RINL
-
వైజాగ్ స్టీల్‌కు రూ.1,650 కోట్లు.. ఎల్ అండ్ టీకి ప్రాజెక్ట్‌లు
నిర్వహణ, ఆర్థికపరమైన సవాళ్లతో సతమతమవుతున్న రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్‌కు (వైజాగ్ స్టీల్) రూ.1,650 కోట్లు సమకూర్చినట్లు కేంద్ర ఉక్కు శాఖ తెలిపింది. సంస్థ కార్యకలాపాలు యథావిధంగా కొనసాగేలా తోడ్పాటు అందించేందుకు వివిధ చర్యలు తీసుకుంటున్నట్లు వివరించింది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 19న రూ.500 కోట్లు ఈక్విటీ కింద, సెప్టెంబర్ 27న రూ.1,140 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ లోన్ కింద అందించినట్లు పేర్కొంది. సంస్థ సుస్థిరంగా నిలదొక్కుకోవడంపై ఎస్‌బీఐక్యాప్స్ ఒక నివేదికను రూపొందిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.ఇదీ చదవండి: పన్నుల ప్రణాళిక.. ఎగవేత మధ్య తేడా!ఎల్అండ్టీకి భారీ ప్రాజెక్టులుఅధిక వోల్టేజీ విద్యుత్ గ్రిడ్లను విస్తరించడం, బలోపేతం చేయడం కోసం మధ్యప్రాచ్య, ఆఫ్రికాలో ప్రధాన ప్రాజెక్టులను దక్కించుకున్నట్టు మౌలిక రంగ నిర్మాణ సంస్థ లార్సెన్ అండ్ టూబ్రో వెల్లడించింది. పవర్ ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ విభాగం ఈ ఆర్డర్లను పొందినట్లు కంపెనీ తెలిపింది. రూ.5,000 కోట్ల నుంచి రూ.10,000 కోట్ల శ్రేణిలో ఆర్డర్లు ప్రధానమైనవిగా కంపెనీ వర్గీకరించింది. కాగా, కెన్యా కోసం కొత్త నేషనల్ సిస్టమ్ కంట్రోల్ సెంటర్‌ను నిర్మిస్తారు. ప్రముఖ ఒరిజినల్ పరికరాల తయారీ కంపెనీ భాగస్వామ్యంలోని కన్సార్షియం ఈ ఆర్డర్‌ను అందుకుంది. మధ్యప్రాచ్యంలోని సౌదీ అరేబియాలో అధిక వోల్టేజ్ ట్రాన్స్మిషన్ లైన్ల టర్న్‌కీ నిర్మాణం చేపడతారు. ఖతార్‌లో కొనసాగుతున్న విద్యుత్ వ్యవస్థ విస్తరణ ప్రాజెక్ట్‌లో అదనపు గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్స్ ఏర్పాటు చేస్తారు. -
అప్పు చెల్లించని వైజాగ్ స్టీల్‌ప్లాంట్!
ప్రభుత్వ ఆధ్వర్యంలోని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (వైజాగ్ స్టీల్ ప్లాంట్) బ్యాంకులకు అప్పులు చెల్లించకుండా తీవ్ర ఆర్థిక ఒత్తిడికి గురవుతుంది. జూన్ 30న బ్యాంకులకు చెల్లించాల్సిన రూ.410 కోట్లను డిఫాల్ట్ చేసింది. ఇందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్‌లకు తీవ్రనష్టం వాటిల్లినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో సంస్థపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ వెంటనే చర్యలు తీసుకునేలా అప్పు ఇచ్చిన బ్యాంకులు ఇంటర్క్రెడిటర్ అగ్రిమెంట్(రుణ గ్రహీతలు డిఫాల్ట్ అయితే రిస్క్ తగ్గించే ఒప్పందం)పై సంతకాలు చేయాలని నిర్ణయించుకున్నాయి.వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌కు దాదాపు రూ.14,000 కోట్లు టర్మ్ లోన్లు ఉన్నాయి. రూ.15,000 కోట్లు షార్ట్ టర్మ్ లోన్లు, గ్యారెంటీలు, లెటర్ ఆఫ్ క్రెడిట్ వంటివి ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌కు రూ.5,000 కోట్ల కంటే ఎక్కువ టర్మ్ లోన్, రూ.4,000 కోట్ల షార్ట్ టర్మ్ లోన్, రూ.1,400 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ లోన్ అందించింది. కెనరా బ్యాంక్ రూ.3,800 కోట్ల రుణాలు, ఇండియన్ బ్యాంక్ రూ.1,400 కోట్ల టర్మ్ లోన్ ఇచ్చింది. అయితే ఇటీవల రుణదాతలకు చెల్లించాల్సిన రూ.410 కోట్లు డిఫాల్ట్ చేయడంతో బ్యాంకులు ఇంటర్ క్రెడిట్ అగ్రిమెంట్(ఐసీఏ)పై సంతకాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సంస్థ డిఫాల్ట్ అయిన నెలలోపు ఐసీఏపై సంతకం చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులను ఆదేశించింది. తద్వారా నష్టాల్లో ఉన్న కంపెనీని పునరుద్ధరించడానికి తక్షణ చర్య తీసుకోవచ్చు. అయితే 75% మంది రుణదాతలు నిబంధనలకు అంగీకరిస్తేనే ఈ చర్య అమలు అవుతుంది.సంస్థ ఇటీవల చేసిన డిఫాల్ట్ నగదు ఇంకా సాంకేతికంగా నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ (ఎన్పీఏ) అవ్వలేదు. కానీ, ముందుజాగ్రత్త చర్యగా కొంతమంది రుణదాతలు తాము ఇచ్చిన అప్పులకుగాను సంస్థలో 15 శాతం కేటాయింపులు పూర్తి చేశారు. డిఫాల్ట్ నిర్ణయం ప్రకటించిన 90 రోజుల తర్వాత లోన్ ఖాతా ఎన్పీఏగా మారుతుంది. ఆ సమయంలో బ్యాంకులు కనీసం 15 శాతం కేటాయింపులు కలిగి ఉండేలా జాగ్రత్తపడినట్లు తెలిసింది.ఇదీ చదవండి: ఈపీఎఫ్ఓ-టాటా మోటార్స్ వివాదం.. ఢిల్లీ హైకోర్టులో విచారణఈ వ్యవహారంపై సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు స్పందిస్తూ..‘వైజాగ్‌స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్నప్పటికీ సంస్థ రుణాలకు ప్రభుత్వ హామీ ఉండదు. సంస్థ ప్రస్తుతం కేవలం 30 శాతం సామర్థ్యంతో పని చేస్తోంది. దాంతో ఆర్థిక ఒత్తిడి పెరుగుతోంది. కంపెనీ కస్టమర్లు తమ చెల్లింపులు సరిగా చేయడంలేదు. దాంతో పరిస్థితి మరింత దిగజారుతోంది’ అని అన్నారు. ఇదిలాఉండగా, ఈ నెల ప్రారంభంలో ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను సందర్శించి, అన్ని విధాలుగా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. పూర్తి స్థాయిలో ఉత్పత్తి సాగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఇటీవల విడుదల చేసిన కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు రూ.620 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్‌తో పోలిస్తే రూ.63 కోట్లు కోతపెట్టింది. ఇప్పటికే ఈ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. సొంతంగా ఉక్కు గనులు కేటాయిస్తే కంపెనీ లాభాల్లోకి వెళ్తుందని అధికారులు, కార్మికులు చెబుతున్నారు. -
అసెట్ మానిటైజేషన్‌తో రూ. 4 వేల కోట్లు
కోల్‌కతా: రుణ భారం తగ్గించుకుని, ఉత్పత్తిని పెంచుకోవడం, టర్న్అరౌండ్ సాధించడంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు వైజాగ్ స్టీల్ (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ – ఆర్ఐఎన్ఎల్) సీఎండీ అతుల్ భట్ తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫోర్జ్డ్ వీల్ ప్లాంటు, విశాఖలోని స్థలాల మానిటైజేషన్‌తో పాటు వ్యయ నియంత్రణ చర్యలతో దాదాపు రూ. 3,000– 4,000 కోట్లు సమీకరించుకోగలిగితే ఇందుకు సహాయకరంగా ఉండగలదని ఆయన చెప్పారు. ఉక్కు, మెటలర్జీ సదస్సులో పాల్గొన్న సందర్భంగా సంస్థ సీఎండీ అతుల్ భట్ ఈ విషయాలు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే మానిటైజేషన్ (విక్రయం, లీజుకివ్వడం తదితర మార్గాల్లో అసెట్లపై ఆదాయం ఆర్జించడం) చేపట్టగలిగితే ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. 2022–23లో ఆర్ఐఎన్ఎల్ సుమారు రూ. 3,000 కోట్లు నష్టం నమోదు చేసింది. అంతర్జాతీయంగా మందగమనంతో నిల్వలు పేరుకుపోవడం, ఉక్కుపై ఎగుమతి సుంకాలు, ముడి వనరుల లభ్యతకు భద్రత లేకపోవడం తదితర అంశాలు ఇందుకు కారణమని భట్ వివరించారు. ఓపెన్ మార్కెట్ నుంచి ముడి ఇనుము కొనాల్సి రావడం వల్ల ప్రతి టన్నుకు రూ. 6,000 మేర ఎక్కువ వెచ్చించాల్సి వస్తోందని, దీనికి తోడు రూ. 23,000 కోట్ల భారీ రుణ భారం ఉందని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో మానిటైజేషన్ ప్రణాళికతో రుణభారం తగ్గి, నిర్వహణ మూలధన పరిస్థితి మెరుగుపడగలదన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో ఉన్న ఫోర్జ్డ్ వీల్ ప్లాంటుపై ఆర్ఐఎన్ఎల్ రూ. 2,000 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. -
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ప్రస్తుతానికి ముందుకు వెళ్లడం లేదు
-
వైజాగ్ స్టీల్ వినూత్న ప్రతిపాదన..
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ (ఆర్ఐఎన్ఎల్ – వైజాగ్ స్టీల్) నిధుల సమీకరణ కోసం మార్గాలు అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా తమకు నిర్వహణ మూలధనం లేదా ముడి సరుకును సమకూర్చే కంపెనీలకు ప్రతిగా ఫినిష్డ్ ఉక్కు ఉత్పత్తులను సరఫరా చేసే వినూత్న ప్రతిపాదనను తొలిసారిగా తెరపైకి తెచ్చింది. (ఈ-కామర్స్ వ్యాపారంలోకి ఫోన్‌పే.. కొత్త యాప్ పేరు ఏంటంటే..) దీనికి సుముఖంగా ఉన్న ఉక్కు, ఉక్కు సంబంధ ముడి వస్తువుల వ్యాపారం చేసే సంస్థలు ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలు (ఈవోఐ) సమర్పించాలని ఆహ్వానించింది. కోకింగ్ కోల్, ఇనుప ఖనిజం మొదలైన వాటిని సరఫరా చేయడం లేదా నిర్వహణ మూలధనం సమకూర్చడం ద్వారా ఈ ప్రక్రియలో భాగస్వాములు కావచ్చని ఒక నోటీసులో ఆర్ఐఎన్ఎల్ తెలిపింది. దానికి బదులుగా పరస్పరం ఆమోదయోగ్యమైన నిబంధనల ప్రకారం ఉక్కు ఉత్పత్తులను పొందవచ్చని వివరించింది. ఈవోఐల దాఖలుకు ఏప్రిల్ 15 ఆఖరు తేదీ. -
పరిశ్రమల ఆటోమేషన్‌కు ‘కల్పతరువు’
