న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ (ఆర్‌ఐఎన్‌ఎల్ – వైజాగ్ స్టీల్) నిధుల సమీకరణ కోసం మార్గాలు అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా తమకు నిర్వహణ మూలధనం లేదా ముడి సరుకును సమకూర్చే కంపెనీలకు ప్రతిగా ఫినిష్డ్ ఉక్కు ఉత్పత్తులను సరఫరా చేసే వినూత్న ప్రతిపాదనను తొలిసారిగా తెరపైకి తెచ్చింది.
(ఈ-కామర్స్ వ్యాపారంలోకి ఫోన్‌పే.. కొత్త యాప్ పేరు ఏంటంటే..)
దీనికి సుముఖంగా ఉన్న ఉక్కు, ఉక్కు సంబంధ ముడి వస్తువుల వ్యాపారం చేసే సంస్థలు ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలు (ఈవోఐ) సమర్పించాలని ఆహ్వానించింది. కోకింగ్ కోల్, ఇనుప ఖనిజం మొదలైన వాటిని సరఫరా చేయడం లేదా నిర్వహణ మూలధనం సమకూర్చడం ద్వారా ఈ ప్రక్రియలో భాగస్వాములు కావచ్చని ఒక నోటీసులో ఆర్‌ఐఎన్‌ఎల్ తెలిపింది. దానికి బదులుగా పరస్పరం ఆమోదయోగ్యమైన నిబంధనల ప్రకారం ఉక్కు ఉత్పత్తులను పొందవచ్చని వివరించింది. ఈవోఐల దాఖలుకు ఏప్రిల్ 15 ఆఖరు తేదీ.
Comments
Please login to add a commentAdd a comment