
ఉత్పత్తి లక్ష్యాన్ని కుదించిన ఎన్‌ఎండీసీ
హైదరాబాద్: మైనింగ్ రంగ దిగ్గజం ఎన్‌ఎండీసీ వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని కుదించింది. 2018–19 నాటికి 50 మిలియన్ టన్నులకు, 2021–22 నాటికి 67 మిలియన్ టన్నులకు సవరించింది. 2015లో ఎన్‌ఎండీసీ రచించుకున్న విజన్ 2025 ప్రణాళిక ప్రకారం వార్షిక ఉత్పత్తి 2018–19 కల్లా 75 మిలియన్ టన్నులు, 2021–22 కల్లా 100 మిలియన్ టన్నులకు చేరుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా ముడి ఇనుముకు డిమాండ్‌తోపాటు ధరలూ పడిపోవడం, అలాగే నిల్వలు పేరుకుపోవడం సంస్థ తాజా నిర్ణయానికి కారణం. 2016–17లో కంపెనీ 34 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేసింది. ఇప్పటి వరకు ఇదే అత్యధికం.