2025–26కు అంచనాలు
కేంద్ర బ్యాంకు ఆర్‌బీఐ సహా ప్రభుత్వ రంగ ఫైనాన్షియల్ సంస్థల నుంచి కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆర్థిక సంవత్సరం(2025–26)లో రూ.2.56 లక్షల కోట్లు డివిడెండ్‌గా అందనున్నట్లు తాజా బడ్జెట్ అంచనా వేసింది. ప్రస్తుత ఏడాది(2024–25)లో డివిడెండ్, మిగులు ద్వారా రూ. 2.34 లక్షల కోట్లమేర లభించనున్నట్లు అభిప్రాయపడింది. గత అంచనాలకంటే ఇది రూ.1,410 కోట్లు ఎక్కువకాగా.. వచ్చే ఏడాది ఇవి మరింత బలపడనున్నట్లు ఆర్థిక శాఖ భావిస్తోంది. ఇక ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర పెట్టుబడుల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి అందనున్న మొత్తం వసూళ్లు రూ.3.25 లక్షల కోట్లను తాకనున్నట్లు అంచనా. గతంలో నమోదైన రూ.2.89 లక్షల కోట్లను దాటనున్నాయి.
ఎల్రక్టానిక్స్ ప్రాజెక్టులకు రూ.18,000కోట్లు
వచ్చే ఆర్థిక సంవత్సరంలో కీలకమైన టెక్నాలజీ ప్రాజెక్టులకు కేటాయింపులను 84 శాతం అధికంగా రూ. 18,000 కోట్లకు పెంచినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మొబైల్ ఫోన్లు, ఐటీ హార్డ్‌వేర్, సెమీకండక్టర్లు మొదలైన వాటి తయారీని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకం, ఇండియాఏఐ మిషన్ మొదలైనవి వీటిలో ఉన్నాయి. మొత్తం మీద ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖకు కేటాయింపులు 48 శాతం పెరిగి రూ.17,566 కోట్ల నుంచి రూ.26,026 కోట్లకు చేరాయి.
ఇదీ చదవండి: రూ.13 లక్షలు ఆదాయం ఉంటే ట్యాక్స్ ఇలా..
అత్యధికంగా మొబైల్ ఫోన్ల తయారీకి సంబంధించిన లార్జ్ స్కేల్ ఎల్రక్టానిక్స్ మాన్యుఫాక్చరింగ్ పీఎల్‌ఐకి రూ. 8,885 కోట్లు కేటాయించారు. యాపిల్ ఉత్పత్తుల తయారీ సంస్థలు ఫాక్స్‌కాన్, టాటా ఎలక్ట్రానిక్స్ మొదలైనవి ఈ పథకం లబ్ధిదార్లుగా ఉన్నాయి. మరోవైపు, సెమీ కండక్టర్ ప్రాజెక్టులకు కేటా యింపులు, సవరించిన అంచనాలకు దాదాపు రెట్టింపై, దాదాపు రూ. 2,500 కోట్లకు చేరాయి. ఇండియాఏఐ మిషన్‌కి కేటాయింపులు 11 రెట్లు పెరిగి రూ. 2,000 కోట్లకు చేరాయి. డిజైన్ ఆధారిత ప్రోత్సాహక పథకానికి రెట్టింపు స్థాయిలో రూ. 200 కోట్లు కేటాయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎలక్ట్రానిక్ రంగ ప్రాజెక్టులకు కేటాయింపులను రూ. 9,766 కోట్లకు సవరించారు.
Comments
Please login to add a commentAdd a comment