BP Acharya
-
పబ్లిక్ సర్వెంట్ల ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారానికి సంబంధించి అప్పటి సీనియర్ ఐఏఎస్ అధికారులు బీపీ ఆచార్య, ఆదిత్యనాథ్ దాస్‌లకు సుప్రీంకోర్టు భారీ ఊరటనిచ్చింది. వీరిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసులను కొట్టేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఐఏఎస్ అధికారుల ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ ముందస్తు అనుమతి తప్పనిసరి అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అనుమతి తీసుకోకుండా ఈడీ కేసు నమోదు చేయడం, దానిని ఈడీ ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరించడం సరికాదని స్పష్టం చేసింది. ఈ విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సరైనవేనని తెలిపింది. అయితే భవిష్యత్తులో వీరి ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వం అనుమతినిస్తే అప్పుడు కేసు విచారణకు స్వీకరించాలని ప్రత్యేక కోర్టును ఆశ్రయించవచ్చునంటూ సుప్రీంకోర్టు ఈడీకి సూచించింది. అయితే ఈ వెసులుబాటు ప్రతివాదులైన అధికారులు లేవనెత్తే న్యాయపరమైన అభ్యంతరాలకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసి ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది.విధి నిర్వహణలో భాగంగా తీసుకున్న నిర్ణయాలవి ‘ఈడీ ఫిర్యాదులోని అంశాలన్నింటినీ మేం క్షుణ్ణంగా పరిశీలించాం. ఇండియా సిమెంట్స్‌కు అదనంగా 10 లక్షల లీటర్ల నీటిని కేటాయించారన్నదే ఆదిత్యనాథ్ దాస్‌పై ఉన్న ఆరోపణ. ఫిర్యాదులోని ఆరోపణలు వాస్తవమనుకున్నా, నీటి కేటాయింపులు తన విధి నిర్వహణలో భాగంగానే చేశారు. ఇందూ టెక్ జోన్‌కు 250 ఎకరాలు కేటాయించారన్నది బీపీ ఆచార్యపై ఉన్న ఆరోపణ. ఇది కూడా నిజమనుకున్నా, ఆ నిర్ణయం కూడా విధి నిర్వహణలో భాగంగా తీసుకున్నదే. వారి విధి నిర్వహణకు, తీసుకున్న నిర్ణయాలకు సంబంధం ఉంది. ఇద్దరు అధికారులు కూడా పబ్లిక్ సర్వెంట్లే. వీరికి సీఆర్పీసీ సెక్షన్ 197(1) వర్తిస్తుంది. ఈ సెక్షన్ మనీలాండరింగ్ నిరోధక చట్టం కిందకు వచ్చే నేరాలకు సైతం వర్తిస్తుంది. మనీలాండరింగ్ నిరోధక చట్టంలో ఏ నిబంధన కూడా సెక్షన్ 197(1)కు విరుద్ధంగా లేదు. అధికార విధుల్లో భాగంగా తీసుకున్న నిర్ణయాలకు, చేపట్టిన చర్యలకు గాను అధికారులను ప్రాసిక్యూట్ చేయకుండా ఉండేందుకు ఈ సెక్షన్‌ను తీసుకొచ్చారు. అయితే ప్రభుత్వం అనుమతినిస్తే మాత్రం ప్రాసిక్యూట్ చేయవచ్చు. అయితే ఈ కేసులో అలా జరగలేదు. అయినప్పటికీ ఈడీ నమోదు చేసిన కేసును ఈడీ ప్రత్యేక కోర్టు విచారణ నిమిత్తం తీసుకుంది. ఇలా చేయడం ఎంత మాత్రం సరికాదు. అందువల్లే బీపీ ఆచార్య, ఆదిత్యనాథ్ దాస్లపై కేసు కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తున్నాం’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది.ఈడీ కేసుల పూర్వాపరాలుఇండియా అరబిందో, హెటిరో గ్రూపులకు జడ్చర్ల ఎస్ఈజెడ్లో 150 ఎకరాల భూమి కేటాయించడంలో అప్పటి ఏపీఐఐసీ ఎండీగా బీపీ ఆచార్య కీలక పాత్ర పోషించారంటూ ఈడీ ఆయనపై కేసు నమోదు చేసింది. అలాగే ఇందూ టెక్‌జోన్‌కు 250 ఎకరాల భూమి కేటాయింపు వ్యవహారంలోనూ ఆచార్య నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఈడీ ఆరోపించింది. ఇండియా సిమెంట్స్‌కు నీటి కేటాయింపుల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ అప్పటి నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌పై కూడా ఈడీ కేసు నమోదు చేసింది. సీబీఐ చార్జిషీట్ల ఆధారంగా ఈడీ తమపై కేసులు నమోదు చేసిందని, అందువల్ల వాటిని కొట్టేయాలంటూ వారిద్దరూ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసులను కొట్టేస్తున్నట్లు 2019 జనవరి 21న హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ఈడీ 2019 జూలైలో సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు పలుమార్లు విచారణ జరిపింది. చివరిగా గత నెల 15న పూర్తి స్థాయి వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా బుధవారం తన తీర్పును వెలువరించింది. a -
దాస్, ఆచార్యలపై ఈడీ కేసుల కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారానికి సంబంధించిన కేసుల్లో సీనియర్ ఐఏఎస్ అధికారులు ఆదిత్యనాథ్ దాస్, బీపీ ఆచార్యలకు ఊరట లభించింది. వీరిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసులను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఐఏఎస్ అధికారుల ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ ముందస్తు అనుమతి తప్పనిసరని తేల్చి చెప్పింది. అనుమతి తీసుకోకుండా ఈడీ కేసు నమోదు చేయడం, దానిని ఈడీ ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. అయితే ప్రభుత్వ అనుమతి తీసుకున్న తర్వాత కేసు నమోదు చేసే వెసులుబాటును ఈడీకి కల్పించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు సోమవారం తీర్పు వెలువరించారు. ఇద్దరిపై ఈడీ కేసులు... ఇండియా అరబిందో, హెటిరో, ఇందూ టెక్జోన్లకు భూ కేటాయింపుల్లో అప్పటి ఏపీఐఐసీ ఎండీగా ఉన్న బీపీ ఆచార్య.. ఇండియా సిమెంట్స్‌కు నీటి కేటాయింపుల్లో అప్పటి నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపిస్తూ ఈడీ కేసులు నమోదు చేసింది. అయితే, సీబీఐ చార్జిషీట్ల ఆధారంగా ఈడీ తమపై కేసులు నమోదు చేసిందని, అందువల్ల వాటిని కొట్టేయాలంటూ వారిద్దరూ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు విచారణ జరిపారు. ఆదిత్యనాథ్ దాస్ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించగా, బీపీ ఆచార్య తరఫున ప్రద్యుమ్నకుమార్‌రెడ్డి వాదించారు. ఈ ఇద్దరు అధికారుల ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని వారు కోర్టుకు నివేదించారు. వీరిపై ఈడీ గుడ్డిగా మనీల్యాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసిందని తెలిపారు. పిటిషనర్లు వ్యక్తిగత ఆర్థిక ప్రయోజనాలు పొందినట్లు ఎక్కడా ఈడీ ఆరోపించలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మంత్రిమండలి నిర్ణయాలను మాత్రమే వారు అమలుచేశారని వివరించారు. మనీ ల్యాండరింగ్ చట్టం ప్రత్యేక చట్టమని, ఈ చట్టం కింద నమోదు చేసే కేసులకు ప్రభుత్వ అనుమతి అవసరం లేదని ఈడీ తరఫు న్యాయవాది పీఎస్పీ సురేశ్‌కుమార్ తెలిపారు. అనుమతి లేకుండా కేసు నమోదు చెల్లదు... ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పు వెలువరిస్తూ, ప్రభుత్వ అనుమతి లేకుండా ఈడీ కేసు దాఖలు చేయడానికి వీల్లేదని స్పష్టంచేశారు. అటువంటి కేసును ఈడీ ప్రత్యేక కోర్టు విచారణ నిమిత్తం పరిగణనలోకి తీసుకోవడం నిబంధనలకు విరుద్ధమని తేల్చి చెప్పారు. అందువల్ల వారిపై ఈడీ నమోదు చేసిన కేసులను కొట్టేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన తర్వాత వారిపై కేసు నమోదు చేసుకోవచ్చన్నారు. అయితే, ఈ తీర్పు ప్రభావం దేశవ్యాప్తంగా ఈడీ నమోదు చేసిన పలు కేసులపై ఉంటుందని, అందువల్ల దీనిని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని ఈడీ తరఫు న్యాయవాది చెప్పారు. అందుకు వీలుగా 8 వారాల పాటు తీర్పు అమలును నిలిపేయాలని కోరారు. దీంతో న్యాయమూర్తి స్పందిస్తూ.. నాలుగు వారాల పాటు తీర్పు అమలును నిలిపివేస్తున్నట్టు పేర్కొన్నారు. -
ఐఎస్ఎస్లు ఉన్నత స్థానాలకు చేరుకోవాలి
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ (ఐఎస్ఎస్) అధికారులు పరిపాలనా విభాగాల్లో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం (ఎంసీఆర్హెచ్ఆర్డీ) డైరెక్టర్ జనరల్ బీపీ ఆచార్య అన్నారు. ఐఎస్‌ఎస్‌ల శిక్షణ నిమిత్తం నేషనల్ స్టాటిస్టికల్ సిస్టమ్స్ ట్రయినింగ్, కేంద్ర స్టాటిస్టికల్ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వశాఖ సహకారంతో నిర్వహించిన ‘మిడ్ కెరీర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్’ముగింపు కార్యక్రమానికి శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమం ఐఎస్‌ఎస్‌లకు సాధికారతను చేకూర్చి,పరిపాలనా విభాగాల్లో ఉన్నతస్థానాలకు చేరుకునేందుకు ఉపయోగపడుతుందన్నారు. ఐఎస్ఎస్లు నిత్యం తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ కమ్యూనికేషన్ టెక్నాలజీతో అప్డేట్ కావాలన్నారు. కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వివిధ మంత్రిత్వశాఖల నుంచి ఐఎస్ఎస్లు పాల్గొన్నారు. -
డబ్బింగ్ సినిమాలతో తీవ్ర నష్టం..
సాక్షి, హైదరాబాద్: అనేక రకాల దాడుల నుంచి సెక్యులరిజాన్ని కాపాడుకునేందుకు రాజ్యాంగమే గొప్ప ఆయుధమని, రాజ్యాంగం ప్రసాదించిన అత్యున్నతమైన విలువల వెలుగులలో లౌకికవాదాన్ని పరిరక్షించుకోవాలని సీనియర్ జర్నలిస్టు సీమా ముస్తఫా పిలుపునిచ్చారు. సెక్యులరిజానికి విఘాతం కలిగించే చర్యలను నియంత్రించకపోవడం వల్ల రోజురోజుకూ తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ రెండో రోజు కార్యక్రమాల్లో భాగంగా శనివారం బేగంపేట్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ‘బీయింగ్ ఏ సెక్యులర్ ముస్లిం ఇన్ ఇండియా’అనే అంశంపై ఆమె ప్రసంగించారు. అషార్ఫరాన్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. గాంధీ, నెహ్రూ కాలం నాటి సెక్యులరిజాన్ని ఇప్పుడు చూడలేమని, ఆనాటి లౌకికవాద విలువలు ఇప్పుడు ఏ మాత్రం కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘వరుసగా జరుగుతున్న దాడులతో సెక్యులరిజానికి తూట్లు పడుతున్నాయి. దీంతో రాజ్యాంగ లక్ష్యం అమలుకు నోచడం లేదు. ప్రభుత్వాలు కూడా ఎలాంటి నష్టనివారణ చర్యలు చేపట్టడం లేదు. ఇది మన సెక్యులర్ వ్యవస్థకే ప్రమాదకరం’’అని ఆందోళన వ్యక్తం చేశారు. వివిధ వర్గాల్లో రోజురోజుకూ అసహనం పెరుగుతోందని, దీనివల్ల దాడులు, హింస చెలరేగుతున్నాయన్నారు. చిన్నప్పటి నుంచే పిల్లలకు పరమత సహనం, లౌకిక భావాలపై అవగాహన కల్పిస్తే భావితరాల్లో సెక్యులరిజం అభివృద్ధి చెందుతుందన్నారు. వేర్పాటువాదం, మతం ఒకటి కాదు.. ప్రపంచంలో ఎక్కడ హింస చోటుచేసుకున్నా, దాడులు జరిగినా ఇక్కడ ముస్లింల పట్ల అసహనాన్ని ప్రదర్శించడం సరైంది కాదన్నారు. భారతీయ ముస్లింలు ఈ దేశ సంస్కృతిలో ఒక భాగమని అర్థం చేసుకోవాలన్నారు. ‘మైనారిటీ’భావనను ఏ ఒక్క దేశానికి, రాష్ట్రానికి పరిమితమైన అర్థంలో కాకుండా విస్తృత పరిధిలో చూడాలని, మొత్తం ప్రపంచాన్ని దృష్టిలో ఉంచుకుని మైనారిటీ భావనను పునర్నిర్వచించాలని అన్నారు. జమ్మూకశ్మీర్‌లో తలెత్తే వేర్పాటువాద ఆందోళనలకు ముస్లిం మతానికి ఎలాంటి సంబంధం లేదని, రెండూ ఒకటి కాదని చెప్పారు. రాజ్యాంగం పట్ల, రాజ్యాంగ విలువల పట్ల స్పష్టమైన అవగాహన ఉంటే ఇలాంటి అనేక విషయాలు స్పష్టంగా బోధపడతాయన్నారు. జర్నలిస్టులు తమ విధి నిర్వహణలో సొంత అభిప్రాయాలకు తావు లేకుండా వాస్తవాలను యథాతథంగా రిపోర్ట్ చేయాలన్నారు. ‘పద్మావత్’ మూవ్మెంట్లో ఉన్నాం.. కొన్ని రకాల అసహన భావాలను చూస్తోంటే ఎంతో విస్మయం కలుగుతోందని, చరిత్రను ఉన్నదున్నట్లుగా స్వీకరించేందుకు కూడా కొన్ని వర్గాలు సిద్ధంగా లేవని నల్సార్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కన్నబీరన్ అన్నారు. ఇప్పుడు మనమంతా ‘పద్మావత్’ సినిమా మూవ్మెంట్లో ఉన్నామని, పద్మావతి అనే మహిళ పేరును ‘పద్మావత్’గా మార్చి చెప్పుకునే దుస్థితిలో ఉన్నామన్నారు. ‘ది పబ్లిక్ వాయిస్ ఆఫ్ వుమెన్’అనే అంశంపై కొలంబియా రచయిత్రి లారా రెస్ట్రెపో, సీమా ముస్తఫా పాల్గొన్నారు. కొలంబియాలో ఇప్పటికీ మహిళలు అనేక రకాలుగా హింసకు గురవుతున్నారని లారా ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలు తమ భావప్రకటన స్వేచ్ఛను అనుభవించలేకపోతున్నారని, ఇందుకు రాజకీయాల్లో, సమాజంలో వ్యవస్థీకృత పురుషాధిపత్యమే కారణమని సీమా ముస్తఫా అన్నారు. మరోవైపు ‘ది జర్నీ ఆఫ్ కాటన్ ఇండియా’ అనే అంశంపై జరిగిన చర్చలో మీనా మీనన్, ఉజ్రమ్మ పాల్గొన్నారు. బీటీ కాటన్బారి నుంచి దేశ రైతాంగాన్ని కాపాడాలని, మన దేశ అవసరాలకు అనుగుణమైన స్వదేశీ విధానాన్ని అమలు చేయాలని ఉజ్రమ్మ కోరారు. ‘ది జునూన్ ఆఫ్ ది కెండల్స్ అండ్ కపూర్స్’అనే అంశంపై శశికపూర్ కూతురు సంజనా కపూర్ మాట్లాడారు. తమ తండ్రి కుటుంబం నుంచి, అమ్మ కుటుంబం నుంచి నాటక రంగానికి జరిగిన కృషిని గురించి వివరించారు. రెండో రోజు కార్యక్రమాల్లో భాగంగా గిరీష్ కాసరవల్లి దర్శకత్వంలో వెలువడిన ‘గులాబీ టాకీస్’సినిమాను ప్రదర్శించారు. ముంబైకి చెందిన చింటూసింగ్ కళాకారుల బృందం ప్రదర్శించిన బాంబే బైరాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వివిధ భాషల్లో సాగిన కవి సమ్మేళనం విశేషంగా ఆకట్టుకుంది. మిలిటరీ హీరోస్‌కు సెల్యూట్.. దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ శత్రువుతో వీరోచితంగా పోరాడే ఎందరో సైనికులు తమ సొంత జీవితాలను త్యాగం చేశారని, వారి త్యాగాలు స్ఫూర్తిదాయకమని ప్రముఖ జర్నలిస్టులు శివ్అరూర్, రాహుల్‌సింగ్ అన్నారు. సర్జికల్ స్ట్రైక్స్‌తో పాటు, ఇటీవల జరిగిన పలు ఘటనల్లో ప్రాణాలను కోల్పోయిన 14 మంది వీరుల గాథలను వివరిస్తూ వారు రాసిన ‘ట్రూ స్టోరీస్ ఆఫ్ మోడరన్ మిలటరీ హీరోస్’పుస్తకంపై నిర్వహించిన సమీక్షలో వారు మాట్లాడారు. సరిహద్దుల్లో సైనికులతో గడిపిన అనుభవాలను ఈ పుస్తకంలో పొందుపరిచినట్లు చెప్పారు. డబ్బింగ్ సినిమాలతో తీవ్ర నష్టం.. ‘లిటరేచర్ అండ్ ఫిల్మ్’అనే అంశంపై నిర్వహించిన చర్చలో ప్రముఖ కన్నడ డైరెక్టర్ గిరీష్ కాసరవల్లి మాట్లాడుతూ.. డబ్బింగ్ సినిమాల వల్ల సినీపరిశ్రమ తీవ్ర నష్టాలను చవిచూస్తోందన్నారు. డబ్బింగ్ సినిమాల్లో ఏ మాత్రం సృజనాత్మకత ఉండదని, దీనివల్ల ఆయా భాషల్లో సినిమాలు తీసేందుకు అవసరమైన 70 విభాగాలు నష్టపోతాయన్నారు. మరోవైపు ఈశాన్య రాష్ట్రాల్లోని గిరిజన ప్రజలు ఇప్పటికీ కనీస అవసరాలకు నోచుకోవడం లేదని, ప్రభుత్వ సేవలను కూడా వినియోగించుకోలేకపోతున్నారని ప్రముఖ సామాజిక కార్యకర్త ఆదిరాజు పార్థసారథి అన్నారు. ఈశాన్య రాష్ట్రాల స్థితిగతులపై నిర్వహించిన చర్చా కార్యక్రమానికి సీనియర్ ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య అధ్యక్షత వహించారు. -
35 మంది ఐఏఎస్‌లు.. 7 గంటలు..
మహబూబాబాద్ ఘటన నేపథ్యంలో భేటీ సాక్షి, హైదరాబాద్: మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతి మీనా పట్ల ఎమ్మెల్యే శంకర్ నాయక్ అనుచితంగా ప్రవర్తించిన నేపథ్యంలో ఐఏఎస్ అధికారుల సంఘం గురు వారం మంజీరా అథితిగృహంలో ప్రత్యేకంగా సమావేశమైంది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీపీ ఆచార్య అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో సుమారు 35 మంది ఐఏఎస్ అధికారులు పాల్గొనగా.. దాదాపు ఏడు గంటలపాటు సుదీర్ఘంగా చర్చిం చారు. మహబుబాబాద్ కలెక్టర్ పట్ల ఎమ్మెల్యే తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఈ ఘటనపై తక్షణమే స్పందించినందుకు సీఎంకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన విచారణను వేగవంతం చేయాలని, అలాగే దర్యాప్తు పక్రియ పారదర్శకంగా చేపట్టాలని పోలీసులను కోరారు. సమావేశంలో కేవలం మహబుబాబాద్ ఘటనే కాకుండా పలు అంశాలు చర్చకు వచ్చాయి. జిల్లాస్థాయిలో కొందరు రాజకీయ నాయకులతో ఎదురవుతున్న సమస్యలు, ఇబ్బందులపైనా చర్చించారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక కార్యచరణ రూపొందించాలని నిర్ణయించారు. ఐఏఎస్ అధికారుల సంఘం శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ను కలవనుంది. -
బి.పి.ఆచార్యపై విచారణ నిలిపివేత
♦ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ♦ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో అరబిందో, హెటిరో, ట్రైడెంట్ లైఫ్ సెస్సైస్‌కు భూముల కేటాయింపునకు సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసులో నిందితుడిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి బి.పి.ఆచార్యకు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై సీబీఐ ప్రత్యేక కోర్టులో జరుగుతున్న విచారణ ప్రక్రియను హైకోర్టు నిలిపివేసింది. వ్యక్తిగత హాజరు నుంచి కూడా మినహాయింపునిచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో బుధవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. సీబీఐ కేసు ను కొట్టేయడంతో పాటు విచారణ ప్రక్రియను నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ ఆచార్య హైకోర్టులో పిటిషన్ వేశారు. దీన్ని జస్టిస్ ఇలంగో విచారించారు. ఆచార్య తరఫు న్యాయవాది టి.ప్రద్యుమ్నకుమార్‌రెడ్డి వాదనలు వినిపించారు. జడ్చర్ల సెజ్‌లో హెటిరో, అరబిందో, ట్రైడెంట్‌లకు భూ కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని సీబీఐ ఆరోపిం చిందన్నారు. ఇందుకు అప్పట్లో ఏపీఐఐసీ ఎండీ హోదాలో ఉన్న పిటిషనర్‌ను బాధ్యులుగా చేసిందన్నారు.సీబీఐ ఆరోపణల్లో వాస్తవం లేదని ప్రద్యుమ్న తెలిపారు. భూ కేటాయింపులు, బదలాయింపులు నిబంధనల ప్రకారమే జరిగాయన్నారు. ఈ వ్యవహారంలో పిటిషనర్ వ్యక్తిగతంగా లబ్ది పొందినట్లు, దురుద్దేశాలతో వ్యవహరించినట్లు సీబీఐ ఎక్కడా చెప్పలేదన్నారు. అందువల్ల ఈ కేసును కొట్టేయడంతోపాటు విచారణ ప్రక్రియను నిలిపేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి సీబీఐ కోర్టులో ఆచార్యపై జరుగుతున్న విచారణ ప్రక్రియపై స్టే విధించారు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిచ్చారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐ ఆదేశిస్తూ తదుపరి విచారణను జూన్ 14కు వాయిదా వేశారు. మధ్యంతర ఉత్తర్వుల పొడిగింపు జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో నిందితులుగా ఉన్న పెన్నా పత్రాప్‌రెడ్డి, పి.ఆర్. ఎనర్జీ హోల్డింగ్స్‌పై సీబీఐ కోర్టులో జరుగుతున్న విచారణ ప్రక్రియను నిలిపేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది. ఆ ఉత్తర్వుల గడువు ముగిసిందని, కేసులో పూర్తిస్థాయి వాదనలు వినిపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పిటిషనర్లు విన్నవించారు. దీంతో న్యాయస్థానం గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తూ విచారణను జూన్‌కు వాయిదా వేసింది. వ్యక్తిగత హాజరు నుంచి వీర్వాణికి మినహాయింపు ఇందూ-గృహ నిర్మాణ మండలి భూ కేటాయింపుల కేసులో నిందితుడిగా ఉన్న ఎంబసీ రియల్టర్ జితేంద్ర వీర్వాణికి వ్యక్తిగత హాజరు నుంచి హైకోర్టు మినహాయింపునిచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తనపై సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ వీర్వాణి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు విన్న న్యాయమూర్తి... వీర్వాణికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిస్తూ ఉత్తర్వులిచ్చారు. -
జనగణనకు ఆధార్ జోడీ
-
జనగణనకు ఆధార్ జోడీ
- నవంబర్‌లో ఇంటింటి సర్వే - కుటుంబ వివరాల అప్డేషన్ - ఆధార్ కార్డు నంబర్ల సీడింగ్ సాక్షి, హైదరాబాద్: జనగణన తరహాలోనే మరో ఇంటింటి సర్వేకు రంగం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా జాతీయ జనాభా పట్టిక (నేషనల్ పాపులేషన్ రిజిస్టర్-ఎన్పీఆర్)ను సవరించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. 2011 జన గణన సమాచారానికి ఇప్పుడున్న తాజా మార్పులు చేర్పులను జోడించనుంది. పనిలో పనిగా ఆధార్ కార్డులను ఎన్పీఆర్ డేటాబేస్‌తో అనుసంధానం చేస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ ఆరంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం నవంబరులో ఈ సర్వే చేపట్టేందుకు సన్నాహాలు ప్రారంభించింది. నవంబరు 16 నుంచి డిసెంబరు 15 వరకు ఇంటింటి సర్వే చేయాలని ప్రణాళిక విభాగం భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించనుంది. డిసెంబరు 31లోగా సర్వేను పూర్తి చేసి వివరాలను ఆధార్‌తో అనుసంధానం చేయాలని కేంద్రం సూచించింది. పది రోజుల ముందుగానే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి బి.పి.ఆచార్య తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటివరకు నివాసితుల వివరాల్లో చోటుచేసుకున్న మార్పులను కొత్తగా నమోదు చేస్తారు. నివాసితుడి పేరు, పుట్టిన తేదీ, తండ్రి పేరు, చిరునామా, జన్మ స్థలం లాంటి వివరాల్లో మార్పులుంటే సరిదిద్దుతారు. 2011 జనాభా లెక్కల్లో నమోదు కాని కుటుంబాలు, సభ్యుల వివరాలుంటే తాజాగా నమోదు చేస్తారు. తెలంగాణలో ఇప్పటివరకు 98.5 శాతం ఆధార్ కార్డుల జారీ ప్రక్రియ పూర్తయింది. సర్వే సందర్భంగా ఆధార్ కార్డు ఇప్పటికీ అందని కుటుంబాలుంటే వారి దగ్గరున్న ఎన్రోల్మెంట్ నంబర్లతో లింక్ చేస్తారు. ఇవి రెండూ లేకుంటే.. ఆధార్‌లో నమోదు కాలేదంటూ రికార్డుల్లో పేర్కొంటారు. ఆధార్‌ని తప్పనిసరి చేయవద్దంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో.. ఈ వివరాలు ఇవ్వటానికి ఎవరైనా నిరాకరిస్తే ‘నాట్ గివెన్’ అని రాయాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే తమ దగ్గరున్న ఎన్పీఆర్ డేటాబేస్ ప్రకారం ఉన్న చిరునామాలో ఆ కుటుంబం లేకపోతే.. సర్వే అధికారులు ఇరుగుపొరుగు వారిని ఆరా తీస్తారు. జనాభా లెక్కల సర్వే తరహాలోనే ఈ వివరాల సవరణ ప్రక్రియ కొనసాగుతుంది. వివిధ పథకాల్లో లబ్ధిదారుల ఎంపికకు ఆధార్ సీడింగ్‌తో కూడిన ఈ డేటాబేస్ అత్యంత ప్రామాణికంగా నిలుస్తుందని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. దీంతో ఈ కుటుంబ వివరాల అప్డేషన్.. ఆధార్ కార్డుల సీడింగ్ సర్వే ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఇప్పటికే రాష్ట్రస్థాయిలో అధికారులకు శిక్షణ ఇచ్చామని, అక్టోబరు మొదటి వారం నుంచి జిల్లా స్థాయిలో, ఆ తర్వాత మండల స్థాయిలో శిక్షణ తరగతులను పూర్తి చేస్తామని ఆచార్య వివరించారు. -
ఖనిజ వనరుల పర్యవేక్షణకు స్పేస్ టెక్నాలజీ
ఎన్ఎండీసీలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న ఖనిజ వనరులను స్పేస్ టెక్నాలజీ ద్వారా పర్యవేక్షించేందుకు నగరంలో ఉన్న జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్ఎండీసీ) ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఈమేరకు రాష్ట్ర ప్రణాళిక విభాగం ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర రిమోట్ సెన్సింగ్ కేంద్రం డెరైక్టర్ జనరల్ బీపీ ఆచార్య ఢిల్లీలో చెప్పారు. సోమవారం ఢిల్లీలోని విజ్ఞానకేంద్రంలో ‘పరిపాలనలో స్పేస్ టెక్నాలజీ విధానాన్ని ప్రోత్సహించడం’పై జరిగిన జాతీయ సదస్సు లో ఆయన మాట్లాడారు. మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్లను రిమోట్ సెన్సింగ్‌ల ద్వారా పర్యవేక్షిస్తున్నామని ఇస్రో చైర్మన్, స్పేస్ విభాగం కార్యదర్శికి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్, కేంద్ర కార్యదర్శులు, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు పాల్గొన్నట్లు సమాచార, ప్రజాసంబంధాల శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. -
టిడిఎఫ్ ఆధ్వర్యాన కెనడాలో మీట్ అండ్ గ్రీట్
-
హైదరాబాద్ బెస్ట్ సిటీ
కెనడా రోడ్‌షోలో బీపీ ఆచార్య సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా పర్యాటకరంగం ప్రాముఖ్యతను సంతరించుకుంటోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి బీపీ ఆచార్య అన్నారు. కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కెనడాలోని మాంట్రియల్లో బుధవారం నిర్వహించిన టూరిజం రోడ్‌షోలో బీపీ ఆచార్య ప్రసంగించారు. ప్రఖ్యాత నేషనల్ జియోగ్రఫిక్ ట్రావెలర్ మేగజైన్లో హైదరాబాద్‌ను ప్రపంచంలోనే అత్యుత్తమ రెండో నగరంగా పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. ఇండియన్ టూరిజం కార్యాలయంతో పాటు పసిఫిక్ ఆసియా ట్రావెల్ అసోసియేషన్ ఇండియా శాఖ సంయుక్తంగా ఈ రోడ్‌షోను నిర్వహించాయి. ఉత్తర అమెరికాలోని పలువురు టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెంట్లు ఈ రోడ్‌షోలో పాల్గొన్నారు. -
రాష్ర్ట ప్రణాళిక మండలి ఏర్పాటు
* సీఎం అధ్యక్షతన ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ * సమగ్రాభివృద్ధిపై ప్రభుత్వానికి సలహాలివ్వాలని ప్రణాళిక శాఖ మార్గదర్శకాలు * ప్రణాళిక మండలికి అన్ని శాఖలు సహకరించాలని ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వానికి అవసరమైన సలహాలు, సూచనలు అందించడానికి సీఎం కేసీఆర్ అధ్యక్షతన ‘తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక మండలి’ ఏర్పాటైంది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మండలికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శి బీపీ ఆచార్య విడుదల చేశారు. ప్రణాళిక యంత్రాంగాన్ని పటిష్టపరిచే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేసినట్లు అందులో పేర్కొన్నారు. రాష్ట్రంలోని వనరులను సక్రమంగా సద్వినియోగం చేసుకుని సమగ్రాభివృద్ధి సాధించడానికి వీలుగా అర్హులైన మేధావుల నుంచి సూచనలను స్వీకరించి, ప్రభుత్వానికి ప్రణాళిక మండలి ఎప్పటికప్పుడు నివేదికలు అందించాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి చైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో ఎక్స్అఫీషియో వైస్-చైర్మన్‌గా ఆర్థికమంత్రి వ్యవహరిస్తారు. మండలి ఉపాధ్యక్షున్ని ప్రభుత్వం నియమిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ పదవిలో టీఆర్ఎస్ నేత సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే. సభ్యులుగా సీఎస్, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శితోపాటు వివిధ రంగాలకు చెందిన నిపుణులు ఉంటారు. సభ్య కార్యదర్శిగా ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శి వ్యవహరిస్తారు. ప్రణాళిక మండలికి మార్గదర్శకాలు - అభివృద్ధి కోసం సంస్థల ఏర్పాటుకు పాటించాల్సిన విధానాలు సూచించడం. - ఆర్థికాభివృద్ధి పర్యవేక్షణ, మదింపు. వివి ద శాఖలు చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల మెరుగుకు సలహాలివ్వడం. - రాష్ట్రాభివృద్ధికి సంబంధించి ఏ అంశంపైనైనా సలహాలు అందజేయాలి. - వార్షిక, పంచవర్ష ప్రణాళికల రూపకల్పనలో సలహాలు ఇవ్వాలి. - మండలి కార్యకలాపాల నిర్వహణకు అవసరమైన సహకారాన్ని ప్రణాళిక శాఖ అందించాలి. - మండలికి అడిగిన గణాంకాలను ప్రభు త్వ శాఖలన్నీ వెంటనే అందించాలి. రాష్ట్ర, కేంద్రస్థాయిలో తీసుకునే విధానపరమైన నిర్ణయాలకు సంబంధించిన వివరాలను మండలి దృష్టికి తీసుకురావాలి. -
పర్యాటకం టర్నోవర్ రూ.100 కోట్లు..
టీ పర్యాటక అభివృద్ధి సంస్థ లక్ష్యం ఐదు కోట్ల నికరలాభం కోసం యత్నం కొత్త పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి కార్పొరేషన్ బోర్డు సమావేశంలో నిర్ణయం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థను కొత్త పుంతలు తొక్కించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ర్టంలో నూతన పర్యాటక ప్రాంతాలను గుర్తించి వాటిని అభివృద్ధి చేయడంతోపాటు, గతంలో నిర్లక్ష్యానికి గురైన పర్యాటక ప్రాంతాలకూ పునర్వైభవం తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 100 కోట్ల టర్నోవర్ సాధించాలన్న లక్ష్యంగా పెట్టుకుంది. పర్యాటకాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి బీపీ ఆచార్య నేతృత్వంలో సమావేశమైన రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. గతేడాదితో పోలిస్తే.. తెలంగాణ ప్రాంతాల నుంచి టర్నోవర్ రూ. 60 కోట్లకు పైగా చేరినట్లు అధికారవర్గాలు వివరించాయి. దీనిని మరింత పెంచి రూ.5 కోట్ల నికర ఆదాయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వం పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కోసం 45 కోట్ల రూపాయలు రావాల్సి ఉండగా... ఇటీవలే తొమ్మిది కోట్ల రూపాయలు విడుదల చేసిందని ఆ శాఖ ముఖ్యకార్యదర్శి బీపీ ఆచార్య వివరించారు. పర్యాటకాభివృద్ధి సంస్థకు జిల్లాల్లో ఉన్న ఆస్తుల పరిరక్షణ, కొత్త ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రస్తుతం రెండు జిల్లాలకు ఒక డివిజనల్ మేనేజర్ ఉన్నారని, ఇకపై ప్రతి జిల్లాకు ఒక మేనేజర్‌ను నియమించాలని పాలక మండలి నిర్ణయించిందన్నారు. వీరికి అత్యవసర మరమ్మతులు ఇతర కార్యక్రమాల కోసం రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు వ్యయం చేయడానికి అనుమతినిస్తున్నట్లు తెలిపారు. కార్పొరేషన్‌కు ప్రధాన పర్యాటక కేంద్రం వద్ద ఈ మేనేజర్లు ఉంటార ని పేర్కొన్నారు. పర్యాటక పరంగా జిల్లాల్లోని పర్యాటక శాఖ అధికారులకు, కార్పొరేషన్ అధికారుల మధ్య వీరు సమన్వయం చేస్తారు. -
కీలక కేడర్‌లో భారీ మార్పులు!
ప్రత్యూష్‌సిన్హా కమిటీ తుది కసరత్తు పూర్తి తెలంగాణకు ఆంధ్రా సీఎం పేషీ ముఖ్యకార్యదర్శి అజయ్‌సహానీ ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ నుంచి బీపీ ఆచార్య, బీఆర్ మీనాలు త్వరలో ప్రధానమంత్రికి ఫైలు.. వారంలో జాబితా ప్రకటన! సాక్షి, న్యూఢిల్లీ: అఖిల భారత సివిల్ సర్వీసెస్ అధికారుల తుది కేటాయింపు జాబితాలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. దాదాపు 20 మంది అధికారుల కేడర్‌లో మార్పులు, చేర్పులు చేస్తూ ప్రత్యూష్‌సిన్హా కమిటీ తుది జాబితాను ఖరారు చేసినట్లు ఆ కమిటీ వర్గాలు తెలిపాయి. అఖిల భారత అధికారుల కేటాయింపునకు సంబంధించి గత నెల చివరలో ముసాయిదా జాబితా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జాబితాపై ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల నుంచి దాదాపు వందకు పైగా అభ్యంతరాలు వచ్చాయి. ఈ అభ్యంతరాలను చైర్మన్ ప్రత్యూష్‌సిన్హా నేతృత్వంలో కమిటీ సోమవారం ఢిల్లీలో సమావేశమై పరిశీలించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు ఐ.వై.ఆర్.కృష్ణారావు, రాజీవ్‌శర్మలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. దాదాపు నాలుగు గంటల పాటు భేటీ అయిన కమిటీ భారీ మార్పులతో తుది జాబితాను సిద్ధం చేసింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ స్థానికత కలిగిన అధికారులను తెలంగాణకు కేటాయించడం, 1983 బ్యాచ్ బినయ్‌కుమార్ కేంద్ర సర్వీసును పరిగణనలోకి తీసుకోవద్దని చేసిన విజ్ఞప్తికి ప్రత్యూష్‌సిన్హా పెద్ద పీట వేసినట్లు చెప్తున్నారు. తాత్కాలిక కేటాయింపులో బినయ్కుమార్ను ఆంధ్రాకు కేటాయించారు. అయితే తెలంగాణకు కేటాయిస్తే భవిష్యత్‌లో సీఎస్ అయ్యే అవకాశం ఉన్నందున బినయ్‌కుమార్ కేంద్ర సర్వీసును పరిగణనలోకి తీసుకోరాదని విజ్ఞప్తిచేశారు. దీంతో పాటు మరికొన్ని ఇతర అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న కమిటీ తుది జాబితాలో భారీ మార్పులు చేసింది. ప్రధానంగా ముసాయిదా జాబితాలో కేటాయింపు ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు ఖరారైన బినయ్‌కుమార్ అభ్యంతరాన్ని పరిశీలించడంతో రోస్టర్‌లో మార్పులు చోటుచేసుకున్నట్టు సమాచారం. కేంద్ర సర్వీసును తీసేసి రాష్ట్ర సర్వీసును మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం ద్వారా ఈ జాబితాలో మార్పులు చోటుచేసుకున్నాయి. అలాగే ఔట్ సైడర్ అధికారులు ఇతర రాష్ట్రాల్లో పని చేసి ఇక్కడికి బదిలీ అయి రావడం కారణంగా వారిని సంబంధిత బ్యాచ్‌లో చివరగా తీసుకుని సర్వీసును లెక్కించినట్టు సమాచారం. ఈ జాబితాను నేడో రేపో కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ ప్రధానమంత్రికి పంపనుంది. ప్రధానమంత్రి ఆమోదించిన తరువాత ఈ తుది జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. ఈ ప్రక్రియకు వారం రోజులు పట్టే అవకాశం ఉందని కమిటీ వర్గాలు తెలిపాయి. మారిన అధికారుల కేడర్ ఇలా..! తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు..: ఎస్.ఎస్.రావత్, పి.వి.రమేశ్, బి.పి.ఆచార్య, బి.ఆర్.మీనా, ఆధిత్యనాథ్‌దాస్, దినేష్‌కుమార్, జె.రామానంద్, శాంతికుమారి, వీణా ఈష్, అనంతరాం, నీలం సహాని, షాలినిమిశ్రా తదితరులు ఉన్నారు. ఏపీ నుంచి తెలంగాణకు..: బినయ్‌కుమార్, అజయ్‌సహానీ, అజయ్‌జైన్, అదర్‌సిన్హా, రంజీవ్ ఆర్ ఆచార్య తదితరులున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ స్థానికత కలిగిన ఐఏఎస్ అధికారి జె.ఎస్.వి.ప్రసాద్ అభ్యర్థనను కమిటీ తిరస్కరించింది. ఆయన తెలంగాణలోనే ఉంటారు.