fluoride problem
-
కరువు నేలకు జల సవ్వడి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరువుకు శాశ్వత పరిష్కారం లభించబోతోంది. కృష్ణమ్మ బిరబిరా తరలివచ్చి కరువు నేల దాహార్తిని తీర్చనుంది. దాదాపు 100 గ్రామాలను సస్యశ్యామలం చేయనున్న ఉదయసముద్రం (బ్రాహ్మణ వెల్లెంల) ఎత్తిపోతల ప్రాజెక్టులో కీలకమైన రిజర్వాయర్ నిర్మాణం పూర్తైంది. నీటిని ఎత్తిపోసే ప్రక్రియ ఇటీవలే ప్రారంభమైంది. కాల్వల తవ్వకం పనులు కొనసాగుతున్నాయి. ఆ పనులు పూర్తికాగానే కరువు నేలపై కృష్ణమ్మ ఉరకలెత్తనుంది. ఈ ప్రాంతానికి సాగునీటిని అందించటంతోపాటు భూగర్భ జలాలు పెరిగి ఫ్లోరైడ్ సమస్యకూ పరిష్కారం లభించనుంది.వైఎస్ చొరవతో ప్రాజెక్టు మంజూరునల్లగొండ, నకిరేకల్, మునుగోడు, తుంగతుర్తి నియోజకవర్గాల్లోని పలు మండలాలకు జీవనాధారమైన ఈ ప్రాజెక్టును 2007లో ఎమ్యెల్యేగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పట్టుబట్టి సాధించారు. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని ఒప్పించి మంజూరు చేయించారు. బ్రాహ్మణ వెల్లెంల గ్రామ శివారులో 2007లో ఈ ప్రాజెక్టుకు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి శంకుస్థాపన చేయగా, రూ.699 కోట్లతో 2008లో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2009లో పనులు ప్రారంభమయ్యాయి. ఉదయసముద్రం నుంచి అప్రోచ్ చానల్, సొరంగం, పంప్‌హౌస్ నిర్మాణం, మోటార్ల ట్రయల్ రన్, 486 ఎకరాల్లో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వంటి కీలక పనులు పూర్తయ్యాయి. సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల ఈ రిజర్వాయర్‌లోకి 0.302 టీఎంసీల నీటిని ఎత్తిపోసే పనులను ప్రారంభించారు. ప్రాజెక్టు పూర్తి స్వరూపం ఇదీ..ఏఎంఆర్‌పీలో భాగంగా నాగార్జునసాగర్ వెనుక జలాలు పానగల్‌లోని ఉదయ సముద్రం రిజర్వాయర్‌లోకి చేరుతున్నాయి. దాని పైభాగాన ఉన్న దండంపల్లి గ్రామం సమీపం నుంచి అప్రోచ్ చానల్ ప్రారంభమై 6.9 కిలోమీటర్ల దూరంలోని కట్టంగూరు మండలం పిట్టంపల్లి గ్రామం వద్దకు నీరు వస్తోంది. అక్కడి నుంచి 10.625 కిలోమీటర్ల పొడవున సొరంగం ద్వారా నీరు నార్కట్‌పల్లి మండలం చౌడంపల్లి గ్రామం వద్ద ఉన్న సర్జ్పూల్కు చేరుతుంది. అక్కడి నుంచి రెండు మోటార్లతో 86 మీటర్ల ఎత్తుకు పంపింగ్ చేసి 1.12 కిలోమీటర్ల పొడవున ఏర్పాటు చేసిన రెండు డెలివరీ పైపుల ద్వారా బ్రాహ్మణ వెల్లెంల రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసేలా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ప్రధాన కుడి, ఎడమ కాల్వలు, డిస్ట్రిబ్యూటరీల పనులు కొంత వరకే అయ్యాయి. వాటికి సంబంధించిన భూసేకరణ, పరిహారం చెల్లింపు, కాల్వల తవ్వకం, లైనింగ్ చేయాల్సి ఉంది. -
‘మెకానిక్’తో ఆ సమస్య అర్థమవుతుంది: మంత్రి కోమటిరెడ్డి
‘‘నల్గొండ జిల్లాలోని ఫ్లోరైడ్ సమస్యను ప్రధానంగా తీసుకుని సమాజానికి సందేశం ఇచ్చేలా రూపొందిన ‘మెకానిక్’ సినిమాని ప్రజలందరూ ఆదరించాలి. ఈ మూవీ ద్వారా ఫ్లోరైడ్ సమస్య, బాధితుల బాధలు సమాజానికి అర్థమవుతాయి. ఈ చిత్రం హిట్ అవుతుంది’’ అని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మణి సాయితేజ, రేఖ నిరోషా జంటగా ముని సహేకర దర్శకత్వం వహించిన చిత్రం ‘మెకానిక్’. ఎం. నాగమునెయ్య (మున్నా) నిర్మించిన ఈ చిత్రం రేపు (శుక్రవారం) రిలీజవుతోంది. ఈ చిత్రం ట్రైలర్‌ను కోమటిరెడ్డి వెంకటరెడ్డి రిలీజ్ చేశారు. ‘‘మా చిత్రంలో అన్ని వాణిజ్య అంశాలు ఉన్నాయి. మంచి సందేశాత్మక చిత్రం ఇది’’ అన్నారు దర్శక–నిర్మాతలు. -
నల్లగొండ ఫ్లోరోసిస్ బాధితుడు అంశల స్వామి మృతి.. కేటీఆర్ సంతాపం..
నల్లగొండ: ఫ్లోరోసిస్ బాధితుడు అంశల స్వామి శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపారు. ఫ్లోరోసిస్ విముక్తి పోరాటంలో స్వామి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. స్వామి తన గుండెళ్లో చిరస్థాయిగా గుర్తుంటారని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. గతంలో అంశలస్వామి ఇంట్లో కేటీఆర్ భోజనం చేశారు. ఆయనకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లును కూడా మంజూరు చేయించారు. My Heartfelt condolences to the family of Sri Amshala Swamy Garu who passed away today He was a fighter who championed the cause of Fluorosis victims & an inspiration to many. He will always remain close to my heart May his soul rest in peace 🙏 pic.twitter.com/wCv5DHWeGg — KTR (@KTRBRS) January 28, 2023 అంశల స్వామి బైక్ ప్రమాదానికి గురై తలకు గాాయాలు కావడం వల్ల చనిపోయినట్లు తెలుస్తోంది. ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి ఉద్యమ నాయకుడిగా గుర్తింపు పొందిన ఆయన చాలా సంవత్సరాలుగా అనేక అంశాలపై గళమెత్తి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. చదవండి: 2,391 కొత్త ఉద్యోగాలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ -
AP: రాష్ట్రంలో ఫ్లోరైడ్ తగ్గుముఖం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత మూడేళ్లలో ఫ్లోరైడ్ బాగా తగ్గుముఖం పట్టింది. రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలశాఖ అధికారులు 2018 మే, నవంబర్‌ల్లో పరీక్షలు నిర్వహించారు. ఇందులో 660 మండలాలకుగాను 133 మండలాల్లో బోర్లు, బావుల్లో ఫ్లోరైడ్ ఉన్నట్టు గుర్తించారు. అయితే అక్కడి నీరు ప్రజలు తాగునీటికి ఉపయోగించడానికి వీలుగానే ఉందని తేల్చారు. కాగా, ఈ ఏడాది నిర్వహించిన నీటి పరీక్షల్లో కేవలం 98 మండలాల్లోనే ఫ్లోరైడ్ ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టు నిర్ధారించారు. 35 మండలాల్లో ఫ్లోరైడ్ భయాలు పూర్తిగా తొలగిపోయాయి. భూగర్భ జల శాఖ రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో 1,259 బోర్లు, బావులను ప్రత్యేకంగా ఎంపిక చేసుకొని.. ఏటా ఆ నీటిలో వచ్చే మార్పులను గుర్తించేందుకు నీటి పరీక్షలు నిర్వహిస్తోంది. ప్రతి మండలంలో ఖచ్చితంగా ఒక బోరు లేదంటే బావిని నీటి నాణ్యత పరీక్షల కోసం ఎంపిక చేసుకుంటోంది. కొన్ని మండలాల్లో అక్కడి నైసర్గిక స్వరూపం, స్థానిక పరిస్థితుల ఆధారంగా రెండు, మూడింటిలో కూడా పరీక్షలు చేసింది. ఏటా వర్షాకాలం ప్రారంభానికి ముందు, ముగిశాక నవంబర్‌లో ఆ 1,259 బోర్లు, బావుల నీటిని సేకరించి, నాణ్యతను విశ్లేషిస్తోంది. ఫ్లోరైడ్ ఎంత ఉండాలంటే.. గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) అధికారుల లెక్కల ప్రకారం.. ఒక లీటరు నీటిలో ఒక మిల్లీగ్రాము, అంతకంటే తక్కువగా ఫ్లోరైడ్ ఆనవాళ్లు ఉంటే ఆ నీటిని తాగునీటికి ఉపయోగించవచ్చు. దీన్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఒక లీటరు నీటిలో 1.5 మిల్లీగ్రాముల పరిమాణంలో ఫ్లోరైడ్ ఉన్నా తాగునీటికి ఉపయోగించుకోవచ్చని సవరించింది. 1.5 మిల్లీగ్రాములకు మించి ఫ్లోరైడ్ ఉన్న నీరు తాగునీటికి పనికిరాదు. రాష్ట్ర భూగర్భ జలవనరుల శాఖ అధికారుల వివరాల ప్రకారం.. 2018లో ప్రకాశం జిల్లా దర్శి మండలం చందలూరులోని బోర్లు, బావుల్లో 1.58 మిల్లీగ్రాముల పరిమాణంలో ఫ్లోరైడ్ ఆనవాళ్లు ఉన్నాయి. తాజాగా ఆ గ్రామంలో నిర్వహించిన పరీక్షల్లో ఫ్లోరైడ్ ఒక మిల్లీగ్రాము లోపునకే పరిమితమైనట్టు గుర్తించారు. గుంటూరు జిల్లా రొంపిచర్ల మండల కేంద్రంలోని బోరుబావుల నీటిలో మూడేళ్ల కిత్రం 2.55 మిల్లీగ్రాముల పరిమాణంలో ఫ్లోరైడ్ ఉన్నట్టు గుర్తించగా.. తాజా పరీక్షల్లో ఆ గ్రామంలో ఫ్లోరైడ్ 1.90 మిల్లీ గ్రాములకు పరిమితమైనట్టు తేల్చారు. విజయనగరం జిల్లా మినహా.. భూగర్భ జల శాఖ అధికారుల తాజా గణాంకాల ప్రకారం.. విజయనగరం జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య లేదు. రాష్ట్రంలో మిగిలిన 12 జిల్లాల పరిధిలో అక్కడక్కడా భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ ప్రమాదకర పరిమాణంలో ఉంది. 12 జిల్లాల్లోని 98 మండలాల పరిధిలో అత్యధికంగా అనంతపురం, వైఎస్సార్, ప్రకాశం జిల్లాల్లో ఫ్లోరైడ్ సమస్య ఉన్నట్టు తేలింది. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 21, ప్రకాశం జిల్లాలో 17, వైఎస్సార్ జిల్లాలో 15 మండలాల్లో ఫ్లోరైడ్ సమస్య ఉన్నట్టు స్పష్టమైంది. మరోవైపు.. శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కేవలం ఒక్కో మండలంలో, తూర్పుగోదావరి జిల్లాలో మూడు, విశాఖపట్నం జిల్లాలో నాలుగు మండలాల్లో ఫ్లోరైడ్ సమస్య ఉన్నట్టు తేలింది. సీమలో తగ్గి కోస్తా జిల్లాల్లో పెరుగుదల.. గత మూడేళ్ల కాలంలో రాయలసీమలో ఏకంగా 52 మండలాలు ఫ్లోరైడ్ నుంచి బయటపడినట్టు భూగర్భ జల శాఖ తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అదే సమయంలో కోస్తా జిల్లాల్లోని 17 మండలాల్లో నిర్ణీత పరిమాణం కంటే పాక్షికంగా ఫ్లోరైడ్ ప్రభావం పెరిగింది. భూగర్భ జలమట్టంలో హెచ్చుతగ్గుల కారణంగా ఫ్లోరైడ్ పరిమాణంలో మార్పులు కనిపిస్తుంటాయని అధికారులు తెలిపారు. భూమి లోతుకు వెళ్లేకొద్దీ ఫ్లోరైడ్ నీటితో కలిసి బయటకు వస్తుందన్నారు. వర్షాలు ఎక్కువగా కురిసిన సమయాల్లో తక్కువ లోతులోనే నీరు అందుబాటులో ఉండటం వల్ల ఆ నీటిలో ఫ్లోరైడ్ శాతం తక్కువగా ఉంటుందని వివరించారు. -
‘భగీరథ’ ప్రయత్నం.. ఫ్లోరైడ్ మాయం
సాక్షి, హైదరాబాద్: అంగవైకల్యం.. అంతుపట్టని అనారోగ్యం.. మరుగుజ్జుతనం.. బుద్ధిమాంద్యం.. వయసు తగ్గట్టుగా ఎదగని శరీరం.. ఇవి ఫ్లోరైడ్ బారిన పడిన వారి ఆనవాళ్లు. ఫ్లోరైడ్ రక్కసి కాటుకు బలైన కుటుం బాలెన్నో.. జీవచ్ఛవాలుగా బతుకులీడ్చినవారెందరో.. ఇది ఒకప్పుడు. మరిప్పుడో? దాని పీడ విరగడైంది. ఇప్పుడు ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా తెలంగాణ మారింది. దాని కోసం ‘భగీరథ’ప్రయత్నమే చేయాల్సి వచ్చింది. తెలంగాణలో ఫ్లోరైడ్ పీడిత గ్రామాల్లేవని పార్లమెంటు సాక్షిగా కేంద్రం తాజాగా ప్రకటించింది. ఈ రక్కసి బారిన పడి అల్లాడుతున్న 967 ఆవాసాలకు ఊరట కలిగింది. ‘మిషన్ భగీరథ’పథకం ప్రవేశపెట్టడానికి ముందు.. అంటే 2015 ఏప్రిల్ ఒకటి నాటికీ రాష్ట్రంలో 976 ఫ్లోరైడ్ ప్రభావిత ఆవాసాలుండగా.. గత నెల ఒకటో తేదీ నాటికీ ఈ సంఖ్య సున్నాకు చేరుకుంది. ఫ్లోరోసిస్ ప్రభావిత ప్రాంతాలకు మిషన్ భగీరథ కింద రక్షిత తాగునీరు అందించడంతో అది జాడ లేకుండా పోయింది. తొలిసారి దర్శిలో గుర్తింపు భూగర్భజలాల్లో తొలిసారి ఫ్లోరైడ్ ఆనవాళ్లు 1937లో ప్రకాశం జిల్లా దర్శిలో, 1945లో నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం బట్లపల్లి(పాత)లో కనిపించాయి. ప్రజలు ఈ మహమ్మారి బారిన పడకుండా కాపాడుకునేందుకు ఉపరితల నీటివనరుల సేవనమే మార్గమని శాస్త్రవేత్త డాక్టర్ ఎంకే దాహూర్ అప్పటి నిజాం ప్రభుత్వానికి నివేదించారు. ఈ మేరకు నిజాం నవాబు చర్లగూడ, ఇబ్రహీంపట్నం, పసునూరు, తంగడిపల్లి, మునుగోడు చెరువులను తవ్వించినా వర్షాభావ పరిస్థితులు, కరువుతో అవి రానురాను అడుగంటిపోయాయి. దీంతో ఫ్లోరోసిస్ భూతం ఉగ్రరూపం దాల్చింది. 1985లో బట్లపల్లిలో ప్రపంచం లోనే అత్యధిక పరిమాణం(28 పీపీఎం)లో ఫ్లోరైడ్ ఉన్నట్టు తేలింది. ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలైన మర్రిగూడ, నాంపల్లి, చండూరు, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, సంస్థాన్ నారాయణపూర్, చౌటుప్పల్, మునుగోడు మండలాల ప్రజలు అనివార్యంగా బోరుబావుల నీటినే సేవించాల్సి వచ్చింది. 2003లో పోరుయాత్రలో భాగంగా మర్రిగూడకు వచ్చిన ప్రస్తుత సీఎం కేసీఆర్.. ఫ్లోరైడ్ బాధితులను చూసి చలించిపోయారు. అధికారంలోకి రాగానే చౌటుప్పల్‌లో మిషన్ భగీరథ పైలాన్ ఆవిష్కరించి 2017 చివరి నుంచి ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాల్లో ఇంటింటికీ నల్లా ద్వారా రక్షిత మంచినీటిని అందించారు. మిషన్ భగీరథ ఫలితంగానే.. తెలంగాణ ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా మారేం దుకు మిషన్ భగీరథ పథకమే కారణమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మం త్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. తెలం గాణ ఆవిర్భావానికి ముందు కేవలం 5,767 గ్రామాలకు మాత్రమే తాగునీటి సదుపాయం ఉండేదని, ఇప్పుడు రాష్ట్రంలో 23,968 ఆవాసాలకు, 120 పట్టణాలకు మిషన్ భగీరథ రక్షిత మంచినీరందుతోందని చెప్పారు. భగీరథ నీటితో ఫ్లోరైడ్ విముక్తి మిషన్ భగీరథ నీరు రాకమునుపు ఊరంతా ఫ్లోరైడ్ నీరే శరణ్యం. ఫ్లోరైడ్ నీరు తాగి, ఒంటి నొప్పులు ఇతర సమస్యలతో బాధపడేవారు. ఇప్పుడు అలాం టి పరిస్థితి లేదు. గతేడాది నుంచి రక్షిత నీరు ఇంటింటికీ సరఫరా చేస్తున్నాం. –కొట్టం మాధవిరమేష్ యాదవ్, సర్పంచ్ తమ్మడపల్లి, మర్రిగూడ మండలం, నల్లగొండ జిల్లా ఆరోగ్యం కుదుటపడింది ఫ్లోరైడ్ వల్ల చాలామంది మా మండలంలో వికలాంగులుగా మారారు. ఈ నీరు తాగినప్పుడు కాళ్లు, చేతులకు నొప్పులు ఉండేవి. ఏ పనీ చేయలేని పరిస్థితి. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీరు ఇస్తున్నారు. అనారోగ్య సమస్యలు పోయాయి. –అల్వాల అంజయ్య, తిరుగుండ్లపల్లి, మరిగూడ మండలం -
ఫ్లోరైడ్ విముక్త ప్రాంతమదిగో...
సూడుసూడు నల్లగొండ... గుండెమీద ఫ్లోరైడ్ బండ... బొక్కలు వొంకరబోయిన బతుకుల నల్లగొండ జిల్లా... దు:ఖం వెళ్లదీసేది ఎన్నాళ్లు నల్లగొండ జిల్లా..? – కేసీఆర్ (2005లో 25 మంది ఎమ్మెల్యేలు, 5గురు ఎంపీల బృందంతో మర్రిగూడ, నాంపల్లి మండలాలలో క్షేత్రస్థాయిలో పరిశీలించి గుక్కెడు నీళ్లు కరువైన జీవితాలపై దుఃఖంతో కేసీఆర్ రాసిన పాట) ప్రతి మనిషికి మంచినీళ్లు ప్రాథమికహక్కు. గంగా, గోదావరి, కృష్ణా లాంటి జీవనదులు ప్రవహించే చోట నేటికీ మంచినీళ్లకోసం అల్లాడుతున్న ప్రజల జీవన ముఖచిత్రం నా దేశ చిత్రపటంగా కనిపిస్తుంది. ఈ దుస్థితికి గతకాలాన్నే నేరస్తునిగా నిలబెట్టాలా? ప్రజలకోసం పనిచేస్తామని రాజ్యాంగం మీద ప్రమాణంచేసిన గతకాలపు పాలకులదే ఆ నేరం అందామా? ప్రజలకు మాత్రం దోసిళ్లలోకి శుద్ధ మంచినీళ్లు రావాలన్నదే కోరిక. మంచినీళ్లు పొందటం కోసం అల్లాడిన జనాన్ని గతకాలం చూసింది. మంచినీళ్లకోసం కిలోమీటర్ల కొద్దీ నడిచి బిందెలతో మోసుకొచ్చిన మన తల్లుల బొప్పికట్టిన మాడలు చెబుతాయి. కన్నీళ్ల గోసను, మంచినీటి కోసం పడ్డ వెతలను చెబుతాయి. చెప్పుల్లేని కాళ్లతో కోసులకొద్ది దూరం నడిచిన ఆ తల్లుల పాదాలు కాయలు కాసిన కాళ్లు చారిత్రక సత్యాలను చెబుతాయి. ఈ దుస్థితికి నిలువెత్తు నిదర్శనం మా ఉమ్మడి నల్లగొండ జిల్లా. మంచినీళ్లు దొరకని కరుడుకట్టిన ఫ్లోరైడ్ జిల్లాగా దేశంలోనే పేరుపడ్డది. ఫ్లోరైడ్ అత్యధికంగావున్న జిల్లాల్లో అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో ప్రకాశం జిల్లాతోపాటు మా నల్లగొండ జిల్లాకూడా ఉంది. నీళ్లందని భూములు, గొంతుతడవని నాలుకలు మొత్తంగా మంచినీళ్లకోసం అల్లాడిన గోసకు సజీవ తార్కాణం నా నల్లగొండ పోరునేల. ఈ ప్రజలకు మంచినీళ్లు కూడా అందించలేని గతకాలపు నాయకులంతా ప్రపంచ మానవహక్కుల కోర్టుల్లో నిలబడాల్సిందే. ఈ దుస్థితి మారాలని కన్నీళ్లను నీళ్లుగా తాగే ప్రజలు మంచినీళ్ల సాక్షిగా ఎన్ని ఉద్యమాలు చేసినా, దుశ్చర్ల సత్యనారాయణ లాంటి సంఘజీవులు ఎంతెంత దుఃఖించి ఉద్యమించినా, సాక్షాత్తు ఆనాటి ప్రధాని వాజ్‌పేయి ఫ్లోరోసిస్ బాధితుల్ని కళ్లారా చూసి కరిగిపోయిన నల్లగొండ జిల్లా నీటివెతలు తీరలేదు. ఒక్క నల్లగొండ జిల్లానే కాదు ఆనాటి తెలుగు సమాజంలో నీళ్లందని వూళ్లెన్నెన్నో ఉన్నాయి. ఇది తీరని గోసగా ఉంది. ఇది గుండెల్ని పిండిచేసిన దృశ్యాలు తెలంగాణలోని ఎన్నెన్నో మారుమూల గ్రామాల్లో ఉన్నాయి. పేర్లెందుకు, కాలపట్టికలెందుకు గానీ నల్లగొండ జిల్లాలో కొన్ని ఫ్లోరోసిస్ పీడిత గ్రామాల పిల్లలకు పెళ్లి సంబంధాలు పెట్టుకోవాలంటే కూడా జంకిన స్థితి ఆనాటి కాలదుస్థితి. చెలిమల నీళ్లు తాగి దప్పిక తీర్చుకున్న తరాన్ని నా తెలంగాణ చూసింది. నా తెలంగాణ నీళ్లందని దప్పిక తీరని కోట్లమంది కన్నీళ్లవానగా నిలిచింది. రెండు దశాబ్దాల క్రితం ఏ దినపత్రిక చూసిన ఎక్కడో ఒకచోట కోసులకొద్ది నీళ్లకోసం నడిచిన తల్లుల పాదముద్రలే కనిపిస్తాయి. నల్లగొండ జిల్లాలో ఉద్యమకాలంలో కేసీఆర్ పల్లెయాత్రలు చేసుకుంటూ వూరూరా తిరుగుతున్నప్పుడు నీళ్లకోసం మునుగోడు, సంస్థాన్ నారాయణపూర్, ఫ్లోరోసిస్ పీడిత గ్రామాల ప్రజలు పడుతున్న బాధలు చూసి కన్నీళ్లు పెట్టుకుని కవితలల్లి పాటలురాసి పాడారు. అవును, నీళ్లందని వూళ్లు, మంచినీళ్లకోసం అరిచిఅరిచి ఉద్యమించి ఈ నేలపై నీళ్లధారల్ని ప్రవహింపజేసి ఇక్కడ గంగమ్మను పారించే భగీరథుని కోసం తెలంగాణ ఎదురుచూసింది నిజం. ఈ నేలపై నీళ్లను పారించే ఉద్యమ ఋష్యశృంగుని రాకకోసం నా తెలంగాణ కలవరించింది సత్యం. దీన్ని ఏ చరిత్రా కాదనలేనిది. కేసీఆర్ అటు ఉద్యమంలో గెలిచాడు. తెలం గాణ రాష్ట్రం వచ్చింది. ప్రజలు కేసీఆర్‌నే గెలిపిం చారు. ఫ్లోరోసిస్ రక్కసి నుంచి ప్రజలకు విముక్తి లభించింది. ఇపుడు తమ ఇంటిలోకి వచ్చిన స్వచ్ఛ జలాలను తమ దోసిళ్లలోకి తీసుకుని చూసుకున్నప్పుడు ఆ గంగమ్మలో కేసీఆర్ ముఖచిత్రం కనిపిస్తుంది. నీడనిచ్చిన చెట్టును, నీళ్లనిచ్చిన మనిషిని ఈ నేల మరువదు. ఇది ఒక కవి వర్ణనకాదు. ఇది ఫ్లోరోసిస్ పీడిత ప్రాంతాల ప్రజల వర్ణించలేని పరమానంద పరవశమే. ఫ్లోరోసిస్ పీడిత ప్రాంతాల్లో మంచి నీటి ఆశల జల పుట్టింది. ‘‘తెలంగాణ రాకముందు 967 గ్రామాల్లో ఫ్లోరోసిస్ విస్తరించి ఉంది. మిషన్ భగీర«థతో ఆ గ్రామాల్లో ఫ్లోరోసిస్ లేకుండా పోయిందని పార్లమెంటులో కేంద్రం ప్రకటించింది. మిషన్ భగీరథ టీమ్‌కు అభినందనలు’’ అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసిన సందేశం చదివాక అమితానందం అనిపిం చింది. ఇది తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయం. నల్లగొండ జిల్లాలో గత ఆరేండ్లుగా ఒక్క ఫ్లోరోసిస్ కేసు నమోదు కాకపోవటం తెలంగాణ ప్రభుత్వం కృషికి నిదర్శనం. కార్యసాధకుడైన కేసీఆర్ 2015 మార్చి 17న శాసనసభలో మాట్లాడుతూ ‘‘వాటర్ గ్రిడ్‌ను నాలుగు సంవత్సరాలలో పూర్తిచేస్తాము. ప్రతి గుడిసెకు, ఇంటికి ట్యాప్ ఇస్తాము. నాలుగున్నర సంవత్సరాల గడువు తరువాత తెలంగాణలో ఆడబిడ్డలు బిందెలు పట్టుకుని బజారులో కనిపించకూడదని మా ధ్యేయం. నాలుగున్నర సంవత్సరాల నాటికి ప్రతి ఇంటికి నీరు ఇవ్వకుంటే, రాబోయే ఎన్నికలలో మా పార్టీ ఓట్లు అడగదు’’ అని ధైర్యంగా ప్రకటించడం జరిగింది అన్నట్లుగానే మిషన్ భగీరథను పూర్తిచేశారు. ఫ్లోరోసిస్ భూతం ఈ నేలను వదిలివెళ్లటంతో పాలబుగ్గల పసినవ్వుల పళ్లవరుసలు పారే తెల్లటి జలపాతంలాగా మెరిసిపోతున్నాయి. మనిషి శరీరానికి పట్టిన ఫ్లోరోసిస్ తొలగించగలిగారు. ఇంటిం టికీ వచ్చిన మంచినీళ్లు ఇపుడు వొంకర్లు కొంకర్లు తిరిగిన గ్రామాలకు ఆయురారోగ్యాలనిస్తున్నాయి. ఇది ఆరోగ్యవంతమైన సమాజానికి మంచి పునాది. ఈ నేలమీద ఎగిసిన ఫ్లోరోసిస్ వ్యతిరేక ఉద్యమాలన్నింటికి ఇంటింటికీ వచ్చిన నల్లా నీళ్లతో విముక్తి లభించినట్లయ్యింది. ఇపుడు మా నల్లగొండ దేశ పీఠం మీద ఆరోగ్యకొండగా నిలుస్తుంది. తెలం గాణ పునర్నిర్మాణంలో ఇది ఒక భగీర«థమైన అడుగు. ఇదొక మంచిముందడుగు. వ్యాసకర్త : జూలూరు గౌరీశంకర్, ప్రముఖ కవి, సామాజిక విశ్లేషకులు మొబైల్ : 94401 69896 -
మనం తాగేనీరు మంచిదేనా?
లీటరు నీటిలో మెగ్నీషియం 100 మిల్లీ గ్రాముల వరకు ఉండాలి. ఆళ్లగడ్డ మండలం కందుకూరులో 126, గోస్పాడు మండలం జిల్లెల్లలో 160, చిప్పగిరి మండలం ఎర్నూరులో 184, ఆలూరులో 204, హొళగుందలో 165, ఆస్పరి మండలం హలిగేరలో 277, కల్లూరు మండలం చిన్న టేకూరులో 214, మంత్రాలయం మండలం బసాపురంలో 287, వెలుగోడు మండలం పంగిడిగూడెంలో 160, కోడుమూరు మండలం పులకుర్తిలో 151, గూడూరు మండలం నాగులాపురంలో 190, పాణ్యం మండలం గగ్గటూరులో 140 ప్రకారం మెగ్నీషియం ఉన్నట్లు స్పష్టమవుతోంది.నీటిలో కాల్షియం లీటరు నీటికి 200లోపు మిల్లీ గ్రాములు ఉండాలి. ఎమ్మిగనూరు మండలం కె.తిమ్మాపురంలో 232, మంత్రాలయం మండలం బసాపురం గ్రామంలో 432, హొళగుందలో 256, ఆస్పరి మండలం హళిగెరలో 456, అవుకులో 296, చిప్పగిరి మండలం రామదుర్గంలో 232, నంద్యాల మండలం పోలూరులో 256, వెంకటేశ్వరాపురంలో 280, పాణ్యం మండలం గోనవరంలో 360 ప్రకారం ఉన్నట్లు స్పష్టమవుతోంది. కర్నూలు(అగ్రికల్చర్): వేసవి వస్తోంది... భూగర్భ జలాలు అడుగుకు వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో నీటి నాణ్యతా ప్రమాణాలు కూడా దెబ్బతింటున్నాయి. సాధారణంగా నీటి నాణ్యతలో పీహెచ్, కరిగిన ఘనపదార్థాలు (టీడీఎస్), ఫ్లోరైడ్, మొత్తం కాఠిన్యం, నైట్రేటు, కాల్షియం, మెగ్నిషియం, క్లోరైడ్, సల్ఫేటు ప్రధానపాత్ర పోషిస్తాయి. ఇవి మోతాదు వరకు ఉంటే ఎటువంటి ప్రమాదం లేదు. అంతకు మించితేనే సమస్య. భూగర్భ జలాలు జనవరిలో 9.5 మీటర్లు ఉండగా..ప్రస్తుతం 10.25 మీటర్లకు పడిపోయాయి. జలాలు అడుగుకు వెళ్లే కొద్దీ లవణాల మోతాదు పెరుగుతుందని జలవనరుల శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. జిల్లాలోని పలు గ్రామాల్లోని నీటిలో ఫ్లోరైడ్, నైట్రేటు, క్లోరైడ్, సల్ఫేటు తదితరవన్నీ మోతాదుకు మించి ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య 14 గ్రామాలను వేధిస్తోంది. దీనిని తగ్గించుకోవడానికి నీటిని ఫిల్టర్ చేసుకోవడంతోపాటు మిక్స్డ్ వాటర్ మేనేజ్మెంటును పాటించాల్సి ఉందని భూగర్భ జలవనరులశాఖ అధికారులు çసూచిస్తున్నారు. నీటిలో ఏవేవి ఎంత మోతాదులో ఉండాలి.. ♦ నీటిలో పీహెచ్ లీటరు నీటికి మిల్లీ గ్రామలు 6.5 నుంచి 8.5 వరకు ఉండాలి. ఈ మోతాదు దాటితే పైపులకు నష్టం చేకూరుతుంది. పరిమితి దాటితే జీర్ణాశయంలోని జిగురు పొర దెబ్బతింటుంది. చర్మ వ్యాధులు కనిపిస్తాయి. ♦ లీటరు నీటికి 1 నుంచి 1.5 మిల్లీ గ్రాముల వరకు ఫ్లోరైడ్ ఉండవచ్చు. ఈ మోతాదును దాటితే దంతాలకు గారపట్టడం, ఎముకల సమస్యలు ఏర్పడటం, రోగనిరోధక శక్తి తగ్గడం, అంగవైకల్యంతో పాటు కీళ్లనొప్పులు, చిన్న వయస్సులోనే వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తాయి. ♦ మొత్తం కాఠిన్యం 200 నుంచి 600 వరకు ఉండవచ్చు. ఈ మోతాదును దాటితే నీటి సరఫరా వ్యవస్థలో/ నిర్మాణాల్లో పొరలు, పొలుసులు ఏర్పడతాయి. సబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంది. ఈ నీటిని తాగితే శరీరం బలహీనపడుతుంది. ♦ నీటిలో నైట్రేటు 45లోపు వరకు ఉండాలి. ఇంతకంటే ఎక్కువగా ఉంటే నీటి కాలుష్యం ఏర్పడినట్లు సూచన. మితయోగ్లోబిమియా అనే వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ♦ కాల్షియం 200 లోపు ఉంటే ఎటువంటి ప్రమాదం లేదు. ఇంతకంటే ఎక్కువగా ఉంటే నీటి నిర్మాణాల్లో పొరలు, పొలుసులు ఏర్పడుతాయి. గృహ అవసరాలపై అననుకూల ప్రభావం చూపుతాయి. ♦ మెగ్నీషియం 100లోపు ఉండాలి. ఇంతకంటే ఎక్కువగా ఉంటే నిర్మాణాల్లో పొరలు, పొలుసులు ఏర్పడుతాయి. గృహ అవసరాలపై అననుకూల ప్రభావం చూపుతాయి. ♦ నీటిలో క్లోరైడ్ 1000లోపు వరకు ఉండవచ్చు. ఇంతకంటే ఎక్కువ మోతాదులో ఉంటే నీరు రుచి కోల్పోతుంది. జీర్ణక్రియ వ్యాధులు ఏర్పడే ప్రమాదం ఉంది. గుండె, మూత్రపిండాల రుగ్మతలు ఉన్న వారిలో ఈ నీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ♦ నీటిలో సల్ఫేటు 400 వరకు ఉండాలి. ఇంతకంటే ఎక్కువగా ఉంటే జీర్ణకోశంలో అసౌకర్యం కలిగిస్తుంది. 19 గ్రామాల్లో మోతాదుకు మించి కరిగిన ఘన పదార్థాలు.... వివిధ గ్రామాల్లోని నీటిలో కరిగిన ఘనపదార్ధాలు మొతాదు కంటే ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. తాగు నీటిలో ఇవి 500 నుంచి 2000 వరకు, సాగు నీటిలో 2500 వరకు ఉండాలి. ఆదోని మండలంలోని పెద్దహరివణంలో 5050, కల్లుబావిలో 3334, విరుపాపురంలో 4147, మంత్రాలయం మండలం సూగూరులో 3891, సాపురంలో 4467, ఉయ్యలవాడ మండలం కాకరవాడలో 7219, ఒంటెద్దుపల్లిలో 3898, కోవెలకుంట్ల మండలం వల్లంపాడులో 9645, పొటిపాడులో 10170, సంజామల మండలం యగ్గోనిలో 4755, కమలాపురిలో 8666, ఆలూరు మండలం మొలగవెల్లికొట్టాలలో 8915, గూడూరులో 2778, హాలహర్వి మండలం చింతకుంటలో 4352, నందికొట్కూరులో 4186, బనగానపల్లె మండలం అప్పలాపురంలో 4915, నంద్యాల మండలం వెంకటేశ్వరాపురంలో 5786, సి.బెళగల్ మండలం పోలకల్‌లో 5901, దైవందిన్నెలో 12461 ప్రకారం ఉన్నట్లు స్పష్టమవుతోంది. 14 గ్రామాల్లో ఫ్లో‘రైడ్’ నీటిలో ఫ్లోరైడ్ లీటరు నీటికి 1 నుంచి 1.5 మిల్లీ గ్రాముల వరకు ఉండవచ్చు. కల్లూరు మండలం పెద్దపాడులో 3.46, పర్లలో 3.36, మంత్రాలయం మండలం చిన్నకొప్పెర్లలో 3.7, గుంటుపల్లిలో 4.0, గొల్లపల్లిలో 3.3, కోవెలకుంట్ల మండలం వెలగటూరులో 5.5, రేవనూరులో 2.25, ఆదోని మండలం పెద్దహరివాణంలో 3.90, సి. బెళగల్ మండలం పోలకల్‌లో 5.0, కోసిగి మండలం కందుకూరులో 2.30, కోడుమూరు మండలం ప్యాలకుర్తిలో 2.57, పెద్దకడుబూరు మండలం జాలవాడిలో 2.91, నందవరం మండలం కనకవీడులో 2.82, మిడుతూరు మండలం ఖాజీపేటలో 2.0 మిల్లీ గ్రాముల ప్రకారం ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఫ్లోరైడ్ ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నైట్రేట్ ప్రభావం ఎక్కువగా ఉన్న గ్రామాలు 13... నీటిలో నైట్రేటు లీటరు నీటికి 45 మిల్లీ గ్రామాలు లోపు వరకే ఉండాలి. గోస్పాడు మండలం జిల్లెల్లలో 69, ఎం.కృష్ణాపురంలో 86, సి.బెళగల్ మండలం కొండాపురంలో 80, కౌతాళం మండలం బదినేహాల్‌లో 97, పాణ్యం మండలం మద్దూరులో 86, మంత్రాలయం మండలం మాలపల్లిలో 85, హాలహర్వి మండలం చింతకుంటలో 93, ఉయ్యాలవాడ మండలం రూపనగుడిలో 91, అవుకు మండలం చనుగొండ్లలో 105, ఉప్పలపాడులో 96, దొర్పిపాడులో మండలం గోవిందిన్నెలో 75, ఎమ్మిగనూరు మండలం సిరాళదొడ్డి గ్రామంలో 52, ఆస్పరి మండలం హొలగొందలో 65 వరకు ఉన్న పరీక్షల్లో స్పష్టమవుతోంది. క్లోరైడ్ ప్రభావం ఇలా ఉంది... నీటిలో క్లోరైడ్ లీటరు నీటికి 1000 మిల్లీ గ్రాములు ఉండాలి. కోవెలకుంట్ల మండలం గుళ్లదుర్తిలో 1250, పెద్దకొప్పుర్లలో 1070, ఆస్పరి మండలం హళిగేరలో 1020, హలహర్విలో 1050, చిప్పగిరి మండలం రామదుర్గంలో 1030, గోస్పాడు మండలం జిల్లెల్లలో 1010, కౌతాళం మండలం రౌడూరులో 1050, కోవెలకుంట్ల మండలం పొటిపాడులో 1060, ఆదోని మండలం కల్లుబావిలో 1070, గూడూరు మండలం నాగలాపురంలో 1110 ప్రకారం ఉన్నట్లు స్పష్టమవుతోంది. మొత్తం కాఠిన్యత ఎక్కువగా ఉన్నప్రాంతాలు ఇవే(హర్డ్నెస్) నీటిలో మొత్తం కాఠిన్యత లీటరు నీటికి 200 నుంచి 600 మిల్లీగ్రాములు వరకు ఉండాలి. పాణ్యం మండలం వద్దుగండ్లలో 1019, ఆస్పరి మండలం హలిగేరలో 2280, ఉయ్యాలవాడ మండలం బోడెమ్మనూరులో 1658, కోవెలకుంట్ల మండలం గుళ్లదుర్తిలో 1398, గూడూరులో 1001, మంత్రాలయం మండలం బసాపురంలో 2261, గోస్పాడు మండలం జిల్లెల్లలో 1040, హొళగొందలో 1320, పాణ్యం మండలం గోనవరంలో 1380 ప్రకారం ఉన్నట్లు స్పష్టమవుతోంది. 15 గ్రామాల్లోని నీటిలో మోతాదుకు మించి పీహెచ్ .. నీటిలో పీహెచ్ 6.5 నుంచి 8.5 వరకు ఉండవచ్చు. అయితే పలు ప్రాంతాల్లో 9 కంటే ఎక్కువగా ఉండటం గమానార్హం. జిల్లాలో గరిష్టంగా లీటరు నీటికి 10 మిల్లీ గ్రాములు ఉండటం గమానార్హం. ఇటువంటి నీరు తాగడానికి, సాగుకు పనికిరాదు. చాగలమర్రి మండలం ముత్యాలపాడులో 9.1, గోస్పాడులో 9.2, కోవెలకుంట్లలో 9.1, పెద్దకొప్పుర్లలో 9.1, వెలగటూరులో 8.9, రుద్రవరంలో 9.7, రుద్రవరం మండలం ఎర్రగుడిదిన్నెలో 9.9, అవుకు మండలం ఉప్పలపాడులో 10, మిడుతూరులో 10, తుగ్గలి మండలం పగిడిరాయిలో 8.9, ఉయ్యలవాడ మండలం కాకరవాడలో 9.2, సంజామల మండలం నొస్సంలో 9.7, హాలహర్విలో 9, ఎమ్మిగనూరు మండలం దైవందిన్నెలో 9, వెలుగోడు మండలం పంగిడిగూడెంలో 8.9 ప్రకారం పీహెచ్ ఉన్నట్లు స్పష్టమవుతోంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే మేలు నీటిలో లవణాలు ఇతర అన్ని రకాల గుణాలు.. మోతాదు వరకు ఉంటే మంచిది. అటువంటి నీరు తాగడానికి, సాగుకు అనువుగా ఉంటుంది. నీటిలో ప్రధానంగా 9 రకాల గుణాలు ఉంటాయి. ఇవి మోతాదుకు మించితే నష్టమే. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మోతాదుకు మించినపుడు మిక్స్డ్ వాటర్ మేనేజ్మెంటు విధానం పాటించాలి. అంటే భూగర్భ జలాలకు ఉపరితల జలాలను కలిపి వినియోగించుకుంటే వీటి తీవ్రతను కొంత వరకు తగ్గించుకోవచ్చు. వివిధ గ్రామాల్లో ప్లోరైడ్ ప్రభావం ఉన్నట్లు స్పష్టమవుతోంది. దీనిని తగ్గించుకోవడానికి ఫిల్టర్ చేసుకోవాలి. భూగర్భజలశాఖ నీటి నాణ్యత ప్రమాణాలపై పరీక్షలు నిర్వహించి సంబంధిత శాఖల అధికారులకు పంపుతున్నాం. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత సంబంధిత శాఖలపైనే ఉంది.– రఘురామ్, డీడీ, భూగర్భ జల శాఖ, కర్నూలు -
జాడలేని ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రం
సాక్షి, నల్లగొండ: దక్షిణ భారతదేశంలోని ఫ్లోరోసిస్ బాధితుల ఆరోగ్యం కోసం 2008–09లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రాంతీయ పరిశోధన కేంద్రం కార్యరూపం దాల్చే అవకాశాలు కనిపించడం లేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లా చౌటుప్పల్ ప్రాంతంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని తలపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం 8 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించింది. కానీ, ఈ ఏడాది జూన్ 26వ తేదీన ‘ఫ్లోరోసిస్ ప్రాంతీయ పరిశోధన కేంద్రం మా పరిధిలోకి రాదు అందుకే నిధులు కేటాయించలేదు..’ అని కేంద్ర ఆరోగ్య శాఖ తేల్చేసింది. మరి ఇప్పటి దాకా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు, రాష్ట్ర ప్రభుత్వం 2014లో చౌటుప్పల్‌లో కేటాయించిన 8 ఎకరాల స్థలం దేనికోసం, ఎవరికోసమన్న ప్రశ్నలు వస్తున్నాయి. దీంతో కేంద్రం ప్రభుత్వం తెలంగాణపై చిన్నచూపు చూపుతోందన్న విమర్శలకు బలం చేకూరుతోంది. దక్షిణభారత రాష్ట్రాలకు ఉద్దేశించిన ప్రాంతీయ ఫ్లోరోసిస్ పరిశోధన కేంద్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.100 కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించింది. అయినా ఇప్పటి వరకు రీసెర్చ్ సెంటర్ శంకుస్థాపనకు నోచుకోలేదు. నిరాశేనా ! తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాల్లో ఫ్లోరోసిస్ పరిశోధన కేంద్రాల ఏర్పాటుకు గతంలోనే కేంద్రం ఆమోదముద్ర వేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, పాండిచ్చేరి, గోవా, అస్సాం, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల కోసం నల్లగొండలో రూ.100 కోట్లతో ‘రీజనల్ ఫ్లోరోసిస్ మిటిగేషన్ రీసెర్చ్ సెంటర్ (ఆర్.ఎఫ్.ఎం.ఆర్.సి) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించినా ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు. సరికదా తాజాగా, అసలు ఆ కేంద్రం తమ పరిధిలోకి రాదని, అందుకే బడ్జెట్ ఇవ్వలేమని కేంద్ర ఆరోగ్య శాఖ బాంబు పేల్చింది. ఉమ్మడి రాష్ట్రంలోనే నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సహకారంతో చౌటుప్పల్ మండలంలోని దండుమల్కాపురంలో పరిశోధన కేంద్రం ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టును 100 నుంచి 250 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కేంద్రంలో భాగంగా తొలుత 20 పడకలతో ఆసుపత్రి నిర్మిచాల్సి ఉంది. కాగా, ఇప్పటికీ చౌటుప్పల్‌లో ఈ కేంద్రం ఏర్పాటు అతీగతీ లేదు. జిల్లాలో రమారమి 2 లక్షల మంది దాకా ఉన్న ఫ్లోరోసిస్ బాధితులకు ఈ కేంద్రం వల్ల ప్రయోజనం చేకూరుతుందేమోనని ఆశపడినా.. వారికి నిరాశే మిగిలింది. మంజూరైతే చేసింది కానీ, కేంద్ర ప్రభుత్వానికి మొదటి నుంచి ఈ రిసెర్చ్ సెంటర్ ఏర్పాటుపై చిత్తశుద్ధి లేదన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. ఇక, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఇతర సాగునీటి ప్రాజెక్టుల వల్ల ఫ్లోరైడ్ సమస్య దూరమవుతుందన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పరిశోధన కేంద్రంపై దృష్టిపెట్టలేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాజకీయాలు పక్కన పెట్టండి గత ప్రభుత్వంలో కేంద్ర ఆరోగ్యమంత్రి హో దాలో జె.పి.నడ్డా ఇస్తామన్న ఫ్లోరోసిస్ భాదితుల ప్రత్యేక దవాఖాన, తెస్తామన్న ఫ్లోరోసిస్ రిసేర్చ్ సెంటర్ మీద కేంద్ర ప్రభుత్వాన్ని ఆర్టీఐ కింద వివరాలు అడిగితే ‘మా పరిధి లోని అంశం కాదు అందుకే నిధులు కేటాయించట్లేదు‘ అని తెలిపింది. తెలంగాణలో అత్యంత ముఖ్యమైన ఫ్లోరోసిస్ బాధితుల సంక్షేమం మీద రాజకీయాలు పక్కకు పెట్టి కేంద్రం ఆలోచించాలి. హాస్పిటల్, రిసెర్చ్ సెంటర్ వెంటనే ఏర్పా టు చేయాలి. – సుధీర్, అధ్యక్షుడు, ఎన్ఆర్ఐ ఫౌండేషన్ -
పల్లెల పాలిట మరణశాసం ఫ్లోరోసిస్
జన ప్రాణాధారమైన జలమే మరణశాసనాన్ని లిఖిస్తోంది. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాల్సిన అధికారులు, పాలకుల నిర్లక్ష్యం పల్లెల పాలిట శాపంగా మారుతోంది. మానవుల స్వార్థ పూరిత చర్యలకు ప్రకృతి సిద్ధంగా లభించే గాలి, నీరు కలుషితంగా మారుతోంది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రధానంగా మెట్ట ప్రాంతాల్లో నానాటికి పెరుగుతున్న భూతాపం నేపథ్యంలో భూమి అంతర్గత పొరల్లో మార్పులు సంభవిస్తున్నాయి. భూమి పొరల స్వరూపాలు కోల్పోయి సహజ మినరల్స్ శాతం అతిగా పెరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటిలో ఫ్లోరైడ్ శాతం పెరగడంతో ప్రాణాంతకమవుతోంది. సాంకేతిక విప్లవం కొత్త పుంతలు తొక్కుతున్న నేటి పరిస్థితుల్లో ఫ్లోరోసిస్ మానవాళి ఆయష్షుకు ప్రతిబంధకం అవుతోంది. వింజమూరు మండలంలోని శంఖవరంలో ఏడాదికి కనీసం పది మంది కిడ్నీ సంబంధిత వ్యాధులతో కాలం చేస్తున్నారు. వందల సంఖ్యలో జనం కీళ్లు, కిడ్నీ వ్యాధులతో దుర్భర జీవనం సాగిస్తున్నారు. నెల్లూరు, వింజమూరు: మండలంలో ఫ్లోరైడ్ పీడితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాగేనీటిలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా పెరగడంతో ఆ నీటిని తాగుతున్న జనం కీళ్ల, కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాల్సిన పాలకులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మండలంలోని శంఖవరం, వెంకటాద్రిపాళెం, ఎ.కిస్తీపురం, నందిగుంట ఎస్సీ కాలనీ, తక్కెళ్లపాడు, రావిపాడు, గోళ్లవారిపల్లి, చౌవటపల్లిలో తాగునీటిలో 1.5 శాతం కంటే ఎక్కువగా ఫ్లోరిన్ ఉందని ఆర్డబ్ల్యూఎస్ అధికారులే గుర్తించారు. అయితే ఆయా గ్రామాల ప్రజలకు సురక్షిత తాగునీటిని అందించేందుకు అధికారులు, పాలకులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలకు ప్రాణసంకటంగా మారింది. నీటి పథకాలు సరే..ఫ్లోరైడ్ నియంత్రణ శూన్యం మండలంలోని పలు గ్రామాల్లో ఫ్లోరైడ్ సమస్య ఉన్నట్లు గుర్తించిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు నీటి పథకాలు ఏర్పాటు చేశారు. శంఖవరంలో ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ క్వాలిటీ ఫండ్ కింద అధునాతన వాటర్ ప్లాంట్ మంజూరైంది. మిగతా 7 గ్రామాల్లో రూ.6.4 లక్షల నిధులతో ఒక్కో వాటర్ ప్లాంట్ మంజూరు చేశారు. అయితే ఇవి అందుబాటులోకి వచ్చినా నీటిలో ఫ్లోరైడ్ నియంత్రణ జరగకపోవడంతో ఫ్లోరోసిస్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఎముకలు, కీళ్లు బలహీనపడి తక్కువ వయస్సులో నడుము వంగి వృద్ధాప్య లక్షణాలు వస్తున్నాయి. కొంత మంది పూర్తిగా నడవలేక కర్ర సాయంతోనూ, జోగాడుతున్నారు. ప్రతి గ్రామంలోనూ కిడ్నీవ్యాధిగ్రస్తుల సంఖ్య పదుల్లో ఉంది. వీరంతా నెల్లూరుకు ప్రతి మూడు రోజులకు ఒకసారి వెళ్లి డయాలసిస్ చేయించుకుంటున్న పరిస్థితి నెలకొంది. గత పదేళ్ల కాలంలో ఒక్క శంఖవరం ఎస్సీ కాలనీలోనే కిడ్నీ వ్యాధితో 38 మంది మృత్యువాత పడ్డారు. వీరంతా గతంలో చేతి పంపుల్లోని ఫ్లోరైడ్ నీరు తాగడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. మండలంలో ఫ్లోరైడ్ ఉన్న 8 గ్రామాల్లో ఏడాదికి కనీసం పది మంది మరణిస్తున్నారు. ఫ్లోరైడ్ పీడత గ్రామాలు పెరిగే అవకాశం మండలంలో ఇప్పటికే 8 గ్రామాల్లో ఫ్లోరైడ్ సమస్య ఉన్నట్లు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు గుర్తించారు. కొన్ని దశాబ్దాల కాలంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో వర్షపాతం శాతం గణనీయంగా పడిపోయాయని, భూగర్భ జలమట్టాలు పడిపోవడంతో పాటు భూమి పొరల్లో సంభవించిన మార్పుల నేపథ్యంలో సహజ సిద్ధంగా లభిస్తున్న తాగునీటిలో మినరల్స్ శాతాలు పెరుగుతున్నాయిన చెబుతున్నారు. ఇంకా చాలా గ్రామాల్లో నీటి పరీక్షలు జరిపితే ఫ్లోరైడ్ పీడిత గ్రామాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చెబుతున్నారు. 42 ఏళ్ల వయస్సులో జోగాడుతూ.. ఈమె పేరు బక్కా హజరత్తమ్మ. వయస్సు 42 ఏళ్లు ఫ్లోరైడ్‌తో రెండు కాళ్లూ నాలుగేళ్ల క్రితం నుంచి పని చేయలేదు. అప్పటి నుంచి జోగాడుతుంది. వికలాంగురాలై పింఛనుతో బతుకుతోంది. ఈ కుటుంబంలో ముగ్గురు కిడ్నీ వ్యాధితో మృతి చెందారు. ఇల్లు విడిచి బయటకు రాలేని పరిస్థితి. తన పనులు కూడా తాను చేసుకోలేని పరిస్థితి. 10 ఏళ్ల క్రితం వరకు ఈమె రోజూ కూలి పనులకు వెళ్లేది. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఇలా మారింది. ఊతకర్ర సాయంతో.. ఈతని పేరు మాతంగి పెంచలయ్య. వయస్సు 47 సంవత్సరాలు. కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే వాడు. ఇప్పుడు అతను ఊత కర్ర సాయం లేనిదే నడవలేని పరిస్థితి. తాగునీటి వల్లేనని డాక్టర్లు చెప్పారు. ముగ్గురు బిడ్డలు. వారిని ఇంకా చదివించాలి. కాని పని చేయలేక వారిని కూడా ఏదో ఒక కంపెనీలోకి పంపించాలను కుంటున్నాడు. కుటుంబాన్ని పోషించాల్సిన తాను తన కుటుంబానికి భారమైనట్లు కన్నీటి పర్యంతమవుతున్నాడు. కాళ్లు వాపులొచ్చాయి నాకు 40 ఏళ్ల వయస్సు. నేను సంవత్సరం నుంచి కాళ్లు వాచి నడువలేక బాధపడుతున్నాను. ఆస్పత్రుల చుట్టూ తిరిగాను. సుమారు రూ.30 వేలు ఖర్చు పెట్టాను. నా భర్త కూలికి వెళ్లి తెచ్చిన డబ్బులు నాకు వైద్యానికి సరిపోతున్నాయి.– విజయమ్మ, శంఖవరం ఎస్సీ కాలనీ -
మోదీపై ‘ప్రకాశం’ వాసుల పోటీ
సాక్షి, పామూరు: ప్రకాశం జిల్లాలోని పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ ఆవశ్యకతను, ఫ్లోరైడ్ సమస్యను జాతీయస్థాయిలో వినిపించేందుకు ఆ జిల్లాకు చెందిన ఇద్దరు సోమవారం వారణాసిలో ప్రధాని నరేంద్రమోదీపై పోటీగా నామినేషన్ దాఖలు చేశారు. పామూరు మండలం బొట్లగూడూరు గ్రామానికి చెందిన.. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ సాధన సమితి అధ్యక్షుడు వడ్డె శ్రీనివాసులు మధ్యాహ్నం 2.30 గంటలకు నామినేషన్ దాఖలు చేశారు. అలాగే సమితి సభ్యుడు, బ్రాహ్మణ అర్చక పురోహిత విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొల్లూరి వెంకట రవికిరణ్‌శర్మ సాయంత్రం 5.30 గంటలకు నామినేషన్ దాఖలు చేశారు. (చదవండి: వారణాసిలో పసుపు రైతుల నామినేషన్లు) అనంతరం శ్రీనివాసులు, రవికిరణ్ శర్మ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం, ప్రకాశం జిల్లా నేతలు వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని చిన్న చూపు చూసిందని పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లోని 29 మండలాల్లో 15 లక్షల మందికిపైగా తాగునీరు, 4.50 లక్షల ఎకరాలకు సాగు నీటి ఇబ్బందులు తీరతాయన్నారు. ఫ్లోరైడ్ బాధితుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆదుకోవడంతోపాటు సమస్యల పరిష్కారం కోసం తాము మోదీపై వారణాసిలో నామినేషన్ వేసినట్లు తెలిపారు. -
నిప్పు రాజేసిన నీళ్లు
ఏదైనా సమస్యను ప్రజల దృష్టికి, మీడియా దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటే.. ఆ సమస్య పరిష్కారం కోసం సాగిస్తున్న ఉద్యమం.. ఉద్యమ ఎత్తుగడలు ఎంతో ముఖ్యం. సరిగ్గా ఈ సూత్రం ఆధారంగానే ప్రపంచ వ్యాప్తంగా ఫ్లోరైడ్ పీడకు చిరునామాగా.. పర్యాయపదంగా నిలిచిన నల్లగొండ దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలను ఉలిక్కిపడేలా చేసింది. సాగునీటి కోసం అల్లాడిన రైతులు.. తాగునీరు లేక ఎండిన గొంతులు.. ఫ్లోరైడ్ విషపు నీరుతాగి జీవాన్ని కోల్పోయిన బాధితులు.. వెరసి అతి సామాన్యులు అసామాన్యంగా పోరాడి తెగువ చూపారు. నల్లగొండ జిల్లాకు జరిగిన జల వివక్షపై ఎనభయ్యో దశకంలో జిల్లాలో ఉవ్వెత్తున ఎగిసిన జల పోరాటం పార్లమెంటు ఎన్నికలను వేదికగా మార్చుకుంది. సాగునీటి విషయంలో జిల్లాకు జరిగిన అన్యాయాన్ని ఎత్తిచూపుతూనే.. తాగు, సాగు నీటి కోసం, ఫ్లోరైడ్ శాప విముక్తి కోసం సామాన్యులే సైనికులుగా సాగిన ‘జల సాధన సమితి’ ఉద్యమం చేపట్టిన కార్యక్రమాలు, ఆచరించిన వ్యూహాలు దేశం దృష్టిని ఆకర్షించాయి. పోస్టు కార్డుల ఉద్యమాలు, మనీయార్డర్లు, పాదయాత్రలు వంటి రూపాలతోపాటు ‘మాస్ నామినేషన్లు’ సంచలనం సృష్టించాయి.-ఎన్.క్రాంతీపద్మ /నల్లగొండ ఏం జరిగిందంటే.. జల వివక్షను వివరించడం, న్యాయమైన పరిష్కారాన్ని కనుగొనడం ధ్యేయంగా జలసాధన సమితి ఉద్యమిస్తున్న రోజులవి. సమితి వ్యవస్థాపకుడు దుశ్చర్ల సత్యనారాయణ నేతృత్వంలో వాస్తవానికి 1994లోనే మాస్ నామినేషన్లు వేస్తామని ప్రకటించినా.. అప్పటికి తాత్కాలికంగా ఆ నిర్ణయాన్ని వాయిదా వేశారు. 1996 ఎన్నికలు మాత్రం ఇందుకు వేదికయ్యాయి. దానికి ముందు నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గానికి జల సాధన సమితి నేతృత్వంలో స్వతంత్ర అభ్యర్థులుగా భారీగా నామినేషన్లు దాఖలు చేయనున్నామని నాటి జిల్లా కలెక్టర్ నీలం సహానికి ముందుగానే నోటీసిచ్చారు. అప్పటి ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ టి.ఎన్.శేషన్‌కు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి.. ఇలా ప్రతీ ఒక్కరి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. రూ.వెయ్యిలోపే నామినేషన్ డిపాజిట్ మొత్తం ఉండడం కూడా ఉద్యమకారులకు కలిసి వచ్చింది. ఆ ఎన్నికల్లో 582 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఉద్యమకారులు, రైతులు, ఫ్లోరైడ్ బాధితులు, మహిళలు, వృద్ధులు ఇలా.. అన్ని వర్గాల వారూ నామినేషన్లు వేశారు. నామినేషన్ల పరిశీలన తర్వాత 480 మంది బరిలో మిగిలారు. పెద్దసంఖ్యలో పోటీ నెలకొనడంతో నల్లగొండ లోక్‌సభ స్థానానికి జరగాల్సిన ఎన్నిక నెల పాటు వాయిదా పడింది. ఇంతమంది అభ్యర్థులతో తయారైన బ్యాలెట్ పేపర్ ఏకంగా పుస్తకమే అయ్యింది. చివరికి ఆ ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థి బొమ్మగాని ధర్మభిక్షం ఎంపీగా గెలిచారు. ప్రభావం చూపిన వ్యూహం నాటి వ్యూహాన్నే ఈ ఎన్నికల్లో ఆర్మూరు పసుపు రైతులు అనుసరిస్తున్నారు. నిజామాబాద్ ఎంపీ స్థానానికి దాదాపు 175 మంది రైతులు నామినేషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. నాటి మాస్ నామినేషన్లతో దేశంలో పలువురు నాయకులు స్పందించారు. వారిలో బాల్‌థాకరే ఒకరు. ఏ సమస్యపై సామాన్యులు ఇంతగా తెగించి నామినేషన్లు వేశారో పూర్వాపరాలు తెలియని ఆయన.. ‘పుట్టగొడుగులెక్కన పార్టీలు పుడుతున్నాయి. అందుకే ఇన్ని నామినేషన్లు..’ అని వ్యాఖ్యానించారని చెబుతారు. మాస్ నామినేషన్ల వ్యూహకర్త, జలసాధన సమితి స్థాపకుడు దుశ్చర్ల సత్యనారాయణ ‘ఈ ఎన్నికలు నాకు తృప్తినివ్వలేదు. పదివేల నామినేషన్లు వేయించాలనుకున్నాం. కనీసం వెయ్యి నామినేషన్లు వేసి బరిలో నిలవగలిగినా ఎన్నికలు జరిగే అవకాశమే ఉండేది కాదు..’ అని తన ఆత్మకథలాంటి ‘జల సాధన సమరం’లో పేర్కొన్నారు. -
మన్నూరు..బోరు!
ఓ వైపు వాయు కాలుష్యం.. మరో వైపు కలుషిత జలం ఆ పల్లె ప్రాణాలను తీస్తోంది. శ్వాస పీల్చుకోవాలంటే క్వారీల కాలుష్యం.. దాహం తీర్చుకుందామంటే ఫ్లోరైడ్ జలమే దిక్కు. పదేళ్లగా కలుషిత నీరు వల్ల కిడ్నీ సమస్యలు వస్తున్నాయని అధికారులకు ఎన్నో దఫాలుగా మొర పెట్టుకున్నా వారి ఆవేదన అధికారుల చెవికెక్కడం లేదు. వెంకటగిరి : జిల్లాలోని బాలాయపల్లి మండలం మన్నూరు గ్రామ ప్రజలు ఫ్లోరైడ్ సమస్యతో దినగండం నూరేళ్ల ఆయుషుగా జీవిస్తున్నారు. ఆ గ్రామంలో దాహర్తి కోసం 10 బోర్లు ఏర్పాటు చేశారు. మరో వైపు ఓవర్‌హెడ్ ట్యాంక్ ఉంది. అయితే గ్రామంలో భూగర్భ జలం పూర్తిగా అడుగంటి పోవడం వల్ల బోర్లలో నుంచి మంచి నీరు కాకుండా కలుషిత నీరు వస్తుంది. ఇవి తాగిన జనం రోగాల బారిన పడి ఆస్పత్రుల్లో చేరుతున్నారు. తాగునీరు కలుషితం కారణమని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ సమస్య తీవ్రతను అధికారుల దృష్టికి తీసుకెళ్లితే ఏళ్ల తరబడి పరిష్కరించడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఒకే నెలలో కిడ్నీ సమస్యలతో 12 మంది మృతి గ్రామంలో పరిస్థితి ఎలా ఉందంటే.. ఈ ఏడాది జనవరిలో 12 మంది కిడ్నీ సమస్యతో మత్యువాత పడ్డారు. ఆ కుటుంబాలన్నీ కన్నీటిసంద్రంలో మునిగిపోయాయి. నెల వ్యవధిలోనే తక్కువ వయస్సు నుంచి నడి వయస్సు వరకు ఒకే వ్యాధితో చనిపోవడంతో ఆ గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తమ గ్రామానికి ఇంత పెద్ద సమస్య వచ్చిందనే ఆవేదనతో ఆ గ్రామస్తులు మదనపడుతున్నారు. ఈ సమస్య ఉత్పన్నం కావడానికి అధికారులే కారణమని గ్రామస్తులు ముక్తకంఠంతో మండిపడుతోంది. గ్రామంలో ఎన్నీ బోర్లు వేసినా బోర్లలో నుంచి సురక్షిత నీరు రావడం లేదని చెబుతున్నారు. కిడ్నీ సమస్యతో గ్రామస్తులు చనిపోతుండడం వల్ల తాము కూడా చనిపోతామన్న ఆందోళనతో బతుకుతున్నారు. ఇప్పటికే కిడ్నీ వ్యాధితో గ్రామానికి చెందిన జడపల్లి రఘురామయ్య, బద్వేలు కృష్ణారెడ్డి, అనపల్లి శ్రీమరిరెడ్డి, జడపల్లి సురేంద్ర, బండి పోలయ్య, ఆవుల నరసయ్య, వానా బాలకృష్ణయ్య, అనబాక శంకరరెడ్డి, ఉప్పు జయరామయ్య, ఉప్పు రఘురామయ్య, ఉప్పు చెంగమ్మ, వెంకటరమణలు మృతి చెందారు. ఈ గ్రామానికి చెందిన పలువురు డయాలసిస్ కోసం నెల్లూరు, తిరుపతి పట్టణాల్లోని ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. సుజల స్రవంతి పథకం ఏదీ మా గ్రామంలో కలుషిత నీటి వల్ల చాలా మంది కిడ్నీ వ్యాధితో మృతి చెందారు. సుజల స్రవంతి ద్వారా గతంలో హామీలు ఇచ్చిన పాలకులు నేడు ఆ పథకం ద్వారా తమకు సురక్షిత నీటిని అందించలేకపోతున్నారు. ఇప్పటికైనా తమ గ్రామంలో సురక్షిత నీటిని అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి. – జడపల్లి అపర్ణ గుక్కెడు తాగునీరు ఇవ్వాలి తమ గ్రామంలో మంచినీరు దొరకకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. గుక్కెడు మంచినీటి కోసం ఎన్ని బోర్లు వేసిన ఉపయోగం లేకుండా పోతున్నాయి. ఎన్నోసార్లు మంచినీరు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నా వారు పట్టించుకోవడంలేదు. – పచ్చూరి కవిత రెండు మినరల్ వాటర్ ప్లాంట్ల ఏర్పాటు మన్నూరుతో పాటు నాయుడు కండిగ్ర చెరువు గ్రామంలో ఫ్లోరైడ్ సమస్య ఉండడంతో వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని కోరాను. ఆయన స్పందించారు. త్వరలో ఆ గ్రామాల్లో వాటర్ప్లాంట్లు ప్రారంభిస్తాం. పదేళ్లుగా సమస్య ఉన్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఎంపీని ఆశ్రయించాం. – శింగంశెట్టి భాస్కర్‌రావు, ఎంపీపీ, బాలాయపల్లి -
కోళ్ల పరిశ్రమపై ఫ్లోరైడ్ దెబ్బ
ప్రకాశం, మార్కాపురం టౌన్: రైతులు వ్యవసాయం తరువాత ఎక్కువగా పాడి పరిశ్రమ, కోళ్ల ఫారాల నిర్వహణపై ఆసక్తి చూపుతుంటారు. ప్రస్తుతం జిల్లాలో కోళ్లఫారాల నిర్వహణ చేయలేక చేతులేత్తేస్తున్నారు. మార్కాపురం డివిజన్లో నీటిలో ఫ్లోరిన్ శాతం ఎక్కువగా ఉండటంతో కోళ్ల ఫారాల నిర్వహణ కష్టంగా ఉందని, ఈ ప్రాంతానికి వెలిగొండ ప్రాజెక్టు పూర్తయి నీరు వస్తే రైతులకు, వ్యాపారులకు కొంత మేర వ్యాపారం లాభసాటిగా మారవచ్చని పేర్కొంటున్నారు. వీటి నిర్వహణ కష్టతరంగా మారటం, ప్రకృతి నుంచి అవసరమైన సహకారం లేకపోవటం, నీటిలో ఫ్లోరిన్ శాతం ఉండటంతో కోళ్లకు రాడికల్ డిసీజెస్‌లో భాగంగా కొక్కెర వ్యాధులు వచ్చి భారీగా నష్టం వాటిల్లడం, కూలీల వేతనాల భారం, షెడ్లు, దాణా ఖర్చులు అధికం కావటంతో వీటి నిర్వహణపై ఆసక్తి కోల్పోతున్నారని పలువురు రైతులు పేర్కొంటున్నారు. డివిజన్లో బాయిలర్, లేయర్లు, నాటుకోళ్ల పెంపకం సుమారు 25 నుంచి 30 వరకు ఫారాలు ఉంటాయని పేర్కొంటున్నారు. దీనితో చికెన్ వ్యాపారులు ఇతర ప్రాంతాల నుంచి లైవ్ చికెన్ పేపర్ ధరను బట్టి కొనుగోలు చేసి విక్రయించుకుంటున్నారు. ఒక్క మార్కాపురం పట్టణంలోనే రోజుకు 600 నుంచి 1000వరకు, ఆదివారం వీటి సంఖ్య 5వేల వరకు కోళ్లను దిగుమతి చేసుకుని విక్రయాలు చేసుకుంటుంటారు. మరికొందరు చిన్నపాటి షెడ్లలో కోళ్లను నిల్వ ఉంచుకుని విక్రయానికి వినియోగించుకుంటుంటారు. కోళ్లఫారాల నిర్వహణ ఇలా... కోళ్ల ఫారం ఏర్పాటు చేసుకోవాలంటే ముందుగా షెడ్‌ను తయారు చేసుకోవాలి. లేకుంటే షెడ్‌ను సదరు యజమానులు కేజి కోడికి రూ.2 ప్రకారం ఎన్ని కోళ్లు పెంచుకుంటే అంత అద్దె చెల్లించాల్సి ఉంటుంది. కోళ్ల ఫారంలో కూలీలు జతకు నెలకు సుమారు 10వేల రూపాయల వరకు జీతంగా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే విద్యుత్, నీటి సౌకర్యంకు వాడకాన్ని బట్టి చెల్లిస్తుంటారు. బాయిలర్ కోళ్లలో పిల్ల విక్రయం నుంచి కేజికి వచ్చే నాటికి దాణా, ఖర్చుల రూపంలో 80రూ వరకు వస్తుంది. దీని ప్రకారం 2కేజీల కోడి తయారయ్యేందుకు రైతుకు 160రూ ఖర్చు అవుతుంది. లేయర్లకు అయితే పిల్ల 30రూ ధర పలుకుతుండగా, గుడ్లకు వచ్చే వరకు 4నెలల 15రోజుల సమయం పడుతుంది. అప్పటి నుంచి ఏడాది కాలం వరకు పడుతుంది. గుడ్లు పెట్టే వరకు ఒక్కొక్క కోడిపై రూ.600 ఖర్చు వస్తుందని పేర్కొంటున్నారు. దీనితో మార్కెట్ ధరను బట్టి కోడి గుడ్ల ధర హెచ్చుతగ్గులు ఉండటంతో ఒక్కొక్కసారి లాభం, నష్టాలు రావచ్చని పేర్కొంటున్నారు. లేయర్ల పెంపకం డివిజన్లోని వివిధ ప్రాంతాల్లో 3 నుంచి 4సాగులో ఉన్నట్లు సమాచారం. గుడ్లకు వచ్చే దశలో ధర తగ్గితే రైతు ఆర్ధికంగా ఇబ్బందులు పడక తప్పదని పలువురు నిర్వాహకులు పేర్కొంటున్నారు. కోళ్లకు వచ్చే వ్యాధులతో తీవ్ర నష్టం.. కోళ్ల పెంపకంలో రైతు, వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండకపోతే వ్యాధులు సోకినప్పుడు భారీగా కోళ్లు చనిపోయి నష్టం వాటిల్లే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కోళ్లకు బ్యాక్టీరియా, వైరల్, ఫంగస్, విటమిన్, మినరల్స్ లోపించినా వ్యాధులు సోకే అవకాశం ఉంది. కోళ్లు తీసుకునే నీటిలో ఫ్లోరిన్ ఉంటే వాటర్ శానిటేషన్ వాడకుంటే క్రమణే కొక్కెరవ్యాధి ప్రారంభమవుతుంది. ఆ సమయంలో అప్రమత్తం కాకపోతే కొక్కెరవ్యాధి వ్యాప్తి చెంది వందల సంఖ్యలో కోళ్లు మృతి చెందే అవకాశం ఉంటుంది. కోడి పెంపకం నుంచి విక్రయించే వరకు రెండు సార్లు వ్యాక్సిన్లను వేయాల్సి ఉంటుంది. కోళ్ల నిర్వహణలో రైతుకు, వ్యాపారికి అనుభవం ఉంటే వీటి నిర్వహణ చేయాలంటే కష్టతరంగా ఉంటుంది. ఇలా కోళ్ల పెంపకాన్ని చేపట్టిన అనేక మంది రైతులు, వ్యాపారులు ఆర్థికంగా నష్టపోయి కోళ్ల ఫోరాలు ఎత్తేసిన సంఘటనలు కూడ ఎక్కువగా ఉన్నాయి. ఇతర ప్రాంతాల నుంచి దిగుబడి ఇలా... మార్కాపురంతో పాటు పరిసర ప్రాంతాల్లోని కోళ్ల వ్యాపారులు కోళ్లను ఆరోజు మార్కెట్ ధరను బట్టి కొనుగోలు చేస్తుంటారు. మార్కాపురం పరిసరాల్లో లభించే కోళ్లతో పాటు ఇతర ప్రాంతాలైన చిత్తూరు, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, తదితర ప్రాంతాల నుంచి కోళ్లను దిగుమతి చేసుకుంటారు. మరికొందరు అధిక మొత్తంలో కోళ్లను కొనుగోలు చేసి తాత్కాలికంగా షెడ్లలో నిల్వ ఉంచుకుంటుంటారు. -
పల్లెల్లో ఫ్లోరైడ్ భూతం
బజార్హత్నూర్(బోథ్): ఫ్లోరైడ్ మహామ్మరి గిరి గ్రామాలను వణికిస్తోంది. పిల్లల నుంచి పెద్దల వరకూ వ్యాధి ప్రబలుతూ భయాందోళకు గురి చేస్తోంది. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించి హెచ్చరించినా ప్రభుత్వం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది. ప్రత్యామ్నాయంగా కొన్ని చోట్ల ఏర్పాటు చేసిన శుద్ధజల ప్లాంట్లు పనిచేయకుండా పోతున్నాయి. దీంతో సమస్య పెరుగుతుందే తప్పా తగ్గడం లేదు. ఫ్లోరైడ్‌తో పళ్లు రంగు మారుతున్నాయి. నల్లబారి వ్యాధి తీవ్రతను చూపుతున్నాయి. కొందరి పళ్లు గారలు పట్టడం, అరిగిపోవడం జరుగుతుంది. పుట్టిన పిల్లలకు ఎముకలు పెరగడం లేదు. కీళ్ల నొప్పులు, చిన్న దెబ్బకే ఎముకలు విరగడం వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ సమస్య ఏళ్ల తరబడి వేధిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఫ్లోరైడ్ ప్రభావానికి గురైన ఆ ఎనిమిది గ్రామాలు బజార్హత్నూర్ మండలంలోని చందునాయక్ తండా, మోర్కండి, ఏసాపూర్, గులాబ్‌తాండ, టెంబి, హర్కాయి, బోస్రా, భూతాయి(బి). వైద్య, ఆరోగ్య శాఖ నిర్వహించిన సర్వేలో పైన పేర్కొన్న ఎనిమిది గ్రామాల్లో ఫ్లోరైడ్ ఆనవాళ్లు అధికంగా ఉన్నట్లు తేలింది. ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడి ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో వైద్య, ఆరోగ్య శాఖ సూచనల మేరకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఆయా గ్రా మాల్లో బోర్లను సీజ్ చేశారు. సరైన పద్ధతిలో నీటి వసతిని ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారు. పడకేసిన శుద్ధజల పథకం.. చందునాయక్ తండాను ఫ్లోరైడ్ బాధిత గ్రామంగా 2009లో గుర్తించారు. దీంతో గ్రామీణ నీటి పారుదల శాఖ(ఆర్డబ్ల్యూఎస్) ఆధ్వర్యంలో రూ.10లక్షలతో హడావిడిగా శుద్ధజల ప్లాంటును ఏర్పాటు చేశారు. కాని నిర్వహణ లోపంతో అది కాస్త పని చేయకుండా పోయింది. గ్రామానికి సమీపంలో ఫ్లోరైడ్ రహిత ప్రాంతంలో గల కడెం వాగు ఒడ్డున వేసిన బోరు నిరుపయోగంగా మారింది. బోరు నుంచి శుద్ధజల ప్లాంట్ వరకూ పైపులైన్ వేయలేదు. దీంతో బోరును ఇతరులు సాగు నీటికి వినియోగిస్తున్నారు. తండాలో మొత్తం 2800 మంది జనాభాకు 60 శాతం మంది ఫ్లోరైడ్ బారిన పడిన వారే కావడం ఆందోళనకరం. ఇక్కడ మూడేళ్ల పాప నుంచి ముసలి వరకూ పళ్ళు నల్లబారి పోయి ఉంటాయి. శుద్ధజల పథకం గురించి అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. గులాబ్ తండాలో స్వచ్ఛందంగా ప్లాంటు.. వంద శాతం గిరిజనులు గల గులాబ్ తండా గ్రామంలో ప్రజలు ఫ్లోరైడ్ బారిన పడుతున్నారు. ప్రభుత్వాలు స్పందించకపోవడంతో ఈ గ్రామంలోనే పుట్టి పెరిగిన నిజామబాద్ జిల్లా డిచ్‌పెల్లి డీఎస్పీ రాథోడ్ దేవిదాస్ స్వంతంగా ఆర్వో ప్లాంటు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం షెడ్డు నిర్మాణం జరిగింది. త్వరలో మిషనరీలు ఏర్పాటు చేయనున్నారు. అందని ‘భగీరథ’ నీరు.. మండలంలోని అన్ని గ్రామాలతో పాటు ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు సైతం మిషన్ భగీరథ నీళ్లు అందడం లేదు. ఈ నీరు అందితే కొంత మేర ఫ్లోరైడ్ బారి నుంచి విముక్తి కలిగే అవకాశముంది. కాని ఇంకా అంతర్గత పైపులైన్ పనులు కూడా ప్రా రంభించలేదు. ట్యాంకుల నిర్మాణం కూడా పూర్తి కాలేదు. ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అంద డం వచ్చే ఏడాది కూడా అనుమానంగానే ఉంది. ఫ్లోరైడ్ బారి నుంచి కాపాడే మార్గం.. ప్రభుత్వ వైద్యుడు డా. హరీష్ తెలిపిన వివరాల ప్రకారం ఫ్లోరైడ్ ఆనవాళ్లు ఉన్న గ్రామాల పరిధిలో బోరు బావుల నీటిని వాడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఫ్లోరైడ్ రహిత గ్రామాల నుంచి తాగు నీటిని సరఫరా చేయాలి. నల్గొండ జిల్లాలోని ఫ్లోరైడ్ బాధిత గ్రామాల్లో నాగ్‌పూర్ యూనివర్సిటీ విద్యార్థులు నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూషన్(ఎన్ఈఈఆర్ఐ) నీరీ పద్ధతి ద్వారా ఫ్లోరైడ్ బాధితులకు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. ఆ విధానం ఇక్కడ అమలు చేస్తే తప్పా ఫ్లోరైడ్ సమస్య తీరేలా లేదు. ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఆ దిశగా ఆలోచించి ఈ ఎనిమిది గ్రామాల ప్రజలను ఫ్లోరైడ్ బాధ నుంచి తప్పించాల్సిన అవసరముంది. తాగునీటికి దూరభారమవుతుంది.. గులాబ్ తండాలో తాగు, సాగు నీటిలో ఫ్లోరైడ్ ఆనవాళ్ళు ఉన్నాయి. గతంలోనే ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మూడు బోర్లను సీజ్ చేశారు. కాని వాటికి ప్రత్యామ్నయం చూపించలేదు. దీంతో ఇతర అవసరాలకు ఈ నీటినే వాడుతున్నాం. తాగడానికి గ్రామానికి రెండు కిలో మీటర్ల దూరంలోని ఇంద్రనగర్ నుంచి కాలి నడకన ప్రతిరోజు తెచ్చుకుంటున్నాం. దీంతో దూరభారం తప్పడం లేదు. – రాథోడ్ అశోక్, గులాబ్‌తండా నీరీ పద్ధతి అమలు చేయాలి బజార్హత్నూర్ మండలంలో చందునాయక్ తండా, మోర్కండి, ఏసాపూర్, గులాబ్‌తాండ, టెంబి, హర్కాయి, బోస్రా, భూతాయి(బి) ఫ్లోరైడ్ బాధిత గ్రామాలుగా గుర్తించాం. ఈ గ్రామాల్లో చిన్న పిల్లలకు పాల పళ్ళ నుంచే ఫ్లోరైడ్ వ్యాపిస్తుంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశాం. నాగపూర్ ఎన్‌ఈఈఆర్‌ఐకు చెందిన విద్యార్థులు నీరీ పద్ధతి ద్వారా ఫ్లోరైడ్‌ను అరికట్టేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించారు. ఈ పద్ధతిలో ఫ్లోరైడ్ రహిత గ్రామల నుంచి నీటిని సరఫరా చేయాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సూచించాం. – డా.హరీష్, పీహెచ్సీ వైద్యుడు, బజార్హత్నూర్ -
పట్టిపీడిస్తున్న ఫ్లోరైడ్ రక్కసి
-
డిండి..కదలదండి!
వంగిపోయిన నడుము.. వంకర కాళ్లు.. ఎటూ కదల్లేని దైన్యం.. వైద్యం చేయించుకోలని దుర్భర జీవితం.. ఎన్నాళ్లు బతుకుతామో కూడా తెలియని కష్టం.. ఇదీ పూర్వ నల్లగొండ జిల్లాలోని ఫ్లోరైడ్ బాధితుల దుర్భర పరిస్థితి. ఈ దుస్థితికి శాశ్వత పరిష్కారం చూపేలా కృష్ణా జలాలను తరలించేందుకు ఎస్ఎల్బీసీ, డిండి ఎత్తిపోతల పథకాలకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. వాటికి శంకుస్థాపనలు కూడా చేసింది. కానీ ఏళ్లు గడుస్తున్నా ఈ ప్రాజెక్టులు ఇంకా ప్రాథమిక దశలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. అవి ఎప్పటికి పూర్తవుతాయోనని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. – సాక్షి, హైదరాబాద్ అలైన్మెంట్ కూడా తేలలేదు పాత మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని మునుగోడు, దేవరకొండ, నాగార్జునసాగర్ నియోజకవర్గాల పరిధిలో ఫ్లోరైడ్ బాధిత మండలాలకు సురక్షిత తాగునీటిని అందించేందుకు డిండి ఎత్తిపోతల పథకానికి 2015, జూన్ 11న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. రెండేళ్లలోనే ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటించారు. కానీ రెండున్నరేళ్లయినా ప్రాథమిక దశ కూడా దాటలేదు. నార్లాపూర్ నుంచి డిండికి నీటిని తరలించే అలైన్మెంట్తో కల్వకుర్తి ప్రాజెక్టు కింద 90 వేల ఎకరాల ఆయకట్టు దెబ్బతింటుందని మహబూబ్‌నగర్ టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు అభ్యంతరాలు లేవనెత్తారు. దీనిపై ఇప్పటివరకు స్పష్టత లేదు. ప్రాజెక్టుపై సర్వే చేస్తున్న వ్యాప్కోస్ నిర్ణీ త గడువులో నివేదిక ఇవ్వకపోవడంతో అలైన్మెంట్ కూడా తేలలేదు. అయితే డిండికి దిగువన చేపట్టిన పనులు మాత్రం ఇప్పటికే మొదలై కొనసాగుతున్నాయి. మార్పులు, చేర్పులు.. వీడని చిక్కులు వాస్తవానికి డిండి ప్రాజెక్టుకు నీటిని తీసుకునే అంశమై అనేక మార్పులు, చేర్పులు జరుగుతున్నాయి. శ్రీశైలం వరద నీటిపై ఆధారపడుతూ చేపట్టిన ఎస్ఎల్బీసీ టన్నెల్ ద్వారా 30 టీఎంసీల నీటిని డిండికి తరలించేలా ఉమ్మడి రాష్ట్రంలో నిర్ణయించారు. నక్కలగండి వద్ద రిజర్వాయర్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి 11 టీఎంసీలను మిడ్ డిండికి, డిండికి తరలించేలా డిజైన్ చేశారు. కానీ అధిక ఖర్చు దృష్ట్యా శ్రీశైలం నుంచే నేరుగా తీసుకోవాలని నిర్ణయించారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం శ్రీశైలం నుంచి ఓపెన్ చానల్, టన్నెళ్ల ద్వారా నీటిని ఎత్తిపోసి డిండికి తరలించేలా డిజైన్ చేశారు. ఇదే సమయంలో పాలమూరు ఎత్తిపోతల పథకానికి కూడా శ్రీశైలం నుంచే నీటిని తీసుకోవాలని నిర్ణయించడంతో.. డిండికి పాలమూరు పథకంలోని ఏదుల రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకోవాలని యోచిస్తున్నారు. తర్వాత హైదరాబాద్ తాగునీటి అవసరాలు, రంగారెడ్డి జిల్లాలో లక్ష ఎకరాలకు నీరిచ్చేందుకు 30 టీఎంసీలు అవసరమని లెక్కించి.. మొత్తంగా 60 టీఎంసీలను డిండి ద్వారానే తరలించేందుకు కొత్త ప్రణాళిక తెరపైకి తెచ్చారు. తర్వాత ఏదుల కన్నా నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకుంటే నయమంటూ మరో ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఒడిదొడుకుల ఎస్ఎల్బీసీ ఇక శ్రీశైలం నుంచి 30 టీఎంసీలను తీసుకునేలా చేపట్టిన ఎస్ఎల్బీసీ పనులు నత్తనడకన సాగుతున్నాయి. 2004లో రూ.1,925 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టును 2010 నాటికే పూర్తి చేయాల్సి ఉన్నా.. భూసేకరణ సమస్యలు, వరదలతో పనులు జాప్యమయ్యాయి. ప్రాజెక్టులో భాగంగా రెండు టన్నెళ్లు తవ్వాల్సి ఉంది. అందులో శ్రీశైలం డ్యామ్ నుంచి మహబూబ్‌నగర్‌లోని మన్నెవారిపల్లె వరకు తవ్వాల్సిన 43.89 కిలోమీటర్ల టన్నెల్లో.. ఇప్పటివరకు 30.46 కిలోమీటర్లు పూర్తయింది. మరో 13.46 కిలోమీటర్ల మేర తవ్వాల్సి ఉంది. దీనికి మరో మూడేళ్లు పట్టే అవకాశముందని అంచనా. ఈ దృష్ట్యా నక్కలగండి రిజర్వాయర్‌ను త్వరగా పూర్తిచేస్తే అప్పర్ డిండి నుంచి వచ్చే మిగులు జలాలను నిల్వ చేసుకునే అవకాశముందని ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ సునీల్ తెలిపారు. -
రెండు దశల్లో మిషన్ భగీరథ
-
రెండు దశల్లో మిషన్ భగీరథ
సాక్షి, హైదరాబాద్: మిషన్ భగీరథ పనులను రెండు దశలుగా విభజించి తొలి దశను వచ్చే డిసెంబర్ చివరిలోగా.. రెండో దశను తర్వాత మరో ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ఈ పథకం ద్వారా నీటి సరఫరా ప్రారంభించిన తర్వాత కొద్దినెలల పాటు పైపులైన్లు లీక్ కావడం, నీటి ఒత్తిడి తట్టుకోలేక పగలడం, వాల్వుల వద్ద సమస్యలు తలెత్తడం వంటి సహజమైన బాలారిష్టాలు ఎదురవుతాయని.. వాటిని ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ పోవాలని సూచించారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు పనులపై ముఖ్యమంత్రి శనివారం ప్రగతిభవన్‌లో సమీక్షించారు. ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి రాష్ట్రంలోని 25 వేల ఆవాస ప్రాంతాలకు శుద్ధి చేసిన నీటిని సరఫరా చేసి ప్రజలకు నూతన సంవత్సర కానుకగా అందించాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. మిషన్ భగీరథ పథకం ప్రతి ఒక్కరూ జీవితాంతం గుర్తుంచుకునే పనిగా మిగిలిపోతుందని, ఇదో ఇంజనీరింగ్ అద్భుతమని పేర్కొన్నారు. 25 వేల ఆవాస ప్రాంతాలకు శుద్ధిచేసిన తాగునీటిని అందించే గొప్ప పథకం దేశంలో మరెక్కడా లేదన్నారు. దేశానికే ఆదర్శంగా నిలిచే ఈ పథకాన్ని రికార్డు సమయంలో పూర్తిచేయనుండడం అందరికీ గర్వకారణమని చెప్పారు. నీతి ఆయోగ్‌తో పాటు అనేక రాష్ట్రాలు ఈ పథకాన్ని మెచ్చుకున్నాయని, తమ రాష్ట్రాల్లోనూ అమలు చేయడానికి అధ్యయనం చేశాయని తెలిపారు. ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు తొలి ప్రాధాన్యం ఫ్లోరైడ్ పీడిత మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలకు అత్యధిక ప్రాధాన్యమిచ్చి తొలుత తాగునీరు అందించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. వీటిలో అక్టోబర్ చివరి నాటికే పైప్‌లైన్ పూర్తి చేసి.. అంతర్గత పనులను కూడా చేపట్టాలని సూచించారు. ఇక రాష్ట్రంలోని గిరిజన తండాలు, దళితవాడలు, గోండు గూడేలన్నింటికీ మంచినీరు అందించాలని స్పష్టం చేశారు. ‘పాలేరు’కు ప్రత్యేక బృందం పాలేరు నియోజకవర్గం పరిధిలోని పాత వరంగల్ జిల్లా మండలాల్లో భగీరథ పనులు ఆలస్యంగా జరుగుతున్నాయని íసీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పాలేరు ద్వారా పాత వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్, డోర్నకల్, నర్సంపేట అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో 1,706 ఆవాస ప్రాంతాలకు నీరు అందించాలని ఆదేశించారు. వచ్చే రెండు నెలల్లో ఈ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి నాయకత్వంలో ఓ ప్రత్యేక బృందం పాలేరు సెగ్మెంట్‌ను సందర్శించి పనులను సమీక్షించాలని సూచించారు. పరిశ్రమలకు కూడా తాగునీరు.. మిషన్ భగీరథ ద్వారా పరిశ్రమలకు కూడా శుద్ధి చేసిన నీటిని అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. తాగునీరు అవసరమున్న పరిశ్రమల నుంచి దరఖాస్తులు అహ్వానించాలని, వారికి ప్రత్యేకంగా పైపులైన్లు వేసి నీటిని సరఫరా చేయాలని సూచించారు. మిషన్ భగీరథకు కేటాయించిన దాదాపు 80 టీఎంసీల నీటిలో పది శాతం (8 టీఎంసీలు) పరిశ్రమలకు అందించే వెసులుబాటు ఉందన్నారు. హైదరాబాద్ నగర మంచినీటి అవసరాల కోసం 10 టీఎంసీల రిజర్వాయర్ కడుతున్నందున.. అక్కడి నుంచి పరిశ్రమలకు నీరందించడం సాధ్యమవుతుందని చెప్పారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు కూడా మిషన్ భగీరథ ద్వారానే సరఫరా చేయాలని ఆదేశించారు. విద్యుత్ శాఖకు అభినందన భగీరథ పనుల్లో విద్యుత్ శాఖ లక్ష్యానికి రెండు నెలల ముందే పనులు పూర్తి చేస్తోందని సీఎం కేసీఆర్ ప్రశంసించారు. దీనిపై జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావుకు ఫోన్ చేసి అభినందించారు. ఈ సందర్భంగా అక్టోబర్ 2 నాటికే పనులన్నీ పూర్తవుతాయని.. రూ.300 కోట్ల వ్యయంతో చేపట్టిన సబ్స్టేషన్లు, విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు వంటి పనులన్నీ పూర్తిచేసినట్లు సీఎంకు ప్రభాకర్‌రావు వివరించారు. సమీక్షలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి జోగు రామన్న, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ తదితరులు పాల్గొన్నారు. సమస్యలొస్తాయి.. భయపడొద్దు నీటి ప్రవాహ ఒత్తిడి వల్ల ప్రారంభంలో పైపులు లీకేజీ కావడం, వాల్వుల వద్ద లీకేజీల వంటి సమస్యలు తలెత్తుతాయని.. దాంతో భయపడిపోవద్దని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. పథకం ప్రారంభమైన గజ్వేల్‌లో కూడా రెండు నెలల వరకు చిన్న చిన్న సమస్యలు వచ్చాయని పేర్కొన్నారు. సమీక్షలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న మిషన్ భగీరథ పనులను సీఎం గూగుల్ మ్యాప్ ద్వారా పరిశీలించారు. ఎక్కడెక్కడ ఏ సమస్య వస్తోందని అడిగి తెలుసుకున్నారు. జిల్లాల వారీగా, సెగ్మెంట్ల వారీగా ఇన్‌టేక్ వెల్స్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, ఓహెచ్‌బీఆర్‌లు, పైపులైన్ల నిర్మాణం, ఎలక్ట్రో మోటార్ పనుల పురోగతిని సమీక్షించారు. మొత్తం 24,225 ఆవాస ప్రాంతాలకు తాగునీరు అందించాలన్న లక్ష్యంలో భాగంగా ఇప్పటికే 3,431 గ్రామాలకు అందిస్తున్నామని.. అక్టోబర్ చివరి నాటికి మరో 5,443 గ్రామాలకు, నవంబర్ చివరి నాటికి ఇంకో 6,006 గ్రామాలకు, డిసెంబర్ చివరి నాటికి మిగతా 9,345 గ్రామాలకు అందిస్తామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పైపులైన్ల నిర్మాణంతో పాటు మోటార్లు బిగించే పనులు కూడా వేగంగా చేస్తున్నట్లు వివరించారు. -
రేణుక... గోల్డ్‌మెడలిస్ట్!
∙ వెన్నాడిన ఫ్లోరైడ్ భూతం ∙చదువుకు వెళ్లిన చోటల్లా అవమానాలు ∙కష్టాలను అధిగమించి పీజీ, బీఎడ్ చదివింది ∙యూనివర్సిటీ టాపర్‌గా బంగారు పతకం సాధించింది ∙వెక్కిరించిన నోళ్లే ఇప్పుడు వెరీగుడ్ అంటున్నాయ్.... ∙సర్కారు కరుణించాలంటున్న చదువుల తల్లి రేణుక... పసి ప్రాయంలోనే ఫ్లోరోసిస్ భూతం బారిన పడింది. వయస్సుకు తగ్గట్టుగా ఎదగలేకపోయింది. కనీసం నడవడానికి కూడా కాళ్లు సహకరించవు. కన్నవారికి భారమైనా కడుపుతీపి ఆమెను కాపాడింది. బిడ్డను కంటికి రెప్పలా చూసుకున్న తల్లిదండ్రులు ఆమె సంకల్పానికి ఊపిరినిచ్చారు. ఆమె చదువు కోసం ఎన్నో త్యాగాలు చేశారు. కష్టాలెన్నింటినో ఎదుర్కొంటూనే బిడ్డ ఆశయానికి అండగా నిలిచారు. తల్లిదండ్రులు అందించిన ధైర్యంతో, వెక్కిరించిన విధిని, అవమానించిన సమాజాన్ని చాలెంజ్ చేసింది. తన సంకల్పాన్ని నెరవేర్చుకుంది. ఎంఏ, బీఈడీ చదివిన రేణుక యూనివర్సిటీ టాపర్‌గా గోల్డ్‌మెడల్ అందుకుంది. ఉన్నత చదువులతో వెక్కిరించిన నోళ్లను మూయించింది. వారితోనే వెరీగుడ్ అనిపించుకుంది. కాని సర్కారు కొలువు దొరికితేనే తన సంకల్పం నెరవేరినట్టవుతుందని ఉద్యోగం కోసం తపిస్తోంది. సర్కారు కరుణ కోసం ఆరాటపడుతోంది. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని ఆరెపల్లి పంచాయతీ పరిధిలో గల ‘ఆరేడు’ గ్రామానికి చెందిన లక్ష్మారెడ్డి–గంగ దంపతులకు ఒక కూతురు, ఒక కొడుకు. వ్యవసాయంపైనే ఆధారపడ్డ ఆ కుటుంబం సాగునీటి వేటలో అనేక కష్టాలను ఎదుర్కొంది. అయితే లక్ష్మారెడ్డి కూతురు రేణుక చిన్నతనంలోనే ఫ్లోరోసిస్ వ్యాధి బారిన పడి ఇబ్బందులపాలైంది. కూతురికి వైద్యం చేయించడం కోసం తల్లిదండ్రులు ఎన్నో ప్రయత్నాలు చేసినా లాభం లేకుండాపోయింది. అయితే కూతురికి చదువుపై ఉన్న ఆసక్తిని గుర్తించిన తల్లిదండ్రులు కష్టాలెన్నింటినో ఎదుర్కొంటూ ఆమెకు ఉన్నత చదువులు చెప్పించారు. సొంత ఊరైన ఆరేడులో నాలుగో తరగతి వరకే ఉండడంతో అక్కడ నాలుగో తరగతి దాకా చదివింది. తరువాత ఐదు, ఆరు తరగతులు పక్క గ్రామమైన అచ్చంపేటలో చదువుకుంది. ఏడోతరగతి నుంచి పదోతరగతి వరకు నిజామాబాద్ పట్టణంలోని వివేకానంద హైస్కూల్లో చదివించారు. పదో తరగతిలో 400 మార్కులు సాధించింది. తరువాత ఇంటర్మీడియల్ మెదక్ పట్టణంలో చదివింది. 658 మార్కులు సంపాదించింది. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్శిటీకి అనుబంధమైన ఆంధ్రమహిళా సభ కళాశాలలో డిగ్రీ చదివి కాలేజ్ టాపర్‌గా నిలిచింది. బీఈడీ కూడా అదే కళాశాలలో అభ్యసించింది. యూనివర్సిటీ టాపర్‌గా నిలిచిన రేణుకకు గోల్డ్‌మెడల్ అందించారు. పీజీ ఉస్మానియా ఆర్ట్స్ కళాశాలలో పూర్తి చేసింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) కూడా క్వాలిఫై అయ్యింది. కూతురి చదువు కోసం తల్లి ఆమె వెంటే ఉండేది. కూతురు ఎక్కడ ఉంటే అక్కడ తల్లి ఉండి ఆమెను చదువుకోసం తీసుకెళ్లడం, తిరిగి ఇంటికి తీసుకురావడం జరిగేది. తండ్రి అటు వ్యవసాయం చూసుకుంటూ పిల్లల చదువుల కోసం ఆరాటపడేవారు. తల్లిదండ్రులు తన కోసం పడుతున్న శ్రమను చూసిన రేణుక పట్టుదలతో ధైర్యాన్ని కూడగట్టుకుని మరీ ఉన్నత చదువులు పూర్తి చేసింది. చదువుల్లో ఏనాడూ వెనుకబడకుండా అందరికన్నా తనే ఎక్కువ మార్కులు సాధించే ప్రయత్నం చేసింది. ఆంధ్రమహిళా సభ కళాశాలలో బీఈడీ చదివిన రేణుక గోల్డ్‌మెడల్ కూడా సాధించిందంటే ఆమె పట్టుదలకు ఇదే నిదర్శనంగా చెప్పవచ్చు. సర్కారు కరుణ కోసం.... ఎంఏ; బీఈడీ పూర్తి చేసిన రేణుక ఉద్యోగం కోసం ఎదురు చూస్తోంది. డీఎస్సీ నోటిఫికేషన్లు పడకపోవడంతో ఆమె ఆశయం నెరవేరడం లేదు. కనీసం ప్రభుత్వం తన పరిస్థితిని గుర్తించి ఏదైనా ఉద్యోగం ఇస్తే కుటుంబానికి ఆసరా అవుతానంటూ ఇటీవలే కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ను కలిసి విన్నవించింది. ఫ్లోరోసిస్ బారిన పడిన తను నిత్యం ఎన్నో కష్టాలను ఎదుర్కొంటోంది. తల్లిదండ్రులు ఆమెకు అన్ని రకాల సేవలు చేస్తూ ధైర్యాన్నివ్వడం వల్లే ఆమె ఇంతదాక నెట్టుకువచ్చింది. అయితే ప్రభుత్వం తనకు ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని ఆమె వేడుకుంటోంది. సాధారణంగా వికలాంగులు ఏదో ఒక పనిచేసుకుని బతకగలుగుతారని, తాను పూర్తిస్థాయిలో ఫ్లోరోసిస్‌తో బాధపడుతున్నందున ఏ పనీ చేసుకునే పరిస్థితి లేదని, తనకు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు వెంట ఉంటేనే బయటకు వెళ్లే పరిస్థితి ఉందని తెలిపింది. తనను ఆదుకోవాలని వేడుకుంటోంది రేణుక. – సేపూరి వేణుగోపాలాచారి, సాక్షి, కామారెడ్డి -
ఇంటిప్స్
గిన్నెలు తళతళ మెరవాలంటే తోమడానికి వాడే పొడికి గానీ, సబ్బుకి గానీ ఒకటి రెండు టేబుల్ స్పూన్ల వెనిగర్ కలపాలి. వెనిగర్ గిన్నెలపై ఉండే జిడ్డుని వదలగొట్టి మెరిసేలా చేస్తుంది. ఫ్లోరైడ్ వాటర్ వల్ల షింక్‌లు, బకెట్ల అడుగు భాగంలో తెల్లగా గారపడుతుంటాయి. రెండు కప్పుల వెనిగర్‌ని ఒక గిన్నెలో పోసి సన్న మంట మీద పదినిముషాలు వేడిచేసి దానితో శుభ్రం చేస్తే ఎంత మొండి మరకలైనా ఇట్టే మాయమవుతాయి. -
వెలిగొండకు వెన్నుపోటు
► ప్రాజెక్టు పూర్తికి కావల్సింది రూ.2,800 కోట్లు ► తాజా బడ్జెట్లో రూ.200 కోట్ల మొక్కుబడి నిధులు విదిల్చిన సర్కారు మొదటి ఫేజ్ కే రూ.వెయ్యి కోట్లు అవసరం ► ఈ లెక్కన ప్రాజెక్టు పూర్తయ్యేందుకు దశాబ్ద కాలం పట్టే పరిస్థితి ► 2018కే నీళ్లంటూ బాబు మాటల గారడీ వెలిగొండ ప్రాజెక్టుతోనే ప్రకాశం ప్రగతి ► నిధులివ్వకపోయినా పట్టించుకోని అధికార పార్టీ జిల్లా ప్రజాప్రతినిధులు సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రకాశం జిల్లాలో వరుస కరువులకు.. మితిమీరిన ఫ్లోరైడ్‌తో కిడ్నీ వ్యాధి మరణాలకు.. వెలిగొండ ప్రాజెక్టుతో పెద్ద లింకే ఉంది. ఇక్కడి కరువు నుంచి జనం గట్టెక్కాలన్నా... కిడ్నీ వ్యాధి మరణాలు తగ్గాలన్నా... పారిశ్రామిక అభివృద్ధి జరగాలన్నా... వెలిగొండ ప్రాజెక్టే ఏకైక దిక్కు. వ్యవసాయరంగానికి కావాలి్సన సాగునీరు, జనం దప్పిక తీర్చే తాగునీరు ఈ ప్రాజెక్టు వల్లే సాధ్యం. మోడువారిన పశ్చిమ ప్రకాశం కళకళలాడాలన్నా వెలిగొండతోనే సాధ్యం. మొత్తంగా ప్రకాశం జిల్లా మనుగడ వెలిగొండపైనే ఆధారపడి ఉంది. ప్రాజెక్టు పూర్తి చేసి ప్రకాశం జిల్లాను సస్యశ్యామలం చేస్తామని పాలకులు చేస్తున్న హామీలు ఆచరణలో నీటిమూటలుగానే మిగులుతున్నాయి. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రాజెక్టు నిర్మాణానికి రూ.1,500 కోట్లు ఖర్చు చేశారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు మిగిలి ఉన్న పనులను నిధులిచ్చి పూర్తి చేసిన పాపానపోలేదు. దీంతో వెలిగొండ నీరు జిల్లా వాసులకు అందనంత దూరంలోనే ఉండిపోతోంది. ప్రకటనల ప్రగల్బాలే.. వెలిగొండ ప్రాజెక్టుకు అవసరమైన నిధులు వెచ్చించి తన హయాంలోని నీటిని పారిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రగల్భాలు పలికారు. 2014 నుంచి ఇప్పటి వరకు ప్రతి ఏడాది అవిగో నీళ్లు.. ఇదిగో ప్రాజెక్టు అంటూ మాటలతో సరిపెట్టడం తప్ప నిర్మాణ పనులకు అవసరమైన నిధులను కేటాయించలేదు. తాజాగా వెలిగొండను పూర్తి చేసి 2018 జూ¯ŒS నాటికి నీటిని విడుదల చేస్తామంటూ మరోమారు బాబు గొప్పలు చెప్పారు. వెలిగొండ మన హయాంలో పూర్తి చేస్తామని ఈ విషయాన్ని జిల్లావ్యాప్తంగా ప్రచారం చేసుకోండంటూ విజయవాడలో జరిగిన టీడీపీ జిల్లా సమీక్షా సమావేశంలోనూ ఆ పార్టీ నేతలకు ముఖ్యమంత్రి చెప్పారు. ఇది జరిగి పట్టుమని 10 రోజులు కాకుండానే తాజా బడ్జెట్లో వెలిగొండకు కేవలం రూ.200 కోట్లు కేటాయించి మరోమారు ఈ ప్రాజెక్టుపై బాబు వివక్ష చూపారు. ప్రాజెక్టు పూర్తి కావటానికి తాజా అంచనాల ప్రకారం మరో రూ.2,800 కోట్లు అవసరం. చంద్రబాబు చెప్పినట్లు ఫేజ్–1 పనులను పూర్తి చేసి నీటిని విడుదల చేయటానికి కూడా వెయ్యి కోట్ల రూపాయల వరకు అవసరం. కానీ బడ్జెట్లో బాబు సర్కారు కేటాయించింది మాత్రం రూ.200 కోట్లే. ఈ లెక్కన మరో 15 ఏళ్లకు కూడా ప్రాజెక్టు పూర్తి కాదని బాబు చెప్పకనే చెప్పారు. వెలిగొండకు సర్కారు నిధులు కేటాయించకపోయినా... జిల్లాకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు నోరు మెదపకపోవడం గమనార్హం. జిల్లా అభివృద్ధికి వెలిగొండే ఆధారం జిల్లాలోని వ్యవసాయ రంగమే కాదు.. పారిశ్రామిక రంగం సైతం వెలిగొండ ప్రాజెక్టుపైనే ఆధారపడి ఉంది. నీళ్లు లేకుండా పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేదని సాక్షాత్తు పారిశ్రామికవేత్తలే చెబుతున్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే దొనకొండ పారిశ్రామికవాడ, కనిగిరి నిమ్జ్ తదితర ప్రాంతాల్లో పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంటుంది. వెలిగొండ నీరు లేకపోతే ఏ ఒక్క పరిశ్రమ వచ్చే పరిస్థితి లేదు. అంటే జిల్లాకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేనట్లే! చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక మొక్కుబడి నిధులను మాత్రమే కేటాయించారు. ఇప్పటి వరకు రూ.700 కోట్లు ఇచ్చినట్లు సర్కారు లెక్కలు చెబుతున్నా కనీసం రూ.400 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. నిర్మాణ పనులకు రూ.25 కోట్లకుపైనే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. సకాలంలో నిధులివ్వకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు సైతం ఆపివేసిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవల పనులు వేగవంతం చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. టన్నెల్–1, 2 పనులను ఇరువైపుల చేపడుతున్నట్లు చెప్పారు. అదే సమయంలో కొల్లంవాగు హెడ్ రెగ్యులేటర్ పనులను ప్రారంభిస్తున్నామన్నారు. తీరా బడ్జెట్లో చూస్తే సర్కారు రూ.200 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంది. ఈ పరిస్థితుల్లో కాంట్రాక్టర్లు వెలిగొండ పనులను వేగవంతం చేసే పరిస్థితి కనిపించటం లేదు. ఫ్లోరైడ్ పీడకు వెలిగొండే విరుగుడు.. జిల్లాలో ఫ్లోరైడ్ శాతం తీవ్ర స్థాయికి చేరింది. 15 శాతం ఫ్లోరైడ్ ఉన్న గ్రామాలు వందల సంఖ్యలో ఉన్నాయి. 2,200 హాబిటేషన్లు ఉండగా 1200 హాబిటేషన్లలో ఫ్లోరైడ్ అధికంగా ఉంది. దీంతో ఫ్లోరోసిస్ వ్యాధి తీవ్ర స్థాయికి చేరింది. తద్వారా కిడ్నీ వ్యా«ధితో జనం మృత్యువాత పడుతున్నారు. గత రెండేళ్లలోనే 427 మంది మరణించారు. వందలాది మంది మరణానికి దగ్గరగా ఉన్నారు. వేలాది మంది వ్యాధికి గురయ్యారు. రక్షిత మంచినీరు లేకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. వెలిగొండ పూర్తయి కృష్ణా జలాలు అందుబాటులోకి వస్తే ఫ్లోరైడ్ తగ్గుతుందని నిపుణులు తేల్చి చెబుతున్నారు. జిల్లాలో ఫ్లోరైడ్ తీవ్రత, కిడ్నీ వ్యాధి మరణాలు వివరాలను ఒంగోలు ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లారు. ఫ్లోరైడ్ బారి నుంచి జిల్లా వాసులను రక్షించాలని ఆయన కోరుతున్నారు. వ్యాధి తీవ్రతకు కారణాలు అన్వేషించి నివారణ చర్యలు తీసుకోవాలని ఎంపీ కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి నడ్డాకు వివరించారు. అయినా అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అందరీ ఆశలు వెలిగొండపైనే ఉన్నాయి. కానీ నిధుల కేటాయింపులు చూస్తే ఈ ప్రాజెక్టు నిర్మాణం ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించటం లేదు. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయకపోతే ఇప్పటికే ఒంగోలు ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇప్పటికైనా అధికార పార్టీ నేతలు స్పందించి, వెలిగొండ ప్రాజెక్టుకు అధికంగా నిధులు కేటాయించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి్సన అవసరం ఉంది. 2018 నాటికైనా ప్రాజెక్టును పూర్తి చేయించి నీటిని విడుదల చేయించేందుకు కృషి చేసి, కరువు జిల్లాను ఆదుకునేందుకు అందరూ ముందుకు రావాలి. -
‘ఫ్లోరైడ్ సమస్య’పై ఏం చేస్తున్నారో చెప్పండి
సర్కార్‌ను ఆదేశించిన హైకోర్టు.. నోటీసులు జారీ సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని ఉమ్మడి హైకోర్టు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందులో భాగంగా వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి, నల్లగొండ జిల్లా కలెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య తీవ్రంగా ఉందని, దీనిపై ప్రభుత్వం నుంచి నివేదిక కోరడంతోపాటు, ప్రజలకు రక్షిత నీరు అందేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ నల్లగొండకు చెందిన కె.ఎస్.ఎస్.యశస్వి, మరొకరు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పార్టీ ఇన్ పర్సన్‌గా యశస్వి వాదనలు వినిపిస్తూ, నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య గురించి వివరించారు. ఈ సమస్య నివారణకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, ఇది ఇప్పటి సమస్య కాదని, ఎప్పటి నుంచో ఉందని చెప్పింది. ప్రతివాదులుగా ఉన్న పలుశాఖల ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేస్తూ కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. -
ఊగిసలాటలో ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రం
ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రంపై నీలినీడలు కమ్ముకున్నాయి. దేశంలో ఫ్లోరైడ్‌ను తరిమికొట్టేందుకు గుజరాత్, తెలంగాణ రాష్ట్రాల్లో రెండు ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే 2012 నవంబర్‌లో రూ. 10 కోట్లను మంజూరు చేసింది. చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంలో ఏర్పాటు చేస్తున్న పరిశోధనా కేంద్రానికి ఇప్పటికే స్థలం కేటాయించారు. నిధులు విడుదల కాకపోవడంతో పనులు ప్రారంభం కావడం లేదు. ఈ కేంద్రం ఏర్పాటైతే తొమ్మిది రాష్ట్రాల ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుంది. దీంతోపాటు మంజూరైన గుజరాత్ రాష్ట్రంలోని పరిశోధన కేంద్రంలో పనులు ప్రారంభమయ్యాయి. దండుమల్కాపురం కేంద్రంలో పనులు ప్రారంభంకాకపోవడంతో అసలు ఇక్కడ పరిశోధన కేంద్రం ఏర్పాటు అవుతుందా అనే అనుమానం స్థానికుల్లో వ్యక్తం అవుతోంది. ► చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంలో ఏర్పాటుకు నిర్ణయం ► రూ. 100-–250 కోట్లతో ఏర్పాటు చేయాలని ప్రతిపాదన ► తాత్కాలికంగా రూ.10 కోట్లు కేటాయింపు ► పూర్తి స్థాయి నిధుల రాక ప్రారంభం కాని పనులు చౌటుప్పల్ : ఫ్లోరోసిస్ వ్యాధి పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది నల్లగొండ జిల్లా. అందులో ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గం. ఇక్కడి ఫ్లోరైడ్ శాతం ప్రపంచంలోకెల్లా అత్యధికమని ఎన్నో సంవత్సరాలు చేసిన పరిశోధనల ద్వారా శాస్త్రవేత్తలు తేల్చారు. ఫ్లోరైడ్ వ్యాధి, వ్యాధిగ్రస్తులకు చేపట్టాల్సిన చర్యలపై సంవత్సరాల పాటు పరిశోధనలు జరిగాయి. ఫ్లోరైడ్పై పాలకుల తీరును నిరసిస్తూ భాధితులు, స్వచ్ఛంద సంఘాల అధ్వర్యంలో జాతీ య స్థాయి ఉద్యమాలు సైతం జరిగాయి. దశాబ్దాల పోరా టం ఫలితంగా 2012లో అప్పటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. వ్యాధి నివారణకు, వ్యాధిగ్రస్తులకు మెరుగైన చికిత్సలను అందించాలని భావించింది. అందులో భాగం గా ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రాలు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని కేంద్రం నీటి, శానిటేషన్ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఆ క్రమంలోనే రెండు ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రాల ఏర్పాటుకు 2012 నవంబర్ నెలలో అధికారిక మంజూరు ఇచ్చింది. వీటిలో ఒకటి గుజ రాత్ రాష్ట్రంలో, రెండోది తెలంగాణ రాష్ట్రంలోని ప్రస్తుత యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామంలో ఏర్పాటుకు నిర్ణయించి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు ఉత్తర్వులు జారీ చేసింది. తాత్కాలిక అవసరాల నిమిత్తం ఒక్కొ కేంద్రానికి రూ. 10కోట్ల చొప్పున నిధులు మంజూరు చేసింది. ఇది జరిగి నాలుగేళ్లు గడిచినా ఎలాంటి పురోగతి లేదు. ఈ ప్రాజెక్ట్ ఇక్కడే ఉంటుందో లేక వేరే రాష్ట్రానికి తరలిపోతుందో తెలియక ప్రస్తుతం ఊగిసలాట నెలకొంది. రూ.100–250 కోట్లతో ఏర్పాటుకు ప్రతిపాదన హైదరాబాద్‌కు సమీపంలో, విజయవాడ జాతీయ రహదారి కలిగి ఉండడం మూలంగా ఈ ఫ్లోరైడ్ పరిశోధనా కేంద్రం దండుమల్కాపురం గ్రామంలో ఏర్పాటుకు దోహదపడింది. ఇందుకోసం 65వ నంబర్ జాతీయ రహదారికి సమీపంలో ఉన్న 486 సర్వే నంబరులో 7 ఎకరాలను ప్రభుత్వం కేటాయించి ఇప్పటికే ఆసంస్థకు అందజేసింది. స్థల కేటాయింపులో మొదట్లో కొంత వివాదం నెలకొన్నా స్థానిక ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి చొరవతో సద్దుమణిగింది. రూ.100-–250 కోట్ల వ్యయంతో ఈ కేం ద్రాన్ని అన్ని హంగులతో ఏర్పాటు చేయాలని భావించా రు. భూమి కేటాయించి రెండేళ్లు కావొస్తున్నా కేంద్రం నిధు లు కేటాయించకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. దేశవ్యాప్త ప్రయోజనాలకు రూపకల్పన తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాల్లో ఏర్పాటు చేసే ఈ పరిశోధనా కేంద్రాల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలకు ప్రయోజనం కలిగేలా కేంద్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది. తెలంగాణలోని కేంద్రం ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కేరళ, మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రాలకు సేవలు అందనున్నాయి. గుజరాత్ కేంద్రం ద్వారా మిగిలిన రాష్ట్రాలకు సేవలు అందనున్నాయి. తెలంగాణ పనులను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(జాతీయ పోషకాహార సంస్థ)కు, గుజరాత్ బాధ్యతలను గుజరాత్ జల్సేవా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కు అప్పగించారు. వ్యాధిగ్రస్తులకు సూపర్‌స్పెషాలిటీ వైద్యం ఈ ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రాలకు అనుసంధానంగా అదే ప్రాంగణంలో అన్ని హంగులతో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటు చేయనున్నారు. ఫ్లోరోసిస్‌పై పరిశోధనలతోపాటు వ్యాధిగ్రస్తులకు అన్నిరకాల వైద్య సేవలు అందించనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 965 గ్రామాల్లో, 3327 ఆవాసాల్లో ఫ్లోరైడ్ శాతం 7.0శాతం ఉన్నట్టు మినిస్ట్రీ ఆఫ్ వాటర్ అండ్ శానిటేషన్ గుర్తించింది. ఆ ప్రకారంగా ఆయా గ్రామాలకు చెందిన వ్యాధిగ్రస్తులు చికిత్స కోసం ఇక్కడికి వచ్చేవారు. కాళ్లు, చేతులు వంకర్లుపోయి కదల్లేక , మెదల్లేక ఇబ్బందులకు గురయ్యే భాదితులకు కొత్త జీవితం లభించేది. నిధుల విడుదలకు తెలియని కారణాలు ఒక్కో కేంద్రం ఏర్పాటుకు ముందుగా రూ.100కోట్ల చొప్పు న కేటాయించాల్సి ఉంది. పనులు కొనసాగుతుంటే అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు విడుదల చేయాలని నిర్ణయిం చారు. కానీ ఏళ్లు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం నిధులు ఎందుకు విడుదల చేయడం లేదో అర్థం కావడం లేదు. రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఫ్లోరైడ్ మహమ్మారిని తరిమికొట్టే విషయంలో ప్రథమ ప్రాధాన్యత ఇస్తామనే ప్రకటించింది. ఈ విషయాన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు పట్ల కేంద్రం ఎందుకు స్పందించడం లేదో తెలియక స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్ రాష్ట్రంలో మాత్రం పనులు ప్రారంభం కావడం గమనార్హం. ఎక్కడికీ పోనివ్వం ఈ కేంద్రాన్ని ఇక్కడి నుంచి ఎక్కడికీ పోనివ్వం. ఇక్కడ ఏర్పాటు చాలా అవసరం. కేంద్రం నిధులు విడుదల చేస్తే సరిపోతుంది. నిధులు లేకనే పనులు ప్రారంభం కావడం లేదు. ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి సైతం తీసుకెళ్లాం. – కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లాం ఈ విషయాన్ని ఇప్పటికే సంబంధిత కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లాం. త్వర గా నిధులు విడుదల చేయాలని కోరాం. రాష్ట్ర ప్రభుత్వం సైతం సమస్యను కేం ద్రానికి వివరించింది. త్వరలో నిధులు విడుదల అవుతాయని ఆశిస్తున్నాం. – బూర నర్సయ్యగౌడ్, భువనగిరి ఎంపీ -
ఫ్లోరైడ్ బాధిత గ్రామాలను ఆదుకోండి
– ప్రస్తుత బడ్జెట్లోనే నిధులు కేటాయించండి – ఆర్థికమంత్రి అరుణ్ జెట్లీని కోరిన ఎంపీ బుట్టా రేణుక కర్నూలు (ఓల్డ్‌సిటీ): కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఫోరైడ్ బాధిత గ్రామాలకు తాగునీటి వసతి కల్పించాలని ఎంపీ బుట్టా రేణుక బుధవారం మధ్యాహ్నం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జెట్లీని కోరారు. కోడుమూరుకు రూ. 56.70 కోట్లు, మంత్రాలయానికి రూ. 30 కోట్లు, ఆస్పరి, దేవనకొండ, ఆలూరులకు రూ. 90 కోట్లు, ఎమ్మిగనూరు (గోనెగండ్ల)కు రూ. 140 కోట్లు, పత్తికొండ, మద్దికెర, తుగ్గలిలకు రూ. 105 కోట్లు, ఆదోని, కౌతాళంలకు రూ. 105 కోట్ల మేరకు నిధులు అవసరమవుతాయని ప్రతిపాదించారు. ఆయా గ్రామాలకు ప్రస్తుత బడ్జెట్లో ప్రకటించిన విధంగా వివిధ ప్రపంచ బ్యాంకు పథకాల ద్వారా ఎక్కువ మొత్తంలో నిధులు అందజేయాలని కోరారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌కు కూడా ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. -
తోమర్ జీ ధన్యవాదాలు: వైవీ సుబ్బారెడ్డి
కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌కు వైఎస్సార్సీపీ ఎంపీ(లోక్‌సభ) వైవీ సుబ్బారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌కు ఓ లేఖను రాశారు. దేశంలోని ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాల్లో తాగునీటి సదుపాయం కల్పించాలని అందుకు తగిన నిధులను ఈ బడ్డెట్లో కేటాయించేలా చూడాలని తాను తోమర్‌ను కోరినట్లు చెప్పారు. ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ పథకం కింద ఫ్లోరైడ్ ప్రాంతాలకు నీటి సరఫరాను చేర్చడంపై హర్షం వ్యక్తం చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రకాశం జిల్లాలో గల 56 మండలాల్లో 48 మండలాలు ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలేనని లేఖలో పేర్కొన్నారు. ప్రధానమంత్రితో ఈ విషయంపై చర్చించినప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాను కూడా ఈ సమస్యలను ఎదుర్కొన్నట్లు ఆయన చెప్పారని తెలిపారు. తప్పకుండా ఫ్లోరైడ్ ప్రాంతాల ప్రజలకు తాగునీటి సదుపాయం కల్సిస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. ప్రకాశం జిల్లాలోని ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలైన 48 మండలాలను బడ్జెట్లో ప్రకటించిన 28 వేల ప్రాంతాల్లో పరిగణించాలని కోరారు. -
వదలని పీడ!
ఫ్లోరైడ్ బారి నుంచి కనిగిరి వాసులకు విముక్తి ఎప్పుడో.. ♦ వాడుకకూ పనికిరాని భూగర్భ జలాలు ♦ 124 గ్రామాలకు అందని సాగర్ జలాలు ♦ ముందుకు సాగని కుడికాల్వ రెండో దశ పనులు ♦ రక్షిత మంచినీటి పథకానికి గ్రహణం ♦ రెండేళ్లుగా నిలిచిన రూ.88 కోట్ల నిధులు ♦ అమలు కాని సీఎం చంద్రబాబు హామీలు ♦ నిధుల సాధనలో నాయకుల వైఫల్యం ‘ఇక్కడి భూమిలో నీరు 40 అడుగుల లోతు దాటితే తాగేందుకు పనికిరాదు. ఫ్లోరైడ్ తీవ్రంగా ఉందని నివేదికలున్నాయి. భూగర్భ జలం తాగొద్దు.. మీకు వెలిగొండ, సాగర్ జలాలు అందిస్తా.. ఫ్లోరైడ్ నుంచి విముక్తి కల్పిస్తా’.. - గతేడాది శీలంవారిపల్లి సభలో కనిగిరి వాసులకు సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ కనిగిరి ప్రాంతంలోని భూగర్భ జలాలు తాగేందుకు కాదు కదా.. కనీసం వాడుకునేందుకు కూడా పనికిరావు. ఇక్కడ పండించిన కూరగాయలు, పండ్లు సైతం వాడరాదు. వాటిలో ఫ్లోరైడ్ అత్యధికంగా ఉంది. టూత్ పేస్ట్ సైతం ప్రత్యేకమైనది ఉండాల్సిందే.. పారుదల నీటితోనే ఫ్లోరైడ్ నుంచి విముక్తి. - జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి యాస్మిన్ చెప్పిన మాటలు కనిగిరి: కనిగిరి ప్రాంతం పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది ఫ్లోరైడ్. ఎటు చూసిన ఫ్లోరోసిస్ బాధితులే కనిపిస్తారు. ఈ నియోజకవర్గంలో ఎక్కడా శాశ్వత నీటి వనరులు లేవు. ఆరు మండలాల్లోని 135 పంచాయతీల పరిధిలో ఉన్న 467 గ్రామాలకూ వర్షపు నీరు, భూగర్భజలాలే దిక్కు. ఈ ప్రాంతం నుంచి కాలువ నీరు పారాలంటే వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కావాలి. అప్పుడే కనీసం నాలుగు మండలాలకు తాగు, సాగు నీరు లభిస్తుంది. సాగర్ కుడి కాలువ రెండో దశ పనులు చేపడితే నియోజకవర్గానికి తాగు, సాగు నీటి సమస్య తీరుతుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కాలువ కురిచేడు వరకు వచ్చింది. 59 కిలో మీటర్లు కాలువను పొడిగిస్తే కనిగిరి, ఉదయగిరి నియోజకవర్గాల్లో తాగు నీటితో పాటు 6 లక్షల ఎకరాలకు కృష్ణా జలాలు అందుతాయని నిపుణులు చెప్తున్నారు. ఇక్కడి భూ గర్భ జలాలు తాగేందుకు కాదు కదా కనీసం వాడుకకు కూడా పనికిరావని వైద్యాధికారులు ధ్రువీకరిస్తున్నా ప్రజలకు రక్షితనీరు అందించడంలో పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఎమ్మెల్యే సొంత మండలంలోనూ అదే తీరు.. ఫ్లోరోసిస్ బాధ నుంచి కనిగిరి ప్రజలకు విముక్తి కల్గించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2008లో రూ.175 కోట్లతో కనిగిరి రక్షిత మంచినీటి పథకాన్ని మంజూరు చేశారు. మొదటి విడత రూ.91 కోట్ల నిధులు విడుదల చేశారు. తిరిగి రెండోవిడత నిధులు కూడా రూ.61 కోట్లు మంజూరై పనులు జరిగాయి. ఆ తర్వాత ప్రభుత్వాలు మారడంతో పథకానికి గ్రహణం పట్టింది. దీంతో రెండేళ్ల నుంచి మూడో విడత నిధులు రూ.88 కోట్లు రాలేదు. ప్రస్తుతం దాని వ్యయం రూ.100 కోట్లకు పెరిగినట్లు తెలిసింది. నిధుల సాధనకు ప్రభుత్వంపై వత్తిడి తేవడంలో స్థానిక ఎమ్మెల్యే విఫలమయ్యూరనే విమర్శలున్నాయి. ఫలితంగా నియోజకవర్గంలోని 124 గ్రామాల్లో రామతీర్థం ప్రాజెక్టు నీటి సరఫరా లేదు. ఎమ్మెల్యే సొంత మండలంలో ఒక్క గ్రామానికి కూడా సాగర్ జలాలు ఇవ్వలేని దుస్థితి. ఫ్లోరైడ్ శాతం 5 పీపీఎం (పార్ట్స్ పర్ మిలియన్) నుంచి 7పీపీఎం వరకు ఉందని గత ఏడాది శీలంవారి పల్లెలో జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా సెలవిచ్చారు. వెలిగొండ, సాగర్ జలాలు అందించడం ద్వారా ఇక్కడి ప్రజలను ఫ్లోరైడ్ నుంచి విముక్తి కల్పిస్తానని వాగ్దానాలు చేశారు. కనీసం రక్షిత పథకానికి మూడో విడత అందించాల్సిన రూ.88 కోట్లు కూడా మంజూరు చేయకపోవడం గమనార్హం. -
రన్నరప్ బోపన్న జంట
మాడ్రిడ్: డిఫెండింగ్ చాంపియన్స్ రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) ద్వయం మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ మాస్టర్స్ సిరీస్ టైటిల్‌ను నిలబెట్టుకోవడంలో విఫలమైంది. ఆదివారం జరిగిన ఫైనల్లో బోపన్న-మెర్జియా జంట 4-6, 6-7 (5/7)తో జీన్ జూలియన్ రోజర్ (నెదర్లాండ్స్)-హొరియా టెకావ్ (రుమేనియా) జోడీ చేతిలో ఓడిపోయింది. 71 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న జంట ఎనిమిది ఏస్‌లు సంధించి, ఒక డబుల్ ఫాల్ట్ చేసింది. రన్నరప్‌గా నిలిచిన బోపన్న జోడీకి 1,38,400 యూరోల (రూ. కోటీ 5 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 600 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
నార్లాపూర్ నుంచే ‘డిండి’కి నీరు?
♦ అక్కడ్నుంచి అయితేనే కల్వకుర్తి ఆయకట్టు నష్టం తగ్గింపు ♦ ప్రభుత్వానికి నీటిపారుదల నిపుణుల సూచన ♦ ఈ ప్రతిపాదనతో ఏకీభవిస్తున్న ముఖ్యమంత్రి ♦ త్వరలోనే తుది నిర్ణయం సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని ఫ్లోరైడ్ ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు ఉద్దేశించిన డిండి ప్రాజెక్టుకు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకునేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పాలమూరు ప్రాజెక్టు పరిధిలోనే ఉన్న ఏదుల రిజర్వాయర్ నుంచి డిండికి నీటిని మళ్లించే ప్రణాళికను దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యాపక్కనపెట్టాలని యోచిస్తోంది. నార్లాపూర్ నుంచి నీటిని తీసుకునే సామర్థ్యాన్ని (ఇన్‌టేక్ కెపాసిటీ) 2 నుంచి 3 టీఎంసీలకు పెంచి అందులో 2 టీఎంసీలు పాలమూరు ప్రాజెక్టుకు, మరో టీఎంసీ డిండికి తరలించడం ద్వారా మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల ప్రయోజనాలను కాపాడవచ్చంటున్న నీటిపారుదల రంగ నిపుణుల సూచన మేరకు ప్రభుత్వం ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ముఖ్యమంత్రి త్వరలోనే అధికారులు, రెండు జిల్లాల ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని సమాచారం. మారిన ప్రతిపాదనలు... డిండి మొదటి ప్రతిపాదన ప్రకారం శ్రీశైలంలో వరద ఉండే 60 రోజుల్లో రోజుకు 0.5 టీఎంసీల నీటిని తరలించడం ద్వారా 30 టీఎంసీల నీటిని ఏదుల రిజర్వాయర్ నుంచి డిండికి తరలించాలని అధికారులు ప్రణాళిక తయారు చేశారు. అయితే హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 20 టీఎంసీలు, రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మహేశ్వరం మండలాలకు లక్ష ఎకరాలకు నీరిచ్చేందుకు మరో 10 టీఎంసీలు అవసరమని లెక్కించి వాటిని డిండి ద్వారానే తరలించేలా కొత్తగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీంతో మొత్తంగా శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వరద ఉండే 60 రోజుల్లో రోజుకు 0.5 టీఎంసీలు కాకుండా ఒక టీఎంసీ నీటిని డిండికి తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాలమూరు ప్రాజెక్టులో భాగమైన ఏదుల రిజర్వాయర్ నుంచే డిండికి నీటిని తరలించాలని ప్రతిపాదనలు కూడా తయారయ్యాయి. కానీ ఏదుల రిజర్వాయర్ ఎత్తు 445 మీటర్లుకాగా, అప్పర్ డిండి ఎత్తు 396 మీటర్లు ఉంటుందని... అక్కడి వరకు నీటిని తరలించే బదులు ఏదుల రిజర్వాయర్‌ను 430 మీటర్ల ఎత్తు వద్దే నిర్మించి అక్కడి నుంచి కాల్వల ద్వారా నీటిని తరలించాలని అధికారులు కొత్తగా ప్రతిపాదించారు. 430 మీటర్ల ఎత్తు వద్ద రిజర్వాయర్ నిర్మాణం చేపట్టి ఇర్విన్, జేపల్లి వద్ద కొత్త రిజర్వాయర్ల ఏర్పాటుతోపాటు కిష్టరాంపల్లి, శివన్నగూడెం రిజర్వాయర్ల సామర్థ్యం పెంచాలని నిర్ణయించారు. కొలిక్కి తెచ్చే యత్నాల్లో ప్రభుత్వం... డిండి అలైన్మెంట్తో కల్వకుర్తి ప్రాజెక్టు కింద 90 వే ల ఎకరాల ఆయకట్టు దెబ్బతినే అవకాశం ఉంటుందని మహబూబ్న గర్ జిల్లా నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇటీవలే సర్వే చేసిన అధికారులు..ఆయకట్టు నష్టం 27,551 ఎకరాల మేరకే ఉంటుందని తేల్చారు. ఇందులో కల్వకుర్తి ప్యాకేజీ 29లో 20,122 ఎకరాలు, ప్యాకేజీ 30లో మరో 7,629 ఎకరాలకు నష్టం ఉంటుందని లెక్కించారు. ఈ లెక్కలతో నల్లగొండ జిల్లా ప్రతినిధులు విభేదిస్తున్నారు. పాల మూరులోని ఇతర రిజర్వాయర్ల కింద నష్టపోయే ఆయకట్టును డిండి నష్టం కింద లెక్కగడుతున్నారని..దీంతోపాటే భూసేకరణనూ ఇందులో కలిపారని వాదిస్తున్నారు. ఈ సమస్యను కొలిక్కి తెచ్చే యోచనలో సీఎం ఉన్నారు. -
క్వార్టర్స్‌లో బోపన్న జోడి
మోంటే కార్లో: భారత ఆటగాడు రోహన్ బోపన్న- ఫ్లోరిన్ మెర్గా (రొమేనియా) జోడి మోంటే కార్లో మాస్టర్స్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ ప్రి క్వార్టర్ మ్యాచ్‌లో బోపన్న 7-5, 7-5తో రాబర్ట్-అలెగ్జాండర్ ద్వయంపై గెలిచారు. -
పాతాళగంగలో ఫ్లోరైడ్ భూతం!
♦ అడుగంటిన భూగర్భ జలాలు అయినా ఆగని తవ్వకాలు ♦ 300 అడుగులు మించితే ప్రమాదమే.. తేల్చిచెబుతున్న నిపుణులు ♦ జిల్లాలో ఫ్లోరైడ్ జలాల కలకలం ♦ భూగర్భ జలాలు తగ్గినా ఆగని బోరు తవ్వకాలు ♦ సగటున వెయ్యి ఫీట్ల లోతుకు బావులు ♦ 300 అడుగులు మించితే ప్రమాదమంటున్న నిపుణులు ♦ సింగిల్‌ఫేజ్ మోటార్లు కూడా ‘లోతు’కు కారణం భూగర్భ జలాలు అడుగంటాయి.. పాతాళగంగలో ఫ్లోరైడ్ జలాలే దిక్కవుతున్నాయి. ఇష్టారాజ్యంగా నీటిని తోడేస్తుండటం.. సింగిల్ ఫేజ్ బోరు మోటార్లు ఎక్కువకావడంతో ఈ దుస్థితి నెలకొంది. ఫ్లోరైడ్ జలాలే ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయి. ఫలితంగా భవిష్యత్తు ఆందోళనకరంగా మారుతోంది. జిల్లాలో వరుసగా కరువు పరిస్థితులు తలెత్తడంతో భూగర్భ జలమట్టం గణనీయంగా పడిపోయింది. ఈ తరుణంలో బోరుబావులను 600 నుంచి 1000 ఫీట్లకుపైగా తవ్వుతున్నారు. ఫ్లోరైడ్ కలిసిన జలాలు వస్తున్నాయని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చెబుతున్నారు. నిజానికి 300 ఫీట్ల లోతు కంటే ఎక్కువ వేస్తే వచ్చేది ఫ్లోరైడ్ నీరేనని వారంటున్నారు. ఇది తెలియని ప్రజలు కలుషిత జలాలు తాగుతూ రోగాలకు దగ్గరవుతున్నారని ఆందోళన చెందుతున్నారు. మంజీర పరీవాహక ప్రాంతం మినహా జిల్లా వ్యాప్తంగా ఇదే స్థితి ఉందని చెబుతున్నారు. గజ్వేల్: ఇన్నాళ్లు అమృతం పంచిన పాతాళగంగ.. ప్రస్తుతం విషం చిమ్ముతోంది. కరువు ప్రభావంతో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో పాటు ఇష్టారాజ్యంగా నీటిని తోడేస్తుండటంతో ఈ దుస్థితి ఎదురవుతోంది. జిల్లాలో సింగిల్ ఫేజ్ బోరు మోటార్లు ఎక్కువకావడంతో తవ్వకాలు వెయ్యి అడుగుల లోతుకు వెళ్లిపోయాయి. దీంతో ఫ్లోరైడ్ జలాలే ప్రజల దాహార్తిని తీర్చుతున్నాయి. మంజీర పరివాహక ప్రాంతం మినహా మిగిలిన చోట్ల ఈ ముప్పు ఎక్కువగా ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తు ప్రమాదకరంగా మారుతుందని ఆందోళన చెందుతున్నారు. తెరపైకి ‘సింగిల్‌ఫేజ్’ వ్యవస్థ జిల్లాలో 1066 గ్రామ పంచాయతీలు.. రెండు వేలకు పైగా మదిర గ్రామాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 35 లక్షల జనాభా ఉన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఒక్కొక్కరికి 80 లీటర్ల చొప్పున తక్కువలో తక్కువగా 28 కోట్ల లీటర్లకు పైగా నీటిని అందించాల్సి ఉంది. ఈ బా ద్యత ఆర్డబ్ల్యూఎస్(గ్రామీణ నీటి సరఫరా విభాగం)కు పెద్ద సవాల్‌గా మారింది. ఈక్రమంలో కొన్నేళ్ల క్రితం సింగిల్‌ఫేజ్ బోరుమోటార్ల వ్యవస్థ వ చ్చింది. గతంలో త్రీఫేజ్ వి ద్యుత్ సరఫరా ఉన్నప్పుడే మంచినీటి బోరుబావులు నడిచేవి. అలాకాకుండా సింగిల్‌ఫేజ్ విధానంలో 1 హెచ్‌పీ(హార్స్పవర్) మోటార్లను వినియోగిస్తున్నారు. దీంతో సింగిల్‌ఫేజ్ విద్యుత్ సరఫరా ఉన్నంత సేపు మోటార్లు నడుస్తూనే ఉంటాయి. ప్రస్తుతం జిల్లాలో 17,500 బోరుబావులుండగా ఇందులో 10 వేల వరకు సింగిల్‌ఫేజ్ బోరుమోటార్లు ఉండటం విశేషం. పేరుకుపోయిన విద్యుత్ బకాయిలు జిల్లాలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల ద్వారా ప్రస్తుతం 17,500 బోరుబావులు నడుస్తుం డగా వీటి విద్యుత్ బిల్లులు రూ. 156 కోట్లకుపైగా పేరుకుపోయాయి. ప్రస్తుతం పంచాయతీల కు సంబంధించి రూ.134 కోట్లు, మున్సిపాలలిటీల కు సంబంధించి రూ.22 కోట్ల బకాయిలున్నాయి. రెండేళ్ల నుంచి బిల్లులు చెల్లించడం లేదని తెలుస్తోంది. నిజానికి 12వ ఆర్థిక సంఘం నిధుల నుం చి సర్పంచ్‌లు బిల్లులు చెల్లించాల్సి ఉన్నా చేతులెత్తేశారు. ఈనేపథ్యంలో మరికొన్ని రోజులు చూసి సరఫరా నిలిపివేసే యోచనలో ఉన్నట్టు విద్యుత్ శాఖ ఎస్ఈ సదాశివరెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. అయి తే, మార్చి ఆఖరు వరకు బిల్లులు చెల్లిస్తామని స ర్పంచ్‌లు జాప్యం చేస్తున్నారని ఆయన అన్నారు. నల్లా కనెక్షన్ ఎరుగని గ్రామం జగదేవ్‌పూర్ మండలంలోని మునిగడప గ్రామ ప ంచాయితీ మదిర గ్రామం గోపాల్పూర్. గ్రామం లో మొత్తం 40 కుటుంబాలు ఉన్నాయి. 250 జ నాభా, 170 ఓటర్లు ఉన్నారు. మూడు సింగిల్‌ఫేజ్ బోరు మోటార్లు ఉన్నాయి. ఒక బోరుబావి పూ ర్తిగా ఎండిపోగా మరోటి మోటారు లేక నిరుపయోగంగా మారింది. ప్రస్తుతం ఒక్క బోరే దిక్కు అయ్యింది. 15 ఏళ్ల క్రితం నిర్మించిన రెండు మినీ ట్యాంకుల్లో ఒకదానికి కనెక్షన్ లేకపోవడంతో శిథిలావస్థకు చేరింది. ఇంటింటికీ నల్లా కనెక్షన్ లే కపొవడంతో ట్యాంక్ నుంచి ఇళ్లకు పైప్‌లు ఏర్పాటు చేసుకున్నారు. ఒక ట్యాంకుకు 20కి పైగా పైపులు ఉన్నాయి. దీంతో అప్పడప్పుడు గ్రామస్తుల మధ్య నీళ్ల కోసం గొడవలు జరుగుతున్నాయి. గ్రామంలో రెండు చేతి పంపులున్నా అవీ పని చేయడం లేదు. ఎండకాలం వస్తే నీళ్ల కోసం పొలాల వద్దకు వెళ్లాల్సి ఉంటుందని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. ఇంత వరకు నల్లా కనెక్షన్ ఎరుగమని చెప్పారు. ‘వాటర్‌గ్రిడ్’ వస్తే ఉపశమనం కరెంట్ ఉన్నప్పుడల్లా నీటిని పట్టుకొని అవసరాలు తీర్చుకుంటున్న జనంలో ఫ్లోరైడ్ భయం అలుముకుంది. ఇప్పటికే ఈ భయంతో చాలామంది మినరల్ వాటర్ వినియోగిస్తున్నారు. గ్రా మాల్లో రూ.10 నుంచి రూ.15 వరకు విక్రయిస్తుండటంతో ఎక్కువ మంది ‘సింగిల్ ఫేజ్’ నీటినే తాగుతున్నారు. దీంతో వ్యాధుల బారిన పడుతున్నారు. ఈనేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘వాటర్‌గ్రిడ్’ పథకం ప్రజల్లో కొత్త ఆశలను నింపుతోంది. మండలాల్లో పరిస్థితి గజ్వేల్ నియోజకవర్గం: నియోజకవర్గంలో 128 గ్రామపంచాయతీలు, ఒక నగర పంచాయతీ ఉంది. గజ్వేల్ మండలంలో 22 గ్రామపంచాయతీలు, 27 హాబిటేషన్లు, నగర పం చాయతీ ఉంది. మండలంలో సుమారు 84 వేలకు పైగా జనాభా ఉండగా మండలంలో ప్రస్తుతం 60 వరకు ఓవర్‌హెడ్ ట్యాంకులున్నాయి. త్రీఫేజ్ బో రుమోటార్లు కేవలం 60 మాత్రమే ఉండగా సింగిల్‌ఫేజ్ బోరుమోటార్లు 300లకుపైగా ఉన్నాయి. జగదేవ్‌పూర్ మండలం: 23 పంచాయతీలు, 40 హాబిటేషన్లు కలిపి 48 వేలకుపైగా జనాభా ఉన్నారు. మొత్తం 56 ఓవర్‌హెడ్ ట్యాంకులు ఉండగా 105 త్రీఫేజ్ బోరుమోటార్లు ఉన్నాయి. సింగిల్‌ఫేజ్ బోరుమోటార్లు ఏకంగా 308కి పైగా ఉన్నాయి. కొండపాక మండలం: 18 పంచాయతీలు, 42 హాబిటేషన్లు కలిపి 50 వేల జనాభా ఉండగా 52 ఓవర్‌హెడ్ ట్యాంకులున్నా యి. త్రీఫేజ్ బోరుమోటార్లు 102 ఉండగా, సింగిల్‌ఫేజ్ బోరుమోటార్లు 245కు పైగా ఉన్నాయి. ములుగు మండలం: 25 పంచాయతీలు, 42 హాబిటేషన్లు కలిపి 45 వేలకుపైగా జనాభా ఉన్నారు. 40 ఓవర్‌హెడ్ ట్యాంకులుండగా 88 త్రీఫేజ్ బోరుమోటార్లు, 156 సింగిల్‌ఫేజ్ బోరుమోటార్లున్నాయి. తూప్రాన్ మండలం: 22 పంచాయతీలు, 49 హాబిటేషన్లు కలిపి 62 వేలకుపైగా జనాభా ఉండగా 48 ఓవర్‌హెడ్ ట్యాంకులు, 116 త్రీఫేజ్ మోటార్లు, 190 సింగిల్‌ఫేజ్ మోటార్లున్నాయి. వర్గల్ మండలం: 18 పంచాయతీలు, 46 హాబిటేషన్లు కలిపి జనాభా 44 వేల వరకు ఉన్నారు. 44 ఓవర్‌హెడ్ ట్యాంకులు, 102 త్రీఫేజ్ మోటార్లు, 215కు పైగా సింగిల్‌ఫేజ్ బోరు మోటార్లు ఉన్నాయి. ఆ నీటితో ఫ్లోరైడ్ ముప్పు భూగర్భజలమట్టం పూర్తిగా పడిపోవడం వల్ల వెయ్యి ఫీట్ల లోతుకు బోరుబావులు తవ్వుతున్నారు. ఈ నీటిలో ఫ్లోరైడ్ ఉంటుంది. వీటిని శుద్ధి చేసుకుంటే వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. అలా చేయకపోతే ఇబ్బంది తప్పదు. ప్రభుత్వం చేపడుతున్న ‘వాటర్‌గ్రిడ్’ పథకం ద్వారా ఈ సమస్య పరిష్కారమవుతుంది. రిజర్వాయర్లలో నీటిని శుద్ధి చేసి అందిస్తాం కాబట్టి ఇక వ్యాధులు ఇబ్బంది ఉండదు. - విజయప్రకాశ్, ఎస్ఈ, మెదక్ జిల్లా వాటర్‌గ్రిడ్ సింగిల్ ఫేజ్ బోరే దిక్కు మా ఊల్లే ఇప్పటిదాక నల్లా కనెక్షన్ అంటే తెలియదు. సింగల్ ఫేజ్ మోటార్ల మీద ఆధారపడ్డం. దాని దగ్గర నుంచి పైపులైన్లు వేసుకున్నం. ఉదయం వరుస బట్టి నీళ్లు పట్టుకుంటం.ఎండకాలం వస్తే నీళ్లకు చాలా ఇబ్బం దులు అయితున్నయ్. మాది చిన్న గ్రామమని ఎవరు పట్టించుకుంట లేరు. - బొగ్గుల లక్ష్మి, గోపాల్పూర్, జగదేవ్‌పూర్ మండలం బోరుకు పైపులు ఏసుకుంటం కాలం ఎన్కకు పట్టింది. బోర్లు మర్లబడుతున్నయ్. శాన బోర్లల్ల నీళ్లు తగ్గినయ్. తాగు నీళ్ల కోసం పది మంది కలిసి సొం తంగా బోరేసుకున్నం. ఆ బోర్ల నీళ్లు పూర్తిగా లేకుండపోయినయ్. బడి దగ్గర స ర్కార్ బోరుకు పైపులు తలిగించి ఇండ్లల్లకు నీళ్లు తెచ్చుకుంటున్నం. - అండమ్మ, ఇప్పలగూడ, వర్గల్ మండలం -
మంచినీరే మహాభాగ్యం
విశ్లేషణ తెలంగాణలో పరిశుభ్రమైన మంచి నీటి వనరులు లేవు. భూగర్భ జలాలే ప్రధాన వనరు కావడం ఇందుకు కారణం. చాలా ప్రాంతాలలో చెరువుల ద్వారా లభించే ఉపరితల నీటి వనరులే ఇప్పటికి మంచివని తేలింది. ఫ్లోరైడ్ విషయం వరకు ఇది నిజమే. కానీ ఇలాంటి నీటిలో బాక్టీరియా సంబంధిత కాలుష్యం కలవర పరిచే స్థాయిలో ఉంది. నిజామాబాద్ జిల్లా జంగమపల్లె గ్రామంలో చేసిన ప్రయోగాల వల్ల ఇదే అంశం తేటతెల్లమైంది. నిజానికి బోర్వెల్ నీటితో ప్రజలు పెద్ద బెడదనే ఎదుర్కొంటున్నారు. మానవ మనుగడకు నీరు అత్యంతావశ్యకమని అందరికీ తెలుసు. కానీ మంచి ఆరోగ్యానికి పరిశుభ్రమైన తాగునీరు కూడా అంతే ఆవశ్యకమన్న వాస్త వాన్ని గుర్తించవలసి ఉంది. ఆ వాస్తవాన్ని ఆచరణలో పెట్టవలసిన తరుణ మిది. తాగునీరు బాక్టీరియా సంబంధిత కాలుష్యం లేనిదై ఉండాలి. తాగు నీటిలో ఫ్లోరైడ్, ఆర్సెనిక్ (పాషాణ సంబంధమైనవి) వంటి రసాయనాల శాతం తగుమాత్రంగానే ఉండాలి. తెలంగాణ జిల్లాల వరకు మంచినీటి సమ స్యకు అనేక కోణాలు ఉన్నాయి. కానీ ఆర్సెనిక్ ఇక్కడ తీవ్రమైన సమస్య కాక పోవచ్చు. కానీ ఫ్లోరైడ్ రాష్ట్రానికి గడ్డు సమస్యగానే పరిగణించాలి. కలవరా నికి గురి చేసే స్థాయిలో ఇక్కడి నీటిలో ఫ్లోరైడ్ కనిపిస్తున్నది. తేనీరు, వంటకు ఉపయోగించే నీరు, ఇతర పానీయాల ద్వారా; తాగునీటి కారణంగా అధిక శాతం ఫ్లోరైడ్ దేహంలో ప్రవేశించడం వల్ల మనుషులను జీవచ్ఛవాలను చేసే ఆ వ్యాధి సంక్రమిస్తుంది. పోషకాహార లోపం కూడా తన వంతు పాత్రను నిర్వహించి, ఫ్లోరోసిస్ విజృంభించడానికి ఆస్కారం కల్పిస్తున్నది. నిజానికి పశుపక్ష్యాదులు కూడా ఇందుకు మినహాయింపు కాదు. భారతగడ్డ మీద ఫ్లోరోసిస్ తన విషపు గోళ్లను ఇప్పటికే ఎంత లోతుకు దింపేసిందో గణాంకాల ద్వారా చూస్తే గగుర్పాటు కలుగుతుంది. 21 రాష్ట్రాలకు చెందిన ఆరుకోట్ల అరవై లక్షల మంది భారతీయులు దీని కోరలకు అతి సమీపంగా ఉన్నారు. అరవై లక్షల మంది ఫ్లోరోసిస్ వ్యాధి బారిన పడి శరీరం శిథిలమై, ఎముకలు బలహీనమై మంచమెక్కారు. కాబట్టి భారతదేశానికి సంబంధించి ఫ్లోరోసిస్ వ్యాధి ప్రజారోగ్యానికి అతి పెద్ద బెడదలలో ఒకటిగా మారిపోయిందన్న మాట తిరుగులేని వాస్తవం. అలాగే తెలంగాణలో కూడా. ఫ్లోరోసిస్ గ్రామీణ తెలంగాణ పాలిట శాపంగా మారింది. అక్కడ పోషకాహార లోపం చాలా ఎక్కువ. అందుకే ఫ్లోరోసిస్ వ్యాధి బారిన పడుతున్న వారు ఎక్కువగా ఉంటున్నారు. రక్షిత మంచినీటి సరఫరా లేకపోవడం వల్ల బాక్టీరియా సంబంధిత కాలుష్యం ఉన్న నీటి వినియోగం కూడా అక్కడ ఎక్కువే. ఇది కూడా ప్రజారోగ్యానికి సమస్యగా పరిణమించింది. సురక్షితం కాని నీరు వినియోగించడం వల్ల ప్రజలు అతిసారం లేదా విరేచనాల బారిన పడుతున్నారు. ఈ బాధతో మృత్యువాత పడుతున్నవారు దేశంలో 8.1 శాతం ఉన్నారు. అంటే వ్యాధులతో మరణిస్తున్న భారతీయులలో దీని కారణంగా మరణిస్తున్నవారు మూడో స్థానంలో ఉన్నారు. ఇ. కొయిలీ గణన విధానం ద్వారా నీటి వనరులలో బాక్టీరియా సంబంధిత కాలుష్యాన్ని అంచనా వేయవచ్చు. నీటిలో ఫ్లోరైడ్ స్థాయిని గమనించడానికి కేంద్ర ప్రభుత్వం అందించిన ఒక విధానం ఉంది. ఇది నెట్లో దొరుకుతుంది. కొన్ని కొత్త సంగతులు తెలంగాణలో లభ్యమవుతున్న నీటి గురించిన కొన్ని మౌలిక సత్యాలను చర్చించుకోవాలి. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాలలో వినియోగంలో ఉన్న నీరం తటా- ఎక్కువో, తక్కువో ఫ్లోరైడ్ ఉంది. జిల్లాలలో ప్రజలు ప్రస్తుతం వినియోగిస్తున్న నీటి నమూనాలు తీసుకుని అందులో ఫ్లోరైడ్ స్థాయిని ఇటీవల లెక్కించడం జరిగింది. ఇందుకోసం 10,368 నమూనాలు సేకరిం చారు. ఆదిలాబాద్ (297), కరీంనగర్ (1,322), ఖమ్మం (914), మహబూ బ్‌నగర్ (872), మెదక్ (616), నల్లగొండ (3,178), నిజామాబాద్ (203), రంగారెడ్డి (1,219), వరంగల్ (1,747) జిల్లాలలో అవసరం మేరకు వీటిని సేకరించారు. మంజీర, కృష్ణ, గోదావరి జలాలు నగరానికి అందుబాటులో ఉండడం వల్ల, వాన నీటి జలాశయాలు ఉన్నందువల్ల హైదరాబాద్ నగర పరిస్థితిని ఈ అధ్యయనంలో కలపలేదు. వీటిలో ఫ్లోరోసిస్ శాతాన్ని పార్ట్స్ పెర్ మిలియన్ (పీపీఎం) ప్రమాణంతో చూస్తారు. ఇది కనిష్టంగా 0.5 మించరాదు. కానీ ఈ పదివేల పైబడిన నమూనాలు వేటిలోనూ ఈ పీపీఎం 0.5 దగ్గర లేనేలేదు. అన్ని నమూనాలలోను కనిష్టంగా 1.51గా పీపీఎం నమోదైంది. ఆదిలాబాద్‌లో కనిష్టంగా 297 నమూనాలనే తీసుకున్నారు. ఆ సమస్యతో తీవ్రంగా బాధ పడుతున్న నల్లగొండ జిల్లా నుంచి సహజంగానే ఎక్కువ నమూనాలను సేకరించారు. అయితే విచిత్రంగా ఆదిలాబాద్ సమస్య నల్లగొండను మించి పోయిందని రూఢీ అయింది. తరువాత వరసగా రంగారెడ్డి, ఖమ్మం, మెదక్ జిల్లాలు తీవ్రత విషయంలో ముందు ఉన్నాయి. 1975లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నాటి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(ఎన్ఐఎన్) అధిపతి డాక్టర్ శ్రీకాంతయ్య ఆధ్వర్యంలో ఈ అంశం మీద గోష్టి ఏర్పాటయింది. అందులో కూడా పీపీఎం 0.5కు మించరాదనే నిర్ధారించారు. భారత ప్రభుత్వం, ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించిన ప్రమాణమైనా ఒక శాతం పీపీఎం. కానీ, 1970లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫ్లోరోసిస్ మీద ప్రచురించిన పుస్తకం కోసం రాసిన వ్యాసంలో ప్రఖ్యాత వైద్యుడు, పరిశోధకుడు డాక్టర్ సిద్దికీ ఒక శాతం పీపీఎం ఉన్న నీటితో కూడా తీవ్ర పరిణామాలు ఎదురైన సంగతి తన అనుభవంలో ఉందని పేర్కొన్నారు. శీతల దేశం కాబట్టి మన పక్కనే ఉన్న చైనా పీపీఎం శాతాన్ని 0.7 వరకు భరించవచ్చునని లక్ష్మణరేఖ పెట్టుకుంది. మనది వేడి దేశం కాబట్టి 0.5 శాతం పీపీఎం మించరాదన్నదే ఎక్కువ మంది నిపుణుల అభిప్రాయం. పరిశుభ్రమైన నీటి వనరులు లేవు మొత్తానికి తేలేదేమిటంటే, తెలంగాణలో పరిశుభ్రమైన మంచి నీటి వనరులు లేవు. భూగర్భ జలాలే ప్రధాన వనరు కావడం ఇందుకు కారణం. చాలా ప్రాంతాలలో చెరువులు ద్వారా లభించే ఉపరితల నీటి వనరులే ఇప్పటికి మంచివని తేలింది. ఫ్లోరైడ్ విషయం వరకు ఇది నిజమే. కానీ ఇలాంటి నీటిలో బాక్టీరియా సంబంధిత కాలుష్యం కలవరపరిచే స్థాయిలో ఉంది. నిజామాబాద్ జిల్లా జంగమపల్లె గ్రామంలో చేసిన ప్రయోగాల వల్ల ఇదే అంశం తేటతెల్లమైంది. ఇక్కడ మూడు చెరువులు, మూడు దిగుడు బావులు, మూడు బోర్వెల్స్లోని భూగర్భ జలాలను పరీక్షించారు. వీటిలో ఫ్లోరైడ్ శాతం 0.56, 0.63, 0.26, 0.67 - ఇదే ప్రమాణాలలో కనిపించింది. ఒక బోర్వెల్ నీటిలో మాత్రం 1.39 ఫ్లోరైడ్ కనిపించింది. ఈ బోర్వెల్ నీరు తాగుతున్న ప్రజలకు ఆ వ్యాధి బెడద ఉంది. మొత్తంగా చూస్తే జంగమపల్లెలో ఈ సమస్య లేదు. నిజానికి బోర్వెల్ నీటితో ప్రజలు పెద్ద బెడదనే ఎదుర్కొంటున్నారు. ఒకే గ్రామంలో రెండు చోట్ల బోర్‌వెల్స్ నీటిని పరీక్షిస్తే ఫ్లోరైడ్ శాతం వేర్వేరుగా ఉంది. నల్లగొండ జిల్లా ఎల్లారెడ్డిగూడలో ఒక బోర్వెల్ నీటిలో 1.45 నుంచి 8.8 పీపీఎం కనిపించింది. ఇలాంటి చోట ఫ్లోరైడ్ శాతం తక్కువగా ఉన్న బోర్వెల్ నుంచి నీరు తాగడం తప్పనిసరి. ఫ్లోరైడ్ ఎక్కువగా ఉంటే తేనీటిని కూడా తీసుకోకపోవడం ఉత్తమం. కాబట్టి ప్రతి బావి దగ్గర ఫ్లోరైడ్ ఏ మేరకు ఉన్నదో తెలియచేసే బోర్డులు పెట్టి, ఆ మేరకు ప్రజలలో చైతన్యం తీసుకు రావలసిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. ఫ్లోరైడ్ ఉన్న నీటిని నేరుగా తీసుకుంటేనే ఫ్లోరోసిస్ వస్తుందనుకుంటే పొరపాటు. వంట కోసం ఉపయోగించినప్పటికీ సమస్య తప్పదు. ఏ విధంగా చూసినా భూగర్భ జలాలలో ఫ్లోరైడ్ పెరుగుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రజలకు అందుబాటులో ఉన్న కొన్ని నివారణ చర్యలను గురించి వెల్లడించడం అవసరం. కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ -సి చాలి నంతగా తీసుకుంటే సమస్య పరిష్కారమవుతుంది. అవసరమైన మేర కాల్షి యం తీసుకుంటే దేహంలో తిష్ట వేసిన ఫ్లోరైడ్‌ను తగ్గిస్తుంది. పెరిగే పిల్లల కోసం ఇది మరింత అవసరమని గుర్తించాలి. ఇక్కడ మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని ఉదాహరణగా చెప్పాలి. ఈ సమస్యను తీవ్ర స్థాయిలో ఎదుర్కొంటున్న రాష్ట్రా లలో ఇదొకటి. కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ -సిలను ఉపయోగించడం వల్ల వ్యాధి తీవ్ర స్థాయిలో ఉన్న చిన్నారులు కూడా ఉపశమనం పొందగలి గారు. ఫ్లోరైడ్ బెడద లేని ఉపరితల నీటిని ప్రజలకు అందించాలని ఈ మధ్య ఆ రాష్ట్ర హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం గమనించదగినది. కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఎన్నో పథకాలు చేపడుతు న్నాయి. సంక్షేమం ఇదివరకటి కంటే కొత్త రూపాన్నీ, విస్తృతినీ సంతరించు కుంది కూడా. ప్రభుత్వాల దృష్టి ఇంత విశాలమైనప్పుడు ఇప్పటికీ కొన్ని ప్రాంతాల ప్రజల జవజీవాలను తోడేస్తున్న ఈ సమస్య గురించి ఆలోచించక పోవడం మంచిది కాదు. నగరవాసులకైనా, గ్రామీణ ప్రాంతాలకైనా ఆరోగ్య భద్రత సమంగానే ఉండాలి. రక్షిత మంచినీరో, పరిశుభ్రమైన నీరో పట్టణా లకూ, నగరాలకూ పరిమితం చేయడం తీవ్ర సమస్యలకు దారి తీస్తుంది. జీవనదుల నుంచి ఈ ప్రాంతాలకు నీటిని సరఫరా చేయడమే సమస్య పరిష్కారానికి ఉన్న గొప్ప అవకాశం. వాన నీటిని పదిలం చేసే ప్రక్రియను ప్రోత్సహించడం మరొకటి. 1975 నుంచి తీవ్రతను చూపుతున్న ఈ వ్యాధిని నిరోధించడం ఉద్యమ ప్రాతిపదికన జరగాలి. నిరంతర పరిశోధన నేటి అవసరం. ఇందుకు ప్రత్యేక సంస్థలను ఏర్పాటు చేయాలి. కొత్త నీటి ఒప్పందాలు జరుగుతున్నాయి. తెలంగాణ నేల సస్యశ్యామలమవుతుందని అంతా ఆశిస్తున్నారు. నేల పచ్చగా ఉండడంతో పాటు, ప్రజలు కూడా ఆరోగ్యంతో ఉండాలి. అప్పుడే సమగ్ర అభివృద్ధికి అర్థం. - డా.దేమె రాజారెడ్డి (వ్యాసకర్త ప్రముఖ వైద్యులు. ఫ్లోరోసిస్ పరిశోధకులు) 98480 18660 -
‘డిండి’పై కొత్త వివాదం!
♦ కల్వకుర్తి ఆయకట్టుపై పాలమూరు, డిండి ఇంజనీర్ల మధ్య విభేదాలు ♦ 90వేల ఎకరాలకల్వకుర్తి ఆయకట్టుకు నష్టం: పాలమూరు ఇంజనీర్లు ♦ నష్టం తక్కువేనంటున్న డిండి ఇంజనీర్లు.. విభేదాలతో ఆగిన టెండర్లు సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు ఉద్దేశించిన డిండి ప్రాజెక్టు డిజైన్‌లో మార్పులు చేర్పులపై వివాదం రగులుకుంది. డిండి ప్రాజెక్టు కొత్త అలైన్మెంట్తో తమ జిల్లాలోని కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టు ఆయకట్టుకు భారీగా నష్టం జరుగుతుందని మహబూబ్‌నగర్ ఇంజనీర్లు... ఎవరి నుంచి ఏరకమైన ఫిర్యాదులు లేకపోయినా ‘పాలమూరు’ ఇంజనీర్లు కావాలని వివాదం చేస్తున్నారని నల్లగొండ ఇంజనీర్లు వాదనకు దిగుతున్నారు. తొలి ప్రతిపాదనల ప్రకారం శ్రీశైలంలో వరద ఉండే 60 రోజుల్లో రోజుకు 0.5 టీఎంసీ నీటిని తరలించడం ద్వారా 30 టీఎంసీల నీటిని ఏదుల రిజర్వాయర్ నుంచి డిండికి తరలించేలా ప్రణాళిక తయారు చేశారు. అయితే హైదరాబాద్ అవసరాలకు 20 టీఎంసీలు, రంగారెడ్డి జిల్లాలో లక్ష ఎకరాలకు నీరిచ్చేందుకు మరో 10 టీఎంసీలు అవసరమని లెక్కించి.. ఈ నీటిని కూడా డిండి ద్వారా తరలించేలా కొత్తగా ప్రతిపాదనలు రూపొందించారు. ఇందుకోసం శ్రీశైలం నుంచి రోజుకు 0.5 టీఎంసీలకు బదులు ఒక టీఎంసీ చొప్పున తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉండే ఏదుల రిజర్వాయర్ నుంచే డిండికి నీటిని తరలించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే ఏదుల రిజర్వాయర్ ఎత్తు 445 మీటర్లుకాగా, అప్పర్ డిండి ఎత్తు 396 మీటర్లు ఉంటుంది. దీంతో అంతదూరం నుంచి నీటిని తరలించే బదులు 430 మీటర్ల ఎత్తు వద్దే రిజర్వాయర్ నిర్మించి... కాల్వల ద్వారా నీటిని తరలించాలని కొత్తగా ప్రతిపాదించారు. వివాదమంతా ఇక్కడే.. డిండికి రోజుకు అదనంగా 0.5 టీఎంసీ సరఫరా పెంచాలని నిర్ణయించడంతో... పాలమూరు ప్రాజెక్టుకు కేవలం రోజుకు ఒక టీఎంసీ నీటి లభ్యతే ఉంటోంది. ఈ నేపథ్యంలో 60 రోజుల పాటు ఈ నీటిని తరలించి 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించడం సాధ్యం కాదని పాలమూరు ప్రాజెక్టు అధికారులతో పాటు జిల్లా ప్రజా ప్రతినిధులు అభ్యంతరం లేవనెత్తుతున్నారు. మారిన డిండి అలైన్మెంట్ కారణంగా కల్వకుర్తి ప్రాజెక్టు కింద 90 వేల ఎకరాల ఆయకట్టు దెబ్బతినే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇక 430 మీటర్ల వద్ద కొత్తగా రిజర్వాయర్ నిర్మిస్తే... ఇర్విన్ దగ్గర 4.5 టీఎంసీలు, జేపల్లి వద్ద ఒక టీఎంసీ సామర్థ్యం గల రిజర్వాయర్లను చేపట్టాల్సి వస్తుందని డిండి అధికారులు తేల్చారు. దీనిపైనా పాలమూరు అధికారులు అభ్యంతరం లేవ నెత్తారు. వాటితో కల్వకుర్తి ఆయకట్టు మరికొంత దెబ్బతింటుందని చెబుతున్నారు. మరోవైపు డిండి ఇంజనీర్లు మాత్రం.. కొత్త డిజైన్ ద్వారా మహబూబ్‌నగర్ జిల్లాలో అదనంగా 50వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుందని లెక్కలేశారు. అదే సమయంలో కల్వకుర్తి కింద 3 వేల ఎకరాలకు మించి నష్టముండదని అంటున్నారు. నార్లాపూర్ ఇన్‌టేక్ సామర్థ్యాన్ని 2 టీఎంసీల నుంచి 3 టీఎంసీలకు పెంచి... డిండికి ఒక టీఎంసీ నీటిని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు 2 టీఎంసీల నీటిని తరలించాలని సూచిస్తున్నారు. తద్వారా రెండు ప్రాజెక్టులకు ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. టెండర్లు ఆలస్యం డిండి ప్రాజెక్టులో భాగంగా నల్లగొండ జిల్లాలో చేపట్టే రిజర్వాయర్ల టెండర్లను గత మంగళవారమే పిలవాల్సి ఉంది. కానీ కల్వకుర్తి ఆయకట్టు నష్టంపై తేలేవరకు టెండర్లు పిలవరాదని పాలమూరు ప్రాజెక్టు అధికారులు సూచించడంతో ప్రక్రియ నిలిచిపోయింది. అయితే ఇప్పటివరకు కల్వకుర్తి ఆయకట్టు చిత్రాలు అధికారుల వద్ద లేవు. పూర్తిస్థాయి సర్వే పూర్తయితేగానీ నష్టపోయే ఆయకట్టు ఎంతన్నది తేలే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టు ప్రాంతాలు, ప్రస్తుత డిండి ప్రాజెక్టుతో నష్టపోయే ఆయకట్టు వివరాలను తెలపాలని డిండి సీఈ శుక్రవారం కల్వకుర్తి ఎస్ఈకి లేఖ రాశారు. ఈ వివాదంపై శనివారం మంత్రి హరీశ్‌రావు సైతం సమీక్షించే అవకాశం ఉంది. -
'ప్రకాశంలో ఫ్లోరైడ్ నివారణకు నిధులు'
ఒంగోలు టౌన్ : ప్రకాశం జిల్లాను ఫ్లోరైడ్ రహిత ప్రాంతంగా చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి శిద్ధా రాఘవరావు ఆదేశించారు. బుధవారం ఒంగోలులో ఫ్లోరైడ్ అంశంపై వైద్య ఆరోగ్యశాఖ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ఫ్లోరైడ్ బాధితులు పెద్ద సంఖ్యలో పెరిగిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని నివారించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు. అందుకు అవసరమైన నిధులు విడుదల చేస్తామని మంత్రి రాఘవరావు తెలిపారు. -
సుజలమేదీ!
మొక్కుబడిగా ఎన్టీఆర్ సుజల పథకం రూ.2కే 20 లీటర్ల నీరు హామీకి మంగళం పట్టించుకోని ప్రభుత్వం ముందుకు రాని దాతలు మంచి నీరందక రోగాల బారిన జనం చాలా గ్రామాల్లో ఫ్లోరైడ్ నీళ్లే దిక్కు ‘‘తాగునీటిని వారం రోజు ల పాటు నిల్వ ఉంచుకుని తాగడం వల్లే రోగాలు వస్తాయి. నీటిని నిల్వ ఉంచుకుని వాడుకోకూడదు’’ అని వైద్యులతోపాటు సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చెబుతున్నారు. చిత్తూరు : ప్రతిరోజూ స్వచ్ఛమైన మంచి నీటిని అందిస్తే ప్రజలు ఆ నీటినే సేవించేవారు. కానీ జిల్లాలో వారం రోజుల కొకమారు మాత్రమే ప్రజలకు తాగునీరు అందుతోంది. దొరికిన నీటిని నిల్వ ఉంచుకుని జాగ్రత్తగా వాడుకోవాల్సి వస్తోంది. ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా ప్రజ లందరికీ రూ.2లకే 20 లీటర్ల స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తానని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించి ఏడాది ముగుస్తోంది. ఈ పథకం ద్వారా తాగునీరు పూర్తిస్థాయిలో సరఫరా చేయడం లేదు. జిల్లాలో తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు ప్రాంతాల్లో ఫ్లోరైడ్ నీరే దిక్కు. చివరకు ఆ ప్రాంతాల్లో కూడా సుజలం అందడం లేదు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కుప్పంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. తొలుత ప్రభుత్వమే ప్రజలకు స్వచ్ఛమెన నీటిని అందిస్తుందని ప్రకటించారు. ఇప్పుడు మాట మార్చారు. ఎన్టీఆర్ సుజల పథకానికి ఒక్కపైసా నిధులు కూడా వెచ్చించేందుకు ప్రభుత్వం ససేమిరా అంటోంది. దాతలు ముందుకొస్తే తప్ప ఈ పథకాన్ని కొనసాగించలేమని తేల్చి చెప్పింది. దాతలు నామమాత్రంగా కూడా ముందుకు రాకపోవడంతో ఈ పథకం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉండిపోయింది. ఇప్పటివరకు జిల్లాలో కుప్పంలో 18 ప్లాంట్లు, చిత్తూరులో 3, శ్రీకాళహస్తిలో 4, నగరిలో 2, పలమనేరు, పుంగనూరు, సత్యవేడు, చంద్రగిరి నియోజకవర్గాల్లో ఒక్కొక్కటి చొప్పున ఎన్టీఆర్ సుజల పథకం ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కుప్పం మినహా మిగిలిన ప్రాంతాల్లో ఈ ప్లాంట్లు పూర్తిస్థాయిలో నడిచే పరిస్థితి లేకుండా పోయింది. గంటకు 500 లీటర్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్ ఏర్పాటుకు రూ.1.5లక్షలు ఖర్చు కాగా, 2వేల లీటర్ల సామర్థ్యం ప్లాంట్‌కు రూ.3.5లక్షలు వెచ్చించాల్సి ఉంది. పెద్ద ప్లాంట్లు కాకుండా చిన్న చిన్న ప్లాంట్ల ఏర్పాటు చేసేందుకైనా దాతలను వెతకమని అధికారులను ఆదేశించింది. దీంతో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో చిన్న చిన్న పారిశ్రామికవేత్తలతో పాటు ఆర్థిక సామర్థ్యం కలిగిన వారితో పలుమార్లు సమావేశాలు నిర్వహించి ఒప్పించే ప్రయత్నం చేశారు. అయితే ఎవరూ ముందుకు రాలేదు. పైగా ఎన్టీఆర్ పేరు పెట్టుకుని ప్రభుత్వం ఖర్చు పెట్టకుండా మేమెందుకు నిధులు ఖర్చు పెట్టాలంటూ కొందరు అధికారులను నిలదీశారు. దీంతో ఈ పథకం అటకెక్కింది. ఫ్లోరైడ్ ప్రాంతాల్లో మొదటి ప్రాధాన్యత కింద వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆ తరువాత ఆ హామీని గంగలో కలిపింది. జిల్లా ప్రజల సంగతి దేవుడెరుగు కనీసం ఫ్లోరైడ్ ప్రాంతాల్లోనైనా వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి ప్రజలకు తాగునీటిని అందిస్తారనుకుంటే అధికారులు ఆ దిశగా ఎటువంటి చర్యలు చేపట్టలేదు. జిల్లా ప్రజలు ఓవైపు ఫ్లోరైడ్ నీరు, మరోవైపు వారానికి ఒకమారు వచ్చే నీటిని తాగి అనారోగ్యం బారిన పడుతున్నారు. జిల్లాకు సంబంధించి ప్రజల అవసరాల కోసం, అభివృద్ధి కోసం ఎన్ని కోట్లు నిధులైనా ఇస్తానని పదేపదే చెబుతున్న ముఖ్యమంత్రి ఒట్టిమాటలతో సరిపెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా దాతల సంగతి పక్కనపెట్టి ప్రభుత్వం ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని ప్రజలు కోరుతున్నారు. -
టైటిల్ పోరుకు బోపన్న జంట
స్టుట్గార్ట్ (జర్మనీ): మెర్సిడెస్ కప్ టెన్నిస్ టోర్నమెంట్లో రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) ద్వయం ఫైనల్లోకి అడుగుపెట్టింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో బోపన్న-మెర్జియా జంట 6-3, 6-7 (6/8), 10-7తో రెండో సీడ్ జిమోనిచ్ (సెర్బియా) -మట్కోవ్‌స్కీ (పోలండ్) జోడీపై సంచలన విజయం సాధించింది. 71 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న జంట 11 ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను ఒకసారి బ్రేక్ చేసింది. రెండో సెట్‌ను టైబ్రేక్‌లో కోల్పోయినప్పటికీ... నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లో బోపన్న ద్వయం పైచేయి సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది. -
ఫ్లోరోసిస్‌పై దృష్టి పెట్టండి..
కలెక్టర్‌కు సూచించిన ఎంపీ వైవీ ఒంగోలు టౌన్ : ‘జిల్లాలోని 48 మండలాల్లో ఫ్లోరోసిస్ సమస్య ఉంది. అక్కడి ప్రజలు ఫ్లోరైడ్ నీటిని తాగడం వల్ల అనారోగ్యం బారిన పడుతున్నారు. ఫ్లోరోసిస్ ప్రభావిత ప్రాంతాల్లో ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయాలి. అక్కడి ప్రజలకు సురక్షితమైన మంచినీటిని అందించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని’ ఒంగోలు పార్లమెంటు సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి కలెక్టర్ సుజాతశర్మకు సూచించారు. ఆదివారం మధ్యాహ్నం స్థానిక క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌ను ఎంపీ కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు సమస్యలపై ఆమెతో చర్చించారు. ఫ్లోరోసిస్ మహమ్మారి వల్ల ప్రజలు ఏవిధంగా మారిపోయారో కొన్ని ప్రాంతాలకు చెందిన బాధితుల ఫొటోలను కలెక్టర్‌కు చూపించారు. చిన్న వయస్సులోనే వృద్ధాప్య పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందన్నారు. ఫ్లోరోసిస్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సుబ్బారెడ్డి సూచించారు. అదేవిధంగా జిల్లాలోని అనేక ప్రాంతాల్లో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. ప్రజలకు నీటిని అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. నీటి సమస్య ఎదుర్కొంటున్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని సూచించారు. జిల్లాలోని నిరుద్యోగ యువతకుస్కిల్ డెవలప్మెంట్కు సంబంధించి ప్రత్యేకంగా సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా నిరుద్యోగులు తమ ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచుకునేందుకు వీలు కలుగుతుందని వైవీ సుబ్బారెడ్డి వివరించారు. ఎంపీ వెంట వైపాలెం ఎమ్మెల్యే డేవిడ్‌రాజు ఉన్నారు. ఎంపీని కలిసిన పలువురు నాయకులు ఒంగోలు అర్బన్: ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని ఆయన కార్యాలయంలో పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు, ప్రజలు ఆదివారం ఎంపీని కలిసారు. గిద్దలూరు, వైపాలెం, సంతనూతలపాడు ఎమ్మెల్యేలు ముత్తుముల అశోక్‌రెడ్డి, పాలపర్తి డేవిడ్‌రాజు, ఆదిమూలపు సురేష్, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, యూత్ అధ్యక్షుడు గొట్టిపాటి భరత్ తదితరులు ఎంపీని కలిసి నియోజకవర్గ పరిస్థితులను వివరించారు. పార్టీ నగర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ ఇతర నాయకులతో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పలు విషయాలపై చర్చించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఎంపీ తప్పక సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎంపీని కలిసిన వారిలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున, రాష్ట్ర కార్యదర్శి కె.వి.రమణారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు కఠారి శంకర్, ట్రేడ్‌యూనియన్ జిల్లా అధ్యక్షుడు కె.వి.ప్రసాద్, విజయవాడ ఇన్చార్జ్ వై.వెంకటేశ్వర్లు, సంతనూతలపాడు మండల నాయకుడు దుంపా చెంచిరెడ్డి, మద్దిపాడు మండల నాయకులు మండవ అప్పారావు, నాయకులు మారెళ్ల బంగారుబాబు, చింతా శ్రీనివాసరావు, జాజుల కృష్ణ తదితరులు ఉన్నారు. కనిగిరిలో నేడు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పర్యటన సీఎస్‌పురం : కనిగిరి నియోజకవర్గంలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సోమవారం పర్యటించనున్నట్లు పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ బుర్రా మధుసూదన్‌యాదవ్ తెలిపారు. ఉదయం 9 గంటలకు కనిగిరి, 11 గంటలకు వెలిగండ్ల, మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎస్‌పురం, గం.2.30కు పామూరుల్లో పర్యటిస్తారని చెప్పారు. నియోజకవర్గంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. -
పార్లమెంటులో ఫ్లోరైడ్ సమస్య
⇒ వై.ఎస్. జీవించి ఉంటే ఫ్లోరైడ్ రహిత జిల్లాగా మారి ఉండేది ⇒ రూపుమాపాలంటే జిల్లాకు వెయ్యికోట్లు కేటాయించాలి ⇒ లోక్‌సభలో ప్రకాశం, నల్గొండ సమస్యలపై ఎంపీ వైవీ ప్రస్తావన ఒంగోలు: జిల్లాలో వివిధ వర్గాలను పట్టి పీడిస్తున్న ఫ్లోరోసిస్ బాధితుల వెతలను ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పార్లమెంటులో ప్రస్తావించారు. ప్రకాశం జిల్లాలో ఫ్లోరోసిస్ నేటికీ వెంటాడుతోంది. ఈ సమస్యను రూపుమాపేందుకే అప్పట్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని వెలిగొండకు తీసుకొని వచ్చి కనిగిరి, హనుమంతునిపాడు మండలాలను ఫ్లోరైడ్ రహిత మండలాలుగా చేయాలని భావించి ప్రారంభించారు. మొత్తం 5,600 కోట్లకుగాను ఇంకా రూ.3,800 కోట్లు అవసరమవుతాయి. ఈ ప్రాజెక్టు పట్ల ప్రభుత్వం చిన్న చూపు కనబరుస్తోంది. ఈ నేపథ్యంలో ఫ్లోరోసిస్ పీడిత ప్రాంతాలను, ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రజానీకాన్ని, ఆ ప్రాంత పశుగణాలను కాపాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని లోక్‌సభలో బుధవారం ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఇంకా తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ దాదాపు శతాబ్ద కాలంగా కనిగిరి సమీప ప్రాంతాల ప్రజలు ఫ్లోరోసిస్‌తో బాధపడుతున్నారన్నారు. అక్కడి ప్రజలు కేవలం తాగేందుకు సురక్షితమైన నీటిని అందించాలని వేడుకుంటున్నారు. ఇదే పరిస్థితి తెలంగాణా రాష్ట్రంలోని నల్గొండలో కూడా ఉంది. ప్రకాశం జిల్లాలో 56 మండలాలకుగాను 48 మండలాల్లో ఈ సమస్య ఉందన్నారు. కేవలం తాగునీటిలోనే కాకుండా భూగర్భ జలాల్లోనే ఈ సమస్య ఉందని, తద్వారా తాగునీరే కాకుండా భూగర్భ జలాల ద్వారా పండిన గడ్డిని మేస్తున్న పశువులు కూడా బాధపడుతున్నాయన్నారు. భూగర్భ జలాల్లోనే మార్పు తీసుకురావాలంటే ఈ ప్రాంతానికి సాగర్ జలాలు రావాల్సిన అవసరం ఉందన్నారు. సురక్షితమైన తాగునీరు అందించేందుకు యుద్ధ ప్రాతిపదికన వెయ్యి కోట్లు మంజూరు చేయాలని కోరుతున్నామన్నారు. ఒక వేళ అది సాధ్యపడదని భావిస్తే ఫ్లోరోసిస్ ప్రభావానికి తీవ్రంగా గురైన 12 మండలాలకు వంద కిలోమీటర్ల దూరం పైపులైన్లు వేసి సాగర్ నీటిని అందించాలని విజ్ఞప్తి చేశారు. అన్ని ప్రభావిత ప్రాంతాల్లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ ప్రాంతాలలో కిడ్నీవ్యాధిగ్రస్తులు పెరిగిపోయారని, వారు డయాలసిస్ సెంటర్‌కు చేరుకోవాలంటే కనీసంగా వంద కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుందన్నారు. మానవతా దృక్పథంతో పరిశీలించి కనిగిరి సమీప ప్రాంతాలలోనే డయాలసిస్ సెంటర్లు కొత్తగా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అవసరమైన మందులు, పౌష్టికాహారం అందించేందుకు చొరవ చూపాలని డిమాండ్ చేశారు. 2012 ఏప్రిల్ నాటికి జాతీయ స్థాయిలో ఫ్లోరోసిస్‌ను రూపుమాపాలని లక్ష్యంగా నిర్థేశించుకున్నప్పటికీ ఇప్పటివరకు కేవలం 470 గ్రామాలలో మాత్రమే సర్వే జరిగిందని, ఇంకా 317 గ్రామాలలో సర్వే జరగలేదన్నారు. ఇక మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్ అభియాన్ పథకానికి శ్రీకారం చుట్టడాన్ని అభినందిస్తున్నానన్నారు. 2001 నుంచి 2011 వరకు పరిశీలిస్తే ఏడాదికి ఒక శాతం చొప్పున మాత్రమే మరుగుదొడ్ల పెరుగుదల కనిపించిందన్నారు. ప్రస్తుతం దీనికోసం గతంలో 12,187 కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది దీనికి అందులో సగం మాత్రమే కేటాయించారని, ఈ లెక్కన వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలంటే 2081వ సంవత్సరానికి సాధ్యం అవుతుందేమో అన్నారు. కానీ ఏపీలో మాత్రం 65శాతానికిపైగా మరుగుదొడ్లు లేని కుటుంబాలున్నాయన్నారు. 72,176 కుటుంబాలకుగాను 18,674 కుటుంబాలకు మాత్రమే రోజుకు కనీసంగా 55 లీటర్ల తాగునీరు అందుతుందని, మిగిలిన గ్రామాలలోని ప్రజానీకానికి ఇప్పటికీ 55 లీటర్ల తలసరి నీరు అందకపోవడం బాధాకరమన్నారు. -
ఫ్లోరైడ్ పాపం ఆ.. పార్టీలదే
నల్లగొండ రూరల్ : ‘మునుగోడు మండలంలోని ఒక్క గ్రామంలో ఉన్న ఫ్లోరైడ్ భూతం జిల్లా అంతటా పాకింది. ఇప్పుడు జిల్లాలోని వెయ్యికి పైగా గ్రామాలకు ఫ్లోరైడ్ పాకిందంటే ఆ పాపం ఇప్పటివరకు తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన వారిదే. ఆ పార్టీలు చేసిన పాపం కారణంగానే జిల్లా ఫ్లోరైడ్ రక్కసి బారిన పడింది.’ అని తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. మిషన్ కాకతీయ కార్యక్రమంలో భాగంగా ఆయన నల్లగొండ మండలంలోని అన్నెపర్తి తూర్పు చెరువు, కంచనపల్లి చెరువుల్లో పూడిక తీత పనులను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో చెరువులను ఎండబెట్టి, పెద్ద పెద్ద ప్రాజెక్టులను ఆంధ్ర ప్రాంతంలో కట్టిన పార్టీల వైఖరి కారణంగానే నల్లగొండ జిల్లా నష్టపోయిందని అన్నారు. ఒకప్పుడు గొలుసుకట్టు చెరువులతో అలరారిన జిల్లా ఇప్పుడు తాగు, సాగునీరు లేక ఇబ్బందులు పడేందుకు వారి అసమర్థతే కారణమని ఆయన విమర్శించారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవి, చెప్పనవి కూడా చేస్తూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా కార్యక్రమాలు చేపట్టి చిత్తశుద్ధితో ముందుకు వెళుతుండడంతో ఆ పార్టీల నేతలకు మొహం చెల్లడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. ‘గత ఎన్నికలలో మీకు కూడా కొందరు తెలిసో తెలియకో ఓట్లు వేశారు. ఓట్లు వేసినందుకు అయినా అభివృద్ధి జరిగే దగ్గరికి రావాలి కదా... కానీ రారు. అక్కడ కూర్చుని కుట్రలు చేస్తుంటారు. జిల్లా ఇట్లనే ఉండాలె. అభివృద్ధి కావద్దు. ప్రజలిట్లనే ఉండాలె. ఇదీ వాళ్ల ఏడుపు.’ అని ఆయన కాంగ్రెస్ నేతలనుద్దేశించి వ్యాఖ్యానించారు. వాళ్ల పీఠాలు కదులుతున్నాయని, ఉనికి లేకుండా పోతుందని తమపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలకు అవసరమైన కార్యక్రమాలు చేపడుతున్న కారణంగానే ప్రజలు పెద్ద ఎత్తున తమ వెంట వస్తున్నారని, వారికి అనుగుణంగా నాయకులు కూడా కలిసి వస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఎవరెన్ని చేసినా తమ లక్ష్యం నెరవేరడంలో చిత్తశుద్ధితో ముందుకు వెళతామని అన్నారు. ప్రజలు భాగస్వాములు కావాలి కాకతీయుల కాలం నుంచి తెలంగాణ వ్యవసాయానికి తల మానికంగా నిలిచిన చెరువులను అభివృద్ధి చేసుకోవడంలో ప్రజలు భాగస్వాములు కావాలని మంత్రి జగదీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. మన ఊర్లను మనమే బాగుచేసుకోవాలని, మన చెరువులను మనమే అభివృద్ధి చేసుకోవాలని ఆయన కో రారు. ఇందు కోసం ప్రజలు ఇదే చైతన్యం, స్ఫూర్తితో ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమంలో పాలుపంచుకోవాలని ఆయన కోరారు. ‘వర్షం చుక్క వచ్చింది వచ్చినట్టు ఆగాలె. ఆ నీళ్లే గ్రామంలో అన్ని అవసరాలు తీర్చాలె. తాగు, సాగు నీరే కాదు చెరువుల్లో బట్టలు ఉతకడం, పిల్లలు ఈతలు కొ ట్టడం మళ్లీ మనం చూడాలె. మన ఊర్లను మనం బాగు చేసుకోవాలె.’అని ఆయన ఆకాంక్షించారు. మిషన్‌కాకతీయ లో భాగంగా ఈ ఏడాది జిల్లాలో 900 చెరువులను పునరుద్ధరించే పనులు చేపడుతున్నామని, ఇందుకోసం రూ. 500-600 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నామని ఆయన వెల్లడించారు. పలుగు పట్టి.. మట్టి ఎత్తిపోసి అన్నెపర్తి తూర్పు చెరువు పూడికతీత పనులను ప్రారంభించిన సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి రైతు బిడ్డ అవతారమెత్తారు. నెత్తికి తలపాగా చుట్టి నడుం బిగించిన ఆయన పలుగు పట్టి మట్టిని తవ్వారు. పారతో మట్టిని ఎత్తి ట్రాక్టర్లో పోశారు. ఆ తర్వాత జేసీబీ ద్వారా తీయించిన మట్టితో ఉన్న ట్రాక్టర్‌ను స్వయంగా ఆయనే నడుపుకుంటూ వెళ్లారు. పార్లమెంటరీ కార్యదర్శి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్, ఎమ్మెల్సీ పూల రవీందర్‌లు కూడా మంత్రితో పాటు పూడిక తీత పనుల్లో తలపాగా చుట్టి మట్టిని ఎత్తి పోశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి దుబ్బాక నర్సింహారెడ్డి, సర్పంచ్‌లు ఏదుల పుష్పలత, కాసర్ల విజయ, ఎంపీపీ దైద రజిత, జడ్పీటీసీ తుమ్మల రాధ, ఎంపీటీసీలు పొగాకు అండాలు, గట్టయ్య, స్థానిక టీఆర్ఎస్ నేతలు బకరం వెంకన్న, ఏదుల అరుణాకర్‌రెడ్డి, శ్రీనాథ్‌గౌడ్, బొట్టు లింగయ్య, నారబోయిన భిక్షం, సురేందర్, మేకల వెంకన్న యాదవ్, నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ బోయపల్లి కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు అభిమన్యు శ్రీనివాస్, దండెంపల్లి సత్తయ్య, మారగోని నవీన్‌గౌడ్, గుండ్లపల్లి సర్పంచ్ పనస శంకర్, టీఆర్ఎస్ నాయకులు మెరుగు గోపి, అబ్బగోని రమేశ్, విజయ్, రాజేశ్, సింగం రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ, కాంగ్రెస్‌లకు చెందిన పలువురు నేతలు టీఆర్ఎస్లో చేరారు. -
ఫ్లోరిన్ పీడ విరగడ ఎన్నడో
స్థల వివాదం ముగిసినా మొదలుకాని పనులు ఊసేలేని తాత్కాలిక కార్యాలయం రూ.10 కోట్లు మంజూరైనట్లు ప్రకటించిన ఎన్ఐఎన్ అధికారులు అయినా ప్రారంభం కాని పనులు చౌటుప్పల్ : జిల్లాను పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టే విషయంలో పాలకుల్లో చిత్తశుద్ధి కొరవడింది. ఫ్లోరైడ్ నివారణకు చౌటుప్పల్ మండలం మల్కాపురంలో కేంద్ర ప్రభుత్వం జాతీయ ఫ్లోరైడ్ పరిశోధనా కే ంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. అంతర్జాతీయ శాస్త్రవేత్తలు మన ప్రాంతానికి వచ్చి పరిశోధనలు జరిపి ఫ్లోరైడ్‌ను రూపుమాపేందుకు కృషి చేయనున్నట్లు వెలువడిన ప్రకటనతో జిల్లా ప్రజలు సంతోషించారు. కానీ ఈ పనులు కేవలం ప్రకటనలకే పరిమితమయ్యాయి. ఈ విషయంలో రెండున్నరేళ్లుగా ఒక్క అడుగు కూడా ముం దుకు పడలేదు. దీంతో జిల్లా ప్రజలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. కేంద్రం నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరయ్యాయని ఎన్ఐఎన్ అధికారులు ప్రకటించి మూడు నెలలు కావస్తున్నా పరిస్థితిలో మాత్రం మార్పులేదు. దేశంలోనే అధిక ఫ్లోరైడ్ పీడిత ప్రాంతంగా జిల్లాకు పేరుంది. ఫ్లోరైడ్ కారణంగా ఇక్కడి ప్రజలు జీవచ్ఛవాలుగా మారుతున్నారు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌రావు 2012 జూలైలో ఫ్లోరైడ్ పీడిత ప్రాంతంలో పర్యటించి, బాధితుల కష్టాలను చూసి చలించిపోయారు. ఫ్లోరైడ్‌ను రూపుమాపేందుకు మరిన్ని పరిశోధనలు అవసరమని భావించారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన అప్పటి యూపీఏ ప్రభుత్వం జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య శాశ్వత పరిష్కారానికి చౌటుప్పల్ మండలం మల్కాపురంలో జాతీయ ఫ్లోరైడ్ పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు నిర్ణయించింది. రూ.250 కోట్ల వ్యయంతో పరిశోధనా కేంద్రాన్ని నిర్మించి, 11 రాష్ట్రాలతో అనుసంధానం చేయాలని నిర్ణయించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ, చత్తీస్ఘడ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, అస్సాం, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ ఫ్లోరైడ్ నివారణకు కృషి చేయాలని నిర్ణయించారు. ఫ్లోరోసిస్ బాధితులకు ప్రత్యేక సేవలు అందించడంతో పాటు, వారికి ఏర్పడిన అంగవైకల్యాన్ని అధిగమించేందుకు ప్రత్యేకంగా 75 పడకల ఆస్పత్రిని కూడా నిర్మించాలని నిర్ణియించారు. ముగిసిన స్థల వివాదం మల్కాపురం శివారులోని సర్వేనంబర్ 486లో వాహనాల సామర్థ్య కేంద్రానికి, ఫ్లోరైడ్ పరిశోధనా కేంద్రానికి ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది. పరిశోధనా కేంద్రానికి 5 ఎకరాలు, వాహనాల సామర్థ్య కేంద్రానికి 10 ఎకరాల చొప్పున కేటాయించారు. దీని సమీపంలోనే క్రషర్ మిల్లులు ఉండడంతో వారు కోర్టును ఆశ్రయించారు. దీంతో స్థల వివాదం తలెత్తింది. తర్వాత రాష్ట్ర విభజన, ఎన్నికలు రావడంతో ఈ వివాదం మరుగున పడింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డాక మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి చొరవతో స్థల వివాదానికి తెరపడింది. వాహనాల సామర్థ్య కేంద్రానికి 8.16 ఎకరాలు, ఫ్లోరైడ్ పరిశోధనా కేంద్రానికి 8 ఎకరాలు చొప్పున కేటాయించారు. స్థలానికి సంబంధించిన పత్రాలను రెండున్నర నెలల క్రితం జిల్లా కలెక్టర్ టి.చిరంజీవులు జాతీయ పోషకాహార సంస్థ డిప్యూటీ డెరైక్టర్ అర్జున ఎల్.కందారేకు అప్పగించారు. ప్రారంభం కాని పనులు జాతీయ ఫ్లోరైడ్ పరిశోధనా కేంద్రానికి రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ఇటీవల నాగపూర్‌లో ఫ్లోరైడ్పై జరిగిన జాతీయ సదస్సులో కేంద్రం ప్రకటించింది. ఇదే విషయాన్ని జాతీయ పోషకాహార సంస్థ డిప్యూటీ డెరైక్టర్ డాక్టర్ అర్జున్ ఎల్. కందారే ప్రకటించారు. తాత్కాలికంగా చౌటుప్పల్‌లో ఓ భవనాన్ని అద్దెకు తీసుకొని కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. కానీ నేటికీ దీనికి సంబంధించిన పనుల్లో పురోగతి లేదు. కేంద్రానికి ప్రతిపాదనలు పంపాం చౌటుప్పల్‌లో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేసి పనులు ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ఇంకా అనుమతి రాలేదు. నిధులు మంజూరు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పరిశోధనాకేంద్రానికి రాష్ట్రపంచాయతీరాజ్ శాఖ నోడల్ ఏజెన్సీగా పనిచేయాల్సి ఉంటుంది. ఈ శాఖ ద్వారానే పనులన్నీ జరుగుతాయి. - డాక్టర్ అర్జున్ ఎల్.కందారే, డిప్యూటీ డెరైక్టర్, జాతీయ పోషకాహార సంస్థ పనులు త్వరలో ప్రారంభం జాతీయ ఫ్లోరైడ్ పరిశోధనా కేంద్రం పనులు త్వరలో ప్రారంభమవుతాయి. అందుకుతగిన ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తోంది. పరిశోధనాకేంద్రానికి 8 ఎకరాల భూమిని ఇప్పటికే కేటాయించాం. - కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, మునుగోడు, ఎమ్మెల్యే -
ఫ్లోరిన్ సమస్యను పారదోలేందుకే వాటర్‌గ్రిడ్
సూర్యాపేట : జిల్లాను పట్టిపీడిస్తున్న ఫ్లోరిన్ సమస్యను పారదోలేందుకే వాటర్‌గ్రిడ్ పథకానికి ప్రాధాన్యమిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. గురువారం హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తూ మార్గమధ్యలోని సూర్యాపేటలో గల రహదారి బంగ్లాలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో రెండు లక్షల మంది ఫ్లోరైడ్‌తో బాధపడుతూ ప్రాణాలు విడిచిన వారు ఉన్నారని చెప్పారు. దామరచర్ల వద్ద ఏడు వేల మెగా వాట్ల విద్యుదుత్పాదన కేంద్రం ఏర్పాటుకానుందని తెలిపారు. దీంతో ఇక జిల్లాలో కరెంటు సమస్య తీరనుందన్నారు. కళ్ల ముందు ఐదేళ్ల పదవీ కాలం ఉన్నా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మూడున్నరేళ్లలో ప్రతి ఇంటికి నీళ్లు రప్పిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని, ఆ హామీని నెరవేర్చేందుకు రెయింబవళ్లు కష్టపడుతున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి నీళ్లందిస్తామని, సిద్ధిపేటలో గత 18 ఏళ్ల కిందటే ఈ ప్రక్రియ అమల్లోకి వచ్చిందని పేర్కొన్నారు. కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం.. సూర్యాపేటను జిల్లా కేంద్రంగా చేస్తామన్నారు. మీడియా సహకరించి.. తగిన సూచనలు చేయాలని.. ఆ సూచనలను మేం పాటిస్తామన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే, పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకట్రావ్, సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ గండూరి ప్రవళ్లికప్రకాష్, పార్టీ పట్టణ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, నాయకులు వై.వెంకటేశ్వర్లు, శనగాని రాంబాబుగౌడ్, మొరిశెట్టి శ్రీనివాస్, నాతి సవీందర్, తూడి నర్సింహ్మరావు, ఆకుల లవకుశ, గాజుల రాంబాయమ్మ, శ్రీవిద్య, రాధిక, ఎల్గూరి రమాకిరణ్‌గౌడ్, నల్లపాటి అప్పారావు, అనిల్‌రెడ్డి, పాండు, హరీష్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
ఫ్లోరైడ్ పరిష్కారానికి కృషిచేస్తా: ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
అనకర్లపూడి(కొండపి): ప్రకాశం జిల్లా పశ్చిమప్రాంతంలోని పలు నియోజకవర్గాల్లోని ప్రజలు ఫ్లోరైడ్ సమస్యతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు ఒంగోలు పార్లమెంటు సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కొండపి మండలంలోని అనకర్లపూడిలో ఆయన గురువారం రాత్రి గ్రామ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో గుమ్మళ్ళ సురేష్‌బాబు జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన రక్షిత మంచినీటి పథకాన్ని ప్రారంభించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో నేటికీ పల్లెల్లో రక్షిత మంచినీరు దొరకని పరిస్థితి ఉందన్నారు. జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఈ సమస్య ఎక్కువుగా ఉందని, ముఖ్యంగా కనిగిరి, దర్శి ప్రాంతాల్లో తీవ్రంగా కనిపిస్తుందన్నారు. ఒక్కో గ్రామంలో 20 మందికి పైగా కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారని, ఇందులో కొంతమంది మరణిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చన్నారు. జిల్లాలో ఫ్లోరైడ్ రక్కసి నుంచి ప్రజలను కాపాడేందుకు కేంద్ర ఆరోగ్యశాఖా మంత్రిని కలిసి మాట్లాడినట్లు తెలిపారు. జిల్లాకు స్పెషల్ ప్యాకేజీ అడిగానని, కేంద్ర మంత్రి స్పందించి జిల్లాకు వచ్చి స్వయంగా పరిశీలించి సాయం అందిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ప్రజా సంక్షేమం మరచిన టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో దౌర్జాన్యాలకు దిగుతున్నారని, సంక్షేమ పథకాలను పచ్చ చొక్కాల నాయకులకు అర్పిస్తున్నారని విమర్శించారు. ఏ పరిస్ధితుల్లోనైనా కార్యకర్తలకు అండగా ఉంటామని, అధికార పార్టీ నాయకుల ఉడత ఊపులకు భయపడేదిలేదన్నారు. దాడికి పాల్పడిన నేరగాళ్లకు శిక్షపడే వరకూ పోరాడతామని, న్యాయం జరగకపోతేలెక్టరేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. గ్రామాల్లో పచ్చచొక్కా కమిటీలు ఏకపక్షంగా సంక్షేమ పథకాల నుంచి వైఎస్సార్సీపీ సానుభూతిపరుల పేర్లను తొలగిస్తున్నారని, ఇందుకు ఉదాహరణ అనకర్లపూడిలోనే అర్హులైన 18 మంది వైఎస్సార్సీపీ సానుభూతిపరులకు పింఛన్లు తీసేశారన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కోసం త్వరలో ఒంగోల్లో జాబ్‌మేళా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. కొండపి నియోజకవర్గంలో ఎత్తిపోతల పథకాలు, చెక్‌డ్యామ్‌లు మూలనపడ్డాయని, వీటి మరమ్మతులకు ప్రభుత్వం వెంటనే రూ.10 కోట్లను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అనకర్లపూడిలో వైఎస్సార్సీపీ యువత ముందుకు వచ్చి వాటర్ ఫ్లాంట్‌ను స్వచ్ఛంధంగా ఏర్పాటు చేసుకోవటం అభినందనీయమన్నారు. గ్రామాభివృద్ధి కోసం రూ.5 లక్షలు ఎంపీ నిధులు కేటాయిస్తానని గ్రామస్ధులకు వాగ్ధానం చేశారు. కొండపి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కందుకూరు శాసనసభ్యుడు పోతుల రామారావు, రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి, రాష్ట్ర నాయకులు వెంకటేశ్వరరావు, ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు కేవీ ప్రసాద్, జిల్లా నాయకులు ఢాకా పిచ్చిరెడ్డి, కట్టా శివయ్య, జిల్లా విద్యార్ధి విభాగం అధ్యక్షుడు రవీంద్రబాబు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ఆరికట్ల వెంకటేశ్వర్లు, టుబాకో బోర్డు సభ్యుడు రావూరి అయ్యవారయ్య, శింగరాయకొండ యూత్ కన్వీనర్ సామంతుల రవికుమార్ రెడ్డి, జరుగుమల్లి యువజన కన్వీనర్ గాలి శ్రీనివాసులు, గ్రామ ఉపసర్పంచి గుమ్మళ్ళ రవికుమార్, ప్రసాద్, కొండపి సింగిల్‌విండో అధ్యక్షుడు భువనగిరి సత్యన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
సుజలం.. విఫలం
ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు సరఫరా అవుతున్న సుజల స్రవంతి జలాలు సురక్షితమేనా? తాగటానికి యోగ్యమైనవేనా? ఏ మేరకు శుద్ధి చేస్తున్నారు? ఎలా శుద్ధి చేస్తున్నారు? అనే వి ప్రశ్నలుగానే మిగులుతున్నాయి. ‘పేరుకే సుజల స్రవంతి పథకం..కానీ వీటి నుంచి సరఫరా అవుతోంది అపరిశుభ్ర జలం. ఈ నీరు తాగిన పలువురు వ్యాధుల బారిన పడు తున్నారు. అత్తెసరు శుభ్రతతో కూడిన కలుషిత జలాన్ని పంపిణీ చేయడమే దీనికి కారణం’ అని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. నీటి మూటల్లాంటి హామీలిచ్చే పాలకులే వీటికి సమాధానం చెప్పాలంటున్నారు. వైరా వైరా రిజర్వాయర్‌కు అనుసంధానంగా ఉన్న బోడేపూడి సుజల స్రవంతి మంచినీటి పథకం నుంచి ఆరు మండలాల్లోని 120 గ్రామాలకు రోజుకు కోటి లీటర్ల నీరు సరఫరా అవుతోంది. నీరు ఎలా ఉంటున్నాయి? శుభ్రం చేస్తున్నారా? పథకం నిర్వహణ ఎలా ఉందో పర్యవేక్షించాల్సిన అధికారులు, కాంట్రాక్టర్ల మామూళ్ల మత్తులో పడి అసలు విషయమే మరిచిపోయారనే ఆరోపణలు ఉన్నాయి. నీటిని శుద్ధిచేసే ముడిపదార్థాలను నాసిరకమైనవి వాడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రధాన పైపులైన్‌కు ఏర్పాటు చే సిన ఎయిర్‌వాల్వ్స్, గేట్‌వాల్వ్స్ లీకేజీలతో నీరు కలుషితం అవుతున్నాయి. పనిచేయని ఆలం కలిపే మోటార్ సుజల స్రవంతి మంచినీటి పథకంలో ఆలం కలిపేం దుకు మూడు మోటార్లు వినియోగించాలి. ఏడాడి నుంచి ఈ మూడుమోటార్లు పనిచేయడం లేదు. ఆలం పూర్తిస్థాయిలో కలవడం లేదు. వైరా రిజర్వాయర్‌కు వరదనీరు వచ్చి చేరితే అవే నీటిని గ్రామాలకు సరఫరా చేస్తున్నారు. ప్లాంట్‌లో కెమికల్స్, ముడిపదార్థాలు కలిపే కేంద్రాలు అపరిశుభ్రంగా ఉన్నా పట్టడం లేదు. 2002లో ఏర్పాటు చేసిన ప్లాంట్‌లో ఇప్పటి వరకు ఎటువంటి మరమ్మతులు చేయలేదు. రాడ్లు బయటపడి ప్రమాదకరంగా ఉన్నాయి. నాసిరకంగా ఎయిర్‌వాల్వ్స్ వైరా రిజర్వాయర్ నుంచి వైరా, మధిర, బోనకల్లు, ఎర్రుపాలెం, తల్లాడ, కొణిజర్ల మండలాల్లో పలు గ్రామాలకు నీటిని సరఫరా చేసే పైపులైన్లకు బిగించిన ఎయిర్‌వాల్వ్స్ దెబ్బతిన్నాయి. గాలి వదలడానికి వాల్వ్‌లో ఉన్న బాల్స్ సరిగా పనిచేయడం లేదు. నీరు లీకై ఎయిర్‌వాల్వ్స్ మురికికూపంగా తయారవుతున్నాయి. తిరిగి అదే నీరు పైపుల ద్వారా సరఫరా అవుతోంది. చాంబర్ల చుట్టూ మురికిపేరుకుపోవడంతో దోమలకు నిలయంగా మారుతున్నాయి. అరకొర నీటి పరీక్షలు రిజర్వాయర్ వద్ద నీటిశుద్ధి కేంద్రంలో అరకొర పరికరాలు ఏర్పాటు చేశారు. లక్ష లీటర్లకు లీటర్ ఫ్లోరిన్ కలిపి సరఫరా చేయాలి. సరఫరా చేసే ముందు శుద్ధి చేసిన నీటిని పరీక్షించాలి. గతంలో పలుమార్లు ఈ పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్లు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తనిఖీ చేసి అసహనం వ్యక్తం చేశారు. అయినా ఈ కేంద్రానికి అవసరమైన పరికరాలు మంజూరు కాలేదంటే ఎంత నిర్లక్ష్యమో అర్థం చేసుకోవచ్చు. చాంబర్లలో చెత్తాచెదారం.. ఆరు మండలాల్లో 100 ఎయిర్‌వాల్వ్స్, మరో 100 గేట్‌వాల్వ్స్ ఉన్నాయి. ఇవన్నీ శిథిలావస్థకు చేరడంతో నీరు లీకవుతోంది. చెత్తాచెదారం చేరి అపరిశుభ్రంగా తయారవుతున్నాయి. ఈ అపరిశుభ్రనీరే తిగిరి గ్రామాల్లోని ట్యాంకులకు చేరుతోంది. ఆ నీరు తాగి ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. నామమాత్రం నీటిశుద్ధి వైరా రిజర్వాయర్ వద్ద ఉన్న సుజల స్రవంతి మంచినీటి పథకాన్ని పరిశీలించగా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రతి రోజు కోటి లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆలాన్ని రెండేళ్ళుగా ఉపయోగించడం లేదని సిబ్బందే అంటున్నారు. నీటిలో ఆమ్లం, క్షారత్వం ఎంత శాతం ఉందని కోలిచేందుకు మాత్రమే క్లోరిన్‌ను వినియోగిస్తున్నారు. ఇది 7-9 శాతం మాత్రమే ఉండాలని తెలిపారు. 6 మండలాలకు వెళ్ళాలంటే సుమారు 60 కిలోమీటర్ల వరకు పైప్‌లైన్ ద్వారా నీటిని సరఫరా చేయాలి. నీటిశుద్ధి సరిగా చేయకపోవడం, పీహెచ్శాతం ఎంత ఉందో తెలుసుకోవడం లేదు. ఓవర్‌హెడ్ ట్యాంకుల్లోనూ క్లోరిన్కెమికల్స్ కలపడం లేదు. ఎయిర్‌వాల్వ్స్, గేట్‌వాల్వ్స్ లీకవుతున్నాయి. నీరు మురికిగా మారుతోంది. బ్యాక్టీరియా వృద్ధి చెంది పిల్లలు, వృద్ధులు వ్యాధులు బారిన పడుతున్నారు. మోకాళ్లు, కీళ్లనొప్పులు, విషజ్వరాలు వస్తున్నాయి. కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం జిల్లాలో ఇటువంటి సుజల స్రవంతి మంచినీటి పథకాలు వైరా, పాలేరు, అడవిమల్లెల, గంగారం, కల్లూరు పెద్దచెరువు, నాగిలిగొండ, చింతకాని మండలాల్లో ఉన్నాయి. వీటి నిర్వహణ కూడా ఇదే విధంగా ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. కాంట్రాక్టర్లు సుజల స్రవంతికి సరఫరా చేసే క్లోరిన్, ఆలం వంటివి నాసిరకంగా ఉంటున్నాయని తెలుస్తోంది. నీటి శుద్ధిని పరిక్షించాల్సిన పరికరాలు లేవు. క్లోరిన్‌శాతం కూడా తక్కువగా ఉంటోంది. ముడిపదార్థాలు కలపకుండానే, నీటి పరీక్ష చేయకుండానే గ్రామాలకు నీరు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతిరోజు ఈ పథకాలను పరిశీలించాల్సిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు. -
మీనమేషాలు ఇక చాలు
తాజా గణాంకాల ప్రకారం దేశంలో 676 జిల్లాలు ఉన్నాయి. వాటిలో 230 జిల్లాలకు ఫ్లోరోసిస్ సమస్య ఉందని కేంద్ర ఆరోగ్యమంత్రి జేపీ నడ్డా లోక్‌సభలో (డిసెంబర్ 19) ప్రకటించారు. నిజానికి దేశంలోని 20 రాష్ట్రాలలో, 275 జిల్లాలలో ఇది వ్యాపించి ఉందని 2009లోనే తేలింది. దేశంలో మూడు రాష్ట్రాలు -రాజస్థాన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోనే ఈ వ్యాధి మరీ తీవ్రంగా ఉందని మంత్రి చెప్పారు. అంటే దేశంలో ఫ్లోరోసిస్ వ్యాధితో తీవ్రంగా బాధపడుతున్న రాష్ట్రాలు మూడైతే, అందులో రెండు తెలుగు రాష్ట్రాలు కావడం అత్యంత విషాదం. దేశాన్ని పట్టిపీడిస్తున్న తీవ్ర ఆరోగ్య సమస్యల గురించి కేంద్రంలోను, మన రెండు రాష్ట్రాలలోను కొత్తగా ఎన్నికైన ప్రభుత్వాలు ఆశాజనకమైన ప్రయా ణాన్నే ఆరంభించాయని అనిపిస్తోంది. వాతావరణ కాలుష్యంతో, పర్యావరణం దెబ్బ తినడంతో పాత రుగ్మతలు తీవ్ర రూపం దాల్చడం ఇటీవలి విషాదం. అందుకు గొప్ప ఉదాహరణ ఫ్లోరోసిస్ వ్యాధి. చిత్రం ఏమిటంటే, ఈ వ్యాధికి తెలంగాణలో 1975 వరకు ఉన్న స్వరూపం వేరు. తరువాతే ఇది తీవ్రరూపం దాల్చి కాళ్లూ చేతులూ వంకర్లు పోయే విపరిణామానికి దారి తీసింది. భూగర్భ జలాలు విపరీతంగా కాలుష్యానికి గురికావడం ఇందుకు కారణంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వ్యాధి గురించి తగినంత ప్రచారం జరిగింది గానీ, నివారణ చర్యలు చిత్తశుద్ధితో ఆరంభం కాలేదు. కొనసాగలేదు కూడా. తెలంగాణలో గానీ, ఆంధ్రప్రదేశ్‌లో గానీ ఈ వ్యాధిని నివారించడం ఒక బడ్జెట్ కాలంలోనో, ఒక దశాబ్ద కాలంలోనో జరిగేది కాదు. అదొక సుదీర్ఘ ప్రణాళిక . నివారణ పనులు అసలు ఆరంభం కాలేదని చెప్పడం సరికాకపోయినా, ఆ చర్యలన్నీ అరకొర చర్యలేనని చెప్పడం సత్యదూరం కాదు. భారత్‌కు పక్కనే ఉన్న చైనాలోను ఫ్లోరోసిస్ వ్యాధి ఉంది. కానీ వారి అనుభవాలు వేరు. ఎందుకంటే వారు తీసుకున్న చర్యలు కూడా వేరుగానే ఉన్నాయి. భయపెడుతున్న వాస్తవాలు 2014 నాటి తాజా గణాంకాల ప్రకారం దేశంలో 676 జిల్లాలు ఉన్నాయి. వాటిలో 230 జిల్లాలకు ఫ్లోరోసిస్ సమస్య ఉందని కేంద్ర ఆరోగ్యమంత్రి జేపీ నడ్డా లోక్‌సభలో (డిసెంబర్ 19) ప్రకటించారు. నిజానికి దేశంలోని 20 రాష్ట్రాలలో, 275 జిల్లాలలో ఇది వ్యాపించి ఉందని 2009లోనే తేలింది. దేశంలో మూడు రాష్ట్రాలు -రాజస్థాన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోనే ఈ వ్యాధి మరీ తీవ్రంగా ఉందని మంత్రి చెప్పారు. అంటే దేశంలో ఫ్లోరోసిస్ వ్యాధితో తీవ్రంగా బాధపడుతున్న రాష్ట్రాలు మూడైతే అందులో రెండు తెలుగు రాష్ట్రాలు కావడం అత్యంత విషాదం. తెలంగాణకు చెందిన టీఆర్ఎస్ ఎంపీ సీతారాం నాయక్ అడిగిన ప్రశ్నతో మంత్రి పలు అంశాలను సభ దృష్టికి తీసుకువచ్చారు. నిజానికి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో కూడా ఈ సమస్య ఉంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా కొన్ని చర్యలు తీసుకున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. కాబట్టి ఆయన నాయకత్వంలో ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుందని ఆశించడం అత్యాశ కాకపోవచ్చు. తెలంగాణలోని పది జిల్లాలకు 9 జిల్లాలు ఆ వ్యాధితో తీవ్రంగా బాధపడుతున్న సంగతిని కూడా మంత్రి వెల్లడించారు. ఇంకా విషాదం ఏమిటంటే, తెలంగాణలోనే వెనుకబడిన నల్లగొండ జిల్లాలోని 59 మండలాల్లో 58 మండలాల్లో ఈ వ్యాధి తీవ్రంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రకాశం జిల్లాలో, ముఖ్యంగా కనిగిరి ప్రాంతంలో ఈ వ్యాధి విజృంభిస్తోంది. అదుపుతప్పుతున్న వ్యాధి విస్తృతి? దేశంలో పది లక్షల మంది ఫ్లోరోసిస్‌తో బాధపడుతున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రి తెలియచేశారు కానీ, అది అస్పష్ట సమాచారం. మంత్రి చెప్పిన పది లక్షలు ఈ వ్యాధి బారిన పడి మంచం కూడా దిగలేని స్థితిలో ఉన్న వారి లెక్క కావచ్చు. మాలాంటి నిపుణుల అంచనా ప్రకారం దేశంలో ఆరు కోట్లకు పైనే ఈ వ్యాధిన బారిన పడిన వారు ఉన్నారు. కాళ్లూ చేతులూ పూర్తిగా పట్టు తప్పిన వారు అరవై లక్షల వరకు ఉన్నారు. ఈ వ్యాధిలో దశల వారీగా రోగాన్ని గుర్తించవలసి ఉంటుంది. పళ్లు పసుపు రంగులోకి మారడం తొలి దశ. తరువాత ఎముకలకు వ్యాపిస్తుంది. ఆపై ఎముకలు సుద్దముక్కలంత అల్పంగా మారిపో వడమే కాక, బిగుసుకుపోతాయి. వెన్నెముక బిరుసెక్కి, కాళ్లు చేతులు వంకర్లు పోయి, అవి చెట్టు బెరడు మాదిరిగా తయారు కావడం చివరి దశ. ఈ వ్యాధి స్వరూప స్వభావాలను బట్టే కాదు, అది విస్తరిస్తున్న తీరు కూడా ఘోరమైనద న్న సంగతిని ప్రభుత్వాలు ఇప్పటికైనా గుర్తించాలి. సరైన వ్యూహం ఏదీ? ఈ గణాంకాలు ప్రభుత్వం వద్ద ఇప్పటిదాకా లేవని కాదు. కానీ ఇంత పెద్ద ఆరోగ్య సమస్యను పరిష్కరించడానికి అవసరమైన వ్యూహం గురించి గట్టిగా ఆలోచించలేదు. దాని ఫలితమే ఈ విపరిణామాలు. ఫ్లోరోసిస్ వ్యాధిని తొలుత భారతదేశంలో 1937లోనే కనిపెట్టారు. కానీ నివారణ కోసం తీసుకున్న చర్యలు తక్కువే. ఈ వ్యాధి ఏటా తీవ్ర రూపం దాలుస్తున్న సంగతిని నిపుణులు వెల్లడిం చడమే ఇందుకు తార్కాణం. ఫ్లోరైడ్ మానవదేహంలోకి అధిక మోతా దులో ప్రవేశించడం వల్ల ఈ వ్యాధి సోకుతోంది. ఇది తాగునీటితోనే సంక్రమిస్తుందని చాలా కాలం భావించారు. కానీ ఫ్లోరైడ్ శాతం ఉన్న నీరు ఉన్న ప్రాంతాలలో పండే పంట, తాగే టీ కాఫీల వంటి వాటి వల్ల కూడా ఇది సంక్రమిస్తుందని కొద్ది కాలం క్రితమే తెలుసుకున్నారు. అధిక మొత్తంలో టీ ఇంకా హానిచేస్తుంది. కాల్షియం, మెగ్నీషియం శరీరంలోకి చేరడం వల్ల, అసలే పోషకాహార లోపంతో ఉండే జనంలో ఫ్లోరోసిస్ తీవ్రమవుతోంది. ఇవన్నీ శాస్త్రవేత్తలు, పర్యావరణ వేత్తలు, వైద్యులకు సంబంధించిన సాంకేతిక విషయాలు. కానీ సమస్య పరి ష్కారంలో ఈ వాస్తవాలే కీలక పాత్ర వహిస్తాయి. వ్యాధి బారిన పడకుండా కూడా కాపాడతాయి. కొన్ని జాగ్రత్తల గురించిన స్పృహనూ కలిగిస్తాయి. కొంప ముంచుతున్న బోరుబావులు ఫ్లోరోసిస్ సమస్య మూలాల గురించి కొత్త ఆవిష్కరణలు జరిగిన తరువాత ప్రభుత్వాలు కూడా కొత్త దృక్పథంతో ఆలోచించవలసి వచ్చింది. తాగునీటితోనే ఫ్లోరోసిస్ సోకుతోందని అనుకున్నంత కాలం, శుద్ధమైన తాగునీరు అందించ డానికే ప్రభుత్వాలు తమ వంతు ప్రయత్నాలు చేశాయి. అంటే ప్రవాహ శీలత ఉండే నదీజలాలను వ్యాధిపీడిత ప్రాంతాలకు తరలించేందుకు పథకాలు వేశా యి. ఈ అవకాశం లేనిచోట డిఫ్లోరైడేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని యోచించాయి. చాలా చోట్ల ఆ ప్రయత్నం కూడా జరిగింది. ఇలాంటి ప్లాంట్ల నిర్మాణానికే ‘నల్లగొండ విధానం’ అని పేరు కూడా వచ్చింది. కానీ ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో దిరిశవంచ గ్రామంలో వ్యాధిపీడితులకు కృష్ణాజలాలను అందించే అవకాశం వచ్చింది. కనిగిరి జలాశయం ద్వారా దీనిని సాధించగలి గారు. అయితే పదహారేళ్ల పాటు కృష్ణా నీరు అందించిన తరువాత చేసిన పరి శోధనలు మళ్లీ శాస్త్రవేత్తలను ఆలోచనలో పడేసే తీరులో ఉన్నాయి. ఈ ప్రాంతంలో రోగుల ఎముకలు, దంతాలను పరీక్షిస్తే వ్యాధి తీవ్రతలో ఏమీ మార్పు కనిపించలేదు. మళ్లీ కొత్త ప్రశ్నలు ఉదయించాయి. అయితే నల్లగొండ జిల్లాలోని పీడిత ప్రాంతాల మాదిరిగానే, ప్రకాశం జిల్లాలో కూడా క్రమం తప్ప కుండా కృష్ణా నీటిని సరఫరా చేసిన దాఖలాలు లేవు. శుద్ధమైన తాగునీటితోనే ఈ వ్యాధిని అరికట్టలేమని మరోసారి రుజువైంది. ఆయా ప్రాంతాల ప్రజలు తీసుకొనే ఆహార పదార్థాలు, ఇతర పానీయాల విషయంలో కూడా జాగ్రత్త పడవలసిందే. ఈ ప్రాంతాలలో ఎక్కువ వ్యవసాయం బోరు బావుల ద్వారానే జరుగుతోంది. నిజానికి ఫ్లోరోసిస్ అనే ఈ రుగ్మతా భూతానికి మూలం బోరు బావులే. దీనికితోడు 46 శాతం బాలలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న వారే. 70 శాతం గర్భిణులు రక్తహీనతతో ఉంటున్నారు. ఇవన్నీ కలసి దేశంలో ఫ్లోరోసిస్ వ్యాధి విశ్వరూపం దాల్చేటట్టు చేస్తు న్నాయి. దేశంలో ఈ వ్యాధి ఇంత వెర్రి తలలు వేస్తున్నా వైద్య విద్యలో దీని గురించి సరైన అధ్యయనం లేదు. కనీసం పౌష్టికాహార లోపానికీ, ఫ్లోరోసిస్ వ్యాధికీ ఉన్న సంబంధం గురించి కూడా వారి పుస్తకాలలో ఉదహరించడం లేదు. ఆ మధ్య 28 వ్యాధి నిరోధక కార్యక్రమాలను ప్రకటించారు. అందులో ఫ్లోరోసిస్ వ్యాధికి చోటు ఇవ్వలేదు. అనుభవాలు, ఆచరణలు మధ్యప్రదేశ్‌లోని జాబువా గ్రామంలో జరిగిన ప్రయత్నం పేర్కొనదగినది. అక్కడ శుద్ధమైన తాగునీరు సరఫరా చేశారు. లేదంటే డిఫ్లోరైడేషన్ ప్లాంట్ల ద్వారా నీటిని శుద్ధి చేసి అందించారు. డిఫ్లోరైడేషన్ కిట్‌ను కాన్పూర్ ఐఐటీ సంస్థ నిపుణులు తయారు చేసి ఇచ్చారు. స్థానికంగా పండే పంటలను ఆహారం గా తీసుకోవద్దని, హెచ్చరించి ప్రభుత్వం గోధుమలు సరఫరా చేసింది. పిల్లలకు సోయా లడ్డులను అందించింది. దీనితో పిల్లల్లో ఈ వ్యాధి లక్షణాలు తగ్గు ముఖం పట్టాయి. దీనిని గమనించడం అవసరం. కాగా, తెలంగాణ ప్రభుత్వం వాటర్ గ్రిడ్ పథకం చేపట్టడం వెనుక ఉన్న ఉద్దేశాలలో ఫ్లోరోసిస్‌ను అరికట్టే ఆశయం కూడా ఉందని ప్రకటించారు. అలాగే కేంద్ర ఆరోగ్యమంత్రి నడ్డా కూడా 2017 నాటికి దేశంలో ఫ్లోరోసిస్ పీడిత ప్రాంతాలన్నింటికీ పైప్లైన్ల ద్వారా శుద్ధమైన తాగునీటిని అందించే కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని కూడా చెప్పారు. వాటర్‌గ్రిడ్‌కు సంబంధించిన ప్రతిపాదనలు పంపితే నిధులు ఇస్తామని కూడా మంత్రి హామీ ఇచ్చారు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఫ్లోరోసిస్ వ్యాధి నివారణను కూడా చేపడుతున్నట్టు ఆయన చెప్పారు. ఫ్లోరోసిస్ బాధిత తొమ్మిది తెలంగాణ జిల్లాలలో మూడింటిని 2013-14ల నుంచి జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలోకి తెచ్చామని చెప్పారు. దీని ప్రకారం అవసరమైతే ఆపరేషన్లు, పునరావాసం, ఇతర వైద్య సదుపాయాలు కల్పిస్తారు. ఇవన్నీ శుభ పరిణామలే. ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌కు కేంద్ర ఆరోగ్య మంత్రి సరైన హామీ ఇచ్చారనే అనిపిస్తుంది. 2015 జనవరిలో ఎయిమ్స్ నిర్మాణానికి మంగళగిరిలో శంకుస్థాపన చేయనున్నట్టు కామినేని శ్రీనివాస్ చెప్పారు. కాబట్టి మొదటి నుంచీ ఫ్లోరోసిస్ వ్యాధి గురించిన పరిశోధన కూడా మంగళగిరి ఎయిమ్స్‌లో ఉండేటట్టు చర్యలు తీసుకోవడం అత్యవసరం. శుద్ధ మైన నీరు అందించడం ప్రభుత్వాలు ప్రాథమికంగా చేయగల కార్యక్రమం. అలాగే ఆకుకూరలు, పిల్లలకు పాలు సరఫరా చేసే కార్యక్రమం కూడా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు చేపట్టాలి. ప్రజల్లో చైతన్యం అంతకంటే ప్రధానం. (వ్యాసకర్త ప్రఖ్యాత వైద్యులు) మొబైల్: 98480 18660 - డాక్టర్ డి. రాజారెడ్డి -
‘ఫ్లోరైడ్’జిల్లాల్లో వాటర్‌గ్రిడ్‌కు కేంద్రం నిధులు
* లోక్‌సభలో కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి జేపీ నడ్డా వెల్లడి * ఎంపీ సీతారాం నాయక్ ప్రశ్నకు మంత్రి సమాధానం సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన వాటర్ గ్రిడ్ పథకం కింద ఫ్లోరైడ్ సమస్య ఉన్న జిల్లాల్లో పైప్‌లైన్ ద్వారా తాగునీటిని సరఫరా చేస్తామని చెబుతున్నందున ఆయా ప్రాం తాల్లో ప్రాజెక్టుకు కేంద్రం నిధులు మంజూరు చేస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తెలి పారు. శుక్రవారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో టీఆర్ఎస్ ఎంపీ సీతారాం నాయక్ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఈ విష యం చెప్పారు. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఫ్లోరైడ్ కారణంగా ప్రజలు ఫ్లోరోసిస్ వ్యాధితో బాధపడుతున్నారని, అనేకమంది శాశ్వతంగా వికలాంగులు అవుతున్నారని సీతారాం నాయక్ ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్య నుంచి ప్రజలను రక్షించడానికి వాటర్ గ్రిడ్ పథకాన్ని చేపట్టిందని, దీనికి కేంద్రం ఏమైనా ఆర్థిక సహాయం చేస్తుందా? అని ప్రశ్నించారు. దీనికి ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా సమాధానమిస్తూ, దేశంలో సుమారు 230 జిల్లాల్లో ఈ సమస్య ఉందని తెలిపారు. రాజస్థాన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందని వివరించారు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఫ్లోరోసిస్ నివారణ పథకం అమలులో ఉందని చెప్పారు. 2017 నాటికి ఫ్లోరైడ్ పీడిత గ్రామాలన్నిటికి పైపులైన్ ద్వారా నీటిని సరఫరా చేయాలని చూస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ విషయానికి వస్తే ప్రస్తు తం 3 జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వ జాతీయ ఆరోగ్య మిషన్ పథకం అమలులో ఉందని తెలిపారు. ఈ మూడు జిల్లాల్లో రివర్స్ ఆస్మోసిస్(ఆర్వో) విధానంలో నీటిని శుద్ధి చేస్తుందని తెలిపారు. వాటర్ గ్రిడ్క సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిస్తే కేంద్రం నిధులు మంజూరు చేస్తుందని మంత్రి తెలిపారు. -
క్వార్టర్లలో సమస్యల తిష్ట
తాగునీటికి ఇక్కట్లు కాలువల్లో పేరుకుపోయిన పూడిక క్వార్టర్లపై కూలిన వృక్షాలను తొలగించని అధికారులు గోపాలపట్నం : స్థానిక నార్త్ రైల్వే క్వార్టర్లలో పలు సమస్యలు తిష్ట వేశాయి. ఇక్కడ దాదాపు 300 కుటుంబాలకు వీలుగా క్వార్లర్లు నిర్మించారు. ఇక్కడ ప్రధానంగా కొన్నేళ్లుగా తాగునీటి సమస్య వేధిస్తోంది. ఇక్కడ స్థానిక బావి నుంచి ట్యాంకరుకి ఎక్కించి క్వార్టర్లకు నీటిని సరఫరా చేస్తున్నారు. అయితే ఈ నీటిలో ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉండడంతో తాగేందుకు ఎవరూ సాహించడం లేదు. ఎక్కడో దూరానున్న జీవీఎంసీ కుళాయిల నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. అంతదూరం వెళ్లలేని వారు ఆర్థిక భారమైనా సరే నీటిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. పదేళ్ల క్రితం తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఉద్యోగులు ఆందోళన చేస్తే చాలామందిని ఉన్నతాధికారులు బదిలీ చేశారే తప్ప వారి సమస్యలు పరిష్కారం చేయలేదు. అధ్వానంగా డ్రైనేజీ వ్యవస్థ ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉంది. కాలువల్లో మురుగునీరు నిలిచిపోతుండడంతో దుర్వాసనను భరించలేకపోతున్నామని స్థానికులు వాపోతున్నారు. పైగా దోమలు విజృంభిస్తున్నాయి. తొలగించని వృక్షాలు... ఇక్కడ రెండునెలల క్రితం హుద్‌హుద్ తుపానుకి భారీ వృక్షాలు కూలాయి. వీటిని ఇంకా క్వార్టర్లపై నుంచి తొలగించకపోవడం, సదుపాయాలు లేక భరించలేక కొందరు ఇప్పటికే క్వార్టర్లు ఖాళీ చేసివెళ్లిపోయారు. ఇదిలావుండగా, ఇటీవల ఇక్కడ వనమహోత్సవం పేరిట జీవీఎంసీ అధికారులు గోతులు తవ్వించి చేతులుదులిపేసుకున్నారు. తర్వాత ఒక్కమొక్కయినా నాటలేదు. శిథిలబడిలో చదువులు... ఇక్కడ క్వార్టర్లు రైల్వేవయినా ఉద్యోగుల పిల్లల కోసం రాష్ట్ర ప్రభుత్వం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నిర్వహిస్తోంది. ఇక్కడ భవనం శిధిలావస్థకు చేరింది. గోడలు ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితి. విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పైగా ఇక్కడ విద్యుత్తు సదుపాయం లేకపోవడం, ఇటీవల తరగతి గదుల కిటికీలను కొందరు ఆకతాయిలు ధ్వంసం చేయడంతో మధ్యాహ్న భోజన పథకం సామగ్రి చోరుల పాలైందని నిర్వాహకులు తెలిపారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే గణబాబు, అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. -
ఫ్లోరోసిస్ రక్కసికి సమాధానం జలజాలమే
ఫ్లోరోసిస్ రక్కసి మీద మరింత పట్టుదలతో సమరం సాగిస్తే తప్ప, నల్లగొండ ప్రజానీకానికి మనుగడ లేదు. ప్రపంచంలోనే అత్యధికంగా ఫ్లోరైడ్ ఉన్న నీళ్లను ఈ ప్రాంతవాసులు తాగుతున్నారు. ప్రభుత్వాలు వ స్తున్నాయి. పోతున్నాయి. కానీ ఈ సమస్యను చిత్తశుద్ధితో పరిష్కరిం చడానికి జరిగిన ప్రయత్నం చిన్నదే. ఈ బాధ నుంచి ఎప్పుడు విముక్తు లమవుతామా అని ఈ జిల్లా వాసులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇప్పు డు మరో ఆశ కనిపిస్తోంది- అదే జలజాలం పథకం. నల్లగొండ జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో 30 ఏళ్లకే ముసలితనం మీద పడుతోంది. దంతాలు గారపట్టి, కాళ్లు, చేతులు వంకరపోతున్నా యి. నడుమ వంగి, తుప్పు పట్టిన యంత్రాల మాదిరిగా కదలని కీళ్లతో ఈ ప్రాంతవాసులు పడే యాతన వర్ణించ శక్యంకానిది. వీరంతా పేద లు. ఇప్పటికీ చాలా గ్రామాలలో పొద్దస్తమానం వ్యవసాయ పనులు చేసుకుని ఇంటికి వస్తే ఏదో ఒక మందు బిళ్ల (గోలీ) వేసుకుంటే తప్ప నిద్రరాదు. లేకపోతే ఒళ్లు నొప్పులతో, సలుపుతో ఆ రాత్రి నరకం చూ డాలి. ఇక్కడ ప్రజలు తీసుకుంటున్న నీరు, ఆహారంతో కూడా రోజుకు 50 నుంచి 100 మిల్లీగ్రాముల ఫ్లోరైడ్ వారి దేహాలలోకి ప్రవేశిస్తున్నదని యునిసెఫ్ విశ్లేషించిన సంగతి గుర్తుకు తెచ్చుకోవాలి. ఈ జిల్లాలో ప్రజలు తాగుతున్న నీళ్లలో 4.5 పీపీఎం ఫ్లోరైడ్ ఉంది. వేలమంది దంతాలు గారపట్టడం, కాళ్లు చేతులు వికృతంగా మారిపో వడం దాని ఫలితమే. ఈ నీటికంటే విషమే కాస్త నయమని ప్రజలు భావిస్తుంటారు. నార్కట్‌పల్లి, మర్రిగూడ, మునుగోడు, చండూరు, నాంపల్లి, దేవరకొండ వంటి మండలాలలో ఫ్లోరైడ్ శాతం చాలా ఎక్కు వ. సమస్య ముదురుతోంది. బాధితుల సంఖ్య పెరుగుతోంది. పరిష్కా రం మాత్రం కానరావడం లేదు. మూడు నాలుగు దశాబ్దాలుగా ఈ మహమ్మారి మీద పోరాటం జరుపుతున్నా, ఇప్పటికీ చిన్నారులలో కూ డా ఈ లక్షణాలు పొడసూపడం ఎంత విషాదమో అర్థం చేసుకోవాలి. ఎన్ని ప్రభుత్వాలు మారినా మా తలరాతలు మారడం లేదని అందుకే బాధపడుతున్నాం. చిరకాలం నుంచి ఉన్న చెరువులు, కుంటలు నాశనం కావడం కూడా ఇందుకు కారణం. భూగర్భ జలాలు అడుగంటి ఫ్లోరైడ్ పరిమాణం పెరుగుతోంది. దీనికి పరిష్కారం జిల్లాలోని ఎస్ఎల్బీసీ, బ్రాహ్మణవెల్లంల, ఉదయసముద్రం వంటి ప్రాజెక్టులకు అధిక మొత్తం లో నిధులను కేటాయించి త్వరితగతిన పూర్తి చేయాలి. అప్పుడే ఇక్కడ ఇంటింటికీ శుద్ధమైన తాగునీరు దొరుకుతుంది. కొత్త ప్రభుత్వం ప్రవేశ పెట్టదలిచిన జలజాలం (వాటర్‌గ్రిడ్) పథకంతో ఫ్లోరోసిస్ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఇక్కడి వారి ఆశ. కాబట్టి దీనిని చిత్తశుద్ధితో అమలు చేయాలి. మా తరువాతి తరాలైనా సుఖంగా ఉంటాయన్న ఆశ ఇది. అందుకే ఈ ఆశ ఈసారి వమ్ముకారాదని కోరుకుంటున్నాం. బత్తుల శ్రీరాములు బ్రాహ్మణవెల్లంల, నల్లగొండ జిల్లా -
గతంలో ప్రమాదాలు అనుకున్నవే... ఇప్పుడు చికిత్సకు తక్షణావసరాలు!
‘వివాదాల నుంచి ఏకాభిప్రాయానికి’ (కాంట్రవర్సీస్ టు కన్సెన్సస్) అనే నినాదంతో ఈ నెల 4 నుంచి 7 వరకు హైదరాబాద్‌లో కార్డియలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా ఇందులో దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రముఖ కార్డియాలజిస్టులు పాలుపంచుకున్నారు. గుండె చికిత్సల విషయంలో అనేక విషయాలపై ఉన్నత స్థాయి చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా భారత కార్డియాలజిస్ట్‌ల సొసైటీ 66వ వార్షిక సమావేశానికి కార్యనిర్వాహక కార్యదర్శి (ఆర్గనైజింగ్ సెక్రటరీ)గా వ్యవహరించిన డాక్టర్ బి. రమేశ్‌బాబు ‘సాక్షి’ ఫ్యామిలీ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. గుండె చికిత్స ప్రక్రియల విషయంలో అనేక విషయాలపై ఆయన పేర్కొన్న వివిధ అంశాలు ఆయన మాటల్లోనే... ‘వివాదాల నుంచి ఏకాభిప్రాయానికి’ అన్నది మీ సమావేశం నినాదం. గుండె చికిత్సల్లో ఏయే అంశాలపై వివాదాలున్నాయి. ఈ సమావేశంలో ఏకాభిప్రాయం సాధించారా? డా. రమేశ్ : అన్ని శాస్త్రాల్లాగే వైద్యశాస్త్రమూ నిత్యం పురోగమిస్తూ ఉంది. కొత్త కొత్త విషయాలు అనేకం నిత్యం వెలుగుచూస్తుంటాయి. ఒక చికిత్స ప్రక్రియ నిర్దిష్టంగా ఇలాగే ఉండాలని ఎప్పుడూ చెప్పలేం. ఎందుకంటే చికిత్స అన్నది అందరిలో ఒకేలాగా ఎప్పుడూ ఉండదు. రోగి వయసు, అతడికి డయాబెటిస్ ఉందా లేదా... లాంటి అనేక అంశాలు రోగి చికిత్స విధానాన్ని నిర్ణయించడంలో ప్రధాన భూమిక వహిస్తాయి. కాబట్టి ఇదమిత్థంగా ఇదే పద్ధతి అని చెప్పడం ఎప్పుడూ సాధ్యం కాదు. అయితే ఇలాంటి సమావేశాల ద్వారా గతంలో అస్పష్టంగా ఉండే అనేక అంశాల విషయాల్లో స్పష్టత వస్తుంటుంది. అంతేగానీ... ‘ఇది ఇలాగే జరిగి తీరాలి’ తరహా ఏకాభిప్రాయం అన్నది ఎప్పుడూ సాధ్యం కాదు. అప్పటి అంశాల ఆధారంగా సాధ్యమైనంత స్పష్టతను సాధించడమే ఎప్పటికప్పుడు మనం చేయగలిగే పని. గతంలో ఆమోదం కానివని భావించిన చికిత్సలే... ఇప్పుడు ఆమోదయోగ్యమైనవి అని అనుకుంటున్నవి ఏవైనా ఉన్నాయా? డా. రమేశ్ : చాలా! గుండెకు ఉండే ప్రధానమైన మూడు రక్తనాళాల్లో ఒకదానిలో లేదా రెండింటిలోనూ అడ్డంకి ఉంటే యాంజియోప్లాస్టీ (శస్త్రచికిత్స లేకుండానే అడ్డంకిని తొలగించి సన్నబడ్డ రక్తనాళాన్ని వెడల్పు చేసే చికిత్స) ద్వారా ఆ అడ్డంకి తొలగించడం చాలా సాధారణం. అలాగే లెఫ్ట్ మెయిన్ అని పేర్కొనే ఎడమవైపున ఉండే ప్రధాన రక్తనాళం (ధమని)లో అడ్డంకి ఉంటే పదేళ్ల క్రితం శస్త్రచికిత్సనే సూచించేవారు. కానీ ఇప్పుడు ఆ లెఫ్ట్ మెయిన్‌తో సహా మూడు ప్రధాన రక్తనాళాల్లో అడ్డంకి ఉన్నా యాంజియోప్లాస్టీ ప్రక్రియ ద్వారా చికిత్స చేయవచ్చని వైద్యశాస్త్రం పేర్కొంటోంది. అయితే ఈ విషయంలో వివాదాలు కొనసాగుతున్నాయి. ఇది ఇప్పటికీ చర్చనీయాంశమే. అయినప్పటికీ లెఫ్ట్ మెయిన్‌తో సహా మూడు ప్రధాన రక్తనాళాల్లో అడ్డంకి ఉన్నా యాంజియోప్లాస్టీతో చికిత్సను సుసాధ్యం చేసి, మంచి ఫలితాలే సాధిస్తోంది ఇప్పటి ఆధునిక వైద్యశాస్త్రం. వైద్యనిపుణులూ సమర్థంగా ఈ పని చేస్తున్నారు. ఒకవేళ మూడు ధమనులనూ వెడల్పు చేసే యాంజియోప్లాస్టీకి అయ్యే వ్యయం శస్త్రచికిత్సకు అయ్యే వ్యయం కంటే ఎక్కువ కాబట్టి... రోగి శస్త్రచికిత్సనే కోరుకుంటే? డా. రమేశ్ : ఇది చాలా వాస్తవం. కాబట్టి ఉన్న ప్రత్యామ్నాయాలు రోగి ముందు ఉంచి, రోగి ఏది కోరుకోదలచుకున్నాడో చెప్పమనాలి. ఈ విషయంపై తీసుకునే నిర్ణయంలో రోగిని ఇన్వాల్వ్ చేయాలి. అయితే వ్యయం భరించగలిగే ఆర్థిక స్థోమత ఉన్న కొందరు రోగులు శరీరంపై కోత పెట్టే శస్త్రచికిత్స అంటే ఆందోళన పడతారు. మరికొందరు వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని శస్త్రచికిత్స వైపునకు మొగ్గు చూపుతారు. మీరు అన్నట్లే... కొందరు యాభయ్యవ పడిలో ఉన్న రోగులు తమకు ఆర్థిక స్థోమత ఉండి, ఈ వయసులోనే శస్త్రచికిత్స ఎందుకులే అని యాంజియోప్లాస్టీ వైపు మొగ్గు చూపారనుకుందాం. మళ్లీ భవిష్యత్తులో వారి రక్తనాళాలు మరోమారు సన్నబారి ఈసారి తప్పక శస్త్రచికిత్స చేయాల్సి వచ్చిందనుకోండి. అప్పటికీ వాళ్ల వయసు బాగా పెరిగిపోతుంది కదా! మరి ఆ వయసులో వారు శస్త్రచికిత్సను తట్టుకోగలరంటారా? అప్పుడెలా? డా. రమేశ్ : మూడు ప్రధాన రక్తనాళాల్లోనూ అడ్డంకులు ఉండి, యాంజియోప్లాస్టీకి అయ్యే వ్యయాన్ని భరించగలిగితే సరే. లేకపోతే శస్త్రచికిత్సకు వెళ్లడం అనేది రోగి ఇష్టానిష్టాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ రోగి వ్యయాన్ని భరించగలిగేవారే అనుకుందాం. అప్పుడు భవిష్యత్తులో తప్పక శస్త్రచికిత్స చేయించాల్సి వచ్చినా పర్లేదు. ఎందుకంటే ఇప్పుడు 80 ఏళ్లవారికీ శస్త్రచికిత్స చేయడం అంత కష్టమైన పనిగా వైద్యనిపుణులు భావించడం లేదు. రోగికి డయాబెటిస్ ఉంటే యాంజియోప్లాస్టీ మంచిదా లేక శస్త్రచికిత్సను సూచిస్తారా? డా. రమేశ్ : చాలామంది డయాబెటిస్ రోగులకు శస్త్రచికిత్స అంత మంచిది కాదనీ, యాంజియోప్లాస్టీయే మంచిదని అనుకుంటారు. కానీ... డయాబెటిస్ రోగులకు యాంజియోప్లాస్టీ ద్వారా రక్తనాళాన్ని వెడల్పు చేసినా... వారి మధుమేహ వ్యాధి కారణంగా రక్తనాళాలు మళ్లీ సన్నబారిపోవడానికి (రీ-స్టెనోసిస్కి) అవకాశాలు ఎక్కువ. అందుకే డయాబెటిస్ ఉన్నవారికి యాంజియోప్లాస్టీ కంటే శస్త్రచికిత్స మేలు. గుండె చికిత్స విధానాల్లో గతంలో అపోహలు అనుకున్నవి... ఇప్పుడా అభిప్రాయాలు మారిపోయినవి ఏవైనా ఉన్నాయా? డా. రమేశ్ : ఉన్నాయి! గతకొంత కాలం క్రితం బీటా బ్లాకర్స్ అనే మందులు హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న రోగులకు వాడటం సరైన పద్ధతి కాదు అనుకునేవారు. కానీ ఈరోజు ఆ మందులే వైద్యుల ‘డ్రగ్ ఆఫ్ ఛాయిస్’ అయ్యాయి. ఇక అలాగే వ్యాయామం విషయానికి వస్తే... ఆపరేషన్ అయిన రోగికి వారానికి మూడు రోజుల పాటు... రోజుకు 45 నిమిషాల నడక చాలు అనుకునేవారు. కానీ వారి వారి సామర్థ్యాన్ని బట్టి వారంలోని ఏడు రోజులూ నడిచినా మంచిదే. ఇది కేవలం గుండెజబ్బుల వారికే కాదు, ఆరోగ్యవంతులకూ వర్తిస్తుంది. ఒక్కొక్క రోగికీ అతడి లక్షణాలను బట్టి చికిత్సాప్రాధాన్యాలు మారుతుంటాయి. కానీ ఓ సంయుక్త సందేశం ఇవ్వదలిస్తే డాక్టర్‌గా మీరేం చెబుతారు? డా. రమేశ్ : నేను ఒక్కడినే చెప్పడం కాదు. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఆరోగ్య అంశాలపై రూపొందించిన ‘నాన్ కమ్యూనికబుల్ డిసీజస్’ విభాగం పేర్కొనే విషయం ఒక్కటే. గుండెజబ్బులు, డయాబెటిస్, క్యాన్సర్, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల జబ్బులు... ఈ నాలుగు ప్రధాన జబ్బుల నివారణకు ఒకటే తారక మంత్రం. అది పొగతాగకపోవడం, క్రమం తప్పని వ్యాయాయం, మంచి ఆరోగ్యకరమైన ఆకుకూరలు ఎక్కువగా ఉండే సమతులాహారం. సవరణ: ఈనెల 5వ తేదీన ‘చైతన్య శీల నెట్వర్క్’ శీర్షికన ఫ్యామిలీ పేజీలో ప్రచురించిన వార్తలో ఫ్లోరైడ్ యాక్షన్ నెట్వర్క్ ఏర్పాటు కోసం స్ఫూర్తినిచ్చిన వారు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్. డి. రాజారెడ్డి అని గమనించగలరు. ఈయన గత నాలుగు దశాబ్దాలుగా ఫ్లోరైడ్పై పలు రూపాల్లో యుద్ధం చేస్తున్నారు. -
‘సొరంగం’ పూర్తిచేయడమే లక్ష్యం
సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి కనగల్: శ్రీశైలం సొరంగ మార్గం పూర్తిచేయడమే లక్ష్యమని సీఎల్పీ ఉపనేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సొరంగం పూర్తయితేనే జిల్లాను పీడిస్తున్న ఫ్లోరోసిస్ భూతంతో పాటు రైతులను సాగు నీరందనుందన్నారు. శ్రీశైలం సొరంగం నిర్మాణం పనులు ఇప్పటికే అరవై శాతం పూర్తయ్యాయని వివరించారు. 2007 శ్రీశైలం సొ రంగం నిర్మాణానికి 2 వేల కోట్ల ను మంజూరు చేయించానన్నారు. మిగతా పనుల పూర్తికి ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ సమావేశా ల్లో రెండు గంటలు చర్చించామన్నారు. దీంతో ముఖ్యమంత్రి కేసీర్ స్పందించి అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి సొరంగం నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చినట్టు ఆయన తెలిపారు. రాబోయే మూడేళ్లలో సొరంగాన్ని పూర్తిచేసి రైతులకు నిరంతరం రెండు పంటలకు సాగు నీరందించడమే ధ్యేయమన్నారు. ఇప్పటికే సుమారు 15 కోట్ల పంచాయతీరాజ్ నిధులు మండలంలోని వివిధ లింక్‌రోడ్ల అభివృద్ధికి మం జూరైనట్లు వివరిం చారు. ఇటీవల మంజూరైన పొనుగోడు 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను మూడు మాసాల్లో నిర్మా ణం పనులను పూర్తి చేయనున్నట్లు తెలిపారు. చర్లగౌరారం, చెట్లచెన్నారం గ్రామాలకు సైతం త్వరలోనే సబ్ స్టేషన్లు మంజూరు కానున్నట్లు తెలిపారు. నాలుగేళ్లపాటు అభివృద్ధి ఆ తర్వా తే రాజకీయాలన్నారు. అభివృద్ది పనుల నిధుల మం జూరికే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలుస్తున్నానని, పార్టీ మా రడానకి కాదని స్పష్టం చేశారు. జి.చెన్నారం శ్రీబ్రమరాం బిక మల్లికార్జున స్వా మి ఆలయ అభివృద్ధికి 10 వేల విరాళం అందజేశారు. ఆలయం నిర్మాణ క్రమంలో మరో లక్ష అందజేస్తాన న్నారు. అంతకుముందు పర్వతగిరి ఫీడర్ చానల్‌పై ఉన్న శిథిల బ్రిడ్జిని ఆయన పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో జెడ్పీటీసీ నర్సింగ్ శ్రీని వాస్‌గౌడ్, మాజీ ఏఎంసీ చైర్మన్ భిక్షంయాదవ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గడ్డం అనూప్‌రెడ్డి, సర్పంచులు పావనీవెంకటే శం, సునీతావేంకన్న, యాదయ్య, పెంటయ్య, పెద్దులు, లింగయ్య, ఎంపీటీసీలు సునితాకృష ్ణయ్య, హఫీజొద్దీన్,రాజీవ్ ఉన్నారు. -
కృష్ణా జలాలే శరణ్యం
సాక్షిప్రతినిధి, నల్లగొండ :జిల్లాను పట్టిపీడిస్తున్న ఫ్లోరోసిస్ సమస్యను అధిగమించడానికి కృష్ణాజలాల సరఫరానే బ్రహ్మాయుధమని అంటున్నారు జాతీయ ఫ్లోరైడ్ పరిశోధన సంస్థ ఇన్చార్జ్ డాక్టర్ అర్జున్.ఎల్.కందారే. ఫ్లోరోసిస్ నివారణకు ప్రభుత్వాలతోపాటు ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, అన్నివర్గాల వారి భాగస్వామ్యం అవసరమని ఆయన అభిప్రాయపడుతున్నారు. కేంద్రప్రభుత్వం జిల్లాలో ఏర్పాటు చేసిన జాతీయ పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో ఫ్లోరోసిస్ నివారణ పనులు త్వరలోనే ప్రారంభిస్తామని, రాష్ట్ర ప్రభుత్వం సహకారం కూడా తీసుకుంటామని చెబుతున్నారాయన. గురువారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంట ర్వ్యూలో ఫ్లోరోసిస్ నివారణ క్రమంలో ఎదురవుతున్న సమస్యలు, తన అనుభవాల గురించి మాట్లాడారు కందారే. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే... ఫ్లోరోసిస్ సమస్య పరిష్కారం ఏ ఒక్కరి చేతుల్లోనో లేదు. చట్టాలు తయారు చే సే ప్రజాప్రతినిధుల నుంచి సామాన్య ప్రజలవరకు అన్నివర్గాలు ఇందులో చేయీచేయీ కలపాల్సి ఉం టుంది. అలా అందరినీ ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఫ్లోరైడ్ నాలెడ్జ్ అండ్ యాక్షన్ నెట్వర్క్ పేరుతో జాతీయస్థాయిలో వివిధ రంగాల ప్రముఖులను, ఎన్జీఓలను భాగస్వాములను చేసే ప్రయత్నం జరుగుతోంది. అందరూ సహకరిస్తే ఫ్లోరోసిస్ నివారణ పెద్ద సమస్యేమీ కాదు. అయితే, చిత్తశుద్ధితో పనిచేస్తేనే ఇది సాధ్యమవుతుంది. అన్నిచోట్లా ఇదే సమస్య మన దేశంతోపాటు చాలాచోట్ల ఈ ఫ్లోరోసిస్ సమస్య ఉంది. ఈ ఏడాది నవంబర్ 25-28 తేదీల్లో మధ్య థాయిలాండ్‌లోని చాంగ్మై పట్టణంలో ఫ్లోరోసిస్ నివారణపై అంతర్జాతీయ సమావేశం జరిగింది. ఇందులో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశం నాకు దక్కింది. నాతోపాటు శ్రీలంక, పాకిస్తాన్, థాయిలాండ్, స్పెయిన్ దేశాల ప్రతినిధులూ వచ్చారు. వారంతా తాము కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్టు వారి ప్రజెంటేషన్లలో చెప్పారు. ఇటలీనుంచి వచ్చిన ప్రతినిధి కూడా ఇదే చెప్పారు. ఈ సమావేశం ఇన్పుట్స్ ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా ఫ్లోరైడ్ నివారణపై పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతున్నాయి. అసలు ఫ్లోరోసిస్ నివారణమార్గాలు ఏంటన్న దానిపై అంతర్జాతీయ సమాజం దృష్టి సారించింది. బోన్చార్.. ఓకే.. కానీ ఫ్లోరోసిస్ సమస్యకు నదీజలాలతో పాటు మరో ముఖ్యమైన పరిష్కారం ‘బోన్చార్’. అంటే జంతువు ఎముకలను నిర్ణీత కాలవ్యవధిలో నిర్ణీత ఉష్ణోగ్రతలో వేడి చేయడం ద్వారా ఆ ఎముకల్లో ఉన్న ప్రొటీన్లు, కొవ్వును కరిగించవచ్చు. దీనినే బోన్చారింగ్ అంటారు. తర్వాత ఆ ఎముకలను పొడి చేసి క్యాండిల్స్ మాదిరిగా తయారు చేసి రక్షిత మంచినీటి పథకాల్లో ఇమడ్చడం ద్వారా ఫ్లోరోసిస్ సమస్యను నివారించవచ్చు. కానీ ఇందులో ఏ జంతువు ఎముకలు వాడాలి అనే దానిపై కొన్ని సమస్యలు వచ్చే అవకాశం లేకపోలేదు. ప్రక్రియ సరిగ్గా జరగకపోతే మరికొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయేమోననే దానిపై చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా ఈ విధానం ఫ్లోరోసిస్ నివారణకు ఉత్తమ మార్గమనేది నా అభిప్రాయం. అయితే దీనిని ప్రజలు అంగీకరిస్తారో లేదో అనే సందేహం మాత్రం ఉంది. వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవాలి వర్షపు నీటిని నిల్వ చేసి సద్వినియోగం చేసుకోవడం కూడా ఫ్లోరోసిస్ ప్రధాన పరిష్కారమార్గాల్లో ఒకటి. ఈ విధానం వల్ల నదీజలాలను ప్రజలకు తాగిస్తే ప్రయోజనం ఉంటుంది. నార్కట్‌పల్లి మండలంలోని మాధవ యడవల్లి గ్రామ ప్రజల విజయరహస్యం ఇదే. అక్కడ ఫ్లోరోసిస్‌తో బాధపడుతున్న వారిలో క్రమంగా మార్పు వస్తోంది. ఎందుకంటే ఆ గ్రామానికి ఆరేడేళ్లుగా కృష్ణా జలాలను అందిస్తున్నారు. ఇప్పుడు అక్కడి యువత, చిన్నారుల్లో పెద్దగా ఫ్లోరోసిస్ సమస్యల్లేవు. దంత ఫ్లోరోసిస్ మాత్రమే కనిపిస్తోంది. స్కెలెటిన్ ఫ్లోరోసిస్ కేసులు ఇప్పుడు అసలు రావడం లేదు. మేం త్వరలోనే లైన్లోకి వస్తున్నాం ఇక, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చౌటుప్పల్ మండలంలోని మల్కాపూర్ గ్రామపరిధిలో ఏర్పాటు చేస్తున్న జాతీయ ఫ్లోరైడ్ పరిశోధన సంస్థ పనులు త్వరలోనే ప్రారంభిస్తాం. ఇందులో ఫ్లోరోసిస్ నివారణకు ఔషధాలు, ఇతర మార్గాలు, భౌగోళిక సంబంధ పరిశోధనలు జరుగుతాయి. ఈ సంస్థకు భూమి కేటా యింపు ప్రక్రియ కూడా పూర్తయింది. సంస్థ పేరిట ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయిస్తున్నాం. త్వరలోనే దీనిపై కేంద్రప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేస్తోంది. ఈ సమావేశంలో సంస్థ ఏర్పాటుకు అవసరమైన నిధుల వివరాలు, కల్పించాల్సిన మౌలిక సౌకర్యాలపై చర్చిస్తాం. ఇందుకు సంబంధించిన నివేదికను ఇప్పటికే పంపాం. అయితే, ఈ సంస్థ ఏర్పాటయ్యేం దుకు రూ.150 కోట్లు అవసరమని అంచనా. కానీ, ప్రస్తుతమున్న నిధులతో కార్యకలాపాలు ప్రారంభించి అనంతరం కేంద్రం నుంచి అవసరమైతే రాష్ట్రం నుంచి నిధులు తీసుకుంటాం. -
కాలుష్య నివారణ చర్యలేవి..?
మంచాల: ఫ్లొరైడ్ పీడిత ప్రాంతాలకు స్వచ్ఛమైన తాగు నీరును అందించాలనే లక్ష్యంతో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి సరఫరా చేస్తున్న కృష్ణా జలాలు అడుగడుగునా కలుషితమవుతున్నాయి. వీటిని తాగాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. నాగార్జునసాగర్ నుండి వచ్చే కృష్ణా జలాలను గున్గల్ రిజర్వాయర్ నుండి ఈ ప్రాం తంలోని కందుకూరు, యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం మండలాలకు సంబంధించిన 134 గ్రామాలకు ప్రభుత్వం సరఫరా చేస్తోంది. ఇందుకు ప్రభుత్వం 2007లో రూ.18కోట్లను ఖర్చు పెట్టింది. ప్రత్యేకంగా 12 ట్యాంకులు, సంఫులను నిర్మించింది. నీటి సరఫరాకు 60మందికి పైగా సిబ్బంది పని చేస్తున్నారు. వీరు ఈ కృష్ణా జలాలు ఎక్కడా లీకేజి ,వృధా, కలుషితం గాకుండా చర్యలు తీసుకోవాలి. కాని గ్రామాలకు ఎక్కడా స్వచ్ఛమైన కృష్ణా జలాలు అందండం లేదు. లీకేజీల మయం... కృష్ణాజలాలు అనేకచోట్ల లీకేజీల రూపంలో వృధా కావడమే కాక తాగడానికి పనికిరాని విధంగా కలుషితమవుతున్నాయి. ప్రధానంగా గున్గల్నుండి లోయపల్లివరకు పైపు లైన్ పరిధిలో ఎల్లమ్మతండ-రంగాపూర్ , గున్గల్-గడ్డమల్లాయ్యగూడెం , ఆగాపల్లి- నోముల, నోముల- లింగంపల్లి మధ్య,..అలాగే జాపాల-బండలేమూర్ పైపు లైన్ పరిధిలో జాపాల ప్రభుత్వ పాఠశాల , ఆరుట్ల సమీపంలోని వ్యవసాయ పొలాల వద్ద ,.. మంచాల -తిప్పాయి గూడ పైపులైన్ పరిధిలో చిత్తాపూర్ వద్ద తరుచూ గేట్ వాల్వ్‌లు లీకేజీలు అయి నీరు నేలపాలవుతున్నాయి. నాగార్జున సాగర్- హైదారాబాద్ రహదారిపై ఏకంగా ప్రయాణికులు ఈ నీటితోనే స్నానాలు చేస్తున్నారు. ఆగాపల్లి-గురునానక్ కళాశాల మధ్య పారెస్టు సమీపంలో రెండు,మూడు చోట్ల గేట్ వాల్వ్‌ల వద్ద కృష్ణా జలాలు పూర్తిగా కలుషితమవుతున్నాయి. ఒక చోట గేదెలు, గొర్రెలు,మేకలు వంటి జంతువులను గేట్ వాల్వ్ నుండే నీరు తాగిస్తున్నారు.మరో చోట ప్రయాణికులు గేట్‌వాల్వ్ వద్ద నీటిని లీక్ చేసి అందులో నుండే నీళ్లు తోడుకొని స్నానాలు చేస్తున్నారు. దుస్తులు ఉతుక్కుంటున్నారు. ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు, కృష్ణా నీటి సరఫరా విభాగం సిబ్బంది కనీస పర్యవేక్షణ కూడా ఉండడంలేదు. ఇదే విషయంపై ఆర్‌డబ్ల్యుఎస్ డీఈఈ విజయలక్ష్మిని వివరణ కోరగా గ్రామాల్లో గేట్ వాల్వ్‌లు ఎక్కడెక్కడ లీకేజీ అవుతున్నాయో పరిశీలించి తక్షణమే చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
మునుగోడు తీరినట్టే!
ఇక.. ఫ్లోరైడ్ బాధలకు చెక్ మునుగోడు నియోజకవర్గం నుంచే వాటర్‌గ్రిడ్ పథకం డిసెంబర్లో పైలాన్‌ను ఆవిష్కరించనున్న సీఎం జనవరి మొదటివారంలో ప్రారంభం కానున్న పనులు నీటి సరఫరా విభాగం అధికారుల సమీక్షలో నిర్ణయించిన కేసీఆర్ చౌటుప్పల్ ఎన్నికల ముందు ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టి, ప్రజలకు రక్షిత జలాలను అందిస్తామని హామీ ఇచ్చిన టీఆర్ ఎస్ ఆ దిశగా అడుగులు వేస్తోంది. కరువు కాలంలో నీటి కొరత లేకుండా ప్రజలకు అవసరమైన నీటిని నిల్వ చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్ పథకానికి, రాష్ట్రంలోనే అత్యంత ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైన మునుగోడు నియోజకవర్గం నుంచే శ్రీకారం చుట్టనుంది. సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లో శనివారం నీటి సరఫరా విభాగం అధికారులతో సమీక్షించారు. మునుగోడులో వాటర్‌గ్రిడ్ పైలాన్ ఏర్పాటుకు సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. డిసెంబర్ మాసంలో కేసీఆర్ పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు. జనవరి మొదటి వారంలో రాష్ట్రవ్యాప్తంగా వాటర్‌గ్రిడ్ పనులు ప్రారంభం కానున్నాయి. నేటికీ అందని రక్షిత జలాలు.. రాష్ట్రంలోనే అత్యంత ఫ్లోరైడ్‌పీడిత ప్రాంతంగా జిల్లా గుర్తింపు పొందింది. డెబ్బైఏళ్లుగా ఫ్లోరైడ్ భూతం పట్టి పీడిస్తోంది. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లవుతున్నా జిల్లావాసులకు తాగేందుకు రక్షిత జలాలు కరువయ్యాయి. నేటికీ సగం మంది విషపు నీటినే తాగుతున్నారు. దాదాపు 5లక్షల మంది బాధితులు ఫ్లోరైడ్ వ్యాధితో సతమతమవుతున్నారు. మునుగోడు నియోజకవర్గంలో అత్యధికంగా ఫ్లోరైడ్ ఉంది. సాధారణంగా నీటిలో ఫ్లోరైడ్ శాతం 0.5పీపీఎం (పార్ట్ పర్ మిలియన్) ఉండాల్సి ఉండగా, ఇక్కడ లభించే నీటిలో 16నుంచి 18పీపీఎం వరకు ఉంది. ఫలితంగా ఈ నీటిని తాగిన జనం జీవచ్ఛవాలుగా మారిపోయారు. చేతులు, కాళ్లు వంకర్లు పోయాయి. నడవలేరు. వంగలేరు. నేలపై పడుకోలేరు. 5లక్షల మంది ఫ్లోరైడ్ బాధితులు జిల్లాలో దాదాపు 5లక్షల మంది ఫ్లోరైడ్ వ్యాధితో బాధపడుతున్నారు. ఇందులో సుమారు 4లక్షల మంది 1 - 18 ఏళ్ల వయస్సున్న వారు ఉన్నారు. సుమారు 75వేల మందికిపైగా పూర్తి స్థాయిలో ఫ్లోరైడ్ భారిన పడి నరకయాతన అనుభవిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 1900 నివాస ప్రాంతాల్లో ఫ్లోరైడ్ నీటి సమస్య తీవ్రంగా ఉంది. ఇందులో ప్రస్తుతం 1180గ్రామాలకు మాత్రమే కృష్ణా జలాలను అందిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇంకా, 700లకుపైగా ఫ్లోరైడ్ పీడిత గ్రామాలు రక్షిత నీటికోసం ఎదురు చూస్తున్నాయి. సుమారు 400పైచిలుకు గ్రామాల్లో కృష్ణాజలాలను అందించేందుకు పైపులైను పనులు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొడతామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రజలకు రక్షిత జలాలను అందించాలనే లక్ష్యంతో వాటర్‌గ్రిడ్ పథకానికి రూపకల్పన చేశారు. ఫ్లోరైడ్ పీడిత ప్రాంతంగా ముద్రపడ్డ మునుగోడులోనే వాటర్‌గ్రిడ్ పైలాన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జనవరి మాసంలో పనులు ప్రారంభం కానున్నాయి. తాగుజలాలను కూడా ఫ్లోరైడ్ రహిత నీటినే అందించాలని తలంపుతో ఉన్న ప్రభుత్వం కృష్ణా నది నుంచి పాకాల-జూరాల ప్రాజెక్టును కూడా మునుగోడు నియోజకవర్గం మీది నుంచే వరంగల్‌లోని పాకాల చెరువు వరకు చేపట్టనుంది. నక్కలగండి ఎత్తిపోతల పథకాన్ని కూడా చేపడితే, కృష్ణాజలాలు సాగుజలాలుగా అందనున్నాయి. -
విషజలాన్నేతాగుతున్నారు
2 వేల గ్రామాల్లో మంచినీళ్లు విషపూరితం గుర్తించిన కేంద్ర ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని దాదాపు రెండు వేల గ్రామాల్లో ప్రజలు పూర్తిగా ఫ్లోరైడ్‌తో పాటు విషపూరిత జలాలనే మంచినీరుగా తాగుతున్నారని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఏపీలో 745 గ్రామాల్లో ఫ్లోరైడ్, మరో నాలుగు గ్రామాల్లో మాంగనీసు మూలకంతో భూగర్భ జలాలు విషతుల్యమయ్యాయి. తెలంగాణలో ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలు 1,174 ఉండగా, మాంగనీస్ మూలకంతో నీరు కలుషితమైన గ్రామాలు మరో మూడు ఉన్నాయి. ఆయా గ్రామాల్లో రానున్న మూడేళ్లలో ప్రతి వ్యక్తికి 8 నుంచి 10 లీటర్ల రక్షిత నీటిని అందించేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ప్రభావిత గ్రామాల్లో నీటి శుద్ధి ప్లాంట్ల ఏర్పాటు, లేదంటే ఆ గ్రామానికి దగ్గర నదులు, కాల్వల నుంచి నీటిని మళ్లించి ప్రతి ఇంటికీ రక్షిత మంచినీటిని అందజేస్తారు. దీనిపై రాష్ట్రాలకు సలహాలిచ్చేందుకు కేంద్రం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఆయా గ్రామాల్లో నీటి శుద్ధి ప్లాంట్ల ఏర్పాటు, భవన వసతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం నిధులు అందజేస్తాయి. అయితే ఆయా రక్షిత మంచినీటి ప్లాంట్ల నిర్వహణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిధులు అందజేయవు. ఆ బాధ్యతలను కాంట్రాక్టర్లకు అప్పగిస్తారు. ఆ కాంట్రాక్టర్లు గ్రామస్తుల నుంచి నామమాత్రపు రుసుం వసూలు చేస్తూ పదేళ్ల పాటు రక్షిత నీటి ప్లాంట్లు నిర్వహిస్తారు. ఈ రక్షిత నీటి పథకాలను ఏపీలో ఈ ఆర్థిక ఏడాది 166, వచ్చే ఏడాది 333, ఆపై ఏడాది మిగిలిన 250 గ్రామాల్లో ఏర్పాటు చేస్తారు. తెలంగాణలో ఈ ఏడాది 262, రెండో సంవత్సరం 523, మూడో సంవత్సరం 392 గ్రామాల్లో ఏర్పాటు చేయనున్నారు. -
ప్రభుత్వాలు మారినా...మారని రాతలు
-
బోరుమంటున్నాయి
తెలంగాణలో అడుగంటిన భూగర్భజలాలు 38 మండలాల్లో దుర్భర పరిస్థితి, మరో 59 మండలాల్లో తీవ్ర ఎద్దడి జాబితా రూపొందించిన రాష్ర్ట ప్రభుత్వం దేశవ్యాప్తంగా తాగు నీటి సమస్యపై దృష్టి సారించిన కేంద్రం కార్యాచరణపై నేడు రాష్ట్రాలతో సమావేశం.. కేటీఆర్ హాజరు హైదరాబాద్: తెలంగాణలో భూగర్భ జలా లు అడుగంటుతున్నాయి. వినియోగం విపరీతంగా పెరిగిపోవడంతో తాగునీటికీ ఇక్కట్లు తప్పడం లేదు. మరోవైపు పాతాళానికి చేరిన జలాలను వినియోగించడం వల్ల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఫ్లోరైడ్‌తోపాటు పలు రకాల జబ్బులకు కారణమయ్యే మలినా లు, ఖనిజాల అవశేషాలు భూగర్భ జలాల్లో పెరిగిపోతున్నాయి. బావులు, బోర్లు ఎండిపోవడంతో తాగునీటికి తీవ్ర ఇక్కట్లు ఎందుర్కొం టున్న గ్రామీణ ప్రజలు సుదూరాలకు వెళ్లి చెలి మల్లో నుంచి తాగునీటిని తెచ్చుకోవాల్సి వస్తోం ది. ఇలాంటి బాధిత గ్రామాల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. కొన్ని చోట్ల తీవ్ర నీటి ఎద్దడి సర్వ సాధారణంగా కూడా మారింది. ఒక్క తెలంగాణ రాష్ర్టంలోనే కాదు దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ సమస్యను తీర్చడానికి రాష్ర్ట ప్రభుత్వాలు సైతం ఎక్కువగా బోర్లపైనే ఆధారపడుతుండటంతో భూగర్భ జలాలు అందనంత లోతుల్లోకి చేరుతున్నాయి. మంచి నీటి పథకాలు రూపొందించే సమయంలో తాగునీటి వనరుల లభ్యతను పట్టించుకోకపోవడం వల్ల ప్రతి వేసవిలోనూ తాగునీటి సమస్య పునరావృతమవుతోంది. ఎక్కడికక్కడ దగ్గర్లోని చెరువులు, డ్యాములు, రిజర్వాయర్ల నుంచి గ్రామాలకు తాగునీటిని అందించేందుకు ఎలాంటి ప్రయత్నాలు జరగడం లేదు. ప్రస్తుతం తెలంగాణలోని ఆరు జిల్లాల్లో తాగునీటి ఇబ్బందులు తీవ్రంగా ఉన్నాయి. వీటిలోని మండలాలను సమస్యాత్మకం, అతి సమస్యాత్మకం, దుర్భర మండలాలుగా రాష్ట్ర ప్రభుత్వం విభజించింది. దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి మండలాలు అనేకం ఉన్నాయి. ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని ఈ ఆర్థిక సంవత్సరంలోనే 20 వేల ఆవాస ప్రాంతాలకు తాగునీటిని అందించే ందుకు ప్రత్యేక పథకాన్ని ప్రారంభించాలని కేంద్రం యోచిస్తోంది. ఈ అంశంపై చర్చించడానికి సోమవారం ఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ధి, తాగునీటి శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నేతృత్వంలో రాష్ట్రాలతో సమావేశం జరగనుంది. ఆయా రాష్ట్రాల గ్రామీణ తాగునీటి శాఖల మంత్రులు దీనికి హాజరుకానున్నారు. రాష్ర్టం తరఫున మంత్రి కేటీఆర్ హాజరవుతున్నారు. సమీప నీటి వనరుల నుంచే సరఫరా తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న మండలాల్లోని గ్రామాలకు దగ్గర్లోని డ్యామ్‌లు, భారీ చెరువుల నుంచి తాగునీటిని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో భూగర్భ జలాలు మరింతగా పడిపోతున్నందున కేంద్రం ఈ కార్యాచరణ చేపట్టింది. ఇకపై తాగునీటికి ఇబ్బందులు కలగకుండా ఈ ఆర్థిక సంవత్సరంలోనే 20 వేల ఆవాస ప్రాంతాలకు ఉపరితల మార్గంలో నీటిని సరఫరా చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణలోని ప్రభావిత మండలాల జాబితాను రూపొందించింది. దీని ప్రకారం రాష్ట్రంలో భూగర్భ జలాలు అతిగా వినియోగించిన 38 మండలాల్లో దుర్భర పరిస్థితులు ఉండగా, 14 మండలాలను అతి సమస్యాత్మకమైనవిగా, మరో 45 మండలాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించింది. ఈ జాబితాలో ఖమ్మం, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లోని మండలాలే అధికంగా ఉన్నాయి. ఐదేళ్లకు వంద కోట్లూ ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సిన నిధులు సకాలంలో విడుదల అవుతాయనే ఉద్దేశంతో చేపట్టిన పథకాలు నిధులు లేక మధ్యలోనే ఆగిపోయాయి. ఐదేళ్లలో తెలంగాణ ప్రాంతంలో గ్రామీణ తాగునీటి పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం తనవాటాగా రూ. 1128.50 కోట్లు ఇవ్వాల్సి ఉండగా రూ. 99.89 కోట్లు మాత్రమే ఇచ్చింది.. ఇంకా రూ. 1,028.61 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. నిధులు లేకపోవడంతో తొమ్మిది జిల్లాల్లో పలు పథకాలు మధ్యలోనే ఆగిపోయాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లు వినియోగించుకోవడం మినహా.. రాష్ట్రం తన వాటా నిధులు విడుదల చేయలేదు. -
ఫ్లోరైడ్ పాపం ఆంధ్రాపాలకులదే
నల్లగొండ రూరల్ :జిల్లా ఫ్లోరిన్ పీడిత ప్రాంతంగా మారడానికి ఆంధ్రా పాలకులే కారణమని రాష్ర్ట విద్యాశాఖమంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని చిన వెంకటరెడ్డి ఫంక్షన్హాల్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంత్రిని ఘనంగా సన్మానించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ 1972లో జిల్లాలోని ఒకే గ్రామంలో ఫ్లోరైడ్ సమస్య ఉంటే ప్రస్తుతం జిల్లా అంతటా ఈ సమస్య నెలకొందన్నారు. రాష్ర్టంలో విద్యుత్ సమస్యను అధిగమించేం దుకు ఛత్తీస్‌ఘడ్ నుంచి కొనుగోలు చేస్తామన్నారు. అక్కడి నుంచి తెలంగాణకు కరెంట్ లైన్ ఏర్పాటు చేసేందుకు ఏడాది సమయం పట్టొచ్చన్నారు. మూడో సంవత్సరం నుంచి గృహ అవసరాలకు, వ్యవసాయానికి నిరంతరం విద్యుత్ సరఫరా చేసేందుకు అనుగుణంగా ప్రాజెక్టులు, పవర్‌ప్రాజెక్టులు నెలకొల్పుతామన్నారు. పాల న కొనసాగించేందుకు కేంద్రం 45 మంది ఐఏ ఎస్‌లను ఇచ్చిందని, వారు సరిపోయే పరిస్థితి లేదన్నారు. జిల్లా ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నామన్నారు. ఉద్యోగ కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తీర్మానాన్ని అడ్డుకునేందుకు యత్నం పోలవరం ముంపునకు గురవుతున్న 7 మండలాలను ఆంధ్రాలో కలపడాన్ని వ్యతిరేకిస్తూ ఇటీవల అసెంబ్లీలో తీర్మానం చేస్తే చంద్రబాబు తన ఏజెంట్లయిన ఎమ్మెల్యేల ద్వారా అడ్డుకునేందు కు ప్రయత్నించారని ఆరోపించారు. బాబు రాష్ట్రంలో ఆక్రమించిన హరిజన, గిరిజన, బడు గు బలహీన వర్గాల భూముల బండారం బయ ట పడుతుందనే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇబ్బం దులకు గురి చేసేందుకు కుట్ర చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర బిల్లు ఏర్పాటు సమయంలో పోలవరం ముంపు ప్రాంతాలైన కొన్ని గ్రామాలను ఆంధ్రాలో కలిపే ప్రతిపాదనను తాము వ్యతిరేకించామన్నారు. కానీ ఇలా చేయ డం వల్ల రాష్ట్ర ఏర్పాటుకు అవరోధం ఏర్పడుతుందని, రాష్ట్రం ఏర్పడిన తర్వా త సవరించుకోవచ్చని కొందరు పెద్దలు చెప్పడంతో అంగీకరించామన్నారు. కానీ ప్రస్తుతం చంద్రబాబు కుట్రతో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఏడు మండలాలను ఆంధ్రాలో కలుపుతూ ఆగమేఘాల మీద ఆర్డినెన్స్ తీసుకొచ్చారని అన్నారు. కొత్త రాష్ట్రం లో ఉన్న సమస్యలను ఏవిధంగా అధిగమించాలనే విషయమై సీఎం కేసీఆర్ వద్ద తగిన ప్రణాళిక ఉందన్నారు. తెలంగాణలో పవర్‌ప్రాజెక్టులు పెట్టుకునే అవకాశం ఉన్నా అప్పటి పాలకులు ఆంధ్రాలో పెట్టారని పేర్కొన్నారు. మంత్రికి ఘనసన్మానం మంత్రి జగదీష్‌రెడ్డి, భువనగిరి ఎంపీ బూరనర్సయ్యగౌడ్‌ను ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కుల సంఘాల నాయకులు ఘనంగా సన్మానించారు. యాదగిరిగుట్ట ఆలయ అర్చకులు ఆశీర్వాదం అందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వేముల వీరేశం, గొంగిడి సునీత, గాదరి కిషోర్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, నాయకులు నోముల నర్సింహయ్య, చకి లం అనిల్‌కుమార్, దుబ్బాక నర్సింహరెడ్డి, అమరేందర్‌రెడ్డి, మందడి రామంచద్రారెడ్డి, షేక్ కరీంపాష, శంకర్‌రెడ్డి, లాలునాయక్, రామచందర్‌నాయక్, అభిమన్యు శ్రీనివాస్, మైనం శ్రీనివాస్, ఫరీదొద్దీన్, పున్న గణేష్, జమాల్‌ఖాద్రి, బకరం వెంకన్న, జి. సురేందర్, బొయపల్లి జానయ్య, తదితరులు పాల్గొన్నారు. -
ఫ్లోరైడ్‌కు విరుగుడేదీ..?
జిల్లాలో ఫ్లోరైడ్ బాధితులు :సుమారు 5లక్షలు 1-18ఏళ్ల వయస్సువారు :4లక్షలు పూర్తిస్థాయి బాధితులు :75వేలు పాక్షిక బాధితులు :25వేలు ఫ్లోరైడ్ నీటి సమస్య ఉన్న గ్రామాలు : 3,477 ప్రస్తుతం కృష్ణాజలాలు అందుతున్నవి : 1180 రక్షిత నీటికోసం ఎదురుచూస్తున్నవి : 700కు పైగా పైపులైన్ పనులు జరుగుతున్నవి : 400పైచిలుకు ఫ్లోరైడ్ బాధితుల చేతులు, కాళ్లు వంకర్లు పోయాయి. నడవలేరు. వంగలేరు. నేలపై పడుకోలేరు. ఫ్లోరైడ్ చిన్నారి నుంచి ముదుసలి వరకు మూలుగ బొక్కల్ని హరించేసింది.ఈ నీటిని తాగిన జనం జీవచ్ఛవాలుగా మారిపోయారు. మును‘గోడు’ వినేదెవరు..? మునుగోడు నియోజకవర్గంలో అత్యధికంగా ఫ్లోరైడ్ ఉంది. సాధారణంగా నీటిలో ఫ్లోరిన్ 0.5 పీపీఎం (పార్ట్ ఫర్ మిలియన్) ఉండాల్సి ఉండగా, ఇక్కడ లభించే నీటి లో 16 నుంచి 18 పీపీఎం వరకు ఉంది. మర్రిగూడ మండలం బట్లపల్లిలో అత్యధికంగా నీటిలో ఫ్లోరిన్ 18 పీపీఎం ఉంది. వట్టిపల్లి, వెంకెపల్లి, క్షుదాభక్షపల్లి, మర్రిగూడ, చండూరు మండలం గొల్లగూడెంలలో నీటిలో ఫ్లోరిన్ 10 నుంచి 18పీపీఎం వరకు ఉంది. ఈ ఒక్క నియోజకవర్గంలోనే 10వేల మంది ఫ్లోరోసిస్ బాధితులున్నారు. అధికారిక లెక్కల ప్రకారం 40శాతం వికలాంగత్వం పైబడ్డ వారు 5,951మందిగా గుర్తించారు. వీరిలో 4,556 మందికే పింఛన్లు అందుతున్నాయి. దండిగా నిధులిచ్చిన వైఎస్సార్.. జిల్లాలో ఫ్లోరైడ్ నివారణకు తాగునీటి సరఫరా పథకం కింద చంద్రబాబు హయాంలో రూ. 50కోట్లు ఖర్చు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి పదవీ బాధ్యతలను చేపట్టాక ఫ్లోరైడ్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. 2004 నుంచి రూ.395 కోట్లు కేటాయించి, దాదాపుగా ఖర్చు చేశారు. నత్తనడకన కృష్ణా జలాల పనులు ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలు 3,477 ఉన్నాయి. వీటిలో కొన్నింటికి రక్షిత జలాలు అందుతున్నాయి. కాగా, ఫ్లోరైడ్ ప్రాంతాలైన చౌటుప్పల్, భూదాన్‌పోచంపల్లి, బొమ్మలరామారం, రాజపేట, యాదగిరిగుట్ట, ఆలేరు, తుర్కపల్లి మండలాల్లో కృష్ణా జలాల పనులు చాలా నెమ్మదిగా జరుగుతున్నాయి. ప్రాజెక్టుల గడువు ముగిసినా పనులు మాత్రం పూర్తి కావడం లేదు. దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లోని పలు మండలాల్లోనూ ఇదే పరిస్థితి. సూర్యాపేటకు సంబంధించి రూ.71కోట్లు ఇటీవల మంజూరైనా పనులు మొదలు కాలేదు. కోదాడ, తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల్లోని పలు మండలాలకు నిధుల ఊసే లేదు. వందలాది గ్రామాల ప్రజలు ఫ్లోరైడ్ విషపు నీటినే తాగుతున్నారు. పడకేసిన పెలైట్ ప్రాజెక్టు.. ఫ్లోరైడ్‌ను రూపుమాపేందుకు రాష్ట్రంలోనే మొట్టమొదటి గ్రామంగా మర్రిగూడ మండలం ఖుదాభక్షపల్లి గ్రామాన్ని పెలైట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఫ్లోరైడ్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలను ప్రజలకు వివరించడం, రోజురోజుకూ తగ్గిపోతున్న భూగర్భజలాలను పెంపొందించేందుకు వాటర్‌షెడ్ పథకం కింద రైతుల భూముల్లో వరదకట్టలు కట్టడం, చెకుడ్యాంలు నిర్మించడం, ఫ్లోరోసిస్ బాధితులకు పౌష్టికాహారం అందించడం, ఫ్లోరైడ్‌ను నిరోధానికి అవసరమైన పండ్లు, కూరగాయల మొక్కలు పంపిణీ చేయడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. పిల్లలు ఫ్లోరోసిస్‌కు గురికాకుండా తాగుజలాలను పంపిణీ చేయడం, పాలు, గుడ్లు కూడా అందించాలి. ఫ్లోరైడ్ అధికంగా ఉన్న బోర్లు, చేతిపంపులను గుర్తించి, ప్రజలు వాడకుండా సీజ్ చేయాలి. ప్రజలు అవసరమైన అవగాహన కార్యక్రమాలను చేపట్టాలి. తద్వారా ఫ్లోరైడ్ నివారించి, ఈ ప్రాజెక్టును రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలనుకున్నారు. ఖుదాభక్షపల్లి గ్రామాన్ని పెలైట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి ఏడాది కావస్తున్నా, ఇంత వరకు పనులే ప్రారంభం కాలేదు. అధికారులు ఒకేఒక రోజు వచ్చి విద్యార్థులు, గ్రామస్తులకు అవగాహన కల్పించారు. చేతిపంపులు, బోర్ల నుంచి నీటి నమూనాలను సేకరించారు. మళ్లీ ఇంత వరకు గ్రామం వైపు కన్నెత్తి చూడలేదు. స్పీకర్ పర్యటనతో కాస్త ఊరట.. మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ పర్యటనతో ఫ్లోరోసిస్ బాధితులకు కాస్త ఉపశమనం కలిగింది. వారికోసం స్పీకర్ రూ.200కోట్లు కేటాయించారు. 16ప్రభుత్వ శాఖలు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. ఏడాదిలోగా లక్ష్యాన్ని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నా నెరవేరలేదు. ఫ్లోరైడ్ పీడిత 17మండలాల్లోని అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు గుడ్లు, పాలు అందిస్తున్నారు. కొన్ని అంగన్వాడీ కేంద్రాలు పాలు ఇవ్వడం లేదు. ఈ మండలాల్లోని ఆయా పాఠశాలల విద్యార్థులకు కూడా గుడ్లు ఇస్తామని ప్రకటించినా, ఆచరణకు నోచుకోలేదు. పాఠశాలల్లో వంటపాత్రలు స్టీలువి ఇస్తామని ఇవ్వలేదు. జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ఫ్లోరోసిస్ బాధితుల కోసం ప్రత్యేక వార్డు కేటాయించినా ఫలితం లేదు. నక్కలగండి ఎత్తిపోతల పథకానికి నిధులిప్పించేందుకు కృషిచేస్తామని చెప్పినా పురోగతి లేదు. సదరన్ క్యాంపుల ద్వారా 80వేల మందికిపైగా ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తులను గుర్తించారు. వీరిలో 13,395మంది పింఛన్‌కు అర్హులని తేల్చారు. ప్రస్తుతం 4,200మందికి మాత్రమే పింఛన్లు మంజూరయ్యాయి. 60శాతానికిపైగా వికలాంగత్వం ఉన్న వారికి రూ.500, ఆలోపు గల వారికి రూ.200 చొప్పున పింఛన్ ఇస్తున్నారు. వెయ్యి మందికి అంత్యోదయ కార్డులు జారీ చేశారు. సాగు, తాగు జలాలతోనే పరిష్కారం సాగు, తాగు జలాలను అందించినప్పుడే ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. వర్షాలు కురవకపోవడంతో రైతులు పెద్దఎత్తున బోర్లు వేస్తున్నారు. భూమి లోతుకు వెళ్లే కొద్దీ ఫ్లోరిన్ అధికంగా ఉంటుంది. ప్రపంచంలో గుక్కెడు నీటి కోసం ఉద్యమాలు చేసిన చరిత్ర నల్లగొండకు తప్ప ఎక్కడా లేదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రథమ ప్రాధాన్యంగా ఫ్లోరైడ్ సమస్యను తీసుకొని పరిష్కరించాలి. - కంచుకట్ల సుభాష్, ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి కన్వీనర్ పునాదిరాయి పడేదెన్నడో..? అప్పటి శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో 17మంది ఎమ్మెల్యేల బృందం 2012 జూలై 7, 8తేదీల్లో మునుగోడు నియోజకవర్గంలో పర్యటించింది. ఫ్లోరోసిస్ బాధితుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంది. ఫ్లోరైడ్ నివారణకు గానూ మరిన్ని పరిశోధనలు అవసరమని భావించింది. చౌటుప్పల్ మండలం మల్కాపురంలో కేంద్రప్రభుత్వం రూ.250కోట్ల వ్యయంతో జాతీయ ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు మనోహర్ ప్రకటించారు. 6నెలలు దాటినా పునాదిరాయి మాత్రం పడడం లేదు. రాష్ట్ర విభజన, ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడింది. ఈ కేంద్రం 10 రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ పనిచేయనుంది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమబెంగాల్, అస్సాం, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు సేవలు అందించనుంది. ఫ్లోరోసిస్ బాధితుల కోసం ప్రత్యేకంగా 70 పడకల ఆస్పత్రిని కూడా నిర్మించనున్నారు. తెలంగాణ కొత్త రాష్ట్రంలో తక్షణమే ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రం పనులు ప్రారంభించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
పారిశుద్ధ్యంతోనే సంపూర్ణ ఆరోగ్యం
- ఫ్లోరైడ్ విరుగుడుకు భూగర్భజలాలు పెంచాలి - కలెక్టర్ చిరంజీవులు - మల్లాపురంలో శ్రీసత్యసాయి మంచినీటి పథకం ప్రారంభం పెద్ద అడిశర్లపల్లి, న్యూస్‌లైన్, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా ప్రతి ఒక్కరూ ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ చిరంజీవులు అన్నారు. పెద్దఅడిశర్లపల్లి మండ లం మల్లాపురంలో భగవాన్ శ్రీసత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘సత్యసాయి ప్రేమామృతధార’ మంచినీటి పథకాన్ని ఆదివారం ఆయన ప్రారంభిం చారు. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామ సభలో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ మరుగుదొడ్డి నిర్మించుకోవాలని చెప్పారు. మురుగునీటి పారుదల కోసం నిర్మించిన డ్రెయినేజీలను శుభ్రంగా ఉంచాలన్నారు. ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించేందుకు భూ గర్భజలాలను పెంచాలన్నారు. ఎక్కువలో తులోనుంచి బోర్లద్వారా నీటిని తోడడం వల్ల ఫ్లోరిన్ సమస్య తీవ్రమవుతుందని చెప్పారు. సమస్య పరిష్కారానికి అన్ని గ్రామాల్లో ఇంకుడుగుంతలు నిర్మించాలని, చెట్లను పెంచాలని సూచించారు. సత్యసాయి సేవాసమితి 5 లక్షల వ్యయంతో స్వచ్ఛం దంగా గ్రామంలో వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. త్వరలో అన్ని గ్రామాలకు కృష్ణాజలాలు అందిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా చిన్నారుల కోలాట బృందం, గ్రామస్తులు కలెక్టర్‌కు ఘనస్వాగతం పలి కారు. అనంతరం మహిళలు సాయివ్రతాలు ఆచరించారు. అలాగే భక్తులకు అన్నదానం చేశారు. సత్యసాయి మండల సేవాసమితి కన్వీనర్ కల్వకొల్లు శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఎం.కృష్ణారావు, సేవాదళ్ కన్వీనర్ శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్ జి.రాజయ్య, ఎంపీడీఓ బి.నర్సింగరావు, సత్యసాయి సేవాసమితి సభ్యులతో పాటు సర్పంచ్ ఆర్.శంకర్‌నాయక్, జైపాల్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, కార్యదర్శి చలమయ్య, వెంకటయ్య, జగన్ తదితరులు పాల్గొన్నారు. -
ఫ్లోరైడ్ రహిత జిల్లాగా మార్చుతాం
భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ నల్లగొండ రూరల్, న్యూస్‌లైన్ : ఫ్లోరైడ్ రహిత జిల్లాగా మార్చడమే టీఆర్ఎస్ లక్ష్యమని, అందుకు కేసీఆర్ కంకణబద్దులై ఉన్నారని భువనగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫ్లోరైడ్ నీటి వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని, అంగవైకల్యం తో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు కృష్ణాజలాలు అందించాలని కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని, త్వరలోనే జిల్లాకు ఫ్లోరైడ్ పీడ విరుగడ అవుతుందని చెప్పారు. కేసీఆర్‌తో భువనగిరిలోని నిమ్స్ ఆస్పత్రిని ప్రారంభిస్తామన్నారు. పార్టీ మేనిఫెస్టోను అమలు చేసి రాజ కీయ అవినీతి లేకుండా చేస్తామన్నారు. ప్రాజెక్టులు పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు అందిస్తామని చెప్పారు. తనను గెలిపించి వారికి పార్టీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో పార్టీ నాయకులు మైనం శ్రీనివాస్, మాలే శరణ్యారెడ్డి, నాగార్జున, సాయి, వెంకన్న పాల్గొన్నారు. -
ఫ్లోరైడ్ రహిత జిల్లాగా మార్చుతాం
నల్లగొండ రూరల్, న్యూస్‌లైన్ : ఫ్లోరైడ్ రహిత జిల్లాగా మార్చడమే టీఆర్ఎస్ లక్ష్యమని, అందుకు కేసీఆర్ కంకణబద్దులై ఉన్నారని భువనగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫ్లోరైడ్ నీటి వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని, అంగవైకల్యం తో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు కృష్ణాజలాలు అందించాలని కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని, త్వరలోనే జిల్లాకు ఫ్లోరైడ్ పీడ విరుగడ అవుతుందని చెప్పారు. కేసీఆర్‌తో భువనగిరిలోని నిమ్స్ ఆస్పత్రిని ప్రారంభిస్తామన్నారు. పార్టీ మేనిఫెస్టోను అమలు చేసి రాజ కీయ అవినీతి లేకుండా చేస్తామన్నారు. ప్రాజెక్టులు పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు అందిస్తామని చెప్పారు. తనను గెలిపించి వారికి పార్టీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో పార్టీ నాయకులు మైనం శ్రీనివాస్, మాలే శరణ్యారెడ్డి, నాగార్జున, సాయి, వెంకన్న పాల్గొన్నారు. -
నల్లగొండ జిల్లాను అభివృద్ధి చేస్తా
ఎన్నికల సభల్లో కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి కృషి ఫ్లోరైడ్ పీడ విరగడకు ప్రాధాన్యం అన్ని గ్రామాలకు కృష్ణా జలాలు కాంగ్రెస్ నేతల తీరుపై విమర్శలు సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ‘పాలమూరు వలసలతో మహబూబ్‌నగర్ జిల్లాకు జరిగిన నష్టం కన్నా, ఫ్లోరైడ్ సమస్యతో నల్లగొండ జిల్లాకు జరిగిన నష్టమే ఎక్కువ. దశాబ్దాల పాటు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి కాంగ్రెస్, టీడీపీ పాలకులే కారణం. అయినా, మరో సారి వారే ముందుకు వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఎవరి చేతిలో పెడితే తలరాతలు మారతాయో ఆలోచించండి. నలభై ఏళ్లు కాంగ్రె స్, పద్దెనిమిదేళ్లు టీడీపీల పాలన చూశాం. ఇంకా వాళ్లుఅవసరమా అని..’ అని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రశ్నించారు. బుధవారం ఆయన జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాల్లో జరిగిన బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఆయా సభల్లో టీఆర్ఎస్ ఎన్నికల ప్రణాళికను వివరిస్తూనే, జిల్లా అభివృద్ధికి తామేం చేయాలనుకంటున్నామో తెలిపారు. అదే సమయంలో జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలపైనా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సాగర్ నిర్మాణంలో మోసం నాగార్జునసాగర్‌ను వాస్తవానికి ఎగువలో 19 కిలోమీటర్ల దూరంలోని ఏలేశ్వరం వద్ద నిర్మించాల్సి ఉన్నా మోసం జరిగిందని ఆరోపించారు. ఫలితంగా ఆయకట్టు చివరి భూములకు సాగునీరంద ని దుస్థితి నెలకొందన్నారు. సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు పరిధిలో జగ్గయ్యపేట, నందిగామలను కలపడం వల్ల నష్టం జరిగిందన్నారు. ఖమ్మం జిల్లా ఆయకట్టు తగ్గిపోయిందని గుర్తు చేశారు. తాము ఎడమ కాల్వ సామర్ద్యం పెంచుతామని అన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగం పనులు మొదలై ఎన్నాళ్లయ్యింది. కాంగ్రెస్ నేతలు సిగ్గుతో తలవంచుకోవాలి. మాట్లాడడానికే సిగ్గనిపిస్తుంది. నల్లగొండ జిల్లాలో అంతా మంత్రులు, సామంతులే.. పనులు మాత్రం పూర్తి కావు. ఎందుకు వీరుండి. ఏం లాభం అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఎస్ఎల్బీసీ సొరంగం, నక్కలగండి పనులను రెండేళ్లలో పూర్తి చేయించి అ నీళ్లతో దేవరకొండ, మునుగోడు ప్రజల కాళ్లు కడుగుతా అని పేర్కొన్నారు. జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో లక్ష చొప్పున పన్నెండు లక్షల ఎకరాలకు సాగునీరందిస్తానని హామీ ఇచ్చారు. మూసీ ప్రాజెక్టు సామర్థ్యం పెంచుతామని, ఎస్సారె స్పీ ద్వారా తుంగతుర్తి నియోజకవర్గానికి నీరందేలా శ్రద్ధ తీసుకుంటానన్నారు. టెయిలెండ్ భూములకు నీరిందించడంతో పాటు, ఎత్తిపోతల పథకాల నిర్వహణ బాధ్యతను పూర్తిగా ప్రభుత్వమే తీసుకుంటుందని వివరించారు. అణుబాంబు కంటే ఫ్లోరైడ్ విధ్వంసమే ఎక్కువ హిరోషిమా, నాగసాకిలపై పడిన అణుబాంబు సృష్టించిన విధ్వంసం కంటే, ఫ్లోరైడ్ వల్ల జరిగిన విధ్వంసం ఎక్కువన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే, ఈ సమస్యపై దృష్టి పెట్టి కేవలం రెండేళ్లలో ప్రతి గ్రామానికీ కృష్ణా జలాలు అందిస్తామని హామీ ఇచ్చారు. తాగునీటి కోసం తండ్లాడుతున్న తుంగతుర్తి నియోజకవర్గానికి పాలేరు జలాలు తీసుకు వస్తానని పేర్కొన్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని తండాలకు కనీసం తాగునీరందించేలేక పోతున్నారని, ఈ పరిస్థితిలో మార్పు తీసుకువస్తానని హామీ ఇచ్చారు. చివరి సభ జరిగే సూర్యాపేటకు కేసీఆర్ రాత్రి 9.48 గంటలకు వచ్చారు. ప్రసంగానికి కేవలం 12నిమిషాలే ఉండడంతో ఆ సమయం లోనే ఆయన ప్రసంగాన్ని ముగించారు. అక్కడ సభలో కేసీఆర్ మాట్లాడుతూ సూర్యాపేట నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి గుంటకండ్ల జగదీశ్వర్‌రెడ్డిని గెలిపిస్తే ఆయనను రాష్ట్ర మంత్రిని చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ నేతలపై .. ఫైర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు, ప్రధానంగా మాజీ మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలపై నిప్పులు గక్కారు. జానారెడ్డి పరిస్థితి.. పేరుగొప్ప.. ఊరు దిబ్బ అన్న విధంగా ఉందని వ్యాఖ్యానించారు. సాగర్‌కు డిగ్రీ కాలేజీ లేదని అంటున్నారు. సాగర్ న ఎటూ కాకుండా చేశారని విమర్శించారు. ఉపాధ్యాయ జేఏసీ నేతలపై కేసులు పెట్టించిన జానారెడ్డి ఎలాంటి తెలంగాణ వాది అని ప్రశ్నించారు. 610 జీఓ ఛైర్మన్‌గా ఉండి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసింది ఏంది? ఎడమ కాల్వ చైర్మన్ పదవిని జగ్గయ్యపేటకు చెందిన వ్యక్తికి అప్పజెబుతావా? మళ్లీ నిన్ను గెలిపిస్తే, మొత్తం ఎడమ కాల్వను వాళ్ల చేతుల్లో పెడతవ్ అని పేర్కొన్నారు. హుజూర్‌నగర్‌లో ఉత్తమ్ గెలిస్తేంది..? లేకుంటే ఏంది? ఏం ఫరక్ పడదు అని వ్యాఖ్యానించారు. -
టీఆర్ఎస్కు పట్టం కట్టండి
నల్లగొండను సస్యశ్యామలం చేస్తాం ఫ్లోరైడ్ సమస్యను ఎందుకు విస్మరించారు బీబీనగర్ నిమ్స్‌ను ఎందుకు పూర్తి చే యలేదు జిల్లా మంత్రులవి అసమర్థుల జీవితయాత్రలు టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ప్రత్యేక చొరవ జిల్లాలో 12 లక్షల ఎకరాలకు సాగునీరు ఫ్లోరైడ్ పీడ విరుగుడుకు రూ. 600కోట్ల నుంచి రూ.700 కోట్లు ఖర్చు పెడతాం నల్లగొండ బహిరంగ సభలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సాక్షిప్రతినిధి, నల్లగొండ, ‘నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేస్తాం. జిల్లాలో ఒక్కో నియోజకర్గంలో లక్ష ఎకరాల చొప్పున 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాం. ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించేందుకు మొదటి ప్రాధాన్యం ఇస్తాం. అవసరమైతే రూ.600 కోట్ల నుంచి రూ.700 కోట్లైనా ఖర్చు చేస్తాం’ అని టీఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం జిల్లా కేంద్రంలో నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని అభ్యర్థులందరి కోసం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ జిల్లాకు కొన్ని హామీలు ఇచ్చారు. టీఆర్ఎస్కు ఓట్లేసి గెలిపించండి. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణ పునర్నిర్మాణం సక్రమంగా జరుగుతుంది. సీమాంధ్ర పాలకుల హయాంలో పూర్తికాని ప్రాజెక్టులను నిర్ణీత గడువులో పూర్తి చేసేందుకు శ్రద్ధ తీసుకుంటామని కేసీఆర్ అన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం నలభై ఏళ్లుగా ఎందుకు పెండింగులో ఉంది.? ఈ ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు పూర్తి కాదో చూస్తాం. ప్రతి గ్రామానికి సురక్షితమైన తాగునీరందిస్తాం. జిల్లా కేంద్రంలో నిమ్స్ తరహాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, నియోజకవర్గ కేంద్రాల్లో వంద పడకల ఆసుపత్రులు, మండల కేంద్రాల్లో 40 పడకల ఆసుపత్రులు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. నల్లగొండ జిల్లాకు బ్రహ్మాండగా సాగునీరందించేందుకు టీఆర్ఎస్ వద్ద అద్భుతమైన ప్లాన్ ఉందన్నారు. జిల్లాకు చెందిన రిటైర్డ్ ఇంజినీర్ శ్యామ్‌ప్రసాద్ రెడ్డి కృష్ణానది నుంచి నీటిని కాల్వల ద్వారా మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్ జిల్లా పాకాల దాకా తీసుకువెళ్లే ప్రాజెక్టును రూపొందించారని చెప్పారు. ఇది పూర్తయితే, జిల్లా సస్యశామలమేనని పేర్కొన్నారు. అంగ న్వాడీ, ఆశా వర్కర్లు, ఐకేపీ సిబ్బంది కష్టాలు కూడా తొలగిస్తానని చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు. ‘కేసీఆర్‌గా మాట ఇస్తున్నా.. రెండేళ్లలో జిల్లాలోని ప్రతిఇంటికీ రక్షిత నీరిస్తా. జిల్లాలో టీఆర్ఎస్ అభ్యర్థులందరినీ గెలిపించండి. సమస్యలు తీరాలంటే, టీఆర్ఎస్ అధికారంలోకి రావాలి’ అని పేర్కొన్నారు. నల్లగొండ, నాగార్జునసాగర్, మునుగోడు, దేవరకొండ, భువనగిరి, సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, మిర్యాలగూడ, నకిరేకల్ ఇలా పేరు పేరునా ఒక్కో అభ్యర్థిని సభకు పరిచయం చేశారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో జగదీశ్వర్‌రెడ్డి, దుబ్బాక నర్సింహారెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, అమరేందర్‌రెడ్డి, శశిధర్‌రెడ్డి, కిషోర్, శంకర మ్మ, నోముల నర్సింహయ్య, పైళ్ల శేఖర్‌రెడ్డి, సునీత, ఎంపీ అభ్యర్థులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్ పాల్గొన్నారు. కోమటిరెడ్డికి .. కేసీఆర్ మినహాయింపు నల్లగొండలో జరిగిన బహిరంగ సభలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి విమర్శల నుంచి మినహాయింపు ఇచ్చారు. కేసీఆర్ తన ప్రసంగంలో రాష్ట్రానికి సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుని నీచుడితో పోల్చారు. తెలంగాణ అడ్డుపడ్డాడని దుయ్యబట్టారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను ఏకంగా ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు. జిల్లాకు సంబంధించి జానారెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డిలపైనా విమర్శలు వదిలారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్కుమార్రెడ్డినైతే ‘ఉత్తమునివైతే శంకరమ్మపై పోటీ నుంచి విరమించుకోవాలని’ సవాల్ చేశారు. ఫ్లోరైడ్ సమస్యను తీర్చలేని జిల్లా మంత్రులవి ‘అసమర్థుని జీవితాలు’ అని వ్యాఖ్యానించారు. కానీ, నల్లగొండలో టీఆర్ఎస్కు ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని పల్లెత్తు మాట అనలేదు. త మ పార్టీ అభ్యర్థి కోసమైనా కనీసం రాజకీయ విమర్శలు చేయలేదు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడం, తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేయడం వంటి అనుకూల అంశాలున్నందున కోమటిరెడ్డిపై విమర్శలు చేస్తే సబబు కాదని భావించినట్లు కనిపిస్తోంది. నల్లగొండలో సభ అనగానే, స్థానిక ఎమ్మెల్యేపై విమర్శలు ఉంటాయని భావించినపార్టీ నేతలూ అవేమీ లేకపోవడంతో అవాక్కయ్యారు. సభకు హాజరైన పలువురు ఈ అంశంపై మాట్లాడుకోవడం కనిపించింది. -
తలాపునే మంజీర...
కుర్తి(పిట్లం), న్యూస్‌లైన్: పిట్లం మండలంలోని కుర్తి గ్రామం ద్వీపకల్పంగా పేరు గాంచింది. ఎందుకంటే ఈ గ్రామం చుట్టూ మంజీర నది పారుతుంటుంది. ‘‘ఈ గ్రామస్తులు ఎంతో అదృష్టవంతులు. మంజీర నీరు తాగుతారు’’ అని అందరూ అనుకుంటారు. కానీ, వారు తాగేది ఫ్లోరైడ్ నీరే!. ఏళ్ల తరబడి ఈ నీటిని సేవి స్తున్న గ్రామస్తులు కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. కుర్తి గతం లో రాంపూర్ కలాన్ పంచాయతీకి అనుబంధంగా ఉండేది. కాలక్రమంలో పంచాయతీగా ఆవిర్భవిం చింది. గ్రామంలో సుమారు వెయ్యికి పైగా జనాభా ఉండగా, రెండు వందలకు పైగా కుటుంబాలు ఉన్నాయి. వీరందరు నిత్యం తమ అవసరాల కోసం గ్రామంలో గల చేతిపంపులు, నీటిట్యాంకు నీరుపైనే ఆధారపడుతున్నారు. గ్రామంలో ప్రస్తుతం ఒక నీటి ట్యాంకు, ఎస్సీ కాలనీకి నీరు సరఫరా చేసే మరో మినీ నీటి ట్యాంకు ఉంది. వీటితో పాటుగా మరి కొన్ని చేతిపంపులు ఉన్నాయి. ఈ వనరుల ద్వారా గ్రామస్తులకు ఫ్లోరైడ్ నీరే అందుతోంది. ప్లోరైడ్ నీరు వాడకంతో తమకు రోగాలు వస్తున్నాయని గ్రామస్తులు పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. గతంలో నిర్వహించిన రైతు చైతన్య యాత్రలో భాగంగా అప్పటి కలెక్టర్ క్రిస్టీనా కుర్తి గ్రామానికి వచ్చినపుడు ప్లోరైడ్ నీటి బాధను గ్రామస్తులు ఆమెకు వివరించారు. కలెక్టర్ సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య తీర్చుతానని హామీ ఇచ్చారు. అం తేగాక గతంలో చాలా సార్లు ఎమ్మెల్యే హోదాలో గ్రామానికి వచ్చిన హన్మంత్ సింధే దృష్టికి కూడ సమస్యను తీసుకెళ్లారు. ఇలా ఎంతమందికి విన్నవించినా సమస్య తీరలేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెంతనున్న మంజీర నీరును సరఫరా చేయాలని విన్నవించుకుంటున్నారు. -
సంపుల సంగతి మరిచారా?
యాచారం, న్యూస్‌లైన్: ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు కృష్ణా జలాల పంపిణీ ప్రక్రియ నిష్ర్పయోజనంగా మారింది. రూ.కోట్లు ఖర్చవుతున్నా ఫ్లోరైడ్ బాధితులకు స్వచ్ఛమైన నీటిని అందించలేక పోతున్నారు. దీంతో అనేక గ్రామాల ప్రజలు నేటికీ కలుషిత నీటితే తాగుతున్నారు. నల్గొండ, రంగారెడ్డి జిల్లాల సరిహద్దు అయిన యాచారం మండల పరిధిలోని మంతన్‌గౌరెల్లి, దాని అనుబంధ గ్రామాలైన భానుతండా, నున్సవాత్తండాలతోపాటు మరికొన్ని గిరిజన గ్రామాల్లో తాగునీటిలో ఫ్లోరైడ్ శాతం అధికం. నల్లవెల్లి, మాల్, మొండిగౌరెల్లి, తమ్మలోనిగూడ, చింతపట్ల, తక్కళ్లపల్లి తదితర గ్రామాల్లోనూ ఫ్లోరైడ్ ప్రభావం ఉంది. మొత్తంగా 20గ్రామాల ప్రజలు ఫ్లోరైడ్ నీటితో ఇబ్బంది పడుతున్నారు. సహజంగా గ్రామాల్లో ఎప్పుడు పడితే అప్పుడు విద్యుత్ వచ్చిపోతూ ఉంటుంది. ఒక్కోసారి మధ్యాహ్నం వేళ పూర్తిగా ఉండదు. అందుకే ఎప్పుడు విద్యుత్ సరఫరా ఉంటే అప్పుడే ట్యాంకులను, సంపులను నింపుతుంటారు. మండలంలోని మంతన్‌గౌరెల్లి, మొండిగౌరెల్లి, తమ్మలోనిగూడ, చింతపట్ల, నక్కర్తమేడిపల్లి, మాల్ తదితర గ్రామాల్లో కృష్ణా జలాల కోసం ప్రత్యేక ట్యాంకులు లేవు. కృష్ణా నీటిని సైతం ఫ్లోరైడ్ వాటర్ ఎక్కించిన ట్యాంకులోకే పంపిస్తుంటారు. వాటినే ప్రజలకు సరఫరా చేస్తుంటారు. దీంతో ఈ కలుషిత నీటినే జనం తాగుతున్నారు. ఇదిలా ఉంటే మాల్, మంతన్‌గౌరెల్లి, నందివనపర్తి, అయ్యవారిగూడ తదితర గ్రామాలను కలుపుతూ వేసిన కృష్ణా జలాల పైపులైన్లకు తరచూ లీకేజీలు ఏర్పడుతున్నాయి. దీంతో నీరు వృథా పోవడమే కాకుండా జలాలు కలుషితం అవుతున్నాయి. యాచారం- నందివనపర్తి పైపులైన్ వారానికోమారు లీకేజీ అవుతోంది. నత్తనడకన సంపుల నిర్మాణం మండలంలోని గ్రామాల్లో కృష్ణా జలాల నిల్వ కోసం సంపులు నిర్మించేందుకు ప్రభుత్వం రూ.కోటికి పైగా నిధులు మంజూరు చేసింది. నిధులు మంజూరై ఏడాది దాటినా ఇప్పటికీ సంపుల నిర్మాణం పూర్తి కాలేదు. మాల్లో సంపు నిర్మాణం కోసం రూ.20 లక్షలు కేటాయించారు. కానీ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. నందివనపర్తిలో నేటికీ పనులు ప్రారంభం కాలేదు. అత్యధికంగా నీటిలో ఫ్లోరైడ్ ఉన్న మంతన్‌గౌరెల్లిలో సంపు నిర్మాణం పూర్తయినా పైపులకు అనుసంధానం చేయలేదు. దీంతో ఈ నిర్మాణం వృథాగా ఉంది. మండలంలోని మిగిలిన గ్రామాల్లోనూ ఇదే తరహా పనులు సాగుతున్నాయి. తాడిపర్తి గ్రామానికి ఇంతవరకు కృష్ణా జలాలే అందించడం లేదు. రికార్డుల్లో మాత్రం తాడిపర్తికి కృష్ణాజలాలు సరఫరా చేస్తున్నట్టుగా ఉంది. -
కస్తూర్బాధలు...!
కేజీబీవీల్లో మెరుగుపడని వసతులు అరకొర సిబ్బందితో నెట్టుకొస్తున్న పాఠశాలలు సాంఘిక సంక్షేమం కంటే తక్కువ కేటాయింపులు బాలికా విద్యను ప్రోత్సహించేందుకు.. డ్రాపవుట్స్‌ను నిరోధానికి, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా (కేజీబీవీ)లు ఆవిర్భవించాయి. ఇవి ఏర్పాటై మూడేళ్లవుతున్నా మౌలిక వసతుల కోసం యాతన తప్పని పరిస్థితి. జిల్లాలోని 34 కేజీ బీవీల్లో సుమారు 5 వేలమంది విద్యార్థినులున్నారు. చాలా కేజీబీవీలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. వీటిలో విద్యార్థినులకు సరిపడా మరుగుదొడ్లు, స్నానపు గదులు లేక అవస్థపడుతున్నారు. జిల్లాలో 2011-12 విద్యా సంవత్సరం నుంచి కేజీబీవీలు నడుస్తున్నాయి. ఇందులో 18 కేజీబీవీలు రాజీవ్ విద్యామిషన్ (ఆర్వీఎం) ఆధ్వర్యంలోను, గిరిజన సంక్షేమ శాఖ ద్వారా 8, సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా 3, ఏపీ రెసిడెన్షియల్ సొసైటీలో ఐదు ఉన్నాయి. ఆరంభంలో 6, 7, 8 తరగతుల విద్యార్థుల్ని చేర్చుకున్నారు. గత విద్యా సంవత్సరంలో 9వ తరగతి, ఈ విద్యా సంవత్సరంలో 10వ తరగతిని అప్‌గ్రేడ్ చేస్తూ వచ్చారు. గరిష్టంగా ఒక్కో పాఠశాలకు 200 మందిని విద్యార్థుల్ని కేటాయించారు. అయితే ఆ స్థాయిలో వసతుల్ని మాత్రం కల్పించలేదు. సబ్జెక్టుకు ఒకరు చొప్పున ఒక్కో కేజీబీవీకి ఏడుగురు ఉపాధ్యాయులుండాలి. పీఈటీ, అటెండర్, ఏఎన్ఎం, ఇద్దరు వంట మనుషులు, ఇద్దరు సహాయకులు, స్కావెంజర్, పగలు, రాత్రి కాపలా కాసేందుకు ఇద్దరు వాచ్మెన్లను నియమించాలి. చాలా చోట్ల ఈ పరిస్థితి కానరావట్లేదు. బోధనా సిబ్బంది, కంప్యూటర్ బోధకుల కొరత. ఆర్వీఎం ఆనందపురం, చోడవరం, గొలుగొండ, నర్సీపట్నం, అచ్యుతాపురం మండలాల్లో భవన నిర్మాణాలు పూర్తి చేసింది. వాటిలోనే ప్రస్తుతం కేజీబీవీలు నడుస్తున్నాయి. నాతవరం, కోటవురట్ల, ఎస్.రాయవ రం, కశింకోట, కొయ్యూరుల్లో భవనాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. నక్కపల్లి, సబ్బవరం, మాకవరపాలెం, చీడికాడ, రాంబిల్లి, మునగపాక, వి.మాడుగుల మండలాల్లో టెండర్లు పిలిచారు. మార్చిలో పనులు ప్రారంభించే అవకాశాలున్నాయి. భీమిలి మండలంలో నిర్మాణ స్థలంపై కోర్టు వివాదం నడుస్తోంది. గతంలో ఇక్కడి బోధనా సిబ్బందిని ప్రభుత్వ టీచర్ల నుంచే డెప్యుటేషన్‌పై కొనసాగించారు. ఇప్పుడు డెప్యూటేషన్లను రద్దు చేసి, ప్రత్యేక పరీక్ష ద్వారా సిబ్బంది(సీఆర్టీ)ని నియమించారు. డెప్యుటేషన్‌పై పనిచేస్తున్న రెగ్యులర్ టీచర్లు కోర్టుకెళ్లారు. ఈ విద్యాసంవత్సరం చివరి వరకు పాత స్థానాల్లోనే కొనసాగించాల్సిందిగా కోరుతున్నారు. ఈ వివాదం ఇంకా నడుస్తోంది. చాలా సబ్జెక్టులకు ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. నర్సీపట్నం కేజీబీవీలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, బయాలజీ సబ్జెక్టులు అతిథి టీచర్లతోనే నడుస్తున్నాయి. ఎస్.రాయవరం కేజీబీవీలో విద్యార్థినుల దుస్థితిపై గతంలో జిల్లా విద్యాశాఖాధికారి(డీఈవో) బి.లింగేశ్వరరెడ్డి తనిఖీలు నిర్వహించి వసతుల లేమిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని 34 కేజీబీవీల్లో ఇక్కడే విద్యార్థులు తక్కువగా ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. -
‘ఫోరైడ్’ విషానికి విరుగుడు !
నీటి నుంచి ‘ఫ్లోరైడ్’ను సులువుగా తొలగించేందుకు రెండు పద్ధతులను అభివృద్ధి చేసిన ఉస్మానియా ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు సాక్షి, హైదరాబాద్: ఫ్లోరైడ్.. నల్లగొండ జిల్లాలో వేలాది మందిని జీవచ్ఛవాలను చేస్తున్న మహమ్మారి.. ఆ ఫ్లోరైడ్ మహమ్మారి నుంచి నల్లగొండ జిల్లా వాసులను ఆదుకునేందుకు ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు నడుం బిగించారు. ఐదేళ్లపాటు పరిశోధన చేసి.. అత్యంత సులువైన పద్ధతుల్లో నీటిలోంచి ఫ్లోరైడ్‌ను తొలగించే పద్ధతులను అభివృద్ధి చేశారు. ఈ పరిశోధనను గుర్తించిన భారత సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డు (సెర్బ్) దానిని అమలుచేసి, చూసేందుకు రూ. 12 లక్షలను మంజూరు చేసింది. ఈ నిధులతో నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలంలోని ఒక ఫ్లోరైడ్ పీడిత గ్రామాన్ని ఎంచుకుని రెండేళ్లపాటు శుద్ధిచేసిన తాగునీటిని అందించేందుకు వెంకటేశ్వర్లు నిర్ణయించారు. ఈ మేరకు ఆయన ఇటీవల నల్లగొండ జిల్లా కలెక్టర్ చిరంజీవులును కలసి అనుమతి కూడా తీసుకున్నారు. వెంకటేశ్వర్లు ఉస్మానియా యూనివర్సిటీ సైన్స్ కళాశాలలో వృక్షశాస్త్రం (బాటనీ) సీనియర్ ప్రొఫెసర్‌గా, పర్యావరణ శాస్త్ర విభాగం అధిపతిగా పనిచేస్తున్నారు. తాను చేసిన పరిశోధన వివరాలను ఆయన ‘సాక్షి’కి ప్రత్యేకంగా తెలియచేశారు. రెండు పద్ధతుల్లో ఫ్లొరైడ్ నీటి శుద్ధి నీటిలోంచి ఫ్లోరైడ్‌ను తొలగించేందుకు వెంకటేశ్వర్లు రసాయన, ఎలక్ట్రాలసిస్ విధానాల్లో నీటిని సులువుగా, తక్కువ వ్యయంతో శుద్ధిచేసే రెండు పద్ధతులను అభివృద్ధి చేశారు. ఐదేళ్ల పాటు చేసిన తన పరిశోధన వివరాలను సెర్బ్కు తెలియజేసి.. అమలుచేసి పరిశీలించేందుకు రూ. 12 లక్షల నిధులను సమకూర్చుకున్నారు. ఒక గ్రామాన్ని ఎంచుకుని.. నీటిశుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ నీటిని తాగిన ప్రజల ఆరోగ్య పరిస్థితిని మూడు లేదా ఆరునెలలకోసారి పరిశీలిస్తారు. వారి మూత్రం, రక్తాన్ని పరిశీలించి, ఫ్లోరైడ్ శాతం ఎంత తగ్గింది? దాని ప్రభావమేమిటి? తదితర అంశాలను పరిశీలిస్తారు. ఫ్లోరైడ్ రహితంగా మారుస్తా... నేను చేపట్టిన ఈ ప్రయోగం పూర్తి స్థాయిలో విజయవంతం అవుతుంది. ప్రాజెక్టును చేపట్టిన గ్రామంలో ఫలితాల ఆధారంగా.. దాతల సహాయంతో నల్లగొండ జిల్లావ్యాప్తంగా ఈ నీటిశుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసి.. నల్లగొండను ఫ్లోరైడ్ రహిత జిల్లాగా మారుస్తా. నేను రూపొందించిన పద్ధతిలో శుద్ధి చేసిన నీటిని పంట పొలాలకు కూడా ఉపయోగించుకోవచ్చు.ట ఇవీ పద్ధతులు... రసాయన విధానం.. - బోరు నీటిని ప్లాంటులోని ట్యాంకుల్లో సేకరించి, బేరియం హైడ్రాక్సైడ్ అనే రసాయనాన్ని కలుపుతారు. - నీటిలో కలిపిన బేరియం హైడ్రాక్సైడ్ అందులోని ఫ్లోరైడ్, ఇతర రసాయనాలతో చర్య జరిపి అవక్షేపాన్ని ఏర్పరుస్తుంది. - దాంతోపాటు నీటిలోని భార లోహ మూలకాలు, బ్యాక్టీరియా, ఫంగస్, నాచును తొలగించే చర్యలు చేపడతారు. - కొంత సమయం అనంతరం వడగట్టడం ద్వారా శుద్ధి అయిన మంచినీరు రూపొందుతుంది. ఎలక్ట్రాలసిస్ విధానం.. విద్యుత్తు ద్వారా నీటిని శుద్ధి చేసే ‘ఎలక్ట్రాలసిస్’ విధానం చాలా సులువైనది. ఇప్పటికే ఈ విధానం అమల్లో ఉన్నా.. అధిక విద్యుత్ వినియోగంతో పాటు ఇతర ఇబ్బందులూ ఉన్నాయి. వెంకటేశ్వర్లు దీనిని సులువుగా చేసేలా అల్యూమినియం కడ్డీలతో ఈ పరికరాన్ని రూపొందించారు. దీనితో ఏమాత్రం నీరు కూడా వృథా కాదు. కేవలం రూ. 500 వ్యయమయ్యే దీనితో ఇంట్లోనే నీటిని శుద్ధి చేసుకోవచ్చు. పది లీటర్ల నీటిని శుద్ధి చేయడానికి దాదాపు 10 నిమిషాల సమయం సరిపోతుంది. -
ఢిల్లీ యాత్ర విజయవంతం
నల్లగొండ కల్చరల్, న్యూస్‌లైన్ : ఫ్లోరైడ్ బాధితుల పట్ల పాలకులు ప్రదర్శిస్తున్న నిర్లక్ష వైఖరికి నిరసనగా ఈ నెల 16, 17 తేదీల్లో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిర్వహించిన ధర్నా విజయవంతమైందని జలసాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు దుశ్చర్ల సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం నల్లగొండ పట్టణంలోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయస్థాయి నాయకులు ఎంతో మంది తమకు ఆందోళనకు మద్దతు ప్రకటించారన్నారు. పార్లమెంటు సభ్యులు ప్రకాష్ జవదేకర్, వివేక్, ఆనంద్‌భాస్కర్, హన్మంతరావులు జిల్లాలోని ఫ్లోరైడ్ బాధితులకు జరుగుతున్న హక్కుల ఉల్లంఘన పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారన్నారు. కానీ, జిల్లాకు చెందిన ఏ ఒక్క నాయకుడూ అటు తిరిగైనా చూడలేదని, పైగా జిల్లాలో ఫ్లోరిన్ ఎక్కడుందని అంటున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు కనీసం పౌష్టికాహారం, తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఫ్లోరైడ్ మండలానికి ఒక్కంటికి *200 కోట్లు అందిస్తే.. వాటిని ఫ్లోరైడ్ నివారణకు ఖర్చు చేయకుండా రాజకీయ నాయకులు పంచుకున్నారని విమర్శించారు. జలసాధన సమితి రాజకీయంగా ఎదగాల్సిన అవసరం గురించి యావత్ తెలంగాణ నుంచి ఒత్తిడి వస్తుందని, ఆ దిశగా ఆలోచిస్తున్నామని తెలి పారు. రచయితల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు అంబటి వెంకన్న ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి. సమావేశంలో అంజయ్య, దుబ్బ కొండమ్మ, అలుగుబెల్లి భిక్షారెడ్డి, మారం హేమచందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ముందుకు పడని అడుగు
చౌటుప్పల్, న్యూస్‌లైన్ :ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రానికి ముహూర్తం కుదరడం లేదు. ఈ నెల రెండో వారంలో పనులు ప్రారంభిస్తామని స్పీకర్ ప్రకటించినా ఆ దిశగా పనులేమీ జరగడం లేదు. అసలు పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. జిల్లాలో 8లక్షల మంది ఫ్లోరైడ్ బాధితులున్నారు. సమస్యను స్వయంగా తెలుసుకునేందుకు రాష్ట్ర శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌రావు 17మంది ఎమ్మెల్యేల బృం దంతో కలిసి గత ఏడాది జూలై 7, 8 తేదీల్లో మునుగోడు నియోజకవర్గంలో పర్యటిం చారు. ఫ్లోరోసిస్ బాధితుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, చలించిపోయారు. ఫ్లోరైడ్ శాశ్వత నివారణకు పాటుపడాలని తలంచారు. అందుకు ఫ్లోరైడ్పై మరిన్ని పరి శోధనలు అవసరమని భావించి కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కృషి ఫలిం చింది. జాతీయ ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రం మంజూరైంది. దీనిని చౌటుప్పల్ మండలం మల్కాపురంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కేంద్రం నిర్మాణానికి రూ.100 కోట్లు మంజూరయ్యాయి. ఇందుకు అవసరమయ్యే 5 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించారు. ఇక్కడే ఫ్లోరోసిస్ బాధితుల కోసం 75పడకల ఆస్పత్రిని కూడా నిర్మించనున్నారు. రెండేళ్ల కాలంలో నిర్మాణాలన్నీ పూర్తయి సేవలు అందుబాటులోకి రావాలి. స్థల వివాదం.. మల్కాపురం శివారులోని సర్వే నంబర్ 486లో 10ఎకరాల ప్రభుత్వ భూమిని వాహనాల సామర్థ్య కేంద్రానికి, దీని పక్కనే మరో 5ఎకరాల భూమిని జాతీయ ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రానికి కేటాయించారు. సర్వేనంబరు 486, 399లలో 8క్రషర్ మిల్లులకు 88ఎకరాల భూమిని మైనింగ్ కోసం ప్రభుత్వం లీజుకిచ్చింది. మైనింగ్ నిబంధన ప్రకారం.. మిల్లులకు లీజుకు ఇచ్చిన భూమికి 500మీటర్ల లోపు ఎటువంటి నిర్మాణాలకూ అనుమతించకూడదు. కాగా, ఓ క్రషర్ మిల్లుకు, వాహన సామర్థ్య కేంద్రానికి కేటాయించిన భూమి 500మీటర్ల లోపు ఉండడంతో ఆ క్రషర్ యజమాని రెండు నెలల క్రితం హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో కోర్టు వెహికిల్ ఫిట్నెస్ సెంటర్ పనులను నిలిపివేసింది. భూమి కేటాయింపుపై పునఃపరిశీలన చేస్తూ, నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. అయితే ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రానికి కేటాయించిన భూమి కూడా 500మీటర్ల లోపే ఉండడంతో పనులు ప్రారంభిస్తే క్రషర్ యజమానులు అభ్యంతరం చెప్పే అవకాశం ఉన్నందున అధికారులు ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది. జిల్లా అధికారులు వేరే స్థలాన్ని కేటాయించాలని చూస్తున్నట్టు సమాచారం. రెండు నెలలవుతున్నా స్థల వివాదం పరిష్కారం కాకపోవడంతో ఈ నెల రెండో వారంలోనే ప్రారంభం కావాల్సి ఉన్న ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రం పనులు ప్రశ్నార్థకంగా మారాయి. స్పీకరు గారూ.. మీరే పట్టించుకోవాలి 70 ఏళ్లుగా ప్రజలు ఎదుర్కొంటున్న ఫ్లోరైడ్ సమస్యను అధిగమించేందుకు స్పీకర్ నాదెండ్ల మనోహర్‌రావు కృషితో జిల్లాలో జాతీయ ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రం ఏర్పాటవుతోంది. సమాజ ప్రయోజనాల దృష్ట్యా ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రం అత్యంత అవసరం. రెండు నెలలుగా స్థల వివాదం నెలకొన్నా, జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు గానీ ఎవరూ పట్టించుకోవడం లేదు. పరిశోధన కేంద్రం ఏర్పాటుకు కృషి చేసిన స్పీకర్ ప్రత్యేక చొరవ తీసుకొని స్థల వివాదాన్ని పరిష్కరింపజేయాలని ప్రజలు కోరుతున్నారు.. -
రోగాలొచ్చె
చీమకుర్తి, న్యూస్‌లైన్: నిధులు లేక అభివృద్ధికి నోచుకోని ప్రాంతాలున్నాయి. కానీ ఏటా వందల కోట్ల ఆదాయం ఆ ప్రాంతం నుంచి వస్తున్నా.. అక్కడి ప్రజల కోసం కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. గ్రానైట్ ఖిల్లాగా ప్రసిద్ధిగాంచిన చీమకుర్తి ప్రాంతం నుంచి గత 20 ఏళ్లలో రూ 20 వేల కోట్ల విలువైన గ్రానైట్ సంపద దేశ, విదేశాలకు తరలిపోయింది. దీని ద్వారా ప్రభుత్వాధీనంలో ఉన్న మైన్స్ డిపార్టుమెంట్‌కు వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఇక గ్రానైట్ యజమానులైతే కోటానుకోట్ల ఆదాయం గడించారు. కానీ స్థానికులకు ఒరిగింది మాత్రం ... అక్షరాలా శూన్యం. ఎందుకూ పనికిరావనుకున్న భూముల్లో.. 1983కు పూర్వం రామతీర్థం పరిధిలో ఎందుకూ పనికిరావనుకుంటున్న భూముల్లో సిరులు కురిపించే గ్రానైట్ పడుతుందని ఎవరూ ఊహించి ఉండరు. ఓబచెత్త తప్ప ఏమీ పండని ఆ భూములను ఖాళీగా ఉంచడం ఎందుకని సంతనూతలపాడుకు చెందిన అప్పటి ఎమ్మెల్యే వేమా యల్లయ్య పశువుల క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. తీరా దానిలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ ఉందని గమనించిన తర్వాత అందరి చూపు అటువైపు మళ్లింది. 1983లో ఒకే ఒక్క లీజుతో 8.094 హెక్టార్ల విస్తీర్ణంలో గ్రానైట్ రాయిని వెలికి తీసేందుకు అంకురార్పణ జరిగింది. మొట్టమొదటిసారి మైన్స్ డిపార్ట్మెంట్కు ఆ సంవత్సరం రాయల్టీ రూపంలో రూ 11,015 ఆదాయం వచ్చింది. అది మొదలు 2012-13 ఆర్థిక సంవత్సరం వరకు పారిశ్రామికవేత్తలు గ్రానైట్‌ను వెలికితీసే పనిలో నిమగ్నమయ్యారు. ఫలితంగా ప్రస్తుతం 510 హెక్టార్లలో దాదాపు 160 గ్రానైట్ లీజులతో విలువైన బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ రాయిని వెలికితీస్తున్నారు. ఇప్పటి వరకు 33,67,005 క్యూబిక్ మీటర్ల బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ రాయిని వెలికితీశారు. ఏటా 4 లక్షల క్యూబిక్ మీటర్ల రాయి ఎగుమతి.. రామతీర్థంలోని క్వారీలకు మాత్రమే ప్రత్యేకతగా నిలిచిన బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ రాయిని సరాసరి నెలకు 35 వేల క్యూబిక్ మీటర్లు వెలికి తీస్తున్నారు. ఏడాదికి 3 నుంచి 4 లక్షల క్యూబిక్ మీటర్ల రాయిని తీసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. రాయి నాణ్యతను బట్టి క్యూబిక్ మీటర్ రాయి రూ 25 వేల నుంచి రూ 65 వేల వరకు ధర పలుకుతుంది. సరాసరిన క్యూబిక్ మీటర్ రాయి రూ 50 వేలు ఉంటుంది. 1983 నుంచి ఇప్పటి వరకు 60 లక్షల క్యూబిక్ మీటర్ల రాయిని వెలికితీశారు. దానిలో నికరంగా రాయల్టీ చెల్లించి ఎగుమతి చేసిన రాయి దాదాపు 35 లక్షల క్యూబిక్ మీటర్లుంది. దీని ద్వారా ఇప్పటి వరకు రూ 17,500 కోట్ల ఆదాయం వచ్చింది. ఇక డంపింగ్‌ల మీద, దొడ్డిదారిన అధికారుల కళ్లుగప్పి, క్వారీల్లో వృథాగా మరో 15 లక్షల క్యూబిక్ మీటర్ల రాయి పోయిందని స్థానికుల అంచనా. దీని ద్వారా మరో రూ 4 కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తం మీద ఇప్పటి వరకు వెలికితీసిన బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ విలువ రూ 20 వేల కోట్లపైనే ఉందని మైన్స్ అధికారుల రికార్డుల ద్వారా వెల్లడవుతోంది. దీని వలన ప్రభుత్వానికి 1983 నుంచి ఇప్పటి వరకు రూ 726.4 కోట్ల ఆదాయం వచ్చింది. రాయల్టీ చెల్లించకుండా అడ్డదారిలో రవాణా చేస్తున్న గ్రానైట్ వలన అపరాధ రుసుం ద్వారా మరో రూ 300 కోట్ల ఆదాయం వచ్చి ఉంటుందని అంచనా. వెరసి మొత్తం మీద గడిచిన 20 ఏళ్లలో రూ 20 వేల కోట్ల విలువైన గ్రానైట్ తరలిపోగా, ప్రభుత్వానికి వెయ్యి కోట్ల ఆదాయం సమకూరింది. మిగిలింది కాలుష్యమే... వేలాది కోట్ల విలువైన గ్రానైట్ సంపదను తీసుకెళ్లే గ్రానైట్ యజమానులు కనీసం స్థానికులకు కల్పించాల్సిన కనీస వసతులు మరిచారు. గ్రానైట్ పరిశ్రమల కారణంగా మండలంలోని సగానికిపైగా గ్రామాలు కాలుష్యం బారిన పడ్డాయి. ఆయా గ్రామాల్లో ప్రజలంతా శ్వాసకోశ వ్యాధులతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. గ్రానైట్ గుంతల్లో నిల్వ ఉండే నీటి వలన దోమలు, ఈగలు పెరిగి డెంగీ, మలేరియా వంటి ప్రమాదకరమైన వ్యాధులు ఎక్కువయ్యాయి. మలేరియా వ్యాధి వ్యాప్తిలో జిల్లాలో చీమకుర్తిదే మొదటి స్థానం. ఇతర ప్రాంతాల నుంచి కుటుంబాలను వదిలి ఒంటరిగా వచ్చిన కార్మికుల వల్ల ఎయిడ్స్ వ్యాధి విస్తరణలో చీమకుర్తి జిల్లాలోనే మొదటి స్థానం ఆక్రమించింది. తాగునీటికి ఫ్లోరైడ్ నీరే దిక్కయింది. కావాల్సినవివీ... చీమకుర్తి మండలంలో నివసిస్తున్న 79 వేల మంది ప్రజలకు ఉపయోగపడేలా అన్ని వ్యాధులకు చికిత్స చేయగలిగే స్థాయిలో ఉండే ఆస్పత్రిని ఏర్పాటు చేయాల్సి ఉంది. 35 వేల మంది జనాభా ఉన్న చీమకుర్తి పట్టణానికి సురక్షితమైన నీరందించేందుకు కనీసం రెండు ఆర్ఓ ప్లాంట్లు నిర్మించాలి. గ్రామాల్లో వర్షం నీరు నిలబడకుండా ప్రవహించేందుకు సైడు కాల్వలు నిర్మించాలి. ఆడపిల్లలు ప్రత్యేకంగా చదువుకునేందుకు బాలికల హైస్కూలు, కళాశాల ఏర్పాటు చేయాల్సి ఉంది. విద్యార్థులు ఆడుకునేందుకు సరైన క్రీడా ప్రాంగణం లేక వారిలో ఉన్న క్రీడా నైపుణ్యాలు వృథాగా పోతున్నాయి. క్రీడా ప్రాంగణంతో పాటు స్థానికులకు పార్కు ఏర్పాటు చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది. కాలుష్యాన్ని నివారించేందుకు వీధుల వెంట మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమంలా సాగించాలి. గ్రానైట్ మెటీరియల్ రవాణాతో ఛిద్రమైన రోడ్లను, కల్వర్టులను మరమ్మతులు చేయాలి. వేల కోట్ల విలువైన భూగర్భ సంపదను తరలించే ముందు స్థానికులకు కనీసం ఎంతో కొంత మేలు చేద్దామనే ఆలోచనే ఎవరికీ రాకపోవడం శోచనీయం. -
మంచినీళ్ల పేరుతో విషం!
చౌటుప్పల్, న్యూస్‌లైన్‘స్వాతంత్య్రం వచ్చి 65ఏళ్లు దాటింది.. అయినా మన పాలకులకు గుక్కెడు మంచినీళ్లు అందించే సోయి లేదు.. దేశంలోనే మంచినీళ్ల పేరుతో విషం తాగుతోంది నల్లగొండ జిల్లావాసులే’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చౌటుప్పల్ మండలానికి మూసీజలాలు అందించాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ రాష్ట్ర కోశాధికారి డాక్టర్ గంగిడి మనోహర్‌రెడ్డి 5రోజుల క్రితం భూదాన్ పోచంపల్లి మండలం మైసమ్మ కత్వ వద్ద పాదయాత్రను ప్రారంభించారు. 94కి.మీ.ల మేర చౌటుప్పల్ మండలంలోని అన్ని గ్రామాల మీదుగా పాదయాత్ర చేశారు. పెద్దకొండూరులో శుక్రవారం రాత్రి పాదయాత్ర ముగింపు సందర్భంగా బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. నల్లగొండ జిల్లాకు ఒక పక్క గోదావరి, మరోపక్క కృష్ణానది పారుతున్నా, రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్, టీడీపీ నాయకులు గుక్కెడు మంచినీళ్లను అందించలేదన్నారు. ఫ్లోరైడ్ విషపునీళ్లను తాగిన జనం బతికున్న శవాలుగా మారినా పాలకులకు కనిపించడం లేదన్నారు. రాష్ట్ర విభజనకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, చంద్రబాబునాయుడులు అడ్డుపడుతున్నారన్నారు. మంత్రి జానారెడ్డి తెలంగాణ ఇస్తామని చెప్పాం.. తెచ్చాం.. సోనియమ్మకు వందనాలు అంటూ ఫ్లెక్సీలు పెట్టుకున్నారు.. ఏనాడైనా మీరు తెలంగాణ కోసం జైలుకెళ్లారా అని జానారెడ్డిని ప్రశ్నించారు. మంత్రి పదవి రాకముందు తెలంగాణ కోసం మాట్లాడి, మంత్రి పదవి ఇవ్వగానే పదవి పోతుందని ఏనాడు మాట్లాడలేదన్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధు పోరాటంతో తెలంగాణ రాలేదన్నారు. శ్రీకాంత్‌చారి లాంటి 1100మంది తెలంగాణ అమరవీరుల ఆత్మబలిదానాలతో తెలంగాణ వచ్చిందన్నారు. బీజేపీ జాతీయ నాయకుడు ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ కమ్యూనిస్టులు బీజేపీలో చేరుతుంటే ఈ ప్రాంత నాయకులు అడ్డుపడుతున్నారని, బీజేపీ జెండా ఎగురనీయమని అంటున్నారని అన్నారు. సీపీఎంను కాదని, బీజేపీలో చేరితే మోటార్లు బావిలో వేయడం, గడ్డివాములను తగలబెట్టడం లాంటివి చేస్తే ఊరుకునేది లేదన్నారు. బీజేపీ రాష్ట్ర కోశాధికారి గంగిడి మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌కు 16టీఎంసీల నీటిని తాగుజలాల కోసం ఇస్తున్నారని అన్నారు. సుమారు 12టీఎంసీల నీటిని వాడుకొని వదిలేస్తున్నారని, మూసీనది గుండా వెళ్లి సముద్రంలో కలుస్తుందన్నారు. భవిష్యత్తులో మూసీలో నీటి ప్రవాహం ఇంకా పెరగనుందన్నారు. మూసీ జలాలను వినియోగంలోకి తెచ్చుకుంటే సగం జిల్లా సస్యశ్యామలం అవుతుందని, ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేసి, ఒత్తిడి తెచ్చేందుకే పాదయాత్రకు పూనుకున్నానని తెలిపారు. ఈ సందర్భంగా పెద్దకొండూరు, లక్కారం, చిన్నకొండూరు, మసీదుగూడెం గ్రామాలకు చెందిన సుమారు వెయ్యి మంది బీజేపీలో చేరారు. ఈ సభలో బీజేపీ జిల్లా అధƒ్యక్షుడు వీరెల్లి చంద్రశేఖర్, కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూదన్‌రెడ్డి, ప్రేమ్‌రాజ్‌యాదవ్, వెదిరె శ్రీరామ్, కర్నాటి ధనుంజయ, పాలకూర్ల జంగయ్య, దోనూరి వీరారెడ్డి, దూడల భిక్షంగౌడ్, రమణగోని శంకర్, మండల పార్టీ అధ్యక్షుడు మన్నె ప్రతాపరెడ్డి, గుజ్జుల సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
జంటనగరాలకు నీటి ముప్పు!
వేతనాల కోసం ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టు కార్మికుల సమ్మె సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వేతనాల కోసం నల్లగొండ జిల్లాలో ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టు కార్మికులు శుక్రవారం నుంచి సమ్మెకు దిగారు. దీంతో జిల్లాలోని ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు కృష్ణా నీరందడం లేదు. ఈ సమ్మె కారణంగా జంటనగరాల ప్రజలకు మంచినీటి ఎద్దడి ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌కు నేరుగా వెళ్లే పైప్లైన్ల ద్వారా నీరు సరఫరా అవుతోంది. కానీ, మెట్రో వాటర్‌వర్క్స్ ప్లాంట్లలో నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు నిత్యం 30 లక్షల గ్యాలన్ల నీరందించే పైపులైన్లలో సరఫరా నిలిచిపోయింది. 800 మంది కాంట్రాక్టు ఉద్యోగులైన లైన్మన్లు, ఫిట్టర్లు, ఆపరేటర్లతోపాటు కూలీ పనులు చేసేవారంతా సమ్మెబాట పట్టారు. దీంతో జిల్లావ్యాప్తంగా కృష్ణా తాగునీరందాల్సిన 650 ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు నీరు సరఫరా కావడం లేదు. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్‌కు చెందిన గొండగండ్ల, నసర్లపల్లి ప్లాంట్లలో వాటర్మన్లు కూడా సమ్మెలోకి వెళ్లారు. దీంతో శుక్రవారం రంగారెడ్డి జిల్లాకూ నీరు సరఫరా కాలేదు. గడిచిన ఐదు నెలలుగా కార్మికులు వేతనాల కోసం పడిగాపులు గాస్తున్నారు. వేతనాల, పీఎఫ్ సొమ్ముతో పాటు పథకాల నిర్వహణ బడ్జెట్ బకాయిలు మొత్తంగా రూ.40 కోట్ల దాకా పేరుకుపోయాయి. దీంతో తమ బకాయిలు రాబట్టుకోవడానికి కార్మికులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేక చివరకు సమ్మెబాట పట్టారు. మరోవైపు శనివారంలోగా వేతనాలు చెల్లించకుంటే తామూ సమ్మెలోకి వెళతామని ఏఐటీయూసీకి అనుబంధంగా ఉన్న కాంట్రాక్టు కార్మిక సంఘం ప్రకటించింది.