జగిత్యాలక్రైం : జగిత్యాలప్రభుత్వ ఆస్పత్రిలో నర్సు తప్పిదంతో పుట్టిన పిల్లలను మార్చి ఇచ్చారని ఓ బాలింత ఆందోళనకు దిగింది. బుగ్గారం మం డలం మద్దునూర్ గ్రామానికి చెందిన బొంగురాల చామంతి ఈనెల 18న మొదటి కాన్పు కోసం జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. 19న ఉద యం 9.50 గంటలకు ప్రసవం కాగా మగబిడ్డ జన్మించాడు.
అదే ఆస్పత్రిలో మేడిపల్లి మండలం కొండాపూర్‌కు చెందిన రజిత మొదటి కాన్పులో 10.13 గంటలకు మగబిడ్డ జన్మించాడు. విధుల్లో ఉన్న నర్సు ఇద్దరు పిల్లలను రజిత కుటుంబ సభ్యులకు ఇచ్చి వారి వేలిముద్రలు తీసుకుంది. రజిత కుటుంబ సభ్యులు కవల పిల్లలు పుట్టారని సంతోషపడ్డారు. కొద్దిసేపటికి చామంతి కుటుంబ సభ్యులు తమ పిల్లాడు ఏడని నిలదీయడంతో రజిత వద్ద 10.13 గంటలకు జన్మించిన బాబును తీసుకువచ్చి చామంతి కుటుంబ సభ్యులకు ఇచ్చారు.
దీంతో బాబు తమబాబుకాడని వైద్యులకు తెలుపగా రక్తనమూనాలు సేకరించారు. రక్తపరీక్షల్లో న మూనాలు కలువకపోవడంతో పిల్లల మా ర్పు జరిగిందని బలం చేకూరింది. కాగా ప్రస వం తర్వాత పిల్లలను రజిత కుటుంబ సభ్యులకు అందజేసిన నర్సు సెలవులో వెళ్లడంతో అనుమానాలకు తావిస్తోంది.
ఈ విషయంపై ఆస్పత్రి సూపరిండెంట్ సదామోహన్‌ను వివరణ కోరగా ఆస్పత్రి సిబ్బంది పొరపాటు ఏమీ లేదని, బాలింత చామంతి అనుమానంతోనే ఇరు శిశువుల డీఎన్‌ఏ పరీక్షలకు పంపించామని, రిపోర్ట్స్ రాగానే వారికి అందజేస్తాం అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment