women delivers
-
విమానంలోనే శిశువుకు జన్మనిచ్చిన గర్భిణి
విమానం గాల్లో ఉండగానే ఓ మహిళ శిశువుకు జన్మనిచ్చింది. సింగపూర్ నుంచి చెన్నైకి బయలుదేరిన ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణిస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ మార్గమధ్యలో మగబిడ్డకు జన్మనిచ్చారు.విజయవాడకు చెందిన దీప్తి సరసు వీర వెంకటరామన్(28) అనే గర్భిణి సింగపూర్ నుంచి చెన్నైకి బయలుదేరారు. గురువారం తెల్లవారుజామున విమానం గాల్లో ఉన్నప్పుడే పురిటి నొప్పులు మొదలయ్యాయి. విమాన సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే దీప్తి కూర్చున్న చోట చుట్టూ వస్త్రాలు ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు సమాచారం అందించారు. అదే విమానంలో ప్రయాణిస్తున్న ఒక డాక్టర్, ఫ్లైట్ అటెండెంట్లు, మహిళా ప్రయాణికుల సహాయంతో గర్భిణి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఇదీ చదవండి: సీప్లేన్ ఏరోడ్రోమ్ నిబంధనల సడలింపుపైలట్ అప్పటికే చెన్నై ఎయిర్పోర్ట్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించడంతో ఉదయం 4:30కు ల్యాండ్ అయ్యే సమయానికి గ్రౌండ్ సిబ్బంది, వైద్యులు చేరుకుని వైద్య పరీక్షలు చేశారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. మహిళా ప్రయాణికులు, సిబ్బంది, డాక్టర్‌ను పలువురు ప్రశంసించారు. అనంతరం తల్లి, బిడ్డలను అంబులెన్స్‌లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. -
రామ మందిర ప్రతిష్టాపన వేళ.. సిజేరియన్లకు తల్లుల అభ్యర్థనలు
కాన్పూర్: అయోధ్యలోని రామ మందిరం పవిత్రోత్సవం సందర్భంగా జనవరి 22న సిజేరియన్ ప్రసవాలు చేయాలని పలువురు గర్భిణులు వైద్యులను అభ్యర్థిస్తున్నారు. అదే రోజు శిశువులకు జన్మనిచ్చేలా సిజేరియన్ చేయాలని 14 వ్రాతపూర్వక అభ్యర్థనలు అందాయని గణేష్ శంకర్ మెమోరియల్ మెడికల్ కాలేజీలో గైనకాలజీ విభాగానికి ఇన్‌చార్జీగా వ్యవహరిస్తున్న సీమా ద్వివేది తెలిపారు. తమ ఆస్పత్రిలో జనవరి 22న 35 సిజేరియన్ ఆపరేషన్లకు ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. తమ డెలివరీ తేదీలు కొన్ని రోజుల ముందు లేదా జనవరి 22 తర్వాత అయినప్పటికీ గర్భిణులు శుభ దినంగా పరిగణించి వైద్యులకు అభ్యర్థనలు చేశారని సీమా తెలిపారు. పూజారులు ఇచ్చిన ముహూర్తంలో డెలివరీ చేయాలని తల్లులు, కుటుంబ సభ్యులు ఒత్తిడి చేయడంతో తాను నిర్ణీత సమయంలో ఆపరేషన్ చేసిన వివిధ అనుభవాలను ఆమె వివరించారు. అలా చేయడం ద్వారా తల్లి, బిడ్డకు తలెత్తే సమస్యలను కుటుంబ సభ్యులు పట్టించుకోకపోవడంపై ఆందోళన కలిగిస్తోందని అన్నారు. రాముడు వీరత్వానికి, చిత్తశుద్ధికి, విధేయతకు ప్రతీక అని ప్రజలు నమ్ముతారు. అందుకే ఆలయంలో జరిగే ప్రాణ ప్రతిష్ఠ రోజున జన్మించిన శిశువులు కూడా అదే లక్షణాలను కలిగి ఉంటారని వారు నమ్ముతున్నట్లు సీమా ద్వివేది తెలిపారు. ఇదీ చదవండి: అయోధ్య రామునిపై పాట.. సింగర్‌ని అభినందించిన ప్రధాని మోదీ -