సాక్షి, అమరావతి: రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్), సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) సంయుక్తంగా నాలుగోతరం ఇండస్టీ–4 టెక్నాలజీ అభివృద్ధికి ‘కల్పతరువు’ పేరుతో విశాఖపట్నంలో ఏర్పాటైన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ (సీవోఈ) కార్యక్రమాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. అనేక పారిశ్రామిక సంస్థలకు.. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల ఆటోమేషన్‌కు ‘కల్పతరువు’ అన్ని విధాలా ఉపయోగపడనుంది. మంగళవారం ఆర్ఐఎన్ఎల్ ప్రధాన కార్యాలయం నుంచి వర్చువల్‌గా జరిగిన కార్యక్రమంలో ఆ సంస్థ సీఎండీ అతుల్ భట్, ఢిల్లీ నుంచి ఎస్టీపీఐ డైరెక్టర్ జనరల్ అరవింద్ కుమార్ కలిసి కల్పతరువు ఓపెన్ ఛాలెంజ్ ప్రోగ్రాం – 1 (ఓసీపీ–1)ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అతుల్ భట్ మాట్లాడుతూ ఆర్ఐఎన్ఎల్కు చెందిన ఆరు సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఈ ఛాలెంజ్‌ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ సమస్యలకు పరిష్కారం అందించే స్టార్టప్‌లు అంతర్జాతీయంగా ఉక్కు పరిశ్రమ ఎదుర్కొంటున్న కీలక సమస్యలకు పరిష్కారాన్ని కూడా అందించే అవకాశం లభిస్తుందన్నారు. విశాఖపట్నంలో ఉన్న ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు ఎన్టీపీసీ, బీహెచ్ఈఎల్–హెచ్‌వీపీవీ, హెచ్ఎస్ఎల్, హెచ్‌పీసీఎల్, వీపీటీ, బీఏఆర్సీ వంటి సంస్థలు ఈ సీవోఈని వినియోగించుకోవాలని కోరారు. ఈ సీవోఈతో రాష్ట్రంలో స్టార్టప్‌లు పెరుగుతాయని, పారిశ్రామిక కార్యక్రమాలు వేగం పుంజుకుంటాయని తెలిపారు. అరవింద్ కుమార్ మాట్లాడుతూ ఎస్టీపీఐకి దేశవ్యాప్తంగా 20 సీవోఈలు ఉండగా కల్పతరువు 21వదని, కాని ఇది అన్ని సీవోఈలకు తల్లిగా అవతరించనుందని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా, ఎనలటిక్స్ వంటి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాలను వినియోగించుకొని స్మార్ట్ ఆటోమేషన్‌ను పెంచుకోవచ్చని చెప్పారు. ఆర్ఐఎన్ఎల్ లానే ఇతర పీఎస్‌యూలు కూడా వారి సమస్యల పరిష్కారానికి కల్పతరువును వినియోగించుకోవాలని కోరారు. ఆంధ్రా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ పీవీజీడీ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ కల్పతరువు రాకతో 2025 నాటికి రాష్ట్ర తయారీ రంగంలో 25 శాతం వృద్ధి నమోదవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఓసీపీ–1 కార్యక్రమంలో పాల్గొనే స్టార్టప్‌లు అక్టోబర్ 19 వరకు www.kalpataru.stpi.in అనే వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చని ఎస్టీపీఐ విశాఖ అడిషనల్ డైరెక్టర్ సురేష్ బాతా తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ సంస్థలకు చెందిన 1,032 మంది పాల్గొన్నారు. -
వైజాగ్ స్టీల్ విలువ నిర్ధారణకు సై
న్యూఢిల్లీ: ప్రైవేటైజేషన్ బాటలో ఉన్న రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్(ఆర్ఐఎన్ఎల్) విలువ నిర్ధారణకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. దీనిలో భాగంగా ఐబీబీఐలో రిజిస్టరైన సంస్థలకు ఆహ్వానం పలికింది. తద్వారా ఆర్ఐఎన్ఎల్ (వైజాగ్ స్టీల్) ఆస్తుల విలువ మదింపునకు తెరతీసింది. ఈ ఏడాది జనవరి 27న వైజాగ్ స్టీల్‌లో 100 శాతం వాటాను విక్రయించేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ముందస్తు అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. వెరసి అనుబంధ సంస్థలు, భాగస్వామ్య కంపెనీలలో వాటాలు సహా వైజాగ్ స్టీల్ అమ్మకానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో పీఎస్‌యూ కంపెనీలలో ప్రభుత్వ ఈక్విటీలను నిర్వహించే దీపమ్.. ఈ నెల 11న ప్రతిపాదనల ఆహ్వానాన్ని(ఆర్ఎఫ్పీ) ప్రకటించింది. తద్వారా దివాలా, రుణ ఎగవేతల దేశీ బోర్డు(ఐబీబీఐ)లో రిజిస్టరైన కంపెనీల నుంచి బిడ్స్‌కు ఆహ్వానం పలికింది. బిడ్స్ దాఖలుకు ఏప్రిల్ 4 వరకూ గడువిచ్చింది. వేల్యుయర్‌గా ఎంపికయ్యే సంస్థ ఆర్ఐఎన్ఎల్ విలువ మదింపుతోపాటు కంపెనీలో వ్యూహాత్మక వాటా విక్రయంలోనూ ప్రభుత్వానికి సహకరించవలసి ఉంటుంది. కంపెనీకి చెందిన అనుబంధ సంస్థలు, భాగస్వామ్య సంస్థలలో వాటాల విలువసహా.. ప్లాంటు, మెషీనరీ, భూములు, భవనాలు, ఫర్నీచర్, సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తదితరాలను మదింపు చేయవలసి ఉంటుంది. -
విశాఖ స్టీల్ సీఎండీగా అతుల్ భట్
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీగా అతుల్ భట్ నియమితులయ్యారు. గతంలో ఆయన టాటా స్టీల్‌తో పాటు పలు స్టీల్ప్లాంట్లలో పనిచేశారు. ఈ నియామకంతో ఆయన విశాఖకు సీఎండీగా జులై 1 నుంచి పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. చదవండి: బ్రహ్మంగారి మఠం పీఠాధిపతిగా వెంకటాద్రి స్వామి -
విశాఖ ఉక్కు కోసం యాక్షన్ ప్లాన్
సాక్షి, న్యూఢిల్లీ : విశాఖ ఉక్కు కర్మాగారం(రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్)ను మళ్ళీ లాభాల బాట పట్టించడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నట్లు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి విష్ణు దేవ సాయి బుధవారం రాజ్య సభలో వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. సెయిల్, ఆర్ఐఎన్ఎల్ను పటిష్టం చేసి వాటిని లాభాల్లోకి తెచ్చే ప్రణాళిక రూపకల్పన కోసం 2017లో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు. ఆర్ఐఎన్ఎల్కు సొంతంగా గనులు కేటాయించాలన్న డిమాండ్ చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న వాస్తవాన్ని మంత్రి అంగీకరించారు. మైనింగ్ లీజుల కేటాయింపు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయించినందున, కేంద్రం ఆ విషయంలో జోక్యం చేసుకోదని ఆయన స్పష్టం చేశారు. ఉక్కు గనులను ఆపరేట్ చేస్తున్న ఒడిశా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఓఎండీసీ) ఆధ్వర్యంలోని గనులు మూతపడినందున ఆర్ఐఎన్ఎల్కు ఖనిజ సరఫరా జరగలేదని మంత్రి వివరించారు. లాభదాయకత ప్రాతిపదికన పెన్షన్ విజయసాయి రెడ్డి అడిగిన మరో ప్రశ్నకు కూడా ఉక్కు శాఖ మంత్రి వివరణ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేసే సిబ్బందికి పదవీ విరమణ ప్రయోజన పథకంలో భాగంగా తమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పెన్షన్ స్కీమ్‌లను ప్రవేశపెట్టే ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. ఈ ప్రతిపాదనల పరిశీలనకై ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. కమిటీ సూచనల ప్రకారం కంపెనీ లాభదాయకత ప్రాతిపదికన, డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ మార్గదర్శకాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేసే సిబ్బందికి పెన్షన్ స్కీమ్‌ను ప్రవేశపెట్టే దిశగా కేంద్రం యోచిస్తోందని మంత్రి వెల్లడించారు. -
తరలిపోనున్న విశాఖ పెల్లెట్ ప్లాంట్?
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఎన్ఎండీసీ, ఆర్‌ఐఎన్‌ఎల్‌లు రూ.1,000 కోట్లతో విశాఖలో ఏర్పాటు చేయుదలచిన పెల్లెట్ ప్లాంటును ఛత్తీస్‌గఢ్‌కు వూర్చాల్సి రావచ్చని విశ్వసనీయు వర్గాలు వెల్లడించారుు. నలబై లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి సావుర్థ్యం కలిగిన పెల్లెట్ ప్లాంటుకు అవసరమైన వుుడిసరుకు (ఇనుప ఖనిజం) తవు రాష్ట్రంలోనే ఉత్పత్తి అవుతుందనీ, కనుక ఈ ప్లాంటును తవు రాష్ట్రానికి తరలించాలనీ ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం పట్టుబడుతోంది. ఛత్తీస్‌గఢ్‌లోని జగ్దల్పూర్ నుంచి విశాఖకు ఇనుప ఖనిజాన్ని తరలించడానికి పైప్‌లైన్ ఏర్పాటు చేసేందుకు ఎన్ఎండీసీ, ఆర్‌ఐఎన్‌ఎల్‌లు 2012లో ఒప్పం దం కుదుర్చుకున్నారుు. ప్లాంటు, పైప్లైన్ల నిర్మాణానికి రూ.2,200 కోట్ల పెట్టుబడి అవసరవుని అంచనా. పెల్లెట్ ప్లాంటు సావుర్థ్యాన్ని 60 లక్షల టన్నులకు పెంచాలని ప్రతిపాదించిన నేపథ్యంలో ఈ ప్లాంటులో పెట్టుబడి కూడా పెరగనుంది. అదేవిధంగా, పైప్‌లైన్ వార్షిక కెపాసిటీని కోటి టన్నుల నుంచి 1.30 కోట్ల టన్నులకు పెంచాలని నిర్ణరుుంచారు. ఇనుప ఖనిజం సేకరణకు సంబంధించి ఎన్ఎండీసీతో ఆర్ఐఎన్ఎల్కు దీర్ఘకాలిక ఒప్పందం ఉంది. బైలదిల్లా గనుల నుంచి ప్రధానంగా రైల్వేల ద్వారా ఇనుప ఖనిజాన్ని ఎన్ఎండీసీ సరఫరా చేస్తోంది. పైప్‌లైన్ ఏర్పాటుతో ఆర్ఐఎన్ఎల్కు రవాణా వ్యయుం తగ్గడంతోపాటు ఎన్ఎండీసీ అధికంగా ఖనిజాన్ని సరఫరా చేయుగలుగుతుంది. -
సొంత ‘గని’ అభివృద్ధి
కోల్‌కతా: ప్రభుత్వరంగంలోని ఆర్ఐఎన్ఎల్ (విశాఖ ఉక్కు) త్వరలో రాజస్థాన్‌లో తన మొట్టమొదటి ఇనుప ఖనిజ గనిని అభివృద్ధి చేసుకోనుంది. సంస్థ డెరైక్టర్ (ఫైనాన్స్) ఎం.మధుసూదన్ శనివారం ఇక్కడ ఈ విషయాన్ని తెలిపారు. ప్రభుత్వ నుంచి ఈ మేరకు లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ను అందుకున్నట్లు ఆయన తెలిపారు. దాదాపు 900 హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ క్షేత్రంలో 230-250 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజ రిజర్వ్‌లు ఉన్నట్లు అంచనా.