ఛత్తీస్‌గఢ్: ఛత్తీస్‌గఢ్లోని దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. బచేలి సమీపంలో 20 వాహనాలను మావోయిస్టులు తగులబెట్టారు. బుధవారం రాత్రి మావోయిస్టులు జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎండీసీ) కి చెందిన వాహనాలకు నిప్పు పెట్టారు. అయితే బుధవారం తెల్లవారుజామున భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య ఇదే ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మావోయిస్టులు ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని భద్రత బలగాలకు చెందిన ఉన్నతాధికారి ఒకరి వెల్లడించారు.