ప్రభుత్వానికి ఎన్‌ఎండీసీ రూ.952 కోట్ల డివిడెండ్ | NMDC pays interim dividend of Rs 952 crore to Centre | Sakshi
Sakshi News home page

ప్రభుత్వానికి ఎన్‌ఎండీసీ రూ.952 కోట్ల డివిడెండ్

Published Wed, Dec 3 2014 1:05 AM | Last Updated on Sat, Sep 2 2017 5:30 PM

ప్రభుత్వానికి ఎన్‌ఎండీసీ రూ.952 కోట్ల డివిడెండ్

ప్రభుత్వానికి ఎన్‌ఎండీసీ రూ.952 కోట్ల డివిడెండ్

హైదరాబాద్: ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌ఎండీసీ, కేంద్ర ప్రభుత్వానికి రూ.952 కోట్ల డివిడెండ్‌ను చెల్లించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం  తొలి మధ్యంతర డివిడెండ్(300 శాతం)గా రూ.952 కోట్లు కేంద్రానికి చెల్లించామని ఎన్‌ఎండీసీ ఒక ప్రకటనలో తెలిపింది. కంపెనీ సీఎండీ నరేంద్ర కొఠారి ఈ రూ.952 కోట్ల చెక్కును కేంద్ర ఉక్కు శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌కు అందించారని పేర్కొంది.

ఈ కార్యక్రమంలో ఉక్కు శాఖ సహాయ మంత్రి విష్ణు దియోసాయి, ఉక్కు కార్యదర్శి రాకేశ్ సింగ్‌లతో పాటు ఉక్కు మంత్రిత్వ శాఖ, ఎన్‌ఎండీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా తాము 2011-12 ఆర్థిక సంవత్సరంలో 450 శాతం, 2012-13 ఆర్థిక సంవత్సరంలో 700 శాతం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 850 శాతం డివిడెండ్‌ను చెల్లించామని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement