ఎన్‌ఎండీసీలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు
హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న ఖనిజ వనరులను స్పేస్ టెక్నాలజీ ద్వారా పర్యవేక్షించేందుకు నగరంలో ఉన్న జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎండీసీ) ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఈమేరకు రాష్ట్ర ప్రణాళిక విభాగం ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర రిమోట్ సెన్సింగ్ కేంద్రం డెరైక్టర్ జనరల్ బీపీ ఆచార్య ఢిల్లీలో చెప్పారు.
సోమవారం ఢిల్లీలోని విజ్ఞానకేంద్రంలో ‘పరిపాలనలో స్పేస్ టెక్నాలజీ విధానాన్ని ప్రోత్సహించడం’పై జరిగిన జాతీయ సదస్సు లో ఆయన మాట్లాడారు. మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్‌లను రిమోట్ సెన్సింగ్‌ల ద్వారా పర్యవేక్షిస్తున్నామని ఇస్రో చైర్మన్, స్పేస్ విభాగం కార్యదర్శికి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్, కేంద్ర కార్యదర్శులు, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు పాల్గొన్నట్లు సమాచార, ప్రజాసంబంధాల శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఖనిజ వనరుల పర్యవేక్షణకు స్పేస్ టెక్నాలజీ
Published Tue, Sep 8 2015 3:29 AM | Last Updated on Sun, Sep 3 2017 8:56 AM
Advertisement