తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. భారీ వరదలతో టెలికాం సేవల్లో అంతరాయం ఏర్పడింది. గడిచిన 24 గంటల నుంచి వర్షాలు కాస్త నెమ్మదించడంతో టెలికాం కంపెనీలు తమ సేవల పునరుద్ధరణపై దృష్టి సారించాయి. అందులో భాగంగా ప్రముఖ టెలికాం సేవల సంస్థ జియో తెలుగు రాష్ట్రాల్లో వేగంగా సేవలను పునరుద్ధరించింది. వరదల వల్ల దెబ్బతిన్న టెలికాం నెట్‌వర్క్‌ను మెరుగ్గా నిర్వహించేలా క్షేత్ర స్థాయిలో సిబ్బందిని రంగంలోకి దించింది. వరద ఉధృతి పూర్తిగా తగ్గకముందే తిరిగి జియో తన సేవలు పునరుద్ధరించేలా చర్యలు తీసుకుంది.
రిలయన్స్ జియో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తన నెట్‌వర్క్‌ను మెరుగుపరచడానికి గణనీయమైన పెట్టుబడులు పెట్టింది. ఇప్పటికే రూ.6,500 కోట్ల పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్‌లో 5జీ సేవలను ప్రారంభించింది. ముందుగా తిరుమల, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు వంటి నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. క్రమంగా ఈ సర్వీసును విస్తరిస్తున్నారు. తెలంగాణలోనూ జియో 5జీ సేవలు అందిస్తోంది. దేశం అంతటా హై-స్పీడ్ ఇంటర్నెట్, మెరుగైన కనెక్టివిటీని అందించడానికి జియో చర్యలు తీసుకుంటుంది.
ఇదీ చదవండి: పరుష పదజాలం, భారీ లక్ష్యాలు.. సెబీ చీఫ్ పనితీరుపై లేఖ
Comments
Please login to add a commentAdd a comment