narendra singh tomar
-
ఎంపీ పదవికి 10 మంది రాజీనామా
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రులు నరేంద్రసింగ్ తోమర్, ప్రహ్లాద్ సింగ్ పటేల్‌తోపాటు పలువురు బీజేపీ ఎంపీలు తమ పార్లమెంట్ సభ్యత్వానికి బుధవారం రాజీనామా సమరి్పంచారు. ఇటీవల జరిగిన రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో వీరు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకు ఎంపీ పదవులకు రాజీనామా చేశారు. ఇకపై ఎమ్మెల్యేలుగానే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. మొత్తం 12 మంది బీజేపీ ఎంపీలు పార్లమెంట్ సభ్యత్వం వదులుకుంటున్నారు. వీరికి సొంత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి లేదా మంత్రి పదవులు దక్కుతాయని ప్రచారం సాగుతోంది. బుధవారం 10 మంది బీజేపీ ఎంపీలు రాజీనామా చేశారు. మధ్యప్రదేశ్‌కు చెందిన రాకేశ్ సింగ్, ఉదయప్రతాప్ సింగ్, రితీ పాఠక్, రాజస్తాన్‌కు చెందిన కిరోడీలాల్ మీనా, దియా కుమారి, రాజవర్దన్ సింగ్ రాథోడ్, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన గోమతిసాయి, అరుణ్ సావో రాజీనామా సమరి్పంచారు. వీరిలో కిరోడీలాల్ మీనా ఒక్కరే రాజ్యసభ సభ్యుడు. మిగిలినవారంతా లోక్‌సభ సభ్యులు. మరో కేంద్ర మంత్రి రేణుకా సింగ్‌తోపాటు ఎంపీ మహంత్ బాలక్‌నాథ్ యోగి అతి త్వరలో రాజీనామా చేస్తారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. నరేంద్రసింగ్ తోమర్, ప్రహ్లాద్ సింగ్ పటేల్, రేణుకా సింగ్ కేంద్ర మంత్రి పదవుల నుంచి తప్పుకోనున్నారు. రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో నూతన ముఖ్యమంత్రులను బీజేపీ అధిష్టానం ఇంకా నియమించలేదు. ఎంపీ పదవులకు రాజీనామా చేసిన వచ్చిన వారిలో కొందరికి ముఖ్యమంత్రులుగా అవకాశం కల్పించబోతున్నానని తెలుస్తోంది. మరోవైపు కేంద్రంలో మూడు మంత్రి పదవులు ఖాళీ అవుతున్నాయి. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కంటే ముందే ఈ మూడు పదవులను భర్తీ చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యోచిస్తున్నట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి లబ్ధి చేకూరేలా ఈ భర్తీ ఉంటుందని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. -
వ్యవసాయంలో దేశం స్వయం సమృద్ధి
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయంలో భారతదేశం స్వయంసమృద్ధి సాధించిందని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు. వ్యవసాయంలోని వివిధ రంగాలలో ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారాలను కనుగొనడానికి జీ–20 దేశాలతో కలిసి పనిచేయడానికి భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. హైదరాబాద్ హెచ్ఐసీసీ నోవాటెల్‌లో మూడు రోజుల పాటు జరగనున్న జీ–20 వ్యవసాయ మంత్రుల సమావేశం గురువారం ప్రారంభమైంది. జీ–20 సభ్య దేశాలు, ఆహా్వన దేశాలు, అంతర్జాతీయ సంస్థల నుంచి 200 మందికి పైగా ప్రతినిధులు, మంత్రులు, డైరెక్టర్ జనరల్‌లు సమావేశానికి హాజరయ్యారు. కేంద్ర వ్యవసాయ సహాయ మంత్రి కైలాష్ చౌదరి ప్రదర్శనను ప్రారంభించడంతో సమావేశాలు ప్రారంభమయ్యా యి. ఎగ్జిబిటర్లు వ్యవసాయం, అనుబంధ రంగాల్లో సాధించిన విజయాలను ప్రదర్శించారు. అనంత రం మీడియా సమావేశంలో కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడారు. భారతదేశం ఆహార ధాన్యాలను ఎగుమతి చేసే స్థాయి లో ఉందన్నారు. వాతావరణ మార్పులు, పంటల వైవిధ్యంపై సమావేశాల్లో చర్చిస్తామన్నారు. రైతులు ఎక్కువ ఆదాయాన్ని పొందేందుకు, నష్టాలను తగ్గించడానికి ప్రభుత్వం పంటల వైవిధ్యాన్ని ప్రోత్సహిస్తుందని చెప్పారు. పంజాబ్, హరియాణా వంటి రాష్ట్రాల్లో అనేక కార్యక్రమాలు అమలు చేశామన్నారు. ప్రభుత్వాలు సేంద్రియ వ్యవసాయాన్ని కూడా ప్రోత్సహిస్తున్నాయని, వీటి అమలు కోసం ఇప్పటివరకు రూ. 1500 కోట్లు ఖర్చు చేశామన్నారు. వాతావరణ మార్పుల వల్ల జరిగే పంట నష్టాలను తగ్గించేందుకు భారతదేశం వాతావరణాన్ని తట్టుకునే విత్తనాలను అభివృద్ధి చేస్తోందని తోమర్ అన్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రపంచ ప్రయోజనాల కోసం మన జ్ఞానాన్ని, అనుభవాన్ని జీ–20 దేశాలతో పంచుకుంటామన్నారు. అనేక వ్యవసాయోత్పత్తులలో భారతదేశం ప్రపంచంలో మొదటి లేదా రెండో స్థానంలో ఉందన్నారు. శుక్రవారం వివిధ దేశాలకు చెందిన వ్యవసాయ మంత్రులతో ప్రారంభ సెషన్ జరగనుంది. ముగింపు రోజు శనివారం జీ–20 వ్యవసాయ మంత్రులు వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రకటనతో పాటు రోడ్ మ్యాప్‌ను విడుదల చేస్తారని తోమర్ తెలిపారు. ఎగ్జిబిషన్లలో స్టాళ్లు... ఈ సందర్బంగా ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్లో వేస్ట్ టు వెల్త్ మేనేజ్మెంట్, పోస్ట్ హార్వెస్ట్, స్మార్ట్ అండర్ ప్రెసిషన్ అగ్రికల్చర్, అగ్రి ఇన్నోవేషన్స్, వాల్యూ చైన్ మేనేజ్మెంట్ మొదలైన రంగాల్లో 71 స్టాల్స్ ఏర్పాటు చేశారు. వాటిల్లో 15 స్టాళ్లను ఐకార్ ఏర్పాటు చేసింది. ఏడు స్టాళ్లను ఇతర మంత్రిత్వ శాఖలు ప్రదర్శించాయి. 9 స్టాల్స్‌ను ప్రైవేట్ కంపెనీలు ఏర్పాటు చేశాయి. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల సాధించిన విజయాలను ప్రదర్శించేందుకు ఏడు స్టాల్స్‌ను కేటాయించారు. ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవం తర్వాత, సభ్య దేశాలు, ఆహా్వనిత దేశాలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో వ్యవసాయ డిప్యూటీల సమావేశానికి, ఆ తర్వాత ప్యానెల్ చర్చలు జరిగాయి. -
నేటి నుంచి జీ–20 వ్యవసాయ మంత్రుల సమావేశం
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: అగ్రికల్చర్ వర్కింగ్ గ్రూప్ (ఏడబ్ల్యూజీ) మినిస్టీరియల్ సమావేశాలకు హైదరాబాద్ సిద్ధం అయ్యింది. గురువారం నుంచి ఈ నెల 17 వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు జీ20 సభ్య దేశాలు, ఆహా్వనిత దేశాలు, అంతర్జాతీయ సంస్థల నుంచి 200 మందికి పైగా ప్రతినిధులు హాజరుకానున్నారు. కార్యక్రమంలో వివిధ దేశాల వ్యవసాయ మంత్రులు, అంతర్జాతీ య సంస్థల డైరెక్టర్ జనరల్స్ పాల్గొంటారు. కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరి మొదటిరోజు ఎగ్జిబిషన్ ప్రారంభిస్తారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో భారత్ సాధించిన విజయాలను ఇందులో ప్రదర్శిస్తారు. అనంతరం వ్యవసాయ డిప్యూటీస్ మీటింగ్ (ఏడీఎం) జరుగనుంది. ద్వితీయార్ధంలో అగ్రిబిజినెస్ ఫర్ ప్రాఫిట్, పీపుల్ అండ్ ప్లానెట్ నిర్వహణ, ‘డిజిటల్లీ డిస్కనెక్ట్: వ్యవసాయంలో డిజిటల్ సాంకేతికతను ఉపయోగించుకోవడం’ కార్యక్రమాలు జరుగుతాయి. జీ–20 సమావేశంలో పాల్గొనే మంత్రులు, ఇతర ప్రతినిధి బృందాల నాయకులకు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ స్వాగతం పలకడంతో రెండవరోజు సమావేశం ప్రారంభమవుతుంది. ఆహార భద్రత, పౌష్టికాహారం కోసం సుస్థిర వ్యవసాయం, మహిళల నేతృత్వంలోని వ్యవసాయం, సుస్థిర జీవవైవిధ్యం, వాతావరణ సమస్యల పరిష్కారాలపై మంత్రులు, ఉన్నత స్థాయి అధికారుల చర్చలు మూడు సమాంతర సెషన్లలో జరుగుతా యి. మూడవ రోజు భారత్ అధ్యక్షతన అగ్రికల్చర్ వర్కింగ్ గ్రూప్, జీ–20 ఫలితాలను ఆమోదించడంతో మంత్రుల సమావేశం ముగుస్తుంది. అనంతరం హైదరాబాద్‌లోని ఐసీఏఆర్ –ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ (ఐఐఎంఆర్)కు సాంకేతిక విజ్ఞాన యాత్రకు ప్రతినిధి బృందం వెళ్తుంది. -
పరిశోధనా ఫలాలు రైతులకు చేరాలి
సాక్షి, హైదరాబాద్: పరిశోధనా ఫలాల్ని మారుమూల ప్రాంతాల్లో ఉండే సన్న చిన్న కారు రైతాంగాలకి అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పిలుపునిచ్చారు. పంటల ఉత్పత్తి, ఉత్పాదకతల్ని అధికం చేయడానికి, నష్టాల్ని తగ్గించడానికి, మార్కెట్ అనుసంధానం చేయడానికి టెక్నాలజీలని విరివిగా వినియోగించుకోవాలన్నారు. కిందిస్థాయి రైతాంగం వరకు శిక్షణ అందించాలన్నారు. రైతాంగ సంక్షేమం కోసం కేంద్రం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో కలిసి పనిచేస్తాయన్నారు. హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని ‘విస్తరణ విద్యాసంస్థ (ఈఈఐ)’లో నూతనంగా నిర్మించిన ఆడిటోరియాన్ని మంత్రి సోమవారం ప్రారంభించారు. ఈఈఐ స్వరో్ణత్సవాల సందర్భంగా పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో 200 మంది కూర్చునే విధంగా ఈ ఆడిటోరియాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా తోమర్ మాట్లాడుతూ, అనేక పంటల ఉత్పత్తి, ఉత్పాదకతలలో దేశం ప్రథమ శ్రేణిలో ఉందన్నారు. దిగుమతులు చేసుకునే స్థాయి నుంచి ఎగుమతులు చేసుకునే స్థాయికి దేశం ఎదిగిందని మంత్రి వివరించారు. తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి తమ ప్రభుత్వం రైతాంగ సంక్షేమానికి, వ్యవసాయాభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వివరించారు. రాష్ట్రానికి కేంద్రం కూడా ఇతోధిక సాయం అందించాలని కోరారు. జూన్ 15–17 మధ్య హైదరాబాద్‌లో జీ–20 సదస్సు... జూన్ 15–17 మధ్య హైదరాబాద్‌లో జరగనున్న జీ–20 అంతర్జాతీయ శిఖరాగ్ర సదస్సు ముందస్తు ఏర్పాట్లపై మాదాపూర్ హెచ్ఐసీసీ లో కేంద్ర మంత్రి నరేంద్రసింగ్ తోమర్, రాష్ట్ర వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా తోమర్ మాట్లాడుతూ, వ్యవసాయరంగంలో తెలంగాణ ముందున్న నేపథ్యంలోనే ఇక్కడ జీ–20 సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. సీఎస్ శాంతి కుమారితో కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి భేటీ... కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శి మనోజ్ అహూజా సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మనోజ్ అహూజా, జాయింట్ సెక్రటరీ యోగితా రాణాలను శాంతి కుమారి శాలువాతో సత్కరించారు. -
కుంకుమ పువ్వు కృత్రిమ సాగుకు ప్రోత్సాహం
న్యూఢిల్లీ: కృత్రిమ వాతావరణంలో కుంకుమ పువ్వు సాగును ప్రోత్సహించే దిశగా వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఇప్పటికే చర్యలు తీసుకుందని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో ఒక యువ వ్యవసాయ పట్టభద్రురాలు ప్రయోగాత్మకంగా కుంకుమ పువ్వును సాగు మొదలెట్టి తొలి ప్రయత్నంలోనే స్వచ్ఛమైన 200 గ్రాముల ఫస్ట్ గ్రేడ్ దిగుబడి సాధించిన విషయం మీ మంత్రిత్వ శాఖ దృష్టికి వచ్చిందా అని రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. దీనికి మంత్రి జవాబిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం వ్యవసాయంలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేసిన విద్యార్ధిని ఒకరు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో తన ఇంట్లోనే హ్యుమిడిఫైర్స్ సాయంతో సెమి హైడ్రోపోనిక్స్ పరిస్థితులు సృష్టించి కుంకుమ పువ్వును సాగు చేస్తున్నట్లు తెలిసిందని చెప్పారు. జమ్మూ, కశ్మీర్‌లోని పంపోర్, పుల్వామా, బుడ్గాం, శ్రీనగర్ ప్రాంతాల్లో కుంకుమ పువ్వు సాగుకు అనువైన వాతావరణ పరిస్థితులు ఉన్నందున అక్కడ వాణిజ్య స్థాయిలో ఈ పంట సాగు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. సమశీతోష్ణ వాతావరణం, నీరు నిల్వని వదులైన భూమి కుంకుమ పువ్వు సాగుకు అనువైన పరిస్థితులు కల్పిస్తాయి. భూమిలో పీహెచ్ విలువ 6.3 నుంచి 8.3 వరకు ఉండాలి. వాతావరణం ఎండా కాలంలో 23 నుంచి 27 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య శీతాకాలం అయింతే మైనస్ 15 డిగ్రీల నుంచి మైనస్ 20 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు తగ్గకుండా ఉంటే మంచి నాణ్యమైన కుంకుమ పువ్వు దిగుబడి సాధించవచ్చని మంత్రి తెలిపారు. కృత్రిమ వాతావరణంలో నిరూపితమైన టెక్నాలజీని వినియోగించి కుంకుమ పువ్వుతో సహా ఎలాంటి పంటలు సాగు చేయడానికైనా ఉద్యానవన పంటల సమగ్ర అభివృద్ధి మిషన్ (ఎంఐడీహెచ్) ద్వారా వ్యవసాయ మంత్రిత్వ శాఖ మద్దతు ఇస్తుందని మంత్రి తెలిపారు. ఈ విధంగా చేపట్టే కృత్రిమ పంటల సాగుకు అవసరమయ్యే పాలిహౌస్, కృత్రిమ వాతావరణ కల్పన కోసం చేపట్టే నిర్మాణాల ఖర్చులో 50 శాతం వ్యవసాయ మంత్రిత్వ శాఖ భరిస్తుందని ఆయన తెలిపారు. ప్లాంటేషన్ కోసం మౌలిక వసతుల అభివృద్ధిలో భాగమైన ఫాన్, పాడ్ సిస్టమ్, సహజమైన వెంటిలేషన్ కోసం నిర్మించే ట్యూబ్యులర్ స్ట్రక్చర్, వుడెన్ స్ట్రక్చర్, బాంబూ స్ట్రక్చర్ వంటి వాటి నిర్మాణంలో 50 శాతం ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఆహార భద్రత మిషన్‌లో చిరుధాన్యాలకు ప్రోత్సాహం చిరుధాన్యాల ఉత్పత్తిని ప్రోత్సహించే లక్ష్యంగా చేసుకుని వాటిని ప్రజా పంపిణీ వ్యవస్థలో చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత మిషన్ కింద సబ్-మిషన్ ఏర్పాటు చేసిందని ఆహార, ప్రజాపంపిణీ శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి వెల్లడించారు. రాజ్యసభలో ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. గడిచిన అయిదేళ్ళలో దేశంలో 814.17 లక్షల మెట్రిక్ టన్నుల చిరుధాన్యాలు ఉత్పత్తి జరిగినట్లు ఆమె తెలిపారు. 2017-18లో 164.36 లక్షల మెట్రిక్ టన్నులు, 2018-19లో 137.17 ఎల్ఎంటీ, 2019-20లో 172.6, ఎల్.ఎం.టీ, 2020-21లో 180.2ఎల్ఎంటీ, 2021-22 లో 159.9 ఎల్ఎంటీ చిరుధాన్యాలు ఉత్పత్తి జరిగినట్లు తెలిపారు. వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ ఆహార ధాన్యాల ఉత్పత్తి అంచనా ప్రకారం 2022-23లో దేశంలో 159.09 లక్షల మెట్రిక్ టన్నులు చిరుధాన్యాలతో సహా మొత్తం 3235.54 లక్షల మెట్రిక్ టన్నులు వివిధ రకాల ఆహార ధాన్యాలు ఉత్పత్తి జరగనున్నట్లు అంచనా వేశారు. అయితే 2022-23లో అంచనా వేసిన మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో చిరు ధాన్యాల ఉత్పత్తి కేవలం 4.92% మాత్రమే. టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్, ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్ (మిడ్ డే మీల్) తదితర పథకాల కింద లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు 2021-22 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో 6.07లక్షల మెట్రిక్ టన్నులు చిరుధాన్యాలు కొనుగోలు చేసినట్లు తెలిపారు. జాతీయ ఆహార భద్రతా యాక్ట్-2013 ప్రకారం ధాన్యం, గోధుమలు, ముతక ధాన్యం, నాణ్యత కల్గిన ఇతర రకాలను కేంద్ర ప్రభుత్వం ఆహార ధాన్యాలుగా గుర్తిస్తోందని అన్నారు. చిరుధాన్యాలకు చట్టంలో ప్రత్యేక నియమం ఏదీ లేదని మంత్రి తెలిపారు. అయితే ఆహార భద్రత చట్టం కింద లబ్ధి పొందుతున్న వారిలో పోషక విలువలు మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఆయా ప్రాంతాల్లో స్థానికంగా వినియోగిస్తున్న చిరుధాన్యాల ప్రాధాన్యతనుబట్టి చిరుధాన్యాలు కొనుగోలు చేయాలని కోరినట్లు తెలిపారు. ఇప్పటికే చిరుధాన్యాలు టార్గెటెడ్ ప్రజాపంపిణీ వ్యవస్థలో భాగమైనట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు డిసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ పద్ధతిలో ముతక ధాన్యం కొనుగోలు, నిల్వ, పంపిణీ చేస్తున్నాయని మంత్రి తెలిపారు. -
ఏపీలో రైతుభరోసా కేంద్రాలతో సేవలన్నీ ఒకేచోట
సాక్షి, న్యూఢిల్లీ: రైతులకు వన్–స్టాప్ పరిష్కారంలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుభరోసా కేంద్రాల గురించి కేంద్రానికి తెలుసని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చెప్పారు. పరీక్షించిన వ్యవసాయ ఉత్పాదనల సరఫరా నుంచి వివిధ సేవలు, సామర్థ్యం పెంపు చర్యలు, సాగుకు సంబంధించిన పరిజ్ఞానం ప్రచారం వంటి రైతుల అవసరాలన్నింటికీ ఒకేచోట పరిష్కారం అందించేలా ఈ కేంద్రాలు పనిచేస్తాయని తెలిపారు. రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. అగ్రి–క్లినిక్స్, అగ్రి–బిజినెస్ సెంటర్స్, సాయిల్ హెల్త్‌కార్డ్ ఇలా పలు పథకాలను కేంద్రం తీసుకొచ్చిందన్నారు. ఖరీఫ్‌లో 5.15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ ఆంధ్రప్రదేశ్‌లో ఖరీఫ్ సీజన్లో ఈ నెల 11వ తేదీ వరకు 5.15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు కేంద్ర వినియోగదారులు, ఆహారశాఖ సహాయమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి.. వైఎస్సార్సీపీ ఎంపీ పరిమళ్ నత్వానీ ప్రశ్నకు సమాధానమిచ్చారు. జాతీయ సగటు కంటే ఏపీలోనే రైతు ఆదాయం ఎక్కువ జాతీయ సగటు కంటే నెలసరి రైతు ఆదాయం ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ ఉందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. జాతీయ సగటు రూ.10,218 ఉండగా ఏపీలో రైతు నెలసరి ఆదాయం రూ.10,480 అని చెప్పారు. -
చంద్రబాబు హయాంలోనే రైతు ఆత్మహత్యలు ఎక్కువ: కేంద్రం లిఖిత పూర్వక సమాధానం
సాక్షి, ఢిల్లీ: రైతు ఆత్మహత్యలపై రాజ్యసభలో కేంద్రమంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. చంద్రబాబు హయాంలోనే ఎక్కువగా రైతు ఆత్మహత్యలు జరిగాయని నరేంద్రసింగ్ తోమర్ వెల్లడించారు. వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక రైతుల ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టాయి. చంద్రబాబు హయాంలో 2018-19లో 628 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడగా, 2019 తర్వాత క్రమంగా ఏపీలో రైతు ఆత్మహత్యలు తగ్గుతూ వస్తున్నాయి. 2019-20లో 564 మంది, 2020-21లో 481 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని కేంద్రమంత్రి వివరించారు. చదవండి: గుజరాత్ ఎన్నికలు.. గెలిచిన, ఓడిన ప్రముఖులు వీరే! -
రైతులకు శుభవార్త.. రేపే ‘పీఎం కిసాన్’ 12వ విడత నిధుల విడుదల
న్యూఢిల్లీ: రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా 12వ విడత నిధులు విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో రెండు రోజుల పాటు నిర్వహించ తలపెట్టిన పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ 2022 సదస్సును అక్టోబర్ 17న సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం వేదికగానే రైతుల ఖాతాల్లోకి 12వ విడత కిసాన్ సమ్మాన్ నిధి కింద రూ.16వేల కోట్లు విడుదల చేయనున్నారు మోదీ. రైతుల ఖాతాల్లోకి నేరుగా రూ.2వేల చొప్పున జమకానున్నాయి. పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ 2022 సదస్సుపై విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. ఈ నెల 17న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో అగ్రి స్టార్టప్ సదస్సు/ ఎగ్జిబిషన్‌ను, 600 ‘పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాల’ను ప్రధాని ప్రారంభిస్తారని తెలిపారు. సుమారు 300 అంకుర పరిశ్రమలు తమ నవకల్పనలను ప్రదర్శిస్తాయన్నారు. రైతులకు ‘పీఎం సమ్మాన్ నిధి’ 12వ విడత కింద ఇప్పటివరకు రూ.2.16 లక్షల కోట్లు విడుదల చేసినట్లవుతుందని తెలిపారు. ‘ఒకే దేశం ఒకే ఎరువు’ ఇతివృత్తంతో భారత్ యూరియా, భారత్ డీఏపీ, భారత్ ఎంఓపీ, భారత్ ఎన్పీకే బస్తాలను మోదీ విడుదల చేస్తారన్నారు. వీటన్నింటినీ భారత్ పేరుతో విడుదల చేయడంవల్ల రవాణా ఖర్చులు తగ్గుతాయన్నారు. మరోవైపు.. ఈ వేదికగానే వేలాది మంది రైతులు, అగ్రి స్టార్టప్స్, పరిశోధకులు, పాలసీమేకర్స్, బ్యాంకర్లతో ప్రధాని మాట్లాడతారని తెలిపారు తోమర్. కోటి మందికిపైగా రైతులు వర్చువల్‌గా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు వెల్లడించారు. అలాగే.. 732 క్రిషి విజ్ఞాన్ కేంద్రాలు, 73 ఐసీఏఆర్ ఇన్స్టిట్యూట్స్, 72 రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, 600 పీఎం కిసాన్ సెంటర్స్, 50వేల పీఏసీఎస్‌లు, 2 లక్షలకుపైగా కమ్యూనిటీ సర్వీస్ సెంటర్లు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటాయన్నారు. ఇదీ చదవండి: ఉన్ని టోపీల ప్రదర్శనలో గిన్నిస్ రికార్డు -
తెలంగాణ రైతుల సమస్యలు పరిష్కరించండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో చొరవ చూపాల ని జగిత్యాల రైతుల బృందం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌కు విజ్ఞప్తి చేసింది. తమ సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీ వచ్చిన రైతుల బృందం గురువారం బీజేపీ ఎంపీ అర్వింద్ నేతృత్వంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తోమర్, సహాయమంత్రి కైలాశ్ చౌదరిలను కలసి అనేక అంశాలపై చర్చించింది. అనంతరం అర్వింద్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైతుల బృందానికి అధ్యక్షత వహించిన పన్నాల తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. పసుపు పంటకు మద్దతు ధర, చెరకు పంట పునరుద్ధరణ, మామిడి మార్కెట్ అభివృద్ధి, మిర్చి మార్కెట్ ఏర్పాటు, వాలంతరి ప్రదర్శన క్షేత్రం అభివృద్ధి, ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం, రుణాల పరిమితిని రూ.3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచాల్సిందిగా కేంద్రాన్ని కోరామన్నారు. పసుపు పంటకు మద్దతు ధర కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వస్తే గతంలో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద కేంద్ర వాటాగా ఉన్న 30 శాతాన్ని రైతులకు మేలు చేయడానికి 50 శాతం భరించడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు కేంద్రమంత్రి తోమర్ హామీ ఇచ్చారని తెలిపారు. వచ్చే నెల 10న జగిత్యాలలో జరగనున్న రైతు సభలో కేంద్రమంత్రి కైలాశ్ చౌదరి సమక్షంలో పెద్ద ఎత్తున రైతులతో కలసి బీజేపీలో చేరనున్నట్లు ఆయన వెల్లడించారు. అంతకుముందు ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఇథనాల్ ప్లాంట్స్ పెట్టడంలేదని..ప్రైవేట్ వారిని కూడా పెట్టనివ్వడం లేదని విమర్శించారు. -
బరువైందా... అంటూ బాబుకు బాజా! ఏది నిజం?
‘‘రైతుల ప్రయోజనాల దృష్ట్యా ఫసల్ బీమా యోజనలో భాగస్వామి కావాల్సిందిగా నేనే స్వయంగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఫోన్ చేసి అడిగాను. కేంద్ర బృందాన్ని కూడా ఏపీకి పంపించి అక్కడ అమలవుతున్న ఉచిత పంటల బీమా పథకాన్ని అధ్యయనం చేయించాం. నోటిఫైడ్ పంటలు సాగు చేస్తున్న రైతులందరికి బీమా వర్తింప చేసేలా ఫసల్ బీమా యోజనలో కొన్ని మార్పులను సీఎం వైఎస్ జగన్ సూచించారు. ఆయన సూచనల మేరకు రైతులందరినీ బీమా పరిధిలోకి తీసుకొస్తున్నాం. అందుకు ఉన్న అడ్డంకులను తొలగించాం. ఈ–క్రాప్ డేటా ఆధారంగా ఏపీలో ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇదే డేటాను మేం కూడా ప్రామాణికంగా తీసుకుని, నోటిఫైడ్ పంటలు సాగు చేసే రైతులందరికీ వర్తింప చేసేలా ఫసల్ బీమా యోజనలో మార్పులు చేస్తున్నాం.’’ – ఫసల్ బీమాపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా కేంద్ర వ్యవసాయ, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ‘ఈనాడు’ ఇప్పుడు ఏ స్థితిలో ఉంది? చెప్పటం కష్టం. ఎందుకంటే చంద్రబాబుకు మేలు చేయాలనే ఏకసూత్ర అజెండా అమలు చేయటంలో అడ్డూఅదుపూ కోల్పోయింది. నిజాలు నిస్సిగ్గుగా గాలికొదిలేసింది. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న ప్రతి అంశాన్నీ తాము సృష్టించిన ఎల్లో అద్దంలో చూపిస్తోంది. జనంలో అపోహలు సృష్టించడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తోంది. వరద బాధితులకు సాయం విషయంలోనైనా... రైతులకు ముందెన్నడూ లేని తీరులో అందుతున్న పంటల బీమా విషయంలోనైనా... దేన్లోనైనా ఇదే తీరు. ఇదంతా చూశాక ఇప్పుడో కొత్త సామెత చెప్పుకోవాల్సి వస్తోంది. రాసేవాడు రామోజీరావు అయితే... చదివే వాడు చంద్రబాబే అని!!. కాకపోతే ‘ఈనాడు’ పత్రిక చదివే వాళ్లంతా చంద్రబాబులు కారుగా? తమ సంతోషం కోసం రాశారని చూసి మురిసిపోవటానికి!!. పాఠకులకు నిజాలు కావాలి కదా? ఇంకెప్పుడు చెబుతారు రామోజీరావుగారూ వాస్తవాలు? వృద్ధాప్యంలోనైనా మారరా? ‘బీమా బరువైందా?’ అని ప్రశ్నిస్తూ మంగళవారం ఉదయం ఓ పేద్ద కథనాన్ని వండేసింది ‘ఈనాడు’. రెండేళ్లకే సర్కారు మడమ తిప్పేస్తోందని, మళ్లీ కేంద్ర పథకాల్లో చేరుతోందని... ఇదంతా కేంద్ర నిధుల కోసమేనని పాపం తెగ ఆందోళనకు గురైంది. దాంతోపాటు... ఇలా కేంద్ర పథకాల్లో చేరితే అప్పట్లో ఉన్న లోపాలను అధిగమించేదెలా? అంటూ మథనపడిపోయింది కూడా!!. ఇక్కడ రామోజీ తెలిసో తెలియకో ఒప్పుకున్న నిజం ఒకటుంది. అది.. అప్పట్లో లోపాలున్నాయని!! కాబట్టే రెండేళ్ల కిందట వైఎస్ జగన్ ప్రభుత్వం కేంద్ర బీమా పథకం నుంచి బయటకు వచ్చి కొత్త బీమా పథకాన్ని తీసుకువచ్చిందని. దీంతోపాటు.. వైఎస్ జగన్ ప్రభుత్వం రైతుల కోసం చాలా బరువును మోస్తోందన్న విషయాన్ని కూడా రామోజీరావు చెప్పకనే చెప్పారు. ఇక్కడ రామోజీ సమాధానమివ్వాల్సిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. ఏం! చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఈ కేంద్ర పథకం బాగులేదని, రాష్ట్ర రైతులకు మేలు చేయాలంటే దీంతో సాధ్యం కాదని రామోజీ ఎందుకు సలహా ఇవ్వలేదు? పోనీ తన పత్రికలో కథనాలెందుకు రాయలేదు? ఈ రెండేళ్లుగా జగన్ ప్రభుత్వం విప్లవాత్మకమైన మార్పులతో పంటల బీమా అమలు చేస్తోందని ఏ ఒక్కరోజూ ఎందుకు రాయలేదు? ఇపుడు వాస్తవమేంటన్నది చెప్పకుండా ఈ నిందలెందుకు? అసలు మీ పాత్ర ఏంటి రామోజీ? ప్రతిపక్ష పాత్రా..? లేక ప్రతినాయకుడి పక్ష పాత్రా? మీదిప్పుడు రాసే పాత్ర కాబట్టి పాఠకులతో సహా ఎవ్వరికీ సమాధానం ఇవ్వక్కర్లేదనుకోవచ్చు. కానీ మీకు మీరైనా జవాబు చెప్పుకోవాలి కదా ఈ రోత రాతలకు!!. చంద్రబాబు చేయలేదెందుకు? ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన(పీఎంఎఫ్‌బీవై)తో బీమా సంస్థలకే లబ్ధి చేకూరుతోందని, ఒక సీజన్లో పంట నష్టం జరిగితే రెండు సీజన్లు ముగిసినా పరిహారం అందటం లేదని అందుకే బీహార్, గుజరాత్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో సొంత పథకాలు అమలు చేస్తున్నారని ‘ఈనాడు’ వాకృచ్చింది. రెండేళ్ల కిందట ఆంధ్రప్రదేశ్ కూడా వైఎస్సార్ పంటల బీమా తీసుకొచ్చిందని రాసుకొచ్చింది. కాకపోతే ఘనత వహించిన ఇంటిమనిషి చంద్రబాబు నాయుడుకి ఇలాంటి ఆలోచన ఎందుకు రాలేదో ఎప్పుడూ రాయదు. పైపెచ్చు ఆంధ్రప్రదేశ్‌లో ఈ పథకాన్ని పూర్తి ఉచితంగా అమలు చేస్తున్నట్లు కూడా ఎక్కడా ఒక్క అక్షరం ముక్క కూడా రాయదు ‘ఈనాడు’. నిజానికి గతంలో ఇది కేంద్ర పథకంగా ఉండేటపుడు పంటను బట్టి ప్రీమియాన్ని నిర్ణయించాక ప్రీమియంలో 2 శాతాన్ని రైతులే చెల్లించేవారు. బ్యాంకు రుణాలు తీసుకున్న రైతులకు బ్యాంకులే ఈ మొత్తాన్ని మినహాయించేసి బీమా చేయించేవి. మిగిలిన రైతులకు బీమా గురించి తెలిసేదే కాదు. ప్రకృతి వైపరీత్యాలతో వారు నష్టపోతే.. వారికి బీమాయే లేదు కాబట్టి ప్రభుత్వం చేతులెత్తేసేది. బీమా ఉన్నవారికి కూడా ఒక సీజన్లో నష్టం జరిగితే రెండు మూడు సీజన్లు గడిచాక పరిహారం వచ్చేది. ఇదిగో... ఇలాంటి పరిస్థితులకు తావివ్వకూడదన్న ఉద్దేశంతోనే... రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేరుగా పంటల బీమా అమలు చేయాలని సంకల్పించారు వైఎస్ జగన్. అందుకే కేంద్ర పథకం నుంచి బయటకు వచ్చేసి... ఈ–క్రాప్‌ను సమర్థంగా అమలు చేస్తూ... పంట నమోదు చేయించుకున్న ప్రతి రైతుకూ పరిహారం అందేలా చూస్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యం... ఏ సీజన్లో జరిగిన నష్టానికి ఆ సీజన్ ముగియక ముందే పరిహారం ఇవ్వటం. తద్వారా తదుపరి సీజన్‌కు ఆ రైతుకు ఇబ్బంది లేకుండా చేయటం. అదీ ఉద్దేశం. అందుకే ఇది రైతు ప్రభుత్వమయ్యింది. అలాంటి ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు వదిలేస్తుందా? బీమా పథకం బరువైపోయింది కాబట్టి కేంద్రానికి అప్పగించేస్తుందా? ఆ మాత్రం ఆలోచించాలి కదా రామోజీరావు గారూ? అసలు ఖరీఫ్ సీజన్లో జరిగిన నష్టాన్ని మళ్లీ ఖరీఫ్ మొదలు కాకముందే ఇవ్వటమనేది మీ జన్మలో చూశారా? చంద్రబాబు ఈ దిశగా ఆలోచనైనా చేశారా? టీడీపీ హయాంలో జరిగింది ఇదీ... చంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్లలో సగటున ఏడాదికి 20.28 లక్షల మంది రైతులు, 23.57 లక్షల హెక్టార్లకు మాత్రమే బీమా చేయించుకోగలిగారు. 2014–16 మధ్య వ్యవసాయ బీమా పథకం కింద 5.38 లక్షల మందికి రూ.471.94 కోట్లు, 2016–19 మధ్య పీఎంఎఫ్‌బీవై కింద 25.47 లక్షల మందికి రూ.2939.26 కోట్ల బీమా మొత్తాన్ని అందించారు. మొత్తంగా ఐదేళ్లలో కేంద్ర బీమా పథకాల ద్వారా రూ.341 కోట్ల పరిహారాన్ని అందించారు. కానీ కేంద్ర పథకంలో ఉన్న పరిమితులతో రైతులు నష్టపోతున్నారని భావించిన వై.ఎస్.జగన్ సర్కారు.. నోటిఫైడ్ పంటలు సాగు చేసే రైతులందరికీ బీమా వర్తింప చేయాలని డిమాండ్ చేసింది. ప్రీమియం చెల్లించిన వారికే ఇస్తామని కేంద్రం చెప్పడంతో ఆ పథకం నుంచి బయటకొచ్చేసింది. 2019 జూలై 8న డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని తెచ్చారు జగన్. ఈ–క్రాప్‌లో పంట నమోదు చేసుకున్న ప్రతి రైతుకూ బీమా వర్తించేలా... ఆర్బీకేల్లోనే నామమాత్రంగా రూ.10 తీసుకుని రసీదు కూడా ఇస్తున్నారు. ఆ రసీదు.. ఈ–క్రాప్‌లో నమోదు చేసినట్లు రైతుకు ఇచ్చే అధికారిక గుర్తింపు. దాని ఆధారంగా పంట నష్టపోయిన ప్రతి రైతుకూ నేరుగా సీజన్ మారకముందే పరిహారం అందుతోంది. ఇందులో రైతు వాటాతో పాటు కేంద్రం వాటానూ రాష్ట్రమే భరిస్తుండగా... గతంతో పోలిస్తే బీమా పరిధిలోకి వచ్చిన రైతుల సంఖ్య కూడా ఏకంగా 167.04 శాతం పెరిగింది. 2018–19లో 6.19 లక్షల మందికి చెల్లించాల్సిన రూ.715.84 కోట్ల మొత్తాన్ని 2019లో వై.ఎస్.జగన్ ప్రభుత్వమే చెల్లించింది. టీడీపీ ఐదేళ్లలో రూ.30.85 లక్షల మందికి రూ.3411.20 కోట్లు బీమా దక్కితే గడిచిన మూడేళ్లలో 44.28 లక్షల మంది రైతులకు ఏకంగా రూ.6684.84 కోట్ల బీమా సొమ్ములు అందాయి. చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఖరీఫ్– 2021–22 సీజన్‌కు సంబంధించి 15.61 లక్షల మందికి రూ.2977.82 కోట్లు బీమాగా అందజేసింది. ఇవీ రాయని, రాయాలనుకోని వాస్తవాలు!!. బీమా లైసెన్స్ కోసం ప్రయత్నాలు... బీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని భావించటంతో పాటు... దీనికోసం శాశ్వత వ్యవస్థను ఏర్పాటు చేయాలని భావించారు ముఖ్యమంత్రి జగన్. అందుకే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఓ బీమా కంపెనీ ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదించారు. దీనికి బీమా నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏ) లైసెన్సు ఇవ్వాల్సి ఉంటుంది. పదేపదే దీనికోసం అభ్యర్థనలు చేయటంతో పాటు ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దలతో పెండింగ్ అంశాలు మాట్లాడిన ప్రతిసారీ దీన్ని ప్రస్తావించారు. త్వరలో లైసెన్స్ వచ్చే అవకాశాలూ లేకపోలేదు. అయితే ఈ మధ్యలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నేరుగా సీఎం జగన్‌కు ఫోన్ చేసి... కేంద్ర పథకంలో భాగస్వామిగా ఉండాలని కోరారు. ఈ పథకం నుంచి ఎందుకు బయటకు వచ్చేశారో అడగటంతో పాటు... లోటుపాట్లు ఉంటే చెప్పాలని, సవరించుకుంటామని కూడా అడిగారాయన. అనంతరం కేంద్ర బృందాన్ని కూడా పంపించారు. ఇక్కడి అధికారులతో సమావేశమైన ఆ బృందం... ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరాలేమిటనేది అడిగి తెలుసుకుంది. ఈ–క్రాప్‌లో నమోదైన ప్రతి రైతుకూ పంట దెబ్బతిన్న పక్షంలో బీమా పరిహారం అందటం... ఏ సీజన్లో జరిగిన నష్టానికి పరిహారాన్ని అదే సీజన్లో అందించటమనేవి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన డిమాండ్లు కాగా... ఆ రెండింటికీ కేంద్రం అంగీకరిస్తోంది. ఆ మేరకు చట్టానికి సవరణలు చేసే పనిలోనూ పడింది. అవన్నీ పూర్తయితే రైతుకు ఇప్పటి మాదిరే పరిహారానికి ఎలాంటి ఢోకా ఉండదు. మరప్పుడు ఇబ్బంది ఏముంటుంది? అయినా రైతు డబ్బులే చెల్లించాల్సిన అవసరం లేనప్పుడు కేంద్ర పథకానికి దరఖాస్తు చేసుకునే గడువు ముగిసిపోతోందని రామోజీ ఎందుకంత బాధపడిపోతున్నారో అర్థం కాదు. పైపెచ్చు కేంద్ర పథకంలో చేరినా కూడా ఈ–క్రాప్‌లో నమోదు చేసుకున్న డేటా ప్రకారమే... అంటే ఇప్పటి మాదిరిగానే రైతులకు పరిహారం అందుతుంది. మరప్పుడు ‘ఈనాడు’కొచ్చిన కష్టమేంటి? రైతుకు బీమా సొమ్ము ముఖ్యం తప్ప... ఆ డబ్బులు బీమా సంస్థ నుంచి వస్తున్నాయా? కేంద్రం నుంచి వస్తున్నాయా? రాష్ట్రం నుంచి వస్తున్నాయా? అనేది కాదుకదా!!. మూడేళ్లుగా రైతుల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న ప్రభుత్వానికి ఆ మాత్రం తెలియదనుకోవాలా? ఇకనైనా ఇలాంటి అర్థంపర్థం లేని వార్తలు అచ్చేయటం ఆపండి రామోజీరావుగారూ!! బీమా బరువేమీ కాదు... పైసా భారం లేకుండా, ఈ–పంట నమోదు ప్రామాణికంగా మూడేళ్లుగా వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నాం. మనం అమలు చేస్తోన్న ఈ–పంట నమోదు పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన కేంద్రం, ఈ డేటా ఆధారంగా పీఎంఎఫ్‌బీవై పథకాన్ని అమలు చేయడానికి ముందుకొచ్చింది. కేంద్రం అభ్యర్థన మేరకు సాధ్యా, సాధ్యాలను బేరీజు వేసుకొని మన బీమా పథకాన్ని పీఎంఎఫ్‌బీవైతో అనుసంధానించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2022–23 సీజన్ కోసం బీమా కంపెనీల ఎంపికకు టెండర్ ప్రక్రియ త్వరలో ప్రారంభిస్తాం. ఈ పంటలో నమోదు, ఈ కేవైసీ పూర్తయిన తర్వాత రైతులకు ఇచ్చే రసీదులో బీమా చేసిన పంట పేరు, విస్తీర్ణం వివరాలు పొందుపరుస్తాం. వారి వాటాను కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. 2023 జూన్‌లోగా ప్రస్తుత ఖరీఫ్ సీజన్ బీమా పరిహారం, 2023 అక్టోబర్ 15లోగా రబీ–2022–23 సీజన్ బీమా పరిహారం చెల్లించేలా విధి విధానాలు రూపొందిస్తున్నాం. పంటల బీమా విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – చేవూరి హరికిరణ్,స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ -
ఏపీని ఆదర్శంగా తీసుకోవాలి: కేంద్రమంత్రి
సాక్షి, అమరావతి: వ్యవసాయరంగంలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కేంద్ర వ్యవసాయ, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ పిలుపునిచ్చారు. ఏపీలో గ్రామస్థాయిలో రైతులకు సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన రైతుభరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) అద్భుత ఫలితాలు ఇస్తున్నాయని చెప్పారు. ఆర్బీకేలతో పాటు ఏపీలో అమలు చేస్తున్న ఈ–క్రాపింగ్, ప్రకృతిసేద్యాన్ని ఆదర్శంగా తీసుకుని అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని సూచించారు. బెంగళూరులో వ్యవసాయ, ఉద్యానశాఖ మంత్రుల రెండురోజుల జాతీయసదస్సు శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్బీకేల ద్వారా గ్రామస్థాయిలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు వంటి సాగు ఉత్పాదకాలను నేరుగా రైతుల ముంగిటకు తీసుకువెళుతున్నారని చెప్పారు. ఇందుకోసం గ్రామస్థాయిలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారన్నారు. రైతులకు సాగులో సలహాలు, సూచనలతోపాటు అవసరమైన శిక్షణ కార్యక్రమాలను కూడా ఆర్బీకేల ద్వారా అందిస్తున్నారని చెప్పారు. సాగవుతున్న ప్రతి పంటను గుర్తించేందుకు ఈ–క్రాప్ వినూత్నమైన ఆలోచనన్నారు. ఈ–క్రాప్‌ను ప్రామాణికంగా తీసుకుని వాస్తవ సాగుదారులకు ఏపీలో సంక్షేమ ఫలాలు అందిస్తున్న విధానం ఆదర్శనీయంగా ఉందని చెప్పారు. రసాయన అవశేషాలు లేని ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించేందుకు ప్రకృతిసేద్యంపై కేంద్రం ప్రత్యేకదృష్టి పెట్టిందన్నారు. ఇప్పటికే ఏపీలో ఈ తరహా ప్రకృతిసేద్యాన్ని పెద్దఎత్తున అక్కడి ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని చెప్పారు. లక్షలాదిమంది రైతులు ఇప్పటికే ప్రకృతిసేద్యం వైపు వెళ్లారని తెలిపారు. ఇదేరీతిలో ఏపీని స్ఫూర్తిగా తీసుకుని మిగిలిన రాష్ట్రాలు కూడా తమ వ్యవసాయ విధానాల్లో మార్పులు, సంస్కరణలు తీసుకువచ్చేందుకు కృషిచేయాలని సూచించారు. ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజనను ఈ–క్రాప్‌తో అనుసంధానం చేస్తాం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ రైతుభరోసా, పీఎం కిసాన్ కింద రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా రైతు ఖాతాల్లో ఏటా మూడు విడతల్లో రూ.13,500 జమచేస్తోందని చెప్పారు. ఈ మొత్తంలో రూ.7,500 రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుండగా రూ.6 వేలను కేంద్రం పీఎం కిసాన్ పథకం ద్వారా సర్దుబాటు చేస్తోందని తెలిపారు. రైతుభరోసా సొమ్మును ఖరీఫ్ సీజన్‌కు ముందు మే నెలలోను, రబీ సీజన్‌కు ముందు అక్టోబర్‌లోను తాము రైతుల ఖాతాల్లో జమచేస్తున్నామని చెప్పారు. పీఎం కిసాన్ నిధులు మాత్రం సీజన్‌కు మధ్య రెండేసి వేల చొప్పున జమ చేస్తున్నారని తెలిపారు. రైతుభరోసా మాదిరిగానే మే నెలలో రూ.3 వేలు, అక్టోబర్‌లో రూ.3 వేలు సర్దుబాటు చేస్తే రైతులకు ఎంతో మేలు కలుగుతుందని చెప్పారు. ఈ దిశగా ఆలోచించాలని కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్‌ను కోరారు. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి ఏపీ వరకు తప్పనిసరిగా ఈ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకుని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఈ–క్రాప్‌తో అనుసంధానం చేస్తూ ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజనను రైతులందరికీ వర్తింపజేసేలా చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. ఈ సదస్సులో కర్ణాటక ముఖ్యమంత్రి బొమ్మై, ఏపీ వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, ఇన్చార్జ్ కమిషనర్ డాక్టర్ గడ్డం శేఖర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
సాగులో ఏపీ విధానాలు సూపర్.. కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రశంసలు
సాక్షి, అమరావతి: అన్నదాతల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వ్యవసాయ రంగంలో ఏపీప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి నరేంద్రసింగ్ తోమర్ ప్రశంసించారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై)పై మంగళవారం ఢిల్లీ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలసి ఆయన మాట్లాడారు. వ్యవసాయ శాఖమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్‌శర్మ, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, వ్యవసాయశాఖ ఇన్చార్జి కమిషనర్ శేఖర్‌బాబు తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈ–క్రాప్ దేశంలోనే వినూత్నం: తోమర్ ‘వ్యవసాయం బాగుండి రైతుల ఆదాయం పెరిగితే రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. ఆ దిశగా మీ (సీఎం జగన్) ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోంది. వ్యవసాయ రంగంలో మీరు తెచ్చిన సంస్కరణలు విప్లవాత్మకం. ఏపీలో అమలు చేస్తున్న ఈ–క్రాప్ విధానం దేశంలోనే ఒక వినూత్న ప్రక్రియ. ఇది రైతులకు ఏ స్థాయిలో మేలు చేస్తుందో తెలుసుకుని ఆశ్చర్యపోయా. ప్రకృతి సేద్యం, అగ్రి ఇన్ఫ్రా ఫండ్ కార్యక్రమాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ స్ఫూర్తిగా నిలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు రైతులకు ఎంతో మేలు చేస్తున్నాయి. విజయవంతంగా అమలవుతున్న ఒక గొప్ప కార్యక్రమాన్ని దేశమంతా అమలు చేయడం అవసరం. వాటి ఫలాలను రైతులందరికీ అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. త్వరలోనే రాష్ట్రాల వ్యవసాయ శాఖల మంత్రుల సమావేశాన్ని నిర్వహించి ఈ–క్రాప్ విధానం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న వినూత్న పథకాలు, కార్యక్రమాలను వివరిస్తాం. వాటిని ఆయా రాష్ట్రాల్లో అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటాం. సీఎం జగన్ సూచనలను స్వీకరిస్తున్నాం.. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన(పీఎంఎఫ్‌బీవై) రైతులకు ఒక రక్షణ కవచంలా నిలుస్తుంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలకు నష్టం వాటిల్లిన సమయంలో ఎంతో అండగా ఉంటుంది. రైతుల ప్రయోజనాల కోసం కేంద్రం ఈ పథకాన్ని ప్రకటించినప్పుడు అన్ని రాష్ట్రాలు చేరాయి. ఆ తర్వాత కొన్ని రాష్ట్రాలు వైదొలిగాయి. లోటుపాట్లను అధిగమిస్తూ ముందుకెళ్తేనే రైతులకు మరింత మేలు జరుగుతుంది. ఏపీలో కేంద్ర బృందం పర్యటన సందర్భంగా సీఎం జగన్ చేసిన సూచనల మేరకు మార్పులు చేస్తున్నాం. ఈ–క్రాప్ వివరాలతో బీమా పథకాన్ని అనుసంధానిస్తాం. ఈ మేరకు మార్గదర్శకాలు సవరించాం. పీఎంఎఫ్‌బీవైలో భాగస్వామ్యం అవుతున్నందుకు ఏపీ సీఎంకు ధన్యవాదాలు తెలియచేస్తున్నా. ఇతర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందిన సూచనలు కూడా స్వీకరిస్తాం. చెరిసగం భరిస్తే మరింత మేలు: సీఎం జగన్ ఫసల్ బీమా యోజన పథకాన్ని అందరికీ వర్తింప చేయాలంటే విధానపరంగా మార్పులు తేవాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన కేంద్రమంత్రితో మాట్లాడారు. ‘రాష్ట్రంలో 10,778 ఆర్బీకేలున్నాయి. ప్రతి గ్రామంలో వ్యవసాయ కార్యక్రమాలన్నీ ఆర్బీకేల పరిధిలో జరుగుతున్నాయి. గ్రామ సచివాలయాలతో కలిసి ఇవి పనిచేస్తున్నాయి. ఇక్కడ వ్యవసాయ, ఉద్యాన, పట్టు, పశు సంవర్ధక, మత్స్య అసిస్టెంట్లతో పాటు బ్యాంకింగ్ కరస్పాండెంట్లు సేవలందిస్తున్నారు. రైతులు సాగుచేసిన ప్రతి పంటను జియో ట్యాగింగ్‌తో ఇ–క్రాప్ చేస్తున్నాం. ప్రతి పంటను బీమా పరిధిలోకి తెచ్చేలా అడ్డంకులను తొలగించాం. పటిష్ట వ్యవస్థ ద్వారా డేటా సేకరిస్తున్నాం. ఈ–క్రాప్ డేటా ఆధారంగా వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నాం. రైతులు కట్టాల్సిన ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోంది. మూడింట రెండొంతుల ప్రీమియం మొత్తాన్ని రైతుల తరపున రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. పంటల బీమాలో యూనివర్సల్ కవరేజీ అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఏపీ నిలిచింది. సన్న, చిన్నకారు రైతుల తరఫున చెల్లించాల్సిన ప్రీమియాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరిస్తే మరిన్ని అద్భుతాలు జరుగుతాయి. రైతులకు ఇంకా మేలు జరుగుతుంది. ఇందుకోసం ఈ–క్రాప్ డేటాను వినియోగించుకోవాలి. కొన్ని రాష్ట్రాలు ఫసల్ బీమా యోజనలో ఎందుకు లేవన్న అంశంపై దృష్టి సారించి సమస్యల పరిష్కారంతో పాటు మేం సూచించిన మార్పులు చేర్పులు చేసేందుకు ముందుకొచ్చిన కేంద్ర మంత్రి తోమర్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. -
వ్యవసాయ వర్సిటీకి మొదటి స్థానం
సాక్షి, అమరావతి: జాతీయ స్థాయిలో రాష్ట్రానికి చెందిన ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మొదటి స్థానంలో నిలవగా, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం రెండో స్థానంలో నిలిచింది. 2021–22 విద్యాసంవత్సరంలో వ్యవసాయం, వ్యవసాయ ఇంజనీరింగ్ విభాగాల్లో ఎన్జీ రంగా, హార్టి కల్చర్ అండ్ ఫారెస్ట్రీ ప్రోగ్రామ్ కేటగిరీలో ఉద్యాన వర్సిటీ ఈ అవార్డులను దక్కించుకుంది. బుధవారం ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్, మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమల శాఖ మంత్రి పర్షోత్తమ్‌ఖడోభాయ్ రూ పాలా, భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) డైరెక్టర్ జనరల్ త్రి లోచన్ మహాపాత్ర చేతుల మీదుగా ఎన్జీ రంగా, ఉద్యాన వర్సిటీ వీసీలు డాక్టర్ ఎ.విష్ణువర్ధన్‌రెడ్డి, డాక్టర్ టి.జానకీరామ్ అందుకున్నారు. ఆయా కేటగిరీల్లో అత్యధిక పీజీ స్కా లర్షిప్లు మన రాష్ట్రానికి చెందిన వ్యవసాయ, ఉద్యాన వర్సిటీల విద్యార్థులు పొందారు. జాతీయ స్థాయిలో 63 వ్యవసాయ విశ్వవిద్యాలయాలతో పోటీపడిన ఎన్జీ రంగా వర్సిటీ మొదటి స్థానంలో నిలవగా, ఏడు ఉద్యాన విశ్వవిద్యాలయాల్లో బెంగళూరు ఉద్యాన వర్సిటీ మొదటి స్థానంలో నిలిచింది. వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ రెండో స్థానం దక్కించుకుంది. -
ఎఫ్‌పీవోల ఏర్పాటుకు ప్రభుత్వ ప్రోత్సాహం: తోమర్
న్యూఢిల్లీ: దేశంలోని చిన్న, సన్నకారు రైతుల ఆదాయం పెంపులో భాగంగా మరిన్ని ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్(ఎఫ్‌పీవో) ఏర్పాటు ను ప్రోత్సహిస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చెప్పారు. సోమవారం సీఐఐ–ఎన్సీడీఈఎక్స్ ఎఫ్‌పీవో సమ్మిట్ నిర్వహించిన సదస్సులో మంత్రి ఈ విషయం వెల్లడించారు. రూ.6,865 కోట్ల పెట్టుబడితో 10వేల ఎఫ్‌పీవోల ఏర్పాటు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని చెప్పారు. ఇవి పనిచేయడం ప్రారంభిస్తే క్లస్టర్ ఆధారంగా ఒక్కో జిల్లా ఒక్కో వ్యవసాయ ఉత్పత్తిలో ప్రత్యేకత సాధిస్తుందన్నారు. -
పామాయిల్ సాగు ప్రోత్సాహానికి రూ.11 వేల కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో పామాయిల్ సాగు ప్రోత్సాహం కోసం రూ.11 వేల కోట్లు కేటాయించినట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ తెలిపారు. రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. దేశంలో వంట నూనెల అందుబాటును విస్తృతం చేసేందుకు నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్–ఆయిల్ పామ్ (ఎన్ఎంఈవో) పథకాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. దేశంలో 27.99 లక్షల హెక్టార్లు పామాయిల్ సాగుకు అనుకూలంగా ఉన్నట్లు ఐసీఏఆర్ ఆధ్వర్యంలోని కమిటీ అంచనా వేసిందని తెలిపారు. క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి, సాగు విస్తీర్ణం గణనీయంగా పెంచి వంటనూనెల దిగుమతి వల్ల పడుతున్న భారాన్ని తగ్గించుకునేందుకు ఎన్ఎంఈవో బృహత్తర కార్యాచరణను అమలు చేస్తోందన్నారు. అంతర్జాతీయ ధరల్లో హెచ్చు తగ్గుల నుంచి పామాయిల్ రైతులను కాపాడేందుకు వీలుగా గిట్టుబాటు ధర విధానాన్ని ప్రవేశపెట్టినట్లు మంత్రి చెప్పారు. ఏపీలో 40 ఎఫ్‌సీఐ వేర్‌హౌస్‌లు ఆంధ్రప్రదేశ్‌లో ఎఫ్సీఐకు చెందిన సొంత, అద్దె గోదాములు 40 ఉన్నాయని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలశాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్చౌబే తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. ఎఫ్‌సీఐ, రాష్ట్ర ఏజెన్సీలు నిర్వహిస్తున్న వేర్‌హౌస్‌లు సెంట్రల్‌పూల్ స్టాక్‌కు సరిపోతాయని చెప్పారు. ఏపీ ప్రతిపాదనలకు అనుమతి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్వై)లో ఏపీ పంపిన ప్రతిపాదనలను అనుమతించామని కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాలా తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. రూ.657.11 కోట్ల పనులకు అనుమతించి ఇప్పటివరకు రూ.108.95 కోట్లు విడుదల చేశామని చెప్పారు. వైఎస్సార్సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన మరో ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ, ఓడరేవుల్లో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంతోపాటు ఫిష్ రిటైల్ హబ్ తదితర పనులకు అనుమతి ఇచ్చినట్లు వివరించారు. పీపీపీ పద్ధతిలో ఎంవీయూలు పశువుల సంరక్షణ నిమిత్తం సేవలు నేరుగా రైతుల ఇంటివద్దే అందించేలా మొబైల్ వెటర్నరీ యూనిట్లను (ఎంవీయూలను) పబ్లిక్, ప్రైవేటు పార్టనర్షిప్ (పీపీపీ) పద్ధతిలో తీసుకొచ్చినట్లు కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాలా తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మౌలికసదుపాయాలను, ఏజెన్సీలు (కోఆపరేటివ్, మిల్క్ యూనియన్లు) మానవ వనరులను ఏర్పాటు చేస్తాయని వైఎస్సార్సీపీ ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. లబ్ధిదారుల్ని పెంచాలని ఏపీ కోరింది జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ)లో లబ్ధిదారుల సంఖ్యను గ్రామీణ ప్రాంతంలో 75, పట్టణ ప్రాంతంలో 50 శాతానికి పెంచాలని ఏపీ ప్రభుత్వం కోరిందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలశాఖ మంత్రి పీయూష్ గోయెల్ తెలిపారు. బీజేపీ సభ్యుడు జి.వి.ఎల్.నరసింహారావు ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. 2011 జనాభా లెక్కలననుసరించి ఏపీలోని గ్రామీణ ప్రాంతాల్లో 60.96 శాతం, పట్టణ ప్రాంతాల్లో 41.14 శాతం లబ్ధిదారుల్ని గుర్తించినట్లు చెప్పారు. -
కనీస మద్దతు ధరపై కమిటీ
న్యూఢిల్లీ: పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)పై కమిటీని ఏర్పాటు చేసే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ శుక్రవారం రాజ్యసభలో ప్రకటించారు. కమిటీ విషయంలో అనుమతి కోసం ఎన్నికల సంఘానికి లేఖ రాశామని, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాతే ఈ కమిటీని తీసుకురావాలని ఎన్నికల సంఘం సూచించిందని అన్నారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన అనుబంధ ప్రశ్నకు తోమర్ సమాధానమిచ్చారు. ఎంఎస్పీకి రూ.2.37 లక్షల కోట్లు గత ఏడేళ్లలో మద్దతు ధరతో పంటల కొనుగోలు రెండింతలు పెరిగిందన్నారు. ప్రస్తుత బడ్జెట్లో ఇందుకోసం రూ.2.37 లక్షల కోట్లు కేటాయించామన్నారు. రైతుల సంక్షేమం కోసం కేంద్రం కృషి చేస్తోందని, పీఎం–కిసాన్ పథకంతోపాటు ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లు ఏర్పాటు చేస్తోందని వివరించారు. రైతుల నుంచి వరి, గోధుమలను కనీస మద్దతు ధరతో మరింత అధికంగా కొనుగోలు చేస్తామని అన్నారు. తృణధాన్యాలు, నూనె గింజలు సైతం కనీస మద్దతు ధరతో సేకరిస్తామని పేర్కొన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పప్పుగింజలను ప్రజలకు సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలు కోరితే అందుకు అనుమతి మంజూరు చేస్తామని నరేంద్రసింగ్ తోమర్ వెల్లడించారు. కనీస మద్దతు ధర విషయంలో ప్రభుత్వం హామీని నిలబెట్టుకోవడం లేదని సంయుక్త కిసాన్ మోర్చా ఆరోపించింది. యూపీ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని రైతులకు పిలుపునిచ్చింది. -
మిర్చి రైతులను ఆదుకోండి
సాక్షి, న్యూఢిల్లీ/నరసరావుపేట: ఆంధ్రప్రదేశ్‌లో నష్టపోయిన మిరప రైతుల్ని ఆదుకోవాలని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌కు వైఎస్సార్సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు విజ్ఞప్తి చేశారు. ఆయన గురువారం న్యూఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. గుంటూరు మిర్చి సుమారు రూ.5 వేల కోట్లకు పైగా టర్నోవర్‌తో 40కి పైగా దేశాలకు ఎగుమతి అవుతోందని తెలిపారు. ఈ సీజన్లో రికార్డు స్థాయిలో 1.4 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇటీవల రెండు తుపాన్లతో విస్తృతంగా పంట నష్టం జరిగిందన్నారు. 14 వేల హెక్టార్లకుపైగా విస్తీర్ణంలోని పంటపై నల్లతామర తెగులు ప్రభావం చూపిందని, సుమారు రూ.500 కోట్ల నష్టం వచ్చిందని తెలిపారు. పురుగు ఎందు కు ఆశిస్తోందో అధ్యయనం చేసి నివారణ చర్యల గురించి రైతులకు మార్గనిర్దేశం చేయడానికి నిపుణుల బృం దాన్ని పంపాలని, నల్లతామర ప్రభావం తగ్గించడానికి అవసరమైన పురుగుమందులను ఏపీ ప్రభుత్వానికి అందించాలని విజ్ఞప్తి చేశారు. గుంటూరు జిల్లాలో పీఎం ఫసల్ బీమా యోజన సార్వత్రిక కవరేజీ ముందస్తుగా నిర్ధారించాలని కోరారు. నేషనల్ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా నష్టపోయిన పంటను సేకరించాలని విజ్ఞప్తి చేశారు. కమిటీ ఏర్పాటు చేసిన కేంద్రం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చేసిన అభ్యర్థనను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం గురువారం ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. న్యూఢిల్లీలోని ఐసీఏఆర్–ఎన్‌సీఐపీఎం సైంటిస్టు డాక్టర్ కె.రాఘవేంద్ర, బెంగళూరుకు చెందిన ఎంట మాలజీ సైంటిస్టు డాక్టర్ రచనారుమాణీ, ఫరీదా బాద్‌కు చెందిన డాక్టర్ ఒ.పి.వర్మ, విజయవాడ సీఐపీఎంఈ డిప్యూటీ డైరెక్టర్ ఎం.పి.గోస్వామి, రాష్ట్ర ఉద్యానవనశాఖ అధికారిని నియమించింది. -
