భారత్‌లో మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ సేవలందిస్తోన్న ప్రముఖ కంపెనీ రిలయన్స్ ఆఫ్రికాలోనూ తన కార్యకలాపాలు ప్రారంభించనుంది. పశ్చిమ ఆఫ్రికాలోని ఘనా దేశానికి చెందిన ఒక కంపెనీతో 5జీ షేర్డ్ నెట్‌వర్క్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సొల్యూషన్‌లను అందించేందుకు ఒప్పందం చేసుకోనుంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో భాగంగా ఉన్న రాడిసిస్ అనే కంపెనీ ఈ ఏడాది చివరి నాటికి ఘనాలో తన కార్యకలాపాలు ప్రారంభించాలని యోచిస్తున్నట్లు కొన్ని మీడియా సంస్థలు కథనాలు వెల్లడించాయి. వాటి ప్రకారం..నెక్స్ట్ జనరేషన్ ఇన్‌ఫ్రాకో(ఎన్‌జీఐసీ) అనే ఘనా కంపెనీకి అవసరమయ్యే కీలకమైన మౌలిక సదుపాయాలు, అప్లికేషన్‌లు, స్మార్ట్‌ఫోన్‌లను రాడిసిస్ అందిస్తుంది. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లో మెరుగైన డిజిటల్ సేవలను అందించేలా కంపెనీ పని చేస్తోందని ఎన్‌జీఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హర్కిరిత్ సింగ్ బ్లూమ్‌బెర్గ్ నివేదికలో పేర్కొన్నారు.
భారతీ ఎయిర్‌టెల్ ఇప్పటికే 14 ఆఫ్రికన్ దేశాల్లో మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిస్తోంది. సునీల్ భారతి మిట్టల్ నేతృత్వంలోని ఈ కంపెనీ ఆఫ్రికాలో రెండో అతిపెద్ద టెలికాం ఆపరేటర్‌గా చలామణి అవుతోంది. ఇకపై రిలయన్స్ కూడా అక్కడ టెలికాం సేవలు ప్రారంభించడం పట్ల ఇరుకంపెనీల మధ్య పోటీ నెలకొంటుందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఎన్‌జీఐసీ పదేళ్లపాటు ఘనాలో 5జీ సేవలను అందించేలా అనుమతులను పొందింది. అయితే ఆ లైసెన్స్‌ను పదిహేనేళ్లపాటు పొడిగించే అవకాశం ఉంది. ఈ కంపెనీ మూడేళ్ల మూలధన వ్యయం 145 మిలియన్ డాలర్లని అంచనా. ఎలాగైతే భారత్‌లో జియోను ఆవిష్కరించి టెలికాంరంగంలో రిలయన్స్ ప్రత్యేకత చాటుకుందో అక్కడ కూడా తనదైన ముద్రవేయాలని చూస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment