ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో ఉన్న ఏఎం గ్రీన్ (గతంలో గ్రీన్‌కో జీరోసీ) సంస్థకు చెందిన గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు అంతర్జాతీయ గుర్తింపును సాధించింది. యూరప్‌కు చెందిన పునరుత్పాదక ఇంధన ప్రోత్సాహక సంస్థ సర్టిఫ్‌హై నుంచి ప్రీ-సర్టిఫికేషన్ పొందింది.
పునరుత్పాదక ఇంధనాల కోసం కఠినమైన యూరోపియన్ మార్కెట్ ప్రమాణాలకు అనుగుణంగా సర్టిఫ్‌హై ఈయూ పునరుత్పాదక ఇంధనాలు నాన్-బయోలాజికల్ ఆరిజిన్ (ఆర్ఎఫ్ఎన్‌బీఓ) ప్రీ-సర్టిఫికేషన్ పొందిన మొదటి భారతీయ ప్రాజెక్టుగా ఏఎం గ్రీన్ నిలిచింది. ఈ గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో జగన్ ప్రభుత్వంలో ఏర్పాటైంది.
కార్బన్ రహిత ఇంధన వనరులను ఉపయోగించి గ్రీన్ హైడ్రోజన్, అమ్మోనియాను ఉత్పత్తి చేయడానికి ఏఎం గ్రీన్ నిబద్ధతను ప్రీ-సర్టిఫికేషన్ నొక్కి చెబుతుంది. ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక రంగాలను డీకార్బోనేట్ చేయడానికి కీలకమైన ఈ దశలో రవాణా, పరిశ్రమలో సుస్థిరత కోసం ఈయూ నియంత్రణ ప్రమాణాలను చేరుకోవడానికి కంపెనీ సంసిద్ధతను ఈ ప్రీ-సర్టిఫికేషన్ ధ్రువీకరిస్తుంది. లాభదాయకమైన ఈయూ ఆర్ఎఫ్ఎన్‌బీఓ మార్కెట్‌ను సమర్థవంతంగా యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుంది.
సర్టిఫ్‌హై ప్రీ-సర్టిఫికేషన్ ప్రాముఖ్యతను ఏఎం గ్రీన్ ప్రెసిడెంట్ మహేష్ కొల్లి నొక్కి చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భారత పునరుత్పాదక ఇంధన సామర్థ్యాలను ముందుకు తీసుకెళ్లడంలో ఏఎం గ్రీన్ పాత్రను పునరుద్ఘాటించారు. 2030 నాటికి కాకినాడలో ఏడాదికి 10 లక్షల టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
మహేష్ కొల్లి, ఏఎం గ్రీన్ అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment