హైదరాబాద్‌: ఎన్‌ఎండీసీ, ఈసీఐఎల్, ఐఐఆర్‌ఆర్‌లో జాబ్స్‌ | Hyderabad: NMDC, ECIL, IIRR Job Vacancies, Eligibility, Salary Details Here | Sakshi
Sakshi News home page

ఎన్‌ఎండీసీలో ఆఫీస్‌ ట్రెయినీ పోస్టులు

Published Thu, Feb 10 2022 6:14 PM | Last Updated on Thu, Feb 10 2022 6:15 PM

Hyderabad: NMDC, ECIL, IIRR Job Vacancies, Eligibility, Salary Details Here - Sakshi

హైదరాబాద్‌లోని నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఎన్‌ఎండీసీ)..జూనియర్‌ ఆఫీస్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► మొత్తం పోస్టుల సంఖ్య: 94
► విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, మైనింగ్, జీ అండ్‌ క్యూసీ, సర్వే.
► అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా, ఎమ్మెస్సీ /ఎంటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి. వయసు: 32 ఏళ్లు మించకుండా ఉండాలి.
► జీతం: నెలకి రూ.37,000 నుంచి 1,30,000 వరకు చెల్లిస్తారు.
► ఎంపిక విధానం: రాతపరీక్ష, సూపర్‌వైజరీ స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.
► పరీక్షా విధానం: రాత పరీక్షని మొత్తం 100 మార్కులకు మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నల రూపంలో నిర్వహిస్తారు. ఈ పరీక్షని హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో నిర్వహిస్తారు. దీనిలో అర్హత సాధించిన అభ్యర్థుల్ని సూపర్‌వైజరీ స్కిల్‌టెస్ట్‌కి ఎంపికచేస్తారు. స్కిల్‌టెస్ట్‌ అర్హత పరీక్ష మాత్రమే. రాతపరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా తుదిఎంపిక ఉంటుంది.
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 27.02.2022
► వెబ్‌సైట్‌:  nmdc.co.in

ఈసీఐఎల్ లో 12 ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులు
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఈసీఐఎల్‌).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► మొత్తం పోస్టుల సంఖ్య: 12
► పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌(ఈసీఈ, ఈఈఈ, ఈటీఈ)–06, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌(మెకానికల్, ఈసీఈ, సీఎస్‌ఈ)–06. 
► ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌(ఈసీఈ, ఈఈఈ, ఈటీఈ): అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.
    వయసు: 33 ఏళ్లు మించకుండా ఉండాలి. జీతం: నెలకి రూ.40,000 చెల్లిస్తారు.
► ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌(మెకానికల్, ఈసీఈ, సీఎస్‌ఈ): అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.
    వయసు: 33 ఏళ్లు మించకుండా ఉండాలి. జీతం: నెలకి రూ.40,000 చెల్లిస్తారు.
► ఎంపిక విధానం: వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
► వాక్‌ఇన్‌ తేది: 15.02.2022
► వేదిక: ఈసీఐఎల్, నలందా కాంప్లెక్స్, సీఎల్‌డీసీ, టీఐఎఫ్‌ఆర్‌ రోడ్,హైదరాబాద్‌–500062.
► వెబ్‌సైట్‌: ecil.co.in

ఐకార్‌–ఐఐఆర్‌ఆర్ లో వివిధ ఖాళీలు
హైదరాబాద్, రాజేంద్రనగర్‌లోని ఐకార్‌–ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రైస్‌ రీసెర్చ్‌(ఐఐఆర్‌ఆర్‌).. తాత్కాలిక ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► మొత్తం పోస్టుల సంఖ్య: 07
► పోస్టుల వివరాలు: రీసెర్చ్‌ అసోసియేట్‌–01, జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో(జేఆర్‌ఎఫ్‌) –03, టెక్నికల్‌ అసిస్టెంట్లు–03.
► రీసెర్చ్‌ అసోసియేట్‌: అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఎమ్మెస్సీ/పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పరిశోధన అనుభవం ఉండాలి. జీతం: నెలకి రూ.49,000+24 శాతం హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.
► జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో(జేఆర్‌ఎఫ్‌): అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ/పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు పరిశోధన అనుభవం ఉండాలి. జీతం: నెలకి రూ.31,000+24 శాతం హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.
► టెక్నికల్‌ అసిస్టెంట్లు: అర్హత: డిగ్రీ(లైఫ్‌ సైన్స్‌)/డిప్లొమా(అగ్రికల్చర్‌) ఉత్తీర్ణులవ్వాలి. ఫీల్డ్‌ ఆపరేషన్స్‌పై మంచి నాలెడ్జ్‌తోపాటు కంప్యూటర్‌ నైపుణ్యాలు ఉండాలి. జీతం: నెలకి రూ.20,000 చెల్లిస్తారు.
► ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
► దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
► ఈమెయిల్‌: msmrecruitment2021@gmail.com
► దరఖాస్తులకు చివరితేది: 12.02.2022
► వెబ్‌సైట్‌: icar-iirr.org

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement