కాన్పూర్: అయోధ్యలోని రామ మందిరం పవిత్రోత్సవం సందర్భంగా జనవరి 22న సిజేరియన్ ప్రసవాలు చేయాలని పలువురు గర్భిణులు వైద్యులను అభ్యర్థిస్తున్నారు. అదే రోజు శిశువులకు జన్మనిచ్చేలా సిజేరియన్ చేయాలని 14 వ్రాతపూర్వక అభ్యర్థనలు అందాయని గణేష్ శంకర్ మెమోరియల్ మెడికల్ కాలేజీలో గైనకాలజీ విభాగానికి ఇన్‌చార్జీగా వ్యవహరిస్తున్న సీమా ద్వివేది తెలిపారు. తమ ఆస్పత్రిలో జనవరి 22న 35 సిజేరియన్ ఆపరేషన్లకు ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
తమ డెలివరీ తేదీలు కొన్ని రోజుల ముందు లేదా జనవరి 22 తర్వాత అయినప్పటికీ గర్భిణులు శుభ దినంగా పరిగణించి వైద్యులకు అభ్యర్థనలు చేశారని సీమా తెలిపారు. పూజారులు ఇచ్చిన ముహూర్తంలో డెలివరీ చేయాలని తల్లులు, కుటుంబ సభ్యులు ఒత్తిడి చేయడంతో తాను నిర్ణీత సమయంలో ఆపరేషన్ చేసిన వివిధ అనుభవాలను ఆమె వివరించారు. అలా చేయడం ద్వారా తల్లి, బిడ్డకు తలెత్తే సమస్యలను కుటుంబ సభ్యులు పట్టించుకోకపోవడంపై ఆందోళన కలిగిస్తోందని అన్నారు.
రాముడు వీరత్వానికి, చిత్తశుద్ధికి, విధేయతకు ప్రతీక అని ప్రజలు నమ్ముతారు. అందుకే ఆలయంలో జరిగే ప్రాణ ప్రతిష్ఠ రోజున జన్మించిన శిశువులు కూడా అదే లక్షణాలను కలిగి ఉంటారని వారు నమ్ముతున్నట్లు సీమా ద్వివేది తెలిపారు.
ఇదీ చదవండి: అయోధ్య రామునిపై పాట.. సింగర్‌ని అభినందించిన ప్రధాని మోదీ
Comments
Please login to add a commentAdd a comment