భారత ఉక్కు మంత్రిత్వశాఖకు చెందిన నవరత్న ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ), హైదరాబాద్‌లోని నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఎన్‌ఎండీసీ).. ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా మొత్తం 63 జూనియర్ ఆఫీసర్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎన్‌ఎండీసీ
నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌ఎండీసీ).. ఇనుప ఖనిజం, రాగి, రాక్‌ఫాస్పెట్, సున్నపురాయి, డోల్‌మైట్, జిప్సం, మాగ్నసైట్, డైమండ్ వంటి ఖనిజాల అన్వేషణ చేస్తోంది. ఇనుప ఖనిజాన్ని ఉత్పత్తి, ఎగుమతి చేయడంలో ఎన్‌ఎండీసీ దేశంలోనే అగ్రగామీ సంస్థ. అంతేకాకుండా ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌లో ఎన్‌ఎండీసీ 3.0 ఎమ్‌టీపీఏ ఇంటిగ్రేటెడ్ స్టీల్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తుంది. ఎప్పటిప్పుడు మానవ వనరుల అవసరాలకు అనుగుణంగా ఖాళీల ను భర్తీచేసే ఎన్‌ఎండీసీ.. తాజాగా జూనియర్ ఆఫీసర్ ట్రైనీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
పోస్టుల వివరాలు
జూనియర్ ఆఫీసర్(మైనింగ్) ట్రైనీ–28 :
» విద్యార్హతలు: మైనింగ్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు ఓపెన్‌కాస్ట్ మోటాలిఫెరస్ మైన్‌కు సంబంధించిన ఫోర్‌మెన్స్ సర్టిఫికేట్‌ను కలిగి ఉండాలి. లేదా మైనింగ్‌లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఓపెన్‌కాస్ట్ మోటాలిఫెరస్ మైన్‌కు సంబంధించిన మైన్స్ మేనేజర్ సర్టిఫికేట్‌ను పొంది ఉండాలి. అలాగే సంబంధిత పనిలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి.
జూనియర్ ఆఫీసర్ (మెకానికల్ ) ట్రైనీ –17
» విద్యార్హతలు : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా/మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతేకాకుండా సంబంధిత పనిలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి.
జూనియర్ ఆఫీసర్(ఎలక్ట్రికల్)ట్రైనీ –13 :
» విద్యార్హతలు: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమాతోపాటు ఎలక్ట్రికల్ సూపర్‌వైజరీ సర్టిఫికేట్(మైనింగ్)/ ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో ఐదేళ్ల అనుభవం ఉండాలి.
జూనియర్ ఆఫీసర్(సివిల్) ట్రైనీ–05 :
» విద్యార్హతలు: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల/సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి.
» వయసు: 32ఏళ్లకు మించుకుండా ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు–05ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు గరిష్టంగా వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం
ఆన్‌లైన్ టెస్ట్(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), సూపర్‌వైజరీ స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్ టెస్ట్‌ను ఆబ్జెక్టివ్ మల్టిపుల్ ఛాయిస్ పద్దతిలో మొత్తం100 మార్కులకు నిర్వహిస్తారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారిని సూపర్‌వైజరీ టెస్ట్‌కు పిలుస్తారు. ఈ పరీక్ష కూడా 100 మార్కులకు ఉంటుంది. సూపర్‌వైజరీ టెస్ట్‌ను అర్హత పరీక్షగా మాత్రమే పరిగణిస్తారు. కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్ టెస్ట్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థుల తుది జాబితా రూపొందించి.. నియామకం ఖరారు చేస్తారు.
ముఖ్యమైన సమాచారం
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
» దరఖాస్తు చివరి తేదీ : 23.03.2021
» వెబ్‌సైట్ : https://www.nmdc.co.in/Careers/Default.aspx
Comments
Please login to add a commentAdd a comment