NMDC
-
ఎన్ఎండీసీ సీఎండీగా అమితవ ముఖర్జీ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇనుప ఖనిజ మైనింగ్ దిగ్గజం ఎన్ఎండీసీ.. కొత్త చైర్మన్, ఎండీగా అమితవ ముఖర్జీని నియమించింది. సీఎండీగా ముఖర్జీ గురువారం(6) నుంచి బాధ్యతలు స్వీకరించినట్లు కంపెనీ పేర్కొంది. ఇప్పటివరకూ సీఎండీగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2025 మార్చి 6 నుంచి బోర్డు సీఎండీగా ఎంపిక చేసినట్లు ఎన్ఎండీసీ వెల్లడించింది. వయసురీత్యా 2028 ఫిబ్రవరి 29 వరకూ లేదా తదుపరి ఆదేశాలు జారీ చేసేటంతవరకూ ముఖర్జీ పదవిని నిర్వహించనున్నట్లు తెలియజేసింది. 2018 నవంబర్‌లో ఫైనాన్స్ డైరెక్టర్‌గా కంపెనీలో చేరిన ముఖర్జీ 2023 మార్చి నుంచి సీఎండీగా అదనపు బాధ్యతలు చేపట్టారు. -
బోనస్ షేర్లు ప్రకటించిన ఎన్ఎండీసీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మైనింగ్ రంగ దిగ్గజం ఎన్ఎండీసీ 2:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు ప్రకటించింది. అంటే రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రెండు అదనపు షేర్లు జారీ చేస్తారు. అధీకృత మూలధన్నాన్ని రూ.400 కోట్ల నుంచి రూ.1,000 కోట్లకు పెంచాలని సోమవారం సమావేశమైన బోర్డు నిర్ణయించింది.సెప్టెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో ఎన్ఎండీసీ నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 15 శాతం వృద్ధి చెంది రూ.1,030 కోట్ల నుంచి రూ. 1,189 కోట్లకు ఎగసింది. పన్నుకు ముందు లాభం రూ.1,404 కోట్ల నుంచి రూ.1,614 కోట్లుగా ఉంది. వ్యయాలు రూ.2,931 కోట్ల నుంచి రూ.3,665 కోట్లను తాకాయి. ఈపీఎస్ రూ.3.50 నుంచి రూ.4.13కు పెరిగింది. టర్నోవర్ 22% అధికమై రూ.5,280 కోట్లు నమోదైంది. ఫలితాల నేపథ్యంలో ఎన్ఎండీసీ షేరు ధర బీఎస్ఈలో సోమవారం 1.15% క్షీణించి రూ.233 వద్ద స్థిరపడింది. -
ఫైనల్లో రుత్విక–రోహన్ జంట
సాక్షి, హైదరాబాద్: ఎన్ఎండీసీ తెలంగాణ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో భారత క్రీడాకారిణి గద్దె రుత్విక శివాని ఫైనల్‌కు దూసుకెళ్లింది. గచ్చి»ౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో జరుగుతున్న ఈ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ సెమీ ఫైనల్లో శనివారం రుత్విక శివాని–రోహన్ కపూర్ (భారత్) జంట 21–16, 21–13తో అమృత–సూర్య (భారత్) జోడీపై గెలుపొందింది. పురుషుల సింగిల్స్‌లో తెలంగాణ షట్లర్ కాటం తరుణ్ రెడ్డి ఫైనల్లో అడుగు పెట్టాడు.సెమీస్‌లో తరుణ్ 14–21, 21–13, 21–14తో తెలంగాణకే చెందిన రుషీంద్ర తిరుపతిపై గెలిచాడు. మరో సెమీస్‌లో రితి్వక్ సంజీవి సతీశ్ కుమార్ (భారత్) 21–18–21–13తో మైరాబాలువాంగ్ మైస్నమ్ (భారత్)పై విజయం సాధించాడు. మహిళల సింగిల్స్‌లో ఇషారాణి బారువా (భారత్) 15–21, 21–18, 21–11తో అనుపమా ఉపాధ్యాయ్ (భారత్)పై, రక్షిత శ్రీ సంతోష్ రామరాజ్ (భారత్) 21–11, 21–17తో అన్మోల్ ఖరబ్ (భారత్)పై గెలిచి ఫైనల్లో అడుగు పెట్టారు.పురుషుల డబుల్స్‌లో తెలంగాణకు చెందిన పంజాల విష్ణువర్ధన్ గౌడ్ తన భాగస్వామి ఎం.ఆర్.అర్జున్‌తో కలిసి ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. సెమీ ఫైనల్లో విష్ణువర్ధన్ గౌడ్–అర్జున్ ద్వయం 21–12, 14–21, 21–18తో సూరజ్–ధ్రువ్ రావత్ (భారత్) జంటపై, పృథ్వీ కృష్ణమూర్తి–సాయిప్రతీక్ (భారత్) జోడీ 21–18, 21–19తో హరిహరన్–రూబన్ కుమార్ (భారత్) జంటపై గెలిచి టైటిల్ ఫైట్‌కు చేరుకున్నారు. మహిళల డబుల్స్‌లో ప్రియ–శృతి (భారత్) ద్వయం 21–10, 21–18తో ప్రగతి–విశాఖ (భారత్) జంటపై, ఆరతి సారా–వర్షిణి (భారత్) జోడీ 21–13, 16–21, 21–15తో అమృత–సోనాలీ (భారత్)ద్వయంపై గెలిచి తుదిపోరుకు అర్హత సాధించింది. -
రుత్విక–రోహన్ జోడీ ముందంజ
సాక్షి, హైదరాబాద్: ఎన్ఎండీసీ తెలంగాణ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో భారత జట్టు మాజీ సభ్యురాలు, తెలంగాణ అమ్మాయి గద్దె రుత్విక శివాని సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గచి్చ»ౌలిలోని కొటక్ పుల్లెల గోపీచంద్ అకాడమీలో ఈ టోర్నీ జరుగుతోంది.శుక్రవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో రుత్విక శివాని–రోహన్ కపూర్ (భారత్) ద్వయం 21–14, 14–21, 21–17తో భారత్‌కే చెందిన ధ్రువ్ రావత్–రాధిక శర్మ జోడీపై గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో తెలంగాణకు చెందిన కాటం తరుణ్ రెడ్డి, రుషీంద్ర తిరుపతి సెమీఫైనల్లోకి అడుగు పెట్టారు. క్వార్టర్ ఫైనల్స్‌లో రుషీంద్ర 21–9, 21–10తో సంస్కార్ సరస్వత్ (భారత్)పై, తరుణ్ రెడ్డి 22–20, 22–24, 21–15తో రవి (భారత్)పై గెలిచారు.మహిళల సింగిల్స్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి తామిరి సూర్య చరిష్మా పోరాటం క్వార్టర్ ఫైనల్లో ముగిసింది. సూర్య చరిష్మా 21–18, 16–21, 21–23తో రక్షిత శ్రీ (భారత్) చేతిలో పోరాడి ఓడిపోయింది. భారత నంబర్‌వన్ అన్మోల్ ఖరబ్, అనుపమా, ఇషారాణి కూడా సెమీఫైనల్లోకి ప్రవేశించారు.క్వార్టర్ ఫైనల్స్‌లో అన్మోల్ 16–21, 21–14, 21–19తో దేవిక (భారత్)పై, అనుపమ 21–18, 27–25తో శ్రేయా (భారత్)పై, ఇషారాణి 21–18, 17–21, 21–18తో మాన్సి (భారత్)లపై నెగ్గారు. పురుషుల డబుల్స్‌లో తెలంగాణకు చెందిన పంజాల విష్ణువర్ధన్ గౌడ్ తన భాగస్వామి ఎం.ఆర్.అర్జున్‌తో కలిసి సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. క్వార్టర్ ఫైనల్లో విష్ణువర్ధన్ గౌడ్–అర్జున్ ద్వయం 21–11, 21–8తో గణేశ్ కుమార్–అర్జున్ (భారత్) జోడీపై గెలిచింది. -
విదేశాల్లో కీలక ఖనిజాలపై ఎన్ఎండీసీ దృష్టి
న్యూఢిల్లీ: విదేశాల్లో కీలక ఖనిజ వనరులపై దృష్టి సారించినట్టు ప్రభుత్వరంగ ఐరన్ ఓర్ ఉత్పత్తి సంస్థ ఎన్ఎండీసీ ప్రకటించింది. పర్యావరణ అనుకూల శుద్ధ ఇంధన వనరులకు కేంద్రం ప్రాధాన్యం ఇస్తుండడం తెలిసిందే. వీటి కోసం కాపర్, లిథియం, నికెల్, కోబాల్ట్ అవసరం ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రభుత్వరంగ సంస్థలు విదేశాల్లో ఈ కీలకమైన ఖనిజాల అన్వేషణ అవకాశాలను పరిశీలిస్తుండడం తెలిసిందే. ఇందులో ఎన్ఎండీసీ కూడా ఒకటి. ‘‘లిథియం, కోబాల్ట్, నికెల్ తదితర ఖనిజ అవకాశాలను సబ్సిడరీ సంస్థ లెగసీ ఇండియా ఐరన్ ఓర్ ద్వారా పరిశీలిస్తున్నాం. ఆస్ట్రేలియాలో లిథియం మైనింగ్ కూడా ఈ అన్వేషణలో భాగంగా ఉంది’’అని ఎన్ఎండీసీ తన ప్రకటనలో వివరించింది. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి 8 మిలియన్ టన్నుల కోకింగ్ కోల్ ఉత్పత్తి ప్రారంభిస్తామని తెలిపింది. దీంతో దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుందని పేర్కొంది. 2030 నాటికి రెట్టింపు స్థాయిలో 100 మిలియన్ టన్నుల ఐరన్ ఓర్ ఉత్పత్తి లక్ష్యాన్ని పెట్టుకున్నట్టు చెప్పింది. రూ.2,200 కోట్ల పెట్టుబడులు:‘‘కేవలం ఉత్పత్తి పెంపునకే మా కార్యాచరణ పరిమితం కాదు. బాధ్యతతో చేయడం ఇది. పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గించి, సమాజానికి సానుకూల ఫలితాలు అందించేందుకు కట్టుబడి ఉన్నాం’’అని ఎన్ఎండీసీ సీఎండీ అమితవ ముఖర్జీ వివరించారు. 45 మిలియన్ టన్నుల నుంచి 100 మిలియన్ టన్నుల ఉత్పత్తికి విస్తరించేందుకు పెద్ద మొత్తం నిధులు అవసరం పడతాయంటూ.. 2024–25లోనే ఇందుకు రూ.2,200 కోట్లు కేటాయించినట్టు ఎన్ఎండీసీ తెలిపింది. స్లర్నీ పైపులైన్, కొత్త ప్రాసెసింగ్ ప్లాంట్లపై పెట్టుబడులు పెట్టనున్నట్టు, సామర్థ్య విస్తరణకు, పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గించేందుకు ఇవి కీలకమని వివరించింది. కేకే లైన్ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా రైలు ద్వారా ఐరన్ ఓర్ రవాణాను విస్తరించనున్నట్టు తెలిపింది. ఐరన్ ఓర్ వనరులను గరిష్ట స్థాయిలో వినియోగించుకునేందుకు వీలుగా బచేలీలో 4 మిలియన్ టన్నుల బెనిఫికేషన్ ప్లాంట్, నాగర్నార్లో 2 మిలియన్ టన్నుల పెల్లెట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించింది. -
హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో 5K రన్ (ఫొటోలు)
-
రెడీ.. సెట్.. గో..! మరో 4 రోజుల్లో.. హైదరాబాద్ మారథాన్!
సాక్షి, సిటీబ్యూరో: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మోస్ట్ అవెయిటెడ్ ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ ఈవెంట్ మరో నాలుగు రోజుల్లో జరగనుంది. ప్రతి సంవత్సరం కంటే ఈసారి సరికొత్తగా మన ముందుకు రానుంది. నగరంలోని ఓ హోటల్లో మారథాన్‌కు సంబంధించి టీషర్ట్, మెడల్స్ లాంచ్ ఈవెంట్ మంగళవారం జరిగింది. ఇందులో ఎన్ఎండీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అమితవ ముఖర్జీ, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు హెడ్ బ్రాంచ్ బ్యాంకింగ్ సౌత్ నిరీశ్ లలన్, ప్రముఖ బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొన్నారు.13వ ఎడిషన్ మారథాన్‌కు వర్లడ్ అథ్లెటిక్స్ గుర్తింపు రావడంతో మరింత ప్రత్యేకత సంతరించుకుందని రేస్ డైరెక్టర్ రాజేశ్ వెచ్చా పేర్కొన్నారు. 30 రాష్ట్రాల నుంచి దాదాపు ఈ ఏడాది 25,500 మంది మారథాన్‌లో పాల్గొనేందుకు రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు. ఈ మారథాన్‌కు ప్రపంచస్థాయి ఏర్పాట్లు చేశామని వివరించారు. మారథాన్‌లో పాల్గొనే రన్నర్ల సంఖ్య పరంగా చూసుకుంటే.. భారత్‌లోనే అతిపెద్ద రెండో పరుగు ఇదని పేర్కొన్నారు.ప్రైజ్‌మనీ.. రూ.48 లక్షలుఈ మారథాన్‌లో 42 కిలోమీటర్ల దూరం రన్నర్లు పరుగెత్తనున్నారు. ఫుల్ మారథాన్‌తో పాటు హాఫ్ మారథాన్, 10 కిలోమీటర్లు, 5 కిలోమీటర్ల పరుగు కూడా ఉంటుంది. ఇటీవలే ఈ మారథాన్ డ్రైరన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ మారథాన్‌లో మొత్తం రూ.48 లక్షల ప్రైజ్‌మనీ ఇవ్వనున్నారు. మారథాన్ మొదటి రోజైన 24వ తేదీన ఉదయం 7 గంటలకు ఫన్ రన్ పేరుతో 5కే రన్ ఉంటుంది. ఇది అసలు మారథాన్‌కు కర్టెన్‌రైజర్ లాంటిది. ప్రతిఒక్కరూ రన్నింగ్‌ను సెలబ్రేట్ చేసుకునేందుకు ఈ ఫన్ రన్ ఏర్పాటు చేశారు.ఇది హైటెక్స్‌లో ఉంటుంది. ఇక మరుసటి రోజు అసలు ఫుల్ మారథాన్ ప్రారంభం అవుతుంది. పీపుల్స్ ప్లాజా వద్ద ఉదయం మారథాన్ ప్రారంభం అవుతుంది. రాజ్‌భవన్ రోడ్డు, పంజాగుట్ట ఫ్లైఓవర్, కేబీఆర్ పార్కు, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, మైండ్ స్పేస్ జంక్షన్, బయోడైవర్సిటీ జంక్షన్, గచి్చ»ౌలి ఫ్లైఓవర్, హెచ్‌సీయూ మీదుగా గచి్చబౌలి అథ్లెటిక్ స్టేడియం వద్ద ముగుస్తుంది. హాఫ్ మారథాన్ పీపుల్స్ ప్లాజా వద్ద ప్రారంభమై.. 21 కి.మీ. దూరం ఉండేలా నిర్దేశించిన మార్గంలో రన్ ఉంటుంది. గచ్చిబౌలి స్టేడియం వద్ద ముగుస్తుంది. -
Hyderabad Marathon: లింగం.. మారథాన్ సింగం! హార్ట్ పేషెంట్ అయినా..
సాక్షి, హైదరాబాద్: లింగం వయసు 50 ఏళ్లు. ఫుల్ మారథాన్ (42 కిలోమీటర్లు) పూర్తి చేశాడు. ఇది అంత పెద్ద విశేషమేమీ కాదు...కానీ అతను వెల్డింగ్ పనిచేసే సామాన్యమైన కార్మికుడు. అంతేకాదు హార్ట్ పేషెంట్ కూడా. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో నివసించే లింగం ఆదివారం నెక్లెస్‌రోడ్‌లో ప్రారంభమైన హైదరాబాద్ మారథాన్‌లో పాల్గొని ఫుల్ మారథాన్ పూర్తి చేశారు. అయితే ఈ ఘనత సాధించిన హార్ట్ పేషెంట్‌గా ఆయన నిలిచారు. ఈ సందర్భంగా లింగం, ఆయనకు వైద్యం చేసిన డా.మురళీధర్ బాబీ ‘సాక్షి’తో ఆ వివరాలు పంచుకున్నారు. కరోనా అనుకుంటే... వెల్డర్‌గా పనిచేస్తున్న లింగం రెండేళ్ల క్రితం తీవ్రమైన దగ్గు, ఆయాసంతో ఇబ్బంది పడుతూ ఇఎస్ఐ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. అయితే ఈ సమస్యకు కారణం కరోనా అని కుటుంబసభ్యులు అనుమానించారు. అయితే పరీక్షల అనంతరం వైద్యులు ఇది కరోనా కాదని, పల్మనరీ ఆర్టీరియల్ హైపర్‌టెన్షన్ అని..అప్పటికే లింగంకు తెలియకుండా రెండుసార్లు స్ట్రోక్స్ వచ్చి ఉండొచ్చని అంచనా వేశారు. ఆయనకు కొన్ని మందులు రాసిచ్చి వాడమన్నారు. కొద్దిరోజుల తర్వాత నిమ్స్‌కు రిఫర్ చేశారు. నిమ్స్‌లో యాంజియోగ్రామ్ తదితర పరీక్షలు చేసి బ్లాక్స్ లేవని, అయితే ఆయన గుండెకు పంపింగ్ సామర్థ్యం బాగా తక్కువగా..అంటే 18కి దిగిపోయిందని డాక్టర్లు తేల్చారు. రిహాబ్‌తో రీచార్జ్ డాక్టర్ మురళీధర్ నిర్వహించే కార్డియాక్ రిహాబ్ సెంటర్ ప్రోగ్రామ్‌లో లింగం చేరారు. అక్కడ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే కొన్ని రకాల మందులు, చికిత్సలతో పాటుగా రెగ్యులర్‌గా ట్రెడ్మిల్ వ్యాయామం, ఆహారంలో రైస్ బాగా తగ్గించి కాయగూరలు, మొలకలు వంటివి బాగా పెంచారు. తద్వారా పంపింగ్ సామర్థ్యాన్ని 53 శాతానికి మెరుగుపరిచారు. ఫలితంగా గత ఏడాదిలో జరిగిన హాఫ్ మారథాన్ పూర్తి చేసిన లింగం...మంచి అలవాట్లు కొనసాగిస్తూ గుండెను మరింత బలోపేతం చేసుకున్నారు. ప్రస్తుతం ఫుల్ మారథాన్‌ను కూడా పూర్తి చేయగలిగారు. చదవండి: మంచిర్యాల: పీఎస్‌లో కుప్పకూలిన నిందితుడు -
ఎన్ఎండీసీ క్రికెట్ ట్రోఫీ ఫైనల్‌కు సింగరేణి జట్టు
నాంపల్లి: ఎనిమిది ప్రభుత్వ రంగ సంస్థలు తలపడుతున్న ప్రతిష్టాత్మక ఎన్ఎండీసీ క్రికెట్ టోర్న్ లో సింగరేణి కాలరీస్ జట్టు అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. హైదరాబాద్‌లోని విజయ్ ఆనంద్ క్రీడా మైదానంలో ఆదివారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో సింగరేణి జట్టు హిందుస్తాన్ ఏరో నాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) జట్టుతో తలపడింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హెచ్ఏఎల్ జట్టు నిర్ణత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 108 పరుగులు మాత్రమే చేయగలిగింది. హెచ్ఏఎల్ జట్టు ఓపెనర్ సందీప్‌కుమార్ అత్యధికంగా 48 పరుగులు చేశాడు. సింగరేణి జట్టు బౌలర్లు జగదీష్ (2 వికెట్లు), మహేష్ (2 వికెట్లు), హరికిషన్ (ఒక వికెట్)లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేసి హెచ్ఏఎల్ జట్టును తక్కువ స్కోర్‌కు పరిమితమ్యేలా చేయడంలో సఫలమయ్యారు. ఆ తర్వాత 109 పరుగుల లక్ష్య సాధనతో బరిలోకి దిగిన సింగరేణి జట్టు ఓపెనర్లు శశికాంత్, డేవిడ్, రిచర్డ్స్ దూకుడుగా బ్యాటింగ్ చేశారు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడటమే కాకుండా తొలి వికెట్‌కు కేవలం 9 ఓవర్లలో 76 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. 47 పరుగుల వద్ద డేవిడ్ రిచర్డ్స్ అవుట్ అయ్యాక.. జట్టు కెపె్టన్ శశికాంత్ నిలకడగా ఆడుతూ జట్టుకు విజయాన్ని అందించారు. డేవిడ్ రిచర్డ్స్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఈ టోరీ్నలో సింగరేణి జట్టు లీగ్ దశలో తాను ఆడిన ఈసీఐఎల్, మిథాని, ఎన్ఆర్ఎస్ఈ జట్లను ఓడించి ఓటమి లేని జట్టుగా నిలిచింది. ఆగస్టు 6న ఆదివారం ఫైనల్ మ్యాచ్ భెల్‌తో తలపడనుంది. -
ఏపీలో బంగారం తవ్వకాలు! ఎన్ఎండీసీ రూ. 500 కోట్ల వ్యయం..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మైనింగ్ దిగ్గజం ఎన్ఎండీసీ.. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఉన్న బంగారు గని కోసం రూ.500 కోట్లు వ్యయం చేసే అవకాశం ఉందని సమాచారం. గుడుపల్లి మండలంలో ఏడు గ్రామాల్లో విస్తరించిన ఈ గోల్డ్ బ్లాక్‌కు సంబంధించిన లీజును ఎన్ఎండీసీ త్వరలో దక్కించుకోనుంది. ప్రాజెక్ట్ విషయమై గతేడాది చివరలో ఏపీ ప్రభుత్వంతో ఎన్ఎండీసీ చేతులు కలిపింది. నిబంధనల ప్రకారం లెటర్ ఆఫ్ ఇంటెంట్‌పై సంతకం చేసిన మూడేళ్లలో మైనింగ్ లీజు పొందాల్సి ఉంటుంది. ఈ గనిలో 18.3 లక్షల టన్నుల బంగారు ఖనిజం ఉన్నట్టు అంచనా. టన్నుకు 5.15 గ్రాముల పుత్తడి వెలికితీయవచ్చని ఎన్ఎండీసీ భావిస్తోంది. -
మోహిదీపట్నం ఎన్ఎండీసీ వద్ద ఆయిల్ ట్యాంకర్ బోల్తా
-
ఎన్ఎండీసీలో ఎల్ఐసీ వాటా విక్రయం
న్యూఢిల్లీ: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) తాజాగా ఎన్ఎండీసీలో 2 శాతం వాటాను విక్రయించింది. దీంతో ఈ కంపెనీలో ఎల్ఐసీ వాటా మార్చి 14 నాటికి 11.69 శాతానికి వచ్చి చేరింది. తద్వారా రూ.700 కోట్లు సమకూరింది. బహిరంగ మార్కెట్లో 2022 డిసెంబర్ 29 నుంచి 2023 మార్చి 14 మధ్య 5.88 కోట్ల షేర్లను ఒక్కొక్కటి సగటున రూ.119.37కు ఎల్ఐసీ విక్రయించింది. ఈ విక్రయం ఫలితంగా ఎల్ఐసీ హోల్డింగ్ 13.699 శాతంనుంచి 11.69శాతానికి దిగి వచ్చిందని కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్కి తెలియజేసింది. దీంతో షేర్ల పరంగా ఎన్ఎండిసిలో ఎల్ఐసీ హోల్డింగ్ 40,14,72,157 నుండి 34,25,97,574 ఈక్విటీ షేర్లకు తగ్గింది. ఇది కూడా చదవండి: లగ్జరీ ఫ్లాట్లకు ఇంత డిమాండా? మూడు రోజుల్లో రూ. 8 వేల కోట్లతో కొనేశారు! 250 కోట్ల బిగ్గెస్ట్ ప్రాపర్టీ డీల్: మాజీ ఛాంపియన్, బజాజ్ ఆటో చైర్మన్ రికార్డు -
ఎన్ఎండీసీ తాత్కాలిక సీఎండీగా అమితవ ముఖర్జీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మైనింగ్ రంగ దిగ్గజం ఎన్ఎండీసీ తాత్కాలిక సీఎండీగా సంస్థ ఫైనాన్స్ డైరెక్టర్ అమితవ ముఖర్జీ అదనపు బాధ్యతలు స్వీకరించారు. మూడు నెలలు లేదా కొత్త సీఎండీ నియామకం పూర్తి అయ్యే వరకు ఆయన ఈ పదవిలో ఉంటారు. 1995 బ్యాచ్ ఇండియన్ రైల్వేస్ అకౌంట్స్ సర్వీస్‌కు చెందిన ముఖర్జీ 2017లో ఎన్ఎండీసీలో చేరారు. ఎన్ఎండీసీ సీఎండీ పదవి కోసం పోటీపడుతున్న ఏడుగురిలో ముఖర్జీ కూడా ఉన్నారు. -
సెయిల్ లేదా ఎన్ఎండీసీలో వైజాగ్ స్టీల్ విలీన ప్రతిపాదనలు
న్యూఢిల్లీ: వైజాగ్ స్టీల్‌ను (ఆర్ఐఎన్ఎల్) సెయిల్, ఎన్ఎండీసీలో విలీనం చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి పలు ప్రతిపాదనలు వచ్చాయి. కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగన్ సింగ్ కులస్తే ఈ విషయం తెలిపారు. ప్రస్తుతం ఆర్ఐఎన్ఎల్లో 4,875 మంది ఎగ్జిక్యూటివ్‌లు, 10,005 మంది నాన్–ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులు ఉన్నారని రాజ్యసభకు రాతపూర్వక సమాధానంలో ఆయన వివరించారు. కంపెనీ ఆర్థిక పరిస్థితి అంతగా బాగా లేనందున రిక్రూట్‌మెంట్‌ను క్రమబద్ధీకరించినట్లు కులస్తే పేర్కొన్నారు. పబ్లిక్ ఇష్యూ లేదా బాండ్ల జారీ ద్వారా ఆర్ఐఎన్ఎల్ నిధులు సమీకరించే యోచనేదీ లేదని తెలిపారు. -
ఎన్ఎండీసీ నగర్నార్ ప్లాంటుకు బిడ్ల ఆహ్వానం
న్యూఢిల్లీ: ఎన్ఎండీసీకి చెందిన నాగర్నాల్ ఉక్కు ప్లాంటులో వ్యూ హాత్మక వాటాలను విక్రయించేందుకు కేంద్రం ప్రాథమికంగా బిడ్లను ఆహ్వానించింది. సందేహాలను సమర్పించేందుకు డిసెంబర్ 29, బిడ్లను దాఖలు చేసేందుకు 2023 జనవరి 27 ఆఖరు తేదీ అని దీపం తెలిపింది. చత్తీస్‌గఢ్‌లోని నగర్నార్లో ఎన్ఎండీసీ 3 మిలి యన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో ఎన్ఎండీసీ ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్‌ని ఏర్పాటు చేస్తోంది. దీన్ని ఎన్ఎండీసీ నుండి ఎన్ఎండీసీ స్టీల్‌గా విడగొట్టి, ఎక్సే్చంజీల్లో లిస్ట్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. చదవండి: విప్రో చేతికి ప్రముఖ స్టార్టప్ కంపెనీ -
ఎన్ఎండీసీ లాభం డౌన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మైనింగ్ రంగ దిగ్గజం ఎన్ఎండీసీ సెప్టెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 62 శాతం తగ్గి రూ.886 కోట్లు నమోదు చేసింది. టర్నోవర్ రూ.6,882 కోట్ల నుంచి రూ.3,755 కోట్లకు పడిపోయింది. వ్యయాలు రూ.3,743 కోట్ల నుంచి రూ.2,570 కోట్లకు వచ్చి చేరాయి. క్రితం ముగింపుతో పోలిస్తే బీఎస్ఈలో ఎన్ఎండీసీ షేరు ధర సోమవారం 0.26 శాతం పడిపోయి రూ.113.35 వద్ద స్థిరపడింది. చదవండి: ఆ బ్యాంకులపై కొరడా ఝులిపించిన ఆర్బీఐ! -
ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ రన్ (ఫొటోలు)
-
కొత్త స్టీల్ ప్లాంట్లు లేనట్టే: ఎన్ఎండీసీ
న్యూఢిల్లీ: కొత్త ఉక్కు ప్రాజెక్టుల్లో పెట్టుబడులు లేనట్టేనని మైనింగ్ రంగ దిగ్గజం ఎన్ఎండీసీ సీఎండీ సుమిత్ దేవ్ తెలిపారు. ఖనిజాల అన్వేషణపైనే దృష్టిసారిస్తామని చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌లో నిర్మాణంలో ఉన్న 3 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం గల నాగర్నార్ స్టీల్ ప్లాంట్‌ను వ్యూహాత్మక కొనుగోలుదారుకు విక్రయించిన తర్వాత ఎన్ఎండీసీ ఉక్కు రంగంలో తన ఆసక్తిని కొనసాగిస్తుందా అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ‘ఇనుము ధాతువు ఉత్పత్తి 2030 నాటికి 100 మిలియన్ టన్నుల స్థాయికి చేర్చాలన్నది సంస్థ లక్ష్యం. 2021–22లో 42 మిలియన్ టన్నులు ఉత్పత్తి అయింది. అంత క్రితం ఏడాదిలో ఇది 34 మిలియన్ టన్నులు. ఎన్ఎండీసీ భారత్‌తోపాటు ప్రపంచ స్థాయిలో బలమైన మైనింగ్ కంపెనీగా తన స్థానాన్ని పెంపొందించుకుంటుంది. స్టీల్ అనేది కంపెనీ ప్రాధాన్యత కాదు. నాగర్నార్ స్టీల్ ప్లాంట్ విలీనం ప్రస్తుత త్రైమాసికంలోనే కార్యరూపం దాల్చనుంది. స్టీల్ ప్లాంటులో కార్యకలాపాలు సెప్టెంబర్ చివరినాటికి ప్రారంభం అవుతాయి’ అని వివరించారు. -
ఆగస్ట్‌లో హైదరాబాద్ మారథాన్, టైటిల్ స్పాన్సర్‌గా ఎన్ఎండీసీ!
తెలంగాణ ప్రభుత్వం, ఎన్ఎండీసీ లిమిటెడ్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ లిమిటెడ్, హైదరాబాద్ రన్నర్స్ సొసైటీలు సంయుక్తంగా 11వ ఎడిషన్ ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ - 2022 ప్రారంభం కానున్నాయి. ఆగస్ట్ 27న 5కె ఫన్ రన్, ఆగస్టు 28న 10 కె, హాఫ్ మారథాన్ 21.095కె , ఫుల్ మారథాన్ 42.195కెలు జరగనున్నట్లు నిర్వాహాకులు తెలిపారు. ఇందుకోసం 15వేల మందికి పైగా రన్నర్లు, 3500 మందికి పైగా వాలంటీర్లు, 250 మంది వైద్య సిబ్బంది పాల్గొననున్నారు. ఇక ఈ హైదరాబాద్ మారథాన్ టైటిల్ స్పాన్సర్ షిప్‌ను ఎన్ఎండీసీ అందిస్తున్నట్లు ఆ సంస్థ రేస్ డైరెక్టర్ ప్రశాంత్ మోర్పారియా తెలిపారు. హైదరాబాద్ మారథాన్‌లో పాల్గొనేవారికి ప్రపంచ స్థాయి అనుభవాన్ని అందించే దిశగా కృషి చేస్తామని అన్నారు. మారథాన్ ఈవెంట్‌కు ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ ఫేస్ ఆఫ్ ది ఈవెంట్‌గా వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా నిఖత్ జరీన్ మాట్లాడుతూ.. ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ 2022 ఎడిషన్‌లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని తెలిపారు. నగరంలో జరిగే అతిపెద్ద కమ్యూనిటీ ఫిట్నెస్ ఈవెంట్‌ను విజయవంతం చేయాలని నిఖత్ జరీన్ పిలుపునిచ్చారు. -
నాగర్నార్ స్టీల్‌విడదీతకు ఓకే
న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజం ఎన్ఎండీసీ నుంచి నిర్మాణంలో ఉన్న నాగర్నార్ స్టీల్ ప్లాంటు(ఎన్ఎస్పీ)ను విడదీసేందుకు వాటాదారులు, రుణదాతలు అనుమతించినట్లు కంపెనీ సీఎండీ సుమిత్ దేవ్ తాజాగా వెల్లడించారు. ఇందుకు అనుగుణంగా స్టీల్ శాఖ ఎన్ఎండీసీ వాటాదారులు, రుణదాతలతో ప్రత్యేక సమావేశాలను నిర్వహించినట్లు పేర్కొన్నారు. తద్వారా ఎన్ఎండీసీ నుంచి ఎన్ఎస్పీ విడదీతకు గ్రీన్‌సిగ్నల్ లభించినట్లు తెలియజేశారు. చత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌కు దగ్గర్లోగల నాగర్నార్లో ఎన్ఎండీసీ 3 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో స్టీల్ ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. రూ. 23,140 కోట్ల అంచనా వ్యయాలతో 1,980 ఎకరాల విస్తీర్ణంలో ప్లాంటును నెలకొల్పుతోంది. 2020 అక్టోబర్‌లో ఎన్ఎండీసీ నుంచి ఎన్ఎస్పీని విడదీసేందుకు కేం్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. దీంతో ఎన్ఎస్పీ ప్రత్యేక కంపెనీగా విడివడనుంది. తదుపరి సంస్థలో కేంద్ర ప్రభుత్వానికిగల పూర్తి వాటాను వ్యూహాత్మక కొనుగోలుదారుకి విక్రయించనున్నారు. -
ఎన్ఎండీసీ నుంచి ఎన్ఎస్పీ విడదీత
న్యూఢిల్లీ: పీఎస్‌యూ సంస్థ ఎన్ఎండీసీ నుంచి నిర్మాణంలో ఉన్న నాగర్నర్ స్టీల్ ప్లాంటు(ఎన్ఎస్పీ)ను విడదీసేందుకు చర్యలు చేపట్టనున్నట్లు స్టీల్ శాఖ తాజాగా వెల్లడించింది. విలీన ప్రక్రియను వేగవంతం చేసే బాటలో కంపెనీకి చెందిన వాటాదారులు, రుణదాతలతో నేడు(7న) సమావేశాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. నాలుగు నుంచి ఐదు నెలల్లో ఎన్ఎస్పీని పూర్తిస్థాయిలో ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు చేసే లక్ష్యంతో కేంద్రం ఉన్నట్లు ఒక అధికారిక ప్రతిలో స్టీల్ శాఖ పేర్కొంది. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ సమీపంలో 3 మిలియన్ టన్నుల వార్షిక(ఎంటీపీఏ) సామర్థ్యంతో ఎన్ఎస్పీ ఏర్పాటవుతోంది. 1,980 ఎకరాలలో యూనిట్‌ను నిర్మిస్తున్నారు. ఇందుకు రూ. 23,140 కోట్లు వెచ్చిస్తున్నట్లు అంచనా. ఎన్ఎండీసీ నుంచి ఎన్ఎస్పీని విడదీసేందుకు 2020 అక్టోబర్‌లో కేంద్ర క్యాబినెట్ అనుమతించింది. తద్వారా కంపెనీలో కేంద్రానికున్న మొత్తం వాటాను వ్యూహాత్మక కొనుగోలుదారుడికి విక్రయించనుంది. మంగళవారం నిర్వహించనున్న సమావేశాలకు స్టీల్ శాఖ అదనపు కార్యదర్శి రాశికా చౌబే అధ్యక్షత వహించనున్నారు. ఈ వార్తల నేపథ్యంలో ఎన్ఎండీసీ షేరు ఎన్ఎస్ఈలో 1.6 శాతం నీరసించి రూ. 125 వద్ద ముగిసింది. -
వజ్రాల వేలం.. పోలో అంటూ వచ్చిన వ్యాపారులు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం ఎన్ఎండీసీ ఇటీవల నిర్వహించిన వజ్రాల వేలానికి మంచి స్పందన లభించింది. మధ్యప్రదేశ్‌లోని పన్నా వజ్రాల గనుల నుంచి వెలికితీసిన 8,337 క్యారట్ల రఫ్ డైమండ్లకు నిర్వహించిన ఈ–వేలంలో సూరత్, ముంబై, పన్నా ప్రాంతాల్లోని వర్తకులు పాల్గొన్నట్లు సంస్థ తెలిపింది. 2020 డిసెంబర్ ముందు వెలికి తీసిన వజ్రాలను ఇందులో విక్రయించినట్లు పేర్కొంది. ఈ వజ్రాల వేలానికి నూటికి నూరు శాతం బిడ్లు వచ్చినట్లు ఎన్ఎండీసీ సీఎండీ సుమీత్ దేవ్ తెలిపారు. దేశీయంగా 90% మేర వజ్రాల వనరులు మధ్యప్రదేశ్‌లోనే ఉన్నాయి. ఎన్ఎండీసీకి చెందిన పన్నా గనుల్లో ఏటా 84,000 క్యారట్ల డైమండ్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. దేశంలో యాంత్రీకరించిన వజ్రాల గని ఇదొక్కటే. -
హైదరాబాద్: ఎన్ఎండీసీ, ఈసీఐఎల్, ఐఐఆర్ఆర్లో జాబ్స్
హైదరాబాద్‌లోని నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్ఎండీసీ)..జూనియర్ ఆఫీస్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 94 ► విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, మైనింగ్, జీ అండ్ క్యూసీ, సర్వే. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, ఎమ్మెస్సీ /ఎంటెక్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి. వయసు: 32 ఏళ్లు మించకుండా ఉండాలి. ► జీతం: నెలకి రూ.37,000 నుంచి 1,30,000 వరకు చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: రాతపరీక్ష, సూపర్వైజరీ స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ► పరీక్షా విధానం: రాత పరీక్షని మొత్తం 100 మార్కులకు మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల రూపంలో నిర్వహిస్తారు. ఈ పరీక్షని హిందీ, ఇంగ్లిష్ భాషల్లో నిర్వహిస్తారు. దీనిలో అర్హత సాధించిన అభ్యర్థుల్ని సూపర్వైజరీ స్కిల్టెస్ట్కి ఎంపికచేస్తారు. స్కిల్‌టెస్ట్ అర్హత పరీక్ష మాత్రమే. రాతపరీక్షలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా తుదిఎంపిక ఉంటుంది. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 27.02.2022 ► వెబ్సైట్: nmdc.co.in ఈసీఐఎల్ లో 12 ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 12 ► పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ ఇంజనీర్(ఈసీఈ, ఈఈఈ, ఈటీఈ)–06, ప్రాజెక్ట్ ఇంజనీర్(మెకానికల్, ఈసీఈ, సీఎస్ఈ)–06. ► ప్రాజెక్ట్ ఇంజనీర్(ఈసీఈ, ఈఈఈ, ఈటీఈ): అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 33 ఏళ్లు మించకుండా ఉండాలి. జీతం: నెలకి రూ.40,000 చెల్లిస్తారు. ► ప్రాజెక్ట్ ఇంజనీర్(మెకానికల్, ఈసీఈ, సీఎస్ఈ): అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 33 ఏళ్లు మించకుండా ఉండాలి. జీతం: నెలకి రూ.40,000 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: వాక్ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► వాక్ఇన్ తేది: 15.02.2022 ► వేదిక: ఈసీఐఎల్, నలందా కాంప్లెక్స్, సీఎల్‌డీసీ, టీఐఎఫ్ఆర్ రోడ్,హైదరాబాద్–500062. ► వెబ్సైట్: ecil.co.in ఐకార్–ఐఐఆర్ఆర్ లో వివిధ ఖాళీలు హైదరాబాద్, రాజేంద్రనగర్‌లోని ఐకార్–ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్(ఐఐఆర్ఆర్).. తాత్కాలిక ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 07 ► పోస్టుల వివరాలు: రీసెర్చ్ అసోసియేట్–01, జూనియర్ రీసెర్చ్ ఫెలో(జేఆర్ఎఫ్) –03, టెక్నికల్ అసిస్టెంట్లు–03. ► రీసెర్చ్ అసోసియేట్: అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఎమ్మెస్సీ/పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పరిశోధన అనుభవం ఉండాలి. జీతం: నెలకి రూ.49,000+24 శాతం హెచ్ఆర్ఏ చెల్లిస్తారు. ► జూనియర్ రీసెర్చ్ ఫెలో(జేఆర్ఎఫ్): అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ/పీహెచ్డీ ఉత్తీర్ణతతోపాటు పరిశోధన అనుభవం ఉండాలి. జీతం: నెలకి రూ.31,000+24 శాతం హెచ్ఆర్ఏ చెల్లిస్తారు. ► టెక్నికల్ అసిస్టెంట్లు: అర్హత: డిగ్రీ(లైఫ్ సైన్స్)/డిప్లొమా(అగ్రికల్చర్) ఉత్తీర్ణులవ్వాలి. ఫీల్డ్ ఆపరేషన్స్‌పై మంచి నాలెడ్జ్‌తోపాటు కంప్యూటర్ నైపుణ్యాలు ఉండాలి. జీతం: నెలకి రూ.20,000 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఈమెయిల్: msmrecruitment2021@gmail.com ► దరఖాస్తులకు చివరితేది: 12.02.2022 ► వెబ్సైట్: icar-iirr.org -
హైదరాబాద్ ఎన్ఎండీసీ లిమిటెడ్‌లో భారీగా ఉద్యోగాలు
హైదరాబాద్‌లోని నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్ఎండీసీ) లిమిటెడ్... ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 200 ► పోస్టుల వివరాలు: ఫీల్డ్ అసిస్టెంట్(ట్రెయినీ)–43, మెయింటెనెన్స్ అసిస్టెంట్ (మెకానికల్ ట్రెయినీ)–90, మెయింటెనెన్స్ అసిస్టెంట్(ఎలక్ట్రికల్ ట్రెయినీ)–35, ఎంసీఓ గ్రేడ్ 3(ట్రెయినీ)–04, హెమ్ మెకానిక్ గ్రేడ్ 3(ట్రెయినీ)–10, ఎలక్ట్రీషియన్ గ్రేడ్3(ట్రెయినీ)–07, బ్లాస్టర్ గ్రేడ్ 2(ట్రెయినీ)–02, క్యూసీఏ గ్రేడ్–3 (ట్రెయినీ)–09. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత ట్రేడులు/సబ్జెక్టుల్లో ఐటీఐ, ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత సర్టిఫికేట్లతో పాటు పని అనుభవం ఉండాలి. ► వయసు: 02.03.2022 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ► వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకి రూ.18,100 నుంచి రూ.35,040 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి రాతపరీక్ష, ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 02.03.2022 ► వెబ్సైట్: nmdc.co.in -
విశ్వసనీయ వారధిగా మారండి
న్యూఢిల్లీ: పార్టీకి, సామాన్య ప్రజలకు మధ్య విశ్వసనీయ వారధిగా మారాలని భారతీయ జనతా పార్టీ శ్రేణులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశంలో సామాన్య ప్రజల ప్రయోజనాల కోసం బీజేపీ కట్టుబడి ఉందని గుర్తుచేశారు. వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ప్రజల విశ్వాసాన్ని కచ్చితంగా చూరగొంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని ఎన్ఎండీసీ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని పార్టీ నేతలను ఉద్దేశించి ప్రసంగించారు. సేవా, సంకల్పం, అంకితభావం అనే విలువలపై ఆధారపడి బీజేపీ పని చేస్తోందని చెప్పారు. కేవలం ఒక కుటుంబం చుట్టే తిరగడం లేదంటూ పరోక్షంగా కాంగ్రెస్‌కు చురకలంటించారు. బీజేపీ కుటుంబ పార్టీ కాదని, ఒక కుటుంబం పెత్తనం కింద కొనసాగడం లేదన్నారు. ప్రజా సంక్షేమం అనే సంస్కృతే బీజేపీకి ఆయువుపట్టు అని వ్యాఖ్యానించారు. ప్రజల బాగు కోసం పని చేస్తోంది కాబట్టే కేంద్రంలో తమ పార్టీ అధికారంలో ఉందని వివరించారు. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో కార్యకర్తలు ప్రజలకు విశేష సేవలందించారని కొనియాడారు. ప్రజలకు సేవ చేయడమే బీజేపీకి పరమావధి అని స్పష్టం చేశారు. అభివృద్ధి ఎజెండాకు ప్రజామోదం తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధించిందని మోదీ ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌లో బద్వేల్ ఉప ఎన్నికలోనూ ఓట్ల శాతాన్ని భారీగా పెంచుకుందని వివరించారు. బద్వేల్ ఉప ఎన్నికలో పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలపై మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. 2019 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ బీజేపీకి కేవలం 750 ఓట్లు వచ్చాయని, ఈసారి ఏకంగా 21,000కుపైగా ఓట్లు సాధించిందని హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ అభివృద్ధి అజెండాకు ప్రజామోదం లభిస్తోందనడానికి ఇవే నిదర్శనాలని పేర్కొన్నారు. పార్టీలోని సీనియర్ నేతలు, కార్యకర్తలతో సంబంధాలు పెంచుకోవాలని, వారి నుంచి ఎంతో నేర్చుకోవచ్చని బీజేపీ శ్రేణులకు సూచించారు. కార్యకర్తలకు నడ్డా దిశానిర్దేశం వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ ముఖ్యమంత్రులు, బీజేపీ అధ్యక్షులు పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్నారు. తమ రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితిని వివరిస్తూ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సమావేశంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగించారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం కోసం కృషి చేయాలంటూ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ ఏడాది డిసెంబర్ 25 నాటికి 10.40 లక్షల పోలింగ్ స్టేషన్ల పరిధిలో బూత్ లెవెల్ కమిటీల ఏర్పాటును పూర్తిచేస్తామన్నారు. రాజకీయ తీర్మానం ప్రధాని మోదీ నాయకత్వ ప్రతిభను కొనియాడుతూ, ప్రతిపక్షాల అవకాశవాద వైఖరిని ఎండగడుతూ బీజేపీ జాతీయ కార్యకర్గ సమావేశంలో యూపీ సీఎం ఆదిత్యనాథ్ ఒక రాజకీయ తీర్మానాన్ని ప్రతిపాదించారు. వచ్చే ఏడాది ప్రారంభంలో జరగబోయే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ ఘన విజయం సాధించడం ఖాయమని తీర్మానంలో పేర్కొన్నారు. మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను ఇందులో ప్రస్తావించారు. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం పట్ల మోదీని అభినందించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ దేశంలోనే పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఆదిత్యనాథ్ రాజకీయ తీర్మానాన్ని ప్రతిపాదించడంలో ఎలాంటి తప్పు లేదన్నారు. ప్రతిపక్షాలు పచ్చి అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. -
పర్యావరణహితంగా ‘వైఎస్సార్ స్టీల్’
సాక్షి, అమరావతి: ఎటువంటి కాలుష్యం లేకుండా.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడం ద్వారా పర్యావరణహితంగా వైఎస్సార్ స్టీల్ ప్లాంట్‌ను నిర్మించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ ప్లాంట్ నిర్మాణానికి ఇప్పటికే కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా నిర్మాణ పనులు చేపట్టడానికి అవసరమైన సీఎఫ్ఈ (కన్సంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్)ను రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి మంజూరు చేసింది. సీఎఫ్ఈ సర్టిఫికెట్‌ను వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్‌కు జారీ చేసినట్లు ఏపీ కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ) చైర్మన్ అశ్వినీకుమార్ పరిడా గురువారం తెలిపారు. వెనుకబడిన రాయలసీమను పారిశ్రామికంగా అభివృద్ధి చేసి.. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనేది ఈ ప్లాంట్ ఏర్పాటు లక్ష్యం. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు సమీపంలో ఈ స్టీల్ ప్లాంట్‌కు 2019 డిసెంబర్లో సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. 3,591 ఎకరాల్లో రూ.16,986 కోట్లతో అంచనాతో ఈ ప్రాజెక్టును చేపట్టినట్టు పరిడా పేర్కొన్నారు. ఏడాదికి 30 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు అవసరమైన ముడి ఇనుమును సరఫరా చేయడానికి జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్ఎండీసీ)తో ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టడానికి ఎస్సార్ స్టీల్ ముందుకు వచ్చింది. కాలుష్యాన్ని తగ్గించే పరిజ్ఞానం పర్యావరణహితంగా వైఎస్సార్ స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రాజెక్టస్ డైరెక్టర్ బలరామ్ ‘సాక్షి’కి వివరించారు. సాధారణంగా స్టీల్ ప్లాంట్ల్లో వాయుకాలుష్యం 50 ఎంజీ/ఎన్ఎం3 వరకు అనుమతిస్తారని తెలిపారు. అయితే అత్యాధునిక పరిజ్ఞానం వినియోగించడం ద్వారా దీన్ని 30 ఎంజీ/ఎన్ఎం3కే పరిమితం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పరిశ్రమ వ్యర్థాలు ఒక చుక్క కూడా బయటకు వెళ్లకుండా శుద్ధి చేసి పూర్తిగా వినియోగించుకుంటామని చెప్పారు. ప్లాంట్ దక్షిణం వైపు రిజర్వ్ ఫారెస్ట్ ఉందని.. దానిపై కాలుష్యం ప్రభావం పడకుండా అర కిలోమీటరు వరకు చెట్లను పెంచుతామన్నారు. ప్రధాన ప్లాంట్ చుట్టూ 30 నుంచి 50 మీటర్ల వరకు పచ్చదనాన్ని పెంపొందిస్తామని తెలిపారు. ఈ ప్రతిపాదనను పరీడా నేతృత్వంలోని సీఎఫ్ఈ కమిటీకి వివరించగా.. సానుకూలంగా స్పందించి అనుమతులు మంజూరు చేసినట్లు వివరించారు. ప్రస్తుతం ప్రధాన ప్లాంట్‌కు సంబంధించిన ప్రాజెక్టు రిపోర్ట్ సిద్ధమవుతోందన్నారు. త్వరలోనే ఎస్సార్ స్టీల్‌తో ఒప్పందం చేసుకొని నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. -
ఎన్ఎండీసీ కేన్సర్ రన్ 2021
-
NMDC Recruitment 2021: ఎన్ఎండీసీలో 89 పోస్టులు
హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న భారత ప్రభుత్వ రంగ సంస్థ.. నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్ఎండీసీ)కు చెందిన జార్ఖండ్‌లోని టాకిసుడ్ నార్త్ కోల్‌మైన్‌లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 89 ► పోస్టుల వివరాలు: కొల్లియరీ ఇంజనీర్(మెకానికల్, ఎలక్ట్రికల్)–02, లెయిజనింగ్ ఆఫీసర్–02, మైనింగ్ ఇంజనీర్–12, సర్వేయర్–02, ఎలక్ట్రికల్ ఓవర్‌మెన్–04, మైన్ ఓవర్‌మెన్–25, మెకానికల్ ఓవర్‌మెన్–04, మైన్ సిర్దార్–38. ► అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, ఇంజనీరింగ్ డిగ్రీ, పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు వాలిడ్ సిర్దార్ సర్టిఫికేట్ ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. ► ఎంపిక విధానం: ఎగ్జిక్యూటివ్ గ్రేడ్ పోస్టుల ఇంటర్వ్యూ ఆధారంగా; సూపర్వైజర్లు, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు రాతపరీక్ష సూపర్వైజరీ స్కిల్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ► పరీక్షా విధానం: రాతపరీక్ష మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల రూపంలో 100 మార్కులకు ఉంటుంది. ఈ పరీక్షను ఇంగ్లిష్, హిందీ భాషల్లో నిర్వహిస్తారు. రాతపరీక్షలో అర్హత సాధించిన సూపర్వైజరీ పోస్టు అభ్యర్థులను సూపర్వైజరీ స్కిల్ టెస్ట్‌కు, నాన్ ఎగ్జిక్యూటివ్ అభ్యర్థులకు స్కిల్ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు. రాతపరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 22.06.2021 ► వెబ్సైట్: www.nmdc.co.in మరిన్ని నోటిఫికేషన్లు: ఏపీ: శ్రీకాకుళంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 22 ఉద్యోగాలు సదరన్ రైల్వేలో 3378 అప్రెంటిస్ ఖాళీలు బెల్లో ట్రెయినీ, ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు -
ఎన్ఎండీసీలో జాబ్స్; 304 ఖాళీలు
హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్ఎండీసీ).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. » మొత్తం పోస్టుల సంఖ్య: 304 » పోస్టుల వివరాలు: ఫీల్డ్ అటెండెంట్(ట్రెయినీ)–65, మెయింటెనెన్స్ అసిస్టెంట్ (మెకానికల్)(ట్రెయినీ)–148, మెయింటెనెన్స్ అసిస్టెంట్(ఎలక్ట్రికల్)(ట్రెయినీ)–81, బ్లాస్టర్ గ్రేడ్–2(ట్రెయినీ)–01, ఎంసీఓ గ్రేడ్–3(ట్రెయినీ)–09. » ఫీల్డ్ అటెండెంట్(ట్రెయినీ): బీఐఓఎల్ కిరండల్ కాంప్లెక్స్–35, బీఐఓఎల్ బచేలీ కాంప్లెక్స్–30. అర్హత: మిడిల్ పాస్/ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. » మెయింటెనెన్స్ అసిస్టెంట్(మెకానికల్) (ట్రెయినీ): బీఐఓఎల్ కిరండల్ కాంప్లెక్స్ –76, బీఐఓఎల్ బచేలీ కాంప్లెక్స్–72. అర్హత: వెల్డింగ్/ఫిట్టర్/మెషినిస్ట్/మోటార్ మెకానిక్/డీజిల్ మెకానిక్/ఆటో ఎలక్ట్రీషియన్ ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. » మెయింటెనెన్స్ అసిస్టెంట్(ఎలక్ట్రికల్)(ట్రెయినీ): బీఐఓఎల్ కిరండల్ కాంప్లెక్స్ –49,బీఐఓఎల్ బచేలీ కాంప్లెక్స్–32. అర్హత: ఎలక్ట్రికల్ ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. » బ్లాస్టర్ గ్రేడ్–2(ట్రెయినీ): అర్హత: బ్లాస్టర్ ట్రేడులో మెట్రిక్/ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. మైనింగ్ మేట్, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉండాలి. బ్లాస్టింగ్‌లో మూడేళ్ల అనుభవం ఉండాలి. » ఎంసీఓ గ్రేడ్–3(ట్రెయినీ): అర్హత: మెకానికల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. » వయసు: 15.04.2021 నాటికి 18–30 ఏళ్ల మధ్య ఉండాలి. » ఎంపిక విధానం: ఫీల్డ్ అటెండెంట్ పోస్టులకి రాతపరీక్ష, ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్ ఆధారంగా.. మిగిలిన పోస్టులకి రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. » పరీక్షా విధానం: ఫీల్డ్ అటెండెంట్ పోస్టులకి 100 మార్కులకు రాతపరీక్ష ఉంటుంది. ఇందులో జనరల్ నాలెడ్జ్ 70 మార్కులు, న్యూమరికల్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ 30 మార్కులకు ఉంటాయి. మిగతా పోస్టులకి 130 మార్కులకు రాతపరీక్ష ఉంటుంది. ఇందులో సబ్జెక్టు నాలెడ్జ్(సంబంధిత ట్రేడు) 30 మార్కులు, జనరల్ నాలెడ్జ్ 70 మార్కులు, న్యూమరికల్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ 30 మార్కులకు ఉంటాయి. దీనిలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ నిర్వహిస్తారు. రాతపరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. » దరఖాస్తు విధానం: ఆన్లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తును పోస్ట్ బాక్స్ నెం.1383, పోస్ట్ ఆఫీస్, హుమాయూన్ నగర్, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం, పిన్–500028 చిరునామాకు పంపించాలి. » ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 31.03.2021 » దరఖాస్తు హార్ట్కాపీలను పంపడానికి చివరి తేది: 15.04.2021 » వెబ్సైట్: https://www.nmdc.co.in/Careers/Default.aspx ఎన్ఎండీసీలో జూనియర్ ఆఫీసర్ ట్రైనీ పోస్టులు -
ఎన్ఎండీసీలో జాబ్స్; నోటిఫికేషన్ విడుదల
భారత ఉక్కు మంత్రిత్వశాఖకు చెందిన నవరత్న ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ), హైదరాబాద్‌లోని నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్ఎండీసీ).. ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా మొత్తం 63 జూనియర్ ఆఫీసర్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్ఎండీసీ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్ఎండీసీ).. ఇనుప ఖనిజం, రాగి, రాక్ఫాస్పెట్, సున్నపురాయి, డోల్మైట్, జిప్సం, మాగ్నసైట్, డైమండ్ వంటి ఖనిజాల అన్వేషణ చేస్తోంది. ఇనుప ఖనిజాన్ని ఉత్పత్తి, ఎగుమతి చేయడంలో ఎన్ఎండీసీ దేశంలోనే అగ్రగామీ సంస్థ. అంతేకాకుండా ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్పూర్లో ఎన్ఎండీసీ 3.0 ఎమ్‌టీపీఏ ఇంటిగ్రేటెడ్ స్టీల్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తుంది. ఎప్పటిప్పుడు మానవ వనరుల అవసరాలకు అనుగుణంగా ఖాళీల ను భర్తీచేసే ఎన్ఎండీసీ.. తాజాగా జూనియర్ ఆఫీసర్ ట్రైనీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. పోస్టుల వివరాలు జూనియర్ ఆఫీసర్(మైనింగ్) ట్రైనీ–28 : » విద్యార్హతలు: మైనింగ్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు ఓపెన్‌కాస్ట్ మోటాలిఫెరస్ మైన్‌కు సంబంధించిన ఫోర్మెన్స్ సర్టిఫికేట్‌ను కలిగి ఉండాలి. లేదా మైనింగ్‌లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఓపెన్‌కాస్ట్ మోటాలిఫెరస్ మైన్‌కు సంబంధించిన మైన్స్ మేనేజర్ సర్టిఫికేట్‌ను పొంది ఉండాలి. అలాగే సంబంధిత పనిలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి. జూనియర్ ఆఫీసర్ (మెకానికల్ ) ట్రైనీ –17 » విద్యార్హతలు : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా/మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతేకాకుండా సంబంధిత పనిలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి. జూనియర్ ఆఫీసర్(ఎలక్ట్రికల్)ట్రైనీ –13 : » విద్యార్హతలు: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమాతోపాటు ఎలక్ట్రికల్ సూపర్వైజరీ సర్టిఫికేట్(మైనింగ్)/ ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో ఐదేళ్ల అనుభవం ఉండాలి. జూనియర్ ఆఫీసర్(సివిల్) ట్రైనీ–05 : » విద్యార్హతలు: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల/సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి. » వయసు: 32ఏళ్లకు మించుకుండా ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు–05ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు గరిష్టంగా వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం ఆన్లైన్ టెస్ట్(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), సూపర్వైజరీ స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్‌ను ఆబ్జెక్టివ్ మల్టిపుల్ ఛాయిస్ పద్దతిలో మొత్తం100 మార్కులకు నిర్వహిస్తారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారిని సూపర్వైజరీ టెస్ట్‌కు పిలుస్తారు. ఈ పరీక్ష కూడా 100 మార్కులకు ఉంటుంది. సూపర్వైజరీ టెస్ట్‌ను అర్హత పరీక్షగా మాత్రమే పరిగణిస్తారు. కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థుల తుది జాబితా రూపొందించి.. నియామకం ఖరారు చేస్తారు. ముఖ్యమైన సమాచారం » దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. » దరఖాస్తు చివరి తేదీ : 23.03.2021 » వెబ్సైట్ : https://www.nmdc.co.in/Careers/Default.aspx హెచ్‌పీసీఎల్ ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండి -
స్వల్పకాలంలో రెట్టింపు లాభాల్ని ఇచ్చే 3 షేర్లు ఇవే..!