సరికొత్త రచన..ఫుడ్ డెలివరీ గర్ల్
కరోనా వచ్చాకా పెద్దపెద్ద కంపెనీలు నష్టాల బాట పడితే మరికొన్ని కంపెనీలు మూతపడ్డాయి. కొంతమంది ఉద్యోగుల కొలువులు కోతకు గురైతే రోజువారి కూలిపని చేసుకునే నిరుపేదల బతుకులు రోడ్డున పడ్డాయి. లాక్‌డౌన్‌తో దినసరి కూలీల అరకొర ఆదాయం కూడా ఆవిరైపోయింది. సరిగ్గా ఈ కోవకు చెందిన రచన ఒకపక్క చదువుకుంటూ మరోపక్క ఫుడ్ డెలివరి గర్ల్‌గా పనిచేస్తూ సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఇటు తన చదువుకయ్యే ఖర్చులు నెట్టుకొస్తూనే, కుటుంబానికి ఆర్థిక ఆసరాగా నిలుస్తోంది. వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన మామిడిపెల్లి రచనది నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు రోజువారి కూలిపని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. దీంతో ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వ స్కూలు, కాలేజిలో చదువుకుంది. హైదరాబాద్‌లోని ఓ హోటల్ మేనేజ్మెంట్ కాలేజిలో డిప్లామా చదివేందుకు రచనకు అడ్మిషన్ దొరకడంతో రచన హైదరాబాద్ వచ్చింది. సిటీæఅంటే ఖర్చులు ఎక్కువ. వాటిని భరించే స్థోమత రచనకు లేదు. దీంతో ఉదయాన్నే నాలుగు గంటలకు నిద్రలేచి ఇంటింటికి తిరిగి పాల ప్యాకెట్లను డెలివరి చేస్తూ కొంత ఆదాయాన్ని సంపాదించేది. తన సొంతఖర్చులకు కొంత వాడుకుని మిగతాది తల్లిదండ్రులకు పంపించేది. మూలిగే నక్కమీద తాటికాయపడ్డట్టుగా... కరోనా విజృంభణతో కూలి పనిచేసే వారి బతుకులు చితికిపోయాయి. దీంతో రచన మరికొంత ఎక్కువ సంపాదించి తల్లిదండ్రులను ఆదుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే ఎక్కువగా అబ్బాయిలు మాత్రమే చేసే.. ఫుడ్ డెలివరి ఉద్యోగాన్ని ఎంచుకుంది. జొమాటో ఫుడ్ డెలివరి యాప్‌లో పనిచేస్తూ తన ఆదాయాన్ని మరికొంత పెంచుకుని తల్లిదండ్రులకు ఆసరాగా నిలుస్తోంది. ‘‘అబ్బాయిలు చేసే ఉద్యోగమే అయినప్పటికి నా ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో నేను ఫుడ్ డెలివరి జాబ్‌ను ఎంచుకున్నాను. ఇది నాకు, నా కుటుంబానికి మంచి ఆర్థిక ఆధారాన్ని ఇస్తుంది. హోటల్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తయ్యాక నాకు మంచి ఉద్యోగం వస్తుంది. అప్పుడు నా కష్టాలు కూడా తీరతాయి’’ అని రచన ఆత్మవిశ్వాసంతో చెబుతోంది. -
కడుపులో కాటన్ పెట్టి కుట్టేసిన వైద్యులు
