తోమర్‌ జీ ధన్యవాదాలు: వైవీ సుబ్బారెడ్డి | yv subbareddy thanked thomar for including florosis effected habitations in budget | Sakshi
Sakshi News home page

తోమర్‌ జీ ధన్యవాదాలు: వైవీ సుబ్బారెడ్డి

Published Mon, Feb 6 2017 7:07 PM | Last Updated on Tue, Oct 2 2018 7:51 PM

తోమర్‌ జీ ధన్యవాదాలు: వైవీ సుబ్బారెడ్డి - Sakshi

తోమర్‌ జీ ధన్యవాదాలు: వైవీ సుబ్బారెడ్డి

కేంద్రమంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌కు వైఎస్సార్సీపీ ఎంపీ(లోక్‌సభ) వైవీ సుబ్బారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు కేంద్రమంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌కు ఓ లేఖను రాశారు. దేశంలోని ఫ్లోరైడ్‌ బాధిత ప్రాంతాల్లో తాగునీటి సదుపాయం కల్పించాలని అందుకు తగిన నిధులను ఈ బడ్డెట్‌లో కేటాయించేలా చూడాలని తాను తోమర్‌ను కోరినట్లు చెప్పారు. ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ పథకం కింద ఫ్లోరైడ్‌ ప్రాంతాలకు నీటి సరఫరాను చేర్చడంపై హర్షం వ్యక్తం చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రకాశం జిల్లాలో గల 56 మండలాల్లో 48 మండలాలు ఫ్లోరైడ్‌ బాధిత ప్రాంతాలేనని లేఖలో పేర్కొన్నారు.

ప్రధానమంత్రితో ఈ విషయంపై చర్చించినప్పుడు గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాను కూడా ఈ సమస్యలను ఎదుర్కొన్నట్లు ఆయన చెప్పారని తెలిపారు. తప్పకుండా ఫ్లోరైడ్‌ ప్రాంతాల ప్రజలకు తాగునీటి సదుపాయం కల్సిస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. ప్రకాశం జిల్లాలోని ఫ్లోరైడ్‌ ప్రభావిత ప్రాంతాలైన 48 మండలాలను బడ్జెట్‌లో ప్రకటించిన 28 వేల ప్రాంతాల్లో పరిగణించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement