ఘనంగా టీషర్ట్, మెడల్ లాంచ్ ఈవెంట్
ముఖ్య అతిథిగా ప్రముఖ బాక్సర్ నిఖత్ జరీన్
సాక్షి, సిటీబ్యూరో: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మోస్ట్ అవెయిటెడ్ ఎన్‌ఎండీసీ హైదరాబాద్ మారథాన్ ఈవెంట్ మరో నాలుగు రోజుల్లో జరగనుంది. ప్రతి సంవత్సరం కంటే ఈసారి సరికొత్తగా మన ముందుకు రానుంది. నగరంలోని ఓ హోటల్‌లో మారథాన్‌కు సంబంధించి టీషర్ట్, మెడల్స్ లాంచ్ ఈవెంట్ మంగళవారం జరిగింది. ఇందులో ఎన్‌ఎండీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అమితవ ముఖర్జీ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు హెడ్ బ్రాంచ్ బ్యాంకింగ్ సౌత్ నిరీశ్ లలన్, ప్రముఖ బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొన్నారు.
13వ ఎడిషన్ మారథాన్‌కు వర్లడ్ అథ్లెటిక్స్ గుర్తింపు రావడంతో మరింత ప్రత్యేకత సంతరించుకుందని రేస్ డైరెక్టర్ రాజేశ్ వెచ్చా పేర్కొన్నారు. 30 రాష్ట్రాల నుంచి దాదాపు ఈ ఏడాది 25,500 మంది మారథాన్‌లో పాల్గొనేందుకు రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు. ఈ మారథాన్‌కు ప్రపంచస్థాయి ఏర్పాట్లు చేశామని వివరించారు. మారథాన్‌లో పాల్గొనే రన్నర్ల సంఖ్య పరంగా చూసుకుంటే.. భారత్‌లోనే అతిపెద్ద రెండో పరుగు ఇదని పేర్కొన్నారు.
ప్రైజ్‌మనీ.. రూ.48 లక్షలు
ఈ మారథాన్‌లో 42 కిలోమీటర్ల దూరం రన్నర్లు పరుగెత్తనున్నారు. ఫుల్ మారథాన్‌తో పాటు హాఫ్ మారథాన్, 10 కిలోమీటర్లు, 5 కిలోమీటర్ల పరుగు కూడా ఉంటుంది. ఇటీవలే ఈ మారథాన్ డ్రైరన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ మారథాన్‌లో మొత్తం రూ.48 లక్షల ప్రైజ్‌మనీ ఇవ్వనున్నారు. మారథాన్ మొదటి రోజైన 24వ తేదీన ఉదయం 7 గంటలకు ఫన్ రన్ పేరుతో 5కే రన్ ఉంటుంది. ఇది అసలు మారథాన్‌కు కర్టెన్‌రైజర్ లాంటిది. ప్రతిఒక్కరూ రన్నింగ్‌ను సెలబ్రేట్ చేసుకునేందుకు ఈ ఫన్ రన్ ఏర్పాటు చేశారు.
ఇది హైటెక్స్‌లో ఉంటుంది. ఇక మరుసటి రోజు అసలు ఫుల్ మారథాన్ ప్రారంభం అవుతుంది. పీపుల్స్ ప్లాజా వద్ద ఉదయం మారథాన్ ప్రారంభం అవుతుంది. రాజ్‌భవన్ రోడ్డు, పంజాగుట్ట ఫ్లైఓవర్, కేబీఆర్ పార్కు, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, మైండ్ స్పేస్ జంక్షన్, బయోడైవర్సిటీ జంక్షన్, గచి్చ»ౌలి ఫ్లైఓవర్, హెచ్‌సీయూ మీదుగా గచి్చబౌలి అథ్లెటిక్ స్టేడియం వద్ద ముగుస్తుంది. హాఫ్ మారథాన్ పీపుల్స్ ప్లాజా వద్ద ప్రారంభమై.. 21 కి.మీ. దూరం ఉండేలా నిర్దేశించిన మార్గంలో రన్ ఉంటుంది. గచ్చిబౌలి స్టేడియం వద్ద ముగుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment