విమానం గాల్లో ఉండగానే ఓ మహిళ శిశువుకు జన్మనిచ్చింది. సింగపూర్ నుంచి చెన్నైకి బయలుదేరిన ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణిస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ మార్గమధ్యలో మగబిడ్డకు జన్మనిచ్చారు.
విజయవాడకు చెందిన దీప్తి సరసు వీర వెంకటరామన్(28) అనే గర్భిణి సింగపూర్ నుంచి చెన్నైకి బయలుదేరారు. గురువారం తెల్లవారుజామున విమానం గాల్లో ఉన్నప్పుడే పురిటి నొప్పులు మొదలయ్యాయి. విమాన సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే దీప్తి కూర్చున్న చోట చుట్టూ వస్త్రాలు ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు సమాచారం అందించారు. అదే విమానంలో ప్రయాణిస్తున్న ఒక డాక్టర్, ఫ్లైట్ అటెండెంట్లు, మహిళా ప్రయాణికుల సహాయంతో గర్భిణి మగ బిడ్డకు జన్మనిచ్చారు.
ఇదీ చదవండి: సీప్లేన్ ఏరోడ్రోమ్ నిబంధనల సడలింపు
పైలట్ అప్పటికే చెన్నై ఎయిర్‌పోర్ట్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించడంతో ఉదయం 4:30కు ల్యాండ్ అయ్యే సమయానికి గ్రౌండ్ సిబ్బంది, వైద్యులు చేరుకుని వైద్య పరీక్షలు చేశారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. మహిళా ప్రయాణికులు, సిబ్బంది, డాక్టర్‌ను పలువురు ప్రశంసించారు. అనంతరం తల్లి, బిడ్డలను అంబులెన్స్‌లో స్థానిక ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment