దేశంలో కుటుంబాల మొత్తం ఆస్తుల్లో 50.7 శాతం రియల్‌ఎస్టేట్‌దే
15.5 శాతంతోరెండో స్థానంలో బంగారం
నగదు, ఫిక్సిడ్ డిపాజిట్లు17.4 శాతమే
ప్రముఖ వాణిజ్య టీవీ ఛానల్ నివేదిక
దేశంలోని మొత్తం కుటుంబాల ఆస్తుల్లో సగం శాతానికి పైగా వ్యవసాయ, వ్యవసాయేతర భూములతో పాటు ఇళ్లరూపంలోనే ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి.ఈ మేరకు అమెరికాలో ప్రముఖ పెట్టుబడి సంస్థగా పేరున్న జెఫరీస్‌తో పాటు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియాగణాంకాల ఆధారంగా వాణిజ్య వార్తా కథనాలు మాత్రమే ప్రసారం చేసే ప్రముఖ టీవీ ఛానల్ నివేదిక స్పష్టంచేస్తోంది.
ఈ నివేదిక ప్రకారం ఇండియాలోని కుటుంబాల అన్ని రకాల ఆస్తుల మొత్తం విలువ 11.1 ట్రిలియన్ అమెరికన్ డాలర్లు. (రూ.పదికోట్ల కోట్లు) ఈ ఆస్తులు ఏ రంగాల్లో ఉన్నాయో పరిశీలించిన ఆ టీవీ ఛానల్ .. సగానికి పైగా అనగా 50.7 శాతం వ్యవసాయ, వ్యవసాయేతర భూములతో పాటుఇళ్ల రూపంలోనే ఉన్నాయని గుర్తించింది. – సాక్షి, అమరావతి
పీఎఫ్‌లో కన్నా ఇన్సూరెన్స్‌లోనే పెట్టుబడులు అధికం
వృద్ధాప్యంలో ఆర్థిక అవసరాలకు ఉపయోగపడే ప్రావిడెంట్ పెన్షన్ ఫండ్స్‌లో పెట్టుబడులు కన్నా మన దేశంలోని కుటుంబాలు అత్యధిక మొత్తం ఇన్సూరెన్స్ పాలసీల రూపంలోనే పెట్టిన పెట్టుబడులే అధికమని ఆ గణాంకాలు మరో ఆశ్చర్యకరమైన అంశాన్ని వెలుగులో తీసుకొచ్చాయి.
దేశీయ కుటుంబాలు కలిగి ఉన్న మొత్తం ఆస్తుల్లో 5.8 శాతం మేర ప్రావిడెంట్ పెన్షన్ ఫండ్స్ రూపంలో ఉండగా, ఇన్సూరెన్స్ పాలసీల రూపంలో 5.9 శాతం మేర ఆస్తులున్నాయి. మన దేశ మహిళలకు అత్యంత ప్రీతిపాత్రమైన బంగారం.. దేశీయ మొత్తం ఆస్తుల్లో రెండో అతి పెద్ద స్థానంలో 15.5 శాతం మేర ఉండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment