొందరు పెద్దలు చెప్పడంతో అంగీకరించామన్నారు. కానీ ప్రస్తుతం చంద్రబాబు కుట్రతో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఏడు మండలాలను ఆంధ్రాలో కలుపుతూ ఆగమేఘాల మీద ఆర్డినెన్స్ తీసుకొచ్చారని అన్నారు. కొత్త రాష్ట్రం లో ఉన్న సమస్యలను ఏవిధంగా అధిగమించాలనే విషయమై సీఎం కేసీఆర్ వద్ద తగిన ప్రణాళిక ఉందన్నారు. తెలంగాణలో పవర్‌ప్రాజెక్టులు పెట్టుకునే అవకాశం ఉన్నా అప్పటి పాలకులు ఆంధ్రాలో పెట్టారని పేర్కొన్నారు.
మంత్రికి ఘనసన్మానం
మంత్రి జగదీష్‌రెడ్డి, భువనగిరి ఎంపీ బూరనర్సయ్యగౌడ్‌ను ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కుల సంఘాల నాయకులు ఘనంగా సన్మానించారు. యాదగిరిగుట్ట ఆలయ అర్చకులు ఆశీర్వాదం అందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వేముల వీరేశం, గొంగిడి సునీత, గాదరి కిషోర్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, నాయకులు నోముల నర్సింహయ్య, చకి లం అనిల్‌కుమార్, దుబ్బాక నర్సింహరెడ్డి, అమరేందర్‌రెడ్డి, మందడి రామంచద్రారెడ్డి, షేక్ కరీంపాష, శంకర్‌రెడ్డి, లాలునాయక్, రామచందర్‌నాయక్, అభిమన్యు శ్రీనివాస్, మైనం శ్రీనివాస్, ఫరీదొద్దీన్, పున్న గణేష్, జమాల్‌ఖాద్రి, బకరం వెంకన్న, జి. సురేందర్, బొయపల్లి జానయ్య, తదితరులు పాల్గొన్నారు.