షాద్‌నగర్‌టౌన్ : ప్రసవం కోసం ఓ మహిళ ఆసుపత్రికి వచ్చింది... వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేశారు. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే వైద్యులు ఆపరేషన్ సమయంలో ఆమె కడుపుకోసి కాటన్‌తో మూసేసి కుట్టేశారు. ప్రస్తుతం బాధిత మహిళ హైదరాబాద్‌లోని ఓవైసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చావుబతుకుల మధ్య పోరాడుతోంది. బాధితురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు... రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం బొబ్బిలిగామ గ్రామానికి చెందిన హరిత అనే మహిళ నిండు గర్భిణి. 2017 అక్టోబర్ 3న కుటుంబ సభ్యులు ఆమెను ప్రసవం కోసం షాద్‌నగర్ పట్టణంలోని పరిగి రోడ్డులో బస్టాండ్ ఎదురుగా ఉన్న విజయ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆసుపత్రి వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించి ఆపరేషన్ చేశారు. హరిత పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆపరేషన్ అనంతరం హరిత స్వగ్రామానికి వెళ్లింది. ఆపరేషన్ నిర్వహించిన రోజు నుంచి హరిత ఆరోగ్యం సరిగా ఉండకపోవడంతో దిగులు చెందిన బాధితురాలి కుటుంబ సభ్యులు ఆమెను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుప్రతికి తరలించారు. కాటన్ పేగులకు చుట్టుకుని అస్వస్థత.. ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యులు హరితకు స్కానింగ్ నిర్వహించారు. కడుపులో కాటన్ ఉన్నట్లు గుర్తించి బాధితురాలి కుటుంబ సభ్యులకు విషయం తెలిపారు. ప్రసవం కోసం వచ్చినప్పుడు ఆపరేషన్ నిర్వహించి కడుపులో కాటన్ ఉంచి కుట్లు వేయడమే అస్వస్థతకు కారణమని వైద్యులు నిర్ధారించారు. హరిత కడుపులో ఉన్న కాటన్ పేగులకు చుట్టుకొని పోవడంతో ఉస్మానియా వైద్యులు హరితకు మరోసారి ఆపరేషన్ చేసి కడుపులో ఉన్న కాటన్‌ను తొలగించారు. అయితే ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉందని ఆసుపత్రి వైద్యులు పేర్కొంటున్నారు. కుటుంబ సభ్యులు ఆమెను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓవైసీ ఆసుప్రతిలో చేర్చగా అక్కడ ఐసీయూలో చికిత్స పొందుతోంది. షాద్‌నగర్‌లోని విజయ ఆసుపత్రి వైద్యులు హరిత ఆపరేషన్ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు హరిత కడుపులో కాటన్ ఉన్న విషయాన్ని తెలుసుకున్న బాధితురాలి సోదరుడు పి.రవి నిర్లక్ష్యంగా వ్యవహరించిన విజయ ఆసుపత్రి వైద్యులపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరుతూ షాద్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. షాద్‌నగర్‌లోని విజయ ఆసుపత్రి వైద్యులు హరితకు ఆపరేషన్ సమయంలో నిర్లక్ష్యంగా వ్యహరించారని, దీంతో ఆమె ఆరోగ్యం క్షీణించిందని, ఉస్మానియా ఆసుపత్రిలో ఆపరేషన్ చేసి హరిత కడుపులో ఉన్న కాటన్‌ను తొలగించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా మారిందని రవి తెలిపారు. దీనికి కారకులైన వైద్యులపై కఠిన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని రవి పేర్కొన్నారు. ఆపరేషన్ మా ఆసుపత్రిలో జరగలేదు హరితకు విజయ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయ లేదు. కేవలం ఆమెకు ఓపీని మాత్రమే చూశాం. హరితను పరీక్షించిన అనంతరం ఆమెను హైదరాబాద్‌లోని ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలకు వెళ్లాలని సూచించాం. పట్టణంలోని సేవాలాల్ ఆసుపత్రిలో ఆపరేషన్ చేశారు. హరిత అనారోగ్యం పాలవడానికి మా ఆసుపత్రికి ఎలాంటి సంబంధం లేదు. – డాక్డర్ చందులాల్‌రాథోడ్, విజయ ఆసుపత్రి వైద్యుడు కేసు నమోదు చేశాం వైద్యుల నిర్లక్ష్యం కారణంగా హరిత అనారోగ్యానికి గురైందని వచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశాం. హరితకు ఆపరేషన్ చేసే సమయంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యహరించి ఆమె కడుపులో కాటన్ ఉంచి కుట్లు వేశారని బాధితురాలి సోదరుడు రవి విజయ ఆసుపత్రి వైద్యులు విజయ, చందూలాల్‌పై ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నాం. – అశోక్‌కుమార్, సీఐ, షాద్‌నగర్‌టౌన్ -
పుట్టిన పిల్లలను మార్చారని బాలింత ఆందోళన
జగిత్యాలక్రైం : జగిత్యాలప్రభుత్వ ఆస్పత్రిలో నర్సు తప్పిదంతో పుట్టిన పిల్లలను మార్చి ఇచ్చారని ఓ బాలింత ఆందోళనకు దిగింది. బుగ్గారం మం డలం మద్దునూర్ గ్రామానికి చెందిన బొంగురాల చామంతి ఈనెల 18న మొదటి కాన్పు కోసం జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. 19న ఉద యం 9.50 గంటలకు ప్రసవం కాగా మగబిడ్డ జన్మించాడు. అదే ఆస్పత్రిలో మేడిపల్లి మండలం కొండాపూర్‌కు చెందిన రజిత మొదటి కాన్పులో 10.13 గంటలకు మగబిడ్డ జన్మించాడు. విధుల్లో ఉన్న నర్సు ఇద్దరు పిల్లలను రజిత కుటుంబ సభ్యులకు ఇచ్చి వారి వేలిముద్రలు తీసుకుంది. రజిత కుటుంబ సభ్యులు కవల పిల్లలు పుట్టారని సంతోషపడ్డారు. కొద్దిసేపటికి చామంతి కుటుంబ సభ్యులు తమ పిల్లాడు ఏడని నిలదీయడంతో రజిత వద్ద 10.13 గంటలకు జన్మించిన బాబును తీసుకువచ్చి చామంతి కుటుంబ సభ్యులకు ఇచ్చారు. దీంతో బాబు తమబాబుకాడని వైద్యులకు తెలుపగా రక్తనమూనాలు సేకరించారు. రక్తపరీక్షల్లో న మూనాలు కలువకపోవడంతో పిల్లల మా ర్పు జరిగిందని బలం చేకూరింది. కాగా ప్రస వం తర్వాత పిల్లలను రజిత కుటుంబ సభ్యులకు అందజేసిన నర్సు సెలవులో వెళ్లడంతో అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయంపై ఆస్పత్రి సూపరిండెంట్ సదామోహన్ను వివరణ కోరగా ఆస్పత్రి సిబ్బంది పొరపాటు ఏమీ లేదని, బాలింత చామంతి అనుమానంతోనే ఇరు శిశువుల డీఎన్ఏ పరీక్షలకు పంపించామని, రిపోర్ట్స్ రాగానే వారికి అందజేస్తాం అని తెలిపారు. -
ఆర్టీసీ బస్సులో మహిళ ప్రసవం
ఆదిలాబాద్(భీమిని): భీమిని మండలం వెంకటాపూర్ వద్ద ఓ మహిళ ఆర్టీసీ బస్సులో ప్రసవించింది. వివరాలు..దహెగాం మండలం పీకలగుండం గ్రామానికి చెందిన కుమ్మరి సరోజ(28) ఆర్టీసీ బస్సులో మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి బయలుదేరగా మార్గమధ్యలో పురిటినొప్పులు ఎక్కువై బస్సులోనే ప్రసవించింది. అనంతరం తల్లీ, బిడ్డను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి, మగబిడ్డ క్షేమంగానే ఉన్నారు.