న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఎన్‌ఎండీసీ, ఆర్‌ఐఎన్‌ఎల్‌లు రూ.1,000 కోట్లతో విశాఖలో ఏర్పాటు చేయుదలచిన పెల్లెట్ ప్లాంటును ఛత్తీస్‌గఢ్‌కు వూర్చాల్సి రావచ్చని విశ్వసనీయు వర్గాలు వెల్లడించారుు. నలబై లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి సావుర్థ్యం కలిగిన పెల్లెట్ ప్లాంటుకు అవసరమైన వుుడిసరుకు (ఇనుప ఖనిజం) తవు రాష్ట్రంలోనే ఉత్పత్తి అవుతుందనీ, కనుక ఈ ప్లాంటును తవు రాష్ట్రానికి తరలించాలనీ ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం పట్టుబడుతోంది. ఛత్తీస్‌గఢ్‌లోని జగ్‌దల్‌పూర్ నుంచి విశాఖకు ఇనుప ఖనిజాన్ని తరలించడానికి పైప్‌లైన్ ఏర్పాటు చేసేందుకు ఎన్‌ఎండీసీ, ఆర్‌ఐఎన్‌ఎల్‌లు 2012లో ఒప్పం దం కుదుర్చుకున్నారుు.
ప్లాంటు, పైప్‌లైన్‌ల నిర్మాణానికి రూ.2,200 కోట్ల పెట్టుబడి అవసరవుని అంచనా. పెల్లెట్ ప్లాంటు సావుర్థ్యాన్ని 60 లక్షల టన్నులకు పెంచాలని ప్రతిపాదించిన నేపథ్యంలో ఈ ప్లాంటులో పెట్టుబడి కూడా పెరగనుంది. అదేవిధంగా, పైప్‌లైన్ వార్షిక కెపాసిటీని కోటి టన్నుల నుంచి 1.30 కోట్ల టన్నులకు పెంచాలని నిర్ణరుుంచారు. ఇనుప ఖనిజం సేకరణకు సంబంధించి ఎన్‌ఎండీసీతో ఆర్‌ఐఎన్‌ఎల్‌కు దీర్ఘకాలిక ఒప్పందం ఉంది. బైలదిల్లా గనుల నుంచి ప్రధానంగా రైల్వేల ద్వారా ఇనుప ఖనిజాన్ని ఎన్‌ఎండీసీ సరఫరా చేస్తోంది. పైప్‌లైన్ ఏర్పాటుతో ఆర్‌ఐఎన్‌ఎల్‌కు రవాణా వ్యయుం తగ్గడంతోపాటు ఎన్‌ఎండీసీ అధికంగా ఖనిజాన్ని సరఫరా చేయుగలుగుతుంది.
తరలిపోనున్న విశాఖ పెల్లెట్ ప్లాంట్?
Published Fri, Jan 10 2014 1:42 AM | Last Updated on Sat, Sep 2 2017 2:26 AM
Advertisement