పామాయిల్ రంగంలో స్వావలంబనే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: వంట నూనెలలో స్వావలంబనే తమ లక్ష్యమని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు. ‘వంట నూనె– ఆయిల్ పామ్ జాతీయ మిషన్ బిజినెస్ సమిట్’ను హైదరాబాద్‌లో మంగళవారం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. పామాయిల్ రంగంలో దేశం స్వావలంబన సాధించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, ఈ జాతీయమిషన్‌కు వనరుల కొరత ఉండబోదని తెలిపారు. ప్రస్తుతం సుమారు 3 లక్షల హెక్టార్ల భూమి పామాయిల్ సాగులో ఉండగా, ఆయిల్ పామ్ సేద్యానికి అనువుగా ఉన్న 28 లక్షల హెక్టార్ల భూమిని సాగులోకి తీసుకురావడం తమ లక్ష్యమన్నారు. పామాయిల్ ఉత్పత్తిని పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం చేసిన కృషిని ఆయన ప్రశంసించారు. ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి పిలుపునిచ్చారు. కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి కైలాశ్ చౌదరి మాట్లాడుతూ మనం వంట నూనె దిగుమతి చేసుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేరళ వ్యవసాయశాఖ మంత్రి పి.ప్రసాద్ మాట్లాడుతూ ఆయిల్ పామ్‌ను ప్రోత్సహించడానికి కేరళ ప్రభు త్వం కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు చెప్పారు. 30 లక్షల ఎకరాలు ఆయిల్‌పాం: నిరంజన్‌రెడ్డి తెలంగాణలో పంటల మార్పిడిని ప్రోత్సహిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం 30 లక్షల ఎకరాలు ఆయిల్‌పాం లక్ష్యంగా పెట్టుకుందని, నేషనల్ మిషన్ ఆఫ్ ఎడిబుల్ ఆయిల్స్ – ఆయిల్‌పామ్ కింద కేంద్ర ప్రభుత్వం ఆమోదించి నిధులు కేటాయించాలని ఆయన కోరారు. ఆయిల్ పామ్ ఫ్రెష్ ఫ్రూట్ బంచ్ (ఎఫ్‌ఎఫ్‌బీ) టన్నుకు రూ. 15 వేలు కనీస ఖచ్చితమైన ధర నిర్ణయించి ఆయిల్ పామ్ సాగుకు రైతులను ప్రోత్సహించాలని, అందుకు అవసరమయ్యే బిందు సేద్యం యూనిట్ ధరను పెంచి విస్తీర్ణ పరిమితిని ఎత్తేయాలని కోరుతూ కేంద్ర మంత్రి తోమర్‌కు వినతిపత్రం అందజేశారు. తెలంగాణలో ఆయిల్‌పామ్ సాగుకు పూర్తి సహకారం అందిస్తామని తోమర్ హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ మాట్లాడుతూ, 3–4 సంవత్సరాలలో తెలంగాణ దేశంలోనే అతిపెద్ద ఆయిల్ పామ్ ఉత్పత్తి ప్రాంతంగా ఆవిర్భవిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతు ఉత్పత్తి సంస్థల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల పంపిణీ కూడా జరిగింది. అంతకుముందు కేంద్ర వ్యవసాయ కార్యదర్శి సంజయ్ అగర్వాల్ ప్రభుత్వ దార్శనికతను వివరించారు. -
కేంద్రమంత్రి యూ టర్న్..‘ ఆ చట్టాలు మళ్లీ తెచ్చే ప్రశ్నే లేదు’
న్యూఢిల్లీ: అత్యంత వివాదాస్పదమైన మూడు వ్యవసాయ చట్టాలపై కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాట మార్చారు. ఇటీవల ప్రధాని మోదీ ప్రకటన తర్వాత పార్లమెంట్ సాక్షిగా రద్దయిన సాగు చట్టాలను భవిష్యత్‌లో అమల్లోకి తెస్తామని నర్మగర్భంగా మాట్లాడిన మంత్రి రెండ్రోజులకే యూ టర్న్ తీసుకున్నారు. ఉపసంహరించుకున్న ఆ చట్టాలను మళ్లీ తెచ్చే యోచన లేదని ఆయన ఆదివారం స్పష్టంచేశారు. మహరాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఒక వ్యవసాయ సంబంధ కార్యక్రమంలో శుక్రవారం తాను మాట్లాడిన మాటలను వక్రీకరించారని, అసలు ఈ గందరగోళానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ వ్యవసాయ కార్యక్రమంలో నేను మాట్లాడింది వేరు. ‘రైతుల ఆందోళనల నేపథ్యంలో ఆ వ్యవసాయ చట్టాలపై వెనక్కి తగ్గాం. రైతు సంక్షేమం విషయంలో ముందడుగు వేస్తాం’ అని మాత్రమే నేను అన్నాను. చట్టాల విషయంలో కాదు. ఆ చట్టాలను మళ్లీ తెచ్చే యోచన మోదీ సర్కార్‌కు ఎంత మాత్రం లేదు’’ అని తోమర్ వివరణ ఇచ్చారు. ‘ రైతు సంక్షేమానికి మేలుబాటలు పరుస్తూ 2006లో స్వామినాథన్ కమిటీ ఇచ్చిన నివేదికను అమలు చేయడంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. రైతులను పట్టించుకోని వారు తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకే ఇప్పుడు ఇలా గందరగోళాన్ని సృష్టిస్తున్నారు’ అని కాంగ్రెస్‌పై తోమర్ ఆరోపణలు గుప్పించారు. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక ఆ చట్టాల తరహాలో కొత్త చట్టాలను తేవాలని మోదీ సర్కార్ యోచిస్తోందని కాంగ్రెస్ విమర్శించడం తెల్సిందే. ఎన్నికల తర్వాత దొడ్డిదారిన తెస్తారు: కాంగ్రెస్ రద్దు చేసిన వ్యవసాయ చట్టాలను దొడ్డిదారిన తిరిగి తెచ్చేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. వచ్చే ఏడాది కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక బీజేపీ ప్రభుత్వం ఈ పనికి పూనుకుంటుందని పేర్కొంది. అందుకే, ఎన్నికల్లో బీజేపీని ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చింది. -
కేటీఆర్ కౌంటర్ ట్వీట్
Telangana Minister KTR Counter Tweet On Agri Minister Farm Laws Bring Comments: సాగు చట్టాల రద్దుపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ యూటర్న్ ప్రకటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. సవరణలతో చట్టాలను ఎలాగైనా తెచ్చితీరతామంటూ తోమర్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు ఎక్కుపెడుతున్నాయి ప్రతిపక్షాలు. ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విటర్ ద్వారా స్పందించారు. గౌరవనీయులైన ప్రధాని క్షమాపణలు, సాగుచట్టాల రద్దు,.. కేవలం ఎన్నికల స్టంటే అనుకోవాల్సిందేనా? అని ప్రశ్నించారు కేటీఆర్. ప్రధాని నరేంద్రగారేమో(మోదీ) చట్టాల్ని రద్దు చేశామని చెప్తున్నారు.. వ్యవసాయ మంత్రి నరేంద్రగారేమో(తోమర్) ప్రతిపాదన వ్యాఖ్యలు చేస్తున్నారు’’ అంటూ సెటైర్ వేశారు. బీజేపీ రాజకీయాలు, ఆ ప్రభుత్వం పట్ల దేశ రైతులంతా అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ సూచించారు. I guess the apology of Hon’ble PM and subsequent repeal of Farm laws was all an election stunt then?! PM Narendra Ji disposes and Agri Minister Narendra Ji re proposes! Classic 👏 Indian farmers need to be wary of the politics of BJP and it’s Govt’s #AntiFarmerLaws https://t.co/FyXjmVGazI — KTR (@KTRTRS) December 25, 2021 సంబంధిత వార్త: వ్యవసాయం చట్టం తెచ్చి తీరతాం.. నరేంద్ర సింగ్ తోమర్ -
వ్యవసాయ చట్టాల్ని మళ్లీ తీసుకొస్తాం : నరేంద్ర సింగ్ తోమర్
-
సాగుచట్టాలు మళ్లీ తెస్తాం.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు
దాదాపు ఏడాదిపాటు సాగిన రైతు ఉద్యమం, రెండు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వం.. వ్యవసాయ చట్టాల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించిన తెలిసిందే. అయితే ఈ నిర్ణయం ప్రకటించిన కొద్దిరోజులకే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగ్‌పూర్(మహారాష్ట్ర)లో శుక్రవారం అగ్రో విజన్ ఎక్స్‌పోలో పాల్గొన్న వ్యవసాయం మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.. సాగు చట్టాల్ని మళ్లీ తీసుకొచ్చేందుకు ప్రయత్నస్తున్నట్లు తెలిపారు. కొన్ని మార్పులతో వ్యవసాయ చట్టాల్ని మళ్లీ తీసుకొస్తాం అని వ్యాఖ్యానించారాయన. కొందరి వల్లే చర్చకు కూడా నోచుకోకుండా చట్టాలు వివాదాస్పదం అయ్యాయి. కేంద్రం వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. అందుకే కొన్ని మార్పులు చేసి మళ్లీ వ్యవసాయ చట్టాలు తీసుకొస్తాం. ఒక అడుగు వెనక్కి వేశామంటే.. మూడు అడుగులు ముందుకు వేస్తాం. వ్యవసాయ చట్టాల్ని మళ్లీ తెచ్చి తీరుతాం అని ఉద్ఘాటించారాయన. Will farm laws make a come-back??? Union agri minister Narendra Tomar @nstomar drops hint during the inauguration of Agro Vision Expo in Nagpur on Friday. @ndtv pic.twitter.com/HDvateXQ6h — Mohammad Ghazali (@ghazalimohammad) December 25, 2021 రైతులు దేశానికి వెన్నెముక. అలాంటి రైతుల కోసం ప్రధాని మోదీ ఎంతో చేశారు. 70 ఏళ్లలో దేశానికి ఎవరూ చేయలేనంత చేసి చూపించారు అని ప్రధాని మోదీపై ప్రశంసలు గుప్పించారు తోమర్. ఇదిలా ఉంటే స్వయంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ మూడు సాగు చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. సిక్కు మత వ్యవస్థాపకుడు గురు నానక్ జయంతి సందర్భంగా.. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగిస్తున్న ఆందోళనను ఇక విరమించాలని, ఇళ్లకు తిరిగి వెళ్లాలని రైతులకు విజ్ఞప్తి చేశారు ప్రధాని. సాగు చట్టాల ఉపసంహరణకు కేబినెట్ ఆమోదం తెలపగా.. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ఆమోదం, వెనువెంటనే సాగు చట్టాల రద్దు బిల్లుపై రాష్ట్రపతి ముద్ర పడింది. చదవండి: రైతు ధర్మాగ్రహ విజయం -
పూల ఉత్పత్తిలో ఏపీది మూడోస్థానం
సాక్షి, న్యూఢిల్లీ: ముందస్తు అంచనాల ప్రకారం 2020–21లో ఆంధ్రప్రదేశ్ దేశంలోని మూడో అతిపెద్ద పూల ఉత్పత్తిదారుగా ఉందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చెప్పారు. లోక్‌సభలో మంగళవారం వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్ ప్రశ్నకు ఆయన జవాబిచ్చారు. 2020–21లో ఆంధ్రప్రదేశ్‌లో 19.84 వేల హెక్టార్లలో 406.85 వేల టన్నుల పూల ఉత్పత్తి జరిగినట్లు అంచనా వేశారని తెలిపారు. 2020–21లో దేశంలో మొత్తం పూల ఉత్పత్తిలో 15.62 శాతం ఆంధ్రప్రదేశ్ అందించిందన్నారు. దేశంలోని ప్రధాన పుష్పాలను ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అత్యధిక ఉత్పత్తిని కలిగి ఉందని చెప్పారు. 35 వ్యవసాయ అటవీ నమూనాల అభివృద్ధి సబ్మిషన్ ఆన్ ఆగ్రోఫారెస్ట్రీ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో 567.65 హెక్టార్లను ఆగ్రోఫారెస్ట్రీ కిందకు తెచ్చినట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. రైతుల ప్రయోజనం కోసం వివిధ వ్యవసాయ పర్యావరణ ప్రాంతాలు, భూ వినియోగ పరిస్థితులకు అనువైన 35 వ్యవసాయ అటవీ నమూనాలను అభివృద్ధి చేసినట్లు చెప్పారు. ఏపీలో 3 మెగా ఫుడ్ పార్కులు ఆంధ్రప్రదేశ్‌లో 3 మెగా ఫుడ్ పార్కులు, 28 కోల్డ్ చైన్ ప్రాజెక్ట్‌లు, 1 ఆగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్, 4 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, 1 ఆపరేషన్ గ్రీన్స్ ప్రాజెక్ట్, 4 ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీలను ఇప్పటికే ఆమోదించినట్లు కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్‌శాఖ సహాయమంత్రి ప్రహ్లాద్‌సింగ్ పటేల్ తెలిపారు. ప్రతి జిల్లాలో ఒక ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ద్వారా నిర్వహించే మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్‌ను కేంద్ర ప్రాయోజిత ఫార్మలైజేషన్ ద్వారా ప్రతి జిల్లాలో ఒక ఇంక్యుబేషన్ సెంటర్, ఒక నైపుణ్య అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ యోచిస్తోందని వైఎస్సార్సీపీ ఎంపీ బాలశౌరి ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 16.8 లక్షలమంది పాల ఉత్పత్తిదారులకు మార్కెట్ యాక్సెస్ పాల ఉత్పత్తిదారుల నికర రోజువారీ ఆదాయం రూ.25.52 పెరగడంతోపాటు కిలో పాలకు దాణా ఖర్చును తగ్గించడంలో జాతీయ డెయిరీ ప్రణాళిక దశ–1 దోహదపడిందని కేంద్ర పాడిపశుసంవృద్ధిశాఖ మంత్రి పురుషోత్తమ్ రూపాలా తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ఈ ప్రాజెక్టులో అదనంగా నమోదు చేసుకున్న 16.8 లక్షల మంది పాల ఉత్పత్తిదారులకు మార్కెట్ యాక్సెస్ అందించినట్లు పేర్కొన్నారు. అందులో 7.65 లక్షల మంది మహిళా సభ్యులున్నారని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ 97 వేల గ్రామాల్లో 59 లక్షలమంది లబ్ధిదారులను కవర్ చేసిందని చెప్పారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ కింద అభివృద్ధి శ్యామాప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ కింద దేశంలోని 28 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాల్లో 109 గిరిజన సమూహాలు, 191 గిరిజనేతర క్లస్టర్లలో అభివృద్ధి వివిధ దశల్లో ఉందని వైఎస్సార్సీపీ ఎంపీ తలారి రంగయ్య ప్రశ్నకు సమాధానంగా కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ సహాయమంత్రి సాధ్వి నిరంజన్‌జ్యోతి తెలిపారు. రూ.27,788.44 కోట్ల ప్రతిపాదిత పెట్టుబడితో 300 రూర్బన్ క్లస్టర్లలో 291 ఇంటిగ్రేటెడ్ క్లస్టర్ యాక్షన్ ప్లాన్లు అభివృద్ధి చేశామని చెప్పారు. 6.50 లక్షల నీటిసేకరణ నిర్మాణాలు జాతీయ మిషన్ ఫర్ సస్టెయినబుల్ అగ్రికల్చర్ కింద వర్షాధార ప్రాంత అభివృద్ధి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ తెలిపారు. ఇప్పటివరకు ప్రధానమంత్రి కృషి సించాయి యోజనలోని వాటర్‌షెడ్ డెవలప్మెంట్ కాంపోనెంట్ కింద దాదాపు 6.50 లక్షల నీటిసేకరణ నిర్మాణాలు సృష్టించినట్లు వైఎస్సార్సీపీ ఎంపీ వంగా గీత ప్రశ్నకు ఆయన జవాబుగా చెప్పారు. స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్ యోజన కింద ప్రారంభించిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ పథకాన్ని ప్రస్తుతం దేశంలో 250 జిల్లాల్లో అమలు చేస్తున్నామనికేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు అందిస్తున్న వైఎస్సార్ సున్నా వడ్డీ పథకంలాంటి దాన్ని అమలు చేసే ఆలోచన కేంద్రానికి ఉందా అని ఎంపీ వంగా గీత అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. స్పెషల్ స్టేటస్ ఇవ్వాలన్న ప్రతిపాదన అందింది ఆంధ్రప్రదేశ్, మరికొన్ని రాష్ట్రాల నుంచి ప్రత్యేక కేటగిరీ హోదా ఇవ్వాలన్న ప్రతిపాదన కేంద్రానికి అందిందని, అయితే 14వ ఆర్థికసంఘం రాష్ట్రాల మధ్య పంచుకోదగిన పన్నుల సమాంతర పంపిణీలో సాధారణ కేటగిరీ రాష్ట్రాలు, ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాల మధ్య వ్యత్యాసాన్ని చూపలేదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ తెలిపారు. టీఆర్ఎస్ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. 14వ ఆర్థికసంఘం సిఫార్సుల ప్రకారం 2015–20 కాలానికి రాష్ట్రాలకు నికర భాగస్వామ్య పన్నుల వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని వెనుకబడిన ప్రాంతాల్లో పారిశ్రామిక సంస్థల ఏర్పాటును ప్రోత్సహించేందుకు 2015 ఆర్థిక చట్టం ప్రకారం ఆదాయపన్నుకు సంబంధించి పన్ను ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు తెలిపారు. -
సాగు చట్టాల ఉపసంహరణ బిల్లు రేపే
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించినట్లుగా మూడు నూతన వ్యవసాయ చట్టాల ఉపసంహరణకు రంగం సిద్ధమయ్యింది. ఈ చట్టాల ఉపసంహరణకు ఉద్దేశించిన కొత్త బిల్లును కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తొలిరోజే దిగువ సభలో ప్రవేశపెట్టే బిల్లుల జాబితాలో ఈ కొత్త బిల్లును అధికారులు చేర్చారు. సాగు చట్టాల ఉపసంహరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఆమోదం తెలియజేసింది. ‘‘మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కేవలం కొందరు రైతులు మాత్రమే నిరసన వ్యక్తం చేస్తున్నారు. సమగ్రాభివృద్ధి కోసం అందరినీ కలుపుకొని వెళ్లాల్సి ఉంది’’ అని బిల్లులో ప్రభుత్వం పేర్కొంది. ఈ నెల 29న లోక్‌సభకు కచ్చితంగా హాజరు కావాలని అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. వివాదాస్పద సాగు చట్టాలను ప్రభుత్వం వెనక్కి తీసుకున్నంత మాత్రాన సరిపోదని, తమ డిమాండ్లను నెరవేర్చేదాకా పోరాటం కొనసాగిస్తామని రైతు సంఘాలు తేల్చిచెబుతున్నాయి. ట్రాక్టర్ల ర్యాలీ రద్దు ఈ నెల 29వ తేదీన పార్లమెంట్ వరకూ తలపెట్టిన ట్రాక్టర్ల ర్యాలీని రద్దు చేసినట్లు సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) నేత దర్శన్ పాల్ శనివారం ప్రకటించారు. తమ డిమాండ్లపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశామని, ప్రతిస్పందన కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. డిసెంబర్ 4న రైతు సంఘాలతో సమావేశం నిర్వహించి, భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని తెలిపారు. ముంబైలో ఆదివారం సంయుక్త షెట్కారీ కామ్‌గార్ మోర్చా(ఎస్ఎస్కేఎం) ఆధ్వర్యంలో కిసాన్–మజ్దూర్ మహాపంచాయత్ నిర్వహించనున్నారు. 100కు పైగా రైతు, కార్మిక సంఘాలు పాల్గొననున్నాయి. రైతుల త్యాగాలను కించపరుస్తారా?: కాంగ్రెస్ వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లులో కేంద్ర ప్రభుత్వం ప్రస్తావించిన ‘అభ్యంతరాలు, కారణాలు’ అనే పదాల పట్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మనీష్ తివారీ విమర్శలు గుప్పించారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిగా కొనసాగుతున్న పోరాటంలో మరణించిన 750 మంది రైతుల త్యాగాలను ప్రభుత్వం కించపరుస్తోందని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన శనివారం ట్వీట్ చేశారు. రైతులకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పారని గుర్తుచేశారు. 750 మంది రైతులు మరణిస్తే, కేవలం కొందరే ఈ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారని ప్రభుత్వం చెప్పడం ఏమిటని నిలదీశారు. పంట వ్యర్థాల దహనం నేరం కాదు కేసుల ఉపసంహరణపై రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవాలి: కేంద్రం రైతాంగం డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ తెలిపారు. పంట వ్యర్థాలను దహనం చేయడాన్ని నేరంగా పరిగణించరాదంటూ రైతులు చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం అంగీకరిస్తున్నట్లు వెల్లడించారు. ఇక ఆందోళన విరమించాలని కోరారు. పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ), పంటల వైవిధ్యంపై చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రైతుల డిమాండ్లపై ప్రధాని మోదీ హామీ మేరకు ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. సాగు చట్టాల వ్యతిరేక పోరాటంలో పాల్గొన్న రైతులపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించే అంశం రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనే ఉందని అన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. రైతులకు నష్టపరిహారం చెల్లిండంపైనా రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవాలన్నారు. మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాతా రైతులు ఆందోళన కొనసాగించడంలో అర్థం లేదన్నారు. రైతన్నలు పెద్ద మనసు చేసుకొని, పోరాటం ఆపేసి, ఇళ్లకు తిరిగి వెళ్లాలని తోమర్ విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ చట్టాల వల్ల దక్కే ప్రయోజనాల గురించి కొందరు రైతులను ఒప్పించలేకపోయామని, ఈ విషయంలో తమకు అసంతృప్తి ఉన్న మాట నిజమేనని అంగీకరించారు. -
కుంకుమ పువ్వుకు రెట్టింపు ధర లభిస్తోంది
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ చర్యల కారణంగా దేశంలోని వేలాదిమంది రైతుల ఆదాయం రెట్టింపు అయిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. ‘ఇటీవల జమ్మూ, కశ్మీర్ పర్యటన సందర్భంగా ‘కుంకుమ పువ్వు’ల సాగు కేంద్రంలో ఓ రైతు నాతో మాట్లాడుతూ గతంలో తమకు కిలో కుంకుమపువ్వుకు రూ.లక్ష వరకూ అందేదని, ‘కేసర్ పార్క్’ఏర్పాటైన తరువాత, సాగు, మార్కెటింగ్‌లలో సాంకేతిక పరిజ్ఞానాన్ని చేర్చిన తరువాత రెట్టింపు ధర లభిస్తోందని ఆనందం వ్యక్తం చేశార’ని మంత్రి తెలిపారు. అంతర్జాతీయ చిరుధాన్య సంవత్సరం (2023) వేడుక సన్నాహకాల్లో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. లావు బియ్యం కొనుగోలు చేస్తారా? లేదా? అని విలేకరులు అడగ్గా.. ‘‘ఎఫ్‌సీఐ ద్వారా సేకరించే బియ్యం మళ్లీ ప్రజలకే పంచుతున్నాం. ఈ క్రమంలో సేకరించే బియ్యం నాణ్యమైందా? కాదా? అన్నది చూస్తాం. ప్రజలకు నాణ్యమైన బియ్యం పంపిణీ చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం’’అని అన్నారు. చిరుధాన్యాలను ప్రజాపంపిణీ వ్యవస్థలో చేర్చే ప్రయత్నం చేస్తారా? అన్న ప్రశ్నపై మాట్లాడుతూ ‘‘రాష్ట్ర ప్రభుత్వం చిరుధాన్యాలను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందరికీ సరఫరా చేయాలని నిర్ణయిస్తే, కేంద్రం అనుమతి పొందితే తాము సేకరించేందుకు సిద్ధమే’’అని తెలిపారు. చదవండి: సోనూసూద్‌పై ఐటీ దాడులు మరింత ఉధృతం -
వేలాదిమంది రైతుల ఆదాయం రెట్టింపు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ చర్యల కారణంగా దేశంలోని వేలాదిమంది రైతుల ఆదాయం రెట్టింపు అయిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. ‘ఇటీవల జమ్మూ, కశ్మీర్ పర్యటన సందర్భంగా ‘కుంకుమ పువ్వు’ల సాగు కేంద్రంలో ఓ రైతు నాతో మాట్లాడుతూ గతంలో తమకు కిలో కుంకుమపువ్వుకు రూ.లక్ష వరకూ అందేదని, ‘కేసర్ పార్క్’ఏర్పాటైన తరువాత, సాగు, మార్కెటింగ్‌లలో సాంకేతిక పరిజ్ఞానాన్ని చేర్చిన తరువాత రెట్టింపు ధర లభిస్తోందని ఆనందం వ్యక్తం చేశార’ని మంత్రి తెలిపారు. అంతర్జాతీయ చిరుధాన్య సంవత్సరం (2023) వేడుక సన్నాహకాల్లో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. లావు బియ్యం కొనుగోలు చేస్తారా? లేదా? అని విలేకరులు అడగ్గా.. ‘‘ఎఫ్‌సీఐ ద్వారా సేకరించే బియ్యం మళ్లీ ప్రజలకే పంచుతున్నాం. ఈ క్రమంలో సేకరించే బియ్యం నాణ్యమైందా? కాదా? అన్నది చూస్తాం. ప్రజలకు నాణ్యమైన బియ్యం పంపిణీ చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం’’అని అన్నారు. చిరుధాన్యాలను ప్రజాపంపిణీ వ్యవస్థలో చేర్చే ప్రయత్నం చేస్తారా? అన్న ప్రశ్నపై మాట్లాడుతూ ‘‘రాష్ట్ర ప్రభుత్వం చిరుధాన్యాలను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందరికీ సరఫరా చేయాలని నిర్ణయిస్తే, కేంద్రం అనుమతి పొందితే తాము సేకరించేందుకు సిద్ధమే’’అని తెలిపారు. -
మా ‘భరోసా’కు తోడు మీ సాయం కావాలి
సాక్షి, అమరావతి: ‘మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చాం. మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. విత్తు నుంచి విపణి వరకు రైతులకు అండగా నిలిచేందుకు గ్రామస్థాయిలో రైతుభరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) ఏర్పాటు చేశాం. రైతు ముంగిట (ఫామ్‌గేట్) పెద్దఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. కరోనా కష్టకాలంలో ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా వారు పండించిన ఉత్పత్తులను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి వారికి అండగా నిలిచాం. గడిచిన రెండేళ్లలో రైతులకు రూ.83 వేల కోట్ల సాయమందించాం. పొరుగు రాష్ట్రాలు కూడా ఇక్కడ అమలు చేస్తున్న కార్యక్రమాలను అధ్యయనం చేస్తున్నాయి. మీరు కూడా ఒక్కసారి మా రాష్ట్రానికి వచ్చి చూడండి.. రైతుల కోసం మా ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పని చేస్తుందో అర్థమవుతుంది. కేంద్రం నుంచి మీరు ఇతోధికంగా సాయమందిస్తే రైతుల సంక్షేమం కోసం మరిన్ని కార్యక్రమాలు అమలు చేసేందుకు తోడ్పడుతుంది..’ అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ నిర్వహించిన జాతీయస్థాయి వర్చువల్ సమీక్షలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తరఫున మంత్రి కన్నబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయిలో ఏర్పాటు చేసిన 10,778 ఆర్బీకేల ద్వారా సర్టిఫై చేసిన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. రైతులు పండించే ప్రతి పంటను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నామన్నారు. అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ద్వారా ఆర్బీకే స్థాయిలో కస్టమ్ హైరింగ్ సెంటర్లు, కంబైన్డ్ హార్వెస్టింగ్ సెంటర్లతో పాటు మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్ల ద్వారా పెద్దఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు. కొనుగోలు చేసే ఉత్పత్తుల కోసం గ్రామస్థాయిలోనే రూ.1,534.75 కోట్లతో 2,543 గోదాములతోపాటు మరో రూ.269 కోట్లతో వివిధరకాల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. వీటికి సంబంధించి టెండర్లు తుదిదశలో ఉన్నాయన్నారు. ఆయిల్‌పామ్ సాగు, దిగుబడిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్ 1గా ఉందని చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత పొరుగు రాష్ట్రాల కంటే మిన్నగా రైతులకు ఆర్థిక చేయూతనిస్తున్నట్లు తెలిపారు. రూ.80 కోట్లకుపైగా ఇన్సెంటివ్ రూపంలో అందించామన్నారు. ఆయిల్‌పామ్ విస్తరణ కోసం కేంద్రం ప్రకటించిన పాలసీ చాలా బాగుందన్నారు. అది తమ రాష్ట్రంలో ఆయిల్‌పామ్ విస్తరణకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ‘ఒక్కసారి మా రాష్ట్రానికి రండి.. మా ప్రభుత్వానికి చేయూతనివ్వండి..’ అని మంత్రి కన్నబాబు కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. -
గత రెండేళ్లలో రైతులకు రూ.83వేల కోట్ల సాయమందించాం: కన్నబాబు
సాక్షి, అమరావతి: వ్యవసాయ అనుబంధ రంగాలపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి నరేంద్రసింగ్ తోమర్ నిర్వహించిన జాతీయ స్థాయి వర్చువల్ సమీక్షలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తరపున మంత్రి కన్నబాబు పాల్గొన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో తీసుకున్న చర్యల గురించి కన్నబాబు ఈ సమావేశంలో వివరించారు. (చదవండి: రైతులకు రెట్టింపు ఆదాయం) ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ.. ‘‘వ్యవసాయ రంగానికి చేయూతనివ్వండి. కరోనా వేళ పెద్ద ఎత్తున ఉత్పత్తులను కొనుగోలు చేశాం. రైతు ముంగిట మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. గడిచిన రెండేళ్లలో రైతులకు రూ.83వేల కోట్ల సాయమందించాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు సంక్షేమానికి గడిచిన రెండేళ్లలో అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు’’ అని తెలిపారు.(చదవండి: లోకేశ్.. పిచ్చి ప్రేలాపనలు వద్దు) ‘‘గ్రామ స్థాయిలో ఆర్బీకేలు ఏర్పాటు చేసాం. పెద్దఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. కరోనా కష్టకాలంలో ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా కనీస మద్దతు ధరకు వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేశాం’’ అని కన్నబాబు తెలిపారు. -
కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీ మిథున్ రెడ్డి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ఎంపీ మిథున్‌రెడ్డి బుధవారం కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌ను కలిశారు. ఈ నేపథ్యంలో.. ఏపీకి ప్రత్యేకంగా యూరియాను కేటాయించాలని విజ్జప్తి చేశారు. అదే విధంగా, ఎఫ్‌బీవోల ఏర్పాటుకు ఏపీఎండీసీ సంస్థను ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీగా గుర్తించాలని కోరారు. కాగా, ఏపీలో జాతీయ వ్యవసాయ వర్శిటీని ఏర్పాటు చేయాలని ఎంపీ మిథున్‌రెడ్డి కోరారు. -
హానికరమైన 27 క్రిమీ సంహారక మందులు నిషేధం
న్యూఢిల్లీ: మనుషులు, జంతువులకు హానికరంగా పరిగణిస్తున్న 27 క్రిమి సంహారక మందుల తయారీ, వినియోగంపై నిషేధం విధించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రకటించారు. రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబు ఇచ్చారు. డాక్టర్ అనుపమ్ వర్మ నేతృత్వంలోని నిపుణుల సంఘం 66 కీటక నాశక మందులు కలిగించే దుష్ప్రభావాలను సమీక్షించిన అనంతరం 12 క్రిమి సంహారక మందులను పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు. మరో 6 క్రిమిసంహారక మందులను క్రమంగా వినియోగం నుంచి తొలగించిందని మంత్రి తోమర్ తెలిపారు. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం 46 క్రిమిసంహారక మందులను నిషేధించడమో లేదా వినియోగం నుంచి తొలగించడమే చేసిందని వివరించారు. 4 క్రిమిసంహారక మందుల ఫార్ములేషన్స్‌ను దిగుమతి, తయారీ, విక్రయాల నుంచి నిషేధించామని, నిషేధించిన 5 క్రిమిసంహారక మందులను కేవలం ఎగుమతి చేయడానికి తయారీకి అనుమతించినట్లు గుర్తుచేశారు. మరో 8 క్రిమిసంహారక మందుల తయారీకి అనుమతించిన రిజిస్ట్రేషన్లను రద్దు చేసినట్లు మంత్రి వెల్లడించారు. డీడీటీని మాత్రం ప్రజారోగ్య కార్యక్రమాల కోసం వినియోగించేందుకు అనుమతిస్తున్నట్లు మంత్రి నరేంద్రసింగ్ స్పష్టం చేశారు. తెలిపారు. క్రిమిసంహారక మందులు విషతుల్యమే అయినప్పటికీ నిర్దేశించిన రీతిలో వాటి వినియోగంతో పర్యావరణానికి ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. క్రిమిసంహారక మందుల భద్రత, సామర్ధ్యం వంటి అంశాలపై నిరంతరం జరిగే అధ్యయనాలు, నివేదికలు, సమాచారం ఆధారంగా నిపుణులు తరచు సమీక్షలు నిర్వహించి ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తుంటాయని మంత్రి చెప్పారు. -
42 లక్షల పీఎం కిసాన్ రైతులకు కేంద్రం భారీ షాక్!
పీఎం కిసాన్ రైతులకు కేంద్రం భారీ షాక్ ఇచ్చింది. పీఎం-కిసాన్ పథకం కింద 42 లక్షల మందికి పైగా అనర్హులైన రైతులకు బదిలీ చేసిన సుమారు రూ.3,000 కోట్లను కేంద్రం రికవరీ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది. పీఎం కిసాన్ పథకం కింద, కేంద్రం ప్రతి ఏడాది రూ.6,000ను దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు మూడు సమాన వాయిదాలలో బదిలీ చేస్తుంది. అయితే ఈ పథకానికి రైతులు అర్హత సాధించాలంటే కొన్ని అర్హతా ప్రమాణాలు ఉన్నాయి. పీఎం కిసాన్ పథకం కింద డబ్బు పొందిన 42.16 లక్షల మంది అనర్హులైన రైతుల నుంచి రూ.2,992 కోట్లు రికవరీ చేయాల్సి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మంగళవారం పార్లమెంటుకు ఇచ్చిన సమాధానంలో అంగీకరించారు. పీఎం కిసాన్ నుంచి అక్రమంగా నగదు పొందిన రైతుల గరిష్ట సంఖ్య అస్సాంలో 8.35 లక్షలుగా ఉంది, తమిళనాడులో - 7.22 లక్షలు, పంజాబ్ - 5.62 లక్షలు, మహారాష్ట్రలో - 4.45 లక్షలు, ఉత్తరప్రదేశ్ లో - 2.65 లక్షలు, గుజరాత్ లో - 2.36 లక్షలు. స్వాధీనం చేసుకోవలసిన డబ్బు అస్సాంలో రూ.554 కోట్లు, పంజాబ్ లో రూ.437 కోట్లు, మహారాష్ట్రలో రూ.358 కోట్లు, తమిళనాడులో రూ.340 కోట్లు, యుపీలో రూ.258 కోట్లు, గుజరాత్ లో రూ.220 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. "ఆధార్, పీఎఫ్ఎంఎస్ లేదా ఆదాయపు పన్ను డేటాబేస్ ఆధారంగా అధికారులు లబ్ధిదారుల డేటాను నిరంతరం చెక్ చేస్తారు. అయితే, వెరిఫికేషన్ ప్రక్రియ సమయంలో ఈ పథకం ప్రయోజనం కొంతమంది ఆదాయపు పన్ను చెల్లిస్తున్న రైతులతో సహా కొంతమంది అనర్హులైన లబ్ధిదారులకు నగదు బదిలీ చేసినట్లు కనుగొన్నట్లు" తోమర్ పార్లమెంటుకు తెలిపారు. పీఎం కిసాన్ నిధులు దుర్వినియోగం కాకుండా చూడటానికి ప్రభుత్వం కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుందని "నిజమైన రైతులకు ప్రయోజనం చేకూర్చడానికి" ఈ పథకాన్ని సక్రమంగా అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. చాలా రాష్ట్రాలు అనర్హులైన రైతుల నుంచి డబ్బులను రికవరీ చేయడానికి నోటీసులు పంపాయి. పీఎం-కిసాన్ లబ్ధిదారుల భౌతిక ధృవీకరణ కోసం ప్రామాణిక కార్యాచరణ మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేసినట్లు తోమర్ పేర్కొన్నారు. -
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ విస్తరణ తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన తొలిసారిగా కేంద్ర కేబినెట్ గురువారం రోజున భేటీ జరిగింది. కేంద్ర కేబినెట్ వ్యవసాయం, హెల్త్ రంగాలపై కీలక నిర్ణయాలను తీసుకుంది. కరోనాను ఎదుర్కొనేందుకు ఎమర్జెన్సీ కింద సుమారు రూ.23,123 కోట్లను కేటాయించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా 736 జిల్లాల్లో పిల్లల చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా స్పష్టం చేశారు. అంతేకాకుండా కొత్తగా 20వేల ఐసీయూ పడకలు అందుబాటులోకి వచ్చాయని మన్సుఖ్ మాండవియా పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 4,17,396 ఆక్సిజన్ పడకలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు . జిల్లాస్థాయిలో 10వేల లీటర్ల ఆక్సిజన్ నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. టెలి మెడిసిన్ ద్వారా వైద్యం అందించేందుకు చర్యలను ముమ్మరం చేశామని ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు వ్యవసాయ మార్కెట్ల బలోపేతానికి లక్ష కోట్ల నిధులను కేటాయించామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పేర్కొన్నారు . మూడు వ్యవసాయ చట్టాల అమలులో భాగంగా వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధికి కృషిచేయాలని నిర్ణయం తీసుకుంది. ఏపీఎంసీ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని తోమర్ పేర్కొన్నారు. రైతుల మౌలిక సౌకర్యాల నిధిని ఏపీఎంసీలు వాడుకోవచ్చునని తోమర్ స్పష్టం చేశారు. సాగు చట్టాల అమలుతో ఏపీఎంసీలకు మరిన్ని నిధులు చేకూరుతాయని తెలిపారు. -
ఉత్తరాఖండ్ నూతన సీఎంగా పుష్కర్ సింగ్ ధామి
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పుష్కర్‌సింగ్ ధామి గవర్నర్ బేబీరాణి మౌర్యను కలిశారు. శనివారం సాయంత్రం ఉత్తరాఖండ్ బిజెపి చీఫ్ మదన్ కౌశిక్ నేతృత్వంలో సమావేశమైన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ధామిని శాసన సభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో నూతన సీఎం ఎంపిక అనివార్యమైంది. ఆరు నెలల్లో ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేనందున ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మార్చి 10న తీరత్ సింగ్ ఉత్తరాఖండ్గా సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే, అప్పటికీ ఆయన ఎమ్మెల్యే కాదు. భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం... ఆరు నెలల కాలంలో ఆయన శాసన సభ సభ్యునిగా ఎంపిక కావాల్సి ఉంది. అయితే, సెప్టెంబరు 5తో ఈ గడువు ముగియనుండటం, మరో 6 నెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉప ఎన్నికలు జరుపలేని పరిస్థితి తలెత్తింది. రాజ్యాంగపరమైన ఇబ్బందుల నేపథ్యంలో బీజేపీ అధిష్టానం సూచన మేరకు తీరత్‌సింగ్ పదవి నుంచి వైదొలిగినట్లు సమాచారం. ఇక నూతన సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న పుష్కర్‌సింగ్ ధామి ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలుపొందారు. పోటీలో మరో ఇద్దరు.. పుష్కర్‌కే ఓటు బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో పార్టీ కేంద్ర పరిశీలకుడు నరేంద్ర సింగ్ తోమర్, రాష్ట్ర ఇంఛార్జ్ దుష్యంత్ కుమార్ గౌతమ్ పాల్గొన్నారు. సమావేశానికి ముందు తీరత్ సింగ్ రావత్, రాష్ట్ర బిజెపి నాయకులతో కేంద్ర మంత్రి తోమర్ చర్చలు జరిపారు. సత్పాల్ మహారాజ్, ధన్ సింగ్ రావత్ ముఖ్యమంత్రి రేసులో ఉన్నప్పటికీ పుష్కర్ సింగ్ ధామికే వైపునకే బీజేపీ అధిష్టానం మొగ్గు చూపింది. ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నికైన పుష్కర్‌సింగ్ ధామి గవర్నర్ బేబీరాణి మౌర్యను కలిసారు.పుష్కర్‌సింగ్ ధామి ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిపొందారు. -
రైతులతో మళ్లీ చర్చలకు సిద్ధం
న్యూఢిల్లీ/చండీగఢ్: వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలపై రైతులతో చర్చలను తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర తోమర్ శనివారం ప్రకటించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఏడు నెలలుగా కొనసాగిస్తున్న ఆందోళనలను విరమించాలని రైతు సంఘాల నేతలకు విజ్ఞప్తి చేశారు. రైతు సంఘాల డిమాండ్ మేరకు ప్రభుత్వం కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)ని పెంచడంతోపాటు ఎంఎస్పీ ప్రకారం పెద్ద మొత్తంలో ధాన్యం సేకరణ జరిపిందని చెప్పారు. కాగా, మంత్రి తోమర్ పిలుపుపై 40 రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) స్పందించింది. ఆ ప్రకటనలు అస్పష్టంగాను, పరస్పర విరుద్ధంగాను ఉన్నాయని వ్యాఖ్యానించింది. వివాదాస్పద చట్టాలకు అర్థంలేని సవరణలు చేపట్టాలని తాము కోరుకోవడం లేదని తెలిపింది. కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలంటూ గత ఏడాది నవంబర్ నుంచి వివిధ రైతు సంఘాలు ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఆయా చట్టాల్లోని వివాదాస్పద అంశాలపై కేంద్రం, రైతు సంఘాల మధ్య జనవరి 22వ తేదీ నాటికి 11 విడతలుగా జరిగిన చర్చలుæ పురోగతి సాధించలేకపోయాయి. ఆందోళనలు 8వ నెలకు చేరుకున్న సందర్భంగా ఎస్కేఎం ఇచ్చిన పిలుపు మేరకు వివిధ రాష్ట్రాలతోపాటు ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నిరసన తెలిపారు. చాలా రాష్ట్రాల్లో రైతులు గవర్నర్లకు వినతి పత్రాలు ఇచ్చేందుకు ర్యాలీగా తరలిరాగా పోలీసులు అడ్డుకున్నారు. భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ తికాయత్ నేతృత్వంలో ఈశాన్య ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ)ను కలిసేందుకు బయలుదేరగా పోలీసులు వారిని వజీరాబాద్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు తరలించారు. మూడు సాగు చట్టాలను ఉపసంహరించుకునేదాకా ఆందోళనలను విరమించబోమని భారతీయ కిసాన్ యూనియన్ ప్రధాన కార్యదర్శి యుధ్వీర్ సింగ్ తేల్చిచెప్పారు. చండీగఢ్–మొహాలీ సరిహద్దుల్లో రైతు సంఘాలు చేపట్టిన నిరసనలు ఉద్రిక్తతకు దారితీశాయి. చండీగఢ్–మొహాలీ సరిహద్దుల్లో ఉన్న బారికేడ్లను తొలగించుకుని రైతులు ముందుకు వచ్చేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వాటర్ కేనన్లను ప్రయోగించి, అడ్డుకున్నారు. -
దేశానికే ఆదర్శం.. మన ‘సచివాలయం’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పాలనాపరంగా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థ ఇప్పుడు దేశానికే ఆదర్శమైంది. ఏకంగా 545 రకాల ప్రభుత్వ సేవలను అందిస్తున్న మన గ్రామ సచివాలయాల తరహాలోనే అన్ని రాష్ట్రాలు గ్రామ స్థాయిలోనే వీలైనన్ని ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తెచ్చేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడమే ఇందుకు నిదర్శనం. ఈ మేరకు ప్రతి రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ స్థాయిలోనే 59 రకాల ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశిస్తూ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ తాజాగా ఒక మోడల్ సిటిజన్ చార్టర్‌ను ప్రకటించారు. ప్రతి సేవకు సంబంధించి ప్రజల నుంచి వినతి అందాక.. ఎన్ని రోజుల్లో దాన్ని పరిష్కరించాలో నిర్దిష్ట గడువును విధించి, ఆ గడువులోగా వాటిని అందించడానికి చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు సూచించారు. మోడల్ సిటిజన్ చార్టర్ ప్రారంభ కార్యక్రమంలో అన్ని రాష్ట్రాల పంచాయతీరాజ్ శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గ్రామ సచివాలయాల్లో అందుబాటులో 545 సేవలు.. మన రాష్ట్రంలో గ్రామ సచివాలయాల ఏర్పాటుకు ముందు గ్రామ పంచాయతీల్లో కేవలం 19 రకాల ప్రభుత్వ సేవలు మాత్రమే ఉండేవి. ఇవికాకుండా ఇంకేమైనా అవసరమైతే మండల, జిల్లా కేంద్రాల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి వచ్చేది. దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఇప్పటికీ ఇదే పరిస్థితి ఉందని పంచాయతీరాజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల కష్టాలను గమనించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019, అక్టోబర్ 2న రాష్ట్రంలో గ్రామ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. మారుమూల కుగ్రామంలో ఉండే సచివాలయంలో సైతం 2020 జనవరి 26 నుంచి ఏకంగా 545 రకాల ప్రభుత్వ సేవలను ఒకేసారి అందుబాటులోకి తీసుకొచ్చారు. కొన్ని సేవలను అప్పటికప్పుడు, మరికొన్నింటిని 72 గంటల్లో, ఇంకొన్నింటిని సాధ్యమైన త్వరగా అందించేలా నిర్దిష్ట కాలపరిమితిని నిర్దేశించారు. అంతేకాకుండా 34 ప్రభుత్వ శాఖలకు సంబంధించి ప్రతి అభివృద్ది సమాచారాన్ని గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచుతున్నారు. గత 17 నెలల కాలంలో 2.51 కోట్ల రకాల ప్రభుత్వ సేవలు.. గత 17 నెలల కాలంలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 2.51 కోట్ల రకాల ప్రభుత్వ సేవలను ప్రజలు అందుకోగా.. అందులో 1.89 కోట్లు గ్రామీణ ప్రజలే పొందారు. సచివాలయాల ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో నగరాలు, పట్టణాల్లో ఉండే ప్రజలకు, మారుమూల కుగ్రామాల్లో ఉండేవారికి సమాన స్థాయిలో ప్రభుత్వ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఉదాహరణకు.. రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ ఏర్పాటుకు ముందు పది వేల జనాభా ఉండే గుంటూరు జిల్లా కాజ గ్రామ పంచాయతీ కార్యాలయానికి వివిధ పనుల కోసం వచ్చే వారి సంఖ్య ఏడాదికి రెండు వందల లోపే ఉండేదని అక్కడి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన రమేష్ ‘సాక్షి’కి తెలిపారు. ఇప్పుడు గ్రామంలో ఉన్న రెండు సచివాలయాలకు రోజుకు 70 నుంచి 100 మంది వరకు వివిధ పనుల కోసం వస్తున్నారని చెప్పారు. 1.34 లక్షల ఉద్యోగాల భర్తీతో సత్వరమే సేవలు సచివాలయ వ్యవస్థ ఏర్పాటుతోపాటు రాష్ట్రంలో కొత్తగా 1.34 లక్షల ఉద్యోగాలను ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసింది. అంతే వేగంగా పారదర్శకంగా వాటిని భర్తీ చేసి.. ప్రతి గ్రామ సచివాలయంలో 10–12 మంది ఉద్యోగులను నియమించింది. దీంతో 545 సేవలు ప్రజలకు సత్వరమే అందుతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటుకు ముందు మన రాష్ట్రంలో మాదిరిగానే అత్యధిక రాష్ట్రాల్లో గ్రామ స్థాయిలో పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య నామమాత్రంగా ఉందని వివరించాయి. ప్రధాని నుంచి కేంద్ర మంత్రుల వరకు ప్రశంసలు.. ఇటీవల కరోనా కట్టడి సమయంలో, వివిధ ప్రభుత్వ పథకాల అమలుపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు సమీక్షలు నిర్వహించినప్పుడు గ్రామ సచివాలయాలు, వలంటీర్లు అందజేస్తున్న సేవలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ మన రాష్ట్రాన్ని అభినందించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే గ్రామ సచివాలయాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సేవలను ఆదర్శంగా తీసుకొని దేశవ్యాప్తంగా ప్రభుత్వ సేవల పెంపునకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అధికార వర్గాలు తెలిపాయి. -
రాష్ట్రానికి రెండు పీఎం–కిసాన్ సమ్మాన్ అవార్డులు
సాక్షి, న్యూఢిల్లీ/అనంతపురం అగ్రికల్చర్/ నెల్లూరు (అర్బన్): కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పీఎం–కిసాన్ పథకం ప్రవేశపెట్టి రెండు సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో పలు విభాగాల్లో జిల్లాలకు కేంద్ర వ్యవసాయశాఖ ప్రకటించిన పీఎం–కిసాన్ సమ్మాన్ అవార్డుల్లో రెండింటిని ఆంధ్రప్రదేశ్ గెలుచుకుంది. వివాదాల పరిష్కారాల విభాగంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, భౌతికపరిశీలన విభాగంలో అనంతపురం జిల్లా ఈ అవార్డుల్ని సాధించాయి. ఢిల్లీలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ నుంచి నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్‌బాబు, అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రూ. 6 వేలతోపాటు రైతుభరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.7,500 కలిపి రూ.13,500 నేరుగా మూడు విడతల్లో రైతుల ఖాతాల్లోకే వేస్తున్నట్లు తెలిపారు. అన్నదాతల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు మాట్లాడుతూ ఈ అవార్డు తన బాధ్యతను మరింతగా పెంచిందన్నారు. అవార్డు స్ఫూర్తితో జిల్లాలో రైతు సమస్యల పరిష్కారానికి, వారి పంటకు మద్దతు ధర దక్కేలా కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ కమిషనర్ అరుణ్‌కుమార్, నెల్లూరు, అనంతపురం జేసీలు వై.ఆనందకుమారి, వై.రామకృష్ణ, అనంతపురం వ్యవసాయాధికారి బి.వంశీకృష్ణ, వ్యవసాయశాఖ నెల్లూరు ఏడీ అనిత పాల్గొన్నారు. ‘అనంత’ కృషి ఇదీ.. అనంతపురం జిల్లాలో పీఎం–కిసాన్ రైతుభరోసా సాయం అందుతున్న తీరును అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లాలో 5.5 లక్షల మందికి పీఎం–కిసాన్ రైతుభరోసా అందుతోంది. కాగా, జిల్లాలో 28,505 మంది రైతులను ఎంపిక చేసి ఈ పథకం కింద సొమ్ము జమ అయిందా, లేదా.. అనే విషయాలను తెలుసుకున్నారు. ఇందులో మరే జిల్లాలో లేనివిధంగా 99.60 శాతం మంది రైతులను కలిసి వివరాలు సేకరించారు. ఈ ఘనత సాధించినందుకు కేంద్ర ప్రభుత్వం అనంతపురం జిల్లాకు ఈ అవార్డు అందజేసింది. నెల్లూరు రైతుల సమస్యలు తీర్చినందుకు.. ప్రజాసాధికారిక సర్వేలో పేర్లు లేవనే ఉద్దేశంతో బ్యాంకులు వేలాదిమంది రైతుల ఖాతాలకు పీఎం–కిసాన్ సాయాన్ని జమచేయలేదు. ఈ నేపథ్యంలో కలెక్టర్ జెడ్పీ సీఈవో సుశీల, లీడ్ బ్యాంకు మేనేజర్ రాంప్రసాద్‌రెడ్డిల సహకారంతో ఈ సమస్య తీర్చారు. బ్యాంకులు రిజెక్ట్ చేసిన ఖాతాలకు సంబందించి ఆర్టీజీఎస్ నుంచి ఏడువేల మంది రైతుల ఖాతా నంబర్లు సేకరించారు. గ్రామాలకు వెళ్లి రైతుల వివరాలు తీసుకుని సమస్యను పరిష్కరించారు. అన్నదాతల ఖాతాల్లో నగదు జమచేయించారు. -
10.75 కోట్ల మంది రైతులకు 1.15 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: పీఎం కిసాన్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 10.75 కోట్ల మంది రైతులకు వారి వ్యక్తిగత బ్యాంక్ ఖాతాల్లో రూ. 1.15 లక్షల కోట్ల రూపాయలను జమ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. అర్హులైన రైతులందరూ లబ్ధిదారుల జాబితాలో చేరేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కోరింది. ఇప్పటికీ కొందరు రైతులు తమకు పీఎం కిసాన్ డబ్బులు అందడం లేదని ఫిర్యాదు చేస్తున్నారని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. 14.5 కోట్ల మంది రైతులను ఈ పథకంలో చేర్చాలని మొదట లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ పథకం రెండో వార్షికోత్సవం సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో తోమర్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల జాబితాను అందజేస్తే పశ్చిమబెంగాల్లోనూ ఈ పథకాన్ని అమలు చేస్తామన్నారు. సాగు చట్టాల అమలును నిలిపేసిన ఏడాదిన్నర సమయంలో సంయుక్తంగా ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని వ్యవసాయ చట్టాల్లోని అభ్యంతరాలపై చర్చించి, పరిష్కారం సాధిద్దామని రైతు నేతలకు ప్రతిపాదించామన్నారు. సాగు చట్టాలను రద్దు చేయనట్లయితే.. 40 లక్షల ట్రాక్టర్లతో పార్లమెంటును ముట్టడిస్తామన్న రైతు నేత రాకేశ్ తికాయత్ హెచ్చరికపై స్పందిస్తూ.. రైతులతో చర్చించేందుకు తమ ప్రభుత్వం సదా సిద్ధంగానే ఉంటుందన్నారు. ఇప్పటికీ వారి నుంచి స్పందన వస్తే చర్చలు పునః ప్రారంభిస్తామని వెల్లడించారు. రెట్టింపు ఆదాయమే లక్ష్యం ‘దేశానికి అన్నం పెడుతున్న రైతులు గౌరవప్రదంగా జీవించాలన్న ఉద్దేశంతో సరిగ్గా రెండేళ్ల క్రితం పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించాం’ అని ‘పీఎం కిసాన్’ పథకం రెండో వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. రైతుల ఆదాయాన్ని రెండింతలు చేసేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని, పంటల కనీస మద్దతు ధరను చరిత్రాత్మక స్థాయిలో పెంచామని ప్రధాని పేర్కొన్నారు. గత ఏడేళ్లుగా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకు వచ్చామన్నారు. మెరుగైన సాగునీటి సదుపాయాలు, సులువైన రుణ సదుపాయం, పంట బీమా, దళారుల తొలగింపు.. తదితర చర్యలు తీసుకున్నామన్నారు. రైతుల కోసం తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ చర్యలను నమో యాప్‌లో చూడవచ్చన్నారు. 2019 ఫిబ్రవరి 24న ‘పీఎం కిసాన్’ పథకాన్ని ప్రధానిమోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
పీఎం కిసాన్ అవార్డు అందుకున్న ‘అనంత’ కలెక్టర్
ఢిల్లీ : ప్రధాన మంత్రి కిసాన్ జాతీయ అవార్డును అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు అందుకున్నారు. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చేతుల మీదుగా బుధవారం ఆయన ఈ అవార్డును తీసుకున్నారు. ప్రధాన మంత్రి కిసాన్ జాతీయ అవార్డుకు అనంతపురం జిల్లా ఎంపికైన సంగతి తెలిసిందే. రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఏటా మూడు విడతల్లో పీఎం కిసాన్ సమ్మన్ నిధి పథకం కింద రైతులకు రూ. 6వేల చొప్పున నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేస్తుంది. ఈ పథకం అమలులో అనంతపురం జిల్లా ముందు వరుసలో నిలిచింది. కేంద్ర వ్యవసాయశాఖ ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లో 5శాతం మంది లబ్దిదారులకు సంబంధించి భౌతిక ధృవీకరణ చేశారు. అసలు వీరు పథకానికి అర్హులేనా? సరైన వివరాలే నమోదు చేశారా? అనే అంశాలను పరిశీలించారు. 2018 డిసెంబర్ 1న ప్రారంభించిన ఈ పథకం కింద జిల్లాలో మొత్తం 63 మండలాల్లో 28,505 మంది లబ్ధిదారులు ఉన్నారు. జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి మరే జిల్లాలో లేని విధంగా లబ్ధిదారుల భౌతిక ధృవీకరణను 99.6 శాతం పూర్తి చేసింది. ఈ ఘనత సాధించడం పట్ల కేంద్ర ప్రభుత్వం అనంతపురం జిల్లాను ప్రధాన మంత్రి కిసాన్ జాతీయ అవార్డుకు ఎంపిక చేసింది. చదవండి : (రూ.2.65 లక్షల టిడ్కో ఇల్లు ఒక్క రూపాయికే) (భారీగా పొగమంచు.. గాల్లో చక్కర్లు కొట్టిన విమానాలు) -
కాంగ్రెస్‌ది రుధిర వ్యవసాయం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ రక్తంతో వ్యవసాయం చేస్తుందని, బీజేపీ అలా కాదని రాజ్యసభలో కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ విపక్షంపై మండిపడ్డారు. ఇటీవల కాంగ్రెస్ విడుదల చేసిన ఒక పుస్తకంలోని వ్యాఖ్యలపై ఆయన ఈ విధంగా స్పందించారు. తోమర్ వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో అనంతరం వాటిని రికార్డుల నుంచి తొలగించారు. ‘మేం తీసుకువచ్చిన చట్టాలను నల్లచట్టాలని అంటున్నారు. ఆ చట్టాల్లో నలుపు(తప్పు) ఎక్కడ ఉందని, రైతులకు వ్యతిరేకంగా అందులో ఏం ఉందని రెండు నెలలుగా రైతులను అడుగుతున్నాం. రైతు వ్యతిరేకత ఎక్కడ ఉందో చూపిస్తే సరిదిద్దుతామని కూడా చెబుతున్నాం. వారి నుంచి జవాబు లేదు. వీరి(విపక్ష సభ్యులను చూస్తూ) నుంచీ జవాబు లేదు’అని వ్యాఖ్యానించారు. రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వ్యవసాయ మార్కెట్లు, కనీస మద్దతు ధర విధానం కొనసాగుతాయని ఆయన మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో జరిగిన చర్చలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. వ్యవసాయ చట్టాల్లో సవరణలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తోమర్ పునరుద్ఘాటించారు. సవరణలకు సిద్ధంగా ఉన్నామంటే దానర్ధం చట్టాల్లో లోపాలున్నాయని తాము అంగీకరించనట్లు కాదని, రైతుల ఆందోళనలను గౌరవించి, సవరణలకు సిద్దమయ్యామని వివరించారు. రైతులే కాదు, వారి మద్దతుదారులు కూడా వ్యవసాయ చట్టాల్లో ఏ ఒక్క లోపాన్ని కూడా చూపలేకపోయారని తెలిపారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు ఉద్యమం చేయడం లేదని, కేవలం ఒక్క రాష్ట్రానికి చెందిన రైతులే ఉందోళనలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. వారిని కూడా కొందరు రాజకీయ లబ్ధి కోసం తప్పుడు సమాచారంతో రెచ్చగొట్టారని ఆరోపించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘నీటితో వ్యవసాయం చేస్తారని అందరికీ తెలుసు. కానీ కాంగ్రెస్ మాత్రం రక్తంతో వ్యవసాయం చేస్తుంది. రక్తంతో సాగు చేయడం బీజేపీకి తెలియదు’అని మండిపడ్డారు. వ్యవసాయ మార్కెట్లకు వెలుపల కోరుకున్న ధరకు, ఎలాంటి పన్ను లేకుండా తమ వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకునే అవకాశం తాజా చట్టాలతో రైతులకు లభిస్తుందన్నారు. కాంట్రాక్ట్ వ్యవసాయంతో రైతులు పన్ను లేకుండానే తమ ఉత్పత్తులకు అమ్ముకోవచ్చని, ఒప్పందం నుంచి ఎలాంటి పరిహారం చెల్లించకుండానే వైదొలిగే అవకాశం కేంద్రం తీసుకువచ్చిన చట్టాల్లో ఉందని వివరించారు. కానీ, పంజాబ్‌లో అమల్లో ఉన్న చట్టం(పంజాబ్ కాంట్రాక్ట్ లా) అందుకు విరుద్ధంగా ఉందని, ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే రైతు.. జరిమానా చెల్లించడంతో పాటు జైలుకు కూడా వెళ్లేలా ఆ చట్టంలో నిబంధనలు ఉన్నాయని గుర్తు చేశారు. అంతే కాదు, ఆ చట్టం ప్రకారం తమ ఉత్పత్తులను అమ్మే రైతులు పన్ను కూడా చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వం అహంకార పూరితంగా వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారని, అయితే, అహంకారం ఎక్కడ ఉందని, చర్చలకు ప్రభుత్వం సిద్ధంగానే ఉందని, చివరకు చట్టాల అమలును 18 నెలల పాటు నిలిపేసేందుకు కడా సిద్ధమైందని చర్చలో పాల్గొన్న బీజేపీ సభ్యుడు వినయ్ సహస్రబుద్ధే వ్యాఖ్యానించారు.సాగు చట్టాలను వెనక్కు తీసుకోవాలని చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ సభ్యుడు ఆనంద్ శర్మ డిమాండ్ చేశారు. ‘కరోనా కన్నా ముందే ఆర్థిక వ్యవస్థ మందగమనం ప్రారంభమైంది. ప్రభుత్వం ప్రకటించిన అనాలోచిత లాక్‌డౌన్‌తో వేలాదిమంది ఉద్యోగాలు కోల్పోయారు. ఈ పరిస్థితుల్లో రైతులు న్యాయం కోసం యుద్ధం చేస్తున్నారు’అని వ్యాఖ్యానించారు. సాగు చట్టాలు రైతుల పాలిట మరణ శాసనాలని కాంగ్రెస్ సభ్యుడు ప్రతాప్ సింగ్ బాజ్వా వ్యాఖ్యానించారు. రైతు నిరసన కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను ‘బెర్లిన్ వాల్’తో పోల్చారు. జనవరి 26న రైతు ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా జరిగిన అల్లర్లపైనిష్పక్షపాత విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నిజాలు మాట్లాడిన వారిని ద్రోహులంటున్నారని, ప్రభుత్వాన్ని విమర్శించిన వారిపై దేశద్రోహం కేసులు పెడ్తున్నారని శివసేన నేత సంజయ్ రౌత్ విమర్శించారు. విపక్ష సభ్యులకు తోమర్ సరైన, వివరణాత్మక జవాబు ఇచ్చారని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఈ ప్రసంగాన్ని ప్రజలంతా వినాలని ఆ ప్రసంగం వీడియో లింక్‌ను ట్యాగ్ చేశారు. సంప్రదాయాల ప్రకారమే.. వ్యవసాయ బిల్లులను రూపొందించే విషయంలో ప్రభుత్వం అన్ని సంప్రదాయాలను పాటించిందని, రాష్ట్రాలతో పాటు, సంబంధిత వర్గాల అభిప్రాయాలను తీసుకుందని ప్రభుత్వం శుక్రవారం రాజ్యసభకు లిఖితపూర్వకంగా తెలిపింది. లోక్‌సభ సోమవారానికి వాయిదా సాగు చట్టాలకు వ్యతిరేకంగా లోక్‌సభలో విపక్షాల నిరసనతో శుక్రవారం కూడా ఎలాంటి కార్యకలాపాలు జరగలేదు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చను ఫిబ్రవరి 3న ప్రారంభించిన బీజేపీ ఎంపీ లాకెట్ చటర్జీకి, ఆ తరువాత తన ప్రసంగాన్ని కొనసాగించే అవకాశమే లభించలేదు. శుక్రవారం కూడా సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు వెల్ వద్దకు దూసుకువెళ్లి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలిచ్చారు. పరిస్థితిలో మార్పు రాకపోవడంతో, సభను సోమవారానికి స్పీకర్ వాయిదా వేశారు. భయపడను: మీనా హ్యారిస్ .భారత్‌లో కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తున్న రైతులకు తమ మద్దతు కచ్చితంగా ఉంటుందని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ సోదరి కుమార్తె, న్యాయవాది, రచయిత మీనా హ్యారిస్(36) మరోసారి తేల్చిచెప్పారు. రైతులకు మద్దతుగా ట్వీట్లు చేసినందుకు తనను దూషిస్తూ ఇండియాలో జరిగిన ప్రదర్శనల ఫొటోను ఆమె ట్విట్టర్లో తాజాగా షేర్ చేశారు. ‘‘భారతదేశంలోని రైతుల మానవ హక్కులకు మద్దతుగా మాట్లాడుతూనే ఉంటా. భయపడే ప్రసక్తే లేదు. నిశ్శబ్దంగా ఉండను’’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. రైతుల పోరాటం గురించి మీనా హ్యారిస్ కొన్ని రోజులుగా వరుసగా ట్వీట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే పాప్ స్టార్ రిహన్నా, పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్ చేసిన ట్వీట్లు వివాదాస్పదంగా మారాయి. వారిపై ప్రభుత్వ అనుకూల వర్గాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. దిష్టిబొమ్మలను దహనం చేస్తున్నాయి. గ్రెటానా.. ఆమెవరో నాకు తెలియదు: తికాయత్ రైతుల ఉద్యమానికి అంతర్జాతీయంగా లభిస్తున్న మద్దతుపై శుక్రవారం భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ స్పందించారు. విదేశాల్లోని ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు తమ ఉద్యమానికి మద్దతిస్తే ప్రభుత్వానికి సమస్య ఏంటని ప్రశ్నించారు. అయితే, ఉద్యమానికి మద్దతుగా ట్వీట్స్ చేసిన పాప్ సింగర్ రిహానా, నటి మియా ఖలీఫా, యువ పర్యావరణ వేత్త గ్రెటా థన్‌బర్గ్ సహా ఆ ప్రముఖులంతా ఎవరో తనకు తెలియదన్నారు. ‘ఎవరు వారంతా?’ అని ఆసక్తిగా మీడియాను ఎదురు ప్రశ్నించారు. వారెవరో వివరించిన తరువాత.. ‘వారు మా ఉద్యమానికి మద్దతిస్తే సమస్యేంటి? వారు మాకేమీ ఇవ్వడం లేదు. ఏమీ తీసుకెళ్లడం లేదు’ అని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో చక్కా జామ్ లేదు నేడుతలపెట్టిన రహదారుల దిగ్బంధన కార్యక్రమం ‘చక్కా జామ్’ను ఢిల్లీలో నిర్వహించడం లేదని రైతు సంఘాల ఐక్య వేదిక సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. ఢిల్లీ సరిహద్దుల్లోని రైతు నిరసన కేంద్రాల వద్ద ఇప్పటికే ‘చక్కా జామ్’ పరిస్థితి ఉన్నందున ప్రత్యేకంగా ఆ కార్యక్రమం అవసరం లేదని భావిస్తున్నామంది. దేశవ్యాప్తంగా శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు అన్ని జాతీయ, రాష్ట్ర రహదారుల దిగ్బంధన కార్యక్రమం ఉంటుందని స్పష్టం చేసింది. కాగా, యూపీలోని శామలి జిల్లా భైన్స్వాల్లో శుక్రవారం జరిగిన రైతు మహాసభకు వేలాదిగా రైతులు హాజరయ్యారు. -
‘వాయిదా’కు ఓకే అంటేనే చర్చలు
సాక్షి, న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న రైతులతో జరుగుతున్న చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. శుక్రవారం ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన 11వ దఫా చర్చలు సుమారు నాలుగున్నర గంటల పాటు జరుగగా, అందులో ఇరుపక్షాలు కేవలం 30 నిమిషాలపాటే ముఖాముఖి భేటీ అయ్యాయి. 10వ దఫా చర్చల సందర్భంగా వ్యవసాయ చట్టాల అమలును 18 నెలల పాటు వాయిదా వేసేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్రం చేసిన ప్రతిపాదనను తిరస్కరిస్తున్నామని, చట్టాల రద్దుకు ప్రత్యామ్నాయం లేదని రైతు సంఘాల నాయకులు స్పష్టం చేయడంతో చర్చలు మళ్లీ వాయిదా పడ్డాయి. అయితే ఈ సారి తదుపరి చర్చల విషయంలో తమ వైఖరిని ప్రభుత్వం రైతుల ముందు స్పష్టంచేసింది. తమ ప్రతిపాదనకు ఒప్పుకుంటేనే తదుపరి చర్చలు జరుగుతాయని రైతు సంఘాలకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తేల్చిచెప్పారు. దీంతో ఈ నెల 26న నిర్వహించ తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీని కచ్చితంగా నిర్వహించి తీరుతామని వ్యవసాయ సంఘాల నాయకులు చర్చల అనంతరం తెలిపారు. సాగు చట్టాలలో ఎటువంటి సమస్యలు లేనప్పటికీ, రైతుల నిరసనలపై గౌరవంతో వాటిని తాత్కాలికంగా నిలిపివేయాలని ప్రభుత్వం ముందుకొచ్చిందని తోమర్ తెలిపారు. చట్టాల అమలును నిలిపివేసే ప్రభుత్వ ప్రతిపాదనపై చర్చించాలనుకుంటేనే మరో సమావేశానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని రైతు సంఘాలకు తోమర్ స్పష్టం చేశారు. సమావేశం తరువాత కిసాన్ మజ్దూర్ సంఘర్‡్ష కమిటీకి చెందిన ఎస్ఎస్ పంఢేర్ మీడియాతో మాట్లాడారు. చర్చలకు ఆహ్వానించి వ్యవసాయ మంత్రి తమను మూడున్నర గంటలపాటు వేచి ఉండేలా చేయడం అవమానకరమన్నారు. ఆ తర్వాత ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను అంగీకరించాలని మంత్రి కోరడంతో తాము నిరసనగా సమావేశం నుంచి బయటికి వచ్చామని వివరించారు. ఈ దఫా చర్చల్లోనూ సాగు చట్టాల రద్దుడిమాండ్ను రైతు సంఘాల నేతలు ముందుకు తేగా ప్రభుత్వం మాత్రం చట్టాల సవరణకు సిద్ధంగా ఉందని చెప్పిందని రైతు నాయకుడు శివ కుమార్ కక్క తెలిపారు. ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను పరిశీలించాలని మంత్రి తమను కోరినప్పుడు, తమ ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలించాలని తాము కోరామని, మంత్రి సమావేశం నుంచి వెళ్ళిపోయారని శివకుమార్ పేర్కొన్నారు. అంతకుముందు, రైతు నాయకుల అంతర్గత సమావేశాల్లో.. ప్రభుత్వానికి మరో కొత్త ప్రతిపాదన ఇవ్వాలన్న చర్చ సైతం జరిగింది. చట్టాల అమలును ఏడాదిన్నర కాకుండా, మూడేళ్ల పాటు వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని కొందరు నేతలు సూచించారు. అంతేగాక వ్యవసాయ రుణ పరిమితిని ఎకరానికి రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచాలని, పాత వడ్డీ రేటును కొనసాగించాలని ప్రతిపాదించారు. 26న ట్రాక్టర్ ర్యాలీ జరుగుతుంది: రాకేశ్ టికైత్ ప్రభుత్వంతో 11వ దఫా చర్చలు అసంపూర్తిగా ముగిసిన తర్వాత భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ టికైత్ మీడియాతో మాట్లాడారు. ముందుగా నిర్ణయించినట్లుగా, జనవరి 26న ట్రాక్టర్ ర్యాలీని నిర్వహిస్తామని ఆయన తెలిపారు. అయితే ట్రాక్టర్ పరేడ్‌కు సంబంధించిన అనుమతి కోసం పోలీసులు, రైతులు మధ్య గురువారం జరిగిన మూడో రౌండ్ సమావేశం అసంపూర్తిగా ముగిసిన విషయం తెలిసిందే. రైతుల పరేడ్‌కు అనుమతించేందుకు పోలీసులు నిరాకరించారు. కుండ్లి–మనేసర్–పాల్వాల్ ఎక్స్‌ప్రెస్ వే పై పరేడ్ జరపాలని పోలీసులు సూచించారు. అందుకు రైతులు అంగీకరించలేదు. -
పంతం వీడండి
న్యూఢిల్లీ: కొత్త సాగు చట్టాలపై రైతులు మొండిపట్టు వీడి, ప్రభుత్వంతో అంశాల వారీగా చర్చలకు రావాలని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కోరారు. కొత్త వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించినందున, రైతులు పంతానికి పోవడంలో అర్థం లేదన్నారు. 19వ తేదీన రైతు సంఘాలతో పదో విడత చర్చలు జరగనున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆదివారం మధ్యప్రదేశ్‌లోని మోరెనాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘సమస్యను పరిష్కరించేం దుకు ప్రభుత్వం ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అన్వేషిస్తోంది. ఎటువంటి దాపరికాలు లేకుండా మనస్ఫూర్తిగా చర్చలకు ఆహ్వానిస్తోంది. ప్రభుత్వం కొన్ని రాయితీలను ఇచ్చేందుకు కూడా సిద్ధమైంది. రైతులు మాత్రం చట్టాల రద్దుపైనే పట్టుదలకు పోతున్నారు’అని చెప్పారు. ‘దేశం మొత్తానికి వర్తించే విధంగా ప్రభుత్వం చట్టాలు తీసుకువచ్చింది. వీటికి రైతులు, నిపుణులు, సంబంధిత వర్గాల మద్దతు ఉంది’అని తెలిపారు. ‘మండీలు, వ్యాపారుల రిజిస్ట్రేషన్ తదితర సమస్యలను పరిష్కరించేందుకు అంగీకరిస్తూ రైతు సంఘాలకు ప్రతిపాదనలు పంపాం. పంట వ్యర్థాల దహనం, విద్యుత్ వంటి వాటిపైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపాం. రైతు సంఘాలు మాత్రం సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతున్నాయి. అంశాల వారీగా చర్చల్లో సంఘాల అభ్యంతరాలు సరైనవే అని తేలితే, ప్రభుత్వం పరిశీలించడానికి సిద్ధంగా ఉంది’అని చెప్పారు. కాగా, కొత్త సాగు చట్టాలపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ ఈ నెల 19వ తేదీన మొట్టమొదటి సమావేశం జరపనుంది. పూసా క్యాంపస్‌లో ఈ సమావేశం ఉంటుందని కమిటీ సభ్యుడు అనిల్ ఘన్వత్ తెలిపారు. భవిష్యత్ కార్యాచరణను ఈ భేటీలో నిర్ణయిస్తామన్నారు. కమిటీలోని నలుగురు సభ్యుల్లో ఒకరు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. సాగు చట్టాలపై దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు జరపనున్న విచారణ సందర్భంగా కమిటీ సభ్యుడు వైదొలగిన విషయం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశాలున్నాయి. దీంతోపాటు, 26న ఢిల్లీలో రైతుల ట్రాక్టర్ ర్యాలీకి అనుమతివ్వరాదంటూ ఢిల్లీ పోలీసుల ద్వారా కేంద్రం వేసిన పిటిషన్ కూడా విచారణకు రానుంది. ట్రాక్టర్ పరేడ్ కొనసాగుతుంది 26న గణతంత్ర దినోత్సవం రోజున ముందుగా ప్రకటించిన విధంగానే ట్రాక్టర్ పరేడ్ కొనసాగుతుందని రైతు సంఘాలు స్పష్టం చేశాయి. సింఘు వద్ద ఆదివారం రైతు సంఘం నేత యోగేంద్ర యాదవ్ మీడియాతో మాట్లాడారు. ‘మా ర్యాలీ ప్రశాంతంగా సాగుతుంది. రిపబ్లిక్ డే పరేడ్‌కు ఎటువంటి ఆటంకం కలిగించం. రైతులు తమ ట్రాక్టర్లపై జాతీయ జెండాలను ప్రదర్శిస్తారు’అని వివరిం చారు. రైతుల ఆందోళనల్లో పాల్గొంటున్న /మద్దతు పలికిన నిషేధిత సిక్కు సంస్థకు చెందిన రైతు నేతకు ఎన్ఐఏ నోటీసులు జారీ చేయడాన్ని మరో నేత దర్శన్ పాల్ సింగ్ తీవ్రంగా ఖండించారు. 2024 మే వరకు పోరుకు సిద్ధం నాగపూర్: కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు 2024 మే వరకు పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ తికాయత్ అన్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతు ఆందోళనలను సైద్ధాంతిక విప్లవంగా ఆయన అభివర్ణించారు. పంటలకు కనీస మద్దతు ధరను చట్టపరమైన హామీగా రైతులు భావిస్తున్నారన్నారు. మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుని ప్రభుత్వం ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలన్నారు. అప్పటి వరకు వెనక్కి తగ్గబోమని గ్రామీణ ప్రాంతాల నుంచి వేర్వేరు సంఘాల నుంచి వచ్చిన రైతులు కోరుకుంటున్నారని చెప్పారు. లోక్‌సభ ఎన్నికలు 2024 ఏప్రిల్/మే నెలలో జరగనున్నాయి. -
అదే ప్రతిష్టంభన
సాక్షి, న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాల విషయంలో రైతు సంఘాల నేతలు, కేంద్ర ప్రభుత్వం మధ్య చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. 9వ ధపా చర్చలు శుక్రవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో దాదాపు ఐదు గంటలపాటు జరిగాయి. కేంద్రం తరపున వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, వాణిజ్య శాఖ సహాయ మంత్రి సోంప్రకాష్ సహా ఉన్నతాధికారులు 41 రైతు సంఘాల ప్రతినిధులతో చర్చించారు. కొత్త సాగు చట్టాల విషయంలో ఇరుపక్షాలు తమ వాదనలకే కట్టుబడి ఉండడంతో ప్రతిష్టంభన నెలకొంది. రైతులు లేవనెత్తిన కొన్ని డిమాండ్లను ప్రభుత్వం ఇప్పటికే అంగీకరించిందని, కాస్తయినా బెట్టు సడలించాలని తోమర్ రైతు సంఘాల నేతలను కోరారు. అయితే, కొత్త చట్టాలను రద్దు చేయాల్సిందేనని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాల్సిందేనని నేతలు తేల్చిచెప్పారు. తమ డిమాండ్ల విషయంలో మార్పు లేదని కుండబద్ధలు కొట్టారు. దీంతో చర్చలు మరోసారి వాయిదా పడ్డాయి. 10వ రౌండ్ చర్చలు 19న మధ్యాహ్నం 12 గంటలకు జరుగనున్నాయి. ప్రతిపాదనలతో రండి తదుపరి చర్చల కంటే ముందే రైతులు సాగు చట్టాల విషయంలో తమ ప్రతిపాదనలతో ఒక ముసాయిదాను సమర్పిస్తే, వాటిపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని నరేంద్రసింగ్ తోమర్ తెలిపారు. 9వ రౌండ్ చర్చలు విఫలమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్త సాగు చట్టాలపై రైతుల సందేహాలను నివృత్తి చేసేందుకు తాము రాతపూర్వక హామీ ఇచ్చామని వెల్లడించారు. కొత్త చట్టాల అమలు విషయంలో సుప్రీంకోర్టు ఉత్తర్వుకు కట్టుబడి ఉంటామని తోమర్ పేర్కొన్నారు. మధ్యవర్తిత్వం కోసం న్యాయస్థానం ఏర్పాటు చేసిన కమిటీ తమను పిలిచినప్పుడు వాదనలు వినిపిస్తామన్నారు. రాహుల్‌ని చూసి కాంగ్రెస్ నవ్వుకుంటోంది తమ వద్ద ఉన్న సమాచారం ప్రకారం వ్యవసాయ సంస్కరణల విషయంలో 2–3 రాష్ట్రాల రైతులు మాత్రమే ధర్నా చేస్తున్నారని నరేంద్రసింగ్ తోమర్ అన్నారు. ప్రస్తుతం శీతాకాలం, కోవిడ్ మహమ్మారి వ్యాప్తి వంటి పరిస్థితుల దృష్ట్యా నిరసనకారుల గురించి ప్రభుత్వం ఆందోళన చెందుతోందని అన్నారు. రాహుల్ గాంధీ ప్రకటనలు, ఆయన చర్యలను చూసి మొత్తం కాంగ్రెస్ పార్టీ నవ్వుకుంటోందని తోమర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో–2019లో వ్యవసాయ సంస్కరణలపై వాగ్దానం చేశారని గుర్తుచేశారు. ఈ విషయం మేనిఫెస్టోలో ఉంటే.. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మీడియా ముందుకు వచ్చి, అప్పుడు అబద్ధాలు చెప్పారో లేక ఇప్పుడు అబద్ధాలు చెబుతున్నారో వివరించాలని సూచించారు. 19న సుప్రీంకోర్టు కమిటీ సమావేశం! సాగు చట్టాల విషయంలో ప్రతిష్టంభనను తొలగించేందుకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ మొదటి సమావేశం జనవరి 19వ తేదీన జరిగే అవకాశాలున్నట్లు సమాచారం. డిమాండ్లకు కట్టుబడి ఉన్నాం.. మూడు వ్యవసాయ చట్టాల రద్దు, కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కు చట్టబద్ధత అనే తమ డిమాండ్లకు కట్టుబడి ఉన్నామని, అదే విషయాన్ని ప్రభుత్వానికి తెలియచేశామని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికైత్ చెప్పారు. అంతేగాక సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ ముందు హాజరుకాకూడదని తాము నిర్ణయించుకున్నామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వంతో మాత్రమే మాట్లాడుతామని, డిమాండ్లపై చర్చిస్తామని ఉద్ఘాటించారు. చర్చలు కొనసాగించాలని ఇరు పక్షాలు నిర్ణయించుకున్నట్లు ఆలిండియా కిసాన్ సంఘర్‡్ష కో–ఆర్డినేషన్ కమిటీ సభ్యురాలు కవితా కురుగంటి తెలిపారు. కమిటీ నుంచి తప్పుకుంటున్నా రైతుల ప్రయోజనాలే తనకు ముఖ్యమని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) జాతీయ అధ్యక్షుడు భూపీందర్‌సింగ్ మన్ చెప్పారు. కొత్త సాగు చట్టాలపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నలుగురు సభ్యుల కమిటీ నుంచి తాను తప్పుకుంటున్నట్లు తెలిపారు. ఈ కమిటీపై రైతు సంఘాలు, ప్రతిపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. కమిటీలో తనను సభ్యుడిగా చేర్చినందుకు భూపీందర్‌సింగ్ సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే, రైతన్నల ప్రయోజనాలను కాపాడే విషయంలో రాజీ పడబోనని తేల్చిచెప్పారు. భూపీందర్సింగ్కు దూరంగా ఉండాలని బీకేయూ పంజాబ్ యూనిట్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలోనే ఆయన ప్రకటన వెలువడింది. -
ముందు లా వాపసీ.. తర్వాతే ఘర్ వాపసీ
సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దు విషయంలో ఇరు వర్గాలు పట్టు వీడకపోవడంతో రైతులు, ప్రభుత్వం మధ్య చర్చలు మరోసారి అసంపూర్ణంగా ముగిశాయి. ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో శుక్రవారం కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పియూష్ గోయల్, సోమ్ ప్రకాశ్ 41 మంది రైతు సంఘాల ప్రతినిధులతో జరిపిన 8వ విడత చర్చలు ఎలాంటి సానుకూల ఫలితం సాధించకుండానే వాయిదా పడ్డాయి. మరో విడత చర్చలు జనవరి 15న జరగనున్నాయి. తదుపరి కార్యాచరణను నిర్ణయించేందుకు రైతు నేతలు జనవరి 11న సమావేశం కానున్నారు. చట్టాలను వెనక్కు తీసుకున్న (లా వాపసీ) తరువాతే.. తాము ఇళ్లకు వెళ్తామని(ఘర్ వాపసీ) రైతులు చర్చల సందర్భంగా ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. చట్టాల రద్దు కోసం చివరి శ్వాస వరకు పోరాడుతామన్నారు. మరోవైపు, చట్టాల రద్దు ప్రసక్తే లేదన్న ప్రభుత్వం.. ఆ చట్టాల్లోని అభ్యంతరకర నిబంధనలపై చర్చకు సిద్ధమేనని పునరుద్ఘాటించింది. చట్టాల రద్దుకు ప్రత్యామ్నాయాలను సూచించాలని కోరింది. దేశవ్యాప్తంగా రైతుల్లో అత్యధికులు ఈ చట్టాలకు మద్దతిస్తున్నారని వాదించింది. దేశ విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలని రైతు నేతలకు సూచించింది. వ్యవసాయ చట్టాలు, రైతుల నిరసనలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఈ నెల 11న విచారణ జరగనున్న నేపథ్యంలో.. తదుపరి చర్చల తేదీని జనవరి 15గా నిర్ణయించారని సంబంధిత వర్గాలు తెలిపాయి. సాగు చట్టాల చట్టబద్ధతను సుప్రీంకోర్టు పరిశీలించే అవకాశముందని పేర్కొన్నాయి. ‘నిజానికి వ్యవసాయం విషయంలో కేంద్రం జోక్యం చేసుకోకూడదు. వ్యవసాయం రాష్ట్ర జాబితాలోని అంశమని పలు తీర్పుల్లో సుప్రీంకోర్టు కూడా ప్రకటించింది. సమస్యను పరిష్కరంచాలన్న ఆలోచన మీకు ఉన్నట్లు కనిపించడం లేదు. ఏ విషయం స్పష్టంగా చెప్పండి. మా నిర్ణయం మేం తీసుకుంటాం. అంతేకానీ, అనవసరంగా అందరి సమయం వృధా చేయొద్దు’అని రైతు నేతలు ప్రభుత్వానికి సూటిగా చెప్పారు. ‘చట్టాలను రద్దు చేయలేం, చేయబోం అని ప్రభుత్వం కూడా రైతు నేతలకు స్పష్టంగా చెప్పింది’అని చర్చల్లో పాల్గొన్న ఆల్ ఇండియా కిసాన్సంఘర్‡్ష కో ఆర్డినేషన్ కమిటీ(ఏఐకేఎస్‌సీసీ) సభ్యురాలు కవిత కురుగంటి తెలిపారు. రైతు ప్రతినిధులు, కేంద్ర మంత్రుల మధ్య చర్చలు ప్రారంభమైన గంట తరువాత.. రైతు ప్రతినిధులు జీతేంగే యా మరేంగే(గెలుపో లేదా మరణమో) అన్న నినాదమున్న పేపర్లు ప్రదర్శిస్తూ మౌనంగా కూర్చోవడంతో, ప్రత్యేకంగా చర్చలు జరిపేందుకు కేంద్ర మంత్రులు సమావేశం స్థలి నుంచి బయటకు వెళ్లారు. మొత్తంగా శుక్రవారం ఇరు వర్గాల మధ్య చర్చలు సుమారు 2 గంటల పాటు మాత్రమే జరిగాయి. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని చర్చల అనంతరం రైతు నేత బల్బీర్ రాజేవాల్ విమర్శించారు. చట్టాల రద్దు విషయంలో ఏ కోర్టుకు వెళ్లబోమని, చట్టాలను వెనక్కు తీసుకునేంతవరకు పోరాటం కొనసాగిస్తామని ఏఐకేఎస్‌సీసీ నేతలు చెప్పారు. ప్రభుత్వ తీరు ఇలాగే కొనసాగితే 26న ట్రాక్టర్ ర్యాలీని భారీ ఎత్తున నిర్వహిస్తామన్నారు. ‘ఈ ఆందోళనల్లో ఎంతో మంది తల్లులు తమ పిల్లలను కోల్పోయారు. ఎంతోమంది కూతుర్లు తమ తండ్రులను కోల్పోయారు. అయినా ప్రభుత్వం మనసు కరగడం లేదు’అని నిరసనల్లో పాల్గొంటున్న ఒక మహిళారైతు ఏడుస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఉండగా, ఢిల్లీ సరిహద్దుల్లో రైతులతో పాటు ఆందోళనల్లో పాల్గొంటున్న పంజాబ్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో శుక్రవారం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ సమావేశమయ్యారు. అమిత్ షాతో భేటీ చర్చలు ప్రారంభం కావడానికి ముందు నరేంద్ర సింగ్ తోమర్ ప్రత్యేకంగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. చర్చల సందర్భంగా వ్యవహరించాల్సిన తీరుపై చర్చించారు. ఆ తరువాత హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కూడా షాతో సమావేశమయ్యారు. ప్రత్యామ్నాయాలు చూపట్లేరు సాగు చట్టాల రద్దు ప్రతిపాదనకు ప్రత్యామ్నాయాలను సూచించమని కోరామని, అయితే, రైతు నేతలు చట్టాల రద్దుకే పట్టుబట్టడంతో ఎలాంటి ఫలితం రాకుండానే చర్చలు వాయిదా పడ్డాయని నరేంద్రసింగ్ తోమర్ తెలిపారు. తదుపరి చర్చల నాటికైనా రైతు నేతలు ప్రత్యామ్నాయాలతో వస్తారని ఆశిస్తున్నామన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టులో కొనసాగుతున్న కేసులో ఇంప్లీడ్ కావాలని రైతు నేతలను కోరారా? అన్న ప్రశ్నకు అలాంటి ప్రతిపాదనేదీ లేదన్నారు. ఈ చట్టాలను అమలు చేసే విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రాలకు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందా? అన్న ప్రశ్నకు ఆ ప్రతిపాదన ఏదీ రైతుల నుంచి రాలేదన్నారు. చర్చలు విఫల కావడంతో రైతు సంఘం నేత రవీందర్ కౌర్ కంటతడి -
26న 3,500 ట్రాక్టర్లతో ర్యాలీ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తమ పోరాటాన్ని ఉధృతం చేసే దిశగా రైతులు అడుగు ముందుకేస్తున్నారు. 26న 3,500 ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ర్యాలీ సన్నాహకాల్లో (రిహార్సల్) భాగంగా గురువారం ఢిల్లీ శివార్లలోని సింఘు, టిక్రీ, ఘాజీపూర్ బోర్డర్లతోపాటు హరియాణాలోని రేవసాన్ నుంచి వేలాది మంది రైతులు ట్రాక్టర్లతో భారీ ప్రదర్శన చేపట్టారు. 26వ తేదీన హరియాణా, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి ఢిల్లీ దాకా పెద్ద ఎత్తున ట్రాక్టర్ ర్యాలీ చేపట్టనున్నట్లు రైతు సంఘాల నేతలు పునరుద్ఘాటించారు.కేంద్ర ప్రభుత్వం, రైతుల మధ్య ఎనిమిదో దఫా చర్చలు శుక్రవారం జరగనున్నాయి. మూడు కొత్త వ్యవసాయ చట్టాల రద్దు తప్ప రైతుల నుంచి వచ్చే ఏ ఇతర ప్రతిపాదనైనా పరిగణనలోకి తీసుకుంటామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ గురువారం పునరుద్ఘాటించారు. రైతులు, ప్రభుత్వం మధ్య శుక్రవారం చర్చల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
రైతులతో చర్చలు అసంపూర్ణం
సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దు లక్ష్యంగా ఉద్యమిస్తున్న రైతులు, కేంద్ర ప్రభుత్వం మధ్య జరుగుతున్న చర్చల ప్రక్రియలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. రైతు సంఘాల ప్రతినిధులు, కేంద్ర మంత్రుల మధ్య సోమవారం జరిగిన ఏడో విడత చర్చలు అసంపూర్ణంగా ముగిశాయి. కొత్త సాగు చట్టాల రద్దు మినహా మరే ప్రతిపాదన తమకు అంగీకారయోగ్యం కాదని రైతు నేతలు ప్రభుత్వానికి తేల్చిచెప్పారు. ఆ చట్టాల్లోని రైతుల అభ్యంతరాలను నిబంధనల వారీగా చర్చిద్దామన్న ప్రభుత్వ ప్రతిపాదనను తోసిపుచ్చారు. రైతు ప్రతినిధులు వ్యవసాయ చట్టాల రద్దుపైనే పట్టుపట్టడంతో, వారి మరో డిమాండ్ అయిన ‘కనీస మద్దతు ధరకు చట్టబద్ధత’ అంశం పెద్దగా చర్చకు రాలేదు. 8న మళ్లీ చర్చించాలని నిర్ణయించారు. 41 రైతు సంఘాల ప్రతినిధులు, కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పీయూష్ గోయల్, సోమ్ ప్రకాశ్ ఈ చర్చల్లో పాల్గొన్నారు. విజ్ఞాన్ భవన్లో చర్చలు ప్రారంభం కాగానే, మొదట, ఈ ఆందోళనల సమయంలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు నివాళులర్పించారు. అనంతరం జరిగిన చర్చల్లో తొలి నుంచీ రైతు నేతలు సాగు చట్టాలను ఉపసంహరించుకోవాల్సిందేనని పట్టుబట్టారు. ప్రభుత్వం ఇచ్చిన సవరణల ప్రతులను చించివేశారు. దాంతో, చర్చలు ప్రారంభమైన గంట సేపటికే ప్రతిష్టంభన నెలకొంది. దాంతో ఇరువర్గాలు బ్రేక్ తీసుకున్నాయి. ఆ సమయంలో రైతు నేతలు, తమకు దీక్షాస్థలి నుంచి వచ్చిన భోజనాన్ని స్వీకరించారు. ఆరో విడత చర్చల సమయంలో రైతులతో పాటు కేంద్రమంత్రులు కూడా అదే ఆహారాన్ని స్వీకరించిన విషయం తెలిసిందే. కానీ ఈ విడత చర్చల్లో మంత్రులు రైతు నేతలతో కలిసి భుజించలేదు. ఆ సమయంలో వారు ప్రత్యేకంగా చర్చలు జరిపారు. అనంతరం, సాయంత్రం 5.15 గంటల సమయంలో ఇరు వర్గాలు మళ్లీ సమావేశమయ్యాయి. చట్టాల రద్దు మినహా మరే ప్రత్యామ్నాయానికి అంగీకరించబోమని రైతు నేతలు తేల్చిచెప్పడంతో, చర్చలు అసంపూర్ణంగా ముగిశాయి. రైతుల డిమాండ్లపై అంతర్గతంగా చర్చించాల్సిన అవసరం ఉందని, ఆ తరువాత మళ్లీ చర్చలు కొనసాగిస్తామని ప్రభుత్వ ప్రతినిధులు చెప్పినట్లు రైతు నేతలు వెల్లడించారు. సమస్య పరిష్కారానికి ప్రభుత్వ అహం అడ్డుపడుతోందని వ్యాఖ్యానించారు. చట్టాల రద్దు, ఎమ్మెస్పీకి చట్టబద్ధత.. కీలకమైన ఈ రెండు డిమాండ్ల విషయంలో వెనక్కు తగ్గబోమని పునరుద్ఘాటించారు. తదుపరి అనుసరించాల్సిన వ్యూహంపై మంగళవారం చర్చిస్తామన్నారు. రెండు చేతులతో చప్పట్లు జనవరి 8న జరిగే చర్చల్లో సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నట్లు చర్చల అనంతరం వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పేర్కొన్నారు. అయితే, అందరికీ ఆమోదయోగ్య పరిష్కారం లభించాలంటే ఇరు వర్గాలు కృషి చేయాల్సి ఉంటుందన్నారు. ‘రెండు చేతులతోనే చప్పట్లు కొట్టగలం’ అని వ్యాఖ్యానించారు. ‘వారు చట్టాల రద్దు అనే ఒక్క విషయం పైననే మొండిపట్టు పట్టారు. చట్టాలను క్లాజ్లవారీ చర్చించాలన్నది మా అభిప్రాయం’ అని వివరించారు. జనవరి 8న జరిగే చర్చలు కూడా మరో తేదీకి వాయిదా పడేందుకే జరుగుతాయా? అన్న ప్రశ్నకు.. పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావంతోనే చర్చలు జరుపుతున్నామని సమాధానమిచ్చారు. దేశంలోని రైతులందరి ప్రయోజనాలు ఆశించి, తమ ప్రభుత్వం చట్టాలను చేసిందన్నారు. అనంతరం, ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. సమస్య పరిష్కారానికి అన్ని సానుకూల ప్రత్యామ్నాయాలను పరిశీలించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని అందులో పేర్కొంది. తద్వారా చట్టాల రద్దు కుదరదన్న విషయాన్ని పరోక్షంగా స్పష్టం చేసింది. సింఘు సరిహద్దు వద్ద నిరసన -
రైతు సంఘాలతో చర్చల్లో పురోగతి
సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాల రద్దు సహా నాలుగు ప్రధాన డిమాండ్లపై కేంద్రం ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య బుధవారం జరిగిన చర్చల్లో కొంత పురోగతి చోటు చేసుకుంది. రైతుల ప్రధానమైన 4 డిమాండ్లలో.. సాగు చట్టాల రద్దుకు విధివిధానాలు రూపొందించడం, కనీస మద్దతు ధర(ఎమ్మెస్పీ)కు చట్టబద్ధత కల్పించడమనే రెండు డిమాండ్ల అమలుపై చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. రైతులపై విద్యుత్ బిల్లుల భారం పెంచే విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలన్న డిమాండ్‌కు, అలాగే, పంట వ్యర్థాలను దహనం చేసే రైతులకు జరిమానా విధించే ప్రతిపాదనను విరమించుకోవాలన్న డిమాండ్‌కు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. నరేంద్ర సింగ్ తోమర్, పియూష్ గోయల్, సోం ప్రకాశ్ సంయుక్త కిసాన్ మోర్చా ప్రతినిధులైన 40 రైతు సంఘాల నేతలతో బుధవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మధ్యాహ్నం 2 నుంచి దాదాపు ఐదు గంటల పాటు చర్చలు జరిపారు. ఇర వర్గాల మధ్య ఇవి ఆరో విడత చర్చలు. 50% అంశాలపై రెండు వర్గాల మధ్య సయోధ్య కుదిరిందని చర్చల అనంతరం తోమర్ వ్యాఖ్యానించారు. ప్రతిష్టంభన నెలకొన్న మిగతా రెండు డిమాండ్లపై వచ్చే సంవత్సరం జనవరి 4న చర్చిస్తామన్నారు. ‘చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయి. రెండు అంశాలపై ఇరు వర్గాలు ఒక అంగీకారానికి వచ్చాయి. మూడు వ్యవసాయ చట్టాలు, ఎమ్మెస్పీపై చర్చలు జనవరి 4న కొనసాగుతాయి’ అన్నారు. రైతు నేతలు కొత్త సాగు చట్టాల రద్దుకు పట్టుపట్టారని, అయితే, చట్టాల వల్ల ప్రయోజనాలను వారికి వివరించామని తెలిపారు. చట్టాలకు సంబంధించి తమ అభ్యంతరాలను నిర్దిష్టంగా తెలపాలని కోరామన్నారు. ఎమ్మెస్పీకి చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్‌పై స్పందిస్తూ.. దీనిపై లిఖితపూర్వక హామీ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో ధర్నా చేస్తున్న వేలాది రైతులపై తోమర్ ప్రశంసలు కురిపించారు. వారు శాంతియుతంగా, క్రమశిక్షణతో నిరసన తెలుపుతున్నారన్నారు. చలి తీవ్రమవుతున్న దృష్ట్యా.. వృద్ధులు, మహిళలు, చిన్న పిల్లలను ఇళ్లకు పంపించాలని కోరారు. విద్యుత్ చార్జీలు, పంట వ్యర్థాల దహనంపైనే బుధవారం నాటి చర్చలు ప్రధానంగా జరిగాయని రైతు నేత కల్వంత్ సింగ్ సంధు వెల్లడించారు. చర్చల్లో ప్రభుత్వం వ్యవహరించిన తీరు సానుకూలంగా ఉందని రైతు నేతలు వ్యాఖ్యానించారు. ఎమ్మెస్పీని సమర్ధవంతంగా అమలు చేసేందుకు నిపుణులతో కమిటీ వేస్తామన్న ప్రతిపాదనను తిరస్కరించామని పంజాబ్ కిసాన్ యూనియన్ నేత రుల్దు సింగ్ మాన్సా వెల్లడించారు. ఎమ్మెస్పీకి చట్టబద్ధత కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు. విద్యుత్ సవరణ బిల్లును వెనక్కు తీసుకుంటామని, పంట వ్యర్థాలను దహనం చేసే రైతులకు శిక్ష విధించే నిబంధనను తొలగిస్తూ సంబంధిత ఆర్డినెన్స్‌లో సవరణలు చేస్తామని ప్రభుత్వం ప్రతిపాదించిందన్నారు. ప్రభుత్వ ప్రతిపాదనలపై 2న రైతుల చర్చ కొత్త వ్యవసాయ చట్టాలు అమల్లోకి వచ్చిన తరువాత వరి సహా పలు పంటలను కనీస మద్దతు ధర కన్నా తక్కువకే అమ్మాలని రైతులపై ఒత్తిడి చేస్తున్నారని రైతు నేతలు బుధవారం తెలిపారు. ‘కొత్త వ్యవసాయ చట్టాలు వచ్చిన తరువాత ఉత్తరప్రదేశ్‌లో పంటల మార్కెట్ ధరలు 50శాతానికిపైగా పడిపోయాయి. ఎమ్మెస్పీ కన్నా తక్కువ ధరకే అమ్మాలని రైతులను ఒత్తిడి చేస్తున్నారు. వరి క్వింటాల్‌కు రూ. 800లకు అమ్మాల్సి వస్తోంది. ఈ విషయాలను చర్చల్లో లేవనెత్తుతాం’ అని చర్చలు ప్రారంభమయ్యే ముందు భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ వివరించారు. ‘మా డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించేవరకు ఉద్యమం కొనసాగుతుంది. నూతన సంవత్సర వేడుకలను కూడా ఇక్కడే జరుపుకుంటాం’ అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ప్రతిపాదనలపై జనవరి 2వ తేదీన రైతు సంఘాల ప్రతినిధులు సింఘు సరిహద్దు వద్ద అంతర్గత చర్చలు జరుపుతారని ఆల్ ఇండియా కిసాన్ సభ నేత హన్నన్ మొల్లా వెల్లడించారు. రైతులతో కలిసి భోజనం ఆరో విడత చర్చల సందర్భంగా రైతు నేతల కోసం దీక్షాస్థలి నుంచి వచ్చిన భోజనాన్నే కేంద్ర మంత్రులు సైతం భుజించారు. చర్చలు ప్రారంభమైన రెండు గంటల తరువాత రైతు నేతలకు నిరసన కేంద్రంలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ కిచెన్ నుంచి ఒక వ్యాన్‌లో భోజనం వచ్చింది. అదే ఆహారాన్ని చర్చల్లో పాల్గొన్న కేంద్ర మంత్రులు తోమర్, గోయల్, సోమ్ ప్రకాశ్ కూడా స్వీకరించారు. సాయంత్రం ప్రభుత్వం ఆఫర్ చేసిన టీ, స్నాక్స్‌ను రైతు నేతలు తీసుకున్నారు. గత చర్చల సమయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన భోజనాన్ని రైతు నేతలు తిరస్కరించి, తమ కోసం దీక్షాస్థలి నుంచి వచ్చిన ఆహారాన్నే స్వీకరించిన విషయం తెలిసిందే. రెండు కమిటీలు రైతుల అభ్యంతరాలపై నిపుణులతో రెండు కమిటీలను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ ప్రతిపాదన. కనీస మద్దతు ధరకు, మార్కెట్ ధరకు మధ్య అసమానతలను తొలగించేందుకు ఒక కమిటీని, వ్యవసాయ చట్టాలపై రైతులు వెలిబుచ్చుతున్న అభ్యంతరాలను తొలగించేందుకు, చట్టాల్లో సవరణలను సూచించేందుకు మరో కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించిన ప్రభుత్వం. ఈ ప్రతిపాదనలను రైతు నేతలు తోసిపుచ్చారు. వాయిదా చర్చల్లో పురోగతి నేపథ్యంలో నేడు తలపెట్టిన ట్రాక్టర్ మార్చ్‌ను వాయిదా వేసుకున్న రైతు సంఘాలు. మోదీది ‘అసత్యాగ్రహ’ చరిత్ర ప్రధాని మోదీపై రైతులు విశ్వాసం కోల్పోయారని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. మోదీ తన ‘అసత్యాగ్రహ’ చరిత్ర వల్ల దేశ ప్రజల నమ్మకం కోల్పోయారన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ చట్టాలను మోదీ ఎందుకు రద్దు చేయడం లేదనే అంశంపై జరిగిన ఆన్లైన్ సర్వేను రాహుల్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘ప్రతీ పౌరుడి బ్యాంక్ ఖాతాలో రూ. 15 లక్షలు’, ‘ఏటా 2 కోట్ల ఉద్యోగాలు’, ‘50 రోజుల సమయమివ్వండి’, ‘కరోనాపై 21 రోజుల్లో విజయం సాధిస్తాం’, ‘మన భూభాగంలోకి ఎవరూ చొరబడలేదు. చైనా మన పోస్ట్‌లను ఆక్రమించలేదు’.. ఇలాంటి ‘అసత్యాగ్రహ’ చరిత్ర కారణంగా రైతులు ప్రధాని మోదీని నమ్మడం లేదని రాహుల్ పేర్కొన్నారు. చర్చల వేళ విజ్ఞాన్ భవన్లో భోజనం చేస్తున్న రైతు ప్రతినిధులు సింఘు సరిహద్దు వద్ద మువ్వన్నెల జెండాతో రైతు -
సాగు చట్టాలు.. కొలిక్కిరాని చర్చలు
ఢిల్లీ : రైతు సంఘాలతో బుధవారం కేంద్రం జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. సుమారు 5 గంటలకుపైగా కొనసాగిన చర్చల్లో సాగు చట్టాల రద్దు అంశాలు ఎలాంటి కొలిక్కి రాలేదు. కాగా జనవరి 4న మరోసారి కేంద్రంతో రైతు సంఘాలు చర్చలు జరిపే అవకాశం ఉంది. కాగా మద్దతు ధర విషయంపై కమిటీ ఏర్పాటు చేసే యోచనను కేంద్రం పరిశీలిస్తుంది. వాయుకాలుష్య ఆర్డినెన్స్‌లో సవరణలకు సముఖత వ్యక్తం చేయడంతో పాటు విద్యుత్ బిల్లులో రైతులు సూచించిన సవరణలకు కేంద్రం మొగ్గుచూపింది. (చదవండి : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు) ఇదే విషయమై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ.. రెండు అంశాలపై రైతు సంఘాలతో అంగీకారానికి వచ్చామన్నారు. రైతు సంఘాలతో జరిగిన చర్చల్లో పురోగతి కనిపించిందన్నారు. కొత్త చట్టాల పై కమిటీ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని .. కొత్త ఏడాదిలో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని భావిస్తున్నామన్నారు. కేంద్ర జరిపిన చర్చలు కాస్త సానుకూల ధోరణిలోనే సాగాయని రైతు సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే తమ ప్రధాన డిమాండ్‌పై కేంద్రం తర్జన భర్జన పడుతుందని.. అందుకే చర్చలు అసంపూర్తిగా ముగిశాయని వారు తెలిపారు. అయితే ముందుగా అనుకున్న ట్రాక్టర్ ర్యాలీని వాయిదా వేస్తున్నామని రైతు సంఘాల నేతలు వెల్లడించారు. కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరిస్తున్న అంశాలు ►రాజధాని పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్య ఆర్డినెన్స్ లో శిక్ష, జరిమానాల నుంచి రైతులను మినహాయిస్తూ సవరణలు ►విద్యుత్తు చట్ట సవరణ ముసాయిదా బిల్లులో రైతులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం అంగీకరించని అంశాలు: ►3 చట్టాలను రద్దు చేయడం ►కనీస మద్దతు ధరపై చట్టం తేవడం -
ఇదీ మా ఎజెండా
న్యూఢిల్లీ: చర్చలకు సంబంధించి తమ షరతులను రైతు సంఘాలు మరోసారి కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేశాయి. ప్రభుత్వం, రైతు సంఘాల నేతల మధ్య బుధవారం జరగనున్న చర్చల ఎజెండాను మంగళవారం ఒక లేఖలో ప్రభుత్వానికి పంపించారు. వివాదాస్పద సాగు చట్టాల రద్దుకు విధి విధానాలను రూపొందించడం, కనీస మద్దతు ధర(ఎమ్మెస్పీ)కు చట్టబద్ధత కల్పించడంతో పాటు గతంలో జరిగిన చర్చల సందర్భంగా తాము లేవనెత్తిన మరో రెండు డిమాండ్లపై మాత్రమే చర్చ జరగాలని తేల్చి చెప్పారు. వ్యవసాయ చట్టాల రద్దు లక్ష్యంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులను ఆరో విడత చర్చలకు బుధవారం రావాలని ప్రభుత్వం ఆహ్వానించిన విషయం తెలిసిందే. సాగు చట్టాల రద్దు కార్యాచరణ, ఎమ్మెస్పీకి చట్టబద్ధతతో పాటు దేశ రాజధాని ప్రాంతంలో వాయు కాలుష్యానికి సంబంధించి జారీ చేసిన ఆర్డినెన్స్‌లో సవరణల అంశాన్ని కూడా చర్చించాలని 40 రైతు సంఘాల ఐక్య వేదిక సంయుక్త కిసాన్ మోర్చా ప్రభుత్వానికి పంపిన లేఖలో స్పష్టం చేసింది. అమిత్ షాతో మంతనాలు నేడు రైతు నేతలతో చర్చలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, గోయల్ హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. చర్చల సందర్భంగా ప్రభుత్వం వ్యవహరించాల్సిన తీరుపై వారు ఒక నిర్ణయానికి వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం తరఫున రైతులతో వ్యవసాయ మంత్రి తోమర్, రైల్వే మంత్రి గోయల్ చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. కొనసాగుతున్న టవర్ల ధ్వంసం రైతులు, రైతు మద్దతుదారులు పంజాబ్ రాష్ట్రంలో భారీ స్థాయిలో టెలికం టవర్లను ధ్వంసం చేయడాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా రిలయన్స్ జియో టెలికం సంస్థకు చెందిన టవర్లకు విద్యుత్ సరఫరా నిలిపేయడం, టవర్లకు చెందిన కేబుల్స్‌ను కత్తిరించడం చేస్తున్నారు. కొత్త వ్యవసాయ చట్టాల వల్ల ప్రధానంగా లబ్ధి పొందేది రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, మరో ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ అని రైతులు భావిస్తున్నారు. పంజాబ్‌లో మంగళవారం దాదాపు 63 టవర్లు ధ్వంసం అయ్యాయని అధికారులు తెలిపారు. గ్రీన్ రెవెల్యూషన్ @ జిలేబీ సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు రైతులు విభిన్న మార్గాలను ఎంచుకుంటున్నారు. సింఘూ సరిహద్దు వద్ద జరిగిన ఓ పెళ్లి ఊరేగింపులో రైతులు ఆకుపచ్చ జిలేబీలను వడ్డించారు. హరిత విప్లవానికి సంకేతంగా ఆకుపచ్చ జిలేబీలను తయారుచేసినట్లు నిరసనలో పాల్గొన్న బల్దేవ్ సింగ్ (65) అనే రైతు చెప్పారు. కాగా, పంజాబ్‌లో రోజుకు దాదాపు అయిదు క్వింటాళ్ల ఆకుపచ్చ జిలేబీ పంచుతున్నామని జస్విర్ చంద్ అనే రైతు తెలిపారు. ఇదిలా ఉండగా హరియాణాలోని కర్నాల్‌లో నిరసన జరుగుతున్న ఓ ప్రాంతంలో నిరసనకారుడు పెళ్లి కుమారుడిలా తయారై ట్రాక్టర్‌పై ఊరేగుతూ విభిన్న రీతిలో నిరసన వ్యక్తం చేశాడు. -
అర్థంపర్థం లేని సవరణలు అక్కర్లేదు
న్యూఢిల్లీ/కోల్‌కతా: కొత్త వ్యవసాయ చట్టాల్లో అర్థంపర్థం లేని సవరణల అంశాన్ని ప్రస్తావించడం, తమకు ప్రేమ లేఖలు రాయడం మానుకోవాలని రైతులు కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న సవరణలను తాము ఎప్పుడో తిరస్కరించామని గుర్తుచేశారు. ప్రభుత్వంతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని ఉద్ఘాటించారు. కొత్త చట్టాలను రద్దు చేయాలన్న తమ డిమాండ్‌లో ఎలాంటి మార్పు లేదని తేల్చిచెప్పారు. ప్రభుత్వం లిఖితపూర్వకమైన ఒక సరైన ప్రతిపాదనతో చర్చలకు ముందుకు రావాలని కోరారు. సవరణలను రైతులు వ్యతిరేకిస్తున్నారని ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లామని రైతు సంఘం నేత శివకుమార్ కక్కా బుధవారం చెప్పారు. మరిన్ని సంస్కరణలు తథ్యం వ్యవసాయ రంగంలో సంస్కరణలను ప్రభుత్వం కొనసాగిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ బుధవారం చెప్పారు. ఈ రంగంలో చాలా అంశాల్లో ఇంకా సంస్కరణలు చేపట్టాల్సి ఉందన్నారు. మూడు కొత్త సాగు చట్టాలపై రైతుల సందేహాలను నివృత్తి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ చట్టాలపై రైతులు తదుపరి చర్చల కోసం ముందుకు వస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఏ సమస్య అయినా చర్చల ద్వారానే పరిష్కారం అవుతుందని గుర్తుచేశారు. తదుపరి చర్చల కోసం తేదీ, సమయాన్ని ఖరారు చేయాలని రైతు సంఘాలకు విజ్ఞప్తి చేశారు. నూతన సాగు చట్టాలపై ప్రభుత్వం– రైతు సంఘాల మధ్య ఇప్పటిదాకా ఐదుసార్లు చర్చలు జరగ్గా, అవన్నీ విఫలమయ్యాయి. మరోవైపు కొన్ని రైతు సంఘాలు కొత్త చట్టాల విషయంలో ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నాయి. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎన్జీవోస్ ఆఫ్ రూరల్ ఇండియా సదస్సులో తోమర్ పేర్కొన్నారు. నూతన వ్యవసాయ చట్టాలకు మద్దతు తెలుపుతూ ఇప్పటిదాకా 3,13,363 మంది రైతుల సంతకాలతో తనకు లేఖలు వచ్చాయని తెలిపారు. వీరిలో పంజాబ్, హరియాణా రైతులు సైతం ఉన్నారని చెప్పారు. రైతన్నలకు అండగా ఉంటాం: మమతా బెనర్జీ నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళన కొనసాగిస్తున్న రైతులతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం ఫోన్ ద్వారా మాట్లాడారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) రైతులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అలాగే ఐదుగురు టీఎంసీ ఎంపీలు డెరెక్ ఓ బ్రెయిన్, శతాబ్ది రాయ్, ప్రసూన్ బెనర్జీ, ప్రతిమా మండల్, నదీమ్ ఉల్ హక్ ఢిల్లీలో రైతులను స్వయంగా కలిశారు. వారి పోరాటానికి సంఘీభావం ప్రకటించారు. నేడు రాష్ట్రపతితో కాంగ్రెస్ ఎంపీల భేటీ కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్‌గాంధీ నేతృత్వంలోని బృందం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో నేడు భేటీ కానుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీలు, నేతలు గురువారం విజయ్ చౌక్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించనున్నారు. అనంతరం రామ్నా«థ్ కోవింద్‌తో సమావేశమై, కొత్త చట్టాలకు వ్యతిరేకంగా సేకరించిన 2 కోట్ల సంతకాలతో పాటు మెమోరాండం సమర్పించనున్నారు. కొత్త చట్టాలను రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఈ సంతకాలను సేకరించింది. 25న రైతులతో మోదీ సమావేశం ప్రధాని మోదీ డిసెంబర్ 25న దేశంలోని 9 కోట్ల మంది రైతులను ఉద్దేశించి ఉపన్యసించనున్నారు. వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వ విధానాన్ని మరోమారు వెల్లడించనున్నారు. ఆన్లైన్లో జరిగే ఈ సమావేశంలో ఆరు రాష్ట్రాల నుంచి ఎంపిక చేసిన రైతులు పాల్గొంటారు. వారి ప్రయోజనం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై తమ అభిప్రాయాలను పంచుకుంటారని ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. -
కేంద్రానికి రైతుల హెచ్చరిక
న్యూ ఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని అటు రైతులు, కావాలంటే సవరణలు చేసైనా సరే అమలు చేస్తామని ఇటు కేంద్రం మొండిపట్టు పడుతోంది. దీంతో కొద్ది రోజులుగా చేపట్టిన రైతుల ఆందోళనలు తగ్గుముఖం పట్టడం లేదు. ఇద్దరి మధ్య జరుగుతున్న చర్చలు కూడా ముందుకు సాగడం లేదు. ఈ క్రమంలో చర్చలకు రమ్మంటున్న కేంద్రం ఆహ్వానాన్ని రైతు సంఘాలు తిరస్కరించాయి. గతంలో పంపిన సవరణలను ఇప్పటికే తిరస్కరించామని, మళ్లీ వాటిని పంపొద్దు అని కోరాయి. కాలయాపనతో రైతుల నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీయాలని కేంద్రం చూస్తోందని, కానీ దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని రైతు సంఘాలు హెచ్చరించాయి. కేంద్ర ప్రభుత్వం సమగ్ర ప్రతిపాదనలతో రావాలని, అప్పుడే తిరిగి చర్చలను ప్రారంభిస్తామని తేల్చి చెప్పాయి. రైతుల ఐక్యవేదిక పేరుతో కేంద్రానికి లేఖ రాశామని, రాత పూర్వక హామీలతో చర్చలకు రావాలని కోరుతున్నామని తెలిపాయి. రైతులు చర్చలకు సిద్ధంగా లేరనే ప్రచారం అవాస్తవమని స్పష్టం చేశాయి. తమ ఉద్యమాన్ని బలహీనం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డాయి. (చదవండి: రైతుల శక్తి అంతింత కాదయ్యా!) కాగా అంతకుముందు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రైతులకు మెరుగైన పంట ధర లభించేలా చేస్తామని హామీ ఇచ్చారు. వేర్వేరు పథకాల ద్వారా వ్యవసాయ రంగంలో లోటుపాట్లు సరిదిద్దుతామని చెప్పారు. కోవిడ్ సమయంలో కూడా వ్యవసాయ రంగం ప్రభావితం కాలేదన్నారు. 8 నెలల వ్యవధిలో కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా కోటి మంది రైతులకు రూ.లక్ష కోట్ల మేర రుణ సదుపాయం అందించామని తెలుపుతూ దీనికి సహకరించిన బ్యాంకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇప్పటికే కొన్ని సంస్కరణలు చేపట్టామని, భవిష్యత్తులో మరిన్ని సంస్కరణలు తీసుకొస్తామని పేర్కొన్నారు. (చదవండి: చర్చలకు మేము ఎల్లప్పుడూ సిద్ధమే) -
రద్దు చేసే వరకు వదలం
న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని రైతులు స్పష్టం చేశారు. ఈ పోరాటంలో గెలుపు తప్ప వేరే మార్గం లేని దశకు చేరుకున్నామని వ్యాఖ్యానించారు. ఢిల్లీ– నోయిడా రహదారిలోని చిల్లా బోర్డర్‌ను బుధవారం పూర్తిగా దిగ్బంధిస్తామని రైతు సంఘాల నేతలు మంగళవారం హెచ్చరించారు. ప్రభుత్వంతో చర్చల నుంచి తాము పారిపోవడం లేదని, ప్రభుత్వమే సరైన ప్రతిపాదనలతో ముందుకు రావాలని స్పష్టం చేశారు. ‘చట్టాలను రద్దు చేయబోం అని ప్రభుత్వం చెబుతోంది. రద్దు చేసేలా చేస్తాం అని మేమంటున్నాం’ అని సింఘు సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైతు సంఘం నేత జగ్జీత్ సింగ్ దల్లేవాల్ వ్యాఖ్యానించారు. రానున్న రోజుల్లో నిరసనను మరింత ఉధృతం చేస్తామని మరో నేత యుధ్వీర్ సింగ్ పేర్కొన్నారు. నిరసనల సందర్భంగా చనిపోయిన రైతుల స్మృతిలో డిసెంబర్ 20వ తేదీని ‘నివాళి రోజు’గా జరపాలని దేశప్రజలకు రైతు నేతలు పిలుపునిచ్చారు. అన్ని గ్రామాలు, తాలూకా కేంద్రాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ కార్యక్రమం నిర్వహించాలని కోరారు. రెతు సంఘాల మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ‘రైతు ఆందోళనల వల్ల కరోనా వైరస్ ప్రబలుతుంది అని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఇప్పటివరకు ఈ దీక్షల్లో పాల్గొంటున్నవారిలో ఒక్కరికి కూడా కరోనా సోకలేదు. దేవుడు మాతోనే ఉన్నాడు’ అన్నారు. నిరసనల్లోకి మహిళలు.. సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఉద్యమం తీవ్రతరమవుతోంది. రైతు కుటుంబాలకు చెందిన 2000 మంది మహిళలు త్వరలోనే నిరసనల్లో చేరతారని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నామని రైతు సంఘాల నేతలు చెప్పారు. మరి కొద్ది రోజుల్లోనే వారు ఢిల్లీ సరిహద్దులకు చేరుకుంటారని తెలిపారు. పంజాబ్ నుంచి రానున్న మహిళల కోసం అవసరమైన వసతిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. చర్చలకు సిద్ధంగానే ఉన్నాం: తోమర్ నిజమైన రైతు సంఘం నేతలతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగానే ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పేర్కొన్నారు. చాలా రాష్ట్రాలు కొత్త వ్యవసాయ చట్టాలను స్వాగతించాయన్నారు. ‘కనీస మద్దతు ధర విధానం అనేది పాలనాపరమైన నిర్ణయం. అది ఎప్పటిలాగానే కొనసాగుతుంది’ అని చెప్పారు. 60 వేల మందికి పైగా.. ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న రైతుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ప్రస్తుతం 60 వేలకు పైగా నిరసనకారులు అక్కడ ఉన్నారని హరియాణా పోలీసులు తెలిపారు. నిరసన కారుల సంఖ్య మరింత పెరిగితే పరిస్థితి అదుపు తప్పే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనకారుల సంఖ్య 60 వేలకన్నా ఎక్కువగా ఉంటుందని, ఇంకా పంజాబ్, హరియాణా, యూపీ, మధ్యప్రదేశ్‌ల నుంచి రైతులు వస్తున్నారని రైతు నేతలు తెలిపారు. రైతులను అడ్డుకునేందుకు పంజాబ్, హరియాణా సరిహద్దుల్లో పోలీసులు చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేశారు. ముందుజాగ్రత్త చర్యగా చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేశామని హరియాణా డీజీపీ మనోజ్ యాదవ్ తెలిపారు. -
రైతన్నలూ.. చర్చలకు రండి
సాక్షి, న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాల విషయంలో రైతు సంఘాల నేతలతో తదుపరి చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చెప్పారు. రాతపూర్వకంగా ఇస్తామన్న హామీలను పరిశీలించాలని కోరారు. చర్చల తేదీని వారే నిర్ణయించవచ్చని అన్నారు. వ్యవసాయ చట్టాల్లోని కొన్ని నిబంధనలను సవరిస్తామంటూ ప్రభుత్వం ఇచ్చిన హామీని తిరస్కరిస్తూ రైతు సంఘాలు తదుపరి ఆందోళనకు కార్యాచరణ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తోమర్ గురువారం ఢిల్లీలో రైల్వే, ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయెల్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ‘‘రైతులకు అభ్యంతరాలు ఉంటే కొత్త చట్టాల్లో ఏవైనా నిబంధనలను విశాల దృక్పథంతో పరిశీలించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైతుల అనుమానాలను నివృత్తి చేస్తాం. వారి సమస్యలను పరిష్కరించడానికి రైతు సంఘాల నాయకుల సలహాల కోసం ఎదురుచూస్తున్నాం. కానీ, కొత్త చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌తో వారు మళ్లీ మొదటికొస్తున్నారు’’ అని తోమర్ వ్యాఖ్యానించారు. చట్టాలను పూర్తిగా రద్దు చేయాలన్న డిమాండ్‌ను తోసిపుచ్చారు. ‘‘తీవ్రమైన చలి వాతావరణంలో, కోవిడ్ మహమ్మారి వ్యాప్తి సమయంలో రైతులు నిరసన వ్యక్తం చేస్తుండడం పట్ల ఆందోళన చెందుతున్నాం. ప్రభుత్వ ప్రతిపాదనను రైతు సంఘాలు పరిగణనలోకి తీసుకోవాలి’’ అని తోమర్ చెప్పారు. సమస్య పరిష్కారంపై తాను అశాభావంతో ఉన్నానన్నారు. చర్చలు పురోగతిలో ఉండగానే రైతు సంఘాలు తదుపరి దశ పోరాట కార్యాచరణను ప్రకటించడం సరైంది కాదని తోమర్ ఆక్షేపించారు. కొత్త చట్టాలతో ఎంఎస్పీకి ఢోకా లేదు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) అమలు కొనసాగుతుందని ప్రభుత్వం చెబుతోంది. దీనిపై రాతపూర్వక హామీ ఇస్తామని బుధవారం ప్రతిపాదించింది. అయితే, ఈ ప్రతిపాదనను రైతు సంఘాలు తిరస్కరించాయి. రైతుల భయాందోళనలు తొలగించడానికి కనీసం 7 సమస్యలపై అవసరమైన సవరణలు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. వీటికి రైతు సంఘాలు ససేమిరా అనడంతో చర్చలకు విఘాతం ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులు తదుపరి చర్చలకు పిలుపునిచ్చారు. కొత్త చట్టాలు ఎంఎస్పీని ప్రభావితం చేయవని, పైగా రక్షణగా ఉంటుందని పీయూష్ గోయెల్ అన్నారు. రైతులు తమ ఉత్పత్తులను ప్రైవేట్ మార్కెట్లలో విక్రయించడానికి అదనపు ఎంపికను మాత్రమే ఈ చట్టం ఇస్తుందని వివరించారు. సివిల్ కోర్టుల్లో అప్పీల్ చేసుకోవచ్చు రైతుల అభ్యంతరాలపై ప్రభుత్వం ముసాయిదా ప్రతిపాదనను పంపుతుందని 13 యూనియన్ నాయకులతో మంగళవారం రాత్రి జరిగిన సమావేశంలో హోం మంత్రి అమిత్ షా చెప్పగా.. ఈ చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాల నేతలు పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో బుధవారం జరగాల్సిన చర్చలు రద్దయ్యాయి. కొత్త చట్టాల తరువాత వ్యవసాయ మార్కెట్లు బలహీనపడతాయన్న రైతుల ఆందోళనకు పరిష్కారంగా.. సవరణలు చేయవచ్చని, రాష్ట్ర ప్రభుత్వాలు మండీల వెలుపల పనిచేసే వ్యాపారులను నమోదు చేయవచ్చని కేంద్రం ప్రతిపాదించిందని తాజాగా మంత్రులు గుర్తుచేశారు. రాష్ట్రాలు వాటిపై కూడా ఏపీఎంసీ మండీల తరహాలో పన్ను, సెస్ విధించవచ్చని వివరించారు. వివాదాల పరిష్కారం కోసం సివిల్ కోర్టుల్లో అప్పీల్ చేసే హక్కు రైతులకు లభించకపోవడాన్ని రైతులు ప్రశ్నిస్తున్నారు. అందుకే సివిల్ కోర్టుల్లో అప్పీల్ చేయడానికి వీలుగా నిబంధనల్లో సవరణలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రులు చెప్పారు. కార్పొరేట్ సంస్థలు సాగు భూములను స్వాధీనం చేసుకుంటాయన్న భయాన్ని తొలగించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. కాంట్రాక్ట్ ఫార్మింగ్ కింద సాగు భూములను అటాచ్ చేయడంపై ఇంకా స్పష్టత ఇస్తామన్నారు. ప్రస్తుత కనీస మద్దతు ధర అమలు ప్రక్రియ కొనసాగుతుందని లిఖితపూర్వక హామీ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమేనన్నారు. ప్రతిపాదిత విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలన్న డిమాండ్లపై స్పందిస్తూ.. రైతుల విషయంలో ప్రస్తుత విద్యుత్ బిల్లు చెల్లింపు విధానంలో ఎటువంటి మార్పు ఉండదని మంత్రులు వెల్లడించారు. రైతుల వెనుక ఎవరున్నారో తేల్చండి ఢిల్లీలో ఆందోళన కొనసాగిస్తున్న రైతుల వెనుక ఏయే శక్తుల ఉన్నాయో నిగ్గు తేల్చాలని నరేంద్ర సింగ్ తోమర్, పీయూస్ గోయెల్ ప్రసార మాధ్యమాలను కోరారు. ‘‘మీడియా కళ్లు చురుగ్గా ఉంటాయి. మీ దర్యాప్తు నైపుణ్యాలను ఉపయోగించండి. రైతుల ఆందోళన వెనుక ఉన్న శక్తులు ఏమిటో బయటపెట్టండి. చర్చల కోసం రైతులు ముందుకు రాకుండా వెనక్కి లాగుతున్న అంశమేమిటో గుర్తించండి’’ అని పేర్కొన్నారు. కార్పొరేట్ల కోసమే.. కొత్త చట్టాలను రైతులు స్వాగతిస్తున్నారంటూ వ్యవసాయ మంత్రి తోమర్ చేసిన ప్రకటనను అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి (ఏఐకేఎస్‌సీసీ) తప్పుపట్టింది. ఈ చట్టాల విషయంలో కేంద్ర మంత్రులు తప్పుడు వాదనలు వినిపిస్తున్నారని, బహిరంగంగా అసత్యాలు వల్లెవేస్తున్నారని విమర్శించింది. బడా కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసమే కొత్త చట్టాలు తెచ్చారని ఆరోపించింది. ఈ విషయాన్ని సామాన్య ప్రజలు సైతం అర్థం చేసుకుని రైతుల పోరాటానికి మద్దతు ఇస్తున్నారని గుర్తుచేసింది. 14 రోజుల్లో 15 మంది.. చండీగఢ్: సాగు చట్టాలపై ఢిల్లీలో, నగర శివార్లలో 14 రోజులుగా ఉద్యమిస్తున్న రైతుల్లో 15 మంది వేర్వేరు కారణాలతో ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను సహచర రైతులు పంజాబ్‌లోని స్వస్థలాలకు చేరుస్తున్నారు. ప్రతి రోజూ ఒక్క మృతదేహమైనా ఢిల్లీ నుంచి పంజాబ్‌కు చేరుకుంటోందని వారు చెప్పారు. రోడ్డు ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు. గుండెపోటుతో 10 మంది రైతన్నలు తనువు చాలించారు. చలిని తట్టుకోలేక మరో రైతు మరణించాడు. మృతుల్లో మహిళలూ ఉన్నారు. రైలు పట్టాలపై పోరాటం! సా గుచట్టాలను తక్షణమే రద్దు చేయాలనే తమ డిమాండ్‌ను నెరవేర్చకపోతే ఇకపై దేశవ్యాప్తంగా రైలు పట్టాలపై పోరాటం సాగిస్తామని హెచ్చరించారు. ఈ ఉద్యమ కార్యాచరణ తేదీని త్వరలోనే ప్రకటిస్తామన్నారు. సింఘు వద్ద ఆందోళన కొనసాగిస్తున్న రైతులు గురువారం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం దిగి రాకపోతే ఢిల్లీకి దారితీసే అన్ని ప్రధాన రహదారులను దిగ్బంధిస్తామని పేర్కొన్నారు. సర్కారు మొండి వైఖరి అవలంబిస్తే రైల్వే ట్రాక్‌లపై పోరాటం తప్పదని, ఇది పంజాబ్, హరియాణాల్లోనే కాదు, దేశమంతటా జరుగుతుందని రైతు సంఘం నాయకుడు బూటా సింగ్ స్పష్టం చేశారు. -
ఆ రాష్ట్రాల్లో కాంట్రాక్టు వ్యవసాయం
ఢిల్లీ: రైతు సమస్యలు పరిష్కరించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. మద్దతు ధర, మార్కెట్ వ్యవస్థ యధావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఏ విషయాల్లో కేంద్రం చట్టాలు చేయవచ్చనేదాన్ని రైతులకు లేఖ ద్వారా తెలిపామన్నారు. గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్, హర్యానాలో కాంట్రాక్టు వ్యవసాయం జరుగుతుందని, అక్కడ ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు రాలేవని తెలిపారు. విద్యుత్ బిల్లులు నష్టం కలిగిస్తాయన్న అంశంపై కూడా రైతులకు స్పష్టత ఇచ్చామని పేర్కొన్నారు. రైతులు లేవనెత్తిన అభ్యంతరాలపై కేంద్ర వైఖరిని లిఖిత పూర్వకంగా రైతులకు అందజేశామన్నారు. గురువారం నరేంద్ర సింగ్ తోమర్ మీడియాతో మాట్లాడుతూ.. "కేంద్రం ప్రతిపాదనలపై రైతు సంఘాలు పునరాలోచించుకోవాలి. రైతు సంక్షేమం కోసం కేంద్రం లక్ష కోట్ల ప్యాకేజీకి సిద్దమైంది. గ్రామాలను, వ్యవసాయ రంగాన్ని ఆత్మనిర్బర్ చేసినప్పుడే దేశం ఆత్మనిర్బర భారత్ అవుతుంది. వ్యవసాయ చట్టాల పట్ల రైతులకు ఉన్న అపోహలు తొలగిస్తున్నాం. రైతులతో చర్చలు జరిపేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. రైతు సంఘాలు చర్చలకు ముందుకు రావాలి" అని కోరారు. (చదవండి: రైతు ఆందోళనలు: కేంద్రం ప్రతిపాదనలు) కాగా, కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు గత కొద్దిరోజులుగా ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆందోళనల్లో భాగంగా మంగళవారం చేపట్టిన భారత్ బంద్ విజయవంతమైంది. వీరితో కేంద్రం జరుపుతున్న చర్చలు సఫలీకృతం కావడం లేదు. వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దుకు కేంద్రం నిరాకరిస్తుండగా, సవరణలు చేస్తామని చెప్పింది. ఈ ప్రతిపాదనను తిరస్కరించిన రైతులు ఉద్యమాన్ని మరింత ఉదృతం చేసే దిశగానే అడుగులు వేస్తున్నారు. (చదవండి: ఉద్యమం ఉధృతం వెనుక కారణాలు.. డిమాండ్లు) -
ఉద్యమం ఉధృతం వెనుక కారణాలు.. డిమాండ్లు
ఢిల్లీ : నూతన వ్యవసాయచట్టాలను రద్దు చేయాలంటూ రైతులు చేస్తున్న ఆందోళన మరింత ఉదృతంగా మారింది. కేంద్ర నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసేవరకు తమ ఉద్యమం కొనసాగుతుందని రైతులు తేల్చి చెబుతున్నారు. వ్యవసాయ చట్టాల రద్దు సహా పలు డిమాండ్లతో రెండు వారాలుగా వేలాదిగా రైతులు దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. రైతు సంఘాలు, కేంద్ర ప్రభుత్వం మధ్య జరుగుతున్న చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. ఆరోవిడత చర్చలకు ముందు రైతుల డిమాండ్లకు సంబంధించి ప్రభుత్వం బుధవారం ఉదయం రైతు సంఘాలకు కొన్ని ప్రతిపాదనలను పంపించింది. వ్యవసాయ చట్టాల రద్దు కుదరదని అందులో స్పష్టం చేసింది. ప్రతిగా, రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని కొన్ని సవరణలకు సిద్ధమని పేర్కొంది. అయితే రైతులు మాత్రం వ్యవసాయ చట్టాల రద్దు మాత్రమే తమ ఏకైక డిమాండ్ అని కేంద్రానికి తేల్చి చెప్పారు. రైతుల ఆందోళన ఇంత ఉదృతం చేయడానికి కారణాలు.. వారు చేస్తున్న డిమాండ్లు, అభ్యంతరాలు.. ప్రభుత్వం చెబుతున్న సమాధానాలు ఏంటనేవి ఒకసారి పరిశీలిద్దాం. నూతన వ్యవసాయ చట్టాలు రైతుల డిమాండ్ : వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి. ప్రభుత్వ ప్రతిపాదన: రైతులకు చట్టంలో ఉన్న అభ్యంతరాలపై చర్చించడానికి, పరిగణనలోకి తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పంటల వ్యాపారం రైతుల సమస్య: ప్రభుత్వ సంస్థకు వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించే వెసులుబాటు ముగుస్తుంది. పంటల కొనుగోలు పూర్తిగా ప్రైవేటు చేతుల్లోకి వెళ్తుంది. ప్రభుత్వ సమాధానం: కొత్త చట్టాల్లో ప్రభుత్వ సేకరణ వ్యవస్థలో జోక్యం చేసుకునే ప్రతిపాదన లేదు. ఎంఎస్పీ కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయగలవు. అక్కడ మండీలను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు స్వేచ్ఛ ఉంది. ప్రభుత్వ ప్రతిపాదన: ఎమ్మెస్పీ వ్యవస్థ కూడా క్రమంగా బలపడుతుంది. ఎమ్మెస్పీపై కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇస్తుంది. రైతుల భూమి ఆక్రమణ రైతుల సమస్య: రైతుల భూమిని పెద్ద పారిశ్రామికవేత్తలు ఆక్రమించుకుంటారు. రైతు తన భూమిని కోల్పోతాడు. ప్రభుత్వ సమాధానం: వ్యవసాయ ఒప్పంద చట్టం ప్రకారం, వ్యవసాయ భూముల అమ్మకం, లీజు మరియు తనఖాపై ఎటువంటి ఒప్పందం ఉండకూడదు. రైతు భూమిలో ఏదైనా నిర్మాణం జరిగితే, ఒప్పందం ముగిసిన తర్వాత పంట కొనుగోలుదారు దానిని తీసివేయాలి. నిర్మాణం తొలగించకపోతే, అది రైతు సొంతం అవుతుంది. ప్రభుత్వ ప్రతిపాదన: రైతు భూమిపై ఒక నిర్మాణ చేపట్టే సందర్భంలో, పంట కొనేవారు దానిపై రుణం తీసుకోలేడు, నిర్మాణాన్ని తన ఆధీనంలో ఉంచుకోలేడు. వ్యవసాయ మార్కెట్ కమిటీలు రైతుల సమస్య: ఏపీఎంసీ మండీలు బలహీనపడ్తాయి. దాంతో, రైతు ప్రైవేటు మండీల బారిన పడే అవకాశం ఉంది. ప్రభుత్వ సమాధానం: మండీలు కాకుండా, రైతులు తమ పంటలను కోల్డ్ స్టోరేజ్ నుంచి, నేరుగా తమ పొలాల నుంచి లేదా కర్మాగారాల్లో కూడా విక్రయించడానికి చట్టాల్లో వీలు కల్పించాము. రైతుల ఆదాయం పెరుగుతుంది. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, ఎమ్మెస్పీ విధానం గతంలో మాదిరిగానే ఉంటుంది. ప్రభుత్వ ప్రతిపాదన: రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ మండీలను నమోదు చేసే విధంగా చట్టాన్ని మార్చవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇటువంటి మండీల నుంచి సెస్ తిరిగి పొందగలవు. రైతుల భూమి స్వాధీనం రైతుల సమస్య: ఈ చట్టం రైతుల భూమిని అటాచ్ చేయిస్తుంది. ప్రభుత్వ సమాధానం: రికవరీ కోసం రైతు భూమిని అటాచ్ చేయడం కుదరదని కొత్త చట్టంలోని సెక్షన్ 15లో స్పష్టంగా ఉంది. నిబంధనలను ఉల్లంఘిస్తే.. కొనుగోలుదారుకు 150% జరిమానా విధించవచ్చు. కాని రైతులకు జరిమానా విధించే నిబంధన చట్టంలో లేదు. ప్రభుత్వ ప్రతిపాదన: అవసరమైతే ఈ విషయంలో మరింత స్పష్టత ఇస్తాం. కోర్టులో వివాదాల పరిష్కారం రైతుల సమస్య: వివాదం ఉంటే, రైతులు సివిల్ కోర్టుకు వెళ్లలేరని కొత్త చట్టం చెబుతోంది. ప్రభుత్వ సమాధానం: 30 రోజుల్లో సమస్యను పరిష్కరించడానికి ఒక నిబంధన ఉంది. సయోధ్య చేసేందుకు ఒక బోర్డు ద్వారా పరస్పర ఒప్పందం కుదిరేలా ఏర్పాటు జరిగింది. ప్రభుత్వ ప్రతిపాదన: సివిల్ కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఇవ్వవచ్చు. పాన్ కార్డ్‌తో పంటను కొనడం రైతుల సమస్య: రిజిస్ట్రేషన్‌కు బదులు గా పాన్ కార్డు చూపించి పంటను కొనుగోలు చేస్తే, మోసం కూడా జరుగుతుంది. ప్రభుత్వ సమాధానం: మరిన్ని మార్కెటిం గ్ అవకాశాలను అందించడానికి పాన్ కార్డ్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ప్రభుత్వ ప్రతిపాదన: పంటలు కొనేవారికి రిజిస్ట్రేషన్ నిబంధనలు రూపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇవ్వవచ్చు. రిజిస్ట్రేషన్ రైతుల సమస్య: సాగు ఒప్పందాన్ని రిజిస్ట్రేషన్ చేసే విధానం లేదు. ప్రభుత్వ సమాధానం: కొత్త చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు రిజిస్ట్రేషన్ వ్యవస్థను ప్రారంభించవచ్చు. వారు రిజిస్ట్రేషన్ ట్రిబ్యునళ్లను కూడా ఏర్పాటు చేయవచ్చు. ప్రభుత్వ ప్రతిపాదన: రాష్ట్ర ప్రభుత్వాలు రిజిస్ట్రేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసేవరకు, వ్యవసాయ ఒప్పందం తర్వాత 30 రోజుల్లోగా దాని కాపీని ఎస్డీఎం కార్యాలయంలో సమర్పించవచ్చు. పంట వ్యర్థాలను తగలబెట్టడంపై శిక్ష రైతుల సమస్య: ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఎన్సీఆర్ ఆర్డినెన్స్ 2020ను రద్దు చేయాలి. దీనివల్ల పంట వ్యర్థాలను తగలబెట్టినందుకు శిక్ష ఉంటుంది. ప్రభుత్వ ప్రతిపాదన: రైతుల అభ్యంతరాలను దూరం చేస్తాం. విద్యుత్ బిల్లు రైతులు: విద్యుత్ సవరణ బిల్లు రద్దు చేయాలి. ప్రభుత్వ సమాధానం: ఈ బిల్లు చర్చలో ఉంది. సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఖాతాలో వేయాలనే ప్రతిపాదన ఉంది. ప్రభుత్వ ప్రతిపాదన: విద్యుత్ బిల్లు చెల్లించే విధానంలో ఎటువంటి మార్పు ఉండదు. -
ఉద్యమం ఇక ఉధృతం
సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ రైతులు చేస్తున్న ఉద్యమం మరింత ఉధృతం కానుంది. రైతు సంఘాలు, కేంద్ర ప్రభుత్వం మధ్య జరుగుతున్న చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. ఆరోవిడత చర్చలకు ముందు రైతుల డిమాండ్లకు సంబంధించి ప్రభుత్వం బుధవారం ఉదయం రైతు సంఘాలకు కొన్ని ప్రతిపాదనలను పంపించింది. వ్యవసాయ చట్టాల రద్దు కుదరదని అందులో స్పష్టం చేసింది. ప్రతిగా, రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని కొన్ని సవరణలకు సిద్ధమని పేర్కొంది. కనీస మద్దతు ధర విధానం కొనసాగింపుపై లిఖితపూర్వక హామీ ఇస్తామని వివరించింది. అయితే, ఈ ప్రతిపాదనలను రైతు సంఘాల నేతలు తిరస్కరించారు. వ్యవసాయ చట్టాల రద్దు మాత్రమే తమ ఏకైక డిమాండ్ అని స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ఉద్యమాన్ని తీవ్రం చేయాలని రైతు నేతలు నిర్ణయించారు. అందుకు ఒక కార్యాచరణను ప్రకటించారు. ఈ నేపథ్యంలో బుధవారం కేంద్ర మంత్రులు, రైతు సంఘాల ప్రతినిధుల మధ్య జరగాల్సిన ఆరో విడత చర్చలు రద్దయ్యాయి. వ్యవసాయ చట్టాల రద్దు సహా పలు డిమాండ్లతో రెండు వారాలుగా వేలాదిగా రైతులు దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. కొత్తవేం లేవు ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదనలపై చర్చించిన అనంతరం రైతు నేతలు విలేకరులతో మాట్లాడారు. ఆ ప్రతిపాదనల్లో కొత్తవేం లేవని, గతంలో చర్చల సందర్భంగా వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఇవే ప్రతిపాదనలను తమ ముందు ఉంచారని వివరించారు. వాటిని ‘సంయుక్త కిసాన్ కమిటీ’ పూర్తిగా తిరస్కరిస్తోందని రైతు నేత శివ కుమార్ కక్కా తెలిపారు. ఆ ప్రతిపాదనలు దేశవ్యాప్తంగా రైతులను అవమానించేవిగా ఉన్నాయన్నారు. ప్రభుత్వం నుంచి కొత్తగా ఏవైనా ప్రతిపాదనలు వస్తే పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ఉద్యమాన్ని ఉధృతం చేయడంలో భాగంగా, డిసెంబర్ 14న ఉత్తరాది రాష్ట్రాల రైతులు ‘ చలో ఢిల్లీ’ కార్యక్రమం చేపడ్తారని, దక్షిణాది రాష్ట్రాల రైతులు స్థానిక జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు జరుపడంతో పాటు, బీజేపీ కార్యాలయాలను ముట్టడిస్తారని రైతు నేతలు తెలిపారు. అలాగే, డిసెంబర్ 12న అన్ని టోల్ ప్లాజాల వద్ద ‘టోల్ ఫ్రీ’ కార్యక్రమం చేపడ్తామన్నారు. అదే రోజు ఢిల్లీ –జైపూర్ హైవే, ఢిల్లీ–ఆగ్రా హైవేలను దిగ్బంధిస్తామన్నారు. పారిశ్రామిక వేత్తలు అంబానీ, అదానీలకు చెందిన సంస్థలకు సంబంధించిన సేవలు, ఉత్పత్తులను బహిష్కరించాలని, టెలీకాం సేవలను జియో నుంచి వేరే సంస్థలకు మార్చుకోవాలని పిలుపునిచ్చారు. జాతీయ స్థాయిలో బీజేపీ నాయకులను ఘొరావ్ చేయాలని, నాయకుల ఇళ్లు, కార్యాలయాల ముందు నిరసన ప్రదర్శనలు జరపాలని విజ్ఞప్తి చేశారు. మీడియాలో వస్తున్నట్లు రైతు సంఘాల నేతల్లో ఎలాంటి విభేదాలు లేవని కక్కా స్పష్టం చేశారు. రాష్ట్రపతిని కలిసిన విపక్ష నేతలు రైతు ఆందోళన అంశంపై బుధవారం ప్రతిపక్ష పార్టీల నాయకుల బృందం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసింది. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని కోరుతూ వారు రాష్ట్రపతికి మెమోరాండం సమర్పించారు. రాష్ట్రపతిని కలిసిన వారిలో ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా, డీఎంకే నాయకుడు టికెఎస్ ఎలంగోవన్ ఉన్నారు. ఆ బిల్లులకు ప్రభుత్వం అప్రజాస్వామికంగా పార్లమెంటులో ఆమోదం పొందిందని వివరించారు. -
మద్దతు ధరకు ఢోకా లేదు
సాక్షి, న్యూఢిల్లీ: మద్దతు ధర ప్రధాన అంశంగా వ్యవసాయ బిల్లుల రద్దు డిమాండ్ చేస్తున్న రైతు సంఘాల ఆందోళనను పరిష్కరించేందుకు కేంద్రం స్పష్టమైన ప్రతిపాదనలతో ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. రైతులతో చర్చలు జరుపుతున్న కేంద్ర ప్రభుత్వం ఈనెల 9న జరగనున్న ఆరో విడత చర్చల్లో మరింత స్పష్టతతో రైతులకు భరోసా ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. రైతుల ప్రతినిధి బృందం, కేంద్ర మంత్రుల మధ్య విజ్ఞాన్ భవన్లో శనివారం జరిగిన ఐదో విడత చర్చలు అసంపూర్తిగా ముగిసిన విషయం తెలిసిందే. రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్రం మళ్లీ డిసెంబర్ 9న సమావేశం కానుంది. 12 రోజులుగా దేశ రాజధాని సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులు.. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా కనీస మద్దతు ధర(ఎమ్మెస్పీ)ను క్రమంగా తొలగించేందుకు ఈ చట్టాలు ఊతమిస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా మొదటి నుంచి ఈ అంశంపై ఆందోళన అవసరం లేదని చెబుతూ వస్తోంది. ఈ చట్టాలు చేసిన అనంతరం కూడా పలు పంటలకు మద్దతు ధర ప్రకటించినట్టు వివరిస్తోంది. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నడూ లేనంతగా మద్దతు ధరలు పెంచుతూ, రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా ముందుకు వెళుతున్నామని వాదిస్తోంది. గతంలోనూ చట్టరూపం లేదు.. ‘వ్యవసాయ వ్యయాలు మరియు ధరల కమిషన్’ (సీఏసీపీ) సిఫారసుల ఆధారంగా మొత్తం 22 వ్యవసాయ పంటలకు ప్రభుత్వం కనీస మద్దతు ధరలను(ఎమ్మెస్పీ) నిర్ణయిస్తుంది. పంటలకు ఎమ్మెస్పీని సిఫారసు చేస్తున్నప్పుడు సీఏసీపీ వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది. ఉత్పత్తి వ్యయంపై ఎమ్మెస్పీ ఒకటిన్నర రెట్లు అధికంగా ఉండాలని 2018–19 బడ్జెట్లోనే ప్రకటించామని, దీని ప్రకారమే అన్ని ఖరీఫ్, రబీ, ఇతర వాణిజ్య పంటల కనీస మద్దతు ధరలను పెంచినట్టు కేంద్రం వాదిస్తోంది. 2018–19, 2019–20 సంవత్సరాల్లో దేశపు సగటు ఉత్పత్తి వ్యయంపై కనీసం 50 శాతం మార్జిన్ తిరిగి వచ్చేలా ఈ చర్యను చేపట్టినట్టు పేర్కొంది. ఇదే సూత్రానికి అనుగుణంగా 2020–21 మార్కెటింగ్ సీజన్ కోసం అన్ని ఖరీఫ్ పంటలకు, రబీ పంటలకు మద్దతు ధర ప్రకటించామని తెలిపింది. మద్దతు ధరకు చట్టరూపం గతంలోనూ లేదని, ఇప్పుడు కూడా అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. దీనికి కొనసాగింపుగా ఐదో విడత చర్చల అనంతరం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మరోసారి స్పష్టత ఇచ్చారు. ‘ఎమ్మెస్పీ కొనసాగుతుందని మేం చెప్పాం. ఎమ్మెస్పీపై భయాలు, సందేహాలు పూర్తిగా నిరాధారమైనవి. అయితే రైతుల మనస్సులో ఏమైనా సందేహాలు ఉంటే, వాటిని నివృత్తి చేసేందుకు ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉంది. ఏపీఎంసీ చట్టం రాష్ట్రాలకు చెందినది. రాష్ట్రానికి చెందిన మండీలను ఏ విధంగానైనా ప్రభావితం చేయాలనేది మా ఉద్దేశం కాదు. ఈ దిశగా ఏపీఎంసీ చట్టాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇందులో ఎవరికైనా అనుమానాలు ఉంటే, వాటినీ నివృత్తి చేస్తాం. ఈ 9వ తేదీన జరగనున్న చర్చల్లో అన్ని అంశాలపై స్పష్టత వస్తుందని భావిస్తున్నాం’ అని తోమర్ తెలిపారు. రైతులు అభ్యంతరం వ్యక్తంచేస్తున్న 39 అంశాల్లోని 8 అంశాల్లో సవరణలు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. వెనక్కి తగ్గని రైతు సంఘాలు.. మద్ధతు ధరపై భరోసా ఇస్తే సరిపోదని, అది చేతల్లో కూడా ఉండాలని, చట్టబద్ధత తప్పని సరిగా కల్పించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎమ్మెస్పీకి చట్టరూపం అవసరం లేదని, అది కార్యనిర్వాహక నిర్ణయమని ప్రభుత్వం చెబుతుండగా.. ఉపాధి హామీ, ఆహార భద్రత వంటివి కూడా చట్టరూపం దాల్చకముందు కార్యనిర్వాహక నిర్ణయంగానే ఉండేవని రైతు సంఘాలు గుర్తుచేస్తున్నాయి. 9వ తేదీన జరిగే చర్చల్లో ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలించి, ఆ తదుపరి నిర్ణయం తీసుకుంటామని రైతు సంఘాలు చెబుతున్నాయి. ముందు ఈ మూడు చట్టాలు రద్దు చేస్తేనే కేంద్రం చెప్పేది ఏదైనా వింటామని స్పష్టం చేస్తున్నాయి. కేంద్రం సవరణలు తెస్తామని చెబుతున్నప్పటికీ ఈ మూడు చట్టాల మౌలిక స్వరూపం రైతులకు వ్యతిరేకంగా ఉందన్నది తమ ఆందోళన అని వివరిస్తున్నాయి. అందుకే రేపు 8వ తేదీన జరిగే భారత్ బంద్ ఆందోళన కార్యక్రమం కొనసాగుతుందని రైతు సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. -
చర్చల్లో ప్రతిష్టంభన.. పట్టువీడని రైతులు
న్యూఢిల్లీ : ఆందోళన బాట పట్టిన రైతు సంఘాలతో కేంద్రం జరుపుతున్న చర్చలు మరోసారి ఎటూ తేలకుండానే ముగిశాయి. శనివారం జరిగిన ఐదో విడత చర్చల్లో వ్యవసాయ చట్టాల రద్దుపైనే రైతు సంఘాల ప్రతినిధులు ప్రధానంగా పట్టుబట్టారు. అయితే, నిర్దుష్ట ప్రతిపాదనలు చేసేందుకు కేంద్రం 9వ తేదీ వరకు సమయం కోరింది. దీంతో 11 రోజులుగా దేశ రాజధాని కేంద్రంగా చేపట్టిన రైతు సంఘాల ఆందోళన మరికొద్ది రోజులు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమ డిమాండ్ల సాధనకు 8వ తేదీన రైతు సంఘాలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ బంద్‌కు పలు ప్రతిపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు కేంద్ర మంత్రులు, 40 మంది రైతు సంఘాల ప్రతినిధులతో ఐదో విడత చర్చలు ప్రారంభమయ్యాయి. దాదాపు 4 గంటలపాటు జరిగిన చర్చలకు కేంద్రం తరఫున వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ నాయకత్వం వహించారు. చర్చల్లో రైల్వేలు, వాణిజ్యం, ఆహారం శాఖల మంత్రి పీయూష్ గోయల్, పంజాబ్‌కు చెందిన ఎంపీ, వాణిజ్య శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాశ్ పాల్గొన్నారు. గత సమావేశాల్లో చర్చల సందర్భంగా హామీ ఇచ్చిన అంశాలపై కేంద్రం తీసుకున్న చర్యలను వ్యవసాయ శాఖ కార్యదర్శి సంజయ్ అగర్వాల్ వారికి వివరించారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చర్చల ప్రారంభం సందర్భంగా పంజాబీలో మంత్రి సోమ్ ప్రకాశ్ వారికి తెలిపారు. ఇటీవల తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతు ప్రతినిధులు గట్టిగా పట్టుబడ్డారు. స్పష్టమైన హామీ లభించకుంటే బయటకు వెళ్లిపోతామంటూ తెగేసి చెప్పారు. రైతుల పట్ల ప్రభుత్వం సానుకూల ధోరణితో ఉందనీ, వారి సమస్యలను పరిష్కరిస్తామని దీంతో మంత్రులు వారికి సర్దిచెప్పారు. అయితే, సాగు చట్టాల రద్దు విషయం తేల్చాలంటూ రైతు ప్రతినిధులు గంటపాటు మౌనవ్రతం సాగించారు. దీంతో ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు, అంతర్గతంగా చర్చలు జరిపి నిర్దిష్ట ప్రతిపాదనలు తయారు చేసేందుకు ఈ నెల 9 వరకు సమయం కావాలని ప్రభుత్వ ప్రతినిధులు కోరారు. దీంతో చర్చలు ఎటూ తేలకుండానే వాయిదా పడ్డాయి. ఆహారం, టీ వెంట తెచ్చుకున్న రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో సింఘూ వద్ద ఆందోళన సాగిస్తున్న ప్రాంతం నుంచి చర్చల్లో పాల్గొనేందుకు వచ్చిన రైతు సంఘాల ప్రతినిధులు ఆహారం, టీ తమతోపాటు తెచ్చుకున్నారు. గురువారం కూడా రైతులు ఆహారం, టీతోపాటు మంచినీరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. రైతు ప్రతినిధుల సూచనలు కోరాం: తోమర్ చర్చల అనంతరం మంత్రి తోమర్ మీడియాతో మాట్లాడారు. ‘కొన్ని కీలక అంశాలపై రైతు సంఘాల నేతల నుంచి నిర్దిష్ట సూచనలను కోరాం. అయితే, చలి తీవ్రత దృష్ట్యా ఆందోళనల్లో పాలుపంచుకుంటున్న వృద్ధులు, మహిళలు, పిల్లల్ని ఇళ్లకు పంపించాలని కోరాం’అని తెలిపారు. వివిధ పార్టీలు..సంఘాల మద్దతు 8వ తేదీన రైతు సంఘాలు ఇచ్చిన భారత్ బంద్ పిలుపునకు కాంగ్రెస్‌తోపాటు ఆర్జేడీ, తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, సీపీఐఎంఎల్, ఆర్ఎస్పీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తదితర వామపక్షాలు, డీఎంకే మద్దతు ప్రకటించాయి. బంద్‌కు 10 కేంద్ర కార్మిక సంఘాల వేదిక మద్దతుగా నిలిచింది. రైతులకు మద్దతుగా పంజాబ్‌కు చెందిన పలువురు మాజీ క్రీడాకారులు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు తమ పద్మశ్రీ, అర్జున అవార్డులను వాపసు చేసేందుకు ఢిల్లీకి బయలుదేరారు. రహదారులే గ్రామాలుగా... ఢిల్లీకి వెళ్లే కీలక రహదారులపై రైతులు నిరసలు తెలుపుతుండటంతో గడిచిన 10 రోజులుగా ఈ మార్గాల్లో ట్రాపిక్ జాంలు పెరిగిపోయాయి. దీంతో పోలీసులు కొన్ని మార్గాలను మూసివేసి, మరికొన్ని రోడ్లలో వాహనాలను దారి మళ్లిస్తున్నారు. దీర్ఘకాలం పోరుకు రైతులు సమాయత్తం అవుతుండటంతో కొన్ని రోడ్లు గ్రామాలుగా మారిపోయాయి. రైతులు రోడ్లపైనే ట్రాక్టర్లు నిలిపి, వాటిపై టెంట్లు వేసుకున్నారు. అక్కడే వంటావార్పూ చేపట్టారు. అవసరమైన సరుకులు, కాయగూరలు వంటివి అక్కడికి అందుతున్నాయి. సెల్ఫోన్లకు సోలార్ ప్యానళ్లతో చార్జింగ్ చేసుకుంటున్నారు. ఆందోళనల్లో పాలుపంచుకుంటున్న వృద్ధుల కోసం కొందరు వైద్యులు వైద్య శిబిరాలు సైతం ఏర్పాటు చేశారు. వృద్ధులు హుక్కా పీలుస్తూ కాలం గడుపుతున్నారు. చర్చలకు ముందు ప్రధానితో భేటీ రైతు సంఘాల ప్రతినిధులతో చర్చలకు వెళ్లేముం దు మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌లు ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. రైతుల ముందుంచబోయే ప్రతిపాదనలపై వారంతా కలసి చర్చించినట్లు సమాచారం. రైతుల ఆందోళనలపై కేంద్ర మంత్రులతో ప్రధాని చర్చలు జరపడం ఇదే మొదటి సారి. రైతు ప్రతినిధుల మౌనవ్రతం చర్చల సందర్భంగా మూడు వ్యవసాయ చట్టాల రద్దు విషయంలో రైతు సంఘాల ప్రతినిధులంతా మౌనవ్రతం పాటించారు. ప్రధానమైన ఈ డిమాండ్ కేంద్రానికి సమ్మతమా కాదా స్పష్టం చేయాలని కోరుతూ ప్రతినిధులు అవును/ కాదు అని రాసి ఉన్న కాగితాలను వారు నోటికి అతికించుకున్నారని పంజాబ్ కిసాన్ యూనియన్ నేత రుల్ధు సింగ్ తెలిపారు. ప్రభుత్వం వారిని మాట్లాడించేందుకు మౌనంతోనే సమాధానం చెప్పారని మరో నేత కవితా కురుగంటి వెల్లడించారు. కేంద్రం నుంచి ఎటువంటి స్పందన రాలేదని చెప్పారు. సాగు చట్టాలకు ప్రభుత్వం పలు సవరణలు చేస్తామంటూ ముందుకు వచ్చిందనీ, తాము మాత్రం పూర్తిగా రద్దు చేయాలని కోరామని బీకేయూ ఏక్తా అధ్యక్షుడు జోగిందర్ సింగ్ ఉగ్రహన్ చెప్పారు. శనివారం సింఘూ వద్ద జరిగిన ధర్నాలో నినదిస్తున్న రైతుల పిల్లలు చర్చల విరామ సమయంలో వెంట తెచ్చుకున్న ఆహారం తింటున్న రైతు సంఘాల ప్రతినిధులు -
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ కీలక భేటీ
-
కేంద్ర మంత్రులతో ప్రధాని మోదీ కీలక భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: రైతులతో ప్రభుత్వం చర్చల నేపథ్యంలో ప్రధాని మోదీ నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నరేంద్ర సింగ్ తోమర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. రైతుల డిమాండ్ల గురించి కేంద్ర మంత్రులు మోదీతో చర్చించారు. నూతన వ్యవసాయ చట్టాల పట్ల అన్నదాతల అభ్యంతరాలను ప్రస్తావించారు. కాసేపటి క్రితమే ఈ సమావేశం ముగిసింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ చట్టాలను సవరించే యోచనలో కేంద్రం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. రైతుల డిమాండ్లకు అనుగుణంగా కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా అన్నదాతలకు భరోసా కల్పించేలా కనీస మద్దతు ధరపై లిఖితపూర్వక హామీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంతేగాకుండా విద్యుత్ బిల్లులపై రైతుల అభ్యంతరాలను కూడా పరిగణనలోకి తీసుకునే అంశాన్ని కేంద్ర సర్కారు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో రైతులు ఆందోళన చేపడుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి రైతులకు మధ్య ఇప్పటికే నాలుగు దఫాలుగా చర్చలు జరిగినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో కేంద్రం నేడు మరోసారి రైతులతో చర్చించేందుకు సిద్ధమైంది. (చదవండి: మరికొన్ని వారాల్లో వ్యాక్సిన్ సిద్ధం: మోదీ) ఈ విషయం గురించి కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ.. ‘‘ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు రైతులతో భేటీ అయ్యేందుకు షెడ్యూల్ రూపొందించుకున్నాం. ప్రభుత్వ నిర్ణయం పట్ల వారు సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాం. చర్చలు సఫలమై.. ఆందోళనకు స్వస్తి పలుకుతారని భావిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా... కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. రద్దు తప్ప మరో ప్రత్యామ్నాయం సమ్మతం కాదని తేల్చిచెబుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం దిగిరాకపోతే ఈనెల 8న భారత్ బంద్ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. -
చర్చలు అసంపూర్ణం
న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు, కేంద్ర మంత్రులకు మధ్య గురువారం జరిగిన నాలుగో విడత చర్చలు ఎలాంటి నిర్ణయాత్మక ఫలితం రాకుండానే, అసంపూర్తిగా ముగిశాయి. రేపు(శనివారం) మరో విడత చర్చలు జరగనున్నాయి. ముగ్గురు కేంద్ర మంత్రులు, దాదాపు 40 మంది రైతు సంఘాల ప్రతినిధుల మధ్య ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో సుమారు 8 గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. చర్చల సందర్భంగా ప్రభుత్వం నుంచి మంచినీరు కూడా రైతు ప్రతినిధులు స్వీకరించలేదు. ప్రభుత్వం ఆఫర్ చేసిన టీ, లంచ్‌ను వారు తిరస్కరించారు. హడావుడిగా తీసుకువచ్చిన సాగు చట్టాల్లోని లోటుపాట్లను ప్రస్తావించి, వాటిని రద్దు చేయాలని మరోసారి గట్టిగా డిమాండ్ చేశారు. కనీస మద్దతు ధర(ఎమ్మెస్పీ) విధానంలో ఎలాంటి మార్పు ఉండబోదని, ఆ విషయంలో అపోహలు వద్దని చర్చల సందర్భంగా మంత్రులు స్పష్టం చేశారు. ఆ విధానాన్ని టచ్ కూడా చేయబోమని హామీ ఇచ్చారు. పార్లమెంటు సమావేశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి, వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతు ప్రతినిధులు డిమాండ్ చేశారు. ‘చర్చించాల్సిన అంశాలను నిర్ధారించాం. వాటిపై శనివారం చర్చ జరుగుతుంది. అదే రోజు రైతుల నిరసన కూడా ముగుస్తుందని ఆశిస్తున్నా’ అని చర్చల్లో పాల్గొన్న వాణిజ్య శాఖ సహాయమంత్రి సోమ్ ప్రకాశ్ పేర్కొన్నారు. ‘చర్చల సందర్భంగా కొన్ని అంశాలను రైతు ప్రతినిధులు లేవనెత్తారు. కొత్త చట్టాల వల్ల వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ(ఏపీఎంసీ)లు మూత పడ్తాయేమోనని వారు భయపడ్తున్నారు. ప్రభుత్వానికి పట్టింపులేవీ లేవు. సానుకూల దృక్పథంతో రైతులతో చర్చలు జరుపుతున్నాం. వ్యవసాయ మార్కెట్ కమిటీలను మరింత బలోపేతం చేయడానికి, ఆ కమిటీల కార్యకలాపాలను విస్తృతం చేయడానికి కృషి చేస్తామని హామీ ఇస్తున్నాం’ అని వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పేర్కొన్నారు. ‘కొత్త చట్టాల ప్రకారం.. ఏపీఎంసీ పరిధికి వెలుపల ప్రైవేటు వ్యవసాయ మార్కెట్లు ఉంటాయి. రెండు విధానాల్లోనూ ఒకే విధమైన పన్ను వ్యవస్థ ఉండేలా చర్యలు తీసుకుంటాం’ అని వివరించారు. ‘రైతులు తమ ఫిర్యాదులపై ఎస్డీఎం(సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్) కోర్టులకు వెళ్లవచ్చని చట్టంలో ఉంది. అది కింది కోర్టు అని, పై కోర్టుల్లో దావా వేసే వెసులుబాటు ఉండాలని రైతు ప్రతినిధులు కోరారు. ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటాం’ అని తోమర్ తెలిపారు. రైతులు కోరుతున్నట్లు.. వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తారా? అన్న మీడియా ప్రశ్నకు తాను భవిష్యత్తును చెప్పేవాడిని కాదని తోమర్ బదులిచ్చారు. తోమర్, సోమ్ ప్రకాశ్‌లతో పాటు రైల్వే, వాణిజ్య, ఆహార శాఖ మంత్రి పియూష్ గోయల్చర్చల్లో పాల్గొన్నారు. చర్చల అనంతరం రైతు సంఘాల ప్రతినిధులు నినాదాలు చేస్తూ బయటకు వచ్చారు. ‘మా వైపు నుంచి చర్చలు ముగిశాయి. ప్రభుత్వం సమస్యకు పరిష్కారం చూపనట్లయితే.. తదుపరి చర్చలకు రాకూడదని మా నేతలు నిర్ణయించారు’ అని ఏఐకేఎస్‌సీసీ(ఆల్ ఇండియా కిసాన్ సంఘర్‡్ష కోఆర్డినేషన్ కమిటీ) సభ్యురాలు ప్రతిభ షిండే తెలిపారు. ‘ఎమ్మెస్పీ సహా పలు అంశాలపై ప్రభుత్వం నుంచి చాలా ప్రతిపాదనలు వచ్చాయి. వాటిపై శుక్రవారం రైతు సంఘాల ప్రతినిధులు చర్చిస్తారు’ అని మరో నేత కుల్వంత్ సింగ్ సంధు తెలిపారు. ‘చట్టాల్లో సవరణలు చేయడం కాదు.. ఆ వ్యవసాయ చట్టాలను రద్దు చేయడమే మా ప్రధాన డిమాండ్’ అని ఏఐకేఎస్‌సీసీ ప్రధాన కార్యదర్శి హన్నన్ మోలా స్పష్టం చేశారు. రైతు సంఘాల ప్రతినిధులు శుక్రవారం సమావేశమై, త్రదుపరి చర్చలపై నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. మీ ఆతిథ్యం మాకొద్దు చర్చల సందర్బంగా ప్రభుత్వ ఆతిథ్యాన్ని రైతు సంఘాల ప్రతినిధులు తిరస్కరించారు. తమకోసం సింఘు నుంచి వ్యాన్‌లో వచ్చిన భోజనాన్ని స్వీకరిం చారు. చర్చల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన టీ, మంచినీరును కూడా వారు తీసుకోలేదు. ‘సహచర రైతులు రోడ్లపై ఉంటే, మేం ఇక్కడ ప్రభుత్వ ఆతిథ్యాన్ని ఎలా తీసుకుంటాం’ అని చర్చల్లో పాల్గొన్న రైతు నేత షిండే వ్యాఖ్యానించారు. ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘూ వద్ద నిరసన తెలుపుతున్న రైతులు -
రైతుల ‘చలో ఢిల్లీకి’ అనుమతి
న్యూఢిల్లీ/చండీగఢ్: నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో రైతు సంఘాలు, రైతులు తలపెట్టిన ‘చలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని తొలిరోజు అడ్డుకున్న ప్రభుత్వం రెండోరోజు శుక్రవారం దిగి వచ్చింది. రైతులు శాంతియుతంగా ధర్నా చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఢిల్లీకి దారి తీసే మార్గాలపై విధించిన ఆంక్షలను పోలీసులు ఎత్తివేశారు. దీంతో పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల రైతులు పెద్ద సంఖ్యలో ఢిల్లీకి చేరుకున్నారు. రాజధానిలో అతి పెద్దదైన నిరంకారీ మైదానంలో ధర్నా నిర్వహించారు. సాగును కార్పొరేట్లకు అప్పగిస్తూ రైతులను దగా చేసే కొత్త వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గురువారం పంజాబ్–హరియాణా సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఢిల్లీకి బయలుదేరిన రైతులపైహరియాణా పోలీసులు భాష్పవాయువు, జల ఫిరంగులు ప్రయోగించారు. హరియాణాలో పలుచోట్ల రైతులపై దాష్టీకం ప్రదర్శించారు. శుక్రవారం పరిస్థితి చాలావరకు సద్దుమణిగింది. ఆంక్షలను ఎత్తివేయడంతో అన్నదాతలు తిక్రీ బోర్డర్ నుంచి పోలీసు ఎస్కార్ట్‌తో నిరంకారీ మైదానానికి చేరుకున్నారు. ధర్నాతో ఢిల్లీలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. హరియాణాలోని భీవానిలో జరిగిన ప్రమాదంలో ర్యాలీలో పాల్గొనేందుకు వస్తున్న పంజాబ్ రైతు తాన్నాసింగ్(40) మృతి చెందాడు. రైతులతో చర్చించేందుకు సిద్ధం రైతులతో అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చెప్పారు. రైతన్నలు ఆందోళన విరమించుకోవాలని కోరారు. కొత్త సాగు చట్టాలతో అన్నదాతల జీవితాల్లో పెను మార్పులు వస్తాయన్నారు. 3న జరిగే భేటీకి రైతు నేతలను ఆహ్వానించామన్నారు. సింఘు సరిహద్దు వద్ద రైతుపై లాఠీచార్జ్ చేస్తున్న జవాను -
భేటీకి కేంద్ర మంత్రుల గైర్హాజరు
న్యూఢిల్లీ/చండీగఢ్: కొత్త వ్యవసాయ చట్టాలపై పంజాబ్ రైతుల ఆందోళనను తీర్చడానికి కేంద్ర వ్యవసాయ శాఖ దేశ రాజధాని ఢిల్లీలోని కృషి భవన్లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశాన్ని అన్నదాతలు బహిష్కరించారు. ఈ భేటీకి కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్‌తో పాటు, సహాయ మంత్రులు గైర్హాజరు కావడంతో 29 రైతు సంఘాలకు చెందిన ప్రతినిధులు సమావేశాన్ని వాకౌట్ చేసి, వ్యవసాయ చట్టం ప్రతుల్ని చించేశారు. సమావేశానికి పిలిచి అవమానిస్తారా..? వ్యవసాయ చట్టాలపై తమకున్న ఆందోళనల్ని తొలగిస్తామని ఢిల్లీ పిలిచి మరీ తమని పట్టించుకోలేదని రైతు సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘కేంద్ర మంత్రులెవరూ ఈ సమావేశానికి హాజరు కానప్పుడు, భేటీని ఎందుకు ఏర్పాటు చేశారు ? కేంద్రం ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తోంది’’ అని రైతు సంఘాల సమన్వయ కమిటీ సభ్యుడు దర్శన్ పాల్ చెప్పారు. తమ ప్రశ్నలకు సరైన సమా« ధానాలు ఇవ్వకపోవడంతో వాకౌట్ చేశా మన్నారు. దీనిపై వివాదం రేగడంతో ప్రభుత్వం వివరణ ఇస్తూ, షెడ్యూల్ ప్రకారం ఇది కార్యదర్శుల స్థాయి సమావేవమని పేర్కొంది. రైతులతో చర్చలకు ఎల్లప్పుడూ సిద్ధమేనని, వారి ప్రయోజనాలను పరిరక్షించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపింది. -
రబీ పంటల ‘మద్దతు’ పెంపు
న్యూఢిల్లీ: గోధుమ సహా ఆరు రబీ పంటల కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)ను 6% వరకు పెంచుతూ కేంద్రం సోమవారం నిర్ణయం తీసుకుంది. తాజాగా పార్లమెంటు ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లుల ద్వారా ఎంఎస్పీ వ్యవస్థను దశలవారీగా తొలగించాలనుకుంటోందన్న రైతుల ఆందోళనకు తాజా చర్య ద్వారా ప్రభుత్వం సమాధానమిచ్చింది. గోధుమ కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు రూ. 50 పెంచారు. దాంతో క్వింటాల్ గోధుమ ఎంఎస్పీ రూ. 1,975కి చేరింది. 2020–21 పంట సంవత్సరానికి(జూన్–జూలై), 2021–22 మార్కెటింగ్ సీజన్‌కు ఆరు రబీ పంటల ఎంఎస్పీ పెంపును ప్రధాని మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదించిందని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లోక్‌సభకు తెలిపారు. బార్లీ కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.75 పెంచారు. దాంతో క్వింటాల్ బార్లీ ధర రూ.1,600కు చేరింది. ఎంఎస్పీ రూ.225 పెరగడంతో, కందుల ధర క్వింటాల్‌కు రూ. 5,100కి చేరింది. మసూర్‌దాల్ ధర క్వింటాల్‌కు రూ.300 పెరిగింది. దాంతో వాటి ధర క్వింటాల్‌కు రూ. 5,100కి చేరింది. ఆవాల ధర క్వింటాల్‌కు రూ.225 పెరిగి, రూ. 4,650కి చేరింది. కుసుమల ధర క్వింటాల్‌కు రూ.112 పెరిగి, రూ.5,327కి చేరింది. కనీస మద్దతు ధర కొనసాగుతుందనేందుకు తాజా పెంపే నిదర్శనమని తోమర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇప్పటికైనా తప్పుడు ప్రచారం మానుకోవాలని విపక్ష పార్టీలకు సూచించారు. గత ఆరేళ్లలో రైతులకు రూ. 7 లక్షల కోట్లను ఎంఎస్పీగా అందించామన్నారు. -
రికార్డు స్థాయిలో ఖరీఫ్ సాగు
సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం సకాలంలో విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ యంత్రాలు మరియు రుణాలను అందించడం వల్ల కోవిడ్–19 లాక్డౌన్ సమయంలో కూడా రికార్డు స్థాయిలో సాగు సాధ్యమైందని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖా మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పేర్కొన్నారు. సమృద్ధిగా వర్షాలు కురవడం, ప్రభుత్వం ప్రధాన పథకాలను సకాలంలో అమలు పరచడం, రైతులు కూడా సకాలంలో వ్యవసాయ కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఇది సాధ్యపడిందని తెలిపారు. ఖరీఫ్ సీజను గణాంకాల వివరాలు నమోదు కు అక్టోబరు 2, 2020 చివరి తేదీ కాగా.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1095.38 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ సాగైనట్టు వెల్లడించారు. ► వరి పంట గత సంవత్సరం 365.92 లక్షల హె క్టార్లలో సాగు కాగా ఈ ఏడాది 396.18 లక్షల హెక్టార్లలో సాగయ్యింది. గత ఏడాది ఇదే సీజనుతో పోలిస్తే 8.27% సాగు విస్తీర్ణం పెరిగింది. ► కాయ ధాన్యాలు ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో సాగు 136.79 లక్షల హెక్టార్లుగా ఉండగా గత సంవత్సరం 130.68 లక్షల హెక్టార్లుగా ఉంది. 4.67% మేర సాగు విస్తీర్ణం పెరిగింది. ► తృణధాన్యాలు గత సంవత్సరం ఖరీఫ్‌లో 176.25 లక్షల హెక్టార్లు సాగు విస్తీర్ణం ఉండగా, ఈ సంవత్సరం 179.36 లక్షల హెక్టార్లు సాగు లో ఉంది. 1.77% సాగు విస్తీర్ణం పెరిగింది. ► నూనె గింజలు ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో 194.75 లక్షల హెక్టార్లలో సాగవ్వగా గత సంవత్సరం 174.00 లక్షల హెక్టార్లలో సాగైంది. అంటే 11.93% సాగు విస్తీర్ణం పెరిగింది. ► చెరుకు గత సంవత్సరం 51.71 లక్షల హెక్టార్లలో సాగుచేయగా ఈ సంవత్సరం ఖరీఫ్‌లో 52.38 లక్షల హెక్టార్లలో సాగు అవుతోంది. 1.30% సాగు విస్తీర్ణంలో పెరుగుదల నమోదయ్యింది. ► పత్తి గత సంవత్సరం 124.90 లక్షల హెక్టార్లుగా ఉండగా ఈ ఖరీఫ్‌లో 128.95 లక్షల హెక్టార్లలో సాగు నమోదయ్యింది.గత సంవత్సరంతో పోలిస్తే 3.24% సాగు విస్తీర్ణం పెరిగింది. ► జనపనార ఈ ఏడాది 6.97 లక్షల హెక్టార్లు కాగా... గత సంవత్సరం 6.86 లక్షల హెక్టార్లలో సాగయ్యింది. 1.68% పెరిగిన సాగు విస్తీర్ణం. కలిసి వచ్చిన వర్షపాతం ► ఈ ఏడాది సెప్టెంబరు 3 నాటికి దేశంలో సాధారణ వర్షపాతం 730.8 మి.మి. కాగా ఈ సంవత్సరం 795.0 మి.మి. వర్షపాతం నమోదైంది. 9% ఎక్కువ వర్షపాతం నమోదైంది. -
తెలంగాణ ప్రభుత్వం అవినీతికి అలవాటు పడింది
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ బీజేపీ అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఢిల్లీ పర్యటనలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగడిలను శనివారం వేర్వేరుగా కలిశారు. తెలంగాణ రాష్ట్రానికి దక్కాల్సిన నిధులు, పనులు, ప్రాజెక్టులపై చర్చించారు. వివిధ మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న కొత్త ప్రాజెక్టులకు విడుదల చేస్తున్న కేంద్రం నిధులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన వాటాను సమయానుకూలంగా అందించకపోవడంతో అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయని తెలిపారు. ఒక దశలో ఆగిపోయే విధంగా మారాయని, వాటిపై దృష్టి సారించి రాష్ట్ర ప్రభుత్వం తమ వాటాను సకాలంలో చెల్లించేలా ఒత్తిడి తీసుకురావాలని కేంద్ర మంత్రులను కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవినీతి, కమిషన్లకు అలవాటుపడి ప్రాజెక్టులు, అభివృద్ధి పనుల రూపురేఖలు మార్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందని మంత్రులకు వివరించారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలు నెరవేరుస్తూ వారి ఆదాయం రెట్టింపు చేయాలన్న లక్ష్యంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ విషయంలో రైతుల ప్రయోజనాల కోసం సంజయ్ కుమార్ కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారు. బండి సంజయ్ చేసిన సూచనలు, సలహాలు విన్న వ్యవసాయ శాఖ మంత్రి తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చే నిధులు దుర్వినియోగం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. తెలంగాణలో రైతుబంధు పథకంలో అవినీతి జరుగుతోన్న విషయాన్ని ఎంపీ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు అందించే అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ రైతుల స్థితిగతులు మార్చే పధకమని, దాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించేలా చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రిని సంజయ్ కోరారు. రైల్వే శాఖ సహాయ మంత్రి అంగడి సురేష్‌తో జరిగిన సమావేశంలో రాష్ట్రానికి రావాల్సిన కొత్త, పెండింగ్ ప్రాజెక్టుల పురోగతి తదితర అంశాలపై చర్చ జరిగింది. ముఖ్యంగా కొత్తగా చేపట్టనున్న హసన్ పర్తి-కరీంనగర్ రైల్వే లైను ప్రాజెక్టు నివేదికపై విస్తృతంగా చర్చించారు. కరీంనగర్ పట్టణం తీగలకుంటపల్లిలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని, కరీంనగర్-నిజామాబాద్ రెండో లైను నిర్మాణం చేపట్టాలని సంజయ్ కేంద్ర మంత్రిని కోరారు. దానికి సానుకూలంగా స్పందించిన కేంద్ర రైల్వే సహాయ శాఖ మంత్రి వెంటనే నివేదికలు సమర్పించాలని సమావేశంలో పాల్గొన్న రైల్వే అధికారులను ఆదేశించారు. గతంలో ఇచ్చిన నివేదికలనూ పరిశీలించి సమీక్షించారు. బండి సంజయ్ కుమార్ వినతి మేరకు విస్తృతమైన ప్రజా సేవలకు అనుకూలంగా ఉండేలా ప్రాజెక్టు నివేదిక రూపొందించాలని రైల్వే శాఖ మంత్రి సురేష్ అంగడి అధికారులను ఆదేశించారు. -
లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభించిన ప్రధాని
-
లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభించిన ప్రధాని
సాక్షి, ఢిల్లీ : వ్యవసాయ రంగంలో స్వావలంబన దిశగా కేంద్ర ప్రభుత్వం మరొక నూతన పథకాన్ని ప్రారంభించింది. ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం కింద రూ.లక్ష కోట్లతో కూడిన వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. దీనిద్వారా దేశంలోని సుమారు 8.5 కోట్ల మంది రైతులకు 2వేల రూపాయల చొప్పున రూ.17 వేల కోట్లు పంపిణీ చేయనున్నారు. వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖల మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌తోపాటు ఇతర అధికారులు, రైతులు ఆన్లైన్ ద్వారా కార్యక్రమంలో పాల్గొన్నారు. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి కింద పంట దిగుబడులను కాపాడుకునేందుకు అవసరమైన సదుపాయాలను కల్పించనున్నారు. ఈ రూ.లక్ష కోట్ల నిధిని రైతులకు చేర్చేందుకు ఇప్పటికే దేశంలోని 11 ప్రభుత్వ రంగ సంస్థలు వ్యవసాయ శాఖతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. పథకంలో భాగంగా అందించే రుణాలపై మూడు శాతం వడ్డీ రాయితీ, రెండు కోట్ల రూపాయల వరకూ క్రెడిట్ గ్యారంటీ లభించనుంది. 2018 డిసెంబర్ ఒకటవ తేదీన ప్రారంభమైన ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా రైతులకు నేరుగా నగదు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద ఇప్పటివరకూ 9.9 కోట్ల మంది రైతులకు సుమారు రూ.75 వేల కోట్లు పంపిణీ చేశామని పేర్కొంది. కోవిడ్–19 కష్ట కాలంలోనూ రైతులను ఆదుకునేందుకు రూ.22 వేల కోట్లు విడుదల చేశామని తెలిపింది. -
రూ. లక్ష కోట్లతో వ్యవసాయ నిధి!
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం కింద దేశంలోని సుమారు 8.5 కోట్ల మంది రైతులకు రూ.17 వేల కోట్ల పంపిణీకి రంగం సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం కిసాన్ నిధులతోపాటు రూ.లక్ష కోట్లతో కూడిన వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని కూడా ప్రారంభించనున్నట్లు శనివారం ఓ అధికారిక ప్రకటన తెలిపింది. వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖల మంత్రి నరేంద్ర తోమర్‌తోపాటు లక్షలాది మంది రైతుల ఆన్లైన్ సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుందని పేర్కొంది. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి కింద పంట దిగుబడులను కాపాడుకునేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు. సామాజిక స్థాయిలో శీతలీకరణ గిడ్డంగులు, ఆహార శుద్ధీకరణ కేంద్రాలను ఏర్పాటు చేస్తారని ఆ ప్రకటనలో వివరించారు. ఈ సదుపాయాల ఏర్పాటుతో రైతుల ఉత్పత్తులకు మెరుగైన విలువ లభిస్తుందని, వృథా తగ్గుతుందని అంచనా. ఈ రూ.లక్ష కోట్ల నిధిని రైతులకు చేర్చేందుకు ఇప్పటికే దేశంలోని 11 ప్రభుత్వ రంగ సంస్థలు వ్యవసాయ శాఖతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. పథకంలో భాగంగా అందించే రుణాలపై మూడు శాతం వడ్డీ రాయితీ, రెండు కోట్ల రూపాయల వరకూ క్రెడిట్ గ్యారంటీ లభించనుంది. 2018 డిసెంబర్ ఒకటవ తేదీన ప్రారంభమైన ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా రైతులకు నేరుగా నగదు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద ఇప్పటివరకూ 9.9 కోట్ల మంది రైతులకు సుమారు రూ.75 వేల కోట్లు పంపిణీ చేశామని పేర్కొంది. కోవిడ్–19 కష్ట కాలంలోనూ రైతులను ఆదుకునేందుకు రూ.22 వేల కోట్లు విడుదల చేశామని తెలిపింది. -
ఒకే దేశం.. ఒకే మార్కెట్
న్యూఢిల్లీ: రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను అధీకృత వ్యవసాయ మార్కెట్లలోనే కాకుండా.. దేశంలో ఎక్కడైనా అమ్ముకునేందుకు వీలు కల్పించే ‘ద ఫార్మింగ్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ఆర్డినెన్స్, 2020’కి బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ‘ఒకే దేశం.. ఒకే వ్యవసాయ మార్కెట్(వన్ నేషన్..వన్ అగ్రి మార్కెట్)’ దిశగా వేసిన ముందడుగుగా ఈ నిర్ణయాన్ని పేర్కొంది. ఈ ఆర్డినెన్స్ ప్రకారం.. మార్కెట్లకు వెలుపల తమ దిగుబడులను అమ్మితే రైతులపై రాష్ట్రాలు ఎలాంటి పన్ను విధించవద్దు. రైతులు తాము కోరుకున్న ధరకే తమ ఉత్పత్తులను అమ్ముకోవచ్చు. ఈ విషయంలో తలెత్తిన వివాదాలను సబ్ డివిజన్ మేజిస్ట్రేట్, కలెక్టర్ నెల రోజుల్లోగా పరిష్కరించాలి. ఈ వివాదాలు సివిల్ కోర్టుల పరిధిలోకి రావు. ప్రస్తుతం రైతులు వ్యవసాయ మార్కెట్ కమిటీ(అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీ– ఏపీఎంసీ)ల్లోనే తమ ఉత్పత్తులను అమ్ముతున్నారు. ఈ మార్కెట్లకు వెలుపల అమ్మాలనుకుంటే వారిపై పలు ఆంక్షలు ఉంటాయి. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడిస్తూ.. ఏపీఎంసీలు యధావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. రాష్ట్రాల ఏపీఎంసీ చట్టాలు కూడా కొనసాగుతాయన్నారు. మండీలకు వెలుపల కూడా రైతులు తమ ఉత్పత్తులను అమ్మే అవకాశం కల్పించి, వారికి అదనపు ఆదాయం అందించాలన్నదే ఈ ఆర్డినెన్స్ ఉద్దేశమన్నారు. ‘ఈ ఆర్డినెన్స్ ద్వారా రైతులు నేరుగా తమ ఇళ్ల నుంచే ఆహార సంస్థలకు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు, రైతు సహకార సంస్థలకు తాము కోరుకున్న ధరకు తమ పంటలను అమ్మవచ్చు’ అని వివరించారు. దీనిపై ఎలాంటి నియంత్రణలు ఉండబోవన్నారు. ‘ఈ – ట్రేడింగ్’కు కూడా అవకాశం ఉందన్నారు. వీటిపై నియంత్రణ ఉండదు 65 ఏళ్ల నాటి నిత్యావసర వస్తువుల(ఎసెన్షియల్ కమాడిటీస్– ఈసీ) చట్టాన్ని సవరించే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆ చట్ట నియంత్రణ పరిధిలో నుంచి నిత్యావసరాలైన పప్పు ధాన్యాలు, తృణధాన్యాలు, నూనె గింజలు, వంట నూనెలు, బంగాళదుంపలు, ఉల్లిగడ్డలను తప్పించేందుకు ఆ సవరణను ప్రతిపాదించారు. ప్రతిపాదిత చట్ట సవరణ ప్రకారం.. యుద్ధం, జాతీయ విపత్తు, కరువు, ధరల్లో అనూహ్య పెరుగుదల వంటి అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే ఆయా ఆహార పదార్థాలు ఈసీ చట్ట నియంత్రణలో ఉంటాయి. మిగతా సమయాల్లో వాటి ఉత్పత్తి, నిల్వ, సరఫరాలపై ఎలాంటి నియంత్రణ ఉండదు. అలాగే, ప్రాసెసింగ్ చేసేవారు, సరఫరా వ్యవస్థలో ఉన్నవారిపై ఆయా ఆహార ఉత్పత్తులకు సంబంధించి ఎలాంటి నిల్వ పరిమితి ఉండదు. రైతుల ఆదాయ పెంపు నిర్ణయాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఆహార ఉత్పత్తులను దిగుబడి చేసుకునే, నిలువ చేసుకునే, పంపిణీ చేసుకునే హక్కు లభించడంతో వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలపై ప్రైవేట్ సంస్థలకు ఆసక్తి పెరిగే అవకాశముందని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా వస్తాయని పేర్కొంది. కోల్‌కతా పోర్ట్ ఇక శ్యామ ప్రసాద్ ముఖర్జీ నౌకాశ్రయం కోల్‌కతా నౌకాశ్రయం పేరును శ్యామ ప్రసాద్ ముఖర్జీ నౌకాశ్రయంగా మార్చే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సంవత్సరం జనవరిలో కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్ 150వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ.. కోల్‌కతా నౌకాశ్రయానికి జనసంఘ్ వ్యవస్థాపకుడైన శ్యామ ప్రసాద్ ముఖర్జీ పేరు పెడ్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అనంతరం ట్రస్ట్ బోర్డ్ సభ్యులు ఫిబ్రవరి 25న భేటీ అయి పేరు మార్పును ప్రతిపాదిస్తూ ఒక తీర్మనాన్ని ఆమోదించారు. కోల్‌కతా పోర్ట్ భారత్‌లోని ఏకైక నదీముఖ నౌకాశ్రయం. 1870 నుంచి కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తోంది. రైతులకు మేలు: మోదీ వ్యవసాయ సంస్కరణలపై కేంద్రం తీసుకున్న నిర్ణయాలు గ్రామీణ భారతం, ముఖ్యంగా రైతులపై గణనీయ సానుకూల ప్రభావం చూపుతాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పంట ఉత్పత్తుల కొనుగోళ్లు, అమ్మకాలపై ఆంక్షలను తొలగించాలని రైతులు దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నారని, ఆ డిమాండ్‌ను తాము నెరవేర్చామని తెలిపారు. -
ఒక దేశం, ఒక మార్కెట్ దిశగా కీలక ముందడుగు
-
ఏపీ కార్యక్రమాలు భేష్
సాక్షి, అమరావతి: లాక్డౌన్ సమయంలో గ్రామీణ పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ కితాబిచ్చారు. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చర్చించేందుకు నరేంద్ర సింగ్ తోమర్ శుక్రవారం రాష్ట్రాల గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామీణ పేదలకు అందుతున్న ప్రభుత్వ పథకాలు, జీవనోపాధికి రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్యక్రమాలను కేంద్రమంత్రి సమీక్షించారు. ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. మరే రాష్ట్రంలో లేనంతగా ఏప్రిల్‌లో 66.33 లక్షల పనిదినాలు ఉపాధి హామీ పథకం ద్వారా కల్పించామని, అర్హులైన పేదలకు రూ. వెయ్యి చొప్పున ఆర్థిక సాయం చేసినట్టు తెలిపారు. -
‘కిసాన్ రథ్’ ఆవిష్కరణ
సాక్షి, న్యూఢిల్లీ: వ్యవసాయోత్పత్తుల రవాణా కోసం కేంద్ర ప్రభుత్వం ట్రాన్స్పోర్ట్ అగ్రిగేటర్ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ‘కిసాన్ రథ్’ పేరుతో ఏర్పాటు చేసిన ఈ యాప్‌ను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఆవిష్కరించారు. వ్యవసాయ క్షేత్రాల నుంచి ఉత్పత్తులను మార్కెట్లకు తరలించేందుకు 5 లక్షల ట్రక్కులు, 20 వేల ట్రాక్టర్లు ఈ మొబైల్ ప్లాట్‌పామ్‌లో అందుబాటులో ఉన్నాయి. ‘లాక్డౌన్ సమయంలో రైతుల తమ ఉత్పత్తులను తరలించేందుకు అవసరమైన ట్రాక్టర్లు, ట్రక్కులు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ ఉత్పత్తులను మండీలు, ఇతర మార్కెట్లకు తరలించడానికి కిసాన్ రథ్ యాప్ ఉపయోగపడుతుంద’ని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. రైతుల ఇబ్బందులను తొలగించడానికి కొద్దిరోజుల క్రితం ఇండియా అగ్రి ట్రాన్స్పోర్ట్ కాల్ సెంటర్‌ను మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. వ్యవసాయోత్పత్తుల రవాణాపై కాల్ సెంటర్ దేశంలో రాష్ట్రాల మధ్య పండ్లు, కూరగాయలు, ఆహార ధాన్యాలు ఇతర వ్యవసాయోత్పత్తుల రవాణా సులభతరం చేయడానికి కేంద్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్టు హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 14488 నంబర్‌లోగానీ, 18001804200 నంబర్లో గానీ కాల్ సెంటర్‌ను సంప్రదించవచ్చన్నారు. చదవండి: లాక్డౌన్లో 4.6 లక్షల ఫోన్‌కాల్స్ -
ఈ ఏడాది అదనంగా రూ. 125 చెల్లిస్తున్నాం: కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం కోరిక మేరకు 47500 మెట్రిక్ టన్నుల కందులు కొనుగోలు చేయాలని కేంద్రం లక్ష్యాన్ని నిర్థేశించుకున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు. పార్లమెంటులో మంగళవారం ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కందుల కొనుగోల్లపై లేవనెత్తిన ప్రశ్నకు ఆయన లిఖిత పూర్వకంగా సమాధానం ఇస్తూ పై వ్యాఖ్యాలు చేశారు. తెలంగాణలో 2.07 లక్షల టన్నుల కంది ఉత్పత్తి అవుతుందని అంచనా వేశామని తెలిపారు. నాఫెడ్, ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా సంస్థల ద్వారా మద్దతు ధరకు కందులను కొనుగోలు చేస్తున్నామని పేర్కొన్నారు. క్వింటాకు రూ. 5800 చొప్పున కనీస మద్దతు ధర చెల్లిస్తున్నామని చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రూ.125 అధికంగా చెల్లిస్తున్నామని తెలిపారు. ఫిబ్రవరి 22 నాటికి 45500 మెట్రిక్ టన్నులను సేకరించామని చెప్పారు. తాజా అంచనాల మేరకు కందుల కొనుగోల్లను పెంచామని వెల్లడించారు. 51625 మెట్రిక్ టన్నుల కందుల సేకరణ లక్ష్యంగా పెట్టుకుని, తగిన మద్దతు ధర చెల్లిస్తూ కొనుగోలు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. -
ఏ రాష్ట్రంలోనూ లేని పద్ధతి తెలంగాణలో ఎందుకు?
సాక్షి, ఢిల్లీ : తెలంగాణలో ఉమ్మడి చెక్ పవర్ ఇచ్చి ప్రభుత్వం సర్పంచ్‌లను అవమానిస్తోందని మాజీ మంత్రి, బీజేపీ నేత డీకే అరుణ ఆరోపించారు. మంగళవారం ఆమె నేతృత్వంలో తెలంగాణ సర్పంచ్ల ఫోరమ్ నాయకులు కేంద్రమంత్రి నరేందర్ సింగ్ తోమర్‌ను కలిశారు. సమావేశం అనంతరం డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ.. లక్షలు ఖర్చుపెట్టుకొని గెలిచిన సర్పంచ్‌తో సమానంగా ఉప సర్పంచ్‌కి చెక్ పవర్ ఇవ్వడం వల్ల గ్రామాల్లో గొడవలు జరుగుతున్నాయన్నారు. ఏమైనా పనులు చేయాలంటే ఉప సర్పంచులు బ్లాక్మెయిల్ చేస్తున్నారని, సర్పంచ్‌లు తీవ్ర మనస్తాపంతో ఉన్నారని ఆమె వెల్లడించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం గత ఐదేళ్లుగా గ్రామాలకు నిధులు కేటాయించకపోవడంతో గ్రామాభివృద్ధి కుంటుపడిందని, గ్రామాలకోసం కేంద్రం ఇచ్చిన నిధులు పక్కదారి పడుతున్నాయని ఆమె విమర్శించారు. మేం చెప్పిన విషయాల పట్ల కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించిన మంత్రి, త్వరలో తెలంగాణలో పర్యటిస్తానని హామీ ఇచ్చారని తెలియజేశారు. తెలంగాణ సర్పంచ్ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు భూమన్న యాదవ్ మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణలో ఉమ్మడి చెక్‌పవర్ ఇవ్వడం దారుణమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మీద తమకు నమ్మకం లేదని, ఆయనవి మాటలే తప్ప చేతలు లేవన్నారు. -
‘ఆత్మా’ కింద ఏపీకి ఐదేళ్లలో రూ.92 కోట్లు
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: ఆత్మా (అగ్రికల్చరల్ టెక్నలాజికల్ మేనేజ్మెంట్ ఏజెన్సీ) పథకం కింద 2014–15 నుంచి ఇప్పటి వరకు ఐదేళ్లలో కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు సుమారు రూ.92 కోట్లు గ్రాంట్–ఇన్–ఎయిడ్ కింద విడుదల చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ శుక్రవారం రాజ్యసభకు తెలిపారు. వైఎస్సార్సీపీ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఆత్మా పథకం అమలు కోసం ప్రతి రెండు గ్రామాలకు ఒక రైతుమిత్రను నియమించేందుకు తమ మంత్రిత్వశాఖ అనుమతించినప్పటికీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఈ పథకం కింద రైతుమిత్రలను గుర్తించలేదని మంత్రి తెలిపారు. ధాన్యం సేకరణలో ప్రైవేట్‌కు అనుమతి కనీస మద్దతు ధర చెల్లించి రైతుల నుంచి ధాన్యం సేకరించేందుకు ప్రైవేట్ ఏజెన్సీలు, స్టాకిస్టులకు అనుమతిస్తున్నట్లు ఆహార, ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి దాన్వే రావుసాహెబ్ దాదారావు వెల్లడించారు. రాజ్య సభలో శుక్రవారం విజయసాయిరెడ్డి అడిగిన మరో ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ప్రధాన మంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్ (పీఎం–ఆషా)ను అక్టోబర్ 2018లో ప్రారంభించినట్లు చెప్పారు. కనీస మద్దతు ధరతో ధాన్యం సేకరించే ప్రైవేట్ ఏజెన్సీల పనితనాన్ని సానుకూలంగా వినియోగించుకోవడం ఈ పథకం ఉద్దేశమని చెప్పారు. జాతీయ రైతు కమిషన్ ఏర్పాటు చేయాలి జాతీయ రైతు కమిషన్ ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి కేంద్రాన్ని కోరారు. నేషనల్ ఫార్మర్స్ కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన ప్రైవేట్ మెంబర్ తీర్మానంపై శుక్రవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘విజయ్‌పాల్ సింగ్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి మద్దతు పలుకుతున్నాను. ఎస్సీ, ఎస్టీ కమిషన్ తరహాలో నేషనల్ ఫార్మర్స్ కమిషన్ ఏర్పాటు చేయాలని, రాష్ట్రాల్లో కూడా ఈ కమిషన్ ఉండాలన్న ప్రతిపాదన బాగుంది’ అని విజయసాయిరెడ్డి అన్నారు. గవర్నర్‌ను అభినందించేందుకు భువనేశ్వర్ వెళ్లిన విజయసాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్‌గా నియమితులైన విశ్వభూషణ్ హరిచందన్‌ను కలుసుకుని ఆయనను అభినందించేందుకు వైఎస్సార్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి.విజయసాయిరెడ్డి శుక్రవారం సాయంత్రం భువనేశ్వర్‌కు వెళ్లారు. శనివారం హరిచందన్‌ను కలిసి పార్టీ తరపున ఆయనకు శుభాకాంక్షలు తెలియ జేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. -
ఆత్మా పథకం కింద ఏపీకి రూ. 92 కోట్లు
సాక్షి, ఢిల్లీ: ఆత్మా (అగ్రికల్చరల్ టెక్నాలాజికల్ మేనేజ్మెంట్ ఏజెన్సీ) పథకం కింద 2014-15 నుంచి ఇప్పటి వరకు దాదాపు 92 కోట్ల రూపాయలను కేంద్రం గ్రాంట్-ఇన్-ఎయిడ్ కింద విడుదల చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ శుక్రవారం రాజ్యసభకు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. ఆత్మా పథకం అమలు కోసం ప్రతి రెండు గ్రామాలకు ఒక రైతుమిత్రను నియమించేందుకు కేంద్రం అనుమతించినప్పటికీ ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఈ పథకం కింద రైతు మిత్రులను గుర్తించలేదని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రతి రైతు వ్యవసాయ రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించేందుకు తలపెట్టిన విస్తరణ సంస్కరణలను పల్లె పల్లెకు చేర్చడం ఆత్మ పథకం ప్రధాన ఉద్దేశాలలో ఒకటి. రైతుల అవసరాలకు అనుగుణంగా ఆత్మా పథకం కింద పనిచేసే రైతు మిత్రలు టెక్నాలజీ విస్తరణ కార్యాచరణను ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తారు. రైతుల సామర్థ్యాన్ని పెంచడం, అధిక దిగుబడులు సాధించేందుకు అవసరమైన కొత్త సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో మెళకువలు నేర్చుకోవడంలో ఇది ఎంతగానో ఉపకరిస్తుంది. తద్వారా రైతులు తమ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరను పొందగలరు’ అని పేర్కొన్నారు. ధాన్య సేకరణలో ప్రైవేట్‌కు అనుమతి రాజ్యసభలో శుక్రవారం విజయసాయి రెడ్డి అడిగిన మరో ప్రశ్నకు ఆహార, ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి దాన్వే రావుసాహెబ్ దాదారావు సమాధానమిచ్చారు. కనీస మద్దతు ధర చెల్లించి రైతుల నుంచి ధాన్య సేకరణకు ప్రైవేట్ ఏజెన్సీలు, స్టాకిస్టులను అనుమతిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ ‘ప్రధాన మంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్’ (పీఎం-ఆషా)ను అక్టోబర్ 2018లో ప్రారంభించినట్లు పేర్కొన్నారు. కనీస మద్దతు ధరకు ధాన్య సేకరణ చేసే ప్రైవేట్ ఏజెన్సీల పనితనాన్ని సానుకూలంగా వినియోగించుకోవడం ఈ పథకం ఉద్దేశమన్నారు. నూనె గింజల సేకరణ కోసం వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సైతం ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. 2017-18 సీజన్లో ఈ పథకాన్ని జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో అమలు చేసి ప్రైవేట్ ఏజెన్సీలు, స్టాకిస్టుల ద్వారా కనీస మద్దతు ధరకు సేకరించే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు మంత్రి వెల్లడించారు. ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా జరిపే ధాన్య సేకరణ కోసం ప్రభుత్వం ఎలాంటి నిధులను కేటాయించలేదని ఆయన స్పష్టం చేశారు. -
శభాష్ రమ్య!
సాక్షి, పాతపట్నం(శ్రీకాకుళం) : సిక్కోలు విద్యార్థినికి అరుదైన గుర్తింపు లభించింది. వ్యవసాయరంగంలో చేసిన పరిశోధనకు గాను జవహర్లాల్ నెహ్రూ అవార్డు–2018 దక్కించుకుంది. పాతపట్నం మండలం బోరుబద్ర గ్రామానికి చెందిన అంధవరపు రాధిక రమ్య క్రాప్సైన్సు ఆధ్వర్యంలో ఐ కార్ ఫౌండేషన్ డే సందర్భంగా ఢిల్లీలో ఈ నెల 16న కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, ఐ కార్ డైరెక్టర్ జనరల్ మహాపాత్రో చేతుల మీదుగా గోల్డ్‌మెడల్, అవార్డు, రూ.50 వేల నగదు అందుకుంది. ఇంటర్నేషనల్ ఇక్రిశాట్(హైదరాబాద్)లో జెనిటిక్స్ అండ్ ఫ్లాంట్ బ్లీడింగ్ అనే అంశంపై(కొత్త రకాల వంగడాలు) పరిశోధన చేసినందుకు గాను ఈ అవార్డు వచ్చిందని రమ్య తెలిపారు. దేశం మొత్తమ్మీద ఈ అవార్డు కోసం 15 మందిని ఎంపిక చేయగా అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి రమ్య ఒక్కరే ఎంపిక కావడం విశేషం. ఈమె 1 నుంచి 5వ తరగతి వరకు బోరుబద్ర మండల పరిషత్ పాఠశాల, 6 నుంచి 10వ తరగతి వరకు పాతపట్నం విక్టరీ పాఠశాల, ఇంటర్మీడియెట్ విజవాడ శ్రీ చైతన్య కళాశాల, బీఎస్సీ అగ్రికల్చర్ ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ నైరా(ఆమదాలవలస), ఎంఎస్సీ, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యునివర్సిటీ, రాజేంద్రనగర్(హైదరాబాద్), పీహెచ్డీ బాపట్ల వ్యవసాయ కళాశాలలో చదివారు. పీహెచ్‌డీలో జెనిటిక్స్ అండ్ ప్లాంట్ బ్లీడింగ్( కొత్త రకాల వంగడాలు) అనే అంశంపై లాల్ అహమ్మద్ గైడ్ ఆధ్వర్యంలో పరిశోధనలు పూర్తిచేశారు. తండ్రి అంధవరపు రాజారావు రిటైర్డు ఉపాధ్యాయుడు. తల్లి వన జాక్షి పాతపట్నం మండలం బొమ్మిక గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. రమ్య భర్త కరిమి పృథ్వీకృష్ణ విజయనగరం గోషా ప్రభుత్వ ఆస్పత్రిలో చిన్నపిల్లల వైద్యునిగా పనిచేస్తున్నారు. తండ్రి, భర్త ప్రోత్సాహం వల్లే వ్యవసాయంపై పరిశోధన చేశానని, శ్రమకు తగిన గుర్తింపుగా ఈ అవార్డు అందుకున్నానని రమ్య తెలిపారు. -
ఢిల్లీలో వ్యవసాయ శాఖ మంత్రుల సమావేశం
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అధ్యక్షతన సోమవారం వ్యవసాయ శాఖ మంత్రుల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల వ్యవసాయ శాఖ మంత్రులు హాజరుకానున్నారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన పథకాలు, వ్యవసాయ రంగ అభివృద్ధికి సంబంధించిన ఏడు అంశాలు ప్రధాన అజెండాగా ఈ కార్యక్రమం జరగనుంది. 1. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి. 2. పీఎం కిసాన్ మన్ ధాన్ యోజన. 3. కిసాన్ క్రెడిట్ కార్డు. 4. ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన. 5.అగ్రికల్చర్ ఎక్స్ పోర్ట్స్. 6. అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ మార్కెట్ కమిటీ. 7. ఆర్గానిక్ ఫార్మింగ్ అంశాలపై చర్చ జరగనుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి మంత్రి నిరంజన్ రెడ్డి, వ్యవసాయ కమిషనర్ రాహూల్ బొజ్జా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతుల ఆదాయం రెట్టింపు, రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న కృషిని మంత్రి నిరంజన్‌రెడ్డి వివరించనున్నారు. -
పీఎంకేవై కింద 12,305 కోట్ల పంపిణీ
న్యూఢిల్లీ: అర్హులైన రైతులకు పీఎం కిసాన్ పథకం(పీఎంకేవై) కింద ఇప్పటి వరకూ రూ. 12,305 కోట్లు పంపిణీ చేశామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. ఈ మేరకు ఆయన రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రైతులకు పెట్టుబడి సాయంగా ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద అందించే రూ. 6,000 మూడు దఫాల్లో చెల్లించనున్నామని మంత్రి తెలిపారు. ఈ పథకం ద్వారా 14.5కోట్ల మంది రైతులు లబ్ధి పొందనున్నారని చెప్పారు. భూపరిమితితో నిమిత్తం లేకుండా సహాయం అందిస్తున్నామని, దీనివల్ల ప్రభుత్వంపై రూ. 87,215.50 కోట్ల భారం పడనున్నదని తెలిపారు. జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు ఢిల్లీతో పాటు రాజస్థాన్, పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పంట అవశేషాలను తగులబెట్టడాన్ని నిషేధించినట్టు నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. ఎవరైనా నిషేధాన్ని ఉల్లంఘిస్తే వారి నుంచి రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ నష్టపరిహారం వసూలు చేయాల్సి ఉంటుందని చెప్పారు. రబీ సీజన్లో వరి చేలల్లో మిగిలిపోయిన పంట వ్యర్థాలను తగలబెట్టడం వల్ల కాలుష్యం పెరిగిపోతోంది. పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి చర్యల కారణంగా ఆ ప్రభావం ఢిల్లీపై పడుతోంది. -
‘భగీరథ’ భారం తగ్గించండి
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: ప్రతి ఇంటికీ శుద్ధమైన తాగునీటిని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిషన్ భగీరథ ప్రాజెక్టును చేపట్టి విజయవంతంగా అమలు చేస్తోందని, ఈ ప్రాజెక్టు నిర్మాణానికి చేసిన రూ.45 వేల కోట్ల అప్పుల భారా న్ని తగ్గించేలా కేంద్ర ప్రభుత్వం సాయం చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. కేంద్ర జల శక్తి మం త్రిత్వ శాఖ తాగునీటి సంరక్షణ, గ్రామీణ నీటి సరఫరా, గ్రామీణ స్వచ్ఛ భారత్ మిషన్‌పై మంగళవారం ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వాలతో ప్రత్యేక సదస్సు నిర్వహించింది. విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన ఈ సదస్సుకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అధ్యక్షత వహించగా, సదస్సుకు అన్ని రాష్ట్రాల మంత్రులు హాజరయ్యారు. అన్ని రాష్ట్రాల్లో గ్రామీణ తాగునీటి సరఫరా, స్వచ్ఛతకు అనుసరిస్తున్న విధానాలను తెలుసుకొనేందుకు కేంద్రం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దీనికి రాష్ట్రం నుంచి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ బండా ప్రకాశ్, సంబంధిత శాఖాధికారులు హాజరయ్యారు. మిషన్ భగీరథ ప్రాజెక్టును అన్ని రాష్ట్రాల అధికారులు పర్యవేక్షించి అభినందించారని కేంద్ర మంత్రికి ఎర్రబెల్లి వివరించారు. మంత్రి ఎర్రబెల్లి మంగళవారం సాయంత్రం కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌తో భేటీ అయ్యారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో ముందున్న తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సాయం అందించాలని కోరారు. ఉపాధి హామీ నిధులు విడుదల చేయండి ఉపాధి హామీ పథకం కింద 2018–19 ఆర్థిక సంవత్సరానికిగానూ తెలంగాణకు కేంద్రం నుంచి విడుదల కావాల్సిన రూ. 760 కోట్ల మెటీరియల్ కాంపోనెట్ నిధులను వెంటనే విడుదల చేయాలని నరేంద్రసింగ్ తోమర్‌ను మంత్రి ఎర్రబెల్లి కోరారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం కేంద్ర మంత్రిని కలసిన ఎర్రబెల్లి ఆయనకు వినతిపత్రాన్ని సమర్పించారు. అలాగే రైతులకు వ్యవసాయాన్ని లాభాసాటి చేసేందుకు ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయడాన్ని పరిశీలించాలని కోరారు. మరోవైపు 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు గ్రామీణ స్థానిక సంస్థలకు 2017–18 ఏడాదికిగానూ విడుదల కావాల్సిన పెర్ఫార్మెన్స్ గ్రాంట్స్ రూ. 119 కోట్లు, 2018–19 ఏడాదికిగానూ విడుదల కావాల్సిన రూ. 135 కోట్ల నిధులను మంజూరు చేయాలని కోరారు. ఇక పాత వరంగల్ జిల్లాలోని పర్వతగిరి మండలాన్ని రూర్బన్ క్లస్టర్‌గా అభివృద్ధి చేసేందుకు అవసరమైన మార్గదర్శకాలు జారీ చేయాలని కోరారు. మంత్రితోపాటు పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్, కమిషనర్ నీతూప్రసాద్ పాల్గొన్నారు.