రిస్క్ రివార్డును ఎదుర్కోనగలిగే ఇన్వెస్టర్లకు అటో, ఫార్మా, ప్రైవేట్ బ్యాంకుల షేర్లను సిఫార్సు చేస్తామని రిలయన్స్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ విశ్లేషకుడు విజయ్ జైన్ తెలిపారు. ఈ రంగాలకు చెందిన షేర్లు మాత్రమే స్టాక్ మార్కెట్లో అత్యుత్తమ ప్రదర్శన చేస్తాయని ఆయన అంచనా వేస్తున్నారు. నిఫ్టీ ఇండెక్స్‌లో మెటల్ షేర్లు వాటి కాంజెస్టింగ్ జోన్ నుండి మీడియం-టర్మ్ సగటులను బ్రేక్ అవుట్ చేస్తున్నాయని ఆయన్నారు. ఈ నేపథ్యంలో ఆయన స్వల్పకాలానికి రెట్టింపు లాభాల్ని ఇచ్చే 3స్టాకులను సిఫార్సు చేస్తున్నారు. 1. షేరు పేరు: ఎన్ఎండీసీ రేటింగ్: బై టార్గెట్ ధర: రూ.86 స్టాప్ లాస్: రూ.68 అప్ సైడ్: 15.60శాతం విశ్లేషణ: డైలీ, వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో సుధీర్ఘ కన్సాలిడేషన్ తరువాత బలమైన వ్యాల్యూమ్స్‌తో షేరు బ్రేక్అవుట్ చూసింది. ఈ మెటల్ సెక్టార్లో ఇటీవల పాజిటివ్ మూమెంటమ్ నెలకొంది. రిలిటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ (ఆర్ఎస్ఐ) దాని యావరేజ్ లైన్ నుంచి అప్‌వర్డ్ క్రాస్ చేస్తోంది. ఈ సంకేతాలు రానున్న రోజుల్లో షేరు భారీ ర్యాలీని సూచిసున్నాయి. 2. షేరు షేరు: సన్ ఫార్మా రేటింగ్: బై టార్గెట్ ధర: రూ.535 స్టాప్ లాస్: రూ.425 అప్ సైడ్: 14.6శాతం విశ్లేషణ: గత నెలలో రూ.505 గరిష్టాల నుండి దిద్దుబాటు తర్వాత ధర, సమయం వారీగా షేరు కరెక్షన్ను పూర్తి చేసిందని మేము(రిలయన్స్ సెక్యూరిటీస్) నమ్ముతున్నాము. రాబోయే కొద్ది వారాల్లో ప్రస్తుత స్థాయిల నుండి మెరుగ్గా రాణించేందుకు అవకాశం ఉంది. 3. షేరు పేరు: వోల్టాస్ రేటింగ్: బై టార్గెట్ ధర: రూ.520 స్టాప్ లాస్: రూ.425 అప్ సైడ్: 13శాతం విశ్లేషణ: ఈ స్టాక్ బలమైన వాల్యూమ్‌లతో సబ్ రూ .430 వద్ద డబుల్ బాటమ్‌ను ఏర్పాటు చేసింది. ఆర్ఎస్ఐ ఇండెక్స్ యావరేజ్ బాండ్... సగటు బాండ్‌ను దాటి పైకి వెళ్లింది. ప్రస్తుత స్థాయిల నుంచి షేరు రాణిస్తుందని నమ్ముతున్నాము. రోజువారీ చార్టులలో డబుల్-బాటమ్ సపోర్ట్ ఓవర్‌సోల్డ్ స్టేటస్ రానున్న రోజుల్లో పదునైన అప్ మూమెంటమ్‌ను సూచిస్తున్నాయి. -
కరోనాపై కార్పొరేట్ల యుద్ధం
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ను ఎదుర్కొనే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ అనే ప్రత్యేక నిధికి కార్పొరేట్లు పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటిస్తున్నారు. దేశంలోనే సంపన్నుడైన ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.500 కోట్లను ఇవ్వనున్నట్టు ప్రకటించింది. అలాగే, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల సీఎం సహాయనిధికి చెరో రూ.5 కోట్లను కేటాయించింది. ఇంజనీరింగ్ దిగ్గజం ఎల్అండ్టీ కూడా పీఎం కేర్స్‌కు రూ.150 కోట్లను ప్రకటించింది. అలాగే, లౌక్‌డౌన్ సమయంలో ఎల్అండ్టీ తన కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు చెల్లించనుంది. ఇందు కోసం ప్రతి నెలా రూ.500 కోట్లను పక్కన పెట్టనున్నట్టు ఎల్అండ్టీ గ్రూపు చైర్మన్ ఏఎం నాయక్ తెలిపారు. ఇప్పటికే టాటాసన్స్, టాటా గ్రూపు కలసి రూ.1,500 కోట్లను పీఎంకేర్స్ కోసం ప్రకటించాయి. ఇక హీరో గ్రూపు సైతం కరోనా వైరస్ నివారణ చర్యల కోసం రూ.100 కోట్లను ఖర్చు చేయనున్నట్టు తెలిపింది. ఇందులో రూ.50 కోట్లను పీఎం కేర్స్‌కు, మరో రూ.50 కోట్లను నివారణ చర్యలకు ఖర్చు చేయనుంది. పేటీఎం సైతం రూ.500 కోట్లు: పేటీఎం సైతం పీఎం కేర్స్ సహాయనిధికి రూ.500 కోట్లు అందించాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. తోటి పౌరుల నుంచి విరాళాలు అందించాలని ఈ సంస్థ కోరింది. యూజర్లు ఇచ్చే ప్రతీ రూ.10కి అదనంగా తాను రూ.10కూడా కలిపి పీఎం కేర్స్‌కు అందించనున్నట్టు ప్రకటించింది. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ రూ.100 కోట్లు... కరోనా సహాయ చర్యల్లో భాగంగా పీఎం కేర్స్ నిధికి రూ.50 కోట్లను విరాళం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. మరో రూ.50 కోట్లను సొంతంగా ఖర్చుచేయనుంది. ఎన్ఎండీసీ రూ.150 కోట్లు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కరోనా వైరస్ మీద కేంద్ర ప్రభుత్వం చేస్తున్న యుద్ధానికి మద్ధతుగా నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండీసీ) పీఎం కేర్స్ ఫండ్‌కు రూ.150 కోట్లు విరాళంగా అందించింది. దేశంలోని ప్రభుత్వ రంగ కంపెనీల్లో ఇదే అతిపెద్ద సహాయమని ఈ మేరకు ఎన్ఎండీసీ సీఎండీ బైజేంద్ర కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అమర్‌రాజా గ్రూప్ రూ.6 కోట్లు..: బ్యాటరీ తయారీ సంస్థ అమర్‌రాజా గ్రూప్ కరోనా నియంత్రణకు రూ.6 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. ఇందులో కంపెనీ ఉద్యోగుల ఒక రోజు వేతనం కూడా కలిపి ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.5 కోట్లు, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.కోటి అందిస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. సిగ్నిటీ రూ.50 లక్షలు..: హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్వేర్ టెస్టింగ్ సర్వీసెస్ కంపెనీ సిగ్నిటీ టెక్నాలజీస్ తెలంగాణ ప్రభుత్వ కోవిడ్ సహాయ నిధికి రూ.50 లక్షల విరాళంగా అందించింది. ఈ మేరకు సిగ్నిటీ సీఎండీ సీవీ సుబ్రహ్మణ్యం మంత్రి కేటీ రామారావుకు చెక్‌ను అందజేశారు. మ్యాన్‌కైండ్ రూ. 51 కోట్లు..: న్యూఢిల్లీకి చెందిన ఫార్మాసూటికల్ కంపెనీ మ్యాన్‌కైండ్ కరోనా వైరస్ మీద ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న యుద్దానికి మద్దతుగా రూ.51 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. ఇం దులో భాగంగా తెలంగాణ ప్రభుత్వానికి రూ.3 కోట్లు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ.కోటి అందిస్తున్నట్లు కంపెనీ చైర్మన్ ఆర్సీ జునెజా ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్సీసీ రూ.కోటి..: కన్స్ట్రక్షన్స్ ఇంజనీరింగ్ కంపెనీ ఎన్సీసీ లిమిటెడ్ కరోనా వైరస్ నియంత్రణ కోసం తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.కోటి నిధులను అందజేసింది. ఈ మేరకు కంపెనీ ఎండీ రంగరాజు సీఎం కే చంద్రశేఖర్ రావుకు చెక్‌ను అందజేశారు. పరిష్కారాలకు రూ. 2.5 కోట్లు పారిశ్రామిక దిగ్గజం హర్ష మారివాలా ఆఫర్ ముంబై: కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు వచ్చే నెల రోజుల్లో వినూత్న పరిష్కారమార్గాలు కనుగొనే వారికి రూ. 2.5 కోట్ల బహుమతి ఇవ్వనున్నట్లు ఎఫ్ఎంసీజీ దిగ్గజం మారికో అధినేత, పారిశ్రామికవేత్త హర్‡్ష మారివాలా ప్రకటించారు. రెండు లాభాపేక్షరహిత సంస్థలతో కలిసి వ్యక్తిగత హోదాలో తాను ఇందుకోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ఇన్నోవేట్2బీట్కోవిడ్ పేరిట నిర్వహిస్తున్న పోటీలో మెడ్–టెక్ ఎంటర్‌ప్రెన్యూర్స్, కార్పొరేటర్లు, నూతన ఆవిష్కర్తలు పాల్గొనాలంటూ మారికో ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఆహ్వానించింది. స్వల్ప సమయంలోనే భారీ స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు అనువైన సొల్యూషన్స్‌పై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు మారివాలా తెలిపారు. -
కడప స్టీల్ ప్లాంట్‌కు ఐరన్ ఓర్ సరఫరాపై ఒప్పందం
-
ఈ ఒప్పందం చరిత్రాత్మకం: సీఎం జగన్
సాక్షి,తాడేపల్లి: మరో చారిత్రాత్మక ఒప్పందానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేసింది. కడప స్టీల్ ప్లాంట్‌కు ఐరన్ ఓర్ సరఫరాపై ఎన్ఎండీసీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పదం కుదరింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఎన్ఎండీసీ డైరెక్టర్ (కమర్షియల్) అలోక్‌కుమార్ మెహతా, ఏపీ హైగ్రేడ్ స్టీల్ లిమిటెడ్ సీఎండీ పీ.మధుసూదన్ పత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం దీనిపై సీఎం సంతోషం వ్యక్తం చేశారు. ఎన్ఎండీసీతో ఒప్పందం చరిత్రాత్మకం అన్నారు. కాగా తాజా అంగీకారంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కళ సాకారం కానుంది. కడప స్టీల్ ప్లాంట్‌కు సీఎం జగన్ త్వరలోనే శంకుస్థాపన చేయనున్నారు. దీని కోసం ఇప్పటికే అధికారులు ఏర్పాటు ముమ్మరం చేసినట్లు సమాచారం. -
బంగారం, వజ్రాల కోసం.. వేట
ఖనిజ ఆదాయంలో దేశంలోనే మూడోస్థానంలో ఉన్న రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ.. ఆదాయాన్ని మరింత పెంచుకునేందుకు కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో భూగర్భ వనరుల సంపూర్ణ సమాచారాన్ని క్రోడీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి పలు ప్రతిపాదనలు చేసింది. ఆదాయ పెంపుదలకు బొగ్గు, యురేనియం, సున్నపురాయి, మాంగనీసు, ఇనుము తదితర ఖనిజాలతోపాటు ఇతర ఖనిజాలను వెలికితీయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా జాతీయ మైనింగ్ సంస్థ (ఎన్ఎండీసీ) సహకారంతో బంగారం, వజ్రపు నిల్వల అన్వేషణ, వెలికితీత పనులు చేపట్టాలని నిర్ణయించింది. వజ్రాల జాడపై ఎన్ఎండీసీ ద్వారా సూర్యాపేట జిల్లాలో ఇదివరకే ప్రాథమిక సర్వే చేయించింది. మహబూబ్‌నగర్, గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో వజ్రాల జాడ కోసం అన్వేషణ ప్రారంభించాలని ప్రతిపాదించింది. బంగారం, వజ్రాల వెలికితీత కోసం కొన్ని ప్రాంతాలను ఎన్ఎండీసీకి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) సహకారంతో గద్వాల జిల్లాలో బంగారం, వనపర్తి జిల్లా ఆత్మకూరు ప్రాంతంలో తగరం నిల్వల అన్వేషణ, వెలికితీత చేపట్టేందుకు గనులశాఖ సిద్ధమవుతోంది. టూరింగ్ స్పాట్స్‌గా... ఖనిజాల వెలికితీత తర్వాత ఏర్పడుతున్న భారీ గుంతలను టూరిజం కేంద్రాలుగా మార్చాలనే ప్రతిపాదనను కూడా రాష్ట్ర భూగర్భ వనరుల శాఖ ప్రతిపాదిస్తోంది. చైనాలోని షాంఘై, రొమేనియా, పోలాండ్లోని పోర్ట్లాండ్ తరహాలో మైనింగ్ గుంతల్లో హోటళ్లు, రెస్టారెంట్లు, అమ్యూజ్మెంట్ పార్కులు, బోటింగ్ వంటి వాటిని ఎకో టూరిజంలో భాగంగా ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది. సినిమా షూటింగ్ స్పాట్లు, చేపల పెంపకం, సాగు, తాగునీటి వనరులుగా కూడా ఈ గుంతలను ఉపయోగించేలా తీర్చిదిద్దే ప్రణాళికలు ఉన్నట్లు మైనింగ్ అధికారులు చెప్తున్నారు. – సాక్షి, హైదరాబాద్ -
క్రీడా విద్యకు ఎన్ఎండీసీ సహకారం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఖనిజ ఉత్పత్తి సంస్థ అయిన ఎన్ఎండీసీ.. క్రీడా విద్య ప్రోత్సాహానికి తన వంతు సహకారాన్ని అందించింది. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం, టెన్విక్ స్పోర్స్లు సంయుక్తంగా పలు పాఠశాలల్లో అందిస్తున్న క్రీడా విద్య కార్యక్రమాలకు ఎన్ఎండీసీ సీఎస్ఆర్ ఫౌండేషన్ రూ.2 కోట్లను అందించనుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయ ప్రిన్సిపల్ సెక్రెటరీ గౌరవ్ ద్వివేది, సంస్థ డైరెక్టర్ సందీప్ తులా, టెన్విక్ చైర్మన్ అనీల్ కుంబ్లే ఈమేరకు కుదిరిన ఎంఓఏలపై సంతకాలు పూర్తిచేశారు. -
రెండేళ్లలో రూ.6,500 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండీసీ) వరుసగా వచ్చే రెండు ఆర్ధిక సంవత్సరాల్లో రూ.6,500 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఇనుము ఖనిజ నిక్షేపాలు, ఉత్పాదనపై గత ఆర్ధిక సంవత్సరంలో రూ.2,800 కోట్లు మూలధన వ్యయం వెచ్చించామని.. ఈ ఆర్ధిక సంవత్సరంలో (2019) రూ.3,185 కోట్లు, వచ్చే ఆర్ధిక సంవత్సరంలో (2020) రూ.3,290 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఎన్ఎండీసీ సీఎండీ భజేంద్ర కుమార్ తెలిపారు. బుధవారమిక్కడ జరిగిన ఏజీఎం సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 2020 నాటికి చత్తీస్‌గఢ్‌లోని నాగర్నార్ స్టీల్ ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభమవుతుందని.. ఇప్పటివరకు ఈ ప్లాంట్ మీద రూ.14,182 కోట్లు వెచ్చించామని ఆయన తెలిపారు. మరో మూడు నెలల్లో నాగర్నార్ స్టీల్ ప్లాంట్‌లో బ్లాస్ట్ ఫ్యూర్నెన్స్ (పేలుడు కొలిమి) ప్రారంభమవుతుందని.. ఆ తర్వాత కాస్టింగ్ మిషనరీని రూపొందిస్తామని.. వచ్చే ఏడాది మే లేదా జూన్ నుంచి ఉక్కు తయారీ మొదలవుతుందని ఆయన తెలియజేశారు. దీని ఉత్పత్తి సామర్థ్యం ఏటా 30 లక్షల టన్నుల వరకుంటుందని పేర్కొన్నారు. ఏటా 6.7 కోట్ల టన్నుల లక్ష్యం..: చత్తీస్‌గఢ్‌లోని బైలాడిల్లా గనుల వద్ద భారీ వర్షాల కారణంగా ఈ ఆర్ధిక సంవత్సరంలో ఇనుము ఉత్పత్తి తగ్గిందని.. ఈ సంవత్సరం రెండో భాగంలో 3.6 కోట్ల నుంచి 3.7 కోట్ల టన్నుల ఉత్పత్తి సామర్థ్యం లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. 2021–22 నాటికి ఏటా ఇనుము ఉత్పత్తి సామర్థ్యం 6.7 కోట్ల టన్నులుగా పెట్టుకున్నామని తెలిపారు. లక్ష్యాన్ని చేరుకోవటానికి ఇప్పటికే ఉన్న గనుల ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచడంతో పాటూ కొత్త గనుల కోసం అన్వేషణ సాగిస్తున్నామని ఆయన వివరించారు. ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచడం కోసం బైలాడిల్లాలో 12 ఎంటీపీఏ, కర్నాటకలోని డొనైమాలైలో 7 ఎంటీపీఏల్లో రెండు కొత్త స్క్రీనింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ ఏడాది ముగింపు నాటికి చత్తీస్‌గఢ్‌లోని కుమారమారంగలో 5 లక్షల టన్నుల ఇనుప ఖనిజ ఇంటర్మీడియట్ స్టాక్ప్లీలను కూడా అభివృద్ధి చేస్తున్నామని.. దీంతో రాత్రి సమయాల్లోనూ నిరంతరాయంగా ఇనుము పంపిణీ అవుతుందని ఆయన వివరించారు. -
ఎన్ఎండీసీ లాభం 159 శాతం జంప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మైనింగ్ రంగ దిగ్గజం ఎన్ఎండీసీ మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. మార్చి త్రైమాసికం(2017–18, క్యూ4)ౖ స్టాండలోన్ ఫలితాల్లో నికరలాభం క్రితంతో పోలిస్తే 159 శాతం అధికమై రూ.1,203 కోట్లుగా నమోదయింది. టర్నోవరు రూ.3,006 కోట్ల నుంచి రూ.4,053 కోట్లకు చేరింది. 2017–18లో నికరలాభం క్రితంతో పోలిస్తే రూ.2,522 కోట్ల నుంచి రూ.3,853 కోట్లను తాకింది. టర్నోవరు రూ.9,738 కోట్ల నుంచి రూ.12,134 కోట్లకు ఎగసింది. -
‘ఉక్కు’.. ఏ దిక్కు?
సాక్షి, కొత్తగూడెం : బయ్యారంలో ఉక్కు కర్మాగారం.. 2012 నుంచి దీనిపై రకరకాల చర్చలు, ఆందోళనలు జరుగుతున్నాయి. చివరకు రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇటీవల కాలంలో దీనిపై వివిధ కదలికలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఒక స్పష్టమైన ప్రకటన మాత్రం రాకపోవడంతో అన్ని వర్గాల ప్రజల్లో అనేక సందేహాలు వస్తున్నాయి. ఇన్నాళ్లుగా బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు అంశంపై ఉత్కంఠ నెలకొనగా.. తాజాగా మరో అంశం తెరపైకి వచ్చింది. బయ్యారం బదులు పాల్వంచలో ఏడాదిన్నర క్రితం మూతపడిన ఎన్ఎండీసీలో విలీనం అయిన స్పాంజ్ ఐరన్ కర్మాగారాన్ని 1.5 మిలియన్ టన్నుల ఉక్కు కర్మాగారంగా కేంద్ర ప్రభుత్వం మార్చనుందనే వార్తలు వస్తున్నాయి. అయితే ఇక్కడే అనేక సందేహాలు వస్తున్నాయి. ప్రస్తుతం పాల్వంచలో ఉన్న యూనిట్లో 30 వేల టన్నుల వార్షిక సామర్థ్యం కలిగిన రెండు యూ నిట్లు ఉండగా, ఏడాదిన్నర క్రితం ఉత్పత్తి నిలిచిపోయింది. ఇక్కడ 425 ఎకరాల భూమి మాత్రమే అందుబాటులో ఉంది. అయితే 1.5 మిలియన్ టన్నుల సామ ర్థ్యంతో ఉక్కు కర్మాగారం నిర్మించాలంటే కనీసం 1000 ఎకరాల భూమి ఉండాలి. బయ్యారంలో భూసేకరణ సమస్యగా ఉంటుందని, పాల్వంచలో అయితే ఆ అవసరం లేదనీ చెపుతున్నప్పటికీ.. ఇక్కడ కూడా భూమి సేకరించాల్సిన అవసరం ఉంది. అయితే దీనిపై కేంద్రం నుంచి అధికారిక ప్రకటన మాత్రం ఇంతవరకు రాలేదు. ‘మెకాన్’ నుంచి డీపీఆర్ రాలే.. కేంద్ర ప్రభుత్వ కన్సల్టెన్సీ అయిన ‘మెకాన్’ (మైనింగ్ ఇంజినీర్స్ కన్సల్టెన్సీ) సంస్థ ఇప్పటివరకు ఇందుకు సంబంధించి డీపీఆర్ ఇవ్వలేదు. అక్కడి నుంచి డీపీఆర్ వస్తేనే కేంద్ర గనులు, ఉక్కు, ఆర్థిక శాఖలు కలిసి అనుమతి ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తారు. ఆ తర్వాతే తుది రూపు వస్తుంది. ఈ క్రమంలో బయ్యారం, పాల్వంచల మధ్య ఉక్కు కర్మాగారం అంశం దోబూచులాడుతోంది. అసలే కేంద్ర ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్ (పెట్టుబడుల ఉపసంహరణ) చేస్తున్న పరిస్థితుల్లో ఇంత భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టే అంశంపైనా సందేహాలు నెలకొన్నాయి. నాడు ఆదర్శం.. నేడు అగమ్యగోచరం.. పాల్వంచలోని జాతీయ ఖనిజాభివృద్ది సంస్థ(ఎన్ఎండిసీ) స్పాంజ్ ఐరన్ యూనిట్ సరికొత్త దేశీయ పరిజ్ఞానంతో రూపుదిద్దుకుని పలు దేశాలకు ఆదర్శంగా నిలిచింది. స్పాంజ్ ఐరన్ తయారీలోనే ప్రత్యేకత కలిగి ఉండేది. ఇక్కడ రూపొందించిన టెక్నాలజీని సైతం ఇతర ప్రైవేట్ కర్మాగారాలకు విక్రయించింది. లక్ష్యానికి మించిన ఉత్పత్తిని సాధించి తన రికార్డులను తానే తిరగరాసింది. అయితే ముడిసరుకుతో పాటు మార్కెటింగ్ సమస్యతో చివరకు మూతపడింది. పక్కనే ఉన్న ఏపీ స్టీల్స్ మూతపడడంతో మార్కెటింగ్ కోసం చెన్నై తదితర దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో భారీ లాభాల నుంచి నష్టాల బాటలోకి వచ్చింది. 2010లో స్పాంజ్ ఐరన్‌ను విలీనం చేసుకున్న ఎన్ఎండీసీ ఏమాత్రం పట్టించుకోకపోగా, ఉన్న ఉద్యోగులకు కూర్చోబెట్టి జీతాలు ఇస్తోంది. గతంలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి రాంవిలాస్‌పాశ్వాన్ రూ.1,200 కోట్లతో విస్తరింపజేస్తామని ఇచ్చిన హామీ నీటిమూటే అయింది. -
నేటి నుంచి ఎన్ఎమ్డీసీ వాటా విక్రయం
న్యూఢిల్లీ: ఎన్ఎమ్డీసీలో ప్రభుత్వ వాటా విక్రయం మంగళవారం నుంచి ప్రారంభమవుతోంది. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో 1.5 శాతం వాటాను ప్రభుత్వం విక్రయిస్తోంది. ఈ ఓఎఫ్‌ఎస్‌కు ఫ్లోర్ ధరను రూ.153.5గా ప్రభుత్వం నిర్ణయించింది. ఇది సోమవారం ముగింపు ధర రూ.161.85తో పోలిస్తే 5 శాతం తక్కువ. మంగళవారంనాడు సంస్థాగత ఇన్వెస్టర్లకు, బుధవారం రిటైల్ ఇన్వెస్టర్లకు... మొత్తం రెండు రోజుల పాటు ఈ ఓఎఫ్ఎస్లో వాటా విక్రయం జరుగుతుంది. ఎన్ఎమ్డీసీలో 1.5 శాతం వాటా విక్రయం ద్వారా రూ.750 కోట్ల నిధులు ప్రభుత్వానికి వస్తాయని అంచనా. ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటా విక్రయం, ప్రభుత్వ రంగ బీమా సంస్థలను, ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్లను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయడం ద్వారా ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.52,500 కోట్లు సమీకరించింది. మొత్తం మీద ఈ ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం రూ.72,500 కోట్లు. -
స్టాక్స్ వ్యూ
ఎన్ఎండీసీ – కొనచ్చు బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ ప్రస్తుత ధర: రూ. 125 టార్గెట్ ధర: రూ.187 ఎందుకంటే: భారత్‌లో ఇనుప ఖనిజం ఉత్పత్తి చేసే అతి పెద్ద కంపెనీ ఇదే. చత్తీస్ఘడ్, కర్నాటకల్లో ఉన్న 4 గనుల ద్వారా ఏడాదికి 30–32 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజాన్ని ఉత్పత్తి చేస్తోంది. ఈ ప్రభుత్వ రంగ గనుల కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నా యి. ఈ క్యూ2లో పటిష్టమైన పనితీరును కనబరిచింది. ఇబిటా 56% (అంతకు ముందటి క్వార్టర్‌తో పోల్చితే 21%) వృద్ధితో రూ.1,280 కోట్లకు పెరిగింది. వ్యయాలు తక్కువగా ఉండడం, రియలైజేషన్ అంచనాల కంటే మించడం కలసివచ్చాయి. నికర లాభం 42% వృద్ధితో రూ.890 కోట్లకు పెరిగింది. అమ్మకాలు 4 శాతం(క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపాదికన 10%) వృద్ధితో 8.3 మిలియన్ టన్నులకు పెరిగాయి. ఉత్పత్తి 14 శాతం(అంతకు ముందటి క్వార్టర్‌తో పోల్చితే 16%) వృద్ధి చెంది 7.2 మిలియన్ టన్నులకు పెరిగింది. ఎగుమతులు 2% క్షీణించి 6.2%కి తగ్గాయి. శీతాకాల ఉత్పత్తి కోత కారణంగా చైనాలో డిమాండ్ తగ్గుతుందనే అందోళనతో అంతర్జాతీయంగా ఇనుప ఖనిజం ధరలు తగ్గాయి. ధరల ఒత్తిడి కారణంగా ఇటీవల కొన్ని నెలల్లో కంపెనీ ఇనుప ఖనిజం అమ్మకాలు కూడా తగ్గాయి. అమ్మకాల వృద్ధిని కొనసాగించాలంటే ఈ కంపెనీ ధరలను మరింతగా తగ్గించాల్సి ఉంటుంది. అదనపు మూలధన పెట్టుబడులు లేకుండానే ఈ కంపెనీ అదనంగా 20% సరఫరాలను అందించగలదు. ప్రస్తుతం 36 మిలియన్ టన్నులుగా ఉన్న వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని ఐదేళ్లలో 50 మిలియన్ టన్నులకు పెంచుకోవడానికి గాను రూ.15,500 కోట్లు పెట్టుబడులు పెడుతోంది. చత్తీస్‌ఘడ్‌లో ఏర్పాటు చేస్తోన్న స్టీల్ ప్లాంట్‌లో 49% వాటా విక్రయం కోసం ఇటీవలనే ఒక బ్యాంక్‌ను సలహా సంస్థగా నియమించుకుంది. ఈ వాటా కొనుగోలుకు టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కంపెనీలు ఇప్పటికే తమ ఆసక్తిని వెల్లడించాయి. మూడేళ్లలో అమ్మకాలు 6% చక్రగతిన వృద్ధి చెందగలవని అంచనా. ప్యూచర్ రిటైల్ – కొనచ్చు బ్రోకరేజ్ సంస్థ: యాక్సిస్ డైరెక్ట్ ప్రస్తుత ధర: రూ. 504 టార్గెట్ ధర: రూ.680 ఎందుకంటే: ప్యూచర్ గ్రూప్‌కు చెందిన ఈ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. సేమ్ స్టోర్స్ సేల్స్(ఎస్‌ఎస్‌ఎస్‌జీ) 10 శాతం పెరగడంతో ఈ కంపెనీ మొత్తం అమ్మకాలు 20 శాతం వృద్ధి చెందాయి. నిర్వహణ పనితీరు బాగా ఉండటంతో ఇబిటా 65 శాతం వృద్ధి చెందింది. ఇక నికర లాభం దాదాపు రెట్టింపై రూ.150 కోట్లకు పెరిగింది. నికర లాభ మార్జిన్ 1.6 శాతం వృద్ధితో 3.4 శాతానికి ఎగసింది. వేగంగా వృద్ధి చెందుతున్న భారత్‌లో వ్యవస్థీకృత ఆధునిక రిటైల్ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఈ కంపెనీ తగిన స్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది. బిగ్‌బజార్‌లో సేమ్ స్టోర్ సేల్స్ రెట్టింపు వృద్ధిని సాధిస్తున్నాయి. అధిక వృద్ధి ఫ్యాషన్ కేటగిరిలో ఎఫ్‌బీబీ(ఫ్యాషన్ ఎట్ బిగ్ బజార్) మార్కెట్ వాటా పెరుగుతోంది. హైపర్సిటీ స్టోర్స్‌ను కొనుగోలు చేయడం కంపెనీకి కలసివచ్చే అంశమే. ఈ కొనుగోలు కారణంగా కంపెనీకి 2 కోట్ల మంది కొత్త వినియోగదారులు లభించారు. ఈ కొనుగోలు ప్రయోజనాలు ఈ ఆర్థిక సంవత్సరం చివరి కల్లా కనిపించనున్నాయి. మరోవైపు చిన్న రిటైల్ స్టోర్స్ చెయిన్...ఈజీడే స్టోర్స్‌ను కూడా కంపెనీ చేజిక్కించుకుంది. ఈజీడే స్టోర్స్ సంఖ్యను కూడా విస్తృతంగా పెంచుతోంది. సాధారణ వినియోగదారుల కంటే 3 రెట్లకు పైగా కొనుగోళ్లు చేసే ఈజీడే సేవింగ్స్ క్లబ్ సభ్యుల సంఖ్య ఈ క్యూ2లో 25 శాతం వృద్ధితో 2.5 లక్షలకు పెరిగింది. ఈ క్యూ2లో ఏడు కొత్త నగరాలకు బిగ్‌బజార్ స్టోర్స్‌ను కంపెనీ విస్తరించింది. దీంతో మొత్తం 253 నగరాల్లో మొత్తం బిగ్‌బజార్ స్టోర్స్ సంఖ్య 914కు చేరింది. మూడేళ్లలో ఆదాయం 20 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించగలదని, ఇదే మూడేళ్లలో ఇబిటా మార్జిన్ 4.8 శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నాం. -
ఎన్ఎండీసీ వజ్రాల వేట!
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని ఎన్ఎండీసీ లిమిటెడ్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విస్తరించి ఉన్న 9 బిలియన్ డాలర్ల విలువైన (రూ.57,600 కోట్ల) వజ్రాల గనులకు బిడ్లు వేసే ఆలోచనతో ఉంది. ఇప్పటికే అదానీ, వేదాంత ఈ వజ్రాల గనులపై కన్నేసిన విషయం తెలిసిందే. వీటి సరసన పోటీలోకి ఎన్ఎండీసీ కూడా రానున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. మధ్యప్రదేశ్ రాష్ట్ర అధికారులతో మాట్లాడేందుకు ఎన్ఎండీసీ త్వరలోనే ఓ బృందాన్ని కూడా పంపనున్నట్టు ఈ వ్యవహారంతో సంబంధమున్న వర్గాలు తెలిపాయి. వజ్రాల గనిని నామినేషన్ ప్రాతిపదికన తమకు నేరుగా కేటాయించాలని కోరగా, దాన్ని కేంద్రం తోసిపుచ్చినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. విశాల ప్రయోజనాల కోణంలో గనులను వేలం వేయాలని ప్రభుత్వం భావిస్తోందని ఆ వర్గాలు చెప్పాయి. మధ్యప్రదేశ్‌లోని బందర్ ప్రాంతంలో 32 మిలియన్ క్యారట్ల నిల్వలు ఉన్నట్టు అంచనా. ఈ గనిని అంతర్జాతీయంగా వజ్రాల మైనింగ్‌లో పేరొందిన రియో టింటో ఈ ఏడాది ఆరంభంలో వదిలిపెట్టి వెళ్లిపోయిన విషయం గమనార్హం. ఈ నెలాఖరులోపు బందర్ వజ్రపు గనికి మధ్యప్రదేశ్ సర్కారు వేలం నిర్వహించే అవకాశాలున్నాయి. ఈ నెల 30 నాటికి టెండర్లను ఆహ్వానిస్తూ ప్రకటన వెలువడుతుందని మధ్యప్రదేశ్ మినరల్ రిసోర్సెస్ ఉన్నతాధికారి మనోహర్‌లాల్ దూబే తెలిపారు. అటవీ అనుమతులు వేగంగా ఇచ్చేందుకు పర్యావరణ శాఖ లోగడే హామీ ఇచ్చినట్టు చెప్పారు. ఇక నూతన ఖనిజ వనరుల విధానంలో భాగంగా భారీ ప్రాజెక్టులకు బిడ్లు వేసేందుకు అర్హతలను సడలించనున్నారు. వజ్రాల వేట: మధ్యప్రదేశ్‌లో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న బందర్ గనిపై రియోటింటో సంస్థ 14 ఏళ్ల పాటు శ్రమించింది. 90 మిలియన్ డాలర్లు (రూ.576 కోట్లను) ఖర్చు చేసింది. ఈ ప్రాంతం పులులకు ఆవాసం కావడంతో పర్యావరణ అనుమతుల్లో ఆలస్యం చోటు చేసుకుంది. దీంతో రియోటింటో ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. తాజా వేలం ప్రతిపాదన నేపథ్యంలో ఇటీవలే వేదాంత రిసోర్సెస్, అదానీ గ్రూపు ప్రతినిధులు ఈ ప్రాంతంలో పర్యటించారు. మరోవైపు ఎన్ఎండీసీ ఇప్పటికే వజ్రాల వెలికితీతలో ఉంది. మధ్యప్రదేశ్‌లోనే మజ్గావన్ గని నుంచి మిలియన్ క్యారట్ వజ్రాలను వెలికితీసిన అనుభవం కూడా ఉంది. దీంతో బందర్ గనికి కూడా పోటీ పడాలనుకుంటోంది. -
ఉత్పత్తి లక్ష్యాన్ని కుదించిన ఎన్ఎండీసీ
హైదరాబాద్: మైనింగ్ రంగ దిగ్గజం ఎన్ఎండీసీ వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని కుదించింది. 2018–19 నాటికి 50 మిలియన్ టన్నులకు, 2021–22 నాటికి 67 మిలియన్ టన్నులకు సవరించింది. 2015లో ఎన్ఎండీసీ రచించుకున్న విజన్ 2025 ప్రణాళిక ప్రకారం వార్షిక ఉత్పత్తి 2018–19 కల్లా 75 మిలియన్ టన్నులు, 2021–22 కల్లా 100 మిలియన్ టన్నులకు చేరుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా ముడి ఇనుముకు డిమాండ్‌తోపాటు ధరలూ పడిపోవడం, అలాగే నిల్వలు పేరుకుపోవడం సంస్థ తాజా నిర్ణయానికి కారణం. 2016–17లో కంపెనీ 34 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేసింది. ఇప్పటి వరకు ఇదే అత్యధికం. -
2030 నాటికి 300 మిలియన్ టన్నులు
ఉక్కు ఉత్పత్తిపై ఎన్ఎండీసీ టెక్నికల్ డైరెక్టర్ నందా వ్యాఖ్య విశాఖ సిటీ: దేశంలోని అన్ని స్టీల్ ప్లాంట్ల నుంచి 2030 నాటికి ఏడాదికి 300 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నట్లు ఎన్ఎండీసీ టెక్నికల్ డైరెక్టర్ ఎన్‌కె నందా చెప్పారు. కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన నేషనల్ స్టీల్ పాలసీ నిర్దేశించిన లక్ష్యాలను నెరవేర్చేందుకు ప్లాంట్ కృషి చెయ్యాలని కోరారు. విశాఖ ఉక్కు కర్మాగారం, కోల్‌కతాకు చెందిన స్టీల్ మెటలర్జీ సంస్థ ఆధ్వర్యంలో విశాఖలో మేకిన్ ఇండియా– మేకిన్ స్టీల్ సదస్సు జరిగింది. దీన్లో సెయిల్, ఎన్ఎండీసీ సహా.. పలు సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నందా మాట్లాడుతూ ప్రస్తుతం ఏడాదికి 90 మిలియన్ టన్నలు స్టీల్ ఉత్పత్తి అవుతోందని.. దీన్ని 2030 నాటికి 3 రెట్లు పెంచడమే లక్ష్యమని చెప్పారు. ఉత్పత్తిలో నాణ్యతతో పాటు ఎలక్ట్రో స్టీల్ వంటి వాటిని దేశంలో ఉత్పత్తి చెయ్యాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం నాలుగు స్టీల్ ప్లాంట్లను కొత్తగా ప్రారంభించేందుకు కేంద్ర మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తోందని వెల్లడించారు. ఒడిషా, కర్ణాటక, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో 5 నుంచి 6 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేసే ఈ ప్లాంట్లు రానున్నట్లు తెలిపారు. స్టీల్ ప్లాంట్ డైరెక్టరు డీఎన్‌రావు, మెటీరియల్స్ మేనేజ్మెంట్ ఈడీ డా.ఎస్‌ఎన్‌రావు, ఐఎన్ఎస్ డీఎజీ డైరెక్టర్ జనరల్ సుషిమ్ బెనర్జీ, సీఎస్ఐఆర్ డైరెక్టర్ మురళీధరన్, స్టీల్ అండ్ మెటలర్జీ ఎడిటర్ నిర్మల్య ముఖర్జీ, విశాఖ పోర్టు ట్రస్టు డిప్యూటీ ఛైర్మన్ పీఎల్ హరనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
టంగ్స్టన్ వేటలో ఎన్ఎండీసీ
హైదరాబాద్: మైనింగ్ రంగ దిగ్గజం ఎన్ఎండీసీ ఖరీదైన టంగ్స్టన్ ఖనిజం వేటలో పడింది. వియత్నాంలోని నూయి ఫావో పాలీమెటాలిక్ మైన్‌లో వాటా కొనుగోలు ప్రయత్నాల్లో ఉంది. గని యజమాని మసన్ రిసోర్సెస్ అనే కంపెనీతో ఈ మేరకు ఎన్ఎండీసీ చర్చలు జరుపుతోంది. గనిలో సుమారు 6.6 కోట్ల టన్నుల టంగ్స్టన్ ముడి ఖనిజం నిల్వలున్నట్టు అంచనా. మసన్ రిసోర్సెస్ 2015 వార్షిక నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా టంగ్స్టన్ను ఉత్పత్తి చేస్తు న్న సంస్థగా ఈ కంపెనీ నిలిచింది. ప్రపంచ అవసరాల్లో 30% సరఫరా చేస్తోంది. ఈ ఖనిజం కోసం భారత్ ప్రస్తుతం అత్యధికంగా దిగుమతులపైనే ఆధారపడి ఉంది. ఎన్ఎండీసీ నుంచి టంగ్స్టన్ కొనుగోలుకు భారత రక్షణ శాఖ సంసిద్ధత వ్యక్తం చేసింది కూడా. -
కర్ణాటక గనుల వేలంకు స్పందన కరువు
న్యూఢిల్లీ: కర్ణాటకలోని ఇనుప ఖనిజ గనుల ఈ–వేలం పాటకు ప్రైవేటు సంస్థల నుంచి ఆశించినంత స్పందన రాకపోవడంతో మిగిలిపోయిన గనుల్ని కలిపి వేలం పాట వేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీంతోపాటు ఈ అంశానికి సంబంధించి త్వరలో సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. ఈ వేలం పాట రెండవ దశలో మొత్తం 14 మైనింగ్ గనులకు గాను ఎన్ఎండీసీ, జిందాల్, వేదాంత సంస్థలతో మరికొన్ని సంస్థలు ఏడు మైనింగ్ గనులను దక్కించుకోగా ఏడు మైనింగ్ గనులు మిగిలిపోయాయి. అయితే ఆ మైనింగ్ గనుల్లో తగినంత ఇనుప ఖనిజం నిల్వలు లేకపోవడంతోపాటు తక్కువ నాణ్యత కారణంగానే ఏ సంస్థలు వాటిపట్ల ఆసక్తి చూపించలేదని ఓ ప్రభుత్వాధికారి వెల్లడించారు. దీనికి పరిష్కారంగా కర్ణాటక ప్రభుత్వం ఈ ప్రైవేటు కంపెనీలకు అనుగుణంగా ఈ ఏడు మైనింగ్ గనుల్ని కలిపి మొత్తం 14 మైనింగ్ గనులకు ఒకేసారి వేలం పాట వేసేందుకు సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఇదే సమయంలో ఈ అంశానికి సంబంధించి కేంద్ర మైనింగ్ మంత్రిత్వశాఖతో చర్చలు జరిపినట్లు వెల్లడించారు. -
వాహనాలు తగలబెట్టిన మావోయిస్టులు
ఛత్తీస్‌గఢ్: ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. బచేలి సమీపంలో 20 వాహనాలను మావోయిస్టులు తగులబెట్టారు. బుధవారం రాత్రి మావోయిస్టులు జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్ఎండీసీ) కి చెందిన వాహనాలకు నిప్పు పెట్టారు. అయితే బుధవారం తెల్లవారుజామున భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య ఇదే ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మావోయిస్టులు ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని భద్రత బలగాలకు చెందిన ఉన్నతాధికారి ఒకరి వెల్లడించారు. -
అరుదైన ఖనిజాల వేటలో ఎన్ఎండీసీ..
♦ బీచ్‌శాండ్, భూగర్భ ఖనిజాలపై దృష్టి ♦ దేశంలో బంగారం శుద్ధి కర్మాగారం ♦ ఆటమిక్ డెరైక్టరేట్‌తో సంప్రదింపులు హైదరాబాద్: మైనింగ్ రంగ దిగ్గజం ఎన్ఎండీసీ అరుదైన భూగర్భ ఖనిజాలతో పాటు బీచ్ శాండ్ మైనింగ్‌లోకి కూడా ప్రవేశించనుంది. ఈ భూగర్భ ఖనిజాలు కొన్నింట్లో రేడియోధార్మికత వెలువడే అవకాశం ఉన్నందున ఈ మేరకు అనుమతులకై ఆటమిక్ మినరల్ డెరైక్టరేట్‌ను (ఏఎండీ) సంప్రదించే పనిలో ఉంది. ఇప్పటి వరకు ఎన్ఎండీసీ ఇనుప ఖనిజంతోపాటు కొంతమేర వజ్రాల అన్వేషణలో మాత్రమే నిమగ్నమైంది. ఇక నుంచి అరుదైన ఖనిజాలు, బంగారంతోపాటు బీచ్ శాండ్ తవ్వకాలపైనా దృష్టిసారించనున్నట్టు సంస్థ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. టాంజానియాలో సంస్థకు ఇప్పటికే బంగారు గని ఉంది. దీంతో అక్కడ పైలట్ ప్రాతిపదికన బంగారం శుద్ధి చేసే కేంద్రాన్ని నెలకొల్పాలని ఎన్ఎండీసీ యోచిస్తోంది. ఈ ప్లాంటు ఏర్పాటు పనులను ఒక ఏజెన్సీకి అప్పగించే ఉద్దేశంతో అంతర్జాతీయ స్థాయి సంస్థలను ఈ ఏడాదే ఆహ్వానించనున్నారు కూడా. ఐదారు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని, టెండరు ప్రక్రియ పూర్తయిన తరవాత 12-18 నెలల్లో ప్లాంటులో కార్యకలాపాలు ప్రారంభమవుతాయని సదరు అధికారి వెల్లడించారు. స్టీలు ప్లాంటులో వాటా విక్రయం.. అనుబంధ కంపెనీ అయిన జార్ఖండ్ కొల్హన్ స్టీల్‌లో వాటాను ఎస్పీవీ ద్వారా విక్రయించాలని సంస్థ భావిస్తోంది. స్టీలు ప్లాంటును ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే కంపెనీకి ఈ వాటాను అమ్మాలని ఎన్ఎండీసీ నిర్ణయించింది. ఇనుప ఖనిజం సరఫరా, గనుల నిర్వహణకు ఎన్ఎండీసీ పరిమితం కానుంది. జార్ఖండ్ ప్రభుత్వం స్థలాన్ని సమకూరుస్తుందని, అనుమతులను తాము సంపాదిస్తామని మైనింగ్ దిగ్గజం వెల్లడించింది. ఈ స్టీలు ప్లాంటుకు తాము ఎటువంటి మొత్తాన్ని పెట్టుబడి చేసే ఉద్ధేశం లేదని సంస్థ ఉన్నతాధికారి స్పష్టం చేశారు. -
చంద్రబాబు సర్కార్‌పై ప్రధానికి ఫిర్యాదు!
సాక్షి, హైదరాబాద్: విశాఖలో రూ.100 కోట్ల విలువైన జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్ఎండీసీ) భూమిని నామమాత్రపు ధరకే ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం రంగం సిద్ధం చేయడాన్ని కేంద్ర గనులు, ఉక్కు శాఖ తీవ్రంగా పరిగణించింది. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేయాలని ఆ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ నిర్ణయించారు. మొత్తం వ్యవహారంపై తక్షణమే తనకు సమగ్ర నివేదిక ఇవ్వాలని మంత్రి ఆదేశించినట్లు ఎన్ఎండీసీ అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి. విశాఖపట్నం పట్టణాభివృద్ధి సంస్థ (వుడా) 1991లో నిర్వహించిన వేలంలో బీచ్ రోడ్డులోని డచ్ హౌస్ లే అవుట్లో 2,419 చదరపు గజాల భూమి ని ఎన్ఎండీసీ కొనుగోలు చేసింది. ఆ స్థలం లో తమ ప్రాంతీయ కార్యాలయం నిర్మాణానికి అనుమతివ్వాలంటూ ఫిబ్రవరి 7, 2013న వుడాకు దరఖాస్తు చేసుకుంది. ఒత్తిళ్ల నేపథ్యంలో.. సదరు భూమిని వెనక్కి తీసుకుంటూ వుడా ఈనెల 6న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఎన్ఎండీసీ హైకోర్టును ఆశ్రయించింది. వుడా నిర్ణయాన్ని తప్పుబట్టిన హైకోర్టు.. తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆస్తులకే రక్షణ లేకపోతే ఇక సామాన్యుల ఆస్తులకేం రక్షణ ఉంటుందని ప్రశ్నించింది. ఆ ఉత్తర్వులను రద్దు చేస్తూ బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయంతో పాటు మొత్తం వ్యవహారాన్ని ఎన్ఎండీసీ చైర్పర్సన్ భారతి.ఎస్.సిహాగ్ గురువారం మంత్రి తోమర్‌కు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన తోమర్ దీనిపై ప్రధానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్లు ఎన్ఎండీసీ అధికారవర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. దీంతో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. ఎన్ఎండీసీ భూమిని వెనక్కి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసిన వుడా వైస్ చైర్మన్ బాబూరావు నాయుడుపై వేటు వేసి.. వివాదం నుంచి గట్టెక్కేందుకు ప్రభుత్వం ‘మాస్టర్’ప్లాన్ వేసినట్లు తెలిసింది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వలవన్‌కు ఆదే శాలు జారీ చేసినట్లు ఆ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. -
ఎన్ఎండీసీ, ఎంఓఐఎల్ షేర్ల బై బ్యాక్
త్వరలో నోటిఫికేషన్ విలువ రూ.10,000 కోట్లు న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ మైనింగ్ దిగ్గజ కంపెనీలు ఎన్ఎండీసీ, ఎంఓఐఎల్‌లు 25 శాతం వాటా షేర్లను బై బ్యాక్ చేయనున్నాయి. ఈ రెండు సంస్థలు కలసి రూ.10,000 కోట్ల విలువైన షేర్లను బై బ్యాక్ చేస్తాయని అంచనాలున్నాయి. ఈ రెండు కంపెనీల్లో ప్రభుత్వ వాటా 80 శాతంగా ఉండటంతో ఈ బై బ్యాక్ కారణంగా ప్రభుత్వ ఖజానాకు రూ.6,500 కోట్లు సమకూరుతాయని అంచనా. ఎన్ఎండీసీ, ఎంఓఐఎల్ కంపెనీలు ఆయా కంపెనీల పెయిడప్ క్యాపిటల్(చెల్లించిన మూలధనం)లో 25 శాతం షేర్లను బై బ్యాక్ చేస్తాయని, దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే విడుదలవుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ వాటాల విక్రయం ద్వారా రూ.56,500 కోట్లు సమీకరించాలని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్(దీపం-గతంలో డిజిన్వెస్ట్మెంట విభాగం) లక్ష్యంగా పెట్టుకుంది. కాగా బై బ్యాక్ వార్తల నేపథ్యంలో ఎన్ఎండీసీ షేర్ 1.6 శాతం లాభపడి రూ.92 వద్ద, ఎంఓఐఎల్ షేర్ 1.4 శాతం లాభపడి రూ.243 వద్ద ముగిశాయి. -
ఎన్ఎండీసీ లాభం 59% డౌన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమ్మకాల క్షీణత కారణంగా గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ మైనింగ్ దిగ్గజం ఎన్ఎండీసీ నికర లాభం దాదాపు 59 శాతం తగ్గుదలతో రూ. 553 కోట్లకు (స్టాండెలోన్) పరిమితమైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో కంపెనీ లాభం రూ. 1,347 కోట్లు. తాజాగా నాలుగో త్రైమాసికంలో ఆదాయం సుమారు 46 శాతం క్షీణించి రూ. 2,827 కోట్ల నుంచి రూ. 1,530 కోట్లకు తగ్గింది. ఈ వ్యవధిలో మొత్తం వ్యయాలు రూ. 1,435 కోట్ల నుంచి రూ. 1,054 కోట్లకు తగ్గినట్లు కంపెనీ పేర్కొంది. మరోవైపు, పూర్తి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయం రూ. 12,356 కోట్ల నుంచి రూ. 6,456 కోట్లకు తగ్గగా, లాభం సైతం రూ. 6,422 కోట్ల నుంచి రూ. 3,028 కోట్లకు క్షీణించింది. మరోవైపు, ముడి ఇనుము అమ్మకాలు, సరఫరా కోసం మరో ప్రభుత్వ రంగ ఉక్కు దిగ్గజం సెయిల్‌తో కలిసి జాయింట్ వెంచర్ సంస్థను ఏర్పాటు చేసినట్లు ఎన్ఎండీసీ వెల్లడించింది. ఇందులో ఎన్ఎండీసీకి 51%, సెయిల్‌కు 49% వాటాలు ఉంటాయి. శుక్రవారం బీఎస్ఈలో కంపెనీ షేరు 1.2% పెరిగి రూ. 92.50 వద్ద ముగిసింది. సువెన్ లైఫ్ లాభం రూ. 33 కోట్లు బయోఫార్మా సంస్థ సువెన్ లైఫ్ నికర లాభం క్యూ4లో సుమారు 88 శాతం వృద్ధితో రూ. 17 కోట్ల నుంచి రూ. 32 కోట్లకు పెరిగింది. ఆదాయం రూ.111 కోట్ల నుంచి రూ. 169 కోట్లకు చేరినట్లు సంస్థ పేర్కొంది. మరోవైపు పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఆదాయం సుమారు 4 శాతం తగ్గి రూ. 520 కోట్ల నుంచి రూ. 500 కోట్లకు పరిమితమైంది. లాభం 13 శాతం క్షీణతతో రూ. 109 కోట్ల నుంచి రూ. 95 కోట్లకు తగ్గింది. పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై రూ. 63 కోట్లు వెచ్చించినట్లు సంస్థ వివరించింది. -
ఖనిజాన్వేషణకు శాటిలైట్ రిమోట్ సెన్సింగ్: ఎన్ఎండీసీ
ఎన్ఆర్ఎస్సీతో ఒప్పందం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఖనిజాన్వేషణ ప్రక్రియలో ఎన్ఎండీసీ ముందడుగు వేసింది. ఇక నుంచి శాటిలైట్ రిమోట్ సెన్సింగ్ విధానాన్ని ఉపయోగించనుంది. ఖనిజ నిల్వలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవడమేగాక ప్రవేశయోగ్యం కాని ప్రాంతాల్లోనూ వీటి అన్వేషణకు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌తో (ఎన్ఆర్ఎస్సీ) ఎన్ఎండీసీ గురువారం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. శాటిలైట్ ఇచ్చే సమాచారాన్ని విశ్లేషించేందుకు హైదరాబాద్‌లోని ఎన్ఎండీసీ కేంద్ర కార్యాలయంలో రిమోట్ సెన్సింగ్, జీఐఎస్ ల్యాబొరేటరీని ఏర్పాటు చేస్తారు. తవ్వకాల వల్ల పర్యావరణ ప్రభావాన్ని ఎన్ఆర్ఎస్సీ మార్గదర్శకత్వంలో ఎన్ఎండీసీ అంచనా వేస్తుంది. ఉక్కు మంత్రిత్వ శాఖ పరిధిలో శాటిలైట్ ఆధారిత జియోలాజికల్ మ్యాపింగ్ విధానాన్ని వినియోగించనున్న తొలి కంపెనీగా ఎన్ఎండీసీ స్థానం సంపాదించింది. -
ఎన్ఎండీసీ వాటా విక్రయానికి మర్చంట్ బ్యాంకర్లు
న్యూఢిల్లీ: ఎన్ఎండీసీ వాటా విక్రయానికి మర్చంట్ బ్యాంకర్లుగా వ్యవహరించడానికి ఆర్థిక సంస్థల నుంచి బిడ్లను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఆహ్వానించింది. ఎన్ఎండీసీలో 10 శాతం వాటా విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ.3,900 కోట్లు వస్తాయని అంచనా. ఈ 10 శాతం వాటాను ఆఫర్ ఫర్ సేల్ విధానంలో విక్రయించనున్నారు. ఈ వాటా విక్రయం కోసం మర్చంట్ బ్యాంకర్లుగా వ్యవహరించడానికి నాలుగు సంస్థలను ప్రభుత్వం ఎంపిక చేయనున్నది. ఆర్థిక సంస్థలు వచ్చే నెల 16లోగా తమ బిడ్లను సమర్పించాలని దీపం పేర్కొంది. -
రికార్డు స్థాయిలో ఇన్ కమ్ టాక్స్
ఈ ఏడాది టార్గెట్ కి మించి ఆదాయ పన్ను వసూలు చేశామని ప్రిన్సిపల్ చీఫ్ ఇన్ కమ్ టాక్స్ ఆఫీసర్ సురేశ్ బాబు తెలిపారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం రూ.36 వేల 663 కోట్ల పన్ను వసూలు చేశామని వివరించారు. గత ఏడాదితో పోలిస్తే ఇది 15.4 శాతం ఎక్కువ అని అన్నారు. దేశంలోనే తమిళ నాడు తర్వాత తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో అత్యధికంగా పన్ను వసూలైందని తెలియజేశారు. ఈఏడాది అత్యధికంగా NMDC రూ1600 కోట్లు ఆదాయ పన్ను చెల్లించిందని వివరించారు. తర్వాతి స్థానంలో రూ. 833 కోట్లతో సింగరేణి, రూ.469 కోట్లతో అరబిందో ఫార్మా ఉన్నాయి. మాటీవీ రూ. 480 కోట్లు చెల్లించిందని, డాక్టర్ రెడ్డీ ల్యాబ్స్ రూ.400 కోట్లు ఇన్ కం టాక్స్ కట్టిందని సురేశ్ బాబు తెలియజేశారు. కాగా.. పన్ను ఎగవేత దార్ల పేర్లు త్వరలోనే వెబ్ సైట్ లో పెడతామని చెప్పారు. టాక్స్ ఎగవేత దారులపై 36 రకాల కేసులు నమోదు చేయనున్నట్లు వివరించారు. అప్పుడు అకౌంట్లు చూపి 10 వేల మంది పైనా కేసులు నమోదు చేయనున్నారు. -
ఎన్ఎండీసీకి ఇండియా ప్రైడ్ అవార్డు
న్యూఢిల్లీలో ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర టెలికం, ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ చేతుల మీదుగా ‘మెటల్స్, మినరల్స్, ట్రేడ్ (మైనింగ్ సహా)’ విభాగానికి గానూ ఇండియా ప్రైడ్ అవార్డును అందుకుంటున్న ఎన్ఎండీసీ డెరైక్టర్ (టెక్నికల్) ఎన్.కె. నందా. -
సిహగ్కు ఎన్ఎండీసీ
♦ సీఎండీగా అదనపు బాధ్యతలు న్యూఢిల్లీ: ఉక్కు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శిగా, ఆర్థిక సలహాదారుగా వ్యవహ రిస్తున్న భారతీ ఎస్. సిహగ్ తాజాగా ప్రభుత్వ రంగ అతిపెద్ద ఐరన్ ఓర్ కంపెనీ ఎన్ఎండీసీ సీఎండీ (చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్)గా అదనపు బాధ్యతలు చేపట్టారు. ఈ విషయాన్ని ఎన్ఎండీసీ బీఎస్ఈకి నివేదిస్తూ వెల్లడిం చింది. భారతీ సిహగ్ ఈ పదవిలో మూడు నెలలపాటు లేదా కొత్తవారిని నియమించే వరకు లేదా ప్రభుత్వపు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు (వీటిల్లో ఏది ముందైతే అది) కొనసాగుతారని ఎన్ఎండీసీ పేర్కొంది. ఇది వరకు ఎన్ఎండీసీ చైర్మన్‌గా వ్యవహరించిన నరేంద్ర కొఠారి డిసెంబర్ 31న పదవీ విరమణ చేశారు. పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలెక్షన్ బోర్డు (పీఎస్ఈబీ) ఎన్ఎండీసీ చైర్మన్ పదవికి గోపాల్ సింగ్ పేరు సిఫార్సు చేసింది. కానీ దానిపై కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్ నియామకాల కమిటీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. గోపాల్ సింగ్ ప్రస్తుతం సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (సీసీఎల్)కు హెడ్‌గా వ్యవహరిస్తున్నారు. -
50 శాతంపైగా తగ్గిన ఎన్ఎండీసీ ముడి ఇనుము ధర
న్యూఢిల్లీ: మైనింగ్ రంగ దిగ్గజం ఎన్ఎండీసీ ముడి ఇనుము ధరను గణనీయంగా తగ్గిం చింది. జనవరిలో రూ.3,060 ఉన్న టన్ను ఫైన్స్ రకం ధర కాస్తా ఇప్పుడు రూ.1,460కి వచ్చి చేరింది. సెప్టెంబర్‌లో ఈ ధర రూ. 1,660 ఉంది. హయ్యర్ గ్రేడ్ ముడి ఇనుము ధర 41 శాతం తగ్గి రూ.2,500గా ఉంది. డిమాండ్ పడిపోయిన నేపథ్యంలో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. క్రితం ఏడాదితో పోలిస్తే ఏప్రిల్-ఆగస్టులో ఎన్ఎండీసీ అమ్మకాలు 17 శాతం తగ్గి 11.27 మిలియన్ టన్నులు నమోదైంది. ఉత్పత్తి 12.10 నుంచి 10.52 మిలియన్ టన్నులకు చేరింది. -
ఖనిజ వనరుల పర్యవేక్షణకు స్పేస్ టెక్నాలజీ
ఎన్ఎండీసీలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న ఖనిజ వనరులను స్పేస్ టెక్నాలజీ ద్వారా పర్యవేక్షించేందుకు నగరంలో ఉన్న జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్ఎండీసీ) ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఈమేరకు రాష్ట్ర ప్రణాళిక విభాగం ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర రిమోట్ సెన్సింగ్ కేంద్రం డెరైక్టర్ జనరల్ బీపీ ఆచార్య ఢిల్లీలో చెప్పారు. సోమవారం ఢిల్లీలోని విజ్ఞానకేంద్రంలో ‘పరిపాలనలో స్పేస్ టెక్నాలజీ విధానాన్ని ప్రోత్సహించడం’పై జరిగిన జాతీయ సదస్సు లో ఆయన మాట్లాడారు. మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్లను రిమోట్ సెన్సింగ్‌ల ద్వారా పర్యవేక్షిస్తున్నామని ఇస్రో చైర్మన్, స్పేస్ విభాగం కార్యదర్శికి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్, కేంద్ర కార్యదర్శులు, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు పాల్గొన్నట్లు సమాచార, ప్రజాసంబంధాల శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. -
ఎన్ఎండీసీపై ధరల తగ్గుదల ప్రభావం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ ఎన్ఎండీసీ తొలి త్రైమాసిక నికర లాభం 47 శాతం క్షీణించింది. అంతకుముందు ఏడాది రూ. 1,915 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఏడాది రూ. 1,010 కోట్లకు పడిపోయింది. ఇదే సమయంలో ఆదాయం రూ. 48 శాతం క్షీణించి రూ. 3,476 కోట్ల నుంచి రూ. 1,806 కోట్లకు తగ్గింది. అంతర్జాతీయంగా ముడి ఇనుము ధరలు తగ్గడం ఫలితాలపై ప్రతికూల ప్రభావం చూపినట్లు కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. -
రెచ్చిపోయిన మావోయిస్టులు
ఛత్తీస్‌గఢ్: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. దంతెవాడ జిల్లా బచేలీ వద్ద ఎన్ఎండీసీ గనులపై మావోయిస్టులు మెరుపు దాడికి పాల్పడ్డారు. గత రాత్రి 11 గంటల సమయంలో దాదాపు 40 మంది మావోయిస్టులు ఎన్ఎండీసీ గనులపై దాడి చేశారు. ఎన్ఎండీసీ డ్రిల్ మిషన్, ఇతర సామాగ్రిని తగులబెట్టారు. ఈ దాడిలో సుమారు 50 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. మరవైపు... మావోయిస్టులపై సీఐఎస్ఎఫ్ బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఇరు వర్గాలు మధ్య దాదాపు 3 గంటల పాటు కాల్పులు కొనసాగినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రష్యా పొటాష్ కంపెనీపై ఎన్ఎండీసీ కన్ను..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయంగా అన్ని కమోడిటీ ధరలు తక్కువ స్థాయిలో ఉండటంతో కొత్త పెట్టుబడులకు ఇది సరైన తరుణంగా ఎన్ఎండీసీ భావిస్తోంది. ఇందుకోసం దేశ విదేశాల్లో భారీగా విస్తరణ కార్యక్రమాలను చేపట్టాలని భావిస్తోంది. ఇప్పటి వరకు ముడి ఇనుము ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న ఎన్ఎండీసీ ఇప్పుడు అంతర్జాతీయంగా ఫాస్పేట్, పొటాష్, కోకింగ్ కోల్, వజ్రాల గనులపై దృష్టిసారిస్తోంది. ఇందులో భాగంగా రష్యాకు చెందిన పొటాష్ తయారీ కంపెనీని కొనుగోలు చేయడంపై దృష్టిసారించినట్లు ఎన్ఎండీసీ చైర్మన్ నరేంద్ర కొఠారి తెలిపారు. దీనికి సంబంధించి కంపెనీ మదింపు ప్రక్రియ కొనసాగుతోందని, ఈ ఆర్థిక సంవత్సరంలోగా ఈ కంపెనీ టేకోవర్ పూర్తవుంతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆర్థిక ఫలితాలను వెల్లడించడానికి గురువారం సంస్థ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భారీ విస్తరణ కార్యక్రమాలను ప్రకటించారు. అంతర్జాతీయంగా అన్ని కమోడిటీస్ ధరలు తక్కువగా ఉండటంతో కొత్త రంగాలకు విస్తరించడానికి ఇది సరైన తరుణంగా భావిస్తున్నామని, ఇందుకోసం ఎన్ఎండీసీ వద్దనున్న సుమారు రూ. 20,000 కోట్ల నగదు నిల్వలను వినియోగించనున్నట్లు తెలిపారు. ఆస్ట్రేలియా, ఆఫ్రికాలోని బొగ్గు గనులతో పాటు, బంగారం, వజ్రాల గనులపై దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. గతేడాది దేశీయంగా విస్తరణ కార్యక్రమాల కోసం రూ. 3,136 కోట్లు వ్యయం చేయగా, ఈ ఏడాది రూ. 3,500 కోట్లు వ్యయం చేయనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఎస్పీవో మోడల్లో ఉక్కు కర్మాగారాలను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు తెలిపారు. కర్ణాటకలో ఏర్పాటు చేస్తున్న ఏడు మిలియన్ టన్నుల ఉక్కు కర్మాగారం ఈ డిసెంబర్ నాటికి అందుబాటులోకి వస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. 100 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యం 2024-25 నాటికి 100 మిలియన్ టన్నుల ముడి ఇనుమును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కొఠారి తెలిపారు. ప్రస్తుతం ఉత్పత్తి సామర్థ్యం 30.44 మిలియన్ టన్నులుగా ఉందని, అది ఈ ఏడాది 35 మిలియన్ టన్నులకు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. తగ్గిన లాభం: మార్చితో ముగిసిన నాల్గవ త్రైమాసిక నికర లాభంలో 31 శాతం క్షీణత నమోదయ్యింది. అంతకుముందు ఏడాది ఇదే కాలానికి రూ. 1,962 కోట్లుగా ఉన్న నికర లాభం ఇప్పుడు రూ. 1,347 కోట్లకు తగ్గింది. అంతర్జాతీయంగా ముడి ఇనుము ధరలు తగ్గడం, హుద్‌హుద్ తుఫాన్ వల్ల ముడి ఇనుము సరఫరా నిలిచిపోవడం లాభాలు తగ్గడానికి కారణంగా పేర్కొన్నారు. సమీక్షా కాలంలో ఆదాయం రూ.3,884 కోట్ల నుంచి రూ. 2,829 కోట్లకు తగ్గింది. పూర్తి ఏడాదికి రూ. 12,356 కోట్ల ఆదాయంపై రూ. 6,422 కోట్ల రికార్డు లాభాన్ని నమోదు చేసింది. వాటాదారులకు రూ. 1.30 తుది డివిడెండ్‌ను బోర్డు ప్రతిపాదించింది. దీంతో ఏడాది మొత్తం మీద షేరుకు రూ.7.25 డివిడెండ్‌ను ఎన్ఎండీసీ అందించింది. -
డీఅండ్‌బీ టాప్500లో 21 తెలుగు కంపెనీలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ విడుదల చేసిన ‘ఇండియా టాప్ 500 కంపెనీస్- 2015’ నివేదికలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 21 కంపెనీలకు చోటు లభించింది. ఇందులో ప్రభుత్వరంగ ఎన్ఎండీసీ 24వ స్థానం సంపాదించగా, డాక్టర్ రెడ్డీస్ (31), దివీస్ ల్యాబ్ (67), అపోలో హాస్పిటల్స్ (79), అమరరాజ బ్యాటరీస్ (129) టాప్-500 జాబితాలో ఉన్నాయి. ఇక మిగతా కంపెనీల విషయానికి వస్తే బిఎస్ లిమిటెడ్(209), సెయైంట్ (222), ఎన్సీసీ (259), ఆంధ్రాబ్యాంక్ (302), అరబిందో ఫార్మా (305), హెరిటేజ్ ఫుడ్స్ (316), హెచ్‌బీఎల్ పవర్ సిస్టమ్స్ (391). స్టీల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా (394), నవభారత్ వెం చర్స్ (404), అవంతి ఫీడ్స్ (417), రాంకీ ఇన్ఫ్రా (445), సంఘి ఇండస్ట్రీస్ (448), కావేరీ సీడ్స్ (480), గ్రాన్యూల్స్ (483), శ్రీకాళహస్తి పైప్స్ (485), ఎక్సల్ క్రాప్ కేర్ (493) ఉన్నాయి. 2014లో ఈ రెండు రాష్ట్రాల నుంచి 16 కంపెనీలకు మాత్రమే స్థానం లభించింది. ఈ టాప్ 500 కంపెనీల ఆదాయం జీడీపీలో 20 శాతానికి సమానమని, పన్నుల ఆదాయంలో మూడో వంతు ఈ కంపెనీల నుంచే వస్తున్నట్లు డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. -
ముడి ఇనుము రేట్లు తగ్గించిన ఎన్ఎండీసీ
న్యూఢిల్లీ: దేశీ ఉక్కు రంగం నుంచి ఒత్తిళ్ల నేపథ్యంలో ఎన్ఎండీసీ ముడి ఇనుము ధరలను 20% మేర తగ్గిస్తున్నట్లు శనివారం ప్రకటించింది. ఈ నెలలో మిగతా రోజులకు ఈ రేటు వర్తిస్తుందని తెలిపింది. అధిక గ్రేడ్ ఐరన్ ఓర్ ధరను (లంప్స్) టన్నుకు రూ. 200 మేర, ఫైన్స్ రేటును రూ. 500 మేర తగ్గించినట్లు పేర్కొంది. దీంతో లంప్స్ ధర రూ. 3,050 గాను, ఫైన్స్ రేటు రూ. 1,960గాను ఉంటుందని ఎన్ఎండీసీ వివరిం చింది. ఏప్రిల్ 18 నుంచి నెలాఖరు దాకా ఈ రేట్లు వర్తిస్తాయని తెలిపింది. -
ఎన్ఎండీసీ ప్రాజెక్టు జాతికి అంకితం
హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌లోని దక్షిణ బస్తర్ జిల్లా బైలదిల్లా 11బీ ప్రాజెక్ట్‌ను ఆదివారం జాతికి అంకితం చేస్తున్న నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్ఎండీసీ) సీఎండీ నరేంద్ర కొఠారి. ఈ కార్యక్రమంలో ఎన్ఎండీసీ డెరైక్టర్లు నరేంద్ర కె. నంద(టెక్నికల్), రబీంద్ర సింగ్(పర్సనల్), టీఆర్కే రావు(కమర్షియల్), పి.కె. శత్పధి(ప్రొడక్షన్), డీఎస్ అహ్లూవాలియా(ఫైనాన్స్), ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏడాదికి 7 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్ట్‌ను ఎన్ఎండీసీ రూ. 600 కోట్లతో అభివృద్ధి చేసింది. ఈ ప్రాజెక్ట్ కారణంగా బైలదిల్లా సెక్టర్లో ఎన్ఎండీసీ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 24 మిలియన్ టన్నుల నుంచి 32 మిలియన్ టన్నులకు పెరుగుతుందని అంచనా. -
ఉక్కు శాఖతో ఎన్ఎండీసీ అవగాహన
హైదరాబాద్: ఇనుప ఖనిజ సరఫరాకు సంబంధించి కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖతో హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరే షన్ ఒక అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. బుధవారంనాడిక్కడ ఎన్ఎండీసీ కార్యాలయంలో ఈ మేరకు ఒప్పంద పత్రాలను మార్పిడి చేసుకున్నారు. కేంద్ర ఉక్కు కార్యదర్శి రాకేష్ సింగ్, ఎన్ఎండీసీ సీఎండీ నరేంద్ర కొఠారిలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఉక్కు శాఖ సంయుక్త కార్యదర్శి సయిదైన్ అబ్బాసి, ఎన్ఎండీసీ డెరైక్టర్లు నరేంద్ర కె. నంద (టెక్నికల్), రబీంద్ర సింగ్ (పర్సనల్), డాక్టర్ టీఆర్కె రావు ( కమర్షియల్), పీకే సత్పతి (ప్రొడక్షన్), డీఎస్ అహ్లువాలియ (ఫైనాన్స్) తదితరులు పాల్గొన్నారు. -
ఎన్ఎండీసీ లాభం 1,593 కోట్లు
* క్యూ3 ఆదాయం రూ. 2,943 కోట్లు * హుద్‌హుద్ ప్రభావంతో 5 శాతం తగ్గిన అమ్మకాలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హుద్ హుద్ తుపాన్ ప్రభావం ప్రభుత్వరంగ ఎన్ఎండీసీ ఫలితాలపై కనిపించింది. మూడో త్రైమాసికంలో అమ్మకాలు తగ్గడంతో నికర లాభం స్వల్పంగా పెరిగింది. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో కంపెనీ నికర లాభం గతేడాదితో పోలిస్తే 1.6% వృద్ధితో రూ. 1,567 కోట్ల నుంచి రూ. 1,593 కోట్లకు చేరింది. సమీక్షా కాలంలో అమ్మకాలు 5 శాతం క్షీణించి 6.97 మిలియన్ టన్నులకు పరిమితమయ్యాయి. హుద్ హుద్ తుపాన్ వల్ల రైల్వే ట్రాకులు దెబ్బ తినడంతో కొద్దిరోజులు రవాణా జరగలేదని, అమ్మకాలు తగ్గడానికి ఇది కారణమని ఎన్ఎండీసీ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. కానీ ఇదే సమయంలో ముడి ఇనుము ఉత్పత్తి మాత్రం 11% వృద్ధితో 8.11 మిలియన్ టన్నులకు చేరింది. సమీక్షా కాలంలో ఆదాయం రూ. 2,823 కోట్ల నుంచి రూ. 2,946 కోట్లకు చేరింది. అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గడంతో ఈ నెల టన్ను ముడి ఇనుము ధర రూ. 450 వరకు తగ్గించామని, దీని ప్రభావం నాల్గవ త్రైమాసిక ఆదాయం, లాభాలపై కనిపిస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. రూ.4.25 మధ్యంతర డివిడెండ్ రూపాయి ముఖ విలువ కలిగిన షేరుకు రూ. 4.25 మధ్యంతర డివిడెండ్ ఎన్ఎండీసీ బోర్డు సిఫార్సు చేసింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ప్రకటించిన డివిడెండ్ విలువ రూ.7.25కి చేరింది. -
ప్రభుత్వానికి ఎన్ఎండీసీ రూ.952 కోట్ల డివిడెండ్
హైదరాబాద్: ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎండీసీ, కేంద్ర ప్రభుత్వానికి రూ.952 కోట్ల డివిడెండ్‌ను చెల్లించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి మధ్యంతర డివిడెండ్(300 శాతం)గా రూ.952 కోట్లు కేంద్రానికి చెల్లించామని ఎన్ఎండీసీ ఒక ప్రకటనలో తెలిపింది. కంపెనీ సీఎండీ నరేంద్ర కొఠారి ఈ రూ.952 కోట్ల చెక్కును కేంద్ర ఉక్కు శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌కు అందించారని పేర్కొంది. ఈ కార్యక్రమంలో ఉక్కు శాఖ సహాయ మంత్రి విష్ణు దియోసాయి, ఉక్కు కార్యదర్శి రాకేశ్ సింగ్‌లతో పాటు ఉక్కు మంత్రిత్వ శాఖ, ఎన్ఎండీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా తాము 2011-12 ఆర్థిక సంవత్సరంలో 450 శాతం, 2012-13 ఆర్థిక సంవత్సరంలో 700 శాతం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 850 శాతం డివిడెండ్‌ను చెల్లించామని పేర్కొంది. -
ఎన్ఎండీసీ ఇనుప ఖనిజం ధర పెంపు
టన్నుకు రూ. 300 అధికం విశాఖ ఉక్కుపై మరింత భారం విశాఖపట్నం: ప్రభుత్వరంగ సంస్థ ఎన్ఎండీసీ ఇనుప ఖనిజం ధరలను టన్నుకు రూ. 250 నుంచి 300 వరకు పెంచుతూ తీసుకున్న నిర్ణయంతో ఉక్కు సంస్థలకు షాక్ తగిలింది. ఈ నిర్ణయం సొంత గనులు లేని విశాఖ స్టీల్‌ప్లాంట్ వంటి ఉక్కు సంస్థలపై అధిక భారాన్ని కలిగించనున్నది. ఉక్కు ఉత్పత్తిలో అత్యధికంగా వినియోగించే లంప్ ఐరన్‌ఓర్‌పై రూ. 300, తక్కువ గ్రేడు ఫైన్ ఐరన్‌ఓర్‌పై రూ. 250 పెంచుతూ జూన్ మొదటి వారంలో సంస్థ నిర్ణయం తీసుకున్నది. పెంపు నిర్ణయం వల్ల ఇప్పటి వరకు ఉన్న టన్ను లంప్ ధర రూ. 4300 నుంచి రూ. 4600కు, ఫైన్ ధర రూ. 2910 నుంచి 3160 ధర పెరిగింది. ప్రతి నెలా ధరలను సమీక్షించే ఎన్ఎండీసీ ఫిబ్రవరిలో ఫైన్స్‌పై రూ. 100 పెంచింది. ఇటీవల ఒడిశాలో మైనింగ్‌పై తాత్కాలిక బ్యాన్‌ను అవకాశంగా తీసుకుని ఎన్ఎండీసీ ధర పెంచినట్టు మార్కెట్ వర్గాల సమాచారం. ఏప్రిల్ మొదట్లో అంతర్జాతీయ ఐరన్‌ఓర్ ధరలు 20 శాతం తగ్గడంతో దేశీయంగా ఉక్కు ధరలు తగ్గించాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఎన్ఎండీసీ ధరలు పెంచడంపై ఉక్కు పరిశ్రమ వర్గాలు విస్తుపోతున్నాయి. ఈ పరిణామంవల్ల సొంత గనులులేని విశాఖ స్టీల్, ప్రైవేటు సంస్థలైన ఎస్సార్, జేఎస్డబ్ల్యూలపై తీరని భారం పడనున్నది. విశాఖ స్టీల్‌ప్లాంట్ 6.3 మిలియన్ టన్నులకు ఉత్పత్తికి అవసరమయ్యే రెండింతల ఐరన్‌ఓర్ ధరకు సుమారు రూ. 380కోట్లు భారం పడనున్నదని ప్లాంటు వర్గాల సమాచారం. -
5 కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ ఎన్ఎండీసీ మార్చితో ముగిసిన నాల్గవ త్రైమాసిక నికర లాభంలో 34 శాతం వృద్ధిని నమోదు చేసింది. అంతకుముందు ఏడాది (2012-13) ఇదే కాలానికి రూ. 1,465 కోట్లుగా ఉన్న నికరలాభం ఇప్పుడు రూ.1,962 కోట్లకు చేరింది. ఇదే సమయంలో ఆదాయం 21 శాతం పెరిగి రూ.3,204 కోట్ల నుంచి రూ. 3,884 కోట్లకు చేరింది. పూర్తి ఆర్థిక సంవత్సరం మీద చూస్తే నికర లాభం రూ. 6,342 కోట్ల నుంచి రూ. 6,420 కోట్లకు పెరగ్గా, ఆదాయం రూ. 10,704 కోట్ల నుంచి రూ. 12,058 కోట్లకు చేరింది. ఏడాది మొత్తం మీద లాభాల్లో వృద్ధి శాతం తక్కువగా ఉండటానికి వేతన సవరణ, ఎగుమతులకు సంబంధించి వ్యయం కారణంగా ఎన్ఎండీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ నరేంద్ర కొఠారి పేర్కొన్నారు. ఆర్థిక ఫలితాలను వెల్లడించడానికి శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్ఎండీసీ తొలిసారిగా ముడి ఇనుము ఉత్పత్తి అమ్మకాల్లో 3 కోట్ల టన్నులు దాటినట్లు తెలిపారు. ఈ ఏడాది 3.1 కోట్ల టన్నుల ఉత్పత్తి, గతేడాది మిగులుతో కలిపి 3.2 కోట్ల టన్నుల అమ్మకాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కొఠారి తెలిపారు. ఇప్పుడిప్పుడే ఇనుముకు డిమాండ్ పెరుగుతోందని, ఏడాది మొత్తం మీద చూస్తే ధరలు పెరగడమే కాని తగ్గే అవకాశాలు తక్కువగా ఉన్నాయన్నారు. సొంత నిధులతోనే స్టీల్‌ప్లాంట్, క్యాప్టివ్ పవర్ ప్లాంట్లు... 2019-20 ఆర్థిక సంవత్సరం చివరినాటికి ముడి ఇనుము ఉత్పత్తి సామర్థ్యాన్ని 5 కోట్ల టన్నులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కొఠారి తెలిపారు. ఇందుకోసం సుమారు రూ.5,000 కోట్లు వ్యయం అవుతుందని అంచనా. ఈ ఏడాది స్టీల్ ప్లాంట్, గనుల విస్తరణ కోసం రూ.3,495 కోట్లు వ్యయం చేయనున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. గతేడాది కంపెనీ రూ. 2,518 కోట్లు విస్తరణ కోసం ఖర్చు చేసింది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న స్టీల్ ప్లాంట్, క్యాపిటివ్ విద్యుత్ ప్రాజెక్టులను సొంత నిధులతోనే ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకోసం కంపెనీ దగ్గర ఉన్న రూ.18,000 కోట్ల మిగులు నిధులను ఉపయోగించనున్నట్లు తెలిపారు. ఛత్తీస్‌గఢ్ నగర్నర్లో ఏర్పాటు చేస్తున్న స్టీల్ ప్లాంట్ 2016-17కి అందుబాటులోకి వస్తుందని అంచనా. విదేశీ విస్తరణపై దృష్టి విదేశాల్లో బొగ్గు, బంగారం, డైమండ్స్, ఫాస్పేట్ గనులపై దృష్టిసారిస్తున్నట్లు ఎన్ఎండీసీ ప్రకటించింది. ఇందుకోసం ఇండోనేషియాలో బొగ్గు గనులు, మొజాంబిక్, ఆస్ట్రేలియాలో ఇనుప ఖనిజాలు, రష్యాలో రాక్ ఫాస్పేట్ గనులపై మదింపు చేస్తున్నామని, వీటి పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని కొఠారి తెలిపారు. -
తరలిపోనున్న విశాఖ పెల్లెట్ ప్లాంట్?
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఎన్ఎండీసీ, ఆర్‌ఐఎన్‌ఎల్‌లు రూ.1,000 కోట్లతో విశాఖలో ఏర్పాటు చేయుదలచిన పెల్లెట్ ప్లాంటును ఛత్తీస్‌గఢ్‌కు వూర్చాల్సి రావచ్చని విశ్వసనీయు వర్గాలు వెల్లడించారుు. నలబై లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి సావుర్థ్యం కలిగిన పెల్లెట్ ప్లాంటుకు అవసరమైన వుుడిసరుకు (ఇనుప ఖనిజం) తవు రాష్ట్రంలోనే ఉత్పత్తి అవుతుందనీ, కనుక ఈ ప్లాంటును తవు రాష్ట్రానికి తరలించాలనీ ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం పట్టుబడుతోంది. ఛత్తీస్‌గఢ్‌లోని జగ్దల్పూర్ నుంచి విశాఖకు ఇనుప ఖనిజాన్ని తరలించడానికి పైప్‌లైన్ ఏర్పాటు చేసేందుకు ఎన్ఎండీసీ, ఆర్‌ఐఎన్‌ఎల్‌లు 2012లో ఒప్పం దం కుదుర్చుకున్నారుు. ప్లాంటు, పైప్లైన్ల నిర్మాణానికి రూ.2,200 కోట్ల పెట్టుబడి అవసరవుని అంచనా. పెల్లెట్ ప్లాంటు సావుర్థ్యాన్ని 60 లక్షల టన్నులకు పెంచాలని ప్రతిపాదించిన నేపథ్యంలో ఈ ప్లాంటులో పెట్టుబడి కూడా పెరగనుంది. అదేవిధంగా, పైప్‌లైన్ వార్షిక కెపాసిటీని కోటి టన్నుల నుంచి 1.30 కోట్ల టన్నులకు పెంచాలని నిర్ణరుుంచారు. ఇనుప ఖనిజం సేకరణకు సంబంధించి ఎన్ఎండీసీతో ఆర్ఐఎన్ఎల్కు దీర్ఘకాలిక ఒప్పందం ఉంది. బైలదిల్లా గనుల నుంచి ప్రధానంగా రైల్వేల ద్వారా ఇనుప ఖనిజాన్ని ఎన్ఎండీసీ సరఫరా చేస్తోంది. పైప్‌లైన్ ఏర్పాటుతో ఆర్ఐఎన్ఎల్కు రవాణా వ్యయుం తగ్గడంతోపాటు ఎన్ఎండీసీ అధికంగా ఖనిజాన్ని సరఫరా చేయుగలుగుతుంది. -
భారీ విస్తరణ దిశగా పీఎస్‌యూలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థలైన సెయిల్, ఎన్ఎండీసీ, ఆర్‌ఐఎన్‌ఎల్‌లు 2014-15లో భారీ స్థాయిలో ఆధునీకరణ, విస్తరణకు సన్నాహాలు చేస్తున్నాయి. ఇందుకు రూ.14,945 కోట్లు ఖర్చు చేయనున్నాయి. సెయిల్ రూ.9,000 కోట్లు, ఎన్ఎండీసీ రూ.4,345 కోట్లు, ఎన్ఐఎన్ఎల్ రూ.1,600 కోట్లు వెచ్చించనున్నాయి. ఆర్ఐఎన్ఎల్ తన ప్రణాళికలో భాగంగా విస్తరణ కొనసాగుతున్న వైజాగ్ ఫెసిలిటీకి రూ.400 కోట్లు కేటాయించనుంది. అలాగే బ్లాస్ట్ ఫర్నేస్, స్టీల్ మెల్టింగ్ షాప్, సింటర్ ప్లాంట్ల ఆధునీకరణకు రూ.400 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ 3 సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆధునీకరణ, విస్తరణకు రూ.15,820 కోట్లు వ్యయం చేయనున్నాయి. -
ఎన్ఎండీసీ విద్యుత్ ప్లాంటుకు అనుమతి వాయిదా
హైదరాబాద్: ప్రభుత్వ మైనింగ్ సంస్థ ఎన్ఎండీసీకి చెందిన ఎన్ఎండీసీ పవర్ ఉత్తరప్రదేశ్‌లో ఏర్పాటు చేయతలపెట్టిన విద్యుత్ ప్లాంటుకు అనుమతులు ఇప్పట్లో లభించేలా లేవు. ప్రతిపాదిత స్థలం సారవంతమైన వ్యవసాయ భూమి కావడంతో పర్యావరణ, అటవీ శాఖకు చెందిన నిపుణుల కమిటీ నిర్ణయాన్ని వాయిదా వేసింది. ప్రత్యామ్నాయ స్థలం ఎంపికకు ఎన్ఎండీసీకి చాలా సమయం తీసుకుంటుంది కాబట్టి ప్రతిపాదిత ప్రాజెక్టును పెండింగు జాబితా నుంచి తొలగించాలని మంత్రిత్వ శాఖకు సూచించింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ అనుబంధ కంపెనీ అయిన ఐఈడీసీఎల్‌తో కలసి ఎన్ఎండీసీ గోండా జిల్లాలో రూ.3 వేల కోట్లతో 500 మెగావాట్ల విద్యుత్ ప్లాంటును నెలకొల్పాలని భావించింది. గోండా వెలుపల అనుమతి ఇవ్వతగ్గ స్థలాన్ని చూసుకోవాల్సిందిగా ఎన్ఎండీసీకి కమిటీ స్పష్టం చేసింది. -
18% తగ్గిన ఎన్ఎండీసీ లాభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ ఎన్ఎండీసీ జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికానికి నికరలాభం 17.51 శాతం క్షీణించి రూ.1,572 కోట్లుగా నమోదయ్యింది. గత సంవత్సరం ఇదే కాలానికి కంపెనీ రూ.1,906 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా మంచి పనితీరు కనపర్చినప్పటికీ ముడి ఇనుము ధరలు తగ్గడం వల్ల ఆ మేరకు లాభాలు తగ్గినట్లు ఎన్ఎండీసీ చైర్మన్ సి.ఎస్.వర్మ తెలిపారు. ఈ మూడు నెలల కాలంలో అమ్మకాలు స్వల్పంగా పెరిగి రూ.2,838 కోట్ల నుంచి రూ.2,869 కోట్లకు చేరినట్లు కంపెనీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న దేశీ ఉక్కు పరిశ్రమకు తోడ్పాటును అందించడంపైనే అధికంగా దృష్టిసారిస్తున్నట్లు వర్మ తెలిపారు. సెవర్‌స్టల్ ఔట్!: ఛత్తీస్‌గఢ్‌లోని 3 మిలియన్ టన్నుల సామర్థ్యం గల ఉక్కు ఫ్యాక్టరీని సొంతంగానే చేపడుతున్నామని, ఈ ప్రాజెక్టు నుంచి రష్యా కంపెనీ సెవర్‌స్టల్ వైదొలిగినట్లేనని వర్మ ప్రకటించారు. ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించి 2010లో ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరినప్పటికీ సెవర్‌స్టల్ అంతగా ఆసక్తి చూపించడం లేదని, దీంతో ప్రస్తుతానికి సొంతంగానే ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టులో సెవర్స్టల్కి ఎన్ఎండీసీ మెజార్టీ వాటా ఇవ్వనందుకే వెనకడుగువేసినట్లు తెలుస్తోంది. అయితే, ప్రస్తుతం ఇండియాలో అనిశ్చితిని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్ట్‌ను ఆపేసినట్లు సెవర్‌స్టల్ ప్రతినిధులు పేర్కొన్నారు.