మైనింగ్ రంగ దిగ్గజం ఎన్‌ఎండీసీ ముడి ఇనుము ధరను గణనీయంగా తగ్గిం చింది.
న్యూఢిల్లీ: మైనింగ్ రంగ దిగ్గజం ఎన్‌ఎండీసీ ముడి ఇనుము ధరను గణనీయంగా తగ్గిం చింది. జనవరిలో రూ.3,060 ఉన్న టన్ను ఫైన్స్ రకం ధర కాస్తా ఇప్పుడు రూ.1,460కి వచ్చి చేరింది. సెప్టెంబర్‌లో ఈ ధర రూ. 1,660 ఉంది. హయ్యర్ గ్రేడ్ ముడి ఇనుము ధర 41 శాతం తగ్గి రూ.2,500గా ఉంది.
డిమాండ్ పడిపోయిన నేపథ్యంలో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. క్రితం ఏడాదితో పోలిస్తే ఏప్రిల్-ఆగస్టులో ఎన్‌ఎండీసీ అమ్మకాలు 17 శాతం తగ్గి 11.27 మిలియన్ టన్నులు నమోదైంది. ఉత్పత్తి 12.10 నుంచి 10.52 మిలియన్ టన్నులకు చేరింది.