NMDC Recruitment 2021: Apply Online, Vacancies, Eligibility, Selection Process - Sakshi
Sakshi News home page

NMDC Recruitment 2021: ఎన్‌ఎండీసీలో 89 పోస్టులు

Published Mon, Jun 7 2021 7:01 PM | Last Updated on Mon, Jun 7 2021 7:17 PM

NMDC Recruitment 2021: Apply Online 89 Vacancies, Eligibility, Selection Process - Sakshi

హైదరాబాద్‌ ప్రధాన కేంద్రంగా ఉన్న భారత ప్రభుత్వ రంగ సంస్థ.. నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఎన్‌ఎండీసీ)కు  చెందిన జార్ఖండ్‌లోని టాకిసుడ్‌ నార్త్‌ కోల్‌మైన్‌లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 89

► పోస్టుల వివరాలు: కొల్లియరీ ఇంజనీర్‌(మెకానికల్, ఎలక్ట్రికల్‌)–02, లెయిజనింగ్‌ ఆఫీసర్‌–02, మైనింగ్‌ ఇంజనీర్‌–12, సర్వేయర్‌–02, ఎలక్ట్రికల్‌ ఓవర్‌మెన్‌–04, మైన్‌ ఓవర్‌మెన్‌–25, మెకానికల్‌ ఓవర్‌మెన్‌–04, మైన్‌ సిర్దార్‌–38.

► అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా, ఇంజనీరింగ్‌ డిగ్రీ, పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు వాలిడ్‌ సిర్దార్‌ సర్టిఫికేట్‌ ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

► ఎంపిక విధానం: ఎగ్జిక్యూటివ్‌ గ్రేడ్‌ పోస్టుల ఇంటర్వ్యూ ఆధారంగా; సూపర్‌వైజర్లు, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు రాతపరీక్ష సూపర్‌వైజరీ స్కిల్‌ టెస్ట్, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

► పరీక్షా విధానం: రాతపరీక్ష మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నల రూపంలో 100 మార్కులకు ఉంటుంది. ఈ పరీక్షను ఇంగ్లిష్, హిందీ భాషల్లో నిర్వహిస్తారు. రాతపరీక్షలో అర్హత సాధించిన సూపర్‌వైజరీ పోస్టు అభ్యర్థులను సూపర్‌వైజరీ స్కిల్‌ టెస్ట్‌కు, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ అభ్యర్థులకు స్కిల్‌ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు. రాతపరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 22.06.2021

► వెబ్‌సైట్‌: www.nmdc.co.in

మరిన్ని నోటిఫికేషన్లు:
ఏపీ: శ్రీకాకుళంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 22 ఉద్యోగాలు

సదరన్‌ రైల్వేలో 3378 అప్రెంటిస్‌ ఖాళీలు

బెల్‌లో ట్రెయినీ, ప్రాజెక్ట్‌  ఇంజనీర్‌ పోస్టులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement