నాంపల్లి: ఎనిమిది ప్రభుత్వ రంగ సంస్థలు తలపడుతున్న ప్రతిష్టాత్మక ఎన్‌ఎండీసీ క్రికెట్ టోర్న్ లో సింగరేణి కాలరీస్ జట్టు అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. హైదరాబాద్‌లోని విజయ్ ఆనంద్ క్రీడా మైదానంలో ఆదివారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో సింగరేణి జట్టు హిందుస్తాన్ ఏరో నాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) జట్టుతో తలపడింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హెచ్‌ఏఎల్ జట్టు నిర్ణత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 108 పరుగులు మాత్రమే చేయగలిగింది. హెచ్‌ఏఎల్ జట్టు ఓపెనర్ సందీప్‌కుమార్ అత్యధికంగా 48 పరుగులు చేశాడు. సింగరేణి జట్టు బౌలర్లు జగదీష్ (2 వికెట్లు), మహేష్ (2 వికెట్లు), హరికిషన్ (ఒక వికెట్)లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేసి హెచ్‌ఏఎల్ జట్టును తక్కువ స్కోర్‌కు పరిమితమ్యేలా చేయడంలో సఫలమయ్యారు.
ఆ తర్వాత 109 పరుగుల లక్ష్య సాధనతో బరిలోకి దిగిన సింగరేణి జట్టు ఓపెనర్లు శశికాంత్, డేవిడ్, రిచర్డ్స్ దూకుడుగా బ్యాటింగ్ చేశారు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడటమే కాకుండా తొలి వికెట్‌కు కేవలం 9 ఓవర్లలో 76 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. 47 పరుగుల వద్ద డేవిడ్ రిచర్డ్స్ అవుట్ అయ్యాక.. జట్టు కెపె్టన్ శశికాంత్ నిలకడగా ఆడుతూ జట్టుకు విజయాన్ని అందించారు. డేవిడ్ రిచర్డ్స్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఈ టోరీ్నలో సింగరేణి జట్టు లీగ్ దశలో తాను ఆడిన ఈసీఐఎల్, మిథాని, ఎన్‌ఆర్‌ఎస్‌ఈ జట్లను ఓడించి ఓటమి లేని జట్టుగా నిలిచింది. ఆగస్టు 6న ఆదివారం ఫైనల్ మ్యాచ్ భెల్‌తో తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment