ఏపీలో బంగారం తవ్వకాలు! ఎన్‌ఎండీసీ రూ. 500 కోట్ల వ్యయం.. | NMDC plans 500 crore investment in first gold block andhra pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో బంగారం తవ్వకాలు! ఎన్‌ఎండీసీ రూ. 500 కోట్ల వ్యయం..

Published Tue, Jun 27 2023 8:40 AM | Last Updated on Tue, Jun 27 2023 8:42 AM

NMDC plans 500 crore investment in first gold block andhra pradesh - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మైనింగ్‌  దిగ్గజం ఎన్‌ఎండీసీ.. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఉన్న బంగారు గని కోసం రూ.500 కోట్లు వ్యయం చేసే అవకాశం ఉందని సమాచారం. గుడుపల్లి మండలంలో ఏడు గ్రామాల్లో విస్తరించిన ఈ గోల్డ్‌ బ్లాక్‌కు సంబంధించిన లీజును ఎన్‌ఎండీసీ త్వరలో దక్కించుకోనుంది.

ప్రాజెక్ట్‌ విషయమై గతేడాది చివరలో ఏపీ ప్రభుత్వంతో ఎన్‌ఎండీసీ చేతులు కలిపింది. నిబంధనల ప్రకారం లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌పై సంతకం చేసిన మూడేళ్లలో మైనింగ్‌ లీజు పొందాల్సి ఉంటుంది. ఈ గనిలో 18.3 లక్షల టన్నుల బంగారు ఖనిజం ఉన్నట్టు అంచనా. టన్నుకు 5.15 గ్రాముల పుత్తడి వెలికితీయవచ్చని ఎన్‌ఎండీసీ భావిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement