ఈ ఏడాది టార్గెట్ కి మించి ఆదాయ పన్ను వసూలు చేశామని ప్రిన్సిపల్ చీఫ్ ఇన్ కమ్ టాక్స్ ఆఫీసర్ సురేశ్ బాబు తెలిపారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం రూ.36 వేల 663 కోట్ల పన్ను వసూలు చేశామని వివరించారు. గత ఏడాదితో పోలిస్తే ఇది 15.4 శాతం ఎక్కువ అని అన్నారు. దేశంలోనే తమిళ నాడు తర్వాత తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో అత్యధికంగా పన్ను వసూలైందని తెలియజేశారు.
ఈఏడాది అత్యధికంగా NMDC రూ1600 కోట్లు ఆదాయ పన్ను చెల్లించిందని వివరించారు. తర్వాతి స్థానంలో రూ. 833 కోట్లతో సింగరేణి, రూ.469 కోట్లతో అరబిందో ఫార్మా ఉన్నాయి. మాటీవీ రూ. 480 కోట్లు చెల్లించిందని, డాక్టర్ రెడ్డీ ల్యాబ్స్ రూ.400 కోట్లు ఇన్ కం టాక్స్ కట్టిందని సురేశ్ బాబు తెలియజేశారు.
కాగా.. పన్ను ఎగవేత దార్ల పేర్లు త్వరలోనే వెబ్ సైట్ లో పెడతామని చెప్పారు. టాక్స్ ఎగవేత దారులపై 36 రకాల కేసులు నమోదు చేయనున్నట్లు వివరించారు. అప్పుడు అకౌంట్లు చూపి 10 వేల మంది పైనా కేసులు నమోదు చేయనున్నారు.